16, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2339 (దారమే లేని హారము...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దారమే లేని హారము తరుణి దాల్చె"
(లేదా...)
"దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

69 కామెంట్‌లు:

 1. హారధారియై పతివిరహంబునోప
  జాలక సరససల్లాప చర్యలందు
  తగుల గాఢపరిష్వంగ తరుణ మందు
  "దారమే లేని హారము తరుణి దాల్చె"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   పతి బాహువులే హారమయ్యాయన్న మాట! సరసంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 2. కోటి కోటీశ్వరుని చిన్న కూతు రామె
  తండ్రి బంగారు వజ్రాల తత్వ వేత్త
  పసిడి తీగతో చుట్టగ పలుపు; నూలు
  దారమే లేని హారము తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
 3. ఆదిభిక్షువు యర్ధాంగి యద్రిపుత్రి
  కౌగిలింపగ కామారి కంజనయన
  కంఠసీమను యురగము గప్పుగొనగ
  దారమేలేని హారము తరుణి దాల్చె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   నాగేంద్రహారుని కౌగిలింతతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
   'ఆదిభిక్షుని యర్ధాంగి/ ఆదిభిక్షువు పెండ్లాము' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు నమస్సులు! మీ సవరణకు వివరణ మా పినతండ్రిగారు ఇచ్చినారు! అది అమోఘమని కూడ సెలవిచ్చారు! మీకు మనఃపూర్వక ధన్యవాదములు!🙏🙏🙏

   తొలగించండి
 4. కం: కోతలతో మురి పింతురు
  భీతిల్లిన వారలు , రణవీరులు ధీరుల్
  చేతలతో పోరి విజయ
  జ్యోతిని తెత్తురు సతతము చూడుము రాజా

  ధర్మరాజు విరాటునికి ఉత్తర కుమారునికి విజయము వరించలేదని విజయుడే విజయము గైకొని వచ్చునని చెప్పు సందర్భము

  రిప్లయితొలగించండి


 5. వారి నటవోర గన్నుల వారిజాక్షి
  జూసె, మురిపెము గానుచు జుంజుఱించు
  మదియు తూగగ సుమముల మర్చి కోవి
  దారమే లేని హారము తరుణి దాల్చె!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. వారిని జూడ తూగె మది వాకలువేసె మరింత గానటన్
  సారము గాంచె జీవితము, సాజము గాద సమీచికిన్ జిలే
  బీ, రస రమ్య వేళనటు బింకపు పట్టును వీడి ముద్దమం
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   కోవిదారం, ముద్దమందారం లేని హారాలతో అలంకరించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. పోతనార్యుని గ్రంధమ్ము భూష ణంబు
  అయ్యి గళసీమ పైచేరి హాయి నొసగ,
  కాళిదాసురచన చేరె కంఠమందు,
  కవిత్రయపు కావ్యరాజమ్ము కంధరమ్ము
  పైన చేరంగ, వాల్మీకి పసిడి రచన
  కుతుక సరసన ఘనముగా అతికి పోయె,
  పెద్ద నయ్య మనుచరిత పీక చేర,
  కవుల గ్రంధాలు భారతి కంఠ మందు
  వలదు వలదన్న వేగాన వచ్చు చుండ
  దారమేలేని హారాలు తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   కవుల గ్రంథాలే హారాలై భారతీదేవి గళసీమ నలంకరించాయని చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రేఫసంయుక్తాక్షరం ముందున్న పూర్వపదాంతాక్షరం లఘువు కాని, గురువు కాని కావచ్చు'. కాని ఎందుకో కవిత్రయంలో 'వి' గురువే అవుతుందని నాకు తోస్తున్నది.

   తొలగించండి
  2. ధన్యవాదములు త్ర ముందు అక్షరముతో ఊద బడలేదని తలచి లఘువుగా స్వీకరించాను. క్షమించండి సరిదిద్దుకుంటాను. కవుల మువ్వురి కావ్యమ్ము కంధరమ్ము అనవచ్చు గదా

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి కవిత్రయములో వి గురువే.
   ప్ర, బ్ర, క్ర, మరియు హ తో గూడిన సంయుక్తాక్షరములు నాలుగు తప్ప మిగిలిన యన్ని సంయుకాక్షరములకు పూర్వాక్షరము గురువే యగునని నేను జదివితిని. ఆ నాలుగు సందర్భములలోనే యవసరార్థము గురులఘువు గా తీసుకొన వచ్చునని.

   తొలగించండి
 8. డా.పిట్టా
  సారమే లేని సంసార సాగరాన
  పూవులే భూషణాలగు ,పూచి రాలు
  బొడ్డుమల్లెల నెల్లను బ్రోవు జేసి
  దారమే లేని హారము తరుణి దాల్చె!
  (బొడ్డుమల్లె కాడలతో జడనల్లినట్లు హారాల నల్లవచ్చును.)

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  చూరగొనంగ నందములు చొప్పడ నా వనవాసి సీతకౌ
  ఆరడి స్వర్ణహారముల నందని దుస్థితి లోన పూచి వి
  ప్పారిన పూలు కాడల విభావరి జార్చగ నల్లె సత్కళన్
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్!

  రిప్లయితొలగించండి
 10. లింగ భేదమే లేకుండ రంగు గలిపి
  మేనిపై పొడిచెడు 'టాటు' మెచ్చి మదిని
  తనదు ప్రత్యేకతను చాటు తపన ముదిరి
  దారము లేని హారము తరుణి దాల్చె

  కోరిన చోటున తనువున
  దీరును రంగులు పొడవగ తిరమౌ 'టాటూ'
  మీరఁగ మక్కువ, గళమున
  దారము లేనట్టి దండ తరుణియె దాల్చెన్

  రిప్లయితొలగించండి
 11. ……………………………………………………

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  { ఒక గారడి వాడు పలు వి౦తలను చేస్తూ

  పూలను గాలి లోనికి ఎగర వేశాడు . అపు డా

  పూ లన్ని గారడి చూస్తున్న ఒక ఆవిడ

  మెడలో హారమై పడినవి }

  ి

  గారడి వాడు బొమ్మలను గ౦తులు

  …………… వేయగ జేసె గాలిలో !

  కారము బ౦చదార రుచి గల్గగ జేసెను !

  ………………… గాజు పె౦కు బ౦

  గారపు రూక మాదిరి యొనర్చెను !

  ………………… పై కెగిరి౦పగా విరుల్ ,

  దారము లేని హారము నిత౦బిని దాల్చెను

  ………………… స౦తస౦బునన్ ! !

  రిప్లయితొలగించండి
 12. కూరిమి భర్త జేర , సతి కోపనయై *పొరుగింటి "గౌరి"*" బం..
  గారము దాల్చె ! మీరు కొనగా వలె ! దెమ్మని బల్క నాతడున్
  హారము దెచ్చె స్వర్ణ మయమైనది క్రొత్తది ! నూలు పోగులౌ
  దారములేని హారము నితంబిని దాల్చెను సంతసమ్మునన్ !!
  ధారుణి గాంచగా నిది *విధాతృ రమేశులకైన* దప్పునే ?!!

  రిప్లయితొలగించండి
 13. మారిపోయెను కాలమ్ము మంజులముగ
  అసలుపూలను మరపించి అలరుచుండె
  మాయ ప్లాస్టిక్కు పూవులు మరులుగొలుప
  దారమేలేని హారము తరుణి దాల్చె
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 14. ఆరయ పూవులెన్నొ ముదమారగ దండగగ్రుచ్చివేడ్క సిం
  గారము చేసుకొన్నయని కాంతయొకర్తుక కంఠసీమలో
  సారెకు పూవులన్నియును చక్కగనుండినగానియొక్క మం
  దారము లేనిహారమును దాల్చెనితంబిని సంతసమ్మున్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చేసుకొన్నయని'...?

   తొలగించండి
  2. 'చేసుకొన్నయది'..

   ధన్యవాదములు.

   తొలగించండి
 15. నగల యందమితము ప్రేమ నారులకును
  మగనిఁ దలతురు నిధి యని మగువ లెపుడు
  పండుగ దినమన నొనర్చి వ్రతము నోము
  దారమే లేని హారము తరుణి దాల్చె

  [నోము దారము = వ్రత సూత్రము; వ్రతసూత్రము లేని తరుణి హారము దాల్చె]


  వారలు వీరలందున నవారితమై వెలు గొందగా వలెం
  దారల వోలె నాదు ముఖ తామరసమ్మని యెంచి యత్తరిన్
  భారము కాదు చేకొన నపారము చెల్వము నందుఁ జూడ చే
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్

  [చేదారము = నగలలోని తఱుఁగు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   వ్రతసూత్రం, చేదారం లేని హారలను గురించిన మీ పూరణలు ఉత్తమంగా ఉన్నవి. ముఖ్యంగా 'చేదారము' ప్రయోగం అభినందించదగినది. మీ పద్యనిర్మాణ శక్తికి, సుమకోమల భావనలకు, అతిలోక చమత్కృతికి జోహారులు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 16. దారము లేని హారము దరుణిదాల్చె
  దాల్చ వచ్చును హారము దరుణి యార్య!
  పసిడి హారము నకదియ వసరముగలు
  గదుక దయికయా దారము కనుగొనంగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దారమే' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 17. వెన్నెలట్టుల విరిసెడి వన్నె లందు
  చల్ల చల్లని తావిని నుల్లమలరి
  వఱలు పున్నాగ పూవుల బట్టి చుట్టి
  దారమేలేని హారమ్ము తరుణి దాల్చె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   మీ ఈ తాజా పూరణ పున్నాగ పూల తావిని వెదజల్లుతూ ఆనందాన్ని ఇచ్చింది. అభినందనలు.

   తొలగించండి
 18. మరచి ముడినుంచ మంచి సుమముల దండ
  వాగు దరిగాంచి వనమున తీగమల్లె,
  మల్లెతీగనె దండగా మడచి ముడిచె;
  దారమే లేని హారము తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   పూలతీగెనే అలంకరించుకున్నప్పుడు దారముతో పనేముంది? చక్కని భావం. అందమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
 19. దారము లేనిహారము నితంబిని దాల్చెను సంతసంబునన్
  హారము కాదుగా నదియ హారము నాబడు దారముండినన్
  దారము దోడగూడగను దానిని నందురు హారమున్నిలన్
  హారము జేతురే కదిక యభ్రము జేతను హేమకారుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'కాదు కా దదియు.. దానినె యందురు...' అనండి.

   తొలగించండి
 20. శాస్త్రసమ్మత పద్ధతి సరకుగొనక
  సంతకమ్ముల పెండ్లిని సలుప వసతి
  కనక హారమునిడ భర్త గళము, నూలు
  దారమే లేని హారము తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
 21. దార కోరిన కోరికన్ దాను తీర్చ
  నేడు వారాల నగలనే యిష్టపడుచు
  ముగ్దకివ్వగ నామెయే మురిసి పోయి
  దారమే లేనిహారము తరుణి దాల్చె


  *నా రెండవ పూరణము*

  నిపుణుడైనట్టి కంసాలి నేర్పుతోడ
  మలచి పచ్చలహారమ్ము మగువ కివ్వ
  మురిసి పోవుచు నాయింతి మోదమలర
  దారమే లేని హారము తరుణి దాల్చె.


  జారుడు చెంతజేరగను జారిణి యొక్కతె కామకేళిలో
  గారపు మాటలాడి నయగారము బోవుచు ముద్దులాడుచున్
  కోరెను స్వర్ణభూషణము, కోమలి కోరిక దీర్చినంత నా
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్

  రిప్లయితొలగించండి
 22. హారమనోహరమ్ము పరిహారము గాదు మనోహరా|యిటన్
  ప్రేరణ గూర్చ పువ్వుల వివేకపు నవ్వులశోభనంబు సం
  స్కారము వీడు కాంక్షలతిసారమటంచునుకామితార్థపున్
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్|
  2.పద్య తోరణమల్లియు పడతి కొసగ
  దారమేలేని హారము తరుణి దాల్చె|
  మనసునందున మమతల మల్లియలగ
  విరిసె విరబోణిబంధమై ప్రేమలాగ|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 23. కనపడని బొట్టు నంటించె కాంత నేడు
  జుట్టు కత్తిరించుకొనియె పొట్టి గాను
  నాధునికత చాటు కొనగ నంత కోవి
  దారమే లేని హారము తరుణి దాల్చె!
  (కోవిదారము = బంగారు)

  గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణను కూడా పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
  జాతి యనగ మదిని భరత
  జాతి యడర రిపు నెదిరిన సైనికులె సుమా
  జాతీయతను విడనాడగ
  భీతిల్లిన వారలు రణ వీరులు ధీరుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   నిన్నటి పూరణలో మూడవ పాదంలో గణదోషం. 'జాతీయత విడనాడగ' అనండి.

   తొలగించండి
 24. కోరివరించియన్యకులకొమ్మను, గూఢ ప్రదేశమందునన్
  చేరననుంగుమిత్రులును, చెన్నగు కాంతగళమ్ము నుంచగా
  ధీరవరుండు బంగరపు తీగెసరమ్మును, మెచ్చ స్నేహితుల్
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెడ్డి గారూ,
   మీ యీ రెండవ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
   'కుల కొమ్మను' దుష్ట సమాసం. 'కోరి వరించె నన్య కుల కోమలి...' అనండి.

   తొలగించండి
 25. పొద్దు బొడవగ ప్రియమార పూర్వదిశను
  భానునరుణ కిరణములు బ్రాకివచ్చి
  వేయ భూమాత మెడలోన వెచ్చగాను
  దారమేలేని హారము తరుణి దాల్చె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   భూదేవికి కిరణాల హారాన్ని వేసిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి


  2. కిరణంబుల హారంబును
   సిరితోడై నెలయు చిన్న చెలియకు కంఠా
   భరణంబుగ వేసితివ
   మ్మ రమణి జోతలివియే సుమతి సీతమ్మా !

   జిలేబి

   తొలగించండి
 26. మల్లె మాలతి సంపెంగ మరువమున్న
  దారమదిలేక గూర్చగ, నీరజముల
  తూడులను ద్రుంచి యల్లుచు తుష్టితోడ
  దారమేలేని హారము తరుణి దాల్చె!!!

  రిప్లయితొలగించండి
 27. తండ్రి జగను పార్టీ నేత తల్లి కూడ
  తెలుగు దేశమున్ దలచిన కలుగు దుగ్ధ
  ధర్మ పత్నియౌ ఘడియలో తాళి పసుపు
  దారమే లేని హారము తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
 28. దారమే లేని *హారము* తరుణి దాల్చె
  దండ కానట్టి *దండ*ను దన్వి మెచ్చె
  కోడియే కాని *కోడి*ని కోరె సుదతి
  పొడుపుకథలివి *నీకైప* విడుపులగును!!

  రిప్లయితొలగించండి
 29. హారమే కావలే నని తరుణి కోరె
  భర్త బంగరు హారము భరణి తెచ్చె
  నీరజాక్షి మెచ్చు కొనెను నిండు మనసు
  దారమే లేని హారము తరుణి దాల్చె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా, (దయచేసి మీ పేరును పద్యం ముందు కాని తరువాత కాని టైప్ చెయ్యండి),
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హారమే కావలె ననుచు..." అనండి.

   తొలగించండి
  2. గురువుగారూ నాపేరు వడ్డూరి రామకృష్ణ

   తొలగించండి
 30. సూరుడు గ్రుంకుచుండగను సుందరి సోనయె ముద్దులాడగా
  దూరపు కొండలన్ తడివి దొంతరి పేర్చుచు నేడురంగులన్
  కూరిమి మీరగా పృథివి గూర్చుచు చేర్చిన నింద్రచాపమౌ
  దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్ :)

  రిప్లయితొలగించండి