5, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2329 (రామునకు సహోదరి...)

కవిమిత్రులారా! 

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామునకు సహోదరి గదా రమణి సీత"
లేదా...
"రామునకున్ సహోదరి ధరాసుత సీత గదా తలంపగన్"

99 కామెంట్‌లు:

  1. లపిత మేగని యనుజుడు లక్ష్మణుండు
    రామునకు, సహోదరి గదా రమణి సీత
    యూర్మి ళకు చూడ గను యాత యోగ్యు రాలు
    ధన్య చరితపు నీతయు ధరణి యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది.
      'లపిత మేగని, ...యాత..'....? లపిత మంటే మాట అని నిఘంటువు చెప్తున్నది.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు.
      లపితము+ఏగు+అని = లపితమేగని = మాట అతిక్రమించని, మాట తప్పని.
      ఏగు= అతిక్రమించు. వ్యతిరేకార్థములో “ఏగని”
      యాత= తోడికోడలు.

      తొలగించండి
  2. భరత లక్ష్మణ శత్రుఘ్ను పురుషు లెల్ల
    తమ్ము లేనందరు భళిగ సుమ్ము! లేదు
    రామునకు సహోదరి గదా; రమణి సీత
    ధరణి పుత్రి రామునికాయె ధర్మ పత్ని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శత్రుఘ్న పురుషులెల్ల తమ్ములే యందరు...' అనండి.

      తొలగించండి
  3. నీమము తప్పకుండ ధరణీతలమందున పుట్టి సజ్జనుల్
    క్షేమము నెంచి దైత్యుల నశింపగ జేసిన ధర్మమూర్తి నా
    భూమిజ పెండ్లియాడ ముదమున్నిక యూర్మిళ మర్దలయ్యెగా
    రామునకున్, సహోదరి ధరాసుత సీత గదా తలంపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సజ్జన। క్షేమము నెంచి...' అనండి.

      తొలగించండి
  4. జనుల దాహంబు దీర్చగా జనకునాజ్ఞ
    మునిని పురముకు దెచ్చిన ముదిత శాంత
    రామునకు సహోదరికదా! రమణి సీత
    చేత చెలిమిని ఘనమైన సేవగొనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      శాంత ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      'పురమునకు' అనడం సాధువు. అక్కడ 'మునిని మిథిలకు దెచ్చిన...' అందామా?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! మీ సవరణ అమూల్యము! ధన్యవాదములు!

      తొలగించండి


  5. అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలతో


    ఊర్మిళ మరదలు కదవె యుక్త మగుచు
    రామునకు; సహోదరి గదా రమణి సీత
    తనకు ; లక్ష్మణునికి భార్య తరము గాను;
    యేల సందేహము జిలేబి యెరుకపట్టు !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. వనితా రమణీ పితరుడు
    జనకుండని, పెండ్లియాడె జానకి రాము
    న్ననితెలు సుకొనగ సుమతీ,
    ఘనమై పూరణ కుదిరెను గదవె జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. ఓమునివర్య ! లక్ష్మణుని యూర్మిళ పెండ్లి గొనంగ హాలియౌ
    రామునకున్; సహోదరి ధరాసుత సీత గదా తలంపగ
    న్రాముని తమ్ముడా భరతు నాలియ మాండవికిన్; కవీశ్వరా
    కోమలి కోడలయ్యె నదికో శ్రుతకీర్తి సుమిత్రకున్ గదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
      'తరముగాను+ఏల' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
  8. ఆర్యులకు మనవి,
    ఈ పూరణము కేవలము సమస్యను సమర్థించుటకు మాత్రమే వ్రాయుట జరిగినది. అన్యథా భావించవద్దని ప్రార్థన.


    వింత బాంధవ్య మీనేల వేడ్క గనిన
    నవని నాథుడు తనతండ్రి, యవనిజ యిక
    భార్య యైనట్టి వైనంబు పలుక నెంచ
    రామునకు సహోదరి గదా రమణి సీత.

    నీమము దప్పనట్టి ధరణీ పతి పంక్తిరథుండు తండ్రియై
    క్షేమము గూర్చు లోకమున, శ్రీప్రదయై వెలుగొందు ధాత్రియే
    యామెకు జన్మనిచ్చినది, యాయమ యీతని భార్య, వింటిరే
    రామునకున్ సహోదరి ధరాసుత సీత గదా తలంపగన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      పూరణలో మీ 'లాజిక్కు' బాగున్నది. రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    రామునికి సహోదరిగదా రమణి సీత
    కౌనులే యాడు బిడ్డ ని గాదె వరుస
    శాంత;యామెను నెంచె విస్తారముగను
    రామనవమి పర్వమున షరాఫు,"కంది"!

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    షరాఫు॥కోఠీదారు,చిల్లర మార్చునతడు శ.ర.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    ప్రేమము మీర నీ నవమి పెళ్ళి సభాస్థలి జూడ "శాంత" యా
    రామునికిన్ సహోదరి, ధరాసుత సీత గదా! తలంపగన్
    నీమము నాడకూతురుకు నిచ్చిరి జ్యోతుల పళ్ళెరంబు స
    త్కామన జేసిరా విబుధ కాంతలు హారతి పాట బాడగన్!

    రిప్లయితొలగించండి
  12. వనములకు నేగు సమయాన వగచి వగచి
    ఊర్మిళా శృతకీర్తియు వూరడించి
    జానకీమాత భద్రతలు జాస్తి జెప్పె
    రామునకు, సహోదరి గదా రమణి సీత!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వూరడించి' అనడం సాధువు కాదు. "శ్రుతకీర్తి నూరడించి" అనండి. మూడవ పాదంలో గణదోషం. "భద్రతల్" అంటే సరి!

      తొలగించండి
  13. ఆందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    శ్రీరామ జయరామ జయజయ రామ.

    కందము:
    రామా! నిన్నే దల్తుము
    రా! మామదిలోన నిలిపి రాజా రామా!
    రా! మాయను తొలగింపుము
    రా! మా సీతమ్మతోడ రక్షణ నిడుమా!

    సీసము.
    సూర్యవంశమునందు సూతివైనాగాని
    చల్లనిదగు చూపు స్వామినీది
    అడవులందున చాల నలయక దిరిగినా
    పరమ కోమలమైన పదమునీది
    కోతిమూకలతోడ కోరుచు దిరిగినా
    చంచలమ్మే లేని చనువు నీది
    కోదండ పాణివే మాదండమే జూచి
    శరణమ్మునిచ్చేటి జాలినీది
    ఆటవెలది:
    పానకమ్ము ద్రాగి వడపప్పు నేదిని
    వేడి గాడ్పులందు వేడినాము
    చల్లదనము గల్గె చలువపందిళ్ళలో
    చల్లగమము జూడు జానకీశ.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ రామ స్తుతి మధురంగా ఉంది. అభినందనలు.
      "సూతివైననుగాని...దిరిగినన్...శరణమ్ము నిచ్చెడు" అనండి.

      తొలగించండి
  14. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
    శ్రీ కోదండరామ దండకం
    శ్రీరామ నీనామ మంత్రంబు మేమంత పల్కంగ
    మాయమ్మసీతమ్మ నీచెంత నుండంగ సౌమిత్రి తోగూడి
    సంజీవ రాయుండు నీపాద ముల్ మ్రొక్క మాయొక్క పాపాలు
    నీయొక్క కోదండ టంకార ఝంకార నాదంబులన్ ద్రోసి భక్తాదు
    లంబ్రోచు దుష్టాత్ము లంద్రుంచు నీమార్గ మే మాకు సన్మార్గ మైగాచి
    రక్షింప రావోయి మాలోని షడ్వర్గ ప్రత్యర్థులే మ్రగ్గి మాయంత రంగంబు
    నీదివ్య నీభవ్య నీరమ్య రూపంబు తోనిండి మందార బృందంపు మాడెంద
    మానంద సందోహ మందుండి యందందు చిందాడు మిందీవర శ్యామ నీవీక్ష
    ణారక్షణల్లేక సంసార సంద్రంబు మేమీద లేమయ్య రావయ్య రామయ్య పట్టాభి
    రామయ్య కళ్యాణ రామయ్య కారుణ్య ధామయ్య ప్రార్థింతు మయ్యా పరంధామ దేవా
    నమస్తే నమస్తే పునస్తే నమః.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుందరం, రామ దండకం, సుందరంబు
      గా రచించెను తోపెల్ల కావ్య వరుడు,
      శంకరాభరణమునందు సంత సముగ
      సృష్టి చేసెను కవులెల్ల ఇష్ట పడగ

      తొలగించండి
    2. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ దండకం మనోహరంగా ఉంది. అభినందలు.
      *****
      పూసపాటి నాగమణి గారూ,
      శర్మ గారిని అభినందిస్తూ పద్యం వ్రాసినందుకు సంతోషం, ధన్యవాదాలు!
      సుందరం, దండకం అనడం వ్యావహారికాలు. "సుందరము రామదండక మందమొప్ప। గా రచించెను తోపెల్ల కవివరుండు..." అనండి.

      తొలగించండి
    3. గురువుగారికి నమస్సులర్పిస్తూ
      రామదండకం బుచదివి రమ్యరమణి
      పూసపాటి నాగమణి యీ పూట పద్య
      సుమము నందభిమానము జూపినారు
      అందు కొనుమమ్మ కొమ్మ నా వందనములు.

      తొలగించండి
  15. శ్రీశంకరార్యులకు ప్రత్యేక నమస్కారములతో
    సీ. నేమాని గురువుల నేమనంబున దల్చి
    …………. యర్పింతు నంజలి యందు కొనుమ
    స్వర్గ సీమను జేరి సాహిత్య శంకరా
    ………… భరణుడై చెలగడో భవ్య మూర్తి
    శంకరార్యుల పద స్పర్శన శ్వాసించు
    ………… నాపద సంపద నాణ్యముగను
    ఏల్చూరి వారికి నేనెంత ధన్యుండ
    ………… మురళీరవళితోడ ముచ్చటింప
    అన్న మిస్సన్న నా కందించు సహకార
    ……….. ప్రోత్సాహ కాలకు పొంగి పోదు

    తే.గీ. పద్య కుసుమాలు వెలయించు సద్యశస్క
    వివరులందరు బంధువుల్ వెన్ను తట్ట
    మొదటి సారిగా వ్రాసితి ముక్తి గోరి
    దండ మర్పించి శ్రీరామ దండకంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు భక్తిరసప్రపూర్ణమై మీ దండకము మహదానందమునిచ్చినది మాహృదయాలకు. ధన్యులు మీరు. పురాకృత సుకృతముంటేనే గాని యిట్టివి సాధ్యము కాదు. నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    2. మీవంటి వారి మన్న పొంద గలగడం నిజంగా పురాకృత సుకృతమేనండి. ధన్యవాదములతో
      అనితరమసాధ్యమగు రీతి నద్భుతముగ
      కైపదంబులు పూరించి కవిత జెప్పు
      పోచిరాజు కామేశ్వర పూజ్యునకిట
      నతుల నర్పింతు మీమెప్పు నందు కొనుగ.

      తొలగించండి
    3. దిసీజ్ టూమచ్ అండ్ త్రీమచ్ తమ్ముడూ

      తొలగించండి
    4. శర్మగారు ధన్యవాదములు. మీ అన్నయ్య గారన్నట్లు నేనంతటి పొగడ్తల కర్హుడను గాను.

      తొలగించండి
  16. శాంతి, ఋష్యశృంగుని పత్ని సద్గుణవతి
    రామునకు సహోదరి గదా, రమణి సీత
    శ్యామలాంగుని ప్రియపత్ని కోమలాంగి
    వీరి కథ విన్న వారికి తీరు నఘము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. కూతురాయెను ఆ జనకునకు ఊర్మి
    ళమ్మ, భార్య అయ్యెను వర లక్ష్మణునకు,
    మరదలాయె గద మనము తరచి చూడ
    రామునికి, సహోదరి గదా రమణి సీత
    కామె, సుమిత్ర కోడలై ప్రేమ చూపి
    దశరధుని ఇంట అడుగిడె మిసిమి తోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      ఊర్మిళ బంధుత్వాన్ని వివరంగా చెప్తూ చక్కని పూరణ నందించారు. అభినందనలు.
      'ఆయెను+ఆ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కూతురై పుట్టె నా జనకునకు నూర్మి।ళమ్ము..." అనండి.

      తొలగించండి
  18. రోమపాదు పెంపుడు కూతురు విను శాంత
    రామునకు సహోదరి గదా, రమణి సీత
    రఘుకులాబ్ధి సోమునకు భార్య యగు నయ్య
    ధీర వరులు కుశలవుల వీర మాత


    హైమ సుహార దామ సుగళావృత జానకి ధర్మ పత్నియౌ
    రామునకున్, సహోదరి ధరాసుత సీత గదా తలంపగ
    న్నా మిథిలా పురాధిపతి యౌవన పుత్ర కుశధ్వజుండు ను
    ద్దామునకుం బ్రియంబుగ విధాతృ వరంబున నిశ్చయంబుగన్

    [జనకమహారాజు సీరధ్వజుని కుమారుఁడు కుశధ్వజుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ! భవాఘ విరామా!
      శ్యామల తను రుచి లలామ! సద్గుణ ధామా!
      రామా! సత్య పరాక్రమ!
      భామావనిజహృదయాబ్ధి భాసిత సోమా!


      రఘు వంశాబ్ధి శశాంక! కోప జిత పారావార! కోదండ పా
      ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా!
      యఘ దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ
      ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ!

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు, రామస్తుతి పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    4. కామేస్వర మహోదయా! మీ కలఖడ్గాని కిరివైపులా పదునే! అభినందనలు.

      తొలగించండి
  19. పాలజలధిని జిలుకగ ప్రభవమొంది
    సోముడాయెను లక్ష్మికి సోదరుండు
    భూమినుండివిడివడగ భూమిజకును
    చింతసేయగ సత్యంబు శీతకరుడు
    రామునకున్ సహోదరిగదా రమణి సీత!

    చంద్రుడనే రామునకని భావన!
    రమయతీతి ఇతి రామః !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      కొంత అన్వయదోషం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పాలజలధిని జిలుకగ ప్రభవమొంది
      సోముడాయెను లక్ష్మికి సోదరుండు
      రమయెగాదె నరయగనా రామపత్ని
      చింతసేయగ సత్యంబు శీతకరుడు
      రామునకున్ సహోదరిగదా రమణి సీత!

      చంద్రుడనే రామునకని భావన!
      రమయతీతి ఇతి రామః !

      తొలగించండి
  20. క్షోణి రక్కసుల నణచు గుణము లోన
    గండ్రగొడ్డలి చేబూని కఠినులైన
    రాజులందరి తలలు నరకిన పరశు
    రామునకు సహోదరిగదా రమణి సీత!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామిని సీత రక్కసుల బాధల బాపెడు సద్గుణమ్ములో
      ఏముని, గండ్రగొడ్డలిన యిమ్మహి గర్వముతోడ రెచ్చు భూ
      స్వాములు రాజులొక్కొకరి ప్రాణము లూడ్చెనొ, జామదగ్నియౌ
      రామునకున్ సహోదరి ధరాసుత సీతగదా తలంపగన్!

      తొలగించండి
    2. మడిపెల్లి రాజ్ కుమార్ గారూ,
      పరశురాముణ్ణి సీతకు సోదరుణ్ణి చేసిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో "సద్గుణమ్ములో । నేముని గండ్రగొడ్డలిని యిమ్మహి..." అనండి. ఇకారాంతమైన గొడ్డలికి 'ని' చేరుతుంది. ఇక్కడ తృతీయార్థంలో ద్వితీయ.

      తొలగించండి
    3. ధన్యవాదాలు శంకరయ్యగారు.
      సవరించుకుంటాను.

      తొలగించండి
  21. సాధ్విజానకి సహధర్మచారిణియగు
    రామునకు,సహోదరి గదా రమణి సీత
    భరత శత్రుఘ్న లక్ష్మణ భార్యలైన
    నుర్వి మాండవి శ్రుతకీర్తి యూర్మిళలకు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భార్యలగుచు। నొప్పు మాండవి..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. రెడ్డి గారు పొరబాటు జరిగినది. లక్షణ సతి సుమిత్ర గాదు. ఊర్మిళ. సుమిత్ర లక్ష్మణునికి తల్లి

      తొలగించండి
  23. క్షమించండి. పొరపాటు జరిగింది. తొలగిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కొత్త సమస్య సృష్టించ వచ్చనుకుంటా

      లక్ష్మణ సతియౌ సుమిత్ర లక్షణముగనన్ !


      జిలేబి

      తొలగించండి
    2. మంచి స్నేహలక్షణాలు చూస్తే ఊర్మిళ లక్ష్మణునికి తగిన భార్య అనే అన్వయంతో పూరిస్తారు. ఇక సమస్య ఏమున్నది?
      కాకుంటే 'క్ష్మ' అనే దుష్కర ప్రాస ఇబ్బంది పెడుతుంది. అలాంటి ప్రాసలతో కవిమిత్రులను ఇప్పట్లో ఇబ్బంది పెట్టదలచుకోలేదు. :-)

      తొలగించండి


    3. లక్ష్మీ ! యూర్మిళయే గద
      లక్ష్మణ సతియౌ ! సుమిత్ర లక్షణము గన
      న్లక్ష్మీ , దశరథు సతియౌ !
      సూక్ష్మము గనవమ్మ లక్ష్మి సుందర వదనా !

      జిలేబి

      తొలగించండి
    4. అమ్మా జిలేబీ!
      నమస్కారం.
      అసాధ్యురాలివి. అయినా ఒకే పద్యంలో లక్ష్మిని మూడుసార్లు సంబోధించాలా?

      తొలగించండి
    5. లక్ష్మి యన సీత; యూర్మిళ
      లక్ష్మణ సతియౌ; సుమిత్ర లక్షణము గనన్
      సూక్ష్మము చెప్పెదను దశర
      థ క్ష్మాపతి కొకతె ముగురు దారలలోనన్.

      తొలగించండి
    6. అన్నట్టు జిలేబీ గారూ,
      పైన ఏకవచన ప్రయోగానికి మన్నించండి. ఏదో అలా వచ్చేసింది.

      తొలగించండి


    7. కంది వారు అదురహో!

      మా కంది వారి సాటిగ
      మా కందమటు జమగట్ట మాతరమగునా!
      శ్రీ కంది శంకరయ్యా !
      మీ కవనమునకు జిలేబి మీరగ జోతల్ :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  24. ముద్దులొలుకుసహోదరుల్ ముగురు సుమ్ము
    రామునకు, సహోదరిగదా రమణి సీత
    లక్ష్మణుని ప్రియ పత్నికి, ప్రాణా నాథు
    పల్కున కునుకుగొనె పలు వత్సరములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'ప్రాణనాథు'... టైపాటు వల్ల 'ప్రాణానాథు' అయింది.

      తొలగించండి
  25. నిద్ర నిచ్చెద మెలకువ నేను గొనెద
    ననుచు సతినాపి లక్ష్మణు డరుగ తోడు
    రామునకు,సహోదరి కదా రమణి సీత
    యూర్మిలన్ గొన సౌమిత్రి నొలయలేదొ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'భరత శత్రుఘ్నలకు తాను వదినగాగ..' అనండి. 'లక్ష్మణ వదిన' అన్నది దుష్టమాసం అవుతుంది.
      రెండవ పూరణలో 'తగు నోర్పును... సీత సిగ్గిలన్' అనండి.

      తొలగించండి
  27. శాంత యనబడు భామిని సరళ యువతి
    రామునకు సహోదరి గదా .రమణి సీత
    రామచంద్రుని పత్నియే భామ! వినుము
    దున్ను చుండగ భూమిని దొరకె జనకు
    నకట యతనిభా గ్యమునేమ నగ గ లము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు (ఈరోజు మీ పూరణ కాస్త ఆలస్యమైనట్టుంది? రాములవారి పెండ్లికి వెళ్ళి వచ్చారా?)
      'జనకునకు' అనవలసింది 'జనకు' అన్నారు. అక్కడ 'పితకు' అనండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. జనకునకు+అట అని మా అన్న గారి ఉద్దేశ్య మనుకుంటాను.

      తొలగించండి
  28. కాంతగను పిలువ బడెడి శాంత యనగ
    రామునకు సహోదరి గదా! రమణి సీత
    యాలి యగు రామచంద్రున కవని లోన!
    యొక్కటియె బాణ మాతని కొక్క సతియె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోన। నొక్కటియె...' అనండి.

      తొలగించండి
  29. దండక మయ్యది చదువగ
    దండమునే బెట్టవలయు దాదృశ కవికిన్
    దండము బెట్టుదు నేమరి
    పండితుడవు రచనయందు బాలా! నీవున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్పితకు స్నేహితులు మంచి మనసుతోడ
      రామదండకంబు చదివి రంజనమగు
      పద్యమందు దీవింపగ ప్రణతులివియె
      పోచిరాజు సుబ్బారావు పూజ్యునకును.

      తొలగించండి
  30. కోసలాధీశునకు శాంత కూతురవగ
    రామునకు సహోదరి గద ; రమణి సీత
    జనకు రాజ్యము నందున జనన మొంది
    రావణుని గూల్చ సతియయ్యె రఘువరునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  31. ఆ: దేవకీసుతుండు, దేవతా శ్రేష్టుoడు,
    చక్ర ధారి, ఘన పరాక్రముండు,
    రుక్మిణీ ప్రియుండు, రోచిష్ణువుండైన
    పార్థుఁ డర్జునునకు బావ గాదె

    పార్ధుడు = కృష్ణుడు ఆర్యా 2 వ తారీకు ఇచ్చిన సమస్య పూరించి పంపాను మీరు అనివార్య కారణముల వలన చూచి ఉండలేదు. అవకాశమున్న పరిశీలించి తప్పులు సూచించ గలరు.

    రిప్లయితొలగించండి
  32. నీరము భార్య పోయగ మునీంద్రుని పాద ద్వయంబు రాముడున్
    కూరిమి యొప్పగా కడిగె, గొంతుకు గంధము పూసె సోదరుల్,
    హారతి నిచ్చి మువ్వురును, హర్షము కూర్చెను కోసలీ మణుల్
    నారద మౌనిముఖ్యునకు, నల్వురు భార్యలతి ప్రసన్నులై

    ఆర్యా మొదటి సారి వృత్తము వ్రాశి 1 వ తారీకు పోస్టు చేశాను. అనివార్య మైన కారణములతో మీరు సమీక్షించ లేక పోయారు. అవకాశమున్న పరిసీలిమ్చి సలహాలు ఈయవలెను.

    రిప్లయితొలగించండి
  33. ఆముని రోమపాదుని నాశలు దీరగ బుట్టు శాంతయే
    రామునకున్సహోదరి ,ధరాసుత సీతగదా తలంపగన్
    రామునకెయ్యెడన్గనిన రమ్యత గల్గుట భార్యయే యగున్
    రాముని సేవజేయుదును రాముని బ్రాపును నొంద గోరికన్

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. శివుని చాపమ్ము భంగమ్ము జేసి యవని
    జాత భర్తాయె రాముడు,భ్రాత వోలె
    రావణుని జంపి శీలము రక్ష జేసె,
    రామునికి సహోదరి గదా రమణి సీత

    రిప్లయితొలగించండి
  36. భూమిజ పత్ని యేరి కగు? బోటి జనించిన తోడ నేమగున్?
    రాముని భామ యే యువిద? రావణు జావుకు మూలకారణం
    బేమని తోచు రామకథ నెన్నిన నేరికి నైన జెప్పవో
    రామునకున్, సహోదరి, ధరాసుత, సీత గదా తలంపగన్.

    రిప్లయితొలగించండి
  37. శాంతయనుకాంత సద్గుణ శాంత చిత్త|
    రామునకు సహోదరి గదా|”రమణిసీత
    భరత,శత్రుఘ్నులకుతాను వదినగాగ
    రామరాజ్యాన రక్షణ ప్రేమమయమె|
    2.”ఓముని పెళ్లియాడ తగుయోర్పునుగల్గిన శాంత|శాంతిచే
    రామునకున్ సహోదరి”|”ధరాసుత సీతగదా తలంపగన్
    నామికమాయెగా శివ ధనస్సు| స్వయంవర మందుగెల్వగా
    రాముడు|తాళిగట్టెగద రాజుల నోర్పున సీత సిగ్గిలన్”|

    రిప్లయితొలగించండి
  38. చెల్లిపోవును బ్రతుకిట్టి చేష్ట మాను
    పరుల భార్యయె రావణా పరగ చెల్లి
    తప్పు మన్నించమనిజెప్పి యప్పజెప్పు
    రామునకు, సహోదరి గదా రమణి సీత.

    రిప్లయితొలగించండి
  39. సరణతో

    సీసము.
    సూర్యవంశమునందు సూతివైబుట్టినన్
    చల్లనిదగు చూపు స్వామినీది
    అడవులందున చాల నలయక దిరిగినన్
    పరమ కోమలమైన పదమునీది
    కోతిమూకలతోడ కోరుచు నుండినన్
    చంచలమ్మే లేని చనువు నీది
    కోదండ పాణివే మాదండమును గనన్
    శరణమ్మునిడునట్టి జాలినీది
    ఆటవెలది:
    పానకమ్ము ద్రాగి వడపప్పు నేదిని
    వేడి గాడ్పులందు వేడినాము
    చల్లదనము గల్గె చలువపందిళ్ళలో
    చల్లగమము జూడు జానకీశ.

    రిప్లయితొలగించండి
  40. వేమును తించు చెప్పితివొ వెర్రితనంబున, లేదు లేదురా
    రామునకున్ సహోదరి;...ధరాసుత సీత గదా తలంపగన్
    రాముని పెండ్లియాడుచును రావణు బందిగ లంకలోన, తా
    గోముగ రాక్షసాధముని గొప్పగ నంపెను స్వర్గసీమకున్

    రిప్లయితొలగించండి