9, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2333 (ధర్మబద్ధము లఁట...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల"
(లేదా...)
"తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్"
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

 1. కర్ణుడాడె నటన కామించి యస్త్రముల్
  ధర్మరాజు బొంకె మర్మ మెరిగి
  కొట్టె వాలి నొకడు చెట్టు చాటున జేరి
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి


 2. ఎప్పటి కైన మేలగును యెన్నటి కైనను భేషుగానగున్
  గొప్పల కీడు జేసియటు కోటికి మింటికి యెక్కు వారలన్
  చప్పున నేల మీదికటు చట్టన నెట్టి మదంబు తీఱుచన్
  తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  ఒక్క భార్యనుగన నొదవు హైందవ నీతి
  బహుళ భార్యలగన బట్టు పీడ
  తురక వైతివేని దొరవలె దిరుగవే?!
  ధర్మ బద్ధములట తప్పులెల్ల!!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  తప్పక తండ్రికిన్ గురువు దైవముకౌ ఋణముక్తి బొందగా
  నొప్పుగృహ‌స్థువౌట ననునొక్కట ధర్మము;బాలయోగిగా
  తప్పుకొనంగనౌను సరిధర్మము;గాదిది నిండు నేరమే!
  తప్పక సేయునట్టివగు తప్పులగున్ గన ధర్మబద్ధముల్!!

  రిప్లయితొలగించండి
 6. నీతిపథమును విడి నిరవధికమ్ముగా
  దొంగలటుల ప్రజల దోచుకొనుచు
  చెప్పుచుండిరి కడుగొప్పగా నేతలు
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 7. సుయోధనుడు సభలోని పెద్దలతో:

  మత్స్యగంధి పట్టి మా తాత వ్యాసుండు
  పతియె కాక వారె పితలఁ గనిరి
  పాండు సుతుల జన్మ పలు దేవతల కర్మ
  ధర్మబద్ధములఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 8. ముప్పునుదీర్చగా ధరణి ముష్కర కోటిని సంహరించగా
  తప్పులు కొన్నిసేయుటయెదప్పదు ధర్మము రక్షసేయగన్
  తప్పక విష్ణుమూర్తి నవతారములన్నియు జేసె దీనినే
  తప్పక సేయునట్టివగు తప్పులగున్ గన ధర్మబద్దముల్

  రిప్లయితొలగించండి
 9. ముప్పునుదీర్చగా ధరణి ముష్కర కోటిని సంహరించగా
  తప్పులు కొన్నిసేయుటయెదప్పదు ధర్మము రక్షసేయగన్
  తప్పక విష్ణుమూర్తి నవతారములన్నియు జేసె దీనినే
  తప్పక సేయునట్టివగు తప్పులగున్ గన ధర్మబద్దముల్

  రిప్లయితొలగించండి
 10. ముప్పునుదీర్చగా ధరణి ముష్కర కోటిని సంహరించగా
  తప్పులు కొన్నిసేయుటయెదప్పదు ధర్మము రక్షసేయగన్
  తప్పక విష్ణుమూర్తి నవతారములన్నియు జేసె దీనినే
  తప్పక సేయునట్టివగు తప్పులగున్ గన ధర్మబద్దముల్

  రిప్లయితొలగించండి
 11. క్షాత్ర ధర్మ మంచు కడతేర్చు జనులెల్ల
  రాజ ధర్మముండు వ్యాజనంబు
  కులట వేశ్య విధులు కులధర్మమయినచో
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 12. శుక్ర నీతి జూడ వక్రమై యుండదె
  చక్రపాణి యొప్పె జగడమందు
  ధర్మమదియె వేరు ధర్మసూక్ష్మము వేరు
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల


  శుక్ర నీతి:

  "వారిజాక్షులందు వైవాహికములందు
  ప్రాణ విత్త మాన భంగమందు
  చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
  బొంకవచ్చు నఘము పొందదధిప !"

  రిప్లయితొలగించండి
 13. రాజ్య మొకటి కలదు ప్రాచీన కాలాన
  పశ్చిమాన నచటి వారలందు
  రాజు నీతి దూరు డాజన మట్టులే
  ధర్మబద్ధము లట తప్పు లెల్ల

  అప్పటి కాలమందు విను డక్కట! పశ్చిమ దేశమందు దా
  నొప్పుగ జేసె శాసనము లోమగ రాజతిదుష్టు డౌటచే
  మెప్పును గోరి పౌరులును మీరక నుందురు చిత్రమా గతుల్
  తప్పక సేయునట్టి వగు తప్పులగున్ గన ధర్మబద్ధముల్

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 14. రక్షకభటుని ఆవేదన....

  విప్పడు నోరు, చెప్పుమని పిల్చిన చెప్పడు పేరు, హంతకుం..
  డిప్పటికారు మందిని వధించిన క్రూరుడు , దండతాడనం...
  బప్పుడు మాత్రమే నిజము బల్కును , కొట్టుట దోసమందురా ?
  తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్ !!

  😩పసివాని మనసు ఆక్రందన..😏

  📌తేటగీతి గర్భంలో ఆటవెలది 😀

  తల్లి నిందించుటన్న *యధర్మమవదె*
  నాన్న దండించుటన్న *యన్యాయమవదె*
  దీనినే పెద్దలిటు *సమర్థించు కొనిరి* !
  ధరణి ధర్మబద్ధములఁట తప్పులెల్ల !!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 15. నీవు నేను జేయ నిక్కమ్ము నరకమ్ము
  భార్య నగ్ని దోయ పాప మవదె
  రాము జేయ నటుల రాజధర్మమ్మౌను
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  * తోయు = త్రోయు
  ఆంధ్ర భారతి

  రిప్లయితొలగించండి
 16. చెట్టు చాటు నుండి మట్టుజేసిననైన
  ధర్మజుండు బొంకు దాప లుకను
  పాండు వంశ మదియ బహువిచిత్రముగద
  ధర్మబధ్ధము లట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 17. పడతి ద్రౌపది సతి , పంచ పాండవులకున్
  తల్లి మాట వలన ధర్మమెనట!
  క్రుంక జూపె రవిని కూల్చ సైంధవు నాజి !
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 18. జూద మెంచ రాజ మోదకరమ్మఁట
  కైతవమున లేదు కైతవ మఁట
  వనిత వలువ లూడ్చఁ బ్రభు ధర్మ మగు నంట
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల!


  ముప్పది ప్రాణ ధారణకు మూరిన నిశ్చయమై వివాహముల్
  తప్పిన విత్త నష్టములు తప్పక యున్నను నింతు లందునం
  గప్పిన ఘోరదుఃఖములు కల్లలు సెప్పినఁ దప్పు లే దిలం
  దప్పక సేయునట్టివగు తప్పు లగుం గన ధర్మబద్ధముల్

  రిప్లయితొలగించండి
 19. అన్న గుట్టు తెల్పె ననుజుడు లంకలో,
  సక్ది గుట్టు తెల్పె శంఖ పాణి,
  గంగ నందనుడు శిఖండి చరిత చెప్పె
  ధర్మబద్ధము లట తప్పులెల్ల


  సక్ది = తొడ శ్రీ శబ్ద రత్నాకరము లో

  రణరంగమున రావణుని చావు రహస్యం విభీషణుడు, దుర్యోధనుని చావు రహస్యము కృష్ణుడు , భీష్ముని అస్త్ర సన్యాసం గూర్చి భీష్ముడే స్వయముగా తెల్పెను. ఇవి అన్నియు ధర్మ బద్ధములే

  రిప్లయితొలగించండి

 20. అన్న గుట్టు తెల్పె ననుజుడు లంకలో,
  తొడల గుట్టు తెల్పె ద్రుహిణు తండ్రి .
  గంగ నందనుడు శిఖండి చరిత చెప్పె
  ధర్మబద్ధము లట తప్పులెల్ల

  రణరంగమున రావణుని చావు రహస్యం విభీషణుడు, దుర్యోధనుని చావు రహస్యము కృష్ణుడు , భీష్ముని అస్త్ర సన్యాసం గూర్చి భీష్ముడే స్వయముగా తెల్పెను. ఇవి అన్నియు ధర్మ బద్ధములే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్న గుట్టు తెల్పె ననుజుడు లంకలో,
   తొడల గుట్టు వెన్న దొంగ తెలిపె .
   గంగ నందనుడు శిఖండి చరిత చెప్పె
   ధర్మబద్ధము లట తప్పులెల్ల

   రణరంగమున రావణుని చావు రహస్యం విభీషణుడు, దుర్యోధనుని చావు రహస్యము కృష్ణుడు , భీష్ముని అస్త్ర సన్యాసం గూర్చి భీష్ముడే స్వయముగా తెల్పెను. ఇవి అన్నియు ధర్మ బద్ధములే

   తొలగించండి
 21. Shiva sena yampi ravendra gaikwad gari nirvaakamu pai

  Tappu jesiti nani dastramu pai vraya ,
  Chatta sabhaku nivu chutta manuchu
  Pragada baluka vega , praja lani rappudu
  "Dharma baddamu lata tappu lella"

  రిప్లయితొలగించండి
 22. ఆవు పాలు విడిచె నావుల ప్రేమించి
  మేక పాలు త్రాగె మెండు గాను
  గాంధి ధర్మ వృత్తి గాంధికే యొప్పురా
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 23. హత్య(జేయువాడు నారాధ్యుడచ్చట
  చోరుడైన (బొందు గౌరవమ్ము
  రాజు దుష్టుడైన రాజ్యమునందున
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 24. లవకుశులు శ్రీరామునితో అంటునట్లుగా...

  దేవదేవుఁ ధనువు త్రెంచివేయుట పాడి
  తాటకిని వధించ తప్పు కాదు
  వాలి సంహరణము ప్రతిభగా దలతురే
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  ముప్పును గాంచి యర్జునుఁడు ముందు శిఖండిని నిల్పె యుద్ధమం
  దొప్పని బల్కె ధర్మజుఁడు యోటమి సైపక ద్రోణసూనుఁడున్
  చప్పున చచ్చెనంచు, మరి సంగరమందున నిట్టి కార్యముల్
  తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్

  రిప్లయితొలగించండి
 25. ఒప్పున కంటె గొప్పనగు నోరిమి ప్రాణమున్ గాచు వేళలో,
  ముప్పును గాక సర్వులకు మోదముఁగూర్చెడు కార్యమందునన్,
  జెప్పెడి వన్ని చూడగను చేటవి కావిల సూక్ష్మబుద్ధితో
  తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్"

  రిప్లయితొలగించండి
 26. తప్పక సేయునట్టివగు తప్పులగున్ గనధర్మబధ్ధముల్
  దప్పవు గొన్ని తప్పులను దద్దయు జేయగ గొన్నివేళల
  న్నప్పులు సేయునప్పుడునునద్దిర పెండ్లిని జేయునప్పుడున్
  దప్పదసత్యమున్బలుక ధర్మమె యౌనది శాస్త్రపధ్ధతిన్

  రిప్లయితొలగించండి
 27. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్లి ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించే అవకాశం దొరకక పోవచ్చు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 28. నీతిమాలిపనులు నిందలు యెన్నున్న?
  లాభసాటి కొరకు లోభులయ్యు
  ధర్మ బద్దములట తప్పులెల్లజరిపి
  దైవముడుపులివ్వ?తప్పుగొప్ప|
  2.చెప్పెడి ధర్మ మార్గములుచేయుట వొప్పని నెంచబోక తా
  మెప్పుగ ఖర్చు జేయుచును మేటియటంచును స్వార్థ చింతతో
  చిత్తము దెల్పు రీతిగను చింతిలునాయక మాయమర్మమే
  తప్పకసేయునట్టి వగుతప్పులగున్ గనధర్మబద్ధముల్|

  రిప్లయితొలగించండి
 29. కర్మ పొసగ జేయ మర్మ మేమియు లేదు,
  ధర్మ బద్ధములట! తప్పు లెల్ల
  దెలిసి, వాని విడచి, తెఱవున దీర్చగా,
  మానవునకు నబ్బు మాన్య యశము!

  రిప్లయితొలగించండి
 30. ధర్మ జుండు పల్కె ధర్మ వాక్యంబుగా
  కర్మ బద్ధుడైనకలియుగా న
  ధర్మమే యగును సధర్మ సందర్భాన
  ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల

  రిప్లయితొలగించండి
 31. అశ్వత్థామ హతః అని బిగ్గరగా పల్కి కుంజరః అని నెమ్మదిగా పల్కుట అశ్వత్థామ మరణించాడని భీతి చెందెను కదా

  రిప్లయితొలగించండి
 32. ఒప్పది యెట్టులయ్యెఁగద యుర్విని కాంతల సంహరింపగా?
  చెప్పగ నేల వీరుడగు శ్రీరఘురాముడు చంపె తాటకిన్
  కుప్పగఁ గూల్చె వాలి నవకుంఠితుడై జనరక్షణార్థమై
  తప్పక సేయునట్టివగు తప్పులగున్ఁ గన ధర్మబద్ధముల్

  రిప్లయితొలగించండి
 33. గొప్పగ జేరినావు కడు గోలను జేయుచు భాజపానురో!
  తప్పని తోచ గానె కడు దబ్బున వీడుచు మోడివర్యునే
  పప్పును బట్టినావు కడు పాపము లేదుర రాజకీయమే!
  తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్

  రిప్లయితొలగించండి