22, ఏప్రిల్ 2017, శనివారం

శుభవార్త!

రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స సత్ఫలప్రదమయింది.

  జైశ్రీరామ్.
శ్రీమతి నేదునూరి రాజేశ్వరక్కయ్య.
ఆర్యులారా! మన నేదునూరి రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స  ఫలప్రదమయింది. 
శస్త్ర చికిత్సాలయము నుండి ఇంటికి పంపించినారట. 
ప్రస్తుతం కులాసాగా  ఉన్నారని తెలిసింది. 
అతి త్వరలో మన బ్లాగులను చదువుతూ వారి అమూల్యమైన అభిప్రాయాలతోపాటు 
సూచనలను కూడా ఇవ్వగలరు.
అక్కయ్య ఆరోగ్యం కుదుట పడాలని, వేగంగా క్రోలుకోవాలని 
సహృదయులయిన మీరంతా ఆకాంక్షించారు. 
మీ ఆకాంక్షల సత్ ఫలమే అక్కయ్య పునరారోగ్యవంతులవటం.
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అక్కయ్యకు పరిపూర్ణ ఆరోగ్యంతో 
నిండు నూరేళ్ళ జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకొంటూ 
ఆంధ్రామృతం పాఠకుల తరపున అక్కయ్యకు అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
 జైహింద్.
('ఆంధ్రామృతం' బ్లాగునుండి... శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

13 కామెంట్‌లు:

 1. అక్కయ్య గారికి శస్త్ర చికిత్స విజయవంతమైనందుకు చాలా సంతోషంగా వుంది. వారు త్వరలో పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకొని మన బ్లాగ్ లో తమ సూచనలు, అభిప్రాయాలు, పద్యాలతోను ఆశీస్సులతోను మనల నలరించాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యగారు పరిపూర్ణారోగ్యురాలై తిరిగి పద్యాలతో మనబ్లాగునలరింపజేయాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 3. అక్కయ్యగారు ఈమధ్య బ్లాగులో కన్పించడంలేదే యని తలపోస్తున్నాను! శస్త్ర చికిత్సజరిగిందని , బావున్నారని తెలిసి చాల సంతోషమైనది!
  త్వరలో ఆమె బ్లాగులో పాల్గొనాలని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశ్రీనివాసుని ప్రార్ధిస్తున్నాను!

  రిప్లయితొలగించండి
 4. శస్త్రపుచికిత్స యయ్యది సఫల మయ్యి
  సేమ ముగనుమీ యింటికి జేరుకొనిన
  నోయి! రాజేశ్వ రక్కయ్య! వేయి నతుల
  నిచ్చు చుంటిని దయతోడ నియ్య కొనుము

  రిప్లయితొలగించండి
 5. కుదుటబడ్డఆరోగ్యంతోఅక్కగారుమళ్ళాఅందర్నీపలకరించాలనిఆకాంక్ష.

  రిప్లయితొలగించండి
 6. అక్కగారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 7. అక్కయ్య గారు దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది కావున మీరు త్వరగా కోలుకుంటారు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

  రిప్లయితొలగించండి
 8. సంతోషంఅక్కగారికి సంపూర్ణఆయురారోగ్యములు ప్రసాదించమని భగవానుని ప్రార్ధిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 9. పూర్వం రేడియో అక్కయ్య అని ఒకర్ని పిలిచే వారు. మనందరికి శంకరాభరణం అక్కయ్య గా సుపరిచితులైన శ్రీమతి నేదునూరి రాజేశ్వరక్కయ్య సంపూర్ణ ఆరోగ్యంతో మనబ్లాగుని మరల ఆనందిపజేయాలని ఆభగవంతుని కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 10. చాలా సంతోషకర మైన వార్త. వారు మరలా ఈ బ్లాగులో అతి త్వరలో తమ వచనామృతాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 11. అక్కయ్య గారు సంపూర్ణారోగ్యముతో త్వరలో పద్య రచనా వ్యాసంగమున న్యస్తులు కాగలరని కోరుకొను చున్నాను.

  రిప్లయితొలగించండి
 12. శుభాభినందనలు.
  మీరు సంపూర్ణ ఆరోగ్యంతో మరల పుంజుకుంటారు.

  రిప్లయితొలగించండి