17, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2709

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"
(లేదా...)
"శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

69 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. సాల్వుడు కొచ్చెను పేపరు :)

      సాల్వు కాని సమస్య :)


      జిలేబి

      తొలగించండి

    2. సరికొత్త పంథా లో " పూరిం" చిన హాట్ హాట్ జిలేబీలు ఉచితము ఆఫరు స్టాకు వున్నంత వరకే
      ఆలసించిన ఆశాభంగము

      భలే మంచి చౌకబేరము :)


      జిలేబి

      తొలగించండి
    3. ఒక సారి కాదు...రెండు సార్లు గతంలో ఇవ్వబడినది. ఐతేనేమి? మరీ మంచిది...క్రొత్త పూరణలు వస్తాయిగా!

      తొలగించండి
    4. కంది శంకరయ్య గారు:

      "ఏమిటో.... ఈమధ్య మతిమరుపు మరీ ఎక్కువౌతున్నది. ఇచ్చిన సమస్యలనే మళ్ళీ ఇస్తున్నాను. ఇప్పటి కిప్పుడు సమస్యను మార్చలేను. ప్రయాణంలో ఉన్నాను కదా! మన్నించండి. ఈరోజు కీ సమస్యనే ఉండనిద్దాం."

      తొలగించండి
  2. ఇకనెవ్వ డెచట వెదుకగ
    శుకయోగికి నల్లుఁ డయ్యె? సురనది సుతుఁడే
    నొకడును నొకడే పొందుగ
    నకళంకుడు భారతమున నందరు పొగడన్

    రిప్లయితొలగించండి

  3. సకియా! వ్యాసుడెవరికి జ
    నకుడు? జనకునికి రఘుపతి? నాయన కొరకై
    సకలము విడిచిన వాడో?
    శుకయోగికి; నల్లుఁ డయ్యె; సురనది సుతుఁడే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. నకులా! వ్యాసుడెవనికి జ
    నకుండు? కృష్ణుండు కంసున కిలను వరుసే
    మి? కురుపితామహుడెవడన
    శుకయోగికి, నల్లుడయ్యె , సురనది కొడుకే

    రిప్లయితొలగించండి
  5. నికరముగ వ్యాసు డెవరి జ
    నకుడు ?ద్రుపదరాజునకిల నరుడేమగునో
    యి ?కురుపితామహుడెవ్వరు?
    శుకయోగికి, నల్లుడయ్యె, సురనది కొడుకే!!!

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి క్రొత్త పూరణ

    వికసించెన్ నవపద్మపంక్తి ధరణిన్ , వేదండసంఘంబులున్
    మకరందమ్మును గ్రోల వ్రాలినవి పద్మశ్రేణిపై , వాటి ధా...
    టికి నబ్జమ్ములు నవ్వె జూడుమనినట్లే దోచునీ వాక్యమున్
    శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాత పూరణ

      అకలంక ప్రథితాత్మభావ వర భక్త్యాయత్త చిత్తమ్మునన్ !
      ప్రకటానంత సహస్రనామగత సారాంశ ప్రబోధమ్మునన్
      సకల స్త్రీజన సంగహీన ఘన భాస్వద్బ్రహ్మచర్యమ్మునన్
      శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు:

      "ఎన్ని మారు లొసగ నన్నిమారులు మీరు
      పూరణమ్ము జేయు పూజ్యులయ్య
      వరములెన్ని గొనిరొ వాజ్ఞ్మాత మెచ్చంగ
      పలుకు పలుకు మాకు పులకరింత!

      👌🏼👏🏻🙏💐🌹🙏🙏"

      తొలగించండి
    3. శ్రీ సహదేవుడు గారూ నమోనమః.. వాఙ్మాత.. టైపాటు.. 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  7. 'తికమక'కూడనిదెవరికి?
    స కరుణుండగు రాముడెట్లు జనకున కయ్యెన్?
    చకితపు శపథముఁజేసెను?
    శుక యోగికి-నల్లుడయ్యె-సురనది సుతుడే.

    రిప్లయితొలగించండి
  8. ఒకచోట సంశయింపక
    చకచక బొంకులను బల్కు స్పర్థను నొకరుం
    డకటా! యిట్లాడెను గద!
    “శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"

    ఒకడి ట్లాడుచునుండె సత్యమిది యోగ్యుండౌ శకారుండు వా
    డకలంకాత్ముడు వంశకారకుడు నా కత్యంత మోదంబునన్
    సకలార్థంబులు జూచినట్టి ఘనుడన్ క్ష్మావాసులారా! భళా!
    శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరయ్య గారు:

    "ఏమిటో.... ఈమధ్య మతిమరుపు మరీ ఎక్కువౌతున్నది. ఇచ్చిన సమస్యలనే మళ్ళీ ఇస్తున్నాను. ఇప్పటి కిప్పుడు సమస్యను మార్చలేను. ప్రయాణంలో ఉన్నాను కదా! మన్నించండి. ఈరోజు కీ సమస్యనే ఉండనిద్దాం."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. చింతలూరి వారి ఆయుర్వేదశాల దివ్యౌషధము :)

      మతిమరుపే నౌషధమౌ
      స్థితముగ జీవనము సాగు చింతలు లేకన్
      జతజేర్చును సమరసమును
      బతుకున కదియే జిలేబి పరిపరి విధముల్ :)

      జిలేబి

      తొలగించండి
  10. నూర్గురు సుతుల పిదప సుతను బడసె
    గాంధారి ప్రేమలు మీరగ
    పూజ్యులగు బంధువులు హితులదె దుస్సల
    పెండ్లి కొచ్చి చేరగ
    దుస్సల మొగుడు జయధ్రధుడు శుకయోగీంద్రున
    కల్లుడయ్యె గద
    భీష్ముండంద రుప్పొంగగన్ కులక్షేమమే కాంక్షించెను
    తన యెద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇదెట్లాంటి వరసండి ?

      దుస్సల మొగుడు జయధ్రధుడు శుకయోగీంద్రున
      కల్లుడయ్యె గద ?

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబిగారూ! నాకు తోచినంత మేరకు

      ధృతరాష్ట్రుడు, శుకుడూ కూడ వ్యాసుని కొడుకులే గదా! కనుక వరుసకు సైంధవుడు శుకయోగికి కూడ అల్లుడవుతాడు కదా!

      తొలగించండి

    3. ఇదేదో బాగుందండోయ్ బ్రహచారుల సమస్యకు పరిష్కారం చిక్కినట్టే వుంది

      అదురహో రమేశా!

      జిలేబి

      తొలగించండి


  11. సకియా! వ్యాసుడు తండ్రి తానెవడికో? సాక్షాత్తు భూభృత్తు తా
    ను కపోదమ్మును త్రెంచి సీత మగడై నుంపారుచున్ రాజుకున్?
    సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యు డెవ్వండయెన్ ?
    శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద; భీష్ముం డంద రుప్పొంగగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2709
    *శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్.*
    బ్రహ్మచారి యైన శుకయోగికి భీష్ముడు అల్లుడయ్యాడు, అందఱూ పొంగిపోయారు. అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీ శుకయోగి పరీక్షిన్మహారాజుకు భాగవతమును వివరిస్తూ ఉండగా ఒక పామరుడు భక్తితో నమస్కరిస్తూ ఓ వ్యాసపుత్రా! మీరు మాకు ఎన్నో కథలు చెప్పినారు. భీష్ముడు హోత్రవాహనుని కుమార్తెలగు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురిని స్వయంవర సభలో గెలిచి ఆ కాశీ రాజుకు అల్లుడయ్యాడు కదా. ఆ వివాహ విశేషాలను గుఱించి మాకు చెప్పండి అని అజ్ఞానంతో అడిగే సందర్భం.

    సుకమున్ బొందగ పామరుం డడిగెడిన్ శుద్ధాత్ముడై మ్రొక్కుచున్
    *శుకయోగీంద్రున; కల్లు డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్*
    సుకృపాశీలికి హోత్రవాహనునికిన్, శోభిల్లె కాశీపురం
    బకటా! తెల్పుము పెండ్లి ముచ్చటల మా కందించుమా చెచ్చెరన్.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (17-6-2018)

    రిప్లయితొలగించండి
  13. మకరాంకుడు హరుని కొడుకు
    నకులుడు హనుమాను సుతుడు నవ్వగనేలా?
    తికమక శకారు వాక్కుల
    శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే!

    రిప్లయితొలగించండి
  14. అకళంక వ్యాసుడే పిత;
    సెకకంటియె నగపతికిని చెన్నలరంగన్;
    చకచక యనిలో పోరెను
    "శుకయోగికి ;నల్లుఁ డయ్యె; సురనది సుతుఁడే"

    రిప్లయితొలగించండి


  15. మిగతా సగం జీపీయెస్ వారు పూరించెదరు :)


    తకరారేమియు లేదు కైపదములో, దమ్మున్న పార్థుండ హో,
    శుక! యోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద ! భీష్ముం డంద ఱుప్పొంగగన్

    ....


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పూరణ ఆటవిడుపులో...

      వరుసలు కట్టడం సీతా దేవి వంతు...

      తొలగించండి


    2. అకటా! భారత మేమి యిట్లు గలదే యంచున్ విచారంబకో?
      తకరారేమియు లేదు కైపదములో, దమ్మున్న పార్థుండ హో,
      శుక! యోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద ! భీష్ముం డంద ఱుప్పొంగగన్
      సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యుడాయెన్ సుమా

      జిలేబి

      తొలగించండి
  16. సీసము
    అప్సరస, ఘ్రుతాచి యా బాదరాయణుల్ తల్లి దండ్రుల్ గదా తరచి చూడ
    యే ముని వరునకున్, యీసుడు దక్ష ప్రజాపతి కేమాయె, చావు తాను
    కోరిన సమయాన కూడు నట్టి వరము బడసిన వీరుడెవడు తెలుపు త
    నయ, (శుక యోగికి, నల్లుడయ్యె, సురనది కొడుకే) , గా విను, తెలుగు పద్య

    ములను, కవులు బహు విచిత్రముగ లిఖించె
    దరు ఘనత తోడ, కనవమ్మ తనయ, శంక
    రార్యు లిచ్చు సమశ్యలన్, పారు వరద
    లై కవుల పూరణమ్ములు లక్షణముగ

    జిలేబి గారు వేడి జిలేబికి అర్హత పొందానా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సీసం వేడి ముందు జిలేబి వేడి యేపాటి :)

      అదురహో పూసపాటి వారు మకరందాన్ని సీసాలో బంధించేరు :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    2. ధన్యవాదాలు ఎప్పుడు జిలేబి పాకం(లో)నోట్లో పడుతునా అని ఎదరు చూస్తున్నా ఫరవాలేదు కవుల పంక్తి చివరలోనైనా నాకు సీటు దొరకింది గురుతుల్యులందరికి పెద్దలైతే వందనాలు పిన్నలైతే ఆశీస్సులు

      తొలగించండి

  17. ఇప్పుడే మా శకారునికి కేల్మోడ్చి ప్రార్థన మొదలెట్టారు :) పరిష్కారం వస్తే చెబ్తా :)


    ముకుళిత హస్తపు ప్రార్థన!
    శకారుడా యిమ్మ కంది శంకరుల సమ
    స్యకు పూరణ! కైపదమిది
    "శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. ఒకనాడో యవధాని పృచ్ఛకుల నోహో యంచు మెప్పించె వా
    చక చాతుర్యము వ్యంగ్య హాస్యముల నాసాంతమ్ము యోజించి, పృ
    చ్ఛకు డొక్కండిడెఁ ధాటి నాపనొక క్లిష్టంబైన ప్రశ్నంబిటుల్
    “శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్”౹౹

    రిప్లయితొలగించండి
  19. ప్రస్తుతానికి ఓ సరదా పూరణ:

    ఎకసెక్కెము లాపండిక
    శుకుడా భీష్మునికిఁ జూడ సుతుడౌ వరుసన్
    సుకవుల కిటు చెప్పఁదగున
    *"శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"*

    రిప్లయితొలగించండి
  20. శుకయోగిబ్రహ్మచారియ
    తికమకగానుండెసామి!తెలియగలేమిన్
    శుకునికిభీష్మునిబంధము
    శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే?

    రిప్లయితొలగించండి
  21. సకలమెరింగిన వారున్
    శుకునకణువుయల్లుడనియె సుకరముగ ననన్ ;
    చకితమిది వినగ నెవ్విధి
    శుకయోగికి నల్లుడయ్యె సురనది సుతుడే!

    రిప్లయితొలగించండి
  22. చకచక నొకరు oడు పలికె
    పకపక నవ్వి పరి హాస భాసురు డ యి తా
    నె కసె క్క ము లాడు చపుడు
    శుక యోగి కి నల్లుడ య్యే సుర నది సు తు డే !

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. యాదృచ్ఛికముగా నాటి యీ రెండు పూరణయుగములను గురువు గారు సమీక్షించ లేదు.

      7/7/2017 నాటి నా పూరణలు:

      సుకరమ్ముగ నా యణుహుఁడు
      శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే
      శుకునకు పినతండ్రి మురియ
      సకల జన సమక్షమునను సంతోషముగన్


      శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్
      వికటంబౌ వచనమ్ము లాడఁ దగునే భీష్ముండు సూడంగ తం
      డ్రి కుమారుం డగు వ్యాస నందనుఁడు సంప్రీతమ్ముగన్ ధాత్రినిం
      బ్రకటంబే యిది యెల్ల వారలకు సద్బాంధవ్యముల్ దల్చవే


      12/3/2017 నాటి నా పూరణలు:

      ప్రకటమ భవకారకుఁ డా
      శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
      యకళంకు నగాధిపునకు
      నిక ముద మొసఁగఁగ నభవుఁడు హిమవంతునకున్

      [భీష్ముఁడు = శివుఁడు]


      వికలంబైన నిజేచ్ఛ పార్వతి గిరిం బ్రీతిన్ తపం బాచరిం
      చి కరంబా పరమేశ్వరున్ గుఱిచి తాఁ జిత్తంబు మెప్పించఁగం
      బ్రకటామ్నాయ విభాగుడే నుడివె నాద్వైపాయనుం డివ్విధిన్
      శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్

      [భీష్ముఁడు = శివుఁడు]


      తొలగించండి
    2. సకలము మా కెఱుకే యని
      కుకవుల్ పల్కిరి శ్రుతి యుగ ఘోరమ్ముగ నే
      రక వావి వరుస లివ్విధి
      శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే


      శుక యోగీంద్రున కౌను భీష్ముఁ డట సంశోధించ చిన్నాన్నయే
      శుక యోగీంద్రుని యల్లుఁడే సుర నదీజుం దాతగం బేర్కొనుం
      బ్రకటంబై తెలియంగఁ బౌత్రుల కిటుల్ భాషించె, వైభ్రాజుఁడే
      శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద, భీష్ముం డంద ఱుప్పొంగగన్

      [వైభ్రాజుఁడు = విభ్రాజుని కొడుకు, అణుహుడు]

      తొలగించండి

  24. అకలంకుడు వ్యాసుడు పిత
    శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
    చకచక తపమ్ము మదనుడు
    కకవిక చేయ వరియించి, గౌరి గురువుకున్
    గురువుః తండ్రి

    రిప్లయితొలగించండి
  25. అకటాయేమనిజెప్పనోపునిటమాయాలో కమేచూడగన్
    "శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"
    శుకయోగీంద్రునిబంధమేయెఱుగ,భీష్ముండా ప్రతిఙ్ఞన్గదా
    యికనెన్నండునుబెండ్లియాడననిజేసెన్గా దెయాహాయనన్

    రిప్లయితొలగించండి
  26. ఒకటే కూతురు దుస్సలన్ మనువు నందోజించ సింధీశుడే( వరుసకు)
    శుకయోగీంద్రున కల్లుడయ్యె; భీష్ముండంద రుప్పొంగగన్
    తకరారేమియు లేక తాతయయె తత్వంబున్ దెల్పగా నని
    న్నకలంకాత్ముడు కృష్ణుకున్ గలుగు సాహస్రాహ్వముల్ గూర్చుచున్!

    కిట్టింపు! 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదంలో “ కల్లుడయ్యెగద” అని ఉండాలి! పొరపాటుకు చింతిస్తున్నాను!

      తొలగించండి
  27. రిప్లయిలు
    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (పీవరీయము)

      అకటా! భార్యకునల్లుడుండె నతడే హాయిన్ కులాసమ్ముగన్
      శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద; ..భీష్ముం డంద రుప్పొంగగన్
      మకరంబందు ప్రభాకరుండొదవు నేమమ్మున్ ప్రతీక్షించుచున్
      నికరమ్ముంగను ప్రాణముల్ విడిచి శ్రీనిన్ వొందె స్వర్గమ్మునన్

      ఒదవు = వచ్చు
      నేమము = కాలము
      నికరము = శ్రేష్ఠము
      శ్రీ = కీర్తి

      దేవీ భాగవతం ప్రకారం శుకమహర్షి పీవరిని పెండ్లాడి నలుగురు పుత్రులను, ఒక పుత్రికను పొందెను:

      https://en.m.wikipedia.org/wiki/Shuka

      నా మాటను నమ్మకపోతే గౌరీభట్ల వారినడగండి...

      తొలగించండి
    2. పీవర్యస్య జాయా...అని వేదంలో కూడా ప్రస్తావించబడింది.
      శుకమహర్షికి నలుగురు పుత్రికలు మాత్రమే.
      శుకయోగి బ్రహ్మచర్య నియమంతో ఉన్నారు.
      బ్రహ్మచర్యాశ్రమము వేఱు.
      శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ నియమంతోనే బ్రహ్మచారి అనే కీర్తి పొందినాడు. 🙏🏻


      జననంలోనే స్త్రీ స్పర్శ లేని నాకు వివాహమెందుకని శుకులు, "న గృహం బంధనాగారం" అని వ్యాసులూ - దేవీభాగవతంలో 2అధ్యాయాలు చక్కనిచర్చ ఉంది. 🙏🏻

      గౌరీభట్ల బాలముకుంద శర్మ

      తొలగించండి
  28. తికమక బెట్టుగద ననే
    క కథలు భారతమునందు ; కడుకొని యత్నిం
    చి కనుంగొనవలె నెవ్విధి
    శుకయోగికి నల్లుడయ్యె సురనది సుతుడే?

    రిప్లయితొలగించండి
  29. సకల పురాణముల రచన
    ల కాననివరుసలు శంకరాభరణా
    న కనబడుచుండు చూడుము
    శుకయోగికి నల్లుడయ్యె సురనది సుతుడే

    రిప్లయితొలగించండి
  30. సకలారాధితశంఖచక్రధరకంసారాతిహింసాసురాం
    తకుడౌ శ్రీహరియే నిరంతరపదధ్యానైకగమ్యంబు, శ్రీ
    శుకయోగీంద్రున, కల్లుడయ్యె గద భీష్ముండదరు ప్పొంగగన్
    ప్రకటవ్యోమనదీసహోదరుడు నా ప్రద్యుమ్నుకుం బంధువై.
    శ్రీ విష్ణుపాదోద్భవి గంగ
    లక్ష్మీనారాయణుల పుత్రుడు మన్మథుడు (ప్రద్యుమ్నుడు).

    రిప్లయితొలగించండి
  31. ఒకగురువడుగగ శిష్యుడు
    "శుకయోగికినల్లుడయ్యె సురనదిసుతుడే
    అకలంక మెరుగడాతడు
    పకపక నవ్వుచును దెలిపె బాలుడు బడిలో

    రిప్లయితొలగించండి
  32. శుక యోగికి ఇవాళ మార్కులు ఎక్కువ రాలేదు సుమీ

    రిప్లయితొలగించండి
  33. "శకునికి భీముడు పుత్రుడు,
    శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"
    తికమక వలదని యొక్కడు
    పకపక నవ్వగ సభికులు పలికెను గదరా!

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      ప్రకటించంగ సమస్య కంది వరులున్ ప్రాభాత కాలమ్మునన్
      యకలంకమ్ముగ రాగమూద 'మురళీ' గానాంబుధిన్ దేలుచున్
      సకళార్థమ్ముల"అస్తు" "అస్తు" యనఁగ భాషాధిక్య విభ్రాజులున్
      శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్!

      తొలగించండి
    2. అవధానులు శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచిత సవరణతో :

      మత్తేభవిక్రీడితము
      ప్రకటింపంగ సమస్య కంది వరులున్ ప్రాభాత కాలమ్మునం
      దకలంకమ్ముగ రాగమూద 'మురళీ' యానందమునన్ దేలుచున్
      సకళార్థమ్ములతో తథాస్తనఁగ భాషాధిక్య విభ్రాజులున్
      శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్!

      తొలగించండి
  35. అకటానేడిట శంకరాభరణ బ్లాగందందరుద్దండులౌ
    సుకవుల్ బుద్ధికి పెట్టుచున్ పదును వ్యాసున్, భీష్మునిన్, యోగియౌ
    శుకునిన్ చుట్టరికమ్ముతోకలుపుచున్ చోద్యమ్ముగా నిట్లనెన్
    శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్

    రిప్లయితొలగించండి
  36. బాగు బాగు జి వి యస్ వారూ! మురళీకృష్ణ గారికి మంచి ప్రశంస! 👏👏👏💐💐💐

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే

    సందర్భము: పతి అనగా పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రునికి నమస్కరించగా.. ఆతడు "విను" మని ఇలా చెప్ప సాగినాడు.
    కాశీ రాజు కుమార్తెలైన అంబ అంబిక అంబాలికల స్వయంవరం జరుగుతున్నది. భీష్ముడు ప్రవేశించినాడు. రాజలోకమంతా ఒక్కసారి ఆతనివైపు చూచి.. భీష్ముడు.. భీష్ముడు.. అని గుసగుసలు పెట్టసాగారు. విదూషకుడు విని కాశీ రాజుతో యిలా అంటున్నాడు.
    "భీష్ముడే మన అల్లుడైనాడు మహారాజా! ఇక మన పని చకచకా పూర్తి అవుతుంది."
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఇక "విను" మనె.. పతి మొక్కగ
    శుకయోగికి; "నల్లుఁ డయ్యె
    సురనది సుతుఁడే!..
    చకచక కాశీ రాజా!
    ఇక పని యగు" ననె విదూషకేంద్రుడు సభలో

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    17.6.18

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే

    సందర్భము: సులభం
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    శుకయోగి మామయై నపు
    డకలంకుడు భీష్మున కిల నాశ్చర్యంబే!
    ఇక పిలిచి యడుగు డెవరినొ!
    శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    17.6.18

    రిప్లయితొలగించండి
  39. కందం
    వికటించెనొ కళ్ళు గొనగ!
    శుకునకు నాలి యసలేది? చూలియు లేదే?
    సుకరంమ్మాడ దగవె? యే
    శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే

    ... గుండా వెంకట సుబ్బ సహదేవుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదము టైపాటు సవరణతో

      కందం
      వికటించెనొ కల్లు గొనగ!
      శుకునకు నాలి యసలేది? చూలియు లేదే?
      సుకరంమ్మాడ దగవె? యే
      శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే

      తొలగించండి