8, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2332 (గొడుగును మధ్యాహ్నవేళ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే"
(లేదా...)
"గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో"
ఈ సమస్యను సూచించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

65 కామెంట్‌లు:

 1. నడచుట మానిన ముదుసలి
  కొడుకును వేధించి కారు గోరుట తగునే
  గుడిసెల వాడల నుండుచు
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. దడదడ లాడుతు కురియగ
   వడివడి వడగళ్ళవాన వణికింపంగన్
   మిడిమిడి" మేనెల,"చిరిగిన
   గొడుగును మధ్యాహ్నవేళ గోరుట తగునే?

   తొలగించండి
  2. చిరిగిన గొడుగుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. జడివాన కోరు నెవరిని?
  కడుపార భుజించు నెపుడు కమ్మని వంటల్?
  జడవక తాపరభామల
  గొడుగును, మధ్యాహ్నవేళ, గోరుట తగునే?

  రిప్లయితొలగించండి
 4. గుడికని నిశ్చయించుకొని కొబ్బరికాయలు పూలు పండ్లతో
  వడివడియంచు మెండయిన భక్తిని కోవెల లోన చేరగా
  గొడుగును పాదరక్షయును కోరుట యొప్పునె, మండుటెండలో
  కడుచలిలోన వేగముగ గాలులు వీచినగాని మిత్రమా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుళ్ళోకి గొడుగు, పాదరక్షలు అవసరం లేదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా
  విడివడె యాగ సుశాలయె
  వడిగాలికి కప్పు యెగసి వ్రాలెన్నెటనో
  చెడువాన దడిసి ఋత్త్విక
  గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే?!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొంత అన్వయలోపం ఉన్నట్టున్నా పూరణ బాగుంది. అభినందనలు.
   ఇక్కడ 'ఋత్విక' అన్నది సంబోధనమా? ఒకవేళ అది 'ఋత్విక గొడుగు' అయితే దుష్ట సమాసం.

   తొలగించండి
  2. డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
   అదియాగశాల. చెడ్డ వానలు ఫాల్గుణ మాసంలో వస్తాయి.అవిగాలితోగూడినవ కొన్ని.యాగశాల గుడిసె.దాని ఛత్రము ,పై కప్పు.అది గాలికి తెప్ప వలె తేలి ఎక్కడో పడ్డది చిరు జల్లు తో ఎండ తాపం తగ్గింది.కాని ఓ ఋత్త్వికా!గొడుగు చెప్పులు నీకు సమకూర్చడ మెందులకు?అంటున్నాడు, యజ్ఞ కర్త.గాలివానలో వచ్చే ఛత్రము ,చెప్పులు కాస్తా రాకుండా పోయినాయి బాపడికి.

   తొలగించండి
  3. డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
   అదియాగశాల. చెడ్డ వానలు ఫాల్గుణ మాసంలో వస్తాయి.అవిగాలితోగూడినవ కొన్ని.యాగశాల గుడిసె.దాని ఛత్రము ,పై కప్పు.అది గాలికి తెప్ప వలె తేలి ఎక్కడో పడ్డది చిరు జల్లు తో ఎండ తాపం తగ్గింది.కాని ఓ ఋత్త్వికా!గొడుగు చెప్పులు నీకు సమకూర్చడ మెందులకు?అంటున్నాడు, యజ్ఞ కర్త.గాలివానలో వచ్చే ఛత్రము ,చెప్పులు కాస్తా రాకుండా పోయినాయి బాపడికి.

   తొలగించండి

 6. అడుగడు కటు మడుగుల నొ
  త్తెడి యయ్యరటు కమ్మ తెమ్మర గానన్
  పడతుక జక్కవచంటికి
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. రెండవ పాదము సవరణ

   అడుగడుగుల మడుగులనొ
   త్తెడి యయ్యరుగారు కమ్మ తెమ్మర గానన్
   పడతుక జక్కవచంటికి
   గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే :)

   జిలేబి

   తొలగించండి
 7. ఒడలంతయు చలిబాధకు
  గడగడమని వణుకునట్టి కాలము నందున్
  కడు భీకర శైత్యంబున
  గొడుగును మధ్యాహ్నవేళ గోరుట తగునే.

  అడలుచునుండి మిక్కిలిగ నాతపబాధకు తాళలేక తా
  నొడలు కృశించుచుండు తరి యుండి గృహాంతర మందు బ్రీతితో
  తడబడకుండ చల్లని పదార్థములన్ గ్రహియించగా దగున్
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఏకాలంలోనైనా ఇంట్లో ఉన్నవానికి గొడుగు,చెప్పులు అవసరం లేదన్న మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. డా.పిట్టా
  కడు గడు పేద తండ్రి, యెట గానడు సౌఖ్యము, గప్పగా తల
  న్నెడ నెడ తాప స్నానములె నేరడు చెప్పులు, ఛత్ర ఛాయలున్
  విడిచిన యాస్తి లేదు సరి వేళకు భుక్తము నాస్తి నాకు యీ
  బుడి బుడి కోర్కె దీర్చగను బోనెటు?తండ్రికి ప్రేత ప్రీతికై
  గొడుగులు పాద రక్షలును గోరుట యొప్పునె మండుటెండలోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిజమే... శ్రాద్ధకర్మకు గొడుగు, చెప్పులు తెమ్మంటారు. నిరుపేద ఏం తేగలడు? అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
 9. విడువుము చెప్పులు, ముడువుము
  గొడుగును , మద్యహ్నవేళ గోరుట తగునే
  కడవలతో ఉష్ణ జలము,
  గొడవను మాని త్వరితముగ కూడును తినుమా

  మతి స్తిమితము లేని పుత్రుని కాంచి తల్లి వేదన

  రిప్లయితొలగించండి
 10. విడువక సూటును బూటును
  తొడుగక జంధ్యమును వరుడు తోడుగ వధువున్
  బుడిబుడి కాశీ యాత్రకు
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 11. వడగాలి సుడులు దిరిగెను
  తడబడక నడువు గృహముకు తక్షణ రీతిన్
  పడిపడి వీచెడిగాలిన
  గొడుగును మధ్యాహ్నవేళ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 12. వడగాలి సుడులు దిరిగెను
  తడబడక నడువు గృహముకు తక్షణ రీతిన్
  పడిపడి వీచెడిగాలిన
  గొడుగును మధ్యాహ్నవేళ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 13. వడిగొను కష్టము లందున
  పొడమెడి యలజడుల వడుల బోరెడి వేళన్
  దడబడక నిలబడగవలె
  గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే!

  రిప్లయితొలగించండి
 14. బడుగా! యేమని యంటివి
  గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే
  గొడుగది లేబోజాలవు
  నడచుచు మధ్యాహ్న వేళ నడిరోడ్డు న నన్

  రిప్లయితొలగించండి
 15. గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పును లేనిచో నిక
  న్నడుగును వేయలేముగ నవారిత యెండను బాదరక్షలున్
  గొడుగును లేనిచో ధరను గోడలిపిల్ల!నెరుంగుమా యిదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   లేబో జాలవు...?
   'అవారిత యెండ' అనడం దుష్టసమాసం.

   తొలగించండి
 16. చెడుపనులన్ సదా సలుపు చెడ్డమనస్కుడు పుట్టి పుత్రుగా
  కడుముదమొందుచున్ పొలము గట్టున పెల్లుగ కల్లు త్రాగుచున్
  నడచుచు వచ్చుచున్నతన నాన్నను గాంచి మదమ్ముతోడుతన్
  గొడుగును పాదరక్షయును కోరుట యొప్పునె మండుటెండలో

  రిప్లయితొలగించండి
 17. వడగాడ్పులు తో డుండగఁ
  గడు మండుచు సూర్యుడుండఁ గార్యార్థము నే
  వడివడి యెండం జన నా
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే


  గడుసరి యన్న నాతడగుఁ గాలము నెంచి చరించ నిత్యముం
  దడఁబడ నేమి లాభము నిదానము ముఖ్యము సర్వవేళల
  న్నుడుపుల తోడఁ బెక్కులట నుండగఁ దక్కినవెల్ల, వీడి యా
  గొడుగును పాదరక్షలను, గోరుట యొప్పునె మండుటెండలో

  రిప్లయితొలగించండి
 18. అడుగులు మూడిమ్మనకనె
  తొడుగుట చెప్పులును మరచి తొందర లోనన్
  బుడతడు కలియుగపు బలిని
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 19. నడుపుచు రాముని వనముల
  కొడుకుకు పట్టమ్ము గట్ట కోరిన కైకన్
  సిడిముడిన జనమనె పరుల
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 20. నడి వీధిన ఛత్రపతిని
  మిడిమేలము తోడ నిల్పి మేయరు సేనన్
  హడవిడి జేయుచు ప్రతిమకు
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ నాల్గవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హడవిడి'...?

   తొలగించండి
  2. "హడావిడి" శ్రీహరి నిఘంటువులోనున్నది. "హడవిడి" ఛందోప్రయాస. మన్నించవలె.

   __/\__

   తొలగించండి
 21. నడిమంచముపై పడుకొని
  కడుముదమున నత్తయిచ్చు ఖాద్యము గొనుచున్
  మిడిమేలముగా గృహమున
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే

  రిప్లయితొలగించండి
 22. దశరథుడు.. విశ్వామిత్రునితో..

  బుడుతడు!పల్కరింపగనె ముద్దుగ నవ్వుచు నిప్పుడిప్పుడే
  యడుగులు వేయనేర్చెను!సహాయము జేయగలేడు!దైత్యులె
  క్కడ? పసిబాలుడెక్కడ? జగద్బలవంతులనిత్తు,మౌని!నా
  గొడుగునుపాదరక్షలనుగోరుట యొప్పునె మండుటెండలో !!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 23. విడువడు సతినొక నిముసము
  గడప బయట పదమునిడడు,గడియ బిగించున్!
  వడి యతని తలుపు తట్టియు
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే ??!!


  కర్ణుడు... ఇంద్రునితో

  కుడి చెయిసాచియున్ కవచకుండలముల్ గొన గోరినారు, మీ..
  రడిగిన దానికిన్ బదులనంతముగా ధన భూ సువర్ణముల్
  వడి యిదె ధారబోసెద !నపప్రథ బొందకుమయ్య విప్రుడా !
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో ?!!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. నడి వేసవి తగదు బయట
  వడగాలులు పడగలెత్తు వద్దన కొడుకుల్
  వెడలుచు వృద్ధుడు భార్యను
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే?

  రిప్లయితొలగించండి
 25. విడువక జేకొన చాలును
  గొడుగును మధ్యాహ్న వేళ! గోరుట తగునే
  బిడియము వీడుచు కారును!
  వడిగ నడువ నిమిషమె యగు, వాహన మేలన్!

  రిప్లయితొలగించండి
 26. పిడుగులు పెద్దగాలులును భీకర వర్షము తోడ నేకమై
  గుడులను గోపురమ్ములను కూల్చు నటంచు మదిందలంచగా
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె ? మండుటెండలో
  నడుగిడ తప్పదంచనిన నయ్యవి ముఖ్యము మానవాళికిన్

  నడుచునపుడు ధరి యించుము
  గొడుగును మద్యహ్నవేళఁ ; గోరుట తగునే
  వడికించెడి చలి వేళను
  మడుగును దాటంగ దలచు మానవున కిలన్

  రిప్లయితొలగించండి

 27. పిన్నక నాగేశ్వరరావు.

  జడివాన కురిసి వెలిసెను

  విడివడుచుండె కరిమబ్బు విస్తృత పరిధిన్

  కడు చల్లని సమయంబున

  గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే?

  *******************************

  రిప్లయితొలగించండి
 28. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్య లో పొరపాటున “మధ్యాహ్న” కు బదులు “మద్యహ్న” అని పడింది. గమనించ గోర్తాను.

  రిప్లయితొలగించండి
 29. అడవిన చెట్టు నీడన జనాభ్యుదయాశయమ్మున శాంతితో
  సడలని దీక్షనున్న యొకసాధువు బ్రహ్మవరమ్ము నీయగా
  తడబడి సూర్యతాపమున త్రాగగచల్లని నీరు వీవనన్
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   'అడవిని' అనండి. మొదటిపాదంలో గణదోషం. "జనాభ్యుదయాశయమందు..." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్యగారు. తొందరపాటున పొరపాటు దొరలింది.సవరించుకుంటాను.

   తొలగించండి
  3. అడవిని చెట్టు నీడన జనాభ్యుదయాశయమందు ప్రీతితో
   సడలని దీక్షనున్న యొకసాధువు బ్రహ్మవరమ్ము నీయగా
   తడబడి సూర్యతాపమున త్రాగగచల్లని నీరు వీవనన్
   గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో

   తొలగించండి
 30. నాదు మాట:

  నడువగ లేడు మానవుడు నడ్డిని వంచక బద్ధకమ్ముతో
  పడుకొనుచుండి యుండునహ పక్కను వీడక మూడు పూటలున్
  గడపను దాట లేడుకద కర్రను వీడక తాతగారిటన్
  గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో?

  రిప్లయితొలగించండి