22, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2344 (వానలే లేక...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వానలే లేక సస్యముల్ పండె మెండు"
(లేదా...)
"వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్" 

81 కామెంట్‌లు:

  1. మూడు వర్షములను భూమి బీడు బారె
    కర్ష కాళి జీ వనమంత కష్ట మాయె
    వరుణ కరుణతో కురియనీ వర్షమందు
    వాన, లేలేక సస్యముల్ పండె మెండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      పండక పండక చాల కాలానికి పంటలు పండాయంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. "అతి సర్వత్ర వర్జ్యయేత్"

    కాల బద్ధమై ఋతువులు కలసి వచ్చి
    వరుణ దేవుని కమ్మని కరుణ తోడ
    వాయు గుండము, వడగళ్ళు, వరద, భోరు
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      అతివృష్టి లేక పంటలు బాగా పండాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. మానవులందరున్ తగని మత్సరమున్ విడనాడి లోకమున్
    దానము ధర్మమున్ గరపి తత్వము నేర్చుచు రామనామమున్
    పానము చేసి యుండిరట భారత సీమను ముమ్మరంబులౌ
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      అతివృష్టి లేక పంటలు పండాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి


  4. తానము తప్పె కర్షకుడి తాహతు తగ్గె జిలేబి కొంతయున్
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    మీనము లన్ని జీవములు మిక్కుట మైనటి యెండ తాళక
    న్నా నవ వృష్టి కై కొలువ నప్పతి పూన్ప పరామృతమ్మునౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఉత్త రాన వరదలొచ్చి ఊళ్ళు మునుగు,
    దక్షిణమ్ము కరువు తోడ తల్లడిలు,
    ఒక్క చోట అధిక మయ్యి , నొక్క చోట
    అల్ప వృష్టి తో వర్షాలు ఆట లాడ,
    నేటి కలియగ ధర్మము నిజము గాదె,
    నెలకు మూడు వానలు చాలు నేల పైన,
    పసిడి పంటలు పండించె ప్రజలు రామ
    రాజ్యమున నాడు, వరుణుడు రమ్య గతిన
    అభయ మీయ అధిక మైన అల్ప మైన
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      అతివృష్టి, అనావృష్టి లేక పంటలు బాగా పండాయన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చి'ని 'ఒచ్చి' అన్నారు. "వరద వచ్చి... వర్షమ్ము లాటలాడ... పంట పండించిరి ప్రజలు" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు. తప్పులు సరి దిద్దు కుంటాను
      మార్చిన పద్యము

      ఉత్తరాన వరద వచ్చి ఊళ్ళు మునుగు,
      దక్షిణమ్ము కరువు తోడ తల్లడిలు,
      ఒక్క చోట అధిక మయ్యి , నొక్క చోట
      అల్ప వృష్టి తో వర్షమ్ము లాట లాడ,
      నేటి కలియగ ధర్మము నిజము గాదె,
      నెలకు మూడు వానలు చాలు నేల పైన,
      పసిడి పంట పండించిరి ప్రజలు రామ
      రాజ్యమున నాడు, వరుణుడు రమ్య గతిన
      అభయ మీయ అధిక మైన అల్ప మైన
      వానలే లేక సస్యముల్ పండె మెండు

      తొలగించండి
  6. దీనుల బాధలన్నిటిని తీర్చెడి నేతలు రాజ్య మేలగా
    దానజపాగ్నిహోత్రములు తప్పక జేసెడి విప్రవర్యులున్
    మౌనివరేణ్యులున్ దనరు మంగళ ధారుణి నల్ప రీతిగా
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    (వానలు అల్పముగా లేవు అంటే సమృద్ధిగానే ఉన్నాయని)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      అనావృష్టి లేదంటారు! బాగుంది పూరణ. అభినందనలు.

      తొలగించండి
  7. కాలమును బట్టి ఋతుపవనాలు వచ్చి
    పెరగు దశలోన జోరుగ కురిసి వాన
    కోతవేళన చెడగొట్టు కుండపోత
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      చెడగొట్టు వానలు లేక పంట సమృద్ధిగా చేతికి వచ్చిందంటారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెరుగు దశలోన" అనండి. (టైపు దోషం కావచ్చు!)

      తొలగించండి
  8. డా.పిట్టా
    కథన కళయున్న కల్లయె కట్టుబట్ట
    ఒకట నరచేత వైకుంఠ మొదవు వినగ
    కొంటెగాడు మాటల తోడ కోట దాటు
    ఊహ లోన దరిద్రము యుండ దగునె?
    "ఉష్ణముష్ణము శీతల ముర్విలోన"
    వానలే లేక సస్యముల్ పండె మెండు! (సైన్స్ ఫిక్షనులు ఒకనాటికి సాధ్యాలైనవి.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దరిద్రము+ఉండ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "ఊహలోనైన దారిద్ర్య ముండ దగునె" అనండి.

      తొలగించండి
  9. డా.పిట్టా
    కానని రీతులెన్నొ యిల కావె ప్రసిద్ధము కొన్నినాళ్ళకున్
    పూనిక నన్ని 'గంగ'లను పూర్తిగ గల్పరె త్రాగు నీటికై
    పో, నిక సంద్ర పంక్తులను పూన్చు యుపాయము గూడ సాధ్యమౌ
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్! God made the man and man made the city.Nothing seemsto be impossible.నరుడే పురహరుడు.Don't worry!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      నదుల అనుసంధానాన్ని ప్రస్తావించిన మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పూన్చు నుపాయము" అనండి.

      తొలగించండి
  10. విత్తు నాటిన రైతులున్ వెతలఁ బడుచు
    చిత్తు చిత్తౌద మని దైవచింత జేయ
    నదును మీరక వర్షించె! నంత దనుక
    వానలే లేక, సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  11. జ్ఞానము తోడ కాలమున జాడ్యము చేయని వానకారుతో,
    జానెడు కాదు బెత్తెడను చందపు నల్పపు వృష్టిలేకయున్,
    పూనకమొచ్చినట్లతిగ భోరని జోరుగ కుండపోతలౌ
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒచ్చినట్లు' అనడం సాధువు కాదు. "పూనక మూనిన ట్లతిగ..." అనండి.

      తొలగించండి


  12. ఏమి చెప్పిరి కవివర ! యెక్క డయ్య
    వానలే లేక సస్యముల్ పండె మెండు
    గా? జిలేబియాశ్చర్యము గాను రావు
    గారి వలె తేటగీతిని గాంచె సూవె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవివరుని మాట తప్పదు గద జిలేబి!
      మిగుల నాశ్చర్య మంది యేమియును దెలియ
      దనుచు చక్కని పూరణ నందజేసి
      నావు, నీకివే యభినందనముల శతము.

      తొలగించండి
  13. అవని పైనను చిత్రంబు లరయ వలయు
    నొక్క ప్రాంతాన క్షామంబు మిక్కుటముగ
    వానలే లేక, సస్యముల్ పండె మెండు
    నొకట వరుణుండు కరుణించ నొప్పుమీర.

    కానగ వచ్చు నీఫణితి క్షామము గల్గుచు నుండె నొక్కచో
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    మానితమౌచు నొక్కటను మాధవు లీల లనూహ్యమై తగన్
    జ్ఞానము గల్గుచుండు నిల నైజము గాంచ నిరంతరమ్ముగన్

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  14. జానకిచేయిబట్టి రఘుచంద్రుడు ధారుణినేలు నత్తరిన్
    కానరు పేదలెయ్యెడ నకాలమృతు ల్కనుపించ రెల్లరు న్సూనృతులైప్రవర్తిలిరి చూడము భర్తృవిహీనల న్జను ల్స్తేనులభీతిలేక సుమతిన్జరియించి రకాలమందునౌ
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      రామరాజ్యంలో చోరభయం, అకాల వర్షాలు లేవంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. "పూనిక మానవాధముల పుణ్యవిహీనత పాపవృద్ధులే
    గానగ వచ్చె ! మేఘముల గావున పంపనటన్న " నింద్రుడున్ ,
    మానవుడెంచె *మేఘమథనమ్మున వృష్టిని ! *దైవికమ్ములౌ*
    *వానలు లేక* యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్"!!


    కర్షకుల కంట కన్నీరు గాంచెనేమొ !
    ఘన ఘనాఘన పంక్తులే కరుణ కలిగి
    కరిగి ధరణిని విరివిగ కురిసె నదిగొ
    వాన లేలేక ! సస్యముల్ పండె మెండు!!

    లేలేక = లేక లేక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. కర్షకాళికి తప్పదు కష్టమెపుడు
    అల్ప, అతివృష్టివానలు హడల గొట్టు
    నేడు సమరీతికురిసి ,నీచ, రాళ్ళ
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  17. సవరణ 3వ పాదం
    నేడు సమరీతి కురిసెను, నీచ రాళ్ళ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      సంధి చేయవలసిన చోటుల్లో సంధి చేయలేదు "కష్టమెప్పు। డల్పవృష్టియు నతివృష్టి హడలగొట్ట" అనండి.

      తొలగించండి
  18. రామ రాజ్యము నందు ధరా తలమున
    మారుతము వీచె నిత్యము మానితముగఁ
    గాంచ నెల మూడు వానలే కాని గాలి
    వానలే లేక సస్యముల్ పండె మెండు


    వానలు భూమి మీద పడుఁ బన్నుగ శక్రుఁడు సంతసించినన్
    మేనలరంగఁ బూజల నమేయపు భక్తిని నెమ్మి సల్పుచున్
    వీనుల విందుగన్ నుతుల వేడిన నింద్రు నుపద్రవమ్ము, లే
    వానలు, లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    [లేవు + ఆనలు = లేవానలు; ఆన = ఒట్టు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు (ముఖ్యంగా రెండవదానిలోని వైవిధ్యం) అద్భుతంగా వున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  19. నదుల యనుసంధతను నేడు నరుడునేర్వ
    యెత్తిపోతల పధకము లింపుగాను
    పంటకుంటల చెరువుల ప్రాభవమున
    కరిసి కురవక రైతుల క్రుంగదీయు
    వానలే లేక సస్యముల్ పండెమెండు!



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాల్గవ పాదంలో కురిసి కురియక యని చదవ ప్రార్ధన! టైపు దోషము కరసి యని పడినది!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఎండి పోయెను నక్కట యిప్పుడమిని
    వానలేక సస్యముల్ ,పండెమెండు
    వలయు నంతగ వర్షాలు బడుట వలన
    పప్పు ధాన్యాలు బాగైన ఫలము తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోయిన వక్కట' అనండి.

      తొలగించండి
  21. తగిన వర్షమ్ము గురిసిన తరుణమందు
    పుడమి తల్లికి గలుగగ పులకరింత
    గోవికర్తులు మురియగ, కుండపోత
    వానలే లేక సస్యముల్ పండె మెండు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీవల్ల 'గోవికర్తులు' అన్న కొత్త పదం తెలిసింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రైతు లానందమందగా చేతసముల
    చేరె రూపాయి కట్టలు చేతినిండ
    తీరగా నప్పులన్నియు
    కురిసెను తరి
    *వాన!లేలేక సస్యముల్ పండెమెండు*

    లేలేక = లేక లేక


    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  23. కలిమి కాధారమైనట్టికర్షకులకు
    వానలేలేక సస్యముల్ పండె మెండు
    యనెడి నాయక సాక్ష్యాలమనుగ డందు
    ప్రజలబాగోగు లబ్భునా?పలుకు లందు?
    2.వానలు లేక యీపుడమివర్దిలె|”పంటలుపండ మెండుగన్
    దీనుల నుద్దరింతు|ప్రజదీక్షగ ఓట్లనువేయ?గెల్వగా
    దానముజేతు కర్ణుడిగ-ధర్మము నిల్పుదు ధర్మరాజుగా
    ప్రేమగ మాట మూటలను పేదలకిత్తును మంత్రినవ్వగా? {ఎన్నికలముందు నాయకులమాటలు}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మెండు ననెడి' అనండి.

      తొలగించండి
  24. నా పద్యం...

    ముడుంబ ప్రవీణ్ కుమార్...

    పంటలన్నియు పచ్చగా పలకరించ
    నా తెలంగాణ రైతులు నాట్య మాడ
    కలలు నెరవేరె, యెందులకన? నిల జడి
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  25. 22.౦4.2017.శంకరాభరణము
    పచ్చజొన్నలు రాగులు,పసుల గడ్డి,
    పెసలు,సెనగలు,మినుములు,బెండ,మిరప,
    మెట్టప్రాంతపు నేలను మిక్కుటముగు
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మిక్కుటమగు'.. టైపాటు.

      తొలగించండి
  26. వానలు లేక యీపుడమి వర్ధిలె పంటలుపండ మెండుగన్
    వానలు లేకయీ పుడమి వారును బీటలు,గానిగాదుగా దానుగ వృధ్ధిచెందనుట ,తప్పను భావము నాకుదోచెగా
    వానలు మెండుగా గురియ పంటలు పండును బాగుగాకదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వృద్ధి చెందునన...' అనండి.

      తొలగించండి
  27. గోనెల విత్తనమ్ములు ఖగోళము నందెట నున్నదెచ్చి మే
    మూని యపూర్వ సేద్యమును,మ్రొక్కగ భక్తిని,మేఘనాధుడున్
    భానుడు మేలు గూర్చ కడు భాగ్య మనంచన కుండ పోతగా
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    నిన్నటి నా మొదటి పూరణ పద్యమునకు భావము తెలిపితిని .
    దాని సారాంశం ఏ మనగా :- గ్రద్ద ఆకాశం లో ఎగురుతూ తన
    ఆహారం కోసం భూమికి దిగి , కోడి గ్రుడ్లను , కూనలను నోట
    కరచు కొని పోవును కదా ! ఆలాగున దిగ లేక ( దిగిన చో పాము
    మ్రింగునని భయము తో ఆకాశము లోనే తిరుగుతూ) చివరకు
    ఆకలి తో మరణించెను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భాగ్య మటంచన' అనండి.
      నిన్నటి పూరణలో నాకు అదే సందేహం. గరుడపక్షికి పాము భయం ఎక్కడిది? పాము కనిపిస్తే రివ్వున వచ్చి తన్నుకుపోతుంది కదా!

      తొలగించండి
  28. కలుపుపెరుగదని రైతులు వరిపొలమునకు నీరధికముగా పెడతారు. ఒకసంవత్సరం వర్షములు తక్కువగా కురిసి తక్కువ నీళ్ళు పెట్టటం వలన పెద్ద దుబ్బులేర్పడి ఎక్కువ దిగుబడి వచ్చింది.
    సమస్యః వానలే లేక సస్యముల్ పండె మెండు
    వరిపొలమున నీరధికముఁ బాఱుచుండ
    తడుపు లెక్కువై పంటలు తరుగుచుండె
    వానలే లేక సస్యముల్ పండె మెండు
    ఆరుతడుల పద్ధతి ప్రజ లాచరించ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాకీ వ్యవసాయ పద్ధతులు తెలియవు సుమండీ!

      తొలగించండి
  29. ప్రాణము లేకనే నదులు పాటలు పాడెను త్రుళ్ళుచున్ భళా
    జ్ఞానము లేకనే నెమలి నాట్యము చేసెను ప్రీతిగన్ సఖీ
    కానగ నైజమే సొగసు; కాలము మానము మీరగన్ సదా
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేకయే' అనండి.

      తొలగించండి
  30. కడచినేడాది వరి దిగుబడులె లేవు
    వానలే లేక సస్యముల్ పండె మెండు
    గా నిట వరుణ దేవుడు కరుణ జూపి
    వలయు వర్షము నిడగ నీ వర్ష మందు!

    రిప్లయితొలగించండి
  31. చేను కృశించిపోయె, తరి చేరక నీరము, బీడుభూమియై
    ధ్యానము చేయుచుండ్రి ప్రజ దైవ ప్రసన్నతఁ గోరినిత్యమున్
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    దీనులఁ గావనెంచి కడుఁ దృప్తి యనంతుడొసంగ వర్షముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు

      తొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.

    అవసరానికి తగినట్లు నదను చూసి

    వర్షము గురియగా రైతు హర్షమొంది

    సేంద్రియపు నెరువులను వేసి గన, గాలి

    వానలే లేక సస్యముల్ పండె మెండు.

    *****************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తగినట్టు లదను చూచి... సేంద్రియపు టెరువులను...' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  33. పైరు లెండెను భూమియె వ్రయ్యలయ్యె
    నిరుడు, శోకించిరిజనులు కరువు జేరె
    వానలేలేక, సస్యముల్ పండె మెండు
    గానిపుడు సువృష్టి కురిసి కలత తీర్చె.


    జానెడు పొట్టకై మనిషి స్వార్థముతో నవివేకుడై కదా
    కానల ద్రుంచగా కరువు కాటక మందున వ్రయ్యలయ్యెనే
    వానలు లేక యీ పుడమి, వర్ధిలె పంటలు పండమెండుగన్
    మానవజాతి బాధ్యతగ మ్రానుల బెంచుచు బెంచకానలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


      22, ఏప్రిల్ 2017, శనివారం

      ఈరోజు పూరించవలసిన సమస్య

      *వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్*

      *మానులుకూలగానరటి మట్టలుతేలగ పండ్లతోటలన్*
      *పానములూడగాపిడుగు పాటులరైతులుతల్లడిల్లగా*
      *గానమహోతుఫానులనిఖార్సగువానలెవచ్చెచేటులౌ*
      *వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్*


      *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

      తొలగించండి
  34. కాకతీయ మిషను రైతు కలత దీర్చె
    నిండె చెరువులు నీటితో నిండు గాను
    కలసి వచ్చెను కాలము గాకను
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  35. ఏమి చెప్పుదు పోయిన యేడు చూడ
    నెట్టి వరదలో? కాని యీ యేడు చూడ
    రైతులుల్లాసమంద వరదలు గాలి
    వానలే లేక సస్యాలు పండె మెండు

    రిప్లయితొలగించండి
  36. వానలే లేక పోయినా పంటలేస
    మృద్ధిగా పండును పొలము మృదుల మైన
    మోటయంత్రములన్ వాడిమోదమైన
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  37. కాకతీయ మిషను రైతు కలత దీర్చె
    నిండె చెరువులు నీటితో నిండు గాను
    కలసి వచ్చెను కాలము గాకనున్న
    వానలే లేక సస్యముల్ పండె మెండు

    రిప్లయితొలగించండి
  38. కానగ రైతులే ఘనులు కాదన లేరు ప్రభుత్వమే సదా
    మానక నిచ్చు నే ఉచితమాయనునట్టి కరెంటునే కదా
    మానవు లందరున్ కొనగ మానస సంతసమేగదా భువిన్
    వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్

    రిప్లయితొలగించండి
  39. మానవులుండలేరు గద మార్సున వీనసు జూపిటర్నయో
    వానలు లేక;...యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    వానలు దండిగా కురిసి పండుగ జేయగ మానవాళియే
    మీనము మేషమున్ గనక మ్రింగుచు త్రాగుచు తందనాలతో!

    రిప్లయితొలగించండి