7, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2331 (వీచె మందమారుతము....)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె"
(లేదా)
"వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్"
ఈ సమస్యను సూచించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

  1. పోలవర యానకట్ట ను పూర్తి చేయు
    సేవకు లటనలసి యుండ సేద దీర
    వీచె మందమారుతము, క్ష్మాభృత్తు వీగె
    నంత విస్ఫోటక పదార్థ మంటు కొనగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పోలవర మానకట్ట..." అనండి.

      తొలగించండి
    2. నిజమే... కాని దానివల్ల గణభంగం. అందుకే దానిని సూచించాను.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పుంప్వాదేశ , టుగాగమ సంధులు నిత్యములు గదా. రాని రూపము లుండవు గదా. గణ భంగము నన్యథా పరిష్కరించుకొన నొప్పగును.

      తొలగించండి


  2. దోచితి వమ్మ మామదిని దోగురు గానుచు గారవమ్మునన్
    నీ చిరునవ్వు మోముగన నెమ్మది గాంచితి నమ్మ రాధికా,
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగిని
    న్నో చినదాన! బోయెనటు నోపిన తాపము వీడుచున్నటన్‌

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చిరునవ్వుల మందమారుతానికి తాపమనే పర్వతం కూలిపోయిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. "క్రియా సిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే"


    కోతి మూక లంకేశుని కొట్టి నెట్టె
    పూల విల్లు ముక్కంటిని కూల ద్రోసె
    ఉప్పు పిడికిటి దొరలకు ముప్పు తెచ్చె
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆ శివుని కూల ద్రోసె
      న్నా సుకుమారమగు పుష్ప నాళీకమ్ముల్
      ద్రోసెనుగ మంద మారుత
      మా సాయం సమయమందు క్ష్మాభృత్తునటన్ !

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      దృష్టాంతాలంకారంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      శాస్త్రి గారి పద్యాన్ని సమర్థిస్తున్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. యోచనతోడ దేశమున యున్న పురాతనమైన నోటులన్
    మోచన చేసె నొక్కతఱి మోదివిభుండది స్వల్పకార్యమే,
    చూచిన యాతనల్ పడిరి చోద్యముగా పలు పెద్దలెందరో
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని సోమయాజులు గారూ,
      నోట్ల రద్దు అంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దేశమున నున్న..." అనండి.

      తొలగించండి
  5. చిత్రలేఖనాభ్యాసంబు చేయుచుండి
    బాలు డొక్కడు చిత్రించె పర్వతమును
    తివిరి దానికి రంగులు దిద్దుచుండ
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె.

    చూచెను పర్వతంబు నొకచోటను బాలుడు సుందరంబుగా
    గీచెను కాగితంబుపయి క్షీరము త్రాగుచు రంగు లద్దగా
    లేచెను వైనమెట్టులని లెక్కలు వేయుచు నుండువేళలో
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగినిన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  6. పూచె వినీల వర్ణ పరి
    పూత ఘనద్యుతులన్ సృజించుచున్
    దోచె వికీర్ణ కాంతిమయ
    ధూమ్ర నవార్ణవ మట్టు నింగిలో,
    రోచిత ధూమయోని తతి
    లోగిలులంబడి జూడ జిత్రమై
    వీచిన మందవాతమున
    వీఁగెను శైలము దూది భంగినిన్!

    ధూమయోని=మబ్బు, మేఘము

    రిప్లయితొలగించండి
  7. తోచెను లోకమంతయు విధూత మనస్సున ప్రేమసంద్రమై
    వేచిన పార్వతీ సతియె వీడిన సిగ్గున కౌగిలింతలన్
    పంచగ శర్వుడే రసపయోనిధి దేలుచు నాట్యమాడగా
    వీచిన మందవాతమున వీగెను శైలము దూదిభంగినిన్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. భరత దేశాన కాంగ్రెస్సు పార్టి అచల
      మై దివిని తాకు సమయాన భంగ పడుచు
      మోడి గాలులు వీచంగ ఓడిపోయె,
      వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె"

      తొలగించండి
    2. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సీత జాడను కనుగొను చింతతోడ
    రాము నాజ్ఞను గైకొని లంకఁ జేర
    హనుమ యెగురగా రయమున నభ్రమునకు
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. [4/7, 8:33 AM] chepuri sreeramarao: 😤😤క్షమించండి
    మూజవపాదం యతి లోపించింది
    సవరిస్తాను
    [4/7, 9:31 AM] chepuri sreeramarao: యోచన శర్వుడేరసపయోనిధి దేలుచు నాట్యమాడగా

    రిప్లయితొలగించండి
  11. [4/7, 8:33 AM] chepuri sreeramarao: 😤😤క్షమించండి
    మూజవపాదం యతి లోపించింది
    సవరిస్తాను
    [4/7, 9:31 AM] chepuri sreeramarao: యోచన శర్వుడేరసపయోనిధి దేలుచు నాట్యమాడగా

    రిప్లయితొలగించండి
  12. ఇందు గలఁడందు లేడను సందియమ్ము
    తగదన హరిఁ జూపుమనంగ స్తంభమందు
    తేనె పలుకుల ప్రహ్లాదు గాన సుధల
    వీచ మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె

    రిప్లయితొలగించండి
  13. దాచిన వస్తువుల్ పలువిధమ్ముల బొమ్మలకొల్వు బేర్చ , దో..
    బూచులనాటలోన తలుపున్నొక పెట్టున ద్రోసినంతనే
    వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్
    కాచిన చెట్టు, రామచిలుకల్, పొదరిండ్లును , పూలమొక్కలున్ !!

    మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. చూచునెపమ్మునన్ హనుమ శూరత లంకకు చేర నెంచి యా
    లోచనఁ జేసి సీతపొడ రూఢిగ నక్కడ చిక్కునంచు తా
    చాచి శరీరమున్ దహన సారథి దన్నున పైకిలేచినన్
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగినిన్

    రిప్లయితొలగించండి
  15. మనసు రంజిల్ల చక్కటి మమత లొలుక
    వీచె మందమారుతము .క్ష్మాభృత్తు వీగె
    క్ష్మాజ ములుపెద్ద యెత్తున గదలి కూల
    పెను తుఫానులు రాకను భీకరముగ

    రిప్లయితొలగించండి
  16. మేను పెంచి యింపుగ హనుమానుఁ డంతఁ
    బాదములు కుదించి పరిఘ బాహువులను
    గిరి తలమున నూని యెగుర విరివి యగుచు
    వీచె మంద మారుతము క్ష్మాభృత్తు వీఁగె


    శోచిత మెంచ నెల్లఱకు శూర వరేణ్యుఁడు ధన్వి విత్తముల్
    దోఁచగఁ దారసిల్ల వని దొంగలు నల్పుల బారి నుండి తాఁ
    గాచఁగ లేక యర్జునుఁడు క్రమ్మఱె యాదవ వృష్ణి కాంతలన్
    వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మహేంద్ర పర్వతము నుండి హనుమంతుడు లంఘించు సమయములో (శ్రీమదాంధ్ర సుందరకాండ):


      శైలసాలమ్ములు సర్వ శాఖ యుతమై
      యెగసె వేగమ్మున నిందు నందు
      విమలాంబరము నీడ్చె వింతగ నూరు జ
      వమ్మున సబక పుష్పభర తరుల
      నూరు వేగోద్ధతి నొడఁగూడె తరులెల్ల
      సాగనంపెడి బంధు జనము రీతి
      భీమ సాలాదులు వెకలి తరలె మహీ
      పతి వెంట జను సైన్య పటల మనఁగ

      పుష్ప సహిత విటపముల భూరి వృక్ష
      జాలములఁ గూడి పర్వత సన్ని భుండు
      దర్శనం బిచ్చె నత్యద్భుతమ్ముగను గ
      పీంద్రు డప్పుడు గుప్పించి యెగురు వేళ

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు, పద్యం అన్నీ మనోజ్ఞంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  17. చూచుచు నుండగా బుడమి శోభిలె జక్కగ రెమ్మలా ర్చుచున్
    వీచిన మంద వాతమున , వీగెను శైలము దూది భంగినిన్
    వీచగ నంజనా సుతుని వేగపు ధాటికి వాయు వీచికల్
    పోచనపెద్ది! ముఖ్యమిల భూతము లందున వాయువేకదా

    రిప్లయితొలగించండి
  18. పేక ముక్కల కొండను పేర్చినంత
    పిల్ల గాలి వీచగ రాజు తల్లడిల్లె
    రాజు కదలగ కొండయు రాలిపోయె
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె


    క్ష్మాభృత్తు kshmā-bhruttu  రాజు. పర్వతము.

    http://telugudictionary.telugupedia.com/telugu_english.php?id=5780

    రిప్లయితొలగించండి
  19. హస్తినాపుర పెన్నిక లందు గాంచ
    మదగజమగు కాంగ్రేసు సామాన్య మైన
    చీపురను గుర్తుగల మూక చేతనోడ
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె.


    పూచిన పూవులన్ దునిమి పూజకు జేర్చెడు సీత పుత్రులే
    యోచన చేసి యశ్వమును యుక్తిగ బంధిని సేసి పోరుకై
    వేచిరటన్ గదా!యనిన వీరుల గూల్చిన వారినే గనన్
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగినిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హస్తినాపురపు టెన్నికలు' అనడం సాధువు. కాని అలా అంటే గణదోషం. అందువల్ల "హస్తినాపురి యెన్నికలందు..." అనండి.

      తొలగించండి
  20. పడతి యనసూయ బ్రహ్మను పాపజేసె
    యన్య మెరుగని సావిత్రి యముని గెలిచె
    సుమతి పతిదేవు గొలిచి సూర్యునాపె
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "పతిదేవుని గొలిచి" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్కారము! అది టైపు దోషము! క్షమించాలి!

      తొలగించండి
  21. నీరము భార్య పోయగ మునీంద్రుని పాద ద్వయంబు రాముడున్
    కూరిమి యొప్పగా కడిగె, గొంతుకు గంధము పూసె సోదరుల్,
    హారతి నిచ్చి మువ్వురును, హర్షము కూర్చెను కోసలీ మణుల్
    నారద మౌనిముఖ్యునకు, నల్వురు భార్యలతి ప్రసన్నులై

    ఆర్యా మొదటి సారి వృత్తము వ్రాశి 1 వ తారీకు పోస్టు చేశాను. అనివార్య మైన కారణములతో మీరు సమీక్షించ లేక పోయారు. అవకాశమున్న పరిసీలిమ్చి సలహాలు ఈయవలెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      'సోదరుల్' అన్నారు కనుక 'పూసిరి' అని ఉండాలి కదా! అక్కడ "పూయ సోదరుల్" అనండి. అలాగే "కోసలాంగనల్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు తప్పులు సవరించుకుంటాను

      తొలగించండి
  22. 6 వ తారీకు న పోస్టు చేసిన సమస్య సలహా చెప్పండి
    ఇనకుల తిలకుని అందము
    కనులారగ కాంచి మనము గాయము నొందన్
    ఘనరక్తి నొసగు మారుని
    జనకుండని పెండ్లియాడె జానకి రామున్
    ప్రత్యుత్తరంతొలగించు

    రిప్లయితొలగించండి
  23. మనసిజుడు,నిసారపుకే
    తనుడు, అసన్యజుడు, లచ్చితనయుడు,పూవిం
    టి,నవవిలుకాడు,రతిపతి
    జనకుండని పెండ్లియాడె జానకి రామున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పూరణ కొంచెం సందిగ్ధంగా ఉంది. విశేషణాలన్నీ మన్మథునికి చెప్పి, చివరకు 'రతిపతి జనకుడు' అన్నారు. పద్యం మాత్రం నిర్దోషంగా చక్కగా ఉంది.

      తొలగించండి
  24. ఆ: దేవకీసుతుండు, దేవతా శ్రేష్టుoడు,
    చక్ర ధారి, ఘన పరాక్రముండు,
    రుక్మిణీ ప్రియుండు, రోచిష్ణువుండైన
    పార్థుఁ డర్జునునకు బావ గాదె

    పార్ధుడు = కృష్ణుడు ఆర్యా 2 వ తారీకు ఇచ్చిన సమస్య పూరించి పంపాను మీరు అనివార్య కారణముల వలన చూచి ఉండలేదు. అవకాశమున్న పరిశీలించి తప్పులు సూచించ గలరు.

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    సీత జాడను కనుగొన చేర లంక

    వాయు మార్గాన రయమున వాయుపుత్ర

    పయన మొనరించు సమయాన వసుధపైన

    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె.

    *******************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర "వాయుసుతుడు" అనండి అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  26. విఠ్ఠలాచార్య సినిమాలు వింతగనుమ|
    మంత్ర తంత్రాలచేతనే మహిమలందు
    వీచె మందమారుతము క్ష్మాభుృత్తువీగె
    చెట్టు కొమ్మన పువ్వుకు పట్టగాలి

    రిప్లయితొలగించండి
  27. డా.పిట్టా
    దోచినవెన్ని దేశములొతొల్లి బృహత్పట కూట మల్లె పో
    తోచెను వీడ యూరపును దోర్బల బ్రెక్సిటు,వార్తలన్ గనన్
    సూచన దేశ ప్రేమయ వచో పరిభాషన నేటి కబ్బెనో
    వీచిన మంద వాతమున వీగెను శైలము దూది భంగినిన్!

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా
    పరుల కుపకారవర్తియై బరగు హనుమ
    శ్రమకు, శ్రాంతికి మరుతము సాగె సదిశ
    యోగ బలవద్ధృతిన్ జూచి యొరిగె గిరియు
    నందు సంజీవనియు నల్లలాడె కృపను
    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె!

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా
    Betrix వ్యవహారము

    ..EUనుండి బ్రిటను విడివడు నిర్ణయమునకు స్పందించి...ఈనాడు తన దేశంపై ప్రేమతో వలస రాజ్యాల కొకనాడు
    కూటములను గట్టిన ,పర్వతము వంటిది తేలికయై వైదొలిగినది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    సీత జాడను కనుగొన చేర లంక

    వాయు మార్గాన రయమున వాయుపుత్ర

    పయన మొనరించు సమయాన వసుధపైన

    వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీగె.

    *******************************

    రిప్లయితొలగించండి
  31. కూచొన మానసమ్మునను కోపము తాపము కుళ్ళు బుద్ధులున్
    దాచిన కూడ దాగనివి దంభము దర్పము మత్సరమ్ములున్
    తోచగ పారిపోవునుగ త్రుళ్ళుచు హృత్తున రామభక్తియే...
    వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్

    (పాఠాంతరం):
    "సాయిభక్తియే" "దైవభక్తియే" వగైరా

    రిప్లయితొలగించండి