3, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2327 (తల్లిఁ బెండ్లాడి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె"
లేదా...
"తల్లికి తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్"

65 కామెంట్‌లు:

 1. తండ్రి విడువగ వనమున తల్లి నీడ
  హాయి దేలుచు వాల్మీకి యాశ్రమమున
  లాలనల పెరిగిన ముద్దుల లవ కుశుల
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని... రాముడు కుశలవుల తల్లిని పెళ్ళాడలేదు. పెళ్ళి చేసుకొని కుశలవులకు తల్లిని చేశాడు!

   తొలగించండి
  2. సార్! వితండ వాదమున కుదాహరణ:

   ప్రశ్న: రాముడెవరిని పెండ్లాడె?
   ఉత్తరం: సీతను
   ప్రశ్న: లవకుశుల తల్లి యెవరు?
   ఉత్తరం: సీత
   ప్రశ్న: రాముడెవరిని పెండ్లాడె?
   ఉత్తరం: లవకుశుల తల్లిని

   Hence proved...


   వితండ = స్వపక్షపాతముగ వాదించెడు వాదము

   ...శబ్దరత్నాకరము...

   తొలగించండి
  3. దానికి ప్రత్యుత్తరం:

   1 × 0 = 0
   2 × 0 = 0

   Hence:

   1 = 2 ?

   తొలగించండి
  4. “లాలనఁ బెరిగి మున్ముందు లవకుశులకుఁ / దల్లి” అనండి సరి పోతుంది.

   తొలగించండి
  5. __/\__

   ఉత్తర భారతదేశపు కొన్ని ప్రాంతాలలో పిల్లలు పుట్టిన తరువాత భర్త భార్యను పేరుబెట్టి బిలువడు:

   "లవ్ కుశ్ కీ మా!"

   తొలగించండి
  6. సారూ! మీ సుందరకాండ శరవేగముతో పరుగు లిడుతోందనుకుంటా!

   తొలగించండి
 2. పరమ సాధ్వీశి రోమణి వసుధ యందు
  తల్లి వసుమతి సహనము తనయ కబ్బ
  కులపు తేజమై దీపించు కుశల వులకు
  "తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.అభినందనలు.
   పైన ప్రభాకర శాస్త్రి గారి పూరణపై నా వ్యాఖ్యను చూడండి.

   తొలగించండి
 3. డా.పిట్టా
  తల్లిని జేసి వీడు నొక ధర్మము జెప్పి"తలాఖ"టంచు వే
  తల్లుల బెండ్లియాడుటయు ధర్మమె పశ్చిమ దేశ జాతికిన్
  బల్లిదులైరి హైందవులు బాల్య వితంతువు గ్రాల తల్లిగా
  తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని"రాము" గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  తొల్లి ప్రేమల దేల్చ నాతురత నొక్క
  తల్లిగా మారె,మాటను దప్పకుండ
  పిదప పరిణయ మాడెను పేద మగడు
  తల్లి బెండ్లాడి "రాముడు"దాత్తుడాయె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   'రాముడు' అనే లౌకిక వ్యక్తి గురించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


 5. తొల్లి విల్లును విరిచెను, తోయ జాక్షి
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె
  తండ్రి యానగ యడవుల ధరణిజయును
  తమ్ము డా లక్ష్మణుండు జతగన నేగె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విరిచి తా నెల్లరకును। తల్లిఁ..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 6. ఇల్లులఁ గూల్చి తాపసుల హింసలు పెట్టెడి శుక్రశిష్యులం
  దెల్లరి మట్టుఁబెట్టి గువువీయగ నానతి నాగభూషణున్
  విల్లును త్రుంచి తన్వి యలివేణి ధరాత్మజ నిజ్జగంబుకున్
  తల్లికి తాళిఁ గట్టిన యుదాత్తచరిత్రుని రాముఁ గొల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేమాని సోమయాజులు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జగంబునకున్' అనడం సాధువు. అక్కడ "లోకమంతకున్। దల్లి..." అందామా?

   తొలగించండి
  2. అలాగేనండీ. తప్పకుండా. ధన్యవాదములు.

   తొలగించండి
 7. జనకు డిట్లని దలచెను మనములోన
  శివుని ధనువును చేనంది శీఘ్రగతిని
  మోదమున ద్రుంచి ఘనుడౌచు నాదు చిట్టి
  తల్లి బెండ్లాడి రాము డుదాత్తు డయ్యె.

  ఎల్లవిధంబులన్ జనకు డెంతయు సంతసమంది యెంచె నీ
  బల్లిదుడైన రాఘవుడు భాగ్య మొసంగెడి చక్రపాణియే
  యుల్లము సంతసించునటు లుర్విజ కారవ ప్రాణమైన నా
  తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. హరుని చాపమ్ము నవలీలఁ విరిచి యయ్య
  యోనిజ సుగుణ శీలియౌ యోషిత ఘన
  జనక రాజదుహిత యైన జగము నేలు
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

  రిప్లయితొలగించండి

 9. తండ్రి రామయ్య విష్ణువే తల్లిలక్ష్మి
  సీతగామార లోకాల క్షేమమెంచి
  దనుజులందర జంపగా ధరనుజేరి
  తల్లి బెండ్లాడి రాము డుదాత్తు డయ్యె.

  రిప్లయితొలగించండి
 10. బాల్య మందున వాల్మీకి ప్రాపు నొందు
  కతన మేటివీరులుగను గణన కెక్కి
  లలిత మనోహ రులునైన లవుడు కుశుల
  తల్లి పెండ్లాడి రాముడుదా త్తుడయ్యె


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పైన ప్రభాకర శాస్త్రి గారి పూరణపై నా వ్యాఖ్యను పరిశీలించండి.

   తొలగించండి
 11. విభీషణుడు రావణబ్రహ్మతో:

  మీరు చెరబట్టి తెచ్చిన నీరజాక్షి
  శోకము విడ సంపదలిడు, లోకములకు
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁడయ్యె
  వారితో వైరమది మీకుఁ బాడి గాదు

  రిప్లయితొలగించండి
 12. అవగాహన లోపంబున
  నవకతవక వ్రాసియుంటి నార్యా! నేనున్
  వివరముగ మరల వ్రాయుదు
  గవనము బాగుండునటుల కాలుని గరుణన్

  రిప్లయితొలగించండి
 13. సకల సద్గుణ భాసిత చంద్ర వదన
  సమద గజయాన మిథిలేశ జనక తనయ
  ధరణిజ విశాల నేత్ర సీతా సతీ మ
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె


  ఉల్లము నందు శంభుని మహోగ్రుని సన్మతిఁ దల్చి భక్తి శో
  భిల్ల ససంభ్రమమ్ముగను భీతిల సీత విశిష్ట సాధ్వి యా
  విల్లును బాహు సత్వమున భేదన చేసి జగత్రయమ్ములం
  దల్లికి, తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   సతీమతల్లితోను, జగత్రయాలకు తల్లితోను మీ రెండు పూరణలు అత్యుత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 14. శివునివిల్లును విఱిచి తా శీఘ్రముగను
  జనకుకొల్వులో తోషించు, శంబరారి
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె
  సురలుకురియ పైనుండి ప్రసూనములను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. తపసి ఘన పాదములకు వందనముచేసి
  హరుని విల్లును సులువుగా విరిచి జనక
  పుత్రి , చల్లని చూపుతో ధాత్రినేలు
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 16. ఉల్లము సంతసిల్లకని యుర్వితనూజను రాజుకొల్వులో
  పెల్లుగ కాటిరేని ఘనవిల్లును త్రుంచి రయమ్ము, కామునిన్
  దల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
  చల్లని చూపులన్ సతము చక్కగ కావుమటంచు కోరుచున్

  రిప్లయితొలగించండి
 17. ఉల్లము నందు నిల్పితి మహోన్నత సద్గుణ మూర్తినే సదా
  విల్లును చేతబట్టి యరి వీరుల ద్రుంచుచు ధీరుడై విరా
  జిల్లెడు దీనబాంధవుడు సీత జగమ్ముల నేలెడా మహా
  తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 18. మల్లెల వోలె నిర్మలపు మానసమున్ గలవాడు శిష్టులన్
  జల్లగ జూచువాడు గుణ సాగర డున్నత వీరవర్యుడున్
  గల్లలు బల్కనట్టి ఘన కార్ముకధారి ప్రియమైన మైథిలీ
  తల్లికి తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రియమైన' అన్నచోట గణభంగం. 'మైథిలీ తల్లి' అనడం దుష్టసమాసం. సవరించండి.

   తొలగించండి
 19. ఆమె జనకుని పుత్రిక యాస తీమ
  తల్లి బెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
  రాము నెరుగుమా సాక్షాత్తు రహిని మహికి
  మానవా కారమెత్తిన మహితుడతడు

  రిప్లయితొలగించండి
 20. రామదాసు రమ్యంబుగ వ్రాసినట్టు
  జానకమ్మను జేపట్ట జక్రవర్తి!
  థీర,ధరణి సంజాత పతివ్రతామ
  తల్లి బెండ్లాడి రాముడుదాత్తుడయ్యె!

  రిప్లయితొలగించండి
 21. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
  మీ సూచనకు ధన్యవాదాలు
  వరించిన ఈ పద్యము చూడండి
  మల్లెల వోలె నిర్మలపు మానసమున్ గలవాడు శిష్టులన్
  జల్లగ జూచు వాడు గుణ సాగరు డున్నత వీర వర్యుడున్
  గల్లలు బల్కనట్టి ఘన కార్ముకధారుడు సౌమ్య జానకీ
  తల్లికి తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 22. మేటి వీరులు విఫలులై మిన్నకున్న
  సభికులందరు జూచుచు జయము లిడగ
  విస్మయముగశివధనువు విరిచి జగము
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁడయ్యె
  ననుచు దలచెగాధేయుడు మనమునందు!!!

  రిప్లయితొలగించండి
 23. శివ ధనుర్భంగ మొనరించి సిరులు గొలుప
  చైత్ర శుద్ధ నవమి నాడు చారు శీల,
  జగతి మెచ్చిన ధరణిజ, జానకమ్మ
  తల్లి బెండ్లాడి రాము డుదాత్తు డయ్యె!

  గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణ పరిశీలించ గోరుతాను.
  అని వలదని గీత నందింప గోరగ
  పార్థు డర్జునునకు బావ మఱది
  సారధిగనె బ్రతుకు సారము నంతయు
  బోధ పఱచి నరుని బాధ దీర్చె!

  రిప్లయితొలగించండి
 24. భూమిఁ దున్నెడి జనకుని పుత్రికయయు
  రావణుని జంప నెంచిన రామచంద్రు
  చేయి బట్టగ నే తెంచె సీత ; చిట్టి
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పంపె కేశవుడు సుభద్రను నేర్పుగా
  పరిణయం బొనర్ప పార్ధు కడకు
  తోడు దొంగ లైరి తుద కిర్వురా విధి
  పార్థుఁ; డర్జునునకు బావమఱఁది

  రిప్లయితొలగించండి
 25. అల్లదె పిల్లవా డొకడు హర్షము తోడన వప్పజెప్పుచున్
  గల్లయుకాదు నా పలుకు కాంచుడు మీరలు దీనిభావము
  న్నుల్లము సంతసించగను నూర్మిళ సోదరి సీతనాగ మా
  తల్లికిదాళి కట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 26. జనకు నుత్చాహ బరచిన జానకమ్మ
  వరమ?గమనించగా స్వయం వరమునందు
  రామచంద్రుడు గెలువ?పరాకునేలు
  తల్లి|బెండ్లాడి రాముడుదాత్తుడయ్యె|
  2.ఎల్లరు జూచుచుండ జనులెంచగనే నవమీముహూర్తమున్
  యుల్లముసంతసంబొసగ యుత్సవ మందున నేత్ర పర్వమై
  కల్లలుమాన్పి మానసవికాశము నింపెడి శక్తి యుక్తి|చిం
  తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్ {భూదేవి పెద్దతల్లి కూతురుసీతచిన్నతల్లి}

  రిప్లయితొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చేవ గలిగిన వీరుడై శివధనువును
  త్రెంచి దాను సౌభాగ్యవతియగు జనక
  రాజ పుత్రిక నయ్యాది లక్ష్మి వంటి
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁడయ్యె

  రిప్లయితొలగించండి
 28. మఱో ప్రయత్నం!

  ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |
  ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణీనా ||

  జనని యెవ్వరో తెలియక జనక రాజు
  పుడమి దొరికినట్టి శిశువు పుత్రి వోలె
  జనకు డొసగంగ ప్రియముగ జానకమ్మ
  తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె


  ...తల్లి = a term of endearment used with girls and young women (showing love or appreciation or coaxing)

  ...ఆంధ్ర భారతి

  రిప్లయితొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బల్లిదుడైన సత్ప్రభువు, పాయక ధర్మమె నెంచు వాడునౌ
  చల్లని దండ్రి, నన్నిలను జానుగ బ్రోచెడి వాడు, భూరిదా
  విల్లును ద్రుంచియున్, జనక బిడ్డ మహీజకు లక్ష్మి రూపుయౌ
  తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

  రిప్లయితొలగించండి
 30. ఫుల్లసరోజనేత్ర దలపోయుచు రాముని డెందమందు, దా
  నల్లదె ముందుగా ముదమునన్ ప్రణమిల్లగ సీత తండ్రికిన్
  తల్లికి, తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
  నల్లని మేని వాని, రఘునందను, ధర్మగుణాభిరామునిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 31. శంకరాభరణం గురుదేవులకు కవిమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
  ఆకర్ణాంత విశాలనేత్రములతో ఆదివ్యనామంబుతో
  శ్రీకారంబులబోలు కర్ణములతో సీతాసమేతంబుగా
  ఆకోదండము మూపునందనర నిత్యానందమౌ మోముతో
  ఓకళ్యాణ గుణాబ్ది దాశరథి నాకున్ దర్శనం బీయరా

  అంజలి మోడ్చి మారుతి పదాబ్జము చెంగట నుండ జానకీ
  కంజదళాక్షి యంకమున కన్నులపండువుగా వసింపగా
  రంజిలుచున్ సహోదరులు ప్రాంజలులై ఇరువంక లొప్పగా
  మంజులమైన నీసుజన మంగళ రూపముజూపురాఘవా
  రచన :వడ్డూరి అచ్యుత రామకవి

  రిప్లయితొలగించండి