25, మే 2017, గురువారం

సమస్య - 2369 (ముని సాంగత్యమున...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్"
(లేదా...)
"ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్"
ఈ సమస్యను సూచించిన 'కవితశ్రీ' శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు.

66 కామెంట్‌లు:

  1. అనయము కార్యాలయమున
    పనిబడియుండెడు పతికిని పడతియె మందుల్
    కొని యివ్వగనంతట కా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. అనిలో విజయము నొందగ
    వనిత అయోధ్య పురమునకు వచ్చెన్, తన నా
    ధునితో కూడగ ఆ రా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి
  3. తన పతి వాక్యమే తనకు తప్పని ధర్మమటంచు నెంచి చ
    య్యన ముని వాటికన్ గడిపె నయ్యమ సీత కఠోరదీక్షతో
    వినయ వివేకముల్ బడసె విజ్ఞతనందె మహత్వసిద్ధితో
    ముని సహవాసముంది;సతి పొందె ముదంబున పుత్రులిద్దరిన్

    రిప్లయితొలగించండి

  4. మనదేశమునన్ ప్రాచీ
    న, నవ్య కథయౌ ధరణిజ నాగటిచాలున్
    తనుబుట్టెను,పెనిమిటి రా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. వనమున గాంచెలేమనట వాకలువేయ మనమ్ము పెండ్లి యా
    డెను తను రీతిగా మనుజుడేగ ద! శోభలనొంది చేరగన్
    ముని సహవాసమంది సతి, ముద్దుగ బొందెను పుత్రు లిద్దరన్
    ఘనముగ కొల్వరండిట సగర్వము గాను జిలేబు లై భళా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. "స్థితధీర్మునిరుచ్యతే"

    ఒనరగ వలచిన దైవము
    ఘనముగ పదునారు వేల కన్యల పతియై
    మనసును దోచిన యదుకుల
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కన ముగ్గురు కూతుళ్ళై
    మనవడు తమ కుండ బట్ట మను నాచింతన్
    బెనగగ కూతుకు కవలలు
    ముని(మొదటి) సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి
  8. తనువు పులకించ నీశుని
    ధనువున్ జేజేల నెత్త తగువాడంచున్
    మనువాడుచు తారక రా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    కనిగని పెళ్ళి బంధమును ఖాయము జేయగ ముచ్చటించగన్
    జన నట నొక్క వాసమున జారిరి వే మరులుత్పతిల్లగన్
    ఘనుడు విదేశ యానమునుగాంచె; శకుంతల కన్న మిన్నయై
    ముని(మొదటి) సహవాసమందె సతి పొందె ముదంబున పుత్రులిద్దరిన్!

    రిప్లయితొలగించండి
  10. ఇనకుల భూషణుండు కడు హేలగ నెక్కిడ చాపమంతటన్
    స్వనమున భర్గచాపమది బ్రంగెను దిక్కులు పెక్కుటిల్లగన్
    జనకుడు సంతసించి తన జానకి నిచ్చియు బెండ్లి జేయ రా
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దరన్

    రిప్లయితొలగించండి
  11. మనమున నిండిన బాధతొ
    వనమున కేగధరణిజను వాల్మీకి కనుం
    గొనిపరి చర్యలు జేయగ
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి
  12. _వనమునకు జనిన జంటకు_
    _మనమున శృంగార కేళి మాధురి సంధిం_
    _చిన పూవిలుకాడగుకా_
    _ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బాధతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "బాధను" అనవచ్చు.

      తొలగించండి
  13. వినయము గలిగిన నొకసతి
    యనయముదాసే వ జేయ హర్షముతోడన్
    ముని కాముకుడగుటననా
    మునిసాంగత్యమున నారిపుత్రులగనియెన్

    రిప్లయితొలగించండి
  14. తనువున మనసున వలపుల
    ననురాగ సుధాస్రవంతి‌ యలరగ వరమై
    మనువాడిన సద్గుణ ధా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్!

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి సమస్యకు మరో పూరణ:

    భర్తపై భార్య మౌనవ్రతం:

    ధనము తగలేయ నన్నింటిఁ గొనెద వనఁగ
    తగవులాడుచు నాపైన తప్పులుంచి
    పలుకులాడక మౌనంపు టలకతోడ
    నేరమగుఁ జేయఁ గాత్యాయనీ! వ్రతమ్ము!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మనసిడి రవి మరి సుత్రా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్
    మునుకొని రాజ్యముకొరకై
    పెనగిరి వారలు పగతుల పేరడగించన్

    రిప్లయితొలగించండి
  17. ఘన పాండురాజు తల్లికి
    జనియించిన వైనమేది?జానకి వాల్మీ
    కుని వాటిక నేమిబడసె?
    ముని సాంగత్యమున, నారి పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  18. తన చిన యత్త కారణము ధాత్రిసుపుత్రియునేగి భర్తతో
    వనమున సంచరించి పలు బాధలనొంది దురాత్ముడైన రా
    వణు చెరఁ జిక్కి యుద్ధమున వాడుగతించ కరమ్ము ప్రీతి రా
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రులిద్దరిన్

    రిప్లయితొలగించండి
  19. అనుమతి నంది నిజ పతిది
    యనిమిష పతి వాయుదేవు డట మరియున్నా
    యిన సూనుండు ఘనుడు ధ
    ర్ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్


    ఘన విరహాంబుధిన్ మునిగి కానలఁ బద్మదళాయతాక్షియే
    మనమున రామ పాదములు మన్నన తోడ స్మరించి నిత్యమున్
    వనమునఁ బుట్టపుట్టువు నపార కృపం గని, రాఘవేంద్రు రా
    ముని సహవాసమంది, సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారు,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  20. అనయము సేవజేయగ నుహర్షముదోడనదానుమౌనికిన్
    మునియునుదుష్టబుధ్ధిని దపోనియమంబును దామరల్చగా
    మునిసహవాసమంది సతిపొందె ముదంబున పుత్రులిధ్ధరన్
    మునియనునాతడెప్పుడుతమోగుణమొప్పగ దాచరించుగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదం చివర గణదోషం. సవరించండి.

      తొలగించండి
  21. ఘనముగ ప్రేమను బంచుచు
    తనమనమును దోచుకొనిన తన నాథుండౌ
    వినయుం డను నా శుభ నా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి

  22. తన సుతులెల్లరన్ చిదిమి తాపము బెంచగ నింద్రునిన్ జయిం
    చు నతి బలాఢ్యునంద దితి శుశ్రుష లందగ జేసి మెచ్చగన్
    వినతిని దెల్ప మ్రాన్పడుచుఁ బెట్టిన నిష్టల కశ్యపాఖ్యుడన్
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్
    ( హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు )

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనబలిమిని శివధనువు
    న్ననువుగ నెత్తిన రఘుపతి ననురాగముతో
    మనువాడిన సీతయె రా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

    ఘనమగు వాడి విక్రమము గల్గి యుమాపతిదైన చాపము
    న్ననువుగ నెత్తి వెల్లిగొనినా రఘురాముని పేర్మితోడ గై
    కొని సొబగైన సందడిని గూడిన జానకి చక్కనైన రా
    ముని సహవాసమంది పొందె ముదంబున పుత్రు లిద్దరిన్

    రిప్లయితొలగించండి
  24. అనయము తోడుండెదనని
    ప్రణయముగా బాస జేసి పరిణయమాడెన్
    తనువు లొకటైన వేళ ర
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్

    రిప్లయితొలగించండి
  25. మిణుగురు లనుకొని,కనులను
    చునకను గ్రుచ్చంగ,మౌని చూపు నశించన్
    మనువాడెను.చ్యవనమహా
    ముని సాంగత్యమున, నారి,పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి
  26. తన పతి యడుగులు విడువక
    మనమున వానినె తలచుచు మార్పది లేకన్
    కనుచును వానినె నిజపతి
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

    రిప్లయితొలగించండి

  27. తన సుతులెల్లరన్ చిదిమి తాపము బెంచగ నింద్రునిన్ జయిం
    చు నతి బలాఢ్యునంద దితి శుశ్రుష లందగ జేసి మెచ్చగన్
    వినతిని దెల్ప మ్రాన్పడుచుఁ బెట్టిన నిష్టల కశ్యపాఖ్యుడన్
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్
    ( హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు )

    రిప్లయితొలగించండి
  28. జనకుని పుత్రికి జానకి
    మనువాడెను శూర వీర మాన్యుల యెదుటన్
    జనులు ముదమొంద రఘు రా
    ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్.

    రిప్లయితొలగించండి
  29. కం. ఘనుడా రాముని యాజ్ఞను
    ఘనముగ బాటించి బంపె కారడవులకున్ ,
    వనమున "వాల్మీకి" యనెడు
    ముని సాంగత్యము ననారి పుత్రుల గనియెన్
    కొరుప్రోలు రాధా కృష్ణారావు

    రిప్లయితొలగించండి
  30. ఘన రాజధర్మ నియతికి
    తన పత్నిని గర్భవతిని దాశరథియు బం..
    పెను నడవికి , ప్రాచేతస
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్ !!


    జనకజ గా జనించెనట సారసవాసిని , విష్ణుతేజమే
    యినకుల దీపమై నిలిచె, నిద్దరునొక్కటిగా చరింప , రా...
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రులిర్వురన్!
    ఘనరఘువంశపూతగుణగానపరాయణచిత్తులన్ వనిన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  31. కవిమిత్రులకు మనవి...
    రేపు నేను హైదరాబాదుకు పోతున్నాను. ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకపోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  32. 9493846984  డా.బల్లూరి ఉమాదేవి.  25/5/17

    జనకుని సుతయౌజానకి
    వనిలో పతితో చరించె పదునాల్గేళ్ళున్
    ననయము గొలుచుచు నా రా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

    ఘనుడగు శౌరిని మనమున
    ననవరతము తల్చిపెండ్లి యాడిన తరుణీ
    మణియును ముదమున నా శ్యా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

    అనయము కొలుచుచు శ్రీరా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్
    వనమున పుట్టిన లవకుశు
    లినవంశతిలకుని గాంచ నేగిరి వడిగాన్.

    రిప్లయితొలగించండి
  33. 9493846984  డా.బల్లూరి ఉమాదేవి.  25/5/17

    జనకుని సుతయౌజానకి
    వనిలో పతితో చరించె పదునాల్గేళ్ళున్
    ననయము గొలుచుచు నా రా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

    ఘనుడగు శౌరిని మనమున
    ననవరతము తల్చిపెండ్లి యాడిన తరుణీ
    మణియును ముదమున నా శ్యా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

    అనయము కొలుచుచు శ్రీరా
    ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్
    వనమున పుట్టిన లవకుశు
    లినవంశతిలకుని గాంచ నేగిరి వడిగాన్.

    మనమున నెంచక ముదుసలి
    యనియాశర్యాతిపుత్రి యారాధించెన్
    వినయముజూపనట చ్యవన
    మునిసాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

    రిప్లయితొలగించండి
  34. డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
    వినుమొక విషయము సఖియా
    కనిగిరిలో నీదు చెల్లె కనిపించెను నా
    కును పిల్లలతో " నా త
    మ్ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్"

    రిప్లయితొలగించండి
  35. తనదగు మాత సేవలన తన్మయ మొందెడి పార్సి మౌనినిన్
    దినమున రాత్రినిన్ గనుచు తియ్యని నూహల లోలలాడుచున్
    ఘనముగ పెండ్లియాడగను ఘాటగు ప్రేమను నిందిరమ్మయే
    ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్

    రిప్లయితొలగించండి