ముక్తిని కోరుచు కర్మనురక్తియు గాంచక మనుజుడు రంజిల జేయన్శాక్తము నటు, కర్మ ఫలపుభుక్తియె లేనట్టి పరమభోగి యతండే!ஜிலேபிதமிழ் புத்தான்டு வாழ்த்துக்கள்
தமிழ் புத்தான்டு வாழ்த்துக்கள்Happy Tamil New Year!
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిని గొలువగ బుట్టినశక్తిధరుడను పసివాని సాకగ యుండన్రక్తిని క్షీరమె త్రాగెడి"భుక్తియె లేనట్టి పరమభోగి యతండే"
శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తికిమించి మంగలి విచారము చేయక ఖర్చులెన్నొ యాసక్తిగఁ జేయగా ఋణపు జాబిత హెచ్చు విశేషరీతిగన్ వ్యక్తులు రాక బేరములు వచ్చుట పూర్తిగ సన్నగిల్లగాభుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలమ్మునన్ (భోగి = మంగలి)
సోమయాజులు గారూ,భోగి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః|సర్వ పరిగ్రహ భోగ త్యాగఃకస్య సుఖం న కరోతి విరాగః||ముక్తి కొరగచాట్లు పడకభక్తి భజన లేక సిధ్ధి బడసిన రీతిన్రక్తి పరమాత్మ పరమైభుక్తియె లేనట్టి పరమభోగి యతండే...రమణ మహర్షి నుద్దేశ్యించి
శాస్త్రి గారూ, ప్రశస్తమైన శ్లోకం ప్రాదిపదికగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.
శక్తియొకింతలేమి, యనుషక్తియు నన్యులతోడ శూన్యమున్భక్తిని చూపి కాంగ్రెసుకు భావిప్రధానియె రాహులుండనిన్రక్తిని జూపుచున్ భజన రంజుగ జేసెడి వారలుండగన్ "భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్" అనుషక్తి= సంబంధముభుక్తి = అనుభవంహుళక్కి = శూన్యముపరమ =ప్రధానముధరా = మెదడు
శర్మ గారూ, సమకాలీనమైన అంశంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.'అనిన్' అంటే యుద్ధంలో అనే అర్థం వస్తుంది. అక్కడ "రాహులుం డనన్" అనండి.
ప్రాక్తన కాలంబున నాసక్తుండై ధార పోసె సర్వము రాజౌభక్తుండు రంతిదేవుడుభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే. ముక్తిని గోరి యాత డతి మోదము నందుచు రంతిదేవు డావ్యక్తులు వారు వీరనెడి వ్యత్యయ మెంచక విశ్వరక్షకున్భక్తి స్మరించువా డగుచు వస్తువు లన్నియు ధారపోయడేభుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్. హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భక్తిన నిరతము నిహసుఖరక్తిమరచి దేవుని స్మరణన గడుపునాసక్తిన్సర్వముమరచినభుక్తియెలేనట్టి పరమభోగి యతండే
చేపూరి వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'భక్తిని' అనండి. రెండవ పాదంలో గణదోషం. "రక్తి మరచి యా ప్రభువు స్మరణను..." అనండి.
డా.పిట్టారక్తికి సాధువు వేషముముక్తికి సాధనను దేలు మోసము స్పర్ధాసక్తికి (నా)యాశ్రమ భూముల్భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే?! (నేటి కుహనా సాధువులనుద్దేశించి)
డా.పిట్టాశక్తిని నించి యాయువును స్తంభన జేసి సుఖించు ధ్యాన మవ్యక్తము ప్రాణ వాయువు సుభక్షణ దేలెడు యోగ శా స్త్ర సంసక్తి రచించు భోజనము, శాంతియు లభ్యము దీర్ఘ జీవికిన్భుక్తి.....................................Wuthering Heights నవల టిబెట్, హిమాలయాలలో ని ఉదంతాల ఆధారంగా
డా. పిట్టా వారూ,మీ రెండు పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండిఆర్యా, కృతజ్ఞతలు
భక్తిని ముమ్మిడి వరమునమౌక్తికమౌ బాలయోగి మహదానందాసక్తుండై ధ్యానమొదగభుక్తియె లేనట్టి పరమభోగి యతండే
సహదేవుడు గారూ, మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు
శక్తికి మించిన ఖర్చులుభక్తుడు త్యాగయ్య చేయ, ఫణిశయనుండేముక్తి నొసగ, ప్రజలనెనటభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
నాగమణి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ప్రజ లనిరట' అనండి.
ధన్యవాదములు సరిదిద్దుకుంటాను
రిక్తము జీతము! వెన్నుని భక్తిగ తలపై భరించు ! పాపము! దినెడిన్ శక్తికి గాలిని ! ద్రవ ఘన భుక్తియె లేనట్టి *పరమభోగి* యతండే !! భోగి =ఆదిశేషువు ఆధునిక భోగి.. వ్యక్తి విలాసజీవనమహార్ణవమందున మున్గి , రేబవల్ రక్తము ధారపోసి,పలు లక్షలు దెచ్చియు, మద్యసేవనా.. సక్తి సతీసుతాదులను సాఁకడు , వేళకు నింటిపట్టునన్ భుక్తి హుళక్కియౌ!*పరమభోగి*యతండు ధరాతలమ్మునన్
మురళీకృష్ణ గారూ, మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ.. నమోనమః
శక్తియుతుండై పెనునాసక్తి గ్రసించును సకలము సమయము పేరున్వ్యక్తివలె జాతక దశాభుక్తియె లేనట్టి పరమ భోగియతండే!కాలాన్ని సర్పంతో పోల్చడం సాధారణం కదా!
సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెను + ఆసక్తి = “పెన్నాసక్తి” అవుతుందనుకుంటాను.
నిజమే నండీ... నేను గమనించలేదు. అలాగే 'పేరాసక్తి' అని కూడా అనవచ్చు ననుకుంటాను.
పూజ్యులు కామేశ్వరరావు గారికి, గురువర్యులు శంకరయ్యగారికి నమస్సులు! పెన్నాసక్తి లేదా పేరాసక్తి యేది యైనా గణాలు సరిపోతాయి కనుక చిన్న సవరణతో పద్యం మార్చవచ్చు! మీ ఇరువురి మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు!🙏🙏🙏
రిక్తకరాలజూపి యెదురేగెడి లుబ్ధుడు లోకమందునన్ముక్తిని పొందలేడు,ధనమున్ నిరుపేదలకందజేయుచున్శక్తికి మించునట్లుగను సాయమొనర్చెడి మేటి దాతయే భుక్తి హుళక్కియౌ పరమ భోగియతండె ధరాతలంబునన్ - వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ, మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
ముక్తికి తాపసియయి యా సక్తిని, చేరగ ననంతు సాధన జేయన్భక్తుడు మోక్షము నందగభుక్తియె లేనట్టి పరమభోగి యతండే
కృష్ణారావు గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
రిక్త కరద్వయ భజనుఁడుముక్తి సతీ కాముకుండు మురరిపు భజనాసక్తుఁడు జితేంద్రియుండునుభుక్తియె లేనట్టి పరమభోగి యతండేరక్తము ధార వోయ నది లబ్దము రమ్యపు టాస్తి యంత బిత్రక్తము సంపదెల్ల పర దారల పాలయినన్ వరాంగనాసక్త వికార చిత్త కృత సంకట సంచయ కారణమ్మునన్భుక్తి యుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్[పితృ+అక్తము = పిత్రక్తము: తండ్రి నుండి చేరినది]
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
భక్తిని దేవుని దలచుచుశక్తిని బడసిన బహువిధ సంపద బలముల్ముక్తి నొసగవని యనుభవభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!
శర్మ గారూ, చక్కని పూరణ. అభినందనలు.
భక్తిని ఫలమును నీయగభుక్తికి లేనట్టి పరమ భోగి యతండేరక్తిని.సిరులను నింకనుభుక్తిని మనకి చ్చునతడు భువనమునందున్
సుబ్బారావు గారూ, కొంత స్పష్టత కొరవడ్డా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముక్తినొసంగెడు వాడైభక్త సులభు డాదిభిక్షు వాతడె శివుడైశక్తియె యిల్లాలైననుభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
విరించి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిన్ గొలిచెడి జనులకు ముక్తికి మార్గమును జూపు ముక్కంటి యనన్' శక్తి ' ని కూడుక యున్ననుభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!
శ్రీధర రావు గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
ముక్తిని గోరువారుభువి మోదము నొందుచు జింతనొందరేభుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్ రక్తిని గామభోగముల రాటునుదేలుచు వన్నెకెక్కెగాముక్తియు భక్తియున్నికను మోదము గూర్చునురక్తిగల్గుచో
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తుల బ్రోచుచు సతమనురక్తినొసంగి గిరిజకు కరమగు ముదముతోశక్తిని సతిగా బడచియుభుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'బడసియు' అనండి.
పెను+ ఆసక్తి=పెనునాాసక్తి--నుగాగమసంధి
అన్నయ్య ను గాగమంమునకు ఇది1. తద్ధర్మార్థవిశేషణము కాదు.2. షష్ఠీసమాసము కాదు. అసలు రూపము పెనుపు – విశేష్యము. సమాసమున పెనుపు నాటకము మీది వర్ణము లోపించి పెను నాటకము స్థిర వర్ణము పరమైన ఉత్వ లోపము. పెన్ నాటకము = పెన్నాటకముఅచ్చు పరమైన ద్విత్వము.పెను ఊత = పెన్నూత. (పెన్ ఊత : పెన్నూత) అట్లే పెన్నాశక్తి.
.త్యక్త విచారుడై తులసిదాసల నాడట భార్యకామితాసక్తత వాగుదాటి నొకసర్పము చేగొని రాత్రివేళలోయుక్తిగవెళ్ళ?”భార్యయనె-యూహలు భక్తికినుంచుమాయికన్భుక్తిహుళక్కియౌ”|పరమభోగి యతండు ధరాతలంబునన్| 2.భుక్తికి కిరాతకంబేరక్తిగ గనుపించ?బోయ రచనలు మారెన్భక్తిగ వాల్మీకుండైభుక్తియు లేనట్టి పరమ భోగి యతండే| {నారద హితబోధచేమార్పునబోయవాల్మీకిగామారుటజరిగినది}
ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భక్తిగ గొలిచెడు వారికిముక్తినొసగు సిద్ధయోగి బూచులదొరయేశక్తిని మేనున గొని యనుభుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!శక్తిని మేనున గొని యాసక్తిగ తలపైనదాల్చి శైలేంద్రజనేముక్తినొసంగుచు నలయుచుభుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!
శైలజ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భుక్తిని గోరి క్షౌరికుడు పూటకు లేదని క్షౌరశాలనేభుక్తి హుళక్కియౌ పరమ భోగి ధరాతలంబునన్ శక్తికి మించిఖర్చిడుచు స్థాపన జేయగ నట్టి యూరిలో వ్యక్తులు జూడనెల్లరులు బభ్రువులేనట కాసురాలదే.
భక్తులఁ బ్రోచుచున్ రహిని భర్గుడు, నిత్యము సేవచేయగన్రక్తినొసంగ పార్వతికి రమ్య మనంబున పెండ్లియాడి యాశక్తిగృహమ్మునన్ కలిగి చక్కగ వర్తిలుచుండ కాటిలోభుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్
అన్నపరెడ్డి వారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
భక్తిగ క్రైస్తుని మోసినశక్తి యుతుండకట! నేడు చాకలి కఱవైముక్తిగ వాషింగు లలరభుక్తియె లేనట్టి పరమభోగి యతండే!1. "గుడ్ ఫ్రైడే" ముందు వచ్చు "పాం సండే" జీససు గార్దభ వాహనుడై కోలాహలముగ జెరుసలేం చేరిన శుభతిథి.2. పరమ భోగి = బ్రాండ్ ఎంబాసడర్ అమితాభ్ బచన్ ద్వారా ప్రఖ్యాతి జెందిన గుజరాత్ గాడిద.https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=https://m.youtube.com/watch%3Fv%3DoQgDz3B1ndY&ved=0ahUKEwiv3P6r0KPTAhVLKo8KHRCIDL84ChC3AggiMAA&usg=AFQjCNG83hOTwcdwRmmw7g-4ph54A29Vww&sig2=iSuKqYsJkw7V-1GIR2RbAA3. వాషింగు = Washing Machine
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనాధగా యుండే పిచ్చివాడు...వ్యక్తము గావు కోరికలు, నట్టలు గట్టిన జుట్టుతో ననాసక్తపు వస్త్రధారణము, చాచడు చేతిని పొట్టనింపగన్సూక్తులఁ జెప్పురీతి తన చూడ్కులఁ జేతులఁ ద్రిప్పుచుండుచున్భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్
సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
9493846984 డా.బల్లూరి ఉమాదేవి.శక్తిని భక్తిని రక్తిని ముక్తినిసతమొసగుమనుచు ముదమున కోరన్రక్తితొ మిత్రుండనియెనుభుక్తికి లేనట్టి పరమభోగి యతండే
శక్తికి మించగా ఋణము శౌర్యము మీరుచు జేసి జేసియున్ముక్తిని గోరి లండనున మోడియె నీరవు దాగుచుండగారక్తియె లేదు లేదుగద రమ్యపు రీతిని మాతృభూమినిన్ భుక్తిహుళక్కియౌ...పరమభోగి యతండు ధరాతలంబునన్ :)
రిప్లయితొలగించండిముక్తిని కోరుచు కర్మను
రక్తియు గాంచక మనుజుడు రంజిల జేయన్
శాక్తము నటు, కర్మ ఫలపు
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే!
ஜிலேபி
தமிழ் புத்தான்டு வாழ்த்துக்கள்
తొలగించండిதமிழ் புத்தான்டு வாழ்த்துக்கள்
Happy Tamil New Year!
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిని గొలువగ బుట్టిన
రిప్లయితొలగించండిశక్తిధరుడను పసివాని సాకగ యుండన్
రక్తిని క్షీరమె త్రాగెడి
"భుక్తియె లేనట్టి పరమభోగి యతండే"
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తికిమించి మంగలి విచారము చేయక ఖర్చులెన్నొ యా
రిప్లయితొలగించండిసక్తిగఁ జేయగా ఋణపు జాబిత హెచ్చు విశేషరీతిగన్
వ్యక్తులు రాక బేరములు వచ్చుట పూర్తిగ సన్నగిల్లగా
భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలమ్మునన్
(భోగి = మంగలి)
సోమయాజులు గారూ,
తొలగించండిభోగి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
సుర మందిర తరు మూల నివాసః
రిప్లయితొలగించండిశయ్యా భూతల మజినం వాసః|
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః||
ముక్తి కొరగచాట్లు పడక
భక్తి భజన లేక సిధ్ధి బడసిన రీతిన్
రక్తి పరమాత్మ పరమై
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే
...రమణ మహర్షి నుద్దేశ్యించి
శాస్త్రి గారూ,
తొలగించండిప్రశస్తమైన శ్లోకం ప్రాదిపదికగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.
శక్తియొకింతలేమి, యనుషక్తియు నన్యులతోడ శూన్యమున్
రిప్లయితొలగించండిభక్తిని చూపి కాంగ్రెసుకు భావిప్రధానియె రాహులుండనిన్
రక్తిని జూపుచున్ భజన రంజుగ జేసెడి వారలుండగన్
"భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్"
అనుషక్తి= సంబంధము
భుక్తి = అనుభవం
హుళక్కి = శూన్యము
పరమ =ప్రధానము
ధరా = మెదడు
శర్మ గారూ,
తొలగించండిసమకాలీనమైన అంశంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
'అనిన్' అంటే యుద్ధంలో అనే అర్థం వస్తుంది. అక్కడ "రాహులుం డనన్" అనండి.
ప్రాక్తన కాలంబున నా
రిప్లయితొలగించండిసక్తుండై ధార పోసె సర్వము రాజౌ
భక్తుండు రంతిదేవుడు
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే.
ముక్తిని గోరి యాత డతి మోదము నందుచు రంతిదేవు డా
వ్యక్తులు వారు వీరనెడి వ్యత్యయ మెంచక విశ్వరక్షకున్
భక్తి స్మరించువా డగుచు వస్తువు లన్నియు ధారపోయడే
భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భక్తిన నిరతము నిహసుఖ
రిప్లయితొలగించండిరక్తిమరచి దేవుని స్మరణన గడుపునా
సక్తిన్సర్వముమరచిన
భుక్తియెలేనట్టి పరమభోగి యతండే
చేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భక్తిని' అనండి. రెండవ పాదంలో గణదోషం. "రక్తి మరచి యా ప్రభువు స్మరణను..." అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిరక్తికి సాధువు వేషము
ముక్తికి సాధనను దేలు మోసము స్పర్ధా
సక్తికి (నా)యాశ్రమ భూముల్
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే?! (నేటి కుహనా సాధువులనుద్దేశించి)
డా.పిట్టా
రిప్లయితొలగించండిశక్తిని నించి యాయువును స్తంభన జేసి సుఖించు ధ్యాన మ
వ్యక్తము ప్రాణ వాయువు సుభక్షణ దేలెడు యోగ శా స్త్ర సం
సక్తి రచించు భోజనము, శాంతియు లభ్యము దీర్ఘ జీవికిన్
భుక్తి.....................................
Wuthering Heights నవల టిబెట్, హిమాలయాలలో ని ఉదంతాల ఆధారంగా
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా, కృతజ్ఞతలు
భక్తిని ముమ్మిడి వరమున
రిప్లయితొలగించండిమౌక్తికమౌ బాలయోగి మహదానందా
సక్తుండై ధ్యానమొదగ
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిశక్తికి మించిన ఖర్చులు
రిప్లయితొలగించండిభక్తుడు త్యాగయ్య చేయ, ఫణిశయనుండే
ముక్తి నొసగ, ప్రజలనెనట
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
నాగమణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రజ లనిరట' అనండి.
ధన్యవాదములు సరిదిద్దుకుంటాను
తొలగించండిరిక్తము జీతము! వెన్నుని
రిప్లయితొలగించండిభక్తిగ తలపై భరించు ! పాపము! దినెడిన్
శక్తికి గాలిని ! ద్రవ ఘన
భుక్తియె లేనట్టి *పరమభోగి* యతండే !!
భోగి =ఆదిశేషువు
ఆధునిక భోగి..
వ్యక్తి విలాసజీవనమహార్ణవమందున మున్గి , రేబవల్
రక్తము ధారపోసి,పలు లక్షలు దెచ్చియు, మద్యసేవనా..
సక్తి సతీసుతాదులను సాఁకడు , వేళకు నింటిపట్టునన్
భుక్తి హుళక్కియౌ!*పరమభోగి*యతండు ధరాతలమ్మునన్
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ.. నమోనమః
తొలగించండిశక్తియుతుండై పెనునా
రిప్లయితొలగించండిసక్తి గ్రసించును సకలము సమయము పేరున్
వ్యక్తివలె జాతక దశా
భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!
కాలాన్ని సర్పంతో పోల్చడం సాధారణం కదా!
సీతాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెను + ఆసక్తి = “పెన్నాసక్తి” అవుతుందనుకుంటాను.
తొలగించండినిజమే నండీ... నేను గమనించలేదు. అలాగే 'పేరాసక్తి' అని కూడా అనవచ్చు ననుకుంటాను.
తొలగించండిపూజ్యులు కామేశ్వరరావు గారికి, గురువర్యులు శంకరయ్యగారికి నమస్సులు! పెన్నాసక్తి లేదా పేరాసక్తి యేది యైనా గణాలు సరిపోతాయి కనుక చిన్న సవరణతో పద్యం మార్చవచ్చు!
తొలగించండిమీ ఇరువురి మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు!🙏🙏🙏
రిక్తకరాలజూపి యెదురేగెడి లుబ్ధుడు లోకమందునన్
రిప్లయితొలగించండిముక్తిని పొందలేడు,ధనమున్ నిరుపేదలకందజేయుచున్
శక్తికి మించునట్లుగను సాయమొనర్చెడి మేటి దాతయే
భుక్తి హుళక్కియౌ పరమ భోగియతండె ధరాతలంబునన్
- వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
ముక్తికి తాపసియయి యా
రిప్లయితొలగించండిసక్తిని, చేరగ ననంతు సాధన జేయన్
భక్తుడు మోక్షము నందగ
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
రిక్త కరద్వయ భజనుఁడు
రిప్లయితొలగించండిముక్తి సతీ కాముకుండు మురరిపు భజనా
సక్తుఁడు జితేంద్రియుండును
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే
రక్తము ధార వోయ నది లబ్దము రమ్యపు టాస్తి యంత బి
త్రక్తము సంపదెల్ల పర దారల పాలయినన్ వరాంగనా
సక్త వికార చిత్త కృత సంకట సంచయ కారణమ్మునన్
భుక్తి యుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్
[పితృ+అక్తము = పిత్రక్తము: తండ్రి నుండి చేరినది]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిభక్తిని దేవుని దలచుచు
రిప్లయితొలగించండిశక్తిని బడసిన బహువిధ సంపద బలముల్
ముక్తి నొసగవని యనుభవ
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!
శర్మ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
భక్తిని ఫలమును నీయగ
రిప్లయితొలగించండిభుక్తికి లేనట్టి పరమ భోగి యతండే
రక్తిని.సిరులను నింకను
భుక్తిని మనకి చ్చునతడు భువనమునందున్
సుబ్బారావు గారూ,
తొలగించండికొంత స్పష్టత కొరవడ్డా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముక్తినొసంగెడు వాడై
రిప్లయితొలగించండిభక్త సులభు డాదిభిక్షు వాతడె శివుడై
శక్తియె యిల్లాలైనను
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిన్ గొలిచెడి జనులకు
రిప్లయితొలగించండిముక్తికి మార్గమును జూపు ముక్కంటి యనన్
' శక్తి ' ని కూడుక యున్నను
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
ముక్తిని గోరువారుభువి మోదము నొందుచు జింతనొందరే
రిప్లయితొలగించండిభుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్
రక్తిని గామభోగముల రాటునుదేలుచు వన్నెకెక్కెగా
ముక్తియు భక్తియున్నికను మోదము గూర్చునురక్తిగల్గుచో
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తుల బ్రోచుచు సతమను
రిప్లయితొలగించండిరక్తినొసంగి గిరిజకు కరమగు ముదముతో
శక్తిని సతిగా బడచియు
భుక్తియె లేనట్టి పరమ భోగి యతండే
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బడసియు' అనండి.
పెను+ ఆసక్తి=పెనునాాసక్తి--నుగాగమసంధి
రిప్లయితొలగించండిఅన్నయ్య ను గాగమంమునకు ఇది
తొలగించండి1. తద్ధర్మార్థవిశేషణము కాదు.
2. షష్ఠీసమాసము కాదు.
అసలు రూపము పెనుపు – విశేష్యము.
సమాసమున పెనుపు నాటకము
మీది వర్ణము లోపించి పెను నాటకము
స్థిర వర్ణము పరమైన ఉత్వ లోపము.
పెన్ నాటకము = పెన్నాటకము
అచ్చు పరమైన ద్విత్వము.
పెను ఊత = పెన్నూత. (పెన్ ఊత : పెన్నూత)
అట్లే పెన్నాశక్తి.
.త్యక్త విచారుడై తులసిదాసల నాడట భార్యకామితా
రిప్లయితొలగించండిసక్తత వాగుదాటి నొకసర్పము చేగొని రాత్రివేళలో
యుక్తిగవెళ్ళ?”భార్యయనె-యూహలు భక్తికినుంచుమాయికన్
భుక్తిహుళక్కియౌ”|పరమభోగి యతండు ధరాతలంబునన్|
2.భుక్తికి కిరాతకంబే
రక్తిగ గనుపించ?బోయ రచనలు మారెన్
భక్తిగ వాల్మీకుండై
భుక్తియు లేనట్టి పరమ భోగి యతండే| {నారద హితబోధచేమార్పునబోయవాల్మీకిగామారుటజరిగినది}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భక్తిగ గొలిచెడు వారికి
రిప్లయితొలగించండిముక్తినొసగు సిద్ధయోగి బూచులదొరయే
శక్తిని మేనున గొని యను
భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!
శక్తిని మేనున గొని యా
సక్తిగ తలపైనదాల్చి శైలేంద్రజనే
ముక్తినొసంగుచు నలయుచు
భుక్తియె లేనట్టి పరమ భోగియతండే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భుక్తిని గోరి క్షౌరికుడు పూటకు లేదని క్షౌరశాలనే
రిప్లయితొలగించండిభుక్తి హుళక్కియౌ పరమ భోగి ధరాతలంబునన్
శక్తికి మించిఖర్చిడుచు స్థాపన జేయగ నట్టి యూరిలో
వ్యక్తులు జూడనెల్లరులు బభ్రువులేనట కాసురాలదే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తులఁ బ్రోచుచున్ రహిని భర్గుడు, నిత్యము సేవచేయగన్
రిప్లయితొలగించండిరక్తినొసంగ పార్వతికి రమ్య మనంబున పెండ్లియాడి యా
శక్తిగృహమ్మునన్ కలిగి చక్కగ వర్తిలుచుండ కాటిలో
భుక్తి హుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిభక్తిగ క్రైస్తుని మోసిన
రిప్లయితొలగించండిశక్తి యుతుండకట! నేడు చాకలి కఱవై
ముక్తిగ వాషింగు లలర
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే!
1. "గుడ్ ఫ్రైడే" ముందు వచ్చు "పాం సండే" జీససు గార్దభ వాహనుడై కోలాహలముగ జెరుసలేం చేరిన శుభతిథి.
2. పరమ భోగి = బ్రాండ్ ఎంబాసడర్ అమితాభ్ బచన్ ద్వారా ప్రఖ్యాతి జెందిన గుజరాత్ గాడిద.
https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=https://m.youtube.com/watch%3Fv%3DoQgDz3B1ndY&ved=0ahUKEwiv3P6r0KPTAhVLKo8KHRCIDL84ChC3AggiMAA&usg=AFQjCNG83hOTwcdwRmmw7g-4ph54A29Vww&sig2=iSuKqYsJkw7V-1GIR2RbAA
3. వాషింగు = Washing Machine
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనాధగా యుండే పిచ్చివాడు...
రిప్లయితొలగించండివ్యక్తము గావు కోరికలు, నట్టలు గట్టిన జుట్టుతో ననా
సక్తపు వస్త్రధారణము, చాచడు చేతిని పొట్టనింపగన్
సూక్తులఁ జెప్పురీతి తన చూడ్కులఁ జేతులఁ ద్రిప్పుచుండుచున్
భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండిశక్తిని భక్తిని రక్తిని
ముక్తినిసతమొసగుమనుచు ముదమున కోరన్
రక్తితొ మిత్రుండనియెను
భుక్తికి లేనట్టి పరమభోగి యతండే
శక్తికి మించగా ఋణము శౌర్యము మీరుచు జేసి జేసియున్
రిప్లయితొలగించండిముక్తిని గోరి లండనున మోడియె నీరవు దాగుచుండగా
రక్తియె లేదు లేదుగద రమ్యపు రీతిని మాతృభూమినిన్
భుక్తిహుళక్కియౌ...పరమభోగి యతండు ధరాతలంబునన్ :)