12, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2704 (తనయను జెల్లెలిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్"
(లేదా...)
"తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా"

77 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కనుమా! నెల్లూరున నా
      తనయను, జెల్లెలిని,..హరుఁడు దారలుగఁ గొనెన్
      తనలో సగముగ నొకతెను,
      తన శిరమున మరియొకతెను తత్పరుడౌచున్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  2. మన కత లివియె జిలేబీ,
    కనుగట్టు చదువుట తెలియకన్ చదువంగన్
    విను యార్యాణిని, హిమగిరి
    తనయను జెల్లెలిని, హరుఁడు దారలుగఁ గొనెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విను మార్యాణిని" అనండి.

      తొలగించండి
  3. పడతికి పంచి యిచ్చె దేహమున సగభాగముగా
    తాను భవుడు
    వనితల హృదయ సరోవరమై తానీదులాడె
    చక్రధరుడు
    శక్తి రూపములుగా ఇంటి సిరులనె తనయను
    జెల్లెలిన్ హరుడు
    దారలుగా గ్రహియించె జూడుమా ఎనిమిదిగ
    మురళీధరుడు

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ


    తుహినశైలతనయ(హైమవతి) ... గంగ
    రమేశుని చెల్లెలు.. గౌరి

    దారలు..
    1) నీటిధార
    2) అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య

    ఘనతరదీక్షఁబూని తనకై తపియించి కృశాంగులైైన , సా...
    ధనమతులైన లోకహితతత్పరలైన మనోజ్ఞలైన భూ..
    జనవరదాయినుల్
    తుహినశైల రమేశులకున్ క్రమమ్ముగా
    తనయను, జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    తన చేష్టల దుష్కర్మల
    ననయము జూడంగ గలహ మగుని యేమో?
    వినయపు రేజీకటి త
    త్తనయను జెల్లెలిని హరుడు1దారలుగ గొనెన్ (1.ఒక దొంగ)

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    తనకొక కాంక్షలేమి తమ దైవత కూటమి క్షేమమెన్ని యా
    తన గను దేహమే పరుల దంచు, మఖఞబుగ నార్తి నాప గా
    దను తనవారు లేని యొక తాపసికిన్ వరుసల్ సు వావులా?(వావివరుసలుండవు)
    తనయను జెల్లెలిన్ హరుడు దారలుగా గ్రహియించె జూడుమా!

    రిప్లయితొలగించండి
  7. (హిమవంతుని పుత్రికలైన గంగాపార్వతుల కల్యాణం)
    అనయము విశ్వనాథుని మహాదరమేదురబుద్ధిమాన్యలై
    సునయనలిర్వురున్ మిగుల సుందరులున్ హిమవంతుబుత్రికల్
    ఘనముగ గంగయున్నుమయు కమ్రసుమాంజలులీయ శైలరాట్
    తనయను జెల్లెలిన్ హరుడు దారలుగా గ్రహియించె జూడుమా!

    రిప్లయితొలగించండి

  8. హిమవంతుని కుమార్తెలు శైలజ,గంగ

    అనవమ గాధ లివ్వి సఖి యద్భుత మైనవి కాలకాలునిన్
    మనుగడ లో జనాళి మది మన్నిక గాంచిన వీ పురాణముల్
    మనకత లివ్వి నేర్వదగు మాన్యముగా చెలి, కొండరాయుడిన్
    తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్సులు.కొడుకు-కోడలు,కూతురు-అల్లుడు,మనుమలతో
    యూరప్ పర్యటనకు వెళ్ళుతున్నాను.పునర్దర్శనం పదిహేను రోజులతరువాత.

    రిప్లయితొలగించండి
  10. ఘనుడౌ శ్రీ హరి ముద్దుల
    తనయను,చెల్లెలును హరుడు దారలుగ కొనెన్
    తన శిరమం దొక్కరికిని
    తనలో సగ మొక్కరికిని దానంబిడుచున్

    శ్రీహరి పాదముల నుండి పుట్టినది కావున గంగ కూతురు .హరికి చెల్లెలు పార్వతి . ఇరువురను హరుడు పెండ్లాడెనను భావన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  11. తనశిర మున విష్ణుపదియె
    తనలో సగ భాగమాయె దాక్షా యణియే
    గనరే లౌకికులు బలుకఁ
    "దనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్"

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2704
    సమస్య :: *తనయను జెల్లెలిన్ హరుడు దారలుగా గ్రహియించెఁ జూడుమా.*
    సందర్భం :: ముల్లోకాలలో గొప్ప ఉదార గుణం గలవారు ఎవరు అని చర్చ జరుగుతూ ఉండగా {నాచికేత నయనుడు అంటే అగ్నినేత్రుడైన}శివుడు మాట్లాడుతూ ‘’ ఉదార గుణంలో మిన్న కన్నతల్లి మాత్రమే. ఈ నా చింతనలో ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. సరస్వతీ మాతను, లోకమాతగా పిలువబడే లక్ష్మీదేవిని, సర్వ మంగళ యైన పార్వతిని చూడండి. ఈ ముగురమ్మలే గొప్ప ఉదారమనస్కలు అని చెబుతూ తన మనస్సులో వాణిని, పార్వతిని, తన చెల్లెలైన లక్ష్మిని ఉదారలుగా గ్రహించిన సందర్భం.

    తన యనుకంపతో ప్రజల ధన్యులఁ జేయును మాత, నాదు చిం
    తన, యనుమాన మెందుల కుదారులు వీరె యటంచు నాచికే
    తనయను డా త్రిమాతలను ధన్యతఁ జూపెను, వాణి మేనకా
    *తనయనుఁ జెల్లెలిన్ హరుఁ డుదారలుగా గ్రహియించెఁ జూడుమా.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

    2. ఉదారులు అంటాము కదండి ? ఉదారలు అనవచ్చా కోట వారు ?

      జిలేబి

      తొలగించండి
    3. స్త్రీలను గుఱించి కాబట్టి ఉదారలు అని అన్నానండీ.

      తొలగించండి
  13. డా.ఎన్.వి.ఎన్.చారి
    తనశిరమునగంగమ్మను
    తనవామాంకము నొసంగి తాదా త్మ్యమునన్
    కనుచును విష్ణుని, జలజా
    త నయను జెల్లెలిన్ హరుడు దారలుగ గొనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

  14. అనుజయనున్ గదా హరియె యద్రితనూజను ప్రేమమీరగా
    తనయయెకాదె గంగ యరిధారి పదమ్ముల చెంతపుట్టుటన్
    గనుకనె తప్పులేదిటుల గ్రక్కున పల్కిన విష్ణమూర్తికౌ
    *తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా*

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [శివుడు పార్వతిని, గంగను వివాహమాడిన విషయమునుం గూర్చి కైలాసవాసులు ముచ్చటించుకొను సందర్భము]

    మన మలరార దేవతలు మక్కువఁ జూడఁగ, మౌని సప్తక
    మ్మును నిడ దీవెనల్, జగము పొంగులు వారుచు మ్రొక్కుచుండఁగా,
    నిన శశి నేత్రుఁడౌ హరి రమేశుఁడు మధ్వరి విష్ణుమూర్తికిన్
    దనయను, జెల్లెలిన్, హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,

    ఘన మహి మాన్వితుండు , విషకంఠు , డనంతుడు , సేవకావళీ

    వినుత మహోద్భటుం , డమర బృంద సురక్షకు , డా సతీ సతీ

    మనసిజ తుల్యు డైన పరమాత్ముడు , శూలధరుండు , భూమి భృ

    త్తనయను - జెల్లెలిన్ హరుడు దారలు గా గ్రహియించె జూడుమా !



    { ఉద్భటుడు = శ్రేష్ఠుడు , శ్రేష్ఠగుణములు గలిగిన ‌ వాడు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  17. కనుగొన ప్రభువుకు సహజము
    మనువాడగ నక్కచెల్లి మగతన మంచున్
    ఘనమగు నటు హిమవంతుని
    తనయను జెల్లెలిని హరుడు దారలుగ గొనెన్!

    ప్రభువు = రాజు, ఈశ్వరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనువున భాగమై దనరు తామసహారిణి పార్వతీ సతిన్
      ఘనమగు శీర్షమున్ దుముకు గంగను మాత త్రిలోక పావనిన్
      దనరగ వైభవమ్ము కడు దక్షత జూపుచు శైలరాట్పతిన్
      తనయను జెల్లెలిన్ హరుడు దారలుగా గ్రహియించె జూడుమా!

      తొలగించండి
    2. రెండవ పాదములో “శీర్షమున్ దురిమి “ గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      శైలరాట్పతి....?

      తొలగించండి
    4. ఆర్యా! పొరపాటు శైలరాట్ప్రియా తనయను యని ఉండాలి సవరిస్తాను! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి

    5. తనువున భాగమై దనర తామసహారిణి పార్వతీ సతిన్
      ఘనమగు శీర్షమున్ దురిమి గంగను మాత త్రిలోక పావనిన్
      దనరగ వైభవమ్ము కడు దక్షత జూపుచు శైలరాట్ప్రియా
      తనయను జెల్లెలిన్ హరుడు దారలుగా గ్రహియించె జూడుమా!

      తొలగించండి
  18. అనురాగంబునజూడుము
    తనయనుజెల్లెలిని,హరుడుదారలుగగొనెన్
    సునయనగంగను గిరిజను
    ననురక్తులుగలుగుకతన హర్షముతోడన్

    రిప్లయితొలగించండి
  19. తన కింక సంతతి కలుగ
    దని నుడువఁగ వైద్యు లెల్లఁ దనదు ననుఁగు మి
    త్రుని దారిద్ర్యాకలితుని
    తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్

    [దారలు = దానములు (దత్తత)]


    ఘన మగు బ్రహ్మ వంశమునఁ గల్గి దురాత్ముఁడునై మహా మద
    మ్మున విహరించి లోకములు మూర్ఖత మీఱఁగ ముజ్జగమ్ములం
    గనులను గాంచి నంతటను గ్రౌర్యమునన్ దశకంఠుఁ డన్యపుం
    దనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా

    [హరుఁడు = అపహరించువాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  20. క: వనమాలి సతము మెచ్చెడి
    తనయను, జెల్లెలిని, హరుఁడు దారలుగఁ గొనెన్
    తనువున సగమిచ్చి శివకు
    తనతలపై గంగకిచ్చె స్థానము నెలమిన్

    రిప్లయితొలగించండి
  21. తన శిరము న గంగ నిలిపి
    మును కొని తాన ద్రిసు తను ముచ్చట పడి యు న్
    మను వాడె ను గా జలజా
    త నయ ను చెల్లెలి ని హరుడు దార లు గ గొనె న్

    రిప్లయితొలగించండి
  22. తనమది దోచగా కలిగి తద్దయు నర్మిలి కంబుపాణికిన్
    తనయను, జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా
    తనువున నర్థభాగమును తామసి కిచ్చి కరమ్ము ప్రీతితో
    తనశిరమందునన్ తగిన స్థానము నిచ్చెను గంగకిచ్చతో

    రిప్లయితొలగించండి
  23. వినుటకు వింతగాదు గద|విశ్వమునందునశక్తి,భుక్తియే
    ననువుగ పెద్దజేసి తనయాశయమున్ హిమవంతుడెంచి తా
    తనయను జెల్లెలిన్ “హరుడు దారలుగా గ్రహియించె” జుడుమా
    మనుగడ కిద్దరైరి గద మంగళ దాయిని,గౌరిజేరియున్| {హిమవంతునిపుత్రికపార్వతి,హిమమందుబుట్టినగంగసవతులైరిహిమవంతునిచెల్లి

    రిప్లయితొలగించండి
  24. తనయౌను హరికి గంగయె
    కనగా చెల్లెలె గదమఱి గౌరియె హరికిన్
    వినుము సుమిత్రా! శ్రీహరి
    "తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తనయ యగు' అనండి.

      తొలగించండి
  25. అనునయమొప్పగామదినిహర్షమునొందుచుజూడుమాదగన్
    దనయను జెల్లెలిన్హరుడుదారలుగాగ్రహియించెచూడుమా
    తనువుననర్ధభాగమునుదాయుమకిచ్చుచుశీర్షమందునన్
    దనర గగంగకిచ్చెనుగదామసినాధుడుసంతసంబుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దైవముగ... దా నుమ కిచ్చుచు' అనండి.

      తొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (భోళా శంకర నంది వాహనా!)

    వినకయె వేదవాక్కులను వెండివి కొండల పాఠశాలలో
    చనుచును వల్లకాడులున చంద్రుడు లేని నిశీధమందునన్
    గునుసుచు నారదాదుల ఖగోళపు గాధల పాత్రలందునన్
    కనుగొన లేక దారలుగ కాని లతాంగుల,...విష్ణుమూర్తికిన్
    తనయను, జెల్లెలిన్, హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!


    దారలు కాని లతాంగులు = బ్రహ్మచారిణులు

    గమనిక: నేను శివభక్తుడను

    రిప్లయితొలగించండి
  27. కందం
    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనె భక్తి గలుగు పెనుజోగి కథల్
    మనల దయఁజూడ మాపతి
    తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్

    రిప్లయితొలగించండి
  28. చంపకమాల
    వినతి భగీరథుండిడఁగ వేడిమికన్దొర గంగఁ దాల్చెనే
    వినతి సురాది దేవతలు వేడఁగ పార్వతి నాథుఁడయ్యెనే
    వినతి పరోపకారమన వేడుక జేయఁగ విష్ణుమూర్తికిన్
    దనయనుఁ జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా 

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    తనయను జెల్లెలిని హరుఁడు
    దారలుగఁ గొనెన్

    సందర్భము: ఘను డెట్లాయెనో..
    మీరే చెప్పాలి మరి!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    తను విచ్చి తాను సగమై..

    తన తలఁ దాకట్టు పెట్టి తరుణికి వశుడై..

    ఘను డె ట్లాయెనొ! శ్రీ హరి

    తనయను జెల్లెలిని హరుఁడు

    దారలుగఁ గొనెన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    12.6.18

    రిప్లయితొలగించండి
  30. కనరే సుదతుల దల్లిని
    తనయను జెల్లెలిని; హరుడు దారలుగ గొనెన్
    తనువున పేర్మిన్ దన సతు
    లను నిల్పి జగతికి జాట లలనల ఘనతన్ !

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    తనయను జెల్లెలిని హరుఁడు
    దారలుగఁ గొనెన్

    మాన్యశ్రీరాణిసదాశివమూర్తిగారిసూచనలతో..

    సందర్భము: సతీదేవి దక్ష యజ్ఞంలో ప్రాణాలు త్యజించి ము క్కను వేలుపును (ముక్కంటిని) ఒంటరివాణ్ణి చేసివేసింది. ఆతడు గాఢ తపస్సుతో గడుప దొడంగినాడు.
    చాలా కాలానికి జలజాత నయనుని
    (శ్రీ హరి) చెల్లెలైన పార్వతీ దేవి సేవలకు అలరినాడు. హరు డామెను చివరికి దారలుగా (భార్యగా.. భార్యలుగా) పరిగ్రహించినాడు.
    దారా శబ్దము నిత్య బహు వచన రూపము. ఏక వచనానికి కూడ బహు వచన రూపాన్నే వాడుతారు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మును సతి యజ్ఞంబున ము

    క్కను వేలుపు నొంటి సేయ

    గాఢ తపమునన్..

    ఘన సేవ కలరి జలజా

    త నయను జెల్లెలిని హరుఁడు

    దారలుగఁ గొనెన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    12.6.18

    రిప్లయితొలగించండి
  32. [6/11, 2:22 PM] Dr Umadevi B: పేరు:డా.బల్లూరి ఉమాదేవి
    కూరిమితో మెచ్చెను పూ

    జారులు నుతియింపఁగ హరి ,శైలజఁ గూడెన్

    చేరుచు చెంతకు శివుడే

    పోరున తారకు దునిమెడి పుత్రుని కొరకై.


    2.ధారుణిలో బుట్టెను పూ

    జారులు నుతియింపఁగ హరి, శైలజఁ గూడె

    న్నారుద్రుడె తపమును విడి

    తారహితోడను సతతము తన్మయుడగుచున్.
    [6/12, 1:08 PM] Dr Umadevi B: పేరు:డా.బల్లూరి ఉమాదేవి


    అనఘుండౌ  శ్రీనాథుని

    తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్

    వినయముతో తలపైతా

    నునిచెను గంగను సగమయి యొప్పెను సతియే.

    రిప్లయితొలగించండి
  33. తనకటు తోడ బుట్టినది తల్లియు గంగమ చెల్లెలౌనులే
    తనకటు ప్రీతి బుట్టినది తల్లియు పార్వతి కూతురౌనులే
    కనగ వితండ వాదమున కష్టము తీర...హిమాలయాలకున్
    తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి