25, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2347 (కోరి దాగెను విష్ణువు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కోరి దాగెను విష్ణువు కోటరమున"
(లేదా...) 
"కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై"

70 కామెంట్‌లు:

  1. ఏమి జేసి సీత వరించె రాము నపుడు?...
    ఏమి జేసె వాలిని చంప రాము డపుడు?...
    ఎవడ వతరించె శ్రీరామ నవమి నాడు?...
    ఎచట దాగునులూకము కిచకిచనక?...
    కోరి, దాగెను, విష్ణువు, కోటరమున...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శస్త్రి గారూ,
      ప్రశ్నోత్తర మాలికగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కిచకిచ+అనక' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ 'హితము గోరి' అందామా?

      తొలగించండి
  2. క్రూర రాక్షసబాధల బారి బడక
    కోరి విష్ణువు దాగెను కోటరమున
    పద్మ భవుడొదిగెను భీతి వాణి వెనుక
    భూత నాధుడు తా మరుభూమిచేరె

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  3. శిష్ట కోటిని రక్షించి దుష్టకోటి
    నణచ రాముడై భవిపైన నవతరించి
    వరముచే విర్రవీగెడు వాలిఁజంప
    కోరి విష్ణువు దాగెను కోటరమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయినా రాముడు దాగింది చెట్టు చాటున. చెట్టుతొర్రలో కాదు కదా!

      తొలగించండి
  4. భక్త ప్రహ్లాదు రక్షించి పాపి యైన
    తండ్రి బరిమార్చు నెపమున స్తంభమందు
    కోరి దాగెను విష్ణువు, కోటరమున
    భవుడు నక్కె భస్మాసుర భయము చేత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      శివుడు భస్మాసురుని భయంతో కాదు తొర్రలో దాగింది... శనీశ్వరుని భయం వల్ల! అక్కడ "భవుడు నక్కె శనీశ్వరు భయముచేత' అందామా?

      తొలగించండి
  5. (1)
    అంతటను వ్యాప్తి చెంది యున్నట్టివాఁడు
    విష్ణు వనుచు వ్యుత్పత్తిని విజ్ఞు లనిరి
    యభవుఁ డా శంకరుఁడు విష్ణు వనఁగ నొప్పు
    శనినిఁ దప్పించుకొన నొక్కసారి తానె
    కోరి దాగెను విష్ణువు కోటరమున
    (2)
    దారుణ దుర్గమాటవినిఁ దప్పక యొంటరియై గమించెఁ గాం
    తారపురాధివాసుఁడు జనార్దన నాముఁడు వర్తకుం డొగిన్
    జోరులు చేర వచ్చుటను జూచి ధనమ్మునుఁ గాచు కోరికన్
    గోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై

    రిప్లయితొలగించండి
  6. చేతమలరంగ దాగుడు మూతలచట
    నాడు చున్నట్టి మిత్రుల యాటలోన
    మదను డనువాడు చేరెను పొదల వెనుక
    కోరి దాగెను విష్ణువు కోటరమున.

    చేరిరి తోటలోపలికి జిహ్వకు గల్గిన చాపలంబుచే
    కోరిక దీర పండ్లనట కొమ్మల పైనను మెక్కుచుండగా
    వారల గాంచు మాలి గని పారిరి మిత్రులు పర్వలేక తా
    కోరి జనార్దనుం డపుడు కోటర మందున దాగె భీతుడై.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      రెంటికి రెండూ వైవిధ్యంగా చక్కగా ఉన్నవి పూరణలు. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    తాకి మ్రొగ్గిన నరునకెదనరు నితరు
    బాధలను గన:భార్యను బాసి రామ
    బాణమున నుపకృతి జేసి బలగము గన
    వాలి గోలన వేయగ వలసి వచ్చె
    లేదు తన కంగబలమను లీల నెరిగి
    ఆర్తుడై తాను విధికొగ్గి యాడ వలసె
    కోరి దాగెను విష్ణువు కోటరమున!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    పూరణ ద్రవ్య భాగ్యమున బొందె దరిద్రత విజయ మాల్య యే
    పారగ నెందరిన్ బ్రతుకు బాటను గూర్చగ జూచి సంస్థలన్
    బారగ నర్థ గౌరవము బాసె నవారిత మాయె శిక్షలే
    భారముగాగ నా బ్రిటను భాసుర న్యాయపు వృక్ష రంధ్రమున్
    గోరి జనార్దనుండపుడు కోటరమందున దాగె భీతుడై!
    (జనార్దనుడు..హరి..పాము)

    రిప్లయితొలగించండి
  9. భక్త ప్రహ్లాదు రక్షించి పాపి యైన
    తండ్రి బరిమార్చు నెపమున స్తంభమందు
    కోరి దాగెను విష్ణువు, కోటరమున
    భవుడు నక్కె శనీశ్వర భయము చేత

    రిప్లయితొలగించండి


  10. వారిజ నేత్రి పద్యముల వాలుగకంటి జిలేబి వేగమై
    సారము గాంచి నాననుచు సన్నిధి గాన సువర్ణ బిందువౌ
    వారిశు డచ్చటన్ వణికి వాతలు తప్ప విమందనమ్మనన్
    కోరి, జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వారిశుడు... విమందనమ్ము'...?

      తొలగించండి

    2. కంది వారు నెనరులు

      వారిశుడు - విష్ణువు

      విమందనము -వేగము తగ్గించు

      విష్ణువు భయపడి వేగాన్ని తగ్గించ మని కోరి

      సరియంటారా ?

      జిలేబి

      తొలగించండి
  11. నేరిచి యొక్కనాడు మన నేదురుమిల్లి జనార్దనుండు తా
    నూరికి బోవుచుండ గని యొక్కట నాపగ తీవ్రవాదులున్
    కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై
    యేరికి నైన తప్పదు ధనేశునకైనను
    ముప్పు గల్గుచో !!


    నగముపై దాగె శివుడు , పన్నగముపైన
    కోరి దాగెను విష్ణువు , కోటరమున
    కోతి దాగెను , నల్లులు కుట్టుననుచు !
    చచ్చినట్టులు మనకు మంచమ్మె దిక్కు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. కోరి దాగెను విష్ణువు కోటరమునఁ
    గొండల గృహముల నదులఁ గోవెలల వ
    నముల సకల చరాచర విమల జీవ
    రాశు లందెం దడుగు నింక రక్కసుఁ డని


    చారు కృపారసుం డడుగ శంభునిఁ గానక యెందుఁ జూడగం
    గోరి జనార్దనుం, డపుడు కోటరమందున దాగె భీతుఁడై
    పారి శనీశ్వ రాపకృతి భంగము నెంచి మనో వికారుఁ డై
    చోరుని రీతి యంచనె వచోవివశాత్మ భవాని వేదనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      విష్ణువు యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, శనిశంకరుల సంవాదాన్ని విషయాలుగా గ్రహించి ఉత్తమమైన పూరణ లందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  13. గజము నానాడు కాపాడె కంబుపాణి,
    భక్త ప్రహ్లాదున్ గాచెను బాణజిత్తు,
    అంబరీషుని బ్రోచెను అచ్యుతుండు,
    రామ దాసును రక్షించె రాఘవుండు,
    అన్నమయ్యను సాకెను అక్షధరుడు,
    మనసు మందిరమవ్వగా మాధవుండు
    భక్త సాంబ్రాజ్య మునుకాచ ముక్తి అస్త్ర
    శస్త్రములతోడ భక్తుల సంతసమును
    కోరి దాగెను విష్ణువు కోటరమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రహ్లాదు గాచెను... బ్రోచినా డచ్యుతుండు... సాకినా డక్షధరుడు భక్త సామ్రాజ్య...' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు తప్పులు సవరిమ్చుకుంటాను

      తొలగించండి
  14. పోరి లక్ష్మియె వీడఁగ, పుట్టఁ జేరి
    కోరి దాగెను విష్ణువు, కోరటమున
    నుండి గోపాలకుడు గాంచి మండి పోయి
    తనదు గోక్షీరమును ద్రాగ దాడి జేసె

    రిప్లయితొలగించండి
  15. ధారుణి భారమై చెఱగు దానవ కోటిని సంహరింపగన్
    దా రఘు రాముడై మరియు దాండవ కృష్ణుడుగాను పుట్టెనే
    కోరి జనార్దనుండపుడు, కోటరమందున దాగె భీతితో
    నా రవి పుత్రుడౌ శని యమాగ్రజుమాటలకే భవుండటన్

    రిప్లయితొలగించండి
  16. 9493846984 Dr.B.Umadevi

    కనకకశిపుసుతుని కావ కంబమందు
    కోరి దాగెను విష్ణువు,కోటరమున
    దాగెను పవనసుతుడుగాంచ దాశరథిని
    దైవలీలల నెంచంగ తరమె భువిని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాగె ననిలాత్మజుడు గాంచ...' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  17. వీరుడు పాండునందనుడు వెన్నుని చెంతకు రాకపూర్వమే
    కౌరవ జ్యేష్ఠుడంకమున కార్యము సిద్ధిల సాయమందగన్
    ద్వారక జేరవచ్చెనని వార్తవినంగనె పాండవాగ్ర్యమున్
    కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై

    రిప్లయితొలగించండి
  18. వాలి భయము సుగ్రీవుడు పారి పోయి
    వ్యాప్తమగుటచే నతనికి బాగ పేరు
    గువ్వలొదిగెడి చోటది గుహ్యముగను
    కోరి దాగెను, విష్ణువు, కోటరమున.

    రిప్లయితొలగించండి
  19. "తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
    గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్"

    కోరి దాగెను విష్ణువు కోటరమున
    సకల జీవుల హృదిలోన సంబరముగ
    వెదకి చూచుట గుడిలోన వెతలు గాదె
    వెదకి చూడగ మనలోన వెలసె నతడు

    రిప్లయితొలగించండి
  20. శనికి భయపడి గుహలోన శంభు డార్య!
    కోరి దాగెను ,విష్ణువు కోటరమున
    వెలసె నండ్రుగ రికపాటి వేంక టేశు
    బొలము దగ్గర గలయట్టి భూజమునకు

    రిప్లయితొలగించండి
  21. బాలు ప్రహ్లాదు బ్రోవగలీలజూపి
    కంబమందున కనిపించ సంబరముగ
    కోరిదాగెను విష్ణువు, కోరటమున
    శనికి భయపడి మఱుపడె శంకరుండు!!!

    రిప్లయితొలగించండి
  22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *"కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై*

    *మారిహిరణ్యకశ్యపకుమారునిమానసదైవమట్లుసం*
    *హారముజేయరాక్షసుఁమహాబలశాలినినారసింహుడై*
    *పారెనువాడు బట్టుకొన పంతముతోన్ పరుగాడెపట్టగా*
    *కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై"*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    ప్రహ్లాదునికై హరి నారసింహావతారమెత్తి పట్టుకొనగోరి పరుగాడగా మహాబలశాలి యైన రాక్షసుడు పారిపోయి కోటరమందు దూరినా
    తాను దూరి వేటాడి అసురసంధ్యవేళ వధించిన సందర్భంలో

    రిప్లయితొలగించండి
  23. దారి జనియెడి జనులను దారుణముగ
    దోచుకొనియెడి దొంగల ధూర్తమణచ
    మారువేషమున నడవి మాటువేసి
    కోరిదాగెను విష్ణువు కోటరమున!

    విష్ణువు = రాజు ( రక్షకుడు)
    నా విష్ణుః పృధివీ పతిః

    రిప్లయితొలగించండి
  24. కోరిదాగెను విష్ణువు కోటరమున
    గాదు|”శివ శనిపంద్యాన కలతలంద?
    విలువ లుడుగగ గనలేనివింతలబ్బు|
    కర్మ గాలిన శనిబట్టు?మర్మ మదియె|
    2.ఔర| యహోభిలేశుడట సంతస మందున చెంచు లక్ష్మితో
    దారియు మార్చుచున్ తిరిగి దాగుడు మూతలనాటపాటలో
    కోర? జనార్ధనుండపుడు కోటర మందునదాగె|”భీతుడై
    చేరెను నడ్డదారిగను చింతను బాపగ లక్ష్మి చెంతకున్” {చెంచు లక్ష్మి గనుపించనందున}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పంద్యాన'...?

      తొలగించండి
  25. ఆరవి యస్తమించుతరి యాయమ దూతలు రాగనప్పుడున్
    గోరిజనార్దనుండపుడు కోటర మందున దాగె భీతుడై
    యారయ నేర్వరా యతని నాకృతి జూచిన వారలప్పుడున్
    మారునుమాటలాడక నమాంతముబ్రాణముదీతురేకదా

    రిప్లయితొలగించండి
  26. వారిజాక్షులు గోపికల్ పనమునందు
    నల్లనయ్యను వెదకుచు తల్లడిల్ల
    వారిగనినంత భయమొంది వణకినట్లు
    కోరి దాగెను విష్ణువు కోటరమున
    వీటూరి భాస్కరమ్మ


    రిప్లయితొలగించండి
  27. వారిజాక్షులు గోపికల్ పనమునందు
    నల్లనయ్యను వెదకుచు తల్లడిల్ల
    వారిగనినంత భయమొంది వణకినట్లు
    కోరి దాగెను విష్ణువు కోటరమున
    వీటూరి భాస్కరమ్మ


    రిప్లయితొలగించండి
  28. సారెకు థేనుకాసురుడు చక్కని గోవుగ మారి పల్లెలో
    చేరియు నాలమందలలొ చేరగ వానిని చూచిచూడన
    ట్లారయనొక్కచో నొదిగి ఆ వికటాసురు సంహరింపగన్
    కోరి జనార్దనుండపుడు కోటరమందున దాగె భీతుడై
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆలమందలలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "మందలను జేరగ..." అనండి.

      తొలగించండి
  29. అశని పాతము కన్నను నధికము శని
    బాధననుచు బొరియనందు పార్వతిపతి
    కోరిదాగెను,విష్ణువు కోటరమున
    జూచి పలికెను విధిరాత చెడ్డ దనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాధ యనుచు బొరియయందు...' అనండి.

      తొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    హరిని స్తంభమందున చూపుమన
    హిరణ్య
    కశిపు; ప్రహ్లాదు మొరవిని కంబమందు

    కోరి దాగెను విష్ణువు; కోటరమున

    భవుడు దాగె భస్మాసుర భయము
    వలన.
    ****************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హిరణ్య కశిపు' అన్నచోట అన్వయం కుదరనట్టు అనుమానం!

      తొలగించండి
  31. ఏగ సంధికి బందిగా నెటులయె హరి
    కొలను నందేమి జేసెను కురుకులపతి
    నారసింహుని గా జన్మ నందె నెవడు
    శనికి దొరకక నెటు నుండె శంకరుండు
    కోరి దాగెను విష్ణువ కోటరమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...నెట నుండె'... టైపాటు!

      తొలగించండి
  32. శౌరిని వీడి తా వెడల సాగర కన్యక, పుట్టఁ దాగె నే
    కోరి జనార్దనుం,డపుడు కోటరమందున దాగె భీతుఁడై
    క్షీరము నష్టమయ్యెనని , గిర్రున గొడ్డలి త్రిప్పివేయగన్
    చీరెను చక్రినిన్ నుదుట చేరిన గోవును దారి మార్చగన్

    రిప్లయితొలగించండి
  33. కన్నఱపడె నింతి మెతుకు
    లన్నవి లేకింట, భక్తి హద్దులు దాటన్
    వెన్నుని భక్తుల మెప్పిం
    చన్నమె లేని నరుడు పరమాన్నము పంచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంత రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. భారపు లోహపుల్ గనులు వందల వేలల కోట్లనివ్వగా
    కోరక వేంకటేశునికి కూరిమి మీర కిరీటమిచ్చెనే
    వైరుల చేతజిక్కి కట! భాజప జేరియు కోర్టుకెక్కగా
    కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై...

    రిప్లయితొలగించండి