20, ఏప్రిల్ 2017, గురువారం

సమస్య - 2342 (రామరాజ్యమ్మునన్...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి"
(లేదా...)
"రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్"

95 కామెంట్‌లు:

  1. రామ రాజ్యమ్మునన్ గనరాదు నీతి
    మాలిన పనుల ధర్మపు మార్గ ములును,
    సచ్చరితజనా శ్రయమది శాంతి నిచ్చు
    రామ రాజ్యమ్ము సుమ్మీ!ధ రణిని జూడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల వారూ,
      నీతిమాలిన పనులు లేవన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      'పనుల ధర్మపు' అన్నదానిని "పను లధర్మపు" అంటే స్పష్టత ఉంటుంది.

      తొలగించండి
  2. ప్రజల సొమ్ములు దోచెడి ప్రభువు లుండ
    మంత్రు లెల్లరు చోరులై మాయ మవగ
    తప్ప త్రాగిన భటులెల్ల తడబడెడు వి
    రామ రాజ్యమ్మునన్ గనరాదు నీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరామ రాజ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఓట్లఁ గోరిన వారలై పాట్లుఁ బడుచు
    మభ్య పెట్టెడు మాటల నభ్యసించి
    ప్రభుత చేతికందఁగ లేదె పలుకు? రామ!
    రామ! రాజ్యమునన్ గనరాదు నీతి!!

    రిప్లయితొలగించండి
  4. సీత నగ్ని పునీతను చిన్న బుచ్చి
    "యసురు నింటను గడపిన నాలి నేలె!"
    ననుచు వాగె మడేలన్న యయ్యొ! రామ!
    రామ!! రాజ్యమునన్ గనరాదు నీతి!!!

    రిప్లయితొలగించండి


  5. నీమముల తప్పు నడవడి, నిశ్చయముగ
    రామ రాజ్యమ్మునన్ గనరాదు, నీతి
    పరుల లోకమది జిలేబి పదరు గనక
    భద్రము గనుచు జనులెల్ల పసిడి గాంచె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జనులు శుభమ్ము గనిరి" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి


  6. కామము, నీతిబాహ్యమగు కార్యము, దోపిడి దుష్టచర్యలున్
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా! శ్రుతి ధర్మపద్ధతుల్,
    సామము హెచ్చుగా జనులు సత్యము శాంతము యజ్ఞయాగముల్
    నేమము గాంచిరౌత, భళి నెమ్మికి మారగు పేరు నేటికిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      "..గాంచి రౌర భళి..." అనండి.

      తొలగించండి
  7. ధర్మ బద్ధులు ప్రజలు సత్కర్మ లందు
    సంత తాసక్తు లేందేని శ్రద్ధ లేమి
    రామరాజ్యమ్మునన్ గనరాదు, నీతి
    యచట నాబాల గోపాల మలమి యుండె.
    హ.వె.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  8. నీమము దప్పు చుండుటయు, నిర్మల భావము వీడుచుండుటల్
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా, శ్రుతి ధర్మపద్ధతుల్,
    క్షేమకరంబులై వెలుగు శ్రేయము లందగ జేయు కర్మ లా
    భూమిని సర్వకాలమును పూర్ణదృఢత్వము నంది యుండగన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      విరుపుతో మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. క్షేమము శాంతిభద్రతలు క్షీణము నొందెను, భక్తి భావముల్
    నీమము నీతి యెట్లు ధరణీతలందున నుండబోవునో
    కామపిశాచి నృత్యములు కాననగున్ దిశలందు భాన్మతీ
    రాముని రాజ్యమందు, గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్
    (భానుమతీ రాముడు = దుర్యోధనుడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      దుర్యోధనుని రాజ్యమంటూ వైవిధ్యంగా పూరించే మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని భానుమతిని భాన్మతి అనడం సాధువు కాదు. "కాననగున్ కురురాజ్య దుష్కృతా।రాముని..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. ఆర్యా! నమస్తే. మీ సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  10. నీతి నియమాలు నడవడి నిండు మనము
    బాల్యమందున నేర్చిన వదలి పోవు
    సీరియళ్ళును సినిమాలు చెప్పు కథల
    రామ రాజ్యమ్మునన్ గన,రాదు నీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ఏమని వెల్లడింతుఁ నిట నెక్కడ జూచిన నాంగ్లవిద్యయే!
      కామము బెంచు పశ్చిమపు గాలుల జోరును హెచ్చె నంతటన్!
      నీమము తోడ బాలురకు నేర్పక నేడనె కాదు నాటిదౌ
      రాముని రాజ్యమందుఁ గన,రావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. చిన్న సవరణతో.. ( మన్నించండి)

      "ఏమిది ! యింతినొల్లనిక ! ఏందిది ? యొప్పునె ? రాములోరి పెం..
      డ్లామును బోలి యెక్కడొ కులాసగనుండె ! మొగుండ నా పయిన్
      ప్రేమయె లేదు దీనికని "బిగ్గరగా నొకడిట్లు బల్కె శ్రీ
      రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్"!!

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      పాత్రోచిత భాషాప్రయోగంతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. కామము జన్మహక్కు మనకౌతుక మొప్పగ నన్యకాంతల
      న్నీమము లెంచకన్కలయు నీతిని నమ్మినవారమంచు దు
      ష్కాముకులై చరింతురు వికారులు దానవులా మయాత్మజా
      రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్.

      తొలగించండి
    4. మిస్సన్న గారూ,
      మయుని అల్లుని రాజ్యంలో... అంటూ చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  12. మాటలాడుము చక్కగ మదిని తలచి
    పెదవి దాటిన మాటలు పృధివి దాటు
    రామరాజ్యమునన్ గనరాదు నీతి
    అనుచు పలుకనొకడు సీత నడవి చేరె

    రిప్లయితొలగించండి
  13. వంశ పాలనయే తమ ప్రముఖ ధ్యేయ
    మనెడి రీతిని సాగించి మనుట జూడ
    వంశజులె మంత్రులయి నేడు బరగ రామ !
    రామ! రాజ్యమ్మునన్ గనరాదు నీతి

    రిప్లయితొలగించండి
  14. నకలు తైలము చక్కెర నకలు పాలు
    నకలు యోగులు బాబాలు నకలు మునులు
    నకలు నోట్లు నాణెమ్ములు నగలు...నకలు
    రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మరి ఇది ఏ రాముని రాజ్యంలో? 'నేటి రామరాజ్యమ్మునన్..' అంటే బాగుండేదేమో?"

      శ్రీయుతులు గురువర్యులు:

      అద్భుతమైన సవరణలలో మీకు మీరే సాటి. ఎంత అవలీలగా పందిని నంది చేస్తారో!!!

      __/\__

      నకలు తైలము చక్కెర నకలు పాలు
      నకలు యోగులు బాబాలు నకలు మునులు
      నకలు నోట్లు నాణెమ్ములు నగలు...నేటి
      రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి

      తొలగించండి
  15. ద్రోహబుద్ధియు లేమియు దుండగమ్ము
    దర్మమార్గము దప్పుట తధ్యముగను
    రామరాజ్యమ్మునన్ గనరాదు, నీతి
    నియమములచట రాజిల్లు నిచ్చలముగ!!!

    రిప్లయితొలగించండి
  16. ………….……………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    " రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి "

    యనుచు ర౦గనాయకి వ్రాసె నక్కట " విష

    వృక్ష " మను గ్ర౦థ మొక్కటి | విసిగి జనులు

    తూ తు యనిరి | సామెత గలదు గద యొకటి

    మోటు ము౦డ కొక మొగలి పువ్వు నిడగ ,

    కొప్పున నిడక •••••••• ఛీ నేను చెప్ప లేను

    రిప్లయితొలగించండి
  17. ధామము, పుణ్యకార్యశుభ తర్షిత మానస బృంద గానయా
    రామము, నీతి, ధర్మచయరంజిత శోభల పంచు సౌధమున్
    నీమము దప్పనట్టిదగు నేలగ పేరును పొందె, నేడు ఆ
    రాముని రాజ్యమందు గనరావుకదా శ్రుతి ధర్మ పద్దతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గాన+ఆరామము = గానారామము' అని సవర్ణదీర్ఘ సంధి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  18. క్షామమ,శాంతి,హింస,మరి చౌర్యమ,సత్యము,బేధ భావముల్
    ఆ మహితాత్మడైన జన కాత్మజ నాథుని నీతిమంతు డా
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా, శ్రుతి ధర్మపద్ధతుల్
    ధామము ధామమందును సదా కను గొందుము రామకీర్తనల్

    రిప్లయితొలగించండి
  19. ఆత్యవసరస్తితి యనుచు అర్ధ రాత్రి
    భరత భూమిలో ప్రకటించె తిరుగు లేక
    నాడు ఇందిరా గాంధి, తనయుడు రెచ్చి,
    కరుడు గట్టిన గుండెతో కరుణ లేక
    పాత్రి కేయుల నోళ్లకు బంధనములు
    వేసి, ఎదురు తిరిగినట్టి వీర వరుల
    నెల్ల జైళ్లలో కుక్కించి, పిల్ల లొద్దు
    యనుచు ఆపరేషన్లను అదుపు లేక
    విచ్చలవిడిగా చేయించి రచ్చ తోడ
    దేశమును భ్రష్టు పట్టించె, దేహి యన్న
    వారలనుగాచి దుష్టులం చేర దీయు
    రామ రాజ్యమ్మునన్ కన రాదు నీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వద్దు'ను 'ఒద్దు' అన్నారు. అక్కడ "పిల్ల లేల। యనుచు నాపరేషనుల తా నదుపులేక ..." అనండి.

      తొలగించండి
  20. ధర్మదూరమైన పనులు దనర వెచట?
    శాంతి సౌభాగ్య సంపదల్ సంచరించు
    రామ రాజ్యమ్మునన్; గనరాదు నీతి
    కలిని పాపపు బుద్ధుల కలయ బోత!

    రిప్లయితొలగించండి
  21. మంచి తానాచరించి బోధించి మించు
    సుజనులకు కష్టమెన్నడు సుంత యైన
    రామరాజ్యమ్మునన్ గనరాదు, నీతి
    సత్య హిత ధర్మ శాంతి పుష్పములు విరియు!!

    రిప్లయితొలగించండి
  22. స్వార్థమవినీతి పరహింస బంధుప్రీతి
    రామరాజ్యమునన్ గనరాదు, నీతి
    గలిగినట్టిపాలకులె యా కాలమందు
    ధరణి నేలిరి ధర్మవర్తనులె సుమ్ము

    కుటిల పన్నాగములతోడ కువలయమ్ము
    నేలుచుండిరి గుణహీన నేతలిపుడు
    స్వార్థమవినీతి పరహింస ప్రబలె రామ
    రామ! రాజ్యమునన్ గనరాదు నీతి.


    సోమరులైన కర్షకులు శోకితులైనపడంతులున్ భువిన్
    క్షామము నిండు గ్రామములు శాస్త్రమెఱుంగని బ్రాహ్మణోత్తముల్
    రాముని రాజ్యమందుగనరావు గదా, శ్రుతి ధర్మపద్ధతుల్
    నేమము తో జరించెడవనీశుల బృందము గూడియుండెనే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ మూడు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
      '...జరించు నవనీశుల...' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములంండీ గురువుగారూ! మీ సూచన శిరోధార్యము

      తొలగించండి
  23. "అగ్గి" రాముని జూచితి సిగ్గు పడుచు
    "తోట" రాముండొకడు మరి "దొంగ" యొకడు
    చక్క నయ్యలమ్మల "భలే" చలన చిత్ర
    రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి


    అగ్గి రాముడు (1954)
    తోట రాముడు (పాతాళ భైరవి 1951)
    దొంగ రాముడు (1955)
    భలే రాముడు (1956)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ సినిమా రాముల పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. దొంగ రాముణ్ణి సావిత్రి దోచు కొనెను,
      అక్కి నేనియే సావిత్రి ప్రక్క చేరి
      అయ్యెనట భలే రాముడు, వియ్య మొందె
      లతను అందాల రాముడై లక్షణముగ,
      అగ్గి రాముడెంటీఆరు బుగ్గ గిల్లి
      భానుమతితోనటించెను భంగ పడక,
      పిడుగు రాముడై రాజశ్రీ నడుము పైన
      చేయి వేసి నటన మాడె,హాయి నిచ్చు
      జయసుధ జయప్ర దలుకూడ జాయి చేసె
      అడవి రాముడై, డ్రైవరై ఆడెను సుధ
      తోడ, సర్కసు చూపెను కూడి ప్రదకు,
      కలియుగపురాముడై చేసె చిలిపి చేష్ట
      రతిని కూడి నాడు సరదా రాము డాయె
      జయసుధకలసి నర్తించ , జయము నిడిన
      రాముని సినిమా లెన్నియో రక్తి కట్టి
      తెలుగు సినిమాలు ఎన్నియో వెలుగులిడగ
      శాస్త్రి గారు తెలిపినట్లు చలన చిత్ర
      రామ రాజ్యమ్మునన్ కన రాదు నీతి





      తొలగించండి
    3. అత్యద్భుతం నాగమణి గారు! పాపం "ప్రేమ కోసమై వలలో పడిన" తోట రాముడో? (పాతాళ భైరవి)...

      తొలగించండి
    4. ఆర్యా నమస్కారములు. నేను సినిమా పేర్లను మాత్రమే తీసుకున్నాను. తోట రాముడు ఒక పాత్ర. ఐనను ఇంకను రాముడి మీద చాలా సినిమాలు వున్నాయి. తోట రాముడు అన్న సినిమాలో చలం హీరో. జానకి రాముడు కల్యాణరాముడు రాముని మించిన రాముడు రావణుడే రాముడైతే , అల్లరి రాముడు, కళ్యాణ రాముడు రాము బండ రాముడు ఇంక రాముని పేర్లు కూడినవి మధ్యలో చాలా ఉన్నాయి. అందు కోసము పాత్రలను ఎంచుకోలేదు. ధన్యవాదములు

      తొలగించండి
  24. ప్రజలు సుఖముగ నుండిరి రాగమలర
    రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి
    నేటి పాలన యందున నిజము గాను
    బాలకులుబాలితుల బంధ మలర వలయు

    రిప్లయితొలగించండి
  25. రాముని రాజ్యమందు గనరావుగదా శ్రుతి ధర్మ పధ్ధతుల్
    యేమని మాటలా డితిరి!యీశుడు రాముని రాజ్యమందు నన్
    సేమము నుండిరే కదిల చిన్నలు పెద్దలు ధర్మ పధ్ధతి
    న్నేమరు లేదుగా నపుడ యీశ్రుతి,ధర్మము లెన్నడున్ధగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సేమము నందినారు కద... లేదుగా యపుడ...' అనండి.

      తొలగించండి
  26. డా}.పిట్టా
    ప్రేమమీరగ నిధులను పెంచి పంచు
    కేసియారన ఖ్యాతి నికేతనమ్మె
    లంచగొండు గండిని బెంచు వంచనలన
    నా తెలంగాణ మేర్పడ నౌనె ప్రగతి?
    రామ!!రాజ్యమునన్ గన రాదు నీతి!

    రిప్లయితొలగించండి
  27. డా}.పిట్టా
    "వంచనలను"గా 3వ పాదంలో చదువ గలరు.

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా
    ఏమనె ధర్మశాస్త్రములు? యేవి స్వయం పరి పోషణాధృతుల్
    నీమమె"మేకినిండియ"యె నీదగు కాళ్ళను నిల్చుటెన్నడో?
    క్షేమమె రూక లేని గతి ?గీకిన వచ్చెడి డబ్బు రీతులున్
    ఏమయె రామ భూమి?గనమే యవినీతి,యివెల్ల "మోడి"వౌ
    రాముని రాజ్యమందు; గనరావుగదా శ్రుతి ధర్మ పద్ధతుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'శాస్త్రములు నేవి...' అనండి. (శాస్త్రములు+ఏవి = శాస్త్రములేవి.. అవుతుంది, యడాగమం రాదు).

      తొలగించండి
  29. కోసలమ్మున నవినీతి కొంచెమైన
    రామరాజ్యమ్మునన్ గనరాదు, నీతి
    నియమములుగల్గి నిశ్చలముగ
    ప్రజలు సుఖజీవితమ్ముల ప్రబలిరపుడు

    రిప్లయితొలగించండి
  30. నియమములు గల్గి సతతము నిశ్చలముగ - మూడవపాదంలో సవరణ గమనించ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  31. “ప్రజల బాగోగు లెంచెడి ప్రభువుగాన?
    కష్ట నష్టము లెవరికి గలుగ వెపుడు|
    రామరాజ్యమ్ము నన్ గన”?”రాదునీతి
    నేటి పరిపాలకుల్ సొంత నేర్పునందు”|
    2.క్షామము లుంచు వర్షములు ,కర్షక వర్యుల నష్ట జాతకాల్
    ప్రేమగు సంతు సౌఖ్య మవివేకమునందున గూర్చుకష్ట “మౌ
    రా|మునిరాజ్యమందు గనరావుగదా?”శ్రుతి ధర్మ పద్ధతుల్
    కాముకు లైన దుష్టుల వికారపు నాయకులుండ?దండలౌ|”

    రిప్లయితొలగించండి
  32. శ్రీ తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారు వారి పద్యాన్ని సవరిస్తూ పంపినది

    అరయ నిధి కుంభ కోణము లంత వెలసె
    మహిళ మానసం రక్షణ మాసి పోయె
    బడుగు జీవితము కనగ భారమయ్యె
    రామ! రాజ్యమ్మునన్ గనరాదు నీతి.

    రిప్లయితొలగించండి
  33. అరయ నిధి కుంభ కోణములంత వెలిసె
    మహిళ మాన సంరక్షణ మాసి పోయె
    బడుగు జీవితము కనగ భార మయ్యె
    రామ! రాజూమ్మునన్ గనరాదు నీతి.

    రిప్లయితొలగించండి
  34. ప్రేమను పంచుచున్ కరము విశ్వసనీయత జూపగా, ప్రజల్
    క్షేమముగావసించిరి విశేషసుఖమ్ములతోడ, దుఃఖముల్
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా, శ్రుతి ధర్మపద్ధతుల్
    నీమముతోచెలంగె నవనీశుడు సల్పిన సత్యపాలనన్

    రిప్లయితొలగించండి
  35. దొంగ రాముణ్ణి సావిత్రి దోచు కొనెను,
    అక్కి నేనియే సావిత్రి ప్రక్క చేరి
    అయ్యెనట భలే రాముడు, వియ్య మొందె
    లతను అందాల రాముడై లక్షణముగ,
    అగ్గి రాముడెంటీఆరు బుగ్గ గిల్లి
    భానుమతితోనటించెను భంగ పడక,
    పిడుగు రాముడై రాజశ్రీ నడుము పైన
    చేయి వేసి నటన మాడె,హాయి నిచ్చు
    జయసుధ జయప్ర దలుకూడ జాయి చేసె
    అడవి రాముడై, డ్రైవరై ఆడెను సుధ
    తోడ, సర్కసు చూపెను కూడి ప్రదకు,
    కలియుగపురాముడై చేసె చిలిపి చేష్ట
    రతిని కూడి, నాడు సరదా రాము డాయె
    జయసుధ కలసి నర్తించ , జయము నిడిన
    రాముని సినిమా లెన్నియో రక్తి కట్టి
    తెలుగు సినిమాలు ఎన్నియో వెలుగులిడగ
    శాస్త్రి గారు తెలిపినట్లు చలన చిత్ర
    రామ రాజ్యమ్మునన్ కన రాదు నీతి




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      అందరు సినీ రాముళ్ళను ఒకచోట చేర్చి చక్కని పద్యం చెప్పారు. బాగుంది.
      'రాజశ్రీ' అన్నపుడు గణదోషం.

      తొలగించండి
    2. క్షమించండి రాముళ్ళు పూనుకునేటప్పటికి గణము మరిచాను

      తొలగించండి
  36. రామ రాజ్యమ్మునం గనరాదు నీతి
    బాహ్యము నధర్మము ననృత భాషణమ్ము
    చోర భయమును బౌరుల శుల్క భార
    మించుకయు రామ భక్తులె యెల్ల జనులు


    కామ విలాస లాలస సుగర్విత కార్య కలాప తోషి యా
    భీమ శరీర భీకర వివేక విహీన మనో విచార సం
    గ్రామ వికార రావణుని రాక్షస సింహుని, ఘోర శత్రువా
    రాముని, రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      నీతి బాహ్యత, రామవైరులతో మీ పూరణలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అద్భుతమైన పూరణలు. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  37. మీ పూరణ కోసం చాలా సేపు నిరీక్షించడమైనది. రావణుడను ఆకాశానికెత్తి సముద్రం లో విసిరి వేశారు.

    __/\__

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు నమస్సులు. కార్యార్థము హైదరాబాదు వచ్చితిని. బయటపనులు చూచుకొని యింటికి వచ్చేసరికి ఆలస్యమయినది. రేపు గూడ యిదే పరిస్థితి.

      తొలగించండి
  38. రాముడు ధర్మ పాలకుడు రాముని రాజ్యమునేగదాభువిన్
    రాముని రామరాజ్యమున రాజిత భక్తిగరామునే సదా
    రామునితోడపాలనము రాజులు జేయగఆదరంబుగా
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్

    రిప్లయితొలగించండి
  39. [20/04, 3:23 PM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    "రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి"

    (లేదా...)
    భీమపరాక్రమోద్ధతులభీతిలజేసిదురాత్ములన్ మహిన్
    క్షేమముగూర్చి సజ్జనులచింతలబాపుటక్షత్రియోచితం
    బౌమునివైతపంబె?తలపన్ దగదందురుబాందవుల్ !కుమా
    *రా!ముని!రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్"*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    [20/04, 3:27 PM] సందిత బెంగుళూరు: క్షత్రియుడైన తనకూమారుడు తపస్సు చేస్తూంటే బాంధవులు మెచ్చరు రాజ్యమందు ధర్మము అదృశ్యమౌతున్న తరుణంలో రాజులు పరాక్రమంజూపి పునరుద్దరించాలని పల్కిన సందర్భం🙏🌺🙏

    రిప్లయితొలగించండి
  40. కామము క్రోధమున్ విడిచి కారలు మార్క్సుకు మ్రొక్కినాడయో
    భీముని వోలె గర్జనలు భీకర రీతిని జేసినాడయో
    నీమము వీడి యేచురుడు నేడిటు రాహులు కాళ్ళుబట్ట...నీ
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్!

    రిప్లయితొలగించండి


  41. నీమము తప్పి నాయకుల నేరుగ తిట్టుచు చూపె దర్పమున్
    కామము తోడు మూసుకొని కన్నుల చేసెను తప్పులెన్నియో
    ప్రేమయొకింత లేదరరె! పేరుకు మాత్రము రాముడైన నా
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి