11, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2335 (బాణఘాతముల్ సుఖమిచ్చు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును"
లేదా...
"బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్"
(ణ-న ప్రాస నిషిద్ధము)

74 కామెంట్‌లు:

  1. ప్రాణ నాథుని విరహము భార మవగ
    వార్త రాగనె ప్రియుడిక వచ్చు ననుచు
    మారు మూలన నున్న మన్మధుని పుష్ప
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పుష్పబాణ ఘాతాలతో శుభారంభం చేశారు. చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. సాంద్రచంద్రికల్ గురియ వసంతకాల
    శోభలన్ బొంది ప్రకృతి మోజులను బెంచ
    మలయమారుతములు సోక మదనుని సుమ
    బాణఘాతముల్ సుఖమిచ్చుఁ బడుచులకును.

    రిప్లయితొలగించండి
  3. వీణను మీటుటన్ సకలవిద్యలలో నెఱవైన బాలనే
    రాణిగ చేసుకొందునను రాజకుమారుడుఁ గాంచె నట్టి పూ
    బోణిని సంతసించి వధువున్ వడి పెండిలియాడినంత పూ
    బాణము దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  4. అమెరికా నుంచి నాధుడు అర్ధరాత్రి
    స్మార్టు ఫోనులో కనిపించి సంతసముగ
    మాటలాడ, మదిని దోచు భాషణముల
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడచులకున్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాథుడు+అర్ధరాత్రి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "అమెరికా నుండి నా నాథు డర్ధరాత్రి" అనండి.

      తొలగించండి
  5. డా.పిట్టా
    వన వహారము కేగగ వలపుజంట
    గాంధి పార్కున గలిసిన ఘడియ యందె
    వరుణ దేవుని చిటపట వర్ష బిందు
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    జాణ తనంబు పెంపెసగ జవ్వని పద్య విశేష భాషణల్
    రాణను గన్న ప్రేమికుని రంగ ప్రవేశ ప్రసంగ వృత్తముల్
    వీణను మీటినట్లు గన వీలగునా?"ముఖవాణి(ఫేస్ బుక్)వాదనా
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చునెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  7. జాణల చూడగన్ వలపు జాలము మేనిని చుట్టి వేయు నా
    ఘ్రాణము జేయు పుష్పముల గండుక లాడుచు గుండు తుమ్మెదల్
    రాణములై, జిలేబి, మజ ! రాసము మన్మధు సౌమనస్యమౌ
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి


  8. వేణి సౌగంధములలర వేణు నాద
    ములట రమ్మని బిలువగా ముద్దు గుమ్మ
    లగుచు మురిసిబోవు రమణు లార పుష్ప
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడచులకును

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. అతుల మైనట్టి యానంద మంద జేసి
    యఖిల జగతికి నాధారమైన ప్రేమ
    నంచితంబుగ బుట్టించు నట్టి పంచ
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును.

    ఘాతము=బాణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      పంచబాణుని ఘాతము లంటూ ఘాత శబ్దానికి బాణమన్న అర్థం సాధించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. ద్రోణ కృపాపగాసుతులు దొమ్మిని పొందిన వేమి? ప్రాయపుం
    జాణతనమ్ము సోయగము సాహస మెవ్వరి కుండు? శాంత మీ
    క్షోణితలమ్మునన్ నరులకున్ సమకూర్చున దేమి? చెప్పుమా!
    బాణపు దెబ్బలే; పడుచువారికి; సౌఖ్యము నిచ్చు నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  11. పరువమంకురు పదహారు ప్రాయమందు
    మరునితలపులు మనమున మాటువేయ
    పొరుగు పోరగాండ్రు విసరు పూలవింటి
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడతులకును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ రసవత్తరంగా ఉంది. అభినందనలు.
      'పరువమంకురు'...?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! పరువ మంకురించు యని భావన! గణాలకోసం కుదించడమైనది! క్షంతవ్యురాలను!

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు పొరపాటున తొలగించబడింది మన్నించండి
      పెళ్లి సందడి మనసైన ప్రియులఁ గలుప
      కార్యదర్శులై తిరిగెడు కన్యలఁగను
      సుమధురమౌ ప్రియతముల చూడ్కులనెడు
      భాణ ఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

      తొలగించండి
  13. కూలి జేయగ పడతులు కూటి కొఱకు
    వేడి గాడ్పుల వేసవి వెతల లోన
    కలలు పండినటుల తొలకరి చినుకుల
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      తొలకరి చినుకులతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  14. ఈవసంతమాసమునందు నిమ్ముగాను
    మావి చెట్టుపై కోయిల మధురమైన
    గానముల వినుచున్ సొక్క, కమ్మవిల్తు
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  15. విరహ వేదన తోడన భీకరముగ
    బాధ పడుచుండు భారతి భర్త రాగ
    ముదము కలుగుచు నొడలెల్ల ముడువ, పుష్ప
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడతులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'తోడను' అనండి.

      తొలగించండి
  16. కోరుకొనకనె పరువపు దారులందు
    పరవశమ్మున నెదలోన వలపు జిలుకు
    రంగు పొంగారు కోమల రమ్య కుసుమ
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును!

    రిప్లయితొలగించండి
  17. దర్పణ నిభము మనమెంచ ధర్షితంపుఁ
    బల్కులను వ్రక్కలగు నింక బాధ కలిగి
    దాని కంటె మేలగు నయ్య మేనికి నగు
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును


    పాణినిఁ జేకొనంగ దృఢ బంధము పన్నుగ నేర్పడంగ నొ
    డ్డాణము గోర నీయ నన డంబపుఁ బల్కులు మాను మంచికన్
    క్షోణి తలంబు పైన ననుకూలపు భార్య మనోజ్ఞ భావ వా
    క్బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ చదివిన వెంటనే 'తనువున విఱిగిన యలుగుల।ననువునఁ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్। మనమున నాటిన మాటలు। విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా" పద్యం గుర్తుకు వచ్చింది.
      ఇక రెండవ పూరణలో అలిగిన ఇల్లాలి వాగ్బాణాలను ప్రస్తావించారు.
      రెండూ అద్భుతమైన పూరణలే అభినందనలు.
      'వాగ్బాణపు'... పొరపాటున 'వాక్బాణపు' అని టైపు చేశారు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ భారత పద్యం 'తనువున విఱిగిన యలుగుల...' గుర్తుకు తెచ్చింది.
      రెండవ పూరణలో అలిగిన ఇల్లాలి వాగ్బాణాలను ప్రస్తావించారు.
      రెండూ అద్భుతమైన పూరణలే. అభినందనలు.
      'వాగ్బాణపు'... పొరపాటున 'వాక్బాణపు' అని టైపు చేశారు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      అవునండి పొరపాటు జరిగింది. సవరిస్తాను.

      తొలగించండి
  18. శోణితధారలన్ మిగులజోరుగపాఱగజేసి వాటిఁబా
    రాణిగఁబెట్టి యాడెడు కరాళనృతిన్ యమహేతుకంబులౌ
    బాణపుదెబ్బ లేపడుచువారికి సౌఖ్యమునిచ్చు? నెప్పుడున్
    ప్రాణమెతీపియందరకు పాయసప్రాయము శాంతియిద్ధరిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాంతి యిద్దరిన్'.... "శాంతి యిద్ధరన్"?

      తొలగించండి
  19. ఏణములన్ వధించుటకు నిద్దరు మిత్రులు వేటకేగ , ని...
    ద్రాణమునౌ మృగేంద్రము విదల్చగ జూలు పరస్పరమ్ముగా
    బాణములందిపుచ్చుకొన వారలు , కేసరి నేల గూలెడిన్
    బాణపు దెబ్బలే పడుచు .., వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్
    ప్రాణ సమాన మైత్రియె ! ధరన్ మఱి దానికి సాటియున్నదే !!

    ఏణములన్ =జింకలను

    మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      మీ యీ తాజా పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

      తొలగించండి
  20. 🌺రాధికాప్రణయమ్🌺

    ప్రాణమె నీవుగా దలచు రాధనురా ! పరికింపవేలరా !
    జాణను గాను సత్యవలె చక్కగ కొంగుకు కట్టలేను ! పూ..
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్ !
    వేణుధరా! నిజమ్ము ! పెనవేసికొనంగ నినున్ సుఖమ్మురా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధ ప్రణయాన్ని అద్భుతముగా పూరణలో చొప్పించిన మురళీకృష్ణ గారికి అభినందనలు.

      తొలగించండి
  21. చిత్రమైనట్టి బాణమ్ము ! చిచ్చు బెట్టి
    కాంతఁ బ్రోషితభర్తృకన్ గాల్చుచుండు !
    పతిని ముద్దాడు వేళలో పంచపుష్ప
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును !!

    రిప్లయితొలగించండి
  22. బోణులు గొంతమం దిధర పూవిలు కానికి వశ్యమౌగబూ
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చుఐనెప్పుడున్
    జాణలు దాముగా భువిని చాలిన బ్రీతిని నెల్లవారికిన్
    జాణతనంబునన్దనదు శక్తిని రక్తిని జూపుచుండుగా

    రిప్లయితొలగించండి
  23. శోభ నాన నఖక్షతల్ శోభనింప?
    వధువుసిగ్గను మొగ్గను వలపుచేత
    వరుడు వికసింప జేయగ వహ్వ పుష్ప
    భాణ ఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును|

    రిప్లయితొలగించండి
  24. బాణములట్లు చూపుల ప్రభావము జూపగ కన్య లిప్పటన్
    రాణి యటంచు దల్చి మగరాయడు తూలుచు తేలునీభువిన్
    ప్రాణ సమాన మీవనుచు బల్కుచు ; పల్మరు వెంబడించడే
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  25. వర్షమందున తడిసిన భామ పొంక
    ములను గాంచి తమకమందు లలన జేరు
    పురుషుని కనులు రాల్చు చూపులవి మదన
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడతులకు


    వేణిన మల్లెలన్ దురిమి వెన్నెల గ్రోలెడు గొల్లభామలన్
    వేణువు నూది పిల్వగను వెన్నుడె, యయ్యమునానదీ తటిన్
    ప్రాణసఖుండజేరెదరు భామలు కృష్ణుడు రాల్చుచూపులా
    బాణపు దెబ్బలే పడచువారికి సౌఖ్యము నిచ్చునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  26. తీర్థ యాత్రలు ఫలమిచ్చు దినమె నేడు
    నిండు గర్భపు నెలలన్ని నిండె నేడు
    ప్రాణ నాధుని తొలికాన్క ప్రాణ గీతి
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును


    ...ప్రాణ గీతి = తొలి కేక (baby's first cry when it takes its first breath of oxygen)...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ప్రాణ గీతి" ని వేరొక సందర్భమున శ్రీయుతులు మిస్సన్న గారు వాడియున్నారు:

      http://kandishankaraiah.blogspot.in/2013/09/blog-post_18.html?m=1

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      ఈ పూరణ మీ బహుముఖ ప్రజ్ఞకు, జ్ఞాపక శక్తికి తార్కాణం. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    3. అది నా జ్ఞాపక శక్తి కాదు సార్! అంతర్జాల శోధనమే!

      తొలగించండి
  27. వీణనుమీటినట్లుగను వీనుల విందు యొనర్చుమాటలున్
    జాణతనమ్మునన్ మెలగు చక్కని కన్యను పెండ్లియాడ తా
    రాణిగ వచ్చిచేరగను రాతిరివేళను శంబరారి పూ
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విందు+ఒనర్చు' అన్నపుడు సంధి నిత్యం,యడాగమం రాదు. అక్కడ "విం దొనరించు మాటలున్" అనండి.

      తొలగించండి
  28. పతిని కొంగున ముడివేసి పట్టియుంచి
    పదుగురి యెదుట వారలఁ బలుచ చేసి
    బాధ కలిగింప జేసెడు వాక్కులనెడు
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును

    రిప్లయితొలగించండి
  29. మల్లె మొగ్గలు వేణిని యల్లు కొనగ
    మంద మారుత మీతరి మరులు గొలుప
    మగని మురిపాలు ముడివేయ మదికి బాణ
    బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును.
    ( బాణ = ఐదు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తనవేణి నల్లుకొనగ" అనండి.. వినసొంపుగా ఉంటుంది.

      తొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    నూత్న దంపతు లెడబాయ నొక్క మాస

    మా తదుపరి సమాగమ మధుర
    క్షణము
    కై నిరీక్షించు తరుణాన కాముని విరి

    బాణ ఘాతముల్ సుఖమిచ్చు
    పడతులకును.

    ****************************

    రిప్లయితొలగించండి
  31. సమస్య:- *బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును!*
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    నా పూరణ:-
    *కట్న కానుకులందున* కఠినమైన,
    యింతి బాధలు పడె *గృహహింసపైన*
    మనుషుల మదిలో మొలిచేటి మలిన మతికి
    *బాణఘాతముల్,సుఖమిచ్చు పడుచులకును!*
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    🌺🌺చెరుకూరి తరుణ్🌺🌺

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తరుణ్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. ప్రణామములు గురువుగారు..
    హైదరాబాద్ ప్రయుతకవితా యజ్ఞంలో మిమ్మల్ని కలవలేకపోడం నాకు కన్నీళ్ళపర్యంతమైంది..
    బల్లూరి ఉమాదేవిగారితో మాట్లాడి మీరు వెళ్లిపోతున్నప్పుడు చూసి మిమ్మల్ని వెదుకుచు అంతా చూసేసరికి మీరు కన్పించలేదు..అప్పడే మీకు ఫోన్ చేసాము..మీరు బస్ లో వున్నానని చెప్పారు..మీ ఆశీస్సులందుకోలేనందుకు చాలా బాధపడ్డాను..గత 3నెలలలుగా నా చేయి విరిగి కట్టుతో వున్నందున తొందరగా లేచి మిమ్మల్ని అనుసరించలేకపోయాను
    2030 పద్యములు ప్రయుతకవితాయజ్ఞంలో వ్రాసిన సందర్భంలో సహస్రకవిచక్రవర్తి బిరుదు నిచ్చి నన్ను సన్నానించారు..చాలామంది నాపద్యములను మెచ్చుకున్నారు...దీనికంతటికీ కారణం మీరు నేర్పిన విద్యే,..అందరితో నేను అదే చెప్పాను ..ఏది ఏమైనా ఒకే వేదిక దగ్గర వుండి కూడ మిమ్మల్ని కలుసుకునేభాగ్యం లభించనందుకు ఎంతగానో చింతించాను..మీ ఆశీస్సులందుకునే రోజు కొరకు నిరీక్షిస్తూ ...కృతజ్ఞతలతో..శైలజ...


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మిమ్మల్ని కలువకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచినందుకు బాధపడుతున్నాను. మీ ఫోన్ ద్వారానే గండూరి వారి కూడా మాట్లాడారు.
      నిజానికి గండూరి వారి సన్మానం పొంది వేదిక దిగి తమ స్థానానికి చేరగానే వారి దగ్గరకు వెళ్ళి వారికి అభినందనలు తెల్పిన మొదటి వ్యక్తిని నేనే. వారు నన్ను గుర్తు పట్టలేదు.
      మళ్ళీ ఏదో ఒక సందర్భం రాకపోదు. మనం కలువ వచ్చు.
      ఒక వారం రోజుల్లో నేను హైదరాబాదులోని వృద్ధాశ్రమంలో చేరుతున్నాను. హైదరాబాదులోనే ఉంటాను కనుక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువ. మీరు హైదరాబాదులోనే ఉంటారా?

      తొలగించండి
  33. మా వూరు విజయనగరం గురువుగారు..హైదరాబాద్ ఎప్పుడో గానీ రాలేను..హైదరాబాద్ లో వుంటే ఇప్పటివరకూనా ఎప్పుడో మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకొందును..ఇకమీద ఎప్పడు అటువైపు వచ్చినా మీకు ఫోన్ చేసి మీరు వున్న చోటుకి వచ్చి తమరిని కలుస్తాను..మళ్ళీ ఆశ్రమంలో చేరుతున్నారా..?

    రిప్లయితొలగించండి
  34. నాణెపు మోమునందునను నందము నిచ్చెడి సొట్టబుగ్గలున్
    వాణిని మించెడిన్ తెలివి భామల హృత్తుల దొంగిలించగా
    వీణను మీటు పల్కులను వింతగ సంధిలు డింపులయ్యవౌ
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్!

    రిప్లయితొలగించండి