వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె పగలె, శోభించె చంద్రుడంబరము పైన స్వాగతమ్మని తీర్చగ వాడలందు (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె పగలె, శోభించె చంద్రుడంబరము పైన స్వాగతమ్మని తీర్చగ వాడలందు (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలను చదివి మిమ్మల్ని ఏమని ప్రశసించాలో పదాలకోసం వెదుక్కున్నాను ఇంతసేపు... మీ పూరణ బాగుగా, చక్కగా, ప్రశస్తంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా అన్న పడికట్టు ప్రశంసాపదాలు పనికి రావు మీ విషయంలో. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఆలోచిస్తూ, ఆ ఆలోచనను చక్కని ధారతో పద్యనిక్షిప్తం చేస్తున్న మీ భాషాపటిమకు, రచనా నైపుణ్యానికి జోహార్లు. నమశ్శతం!
పప్పీ(?) గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ఇది సమూహంలో చదివిన పద్యమే. ఇప్పుడు వెదికితే దొరకడం లేదు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీరు ఏ ఈమెయిల్ చిరునామాతో పంపినా పద్యానికి ముందో వెనుకో మీ పేరును తెల్పండి.
వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె పగలె, శోభించె చంద్రుడంబరము పైన స్వాగతమ్మని తీర్చగ వాడలందు (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. కొంత అన్వయలోపం. రెండవ ప్రశ్న, సమాధానాలలో శోభ పునరుక్త మయింది. నా సవరణలతో మీ పద్యం... జనులు కార్యములు సలుపు సమయమెపుడు? వికసిత కుసుమ వన మెట్లు వేడ్క గనెను? చల్లదనమది యిచ్చు నెచ్చట నెవండు? పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.
సూర్య భగవాను నెప్పుడు చూడ గలము
రిప్లయితొలగించండిపగలె; శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
నిండు పున్నమి రాత్రిలో నిక్కముగను;
విరుపు తప్పలే దక్కట! పరువు దక్క!
పెద్దలు శాస్త్రి గారికి నమస్సులు! చక్కగాచెప్పితిరిగదా! అయినా ఒక్కొక్క తరి విరుపు తురఫు ముక్క.
తొలగించండి__/\__ __/\__ __/\__
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండితప్పని విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నమస్కారమండీ.. పద్యం బాగుందండీ.. అభివందనములు
తొలగించండిఈ g p శాస్త్రి గారు.. శంకరాభరణం లోని ishani.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు ఒకరేనని అనుమానం.. నమోనమః
తొలగించండిమైలవరపు వారలకు వందనములు:
తొలగించండినేనె ప్రభాకర శాస్త్రిన్
నేనె "ఇషాని" కిని తాత నిశ్చయ మిలలో
నేనె ప్రవాసి ఖరగపుర
నేనే శంకరుని దయన నిండుగ నలరన్
తొలగించండిఖరగపుర వాసి శాస్త్రియు
తరంగ వేగపు యిషాని తాతయు నొకరే !
వరమాయె శంకరుని కొ
ల్వు, రాసి పద్యముల వాసి వురుకులు పడెనౌ !
జిలేబి
జిలేబి గారల కందాలకు పదివేల వరహాలు!!!
తొలగించండిదినకరుడుదయించి రగులు దినము నందు
రిప్లయితొలగించండిపగలె, శోభించె చంద్రుడంబరము పైన
రాత్రి, గాలి వీచును దివా రాత్రములను
భేద మించుక లేకయె వినుము బాల.
శర్మ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
పద్యం బాగుందండీ.. అభివందనములండీ
తొలగించండిగురువు గారికి, మైలవరపు మురళీకృష్ణ గారికి నమస్సులు ధన్యవాదములు.
తొలగించండిభాను గాంచిన పద్మాలు పరవశించి
రిప్లయితొలగించండికులుకు లీనుచు వికసింప కొలను జూడ
పగలె శోభించెఁ , జంద్రుఁ డంబరముపైన
కానవచ్చునెప్పుడనుచు కలువ వేచె
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
పచ్చని పసిడి వర్ణపు పట్టుచీర
రిప్లయితొలగించండితార లేణాంకు తోడను తరలిరాగ
నద్భుతంబగు నల్లిక నమరగాను
పగలె శోభించె జంద్రుఢం బరము పైన!
అంబరము=వస్త్రము
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురుదేవులకు నమఃపూర్వక ధన్యవాదములు!🙏🙏🙏
తొలగించండి👏👏👏👏
తొలగించండిమురళీకృష్ణగారికి నమస్సులు, ధన్యవాదములు!!
తొలగించండి
రిప్లయితొలగించండినిగనిగ లాడు గుండునటు నింగిని సూర్యుడు కాల్చ తారల
న్నిగలిసి నాట్య మాడగను నిండుగ చుక్కల రీతి నెత్తిపై
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
సెగలను దాచి మానవుని సేనము చట్టన సేద దీరనౌ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండివగల మారి జిలేబి కవనపు వేడి
సెగల మధ్యన జనులటు సేద దీర
పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
రగడ యన యిదియేగద రత్నమాల !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఉస్సురుస్సుల వేసవి నురుకు పరుగు
లెత్తు జీవిక కళ్ళకు లేవె రెండు
నీలి రంగుటద్దంబులు నింగి జూడ
పగలె శోభించె జంద్రు డంబరము పైన!
డా.పిట్టా
రిప్లయితొలగించండివగలె కవిత్వమై జెలగ వన్నెల చిన్నెలు శబ్ద శక్తినిన్
తెగ గనిపింప జేయుచును తీరిచి దిద్దవె చూపి చుక్కలన్?
దిగుమల "లాసునాంజెలుసు"దీప్తులు నిన్ను భ్రమింప జేయు నా
పగలె శశాంకుడంబరము పై విలసిల్లెను ,సత్కవీశ్వరా!
(LosAngels USA లో భవనంలోనే పైన ceiling కాంతులతో పగలే వెన్నెలను చూపించే మయసభ ఉంటుంది.పెద్ద ప్రదర్శన శాలల్లో యిలాంటి విచిత్రాలు దర్శన మిస్తాయి.)
డా.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా.'అల' ప్రసిద్ధిని తెలుపును శ.ర "అలపర్జన్యుడు" యాదృశ్చికంగా పడగా సరి జూచుకొన్నాను.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
వేద మంత్రాలు వల్లించ విప్రవరులు
రిప్లయితొలగించండిధరణి పుత్రిక మెడలోన తాళికట్టి
పగలె శోభించె జంద్రు, డంబరముపైన
అమరులెల్లదీవించి శుభము లొసగ
రాముడిని రామ చంద్రుడు అని అనుకొని అల్లాను
నాగమణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శుభము లొసంగ' అనండి. లేకుంటే గణభంగం.
ఆర్యా నమస్కారము ముద్రా రాక్షసము o పడలేదు.
తొలగించండిసెలవు లగుటను యాత్రలు చేయుచుండి
రిప్లయితొలగించండిబాలు డొక్కడు నక్షత్ర శాల కేగి
యచట విజ్ఞాన దృశ్యాల నరయు నపుడు
పగలె శోభించె చంద్రు డంబరముపైన.
నగరపు శోభలన్ దెలియు నవ్యకుతూహల మంకురింపగా
తగునని బాలుడొక్కరుడు తన్మయ మందుచు జేరి యచ్చటన్
సొగసుల కబ్బురం పడుచు సుందర తారల శాలకేగినన్
పగలె శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా!
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ప్రేయసీనీఒడిని నేను ప్రేమ పాన
రిప్లయితొలగించండిచిత్తవివశ పరవశాన సేదదీర
చలువ పందిళ్ళు వేయగ జాణ కనులు
పగలెశోభించె చంద్రుడంబరముపైన
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రగిలెడు కక్షతో తనను రాహువు మ్రింగగ వచ్చు వేళలో
రిప్లయితొలగించండిజగముల చీకటిన్ విడువజాలక భానుడు నిల్చె నట్టులే
గగనము నందు, డాసె, గను గ్రక్కున మ్రింగెను
సైంహికేయుడున్
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భగభగలాడనెండ నిటు ప్రక్కనె త్రోవకు , *చీరచెంగు* తా
రిప్లయితొలగించండి*మొగమును దక్క* గప్పి , యొక మోహిని యమ్మగ "కల్లు , ముంజెలన్ ,
దిగి తన వాహనమ్ము , సుదతిన్ గని యొక్కడు పల్కెనిట్లిదే !
" పగలు *శశాంకుడంబరముపై* విలసిల్లెను సత్కవీశ్వరా !! "
పగలు... ఎండలో
అంబరముపై.... వస్త్రముపై
శశాంకుడు... ముఖచంద్రుడు
నేతలో క్రొత్త మెలకువల్ నేర్చి , పడుగు
పేక లలర చుక్కలను జాబిల్లి కలిపి
నేయ , జీరను కవులు వర్ణించిరిట్లు
పగలె శోభించె చంద్రుడంబరము పైన !!
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ గురువుగారూ
తొలగించండిసొగసులు నావినీకలముసొత్తుగవ
రిప్లయితొలగించండిర్ణనసేయగా మదిన్
వగలను రేపనాగక, ప్రవాసము వీడితినోయి యోకవీ
రగిలెనునీదుపద్యమకరందపు మాధురినూహలందులన్
పగలె శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రేపనాగక'.... రేపు+అని+ఆగక... అని మీ ఉద్దేశమా? అని యాగక... అని యడాగమం వస్తుంది.
రేపగ నాగక(ఆగలేక)
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపగలె శోభించె చంద్రుడంబరముపైన
రిప్లయితొలగించండిచివరిపాదం
తగ సినిమాను తీయునెడ దర్శకుడాదిగ చిత్రబృందమో
రిప్లయితొలగించండినగరమునందు దృశ్యములనాణెముగావెస తీయువేళలో
గగనమునందు కృత్రిమముగా శశిబింబమునేర్పరింపగన్
పగలె శశాంకుడంబరముపైనుదయించెను సత్కవీశ్వరా
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి
రిప్లయితొలగించండిచాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
పడమరను గృంక సూర్యుండు బారెతాను
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
"పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత। పగలె..." అంటే ఇంకా బాగుంటుందేమో?
మాస్టరుగారూ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
తొలగించండితూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి
చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత
పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.
వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
రిప్లయితొలగించండినన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
పగలె, శోభించె చంద్రుడంబరము పైన
స్వాగతమ్మని తీర్చగ వాడలందు
(శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
సహదేవుడు గారూ,
తొలగించండితెలంగాణ చంద్రునిపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆంధ్ర చంద్రుడు తక్కువవాడా? అమరావతిలో పగలే వెన్నెల కురిపిస్తున్నాడు. :-)
తొలగించండిఅమరావతిలో పగలే
సమరస వెన్నెల జిలేబి చంద్రుడు కురిపిం
చి మహిష్మతి నగరపు రా
జమౌళి చిత్రపు కలల మజను గనుచుండెన్ :)
జిలేబి
అందరికి నొకడె చంద్రుం
తొలగించండిడాంధ్రప్రజల కిరువురు గద నాహాయనగా
చంద్రు తలదాల్చె నొక్కరు
చంద్రుడు తానాయెనొకరు చక్రము దిప్పన్!
జిలేబీ గారూ, సీతాదేవి గారూ,
తొలగించండిజంట కవయిత్రుల వ్యాఖ్యారూప పద్యాలు అలరింపజేశాయి.ధన్యవాదాలు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురువుగారికి క్షమార్పణలు! మొదటి పాదంలో ప్రాస తప్పింది! డా.జి.పి.శాస్త్రిగారు సూచించారు! సవరణ కూడా వారిదే!
తొలగించండివారికి కృతజ్ఞతలు!
తొలగించండిచంద్రుం డొకడే గగనము
నాంధ్ర ప్రజల కిరువురు గద నాహాయనగా
చంద్రు తలదాల్చె నొక్కరు
చంద్రుడు తానాయెనొకరు చక్రము దిప్పన్!
వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
రిప్లయితొలగించండినన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
పగలె, శోభించె చంద్రుడంబరము పైన
స్వాగతమ్మని తీర్చగ వాడలందు
(శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
క్రొత్తగా పెండ్లిజరుగంగ కోడలపుడు
రిప్లయితొలగించండిఅత్తవారింటికేగంగనామెభర్త
పలికె నిట్టుల సుందరీ బాగుబాగు
పగలె శోభించె చంద్రుడంబరముపైన
శ్యామల గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
భానునిన్ వెస మ్రింగ స్వర్భానుడపుడు
రిప్లయితొలగించండిపగలె శోభించె చంద్రు డంబరముపైన
వేడితగ్గెను భువిపైన వేగముగను
విడువగా రాహువు మరల వెలిగె తరణి
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ఒక సందేహం... సూర్యగ్రహణం అమావాస్యనాడు వస్తుంది. ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోను చంద్రుడు కనిపించడు కదా!
మీరన్నది వాస్తవమే. కానీ పూర్ణ సూర్యగ్రహణము లో ఒక క్షణం పాటు చంద్ర బింబం "వజ్రపుటుంగరం" వలె శోభిస్తుంది. దీనిని నేను ఖరగ్పూరులో (1999) చూచియుంటిని.
తొలగించండి__/\__
శాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు! శాస్త్ర విషయాలు నాకంతగా తెలియదు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండిమగువదినీసతీమణియెమాటకుమాటజవాబుచెప్పుచున్
మగమహరాజుమీకునవమానముజేసెనటంచురౌద్రమం
దగఁదగునే?సతీపతుల తప్పులనెంచుచుకాపురంబులన్
*పగలె ?శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మహరాజు' అనడం సాధువు కాదు.
సెలయు గ్రీష్మ నిదాఘపు సెగలలోన
రిప్లయితొలగించండినడచు వారలు తాపము నడచివేయ
దారి చలిపందిరుల చల్ల దప్పి దీర
పగలె శోభించె జంద్రు డంబరము పైన!
సెలయు=విజృంభించు
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్రవాకము లంతట సంతసించెఁ
రిప్లయితొలగించండిగలువ లింపుగ వికసించెఁ గొలను లోన
హితులఁ గాంచ నేరక విరహిణుల యోరు
పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
[ఓరుపు+అగలె = ఓరుపగలె; అగలు = క్షీణించు]
ఎగిరెను సాగరమ్ము దన యెల్లల నెల్ల నతిక్రమించుచున్
గగన విహార మోదమున గంతులు వేసెను గోకపక్షులే
యగుపడ నంత పట్టపగలై నిసి చోరుల కెల్ల రేఁగెనే
పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
[పగలు = విరోధములు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలను చదివి మిమ్మల్ని ఏమని ప్రశసించాలో పదాలకోసం వెదుక్కున్నాను ఇంతసేపు... మీ పూరణ బాగుగా, చక్కగా, ప్రశస్తంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా అన్న పడికట్టు ప్రశంసాపదాలు పనికి రావు మీ విషయంలో. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఆలోచిస్తూ, ఆ ఆలోచనను చక్కని ధారతో పద్యనిక్షిప్తం చేస్తున్న మీ భాషాపటిమకు, రచనా నైపుణ్యానికి జోహార్లు. నమశ్శతం!
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. మీ నుండి యింతటి ప్రశంస నందుకున్నందులకు ధన్యుడనయ్యాను. మీ ప్రోత్సాహానికి మార్గ దర్శకత్వమునకు సహస్రాధిక వందనములు.
తొలగించండిసూర్య గ్రహణపు దినముననార్య!పగలె
రిప్లయితొలగించండియంధకారమౌటవలన నయ్యదునన
పగలె శోభించె జంద్రు డంబరము పైన
సూర్య చంద్రులి రువురును జోతులెగద
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
అయ్యదనున... టైపాటు.
నీరజమ్ముల ముద్దాడె సూరుడదివొ
రిప్లయితొలగించండిపగలె, శోభించె జంద్రుడంబరముపైన
కలువ కన్నెల వలపుల కాంతులెగసి
నిండుపున్నమి రేయిలో నింగిలోన!!!
విశ్వకర్మను తలపించ వినుతికెక్కు
రాజధానిని నిర్మించు రచనజేసి
యాంధ్రమందున దీర్చుచు నద్భుతముగ
పగలె శోభించె జంద్రుడంబరముపైన!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అష్టదిగ్గజ కవుల మహాద్భు తాంధ్ర
రిప్లయితొలగించండికావ్యనిర్మాణ చాతుర్య కళకు పొంగి
వర్ణనా క్రమమున తమవంతు రాగ
పగలె శోభించె జంద్రుడంబరముపైన!
అగణితమైన ప్రజ్ఞ కదలాడెడు మాటలలోన మంత్రమై
తొలగించండిసొగసుగసాగు పద్యముల సొంపగుకావ్యముఁగాగ సూర్యుడా
గగనపువీధి వీడకనె,కావ్యజగత్తున మీదు వర్ణనన్
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
రాజ్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పట్టుబట్టలు గట్టిరి పగటివేళ
రిప్లయితొలగించండిపడక జేరగ?మిద్దెపై పట్టవాయె|
ముద్దుముచ్చట జంటకు హద్దు మీరు
పగలె|”శోభించె జంద్రు డంబరముపైన
నిశిని పున్నమి వెన్నెల నెగడనీక”
పగను బెంచెనుయవ్వన ప్రతిభలాగ|
2.పగలన?గ్రీష్మ తాపమును భానుడు బంచెడి లెండవేడిమే|
మగువల కామవాంచలకు మార్గమె వెన్నెల పూలనవ్వులే|
తగదని కోప తాపమును దంపతు లందున మాన్పగల్గులే
పగలె|”శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా”|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
తగు సమయంబు మించునని దైన్యమునొందిన పాండునందనున్
రిప్లయితొలగించండివిగతుని చేయనెంచు కురు వీరుల పీచ మణంగ జేయ శీ
ఘ్ర గతిని కృష్ణ చక్రమది కాశినిఁ గ్రమ్ముచు దాచి వేయగన్
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిపగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
రిప్లయితొలగించండిజగను శోభించె కడపలో పగలు రాత్రి
మమత శోభించె మోడిపై మండి పడుచు
మోడి శోభించె మోముపై దాడి తోడ
అంబరము = అమరావతి
శాస్త్రి గారూ,
తొలగించండి'దాడి' అన్యదేశ్యమైనా మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
సార్! "దాడి" శబ్ద రత్నాకరములో నున్నది:
తొలగించండిదాడి

దాడి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 
గ్రంథసంకేతాది వివేచన పట్టికవై. వి.
1. శత్రుజయార్థము దండెత్తిపోవుట; (చూ. జోడఁగి)
2. గడ్డము.
కవిగారి భార్య ఆవేదన..
రిప్లయితొలగించండితెల్లవారిన నుండి నీ తెల్గుపద్య
ములను గోలతో పూర్తిగా ముగిసె జూడు
పగలె ! శోభించె చంద్రుడంబరము పైన
ఇంక చాలించి నను గమనింపుమయ్య !!
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.
పగతుడు దుష్టసైంధవుని ఫల్గుణుడొప్పుగ సంహరించుటన్
రిప్లయితొలగించండిసుగమము చేయనెంచి హరి సూర్యునికడ్డుగ చక్రముంచగా
జగతినినిండె చీకటులు జాగృతి నొందెదివాంధబృందముల్
వగలె శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగగనము నందు భాస్కరుని గాంచిన చాలును విచ్చుతామరల్
రిప్లయితొలగించండిపగలె, శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
ఖగుడటు పశ్చిమాచలపు కౌగిలి సేరిన వేళగాంచుమా
సొగసగు వెన్నెలే కురిసె సోయగ మొప్పెడు కైత వ్రాయుమా
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
సొగసుగనింగిఁ దూర్పుతటిసూర్యుడుతోచగవిచ్చె తామరల్
రిప్లయితొలగించండిపగలె, శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
జగతికి పండువెన్నెలను చక్కగ పంచుచు కూడి భార్యలన్
మగువలు దాల్చి పూలు నిజ మానిసి జేరగనెంచి వేచెడిన్
తగుకవితల్ లిఖించి కడు తన్వి నొసంగుము మానసమ్ముకున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మానసమ్ముకున్' అన్న ప్రయోగాన్ని గురించిన వ్యాఖ్య సమూహంలో చూడండి.
నమస్కారం...
రిప్లయితొలగించండినేటి సమస్యకు నా పూరణ...
పట్ట పగలు పనికొరకు పాకులాడి
నీరసించి యాదమరచి నిదుర పోవ
వాడి కలలోన సృష్టియు గాడి తప్పి
పగలె శోభించె చంద్రుడంబరముపైన
పప్పీ(?) గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
ఇది సమూహంలో చదివిన పద్యమే. ఇప్పుడు వెదికితే దొరకడం లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు ఏ ఈమెయిల్ చిరునామాతో పంపినా పద్యానికి ముందో వెనుకో మీ పేరును తెల్పండి.
వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
రిప్లయితొలగించండినన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
పగలె, శోభించె చంద్రుడంబరము పైన
స్వాగతమ్మని తీర్చగ వాడలందు
(శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
క్రమ్మిన కరిమబ్బు తొలగ రవి కిరణము
పగలె శోభించె ; జంద్రుడంబరము పైన
పున్నమి దినము రాత్రి సంపూర్ణమైన
శుక్ల పక్షపు బింబము శోభలీనె.
***************************
పిన్నక వారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
నెమ్మదిగ గణేశు వెడలె, నిండు పొట్ట
రిప్లయితొలగించండిపగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
దొరలె మోదకంబుల జూచి దుడుకుగా న
శాంతి, శోకమై పార్వతి శాప మొసగె
రఘురామ్ గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినదే... 'గణేశు' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'పగిలె' అన్న క్రియాపదం సాధువు.
భరత పట్టాభిషేకోత్సవమ్ము , రామ
రిప్లయితొలగించండికాననావాసమును గోర కైక, దశర
థునకు దోచెను చుక్కలు కనులముందు
పగలె శోభించె చంద్రుడంబరము పైన !!
ఎడమొగము పెడమొగముగా నిట్టులుండ
రిప్లయితొలగించండితగునె ? శాశ్వతములొకొ ఈ తగువు బిగువు
పగలె ?, శోభించె చంద్రుడంబరము పైన !
ఇట్టి వేళను పాడొనరింపవలదు !!
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
రిప్లయితొలగించండివికసిత కుసుమ శోభల విరులవాటి
చల్లదనమది జగతికి చాటునెవడు?
పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.
తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. కొంత అన్వయలోపం. రెండవ ప్రశ్న, సమాధానాలలో శోభ పునరుక్త మయింది. నా సవరణలతో మీ పద్యం...
జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
వికసిత కుసుమ వన మెట్లు వేడ్క గనెను?
చల్లదనమది యిచ్చు నెచ్చట నెవండు?
పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.
తగులముజూపి పద్యసుమతాడిత మానసమందు నిల్చి నన్
రిప్లయితొలగించండివగను వివాహమాడియు ప్రపంచ తెనుంగు సభల్గనంగనే
గ, గడచె కాలమట్లు కనికారము జూపుము తాపమింక నో
"పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా"
ధగధగ లాడు బ్యానరుల ధాటిగ నవ్వెడి నిండుమోముతో
రిప్లయితొలగించండినిగనిగ మెర్యు రంగులన నీటుగ పూసిన కాస్మెటిక్సుతో
గగనపు ఫ్లెక్సిలందునను గాలికి హాయిగ చంచలించుచున్
పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా!