19, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2711

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్"
(లేదా...)
"దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ"
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

68 కామెంట్‌లు:

  1. తీరని కోరికయె గదర
    దారుణ కృష్ణభుజగము;సుధల్ వెలిగ్రక్కెన్
    పోరాడి గెల్వగ మనము
    నోరూరుచు రామభజన నొప్పుగ జేయన్

    రిప్లయితొలగించండి
  2. చేరగ నెన్నిక లందున
    పోరాటము గెలువ దలచి భూరిగ యోట్లన్
    గోరుతు నటింప గాంచిన
    దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్.

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    " రార ! వరాల బాల ! యనురాగము గల్గెను ! పాలనిత్తురా !
    కూరిమి ద్రాగ రార ! నను గూడ తలంపుమురా యశోదగా !
    జేరుమురా ! "యటంచు దరిజేరుచు పల్కెడు పూతనన్ గనన్
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  4. కాళీయ మర్దనం !


    నీ రుణ మెట్లన తీర్చుదు!
    దారుణ మై బతికినాను దర్పము తో నా
    దారిని, కృష్ణా! యనుచున్
    దారుణ కృష్ణభుజగము సుధల్వెలి గ్రక్కెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    పోరున నుత్తర కొరియన్
    చీరియు పోగులుగనేయ స్థిరమతి ట్రంపే
    కోరెను మైత్రిని, భళిరా!
    దారుణ కృష్ణ భుజగము సుధల్ వెలిగ్రక్కెన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    కారణమేది?సర్పమున కైనవి పూజ లనాదిగా నిలన్
    మారణకారి మానవు డమాయకుడై విష హీనలుండగా
    కోరల జీల్చి చంపుటయె కూడదు;"నాగ!వరంబు లిమ్మ"నన్
    దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండె, సత్కవీ!

    రిప్లయితొలగించండి
  7. పోరాటములో గెలిచిన
    ధీరా! రారా! యనుచును దృతరాష్ట్రుడు తా
    నారాటముతో పిలుచుచు
    దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్.

    రిప్లయితొలగించండి


  8. వీరులు శూరు లెల్లరును బెట్టును జేయుచు వచ్చి చచ్చిరే
    కారణ మాయె కర్మ, యనుకంపన మైనను జూప లేదు ! నా
    మారణ కాండ మాటుకొన మాధవు డాతడు వచ్చె నంచు నా
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మారడు పుత్రుడింక హతమార్చుదునంచు హిరణ్య కశ్యపుం
    డోరిమి లేక సేవకులకుత్తరువీయగ వారు బాలకున్
    క్రూరతఁ బాము కాటునిడ ఘోర భుజంగము ముందునుంచగా
    *"దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ"*

    రిప్లయితొలగించండి
  10. డా.ఎన్.వి.ఎన్.చారి
    మారణహోమమున్ సలిపి మానవ బాంబులునుగ్రమూకలున్
    వీరలమంచుబీరములు ప్రేలగ భారత సైనికోత్తముల్
    వారినిమట్టుపెట్టగను పాకిక పాడెను శాంతిగీతమా
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ

    రిప్లయితొలగించండి
  11. జన్యు మహిమలేమనవలె కడు చిత్రము పంది
    నంది యగు చూడగ
    నాడులనదె సవరించగ పాముల విషంబె
    ఔషధమ్మౌ తోడుగ
    శాస్త్రములే సాక్షిగ నేడు పరిశోధనలు జరిగె
    పెక్కవి
    దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలిగ్రక్కుచు
    నుండె సత్కవీ

    రిప్లయితొలగించండి
  12. కందం
    సారథి గీతామృతమది
    పోరున కర్తవ్యమందు పోషణ రథికిన్
    కౌరవ ధూర్తుల పాలిటి
    దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్

    రిప్లయితొలగించండి
  13. ఈ సమస్య నా కుర్రతనం లో ఆకాశాణి విజయవాడ కేంద్రం లో ఇచ్చారు. అప్పటి నా పూరణ ఎలా ఉన్నదో !
    దూరము నుండి చూడగనె దుష్టత నిండిన నల్ల త్రాచు తా
    గోరిన వాని కాటిడగ క్రోధముతో బుసకొట్టి నిల్చు నా
    కారము తోడ గన్ పడియు కల్లు నొసంగును తాళవృక్ష, మా
    దారుణకృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుందండీ! దూరానికి తాటిచెట్టు పడగ విప్పిన పాములాగానే ఉంటుంది! చక్కని పూరణ! అభినందనలు!💐💐💐

      తొలగించండి
  14. 'జడ కందములు' పద్య సంకలనంలో అక్షరక్రమంలో కవుల పట్టిక...
    ఏమైనా మార్పులు ఉంటే తెలియజేయండి.
    001. అంబటి భాను ప్రకాశ్, గద్వాల.
    002. అనుసూరి వేంకటేశ్వర రావు (అవేరా), బోడుప్పల్, హైదరాబాదు.
    003. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, హైదరాబాదు.
    004. అమరవాది రాజశేఖర శర్మ, గజ్వేల్.
    005. అవుసుల భాను ప్రకాశ్, సంగారెడ్డి.
    006. అష్టకాల విద్యాచరణ శర్మ, సిద్ధిపేట.
    007. ఆకుండి శైలజ, విజయనగరం.
    008. ఆకుల శాంతి భూషణ్, వనపర్తి.
    009. ఆకుల శివరాజలింగం, వనపర్తి.
    010. ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు, హైదరాబాదు.
    011. ఆచార్య పెద్దింటి లక్ష్మణాచార్యులు, యానాం.
    012. ఆచార్య రాణి సదాశివ మూర్తి, తిరుపతి.
    013. ఆత్రేయపురపు పాండురంగ విఠల ప్రసాద్, విశాఖపట్టణం.
    014. ఆముదాల మురళి, తిరుపతి.
    015. ఈడిగ సుధాకర్ గౌడ్, చింతకుంట, వికారాబాదు జిల్లా.
    016. ఊర ఈశ్వర రెడ్డి, కోవెలదిన్నె.
    017. ఎల్లికంటి జ్ఞానప్రసూనా శర్మ, కడ్తాల్, రంగారెడ్డి జిల్లా.
    018. ఐతగోని వేంకటేశ్వర్లు, నల్లగొండ.
    019. కంజర్ల రామాచార్య, కోరుట్ల.
    020. కంది శంకరయ్య, వరంగల్లు.
    021. కట్ట రంజిత్ కుమార్, సిద్ధిపేట.
    022. కవిశ్రీ సత్తిబాబు, మియాపూర్, హైదరాబాదు.
    023. కాశిరాజు లక్ష్మీ నారాయణ, పోరంకి, కృష్ణాజిల్లా.
    024. కిలపర్తి దాలినాయుడు, సాలూరు, విజయనగరం జిల్లా.
    025. కురుగంటి గీత (హంసగీతి), హైదరాబాదు.
    026. కె. ఈశ్వరప్ప
    027. కె. ఆర్. రాజేశ్వర్ రావు
    028. కె.యస్. గురుమూర్తి ఆచారి, వెలుగోడు.
    029. కోట రాజశేఖర్ అవధాని, పడుగుపాడు, నెల్లూరు.
    030. కోడూరి శేషఫణి శర్మ, నంద్యాల.
    031. గంగాపురం శ్రీనివాస్, సిద్ధిపేట.
    032. గంగుల ధర్మరాజు, డోను.
    033. గడ్డిపాటి శ్రీకాంత్, కన్నమంగళ, బెంగుళూరు.
    034. గుండా వేంకట సుబ్బ సహదేవుడు,

    ప్రొద్దుటూరు.
    035. గుండు మధుసూదన్, వరంగల్లు.
    036. గుమ్మా నాగ మంజరి, శృంగవరపుకోట.
    037. గుఱ్ఱం జనార్దన రావు,
    పలమనేరు, చిత్తూరు జిల్లా.
    038. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, చేరియాల, సిద్ధిపేట జిల్లా.
    039. గోగులపాటి కృష్ణమోహన్, సూరారం కాలనీ, హైదరాబాదు.
    040. గోలి హనుమచ్ఛాస్త్రి, గుంటూరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులకు నమస్సులు.నేనీ మధ్య పనుల వత్తిడుల మూలంగా శంకరాభరణం బ్లాగును సరిగా అనుసరించలేక పోవుచున్నాను...ఈ జడ పద్య సంకలనం గురించి తెలుపగలరు. మేము పద్యములు పంపవలెనా....నేను 100కు పైగా పద్యాలు వ్రాశాను....కవికి ఇన్ని వేయాలని కేటాయించారా.పుస్తక ముద్రణకోసం మేము చేయవలసినది ఏమిటి తెలుపగలరు.

      తొలగించండి
  15. 041. గౌరీభట్ల బాల ముకుంద శర్మ, శివాజీ నగరం, సిద్దిపేట.
    042. ఘాలి లలితా ప్రవల్లిక, నెల్లూరు.
    043. చంద్రమౌళి సూర్యనారాయణ, హైదరాబాదు.
    044. చక్రాల లక్ష్మీకాంతరాజారావు. హైదరాబాద్.
    045. చింతా రామకృష్ణారావు, హైదరాబాదు.
    046. చిటితోటి విజయ కుమార్, కలకత్తా.
    047. చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ, పెదపట్నం.
    048. చెఱుకూరి తరుణ్, కొత్తవలస.
    049. చేపూరి శ్రీరామారావు, వరంగల్లు.
    050. జంగం జ్యోతిర్మయి, ఒంగోలు.
    051. జంధ్యాల ఉమాదేవి, కావలి.
    052. జి. సీతాదేవి, నెల్లూరు.
    053. జిలేబి, రాణిపేట, తమిళనాడు.
    054. జొన్నలగడ్డ శ్రీనివాస రావు, తొత్తరమూడి, తూర్పు గోదావరి జిల్లా.
    055. డా.ఎన్.వి.ఎన్.చారి, వరంగల్లు.
    056. డా. కోడూరి విష్ణునందన్, నంద్యాల.
    057. డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, టెక్సాస్, అమెరికా.
    058. డా. పిట్టా సత్యనారాయణ, వరంగల్లు.
    059. డా. బల్లూరి ఉమాదేవి, కామవరం, కర్నూలు జిల్లా.
    060. డా. మునిగోటి సుందర రామ శర్మ, మదనపల్లె.
    061. డా. వెలుదండ సత్యనారాయణ, హైదరాబాదు.
    062. డా. హెచ్. వరలక్ష్మి, బెంగళూరు.
    063. డి. శ్రీనివాసులు (కవితశ్రీ), మదనపల్లె.
    064. తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష, మహబూబాబాదు.
    065. తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి, శాంతినగర్.
    066. దరిశి బాల సుబ్రహ్మణ్యం, ఒంగోలు.
    067. నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి, భద్రాచలం.
    068. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ, అమెరికా.
    069. పింగళి పూర్ణచంద్ర రావు, ఒంగోలు.
    070. పూర్ణకృష్ణ, జోగిపేట.
    071. పూసపాటి కృష్ణ సూర్య కుమార్, గుంటూరు.
    072. పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
    073. పోచిరాజు సుబ్బారావు, హైదరాబాదు.
    074. బండకాడి అంజయ్య గౌడ్, వెంకటరావు పేట, సిద్ధిపేట జిల్లా.
    075. బండి సూర్యారావు, హైదరాబాదు.
    076. బద్రిపల్లె శ్రీనివాసులు, ప్రొద్దుటూరు.
    077. బస్వోజు సుధాకరాచారి, వనపర్తి.
    078. బిట్రా వెంకట నాగ మల్లేశ్వర రావు, చీరాల.
    079. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్, ఒంగోలు.
    080. బొగ్గరం VVHB ప్రసాద రావు, గుంటూరు.

    రిప్లయితొలగించండి
  16. 081. భండారం నాగ వెంకట కళ్యాణ చక్రవర్తి, రాజమహేంద్రవరం.
    082. భమిడిపాటి కాళిదాసు, అనకాపల్లి.
    083. భావోజు దివాకర శాస్త్రి, వికారాబాదు.
    084. భాస్కరపంతుల రామమూర్తి, చెన్నై.
    085. భూసారపు నర్సయ్య, ధూళికట్ట, పెద్దపెల్లి జిల్లా.
    086. మంగళంపల్లి పాండురంగ విఠల్, రాజమహేంద్రవరం.
    087. మద్దా సత్యనారాయణ, గురజనాపల్లి,
    తూర్పు గోదావరి జిల్లా.
    088. మద్దిరాల శ్రీనివాసులు, త్రిపురాంతకం.
    089. మద్దూరి రామమూర్తి, కర్నూలు.
    090. మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి.
    091. మహ్మద్ షరీఫ్, సంగారెడ్డి.
    092. మాచవోలు శ్రీధరరావు, హైదరాబాదు.
    093. మాడుగుల మురళీధర శర్మ, సిద్ధిపేట.
    094. ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య, షాద్‍నగర్.
    095. ముడుంబై ప్రవీణ్ కుమార్, ములుగు, వరంగల్.
    096. ముమ్మడి చంద్రశేఖరాచార్యులు, పెంట్లవెల్లి, నాగర్ కర్నూలు జిల్లా.
    097. మైనంపాటి వరప్రసాదరావు, ఒంగోలు.
    098. మైలవరపు మురళీకృష్ణ, వెంకటగిరి.
    099. యం.వి.వి.యస్. శాస్త్రి, విజయవాడ.
    100. వఝ్ఝల రంగాచార్యులు, వరంగల్లు.
    101. వడలి వేంకట నాగ వరలక్ష్మి, విశాఖపట్టణం.
    102. వడ్ల ప్రసన్న కుమార చారి, జోగిపేట.
    103. వారణాసి నాగేశ్వరాచార్యులు, గద్వాల.
    104. విట్టుబాబు, చెన్నై.
    105. విరించి, హైదరాబాదు.
    106. వీటూరి భాస్కరమ్మ
    107. వెలిదె ప్రసాదశర్మ, ఉర్సు బొడ్రాయి, వరంగల్.
    108. వేలేటి శైలజ, సిద్దిపేట.
    119. శిష్ట్లా వి.యల్.యన్. శర్మ, హైదరాబాదు.
    110. శ్రీపతి శాస్త్రి, తిరుపతి.
    111. సంగు గురుచరణం, గడి పెద్దాపురం, మెదక్ జిల్లా.
    112. సముద్రాల శ్రీనివాసాచార్య, ములుగు, వరంగల్.
    113. సాగర్ల సత్తయ్య, నల్లగొండ.
    114. సీతా సతీశ్
    115. సొలస సీతారామయ్య
    116. స్వయంవరపు అప్పారావు, విశాఖపట్టణం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టానుండి
      ఆర్యా, కృతజ్ఞతలు.మీకు కృతి నిచ్చిన ఫొటో,నా కోరిక మేరకు పెట్టండీ బ్లాగులో

      తొలగించండి
  17. మిత్రులకు మనవి...
    'జడ కందములు' పుస్తక పరిష్కారం, ముద్రణ తదితర పనులలో వ్యస్తుడనై ఉన్నాను. రెండు మూడు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కందివారికి నెనరులు.

      జిలేబి పంచదశలోకము అని మార్చవలసినది గా విన్నపాలు.


      జిలేబి

      తొలగించండి


    2. ఆధారంబెవడో? అనాది యెవడో? ఆత్మై ప్రకాశించు మూ
      లాధారంబెవడో? రమేశుడెవడో? లావై బలమ్మై జనుల్
      రాధాకృష్ణులుగా భువిన్ పరిణితిన్ రాజిల్ల వైనంబెవం
      డో?ధర్మంబెవడో?ప్రభాకర! గనన్ డోలాయమానంబహో

      జిలేబి

      తొలగించండి
    3. లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా! 🙏🙏🙏😀😀😀

      తొలగించండి
    4. జిలేబి గారూ:

      మీరీ శంకరాభరణ సమస్య మిస్సయ్యారు:

      "నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్"

      తొలగించండి


    5. పటపట పండ్లు కొరుకుచున్
      పిటపిట లాడు పరువంపు బింబోష్ఠిని, హా!
      జటబట్టిలాగు దుష్టుని,
      నిటలాక్షుఁడు, శివునిఁ, గాంచి నివ్వెఱబోయెన్ !

      జిలేబి

      తొలగించండి
    6. 👏👏👏👏

      కటువుగ శివాలయమ్మున
      నెటుజూసిన గాంచలేక నెత్తిననున్నన్
      పటుతరపు జోడు దింపగ
      నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్

      జోడు = కళ్ళజోడు
      నిటలాక్షుడు = సులోచనమును ఫాలభాగమున ధరించిన వాడు

      తొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    [ఆదిశేషుని ఘనత]

    కోరి జనించి వెల్గుచునుఁ గూరిమిఁ గద్రువ కశ్యపాత్మజుం
    డీ రితమౌ తపస్సున నహీన గుణుండయి, విష్ణు శయ్యయై,
    ధీరత లక్ష్మణుండు బలదేవుఁడు నా హరి సోదరుండ్రుగాన్
    ధారుణి నున్న వాసుకి ననంతుని శేషుని నెంచి చూడఁగా,
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిఁగ్రక్కుచు నుండె సత్కవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. “పవిత్ర యైన మేనక” యన్న నన్నయార్యుని ప్రయోగము చూడండి.

      క్షత్ర వరుఁ డైన విశ్వా
      మిత్రునకుఁ బవిత్ర యైన మేనకుకున్ స
      త్పుత్రి నయి బొంకు వలుకఁగ
      ధాత్రీ తలనాథ యంత ధర్మేతరనే ... భార. ఆది. 4.98.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు పోచిరాజు వారికి నమస్సులు!

      మీరిది యెందుల కిచ్చితిరో తెలియకున్నది. గత సంబంధమైన చర్చకు సంబంధించినది కాబోలును! అయ్యది దయతో నాకు మఱల గుర్తుచేయగలరు. మఱచిపోయితిని!

      తొలగించండి
    3. నేటి భారత పఠనములో యీ పద్యము చదువుతుండగా 18/4/2018 నాటి మన చర్చ గుర్తుకు వచ్చి మీతో పంచుకొన వలెనని వ్రాసితిని. అంతకు మించి విశేషమేమీ లేదు.
      మీ స్ఫురణార్థము ఆనాటి మీ వ్యాఖ్య వ్రాయు చున్నాను.
      “ కావున, మేనకా సతిని అనుటకన్న మేనకాప్సరను అనిన బాగుండు ననిపించుచున్నది.”

      తొలగించండి
  19. వైరు ల యెడ హరి kకఠిన ము
    దారుణ కృష్ణ భుజ గ ము ; సుధ ల్ వెలి గ్రక్కున్
    వీరులు ధర్మా త్ములు నౌ
    ధీరులు పాండవు ల ట న్న ధీమతు లను చు న్

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,



    మీ ఋణ మెల్ల మాఫి యగు | మేలొనగూరును నేను గెల్చినన్ |

    మారును జీవితాలు | వెస మాయును పేదరికంబు | మీరలున్

    ధీరులు నై మనంగలరు | తీర్చెద నేను సమస్య లెల్లయున్ ,

    గోరిన ముఖ్యమంత్రిగ ననున్ | ధరలన్నియు కూల్చి వేసెదన్ |

    నీరును దెత్తు - పైరు లిక నిక్కగ | ఫింఛను హెచ్చు | స్త్రీలకున్

    కోరిన యంత బాకి దొరకు | న్నుచితం బగు వైద్య మబ్బుగా

    కోరకితం బగున్ బ్రగతి | కోతలు కా వివి యంచు కూయు నా

    దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ !


    { కోరకితమగు = చిగురించును }


    ---------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. బారెడుదండముదగులగ
    దారుణకృష్ణభుజగముసుధల్వెలిగ్రక్కెన్
    నూరంతయుగుమిగూడియు
    నారాస్కెలుసేయుపనికియార్తిని నొందెన్

    రిప్లయితొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2711
    సమస్య :: *దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ!*
    భయంకరమైన నల్ల త్రాచు పాము అమృతాన్ని బయటకు క్రక్కుతూ ఉన్నది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తమ్ముడైన హిరణ్యాక్షుని చంపిన విష్ణుభగవానునిపై పగను ద్వేషాన్ని శత్రుత్వాన్ని పెంచుకొన్న హిరణ్యకశిపుడు కొడుకు చనిపోయాడని ఏడుస్తున్న తన తల్లి దితిని ఓదారుస్తూ వేదాంతాన్ని బోధిస్తూ అమ్మా! కొడుకు చనిపోయాడని ఏడుస్తున్నావా! అన్నిటికీ కారణం భగవంతుడే కదా! ఈ లోక మంతా కల్ల. కల వంటిది. పుట్టిన వాడు మరణించక తప్పదు. అంతా మాయ. అంతా భ్రాంతి అని తెలుసుకో. భ్రాంతితో పోరాడవద్దు. శోకించవద్దు అని ప్రేత బంధు యమ సంవాదము అనే కథను విశదీకరిస్తాడు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇలా బోధ చేస్తున్న హిరణ్యకశిపుని గమనిస్తే విష సర్పం అమృతాన్ని క్రక్కి నట్లు అనిపిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    శూరుడు పుత్రు డేగె నని శోకము నందకు మమ్మ! యీశుడే
    కారణ మమ్మ యన్నిటికి కల్ల జగ మ్మిది తల్లి! భ్రాంతితో
    పోర కనెన్ హిరణ్య కశిపుం డిది జూడగ నిట్లు దోచెడిన్
    *దారుణ కృష్ణ సర్పము సుధన్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ!*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-6-2018)

    రిప్లయితొలగించండి
  23. బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ:

    తీరుగ వడ్డీని గొనుడు
    మీ రుణ మసలుంచుకోము మీ సొమ్ములనే
    మేరువుగను పెంచెదమని
    "దా రుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్"

    రిప్లయితొలగించండి
  24. బారెడుకఱ్ఱతోరమణబాదగనప్పుడుబాధతోడనా
    దారుణకృష్ణసర్పముసుధల్వెలిగ్రక్కుచునుండెసత్కవీ!
    మారుతమాహరంబుగనుమాత్రమెగొంచునుజీవనంబుదా
    మేరకుదానుగామెలగిమీరకహద్దులుసంచరించుగా

    రిప్లయితొలగించండి
  25. ఘోర విషంబును జిల్కెను
    దారుణ కృష్ణభుజగము, సుధల్ వెలిగ్రక్కెన్
    కారణ జన్ముడు కృష్ణుడు
    చేరి యణచగా నురగము క్షేమము నిడుచున్!

    రిప్లయితొలగించండి
  26. వీరుని,కృష్ణుని,బాలకు
    మారుని పద తాడనమ్ము మనుపుచు జనులన్;
    పోరగ లేకయె చావగ
    "దారుణ కృష్ణభుజగము ; సుధల్ వెలిగ్రక్కెన్"
    ****)()(****
    {సుధలు చిమ్మినది కృష్ణుని పద తాడనము}

    రిప్లయితొలగించండి


  27. భారంబయె బతుకునకు స
    దా, రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
    ధీరత్వము జేర్చుచు నీ
    కారుణ్యపు చూపులయ్య కలియుగ వరదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. బీరముగ సుయోధనధణి
    పేరిమితో జూదమాడ పిలిచిన రీతిన్
    ఆరయగ గనబడెనిటుల
    దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్

    రిప్లయితొలగించండి
  29. ఆరని తృష్ణయౌ, సమయ మావిరియౌ, కనరాని చిత్ర సం
    చారము చేటు గూర్చెడి, నసత్యము మించును, కుర్రకారులో
    దారిని తప్పు చేష్టలకు దావగు నీ చరవాణి యెన్నగా
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ.

    రిప్లయితొలగించండి
  30. దారిని గాచుచున్ జనుల తామస రీతిని దోచుచుండెడిన్
    గైరికుడే దగన్ బరము గాంచెడు మార్గము నెంచి దాను సొం
    పారెడు రామగాథ బ్రజ బాడెడు రీతిని గూర్చదోచెడిన్
    దారుణ కృష్ణయర్పము సుధన్ వెలిగ్రక్కుకు నుండె సత్కవీ!

    రిప్లయితొలగించండి
  31. నేరములు చేయువారిని
    చేరిచి తమపక్షమందు చేయుచు నఘముల్
    చేరి ప్రజలయోట్లు గొనగ
    దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్

    రిప్లయితొలగించండి
  32. ధీరుడనంచు స్థాయి వెస తీసుకు వచ్చెదనంచు నాడు తా
    బీరము లెన్నియో పలికి పిమ్మట కాడిని క్రింద వేసి ని
    ర్వీరుడు వచ్చెనోట్లు గొన పెల్లుగ చెప్ప బడాయి మాటలన్
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ

    రిప్లయితొలగించండి
  33. కాళీయుని భార్యలు కృష్ణుని వేడుకొను సందర్భము:

    మూరిన వగపున వేఁడుచు
    నారీ ఫణితతి, కృశించిన, భుజగ వరకాం
    తేరిత కరుణా వాక్కుల్,
    దారుణ కృష్ణభుజగము, సుధల్ వెలి గ్రక్కెన్


    ధారుణి ధర్మ రక్షణము దైత్య వినాశము గోరి విష్ణు విం
    పారఁగ కృష్ణఁడై భవము నంద ననంతుఁడు నెమ్మి నెత్తె స
    త్కారణ జన్ముఁడౌ బలుని గా నవతారము గోకులమ్మునన్
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ

    [కృష్ణ సర్పము = కృష్ణుని (విష్ణువుని) శయనమైన సర్పము]

    రిప్లయితొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (నవరత్న శిరోధారి భుజంగ రావ్)

    వారము వారిగా పసిడి వజ్రము కెంపుయు పుష్యరాగముల్
    నీరపు ధారగా నిడుచు నీలము ముత్యము మానికమ్ములన్
    నీరవ మోడి తా ఋణము నింపుగ కోరగ పోల్చలేదిటుల్:
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆటబట్టు కందము :)


      నీరవ నిశీధి యయెగా
      దా రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
      నీరవ మోడియు నింగ్లాం
      డ్లో రయ్యని విజయమాల్య రూటున బోవన్ :)

      జిలేబి

      తొలగించండి
  35. కారడవిన్ననున్వడిగ గావుమ భూవర యన్చు నార్తితోన్
    భీరువు వోలె పన్నగము భీషణ ఘోషను బెట్టె నగ్నిలోన్
    చేరి నలుండు కావగను చేకొని సఖ్యము జూప నత్తరిన్
    దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ!
    కర్కోటకుడనే సర్పాన్ని అడవిలో అగ్ని జ్వాలలనుండి నలుడు కాపాడిన సందర్భము...

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    దారుణ కృష్ణ భుజగము సుధల్ వెలిగ్రక్కెన్

    పూరణము..

    పూతన
    (ఏక పాత్రాభినయము)

    ఔరా! కంసాధమా! శిశు హంతకా! దైవ ద్రోహీ! దేవకి యష్టమ గర్భంబున వధింపం బడనున్న వాడవు నీవు. వధించువా డా దేవ దేవుడు. నడుమ కష్ట నష్టంబులకు గురియై కాలుని కెరయై కన్నమూయు నభాగ్యులము మేము. బాగు బాగు. ఇందు మా యపరాధ మే మున్నది?
    నవ జాత శిశువుల మట్టుపెట్ట నాజ్ఞాపించిన పాపాత్ముడా! సంకల్పము నీది.పరికరములము మేము.
    కానిమ్ము. మహిళనైన నాకు మాతృత్వ భావన సహజమే! కాని శిశుహత్యా రూపమైన పాప కృత్యంబున కా భావన నాలంబనము నొనర్చుకొను దుర్గతి నాకు పట్టినది. హతవిధీ!
    ఐన నేమి! మాతృభావననే వినియోగించుకొని కన్నయ్య నొకింత సేపైనను నా రొమ్మున కదుముకొను భాగ్యంబునకు నోచుకొందును గాక! తదుపరి యెటులైన నేమి.. యనుకొంటినే!
    ఐనను మాతృ భావననే వినియోగించు కొనవలె. అప్పుడు మాత్రమే యొకింతసేపైనను ఆ దివ్య బాలుని గుండెలకు హత్తుకొన గలను. వేరువిధంబున సంభవింప దనుకొంటినే! అనుకొన్నటులే జరిగినది. హాయి పొంగులు వారుచున్నది.
    కాని యింతలో ని దేమిటి? అయ్యో! ఈ పసిబాలుడు నా విష లిప్త వక్షోజంబుల కాల భుజంగంబు భంగి కాటు గొనుచున్నాడే! ఇంతవరకు సుధలు చిమ్మినట్టే యున్నది. ఇప్పుడేమో అబ్బా! భరింపజాల.. పై ప్రాణములు పైననే పోవుచున్నవే! నా పాప కృత్యమున కిది ప్రతిఫలము కాబోలు!
    మాతృ మూర్తులకే మచ్చ దెచ్చిన నాకు మరణ యాతన తప్పునట్లు లేదే! అబ్బా! ఈ వేదన సైపజాలను. తల్లి యనిపించుకొనుటకే అర్హత చాలని నే నిట్లు తల్లడిల్లవలసినదే! అబ్బా! పంచప్రాణములు పెకలింపబడుచున్న ట్లున్నది.
    అయ్యో! నా కిం కెవరు దిక్కు?దిక్కు లేని వానికి దేవుడే ది క్కందురే! దైవమునకే తెలిసి తెలిసి యపచార మొనర్చిన నా వంటి దాని కిక దైవము ది క్కగునా!
    అయ్యో! ఈ బాధ భరింపలేను. వీడు పసివాడా! కాడు. కాడు. వీడు గ్రోలుచున్నవి పాలు కావు సుమా! నా ప్రాణములు. అయ్యో! ఇంకేమి చేయుదును? పసివానికి పా లిచ్చెద నంటి. వారి దేమి తప్పు? ఇ మ్మనిరి. నేను తీసుకున్న గోతిలో నేనే పడబోవుచుంటి నిక వగవ నేల?
    అబ్బా! అయ్యో! దురాత్ముడైన కంసుని మనోరథము ఫలింపజేసి జీవించుటకంటె మహాత్ముడైన కృష్ణునివలన మరణించుటయే మహా భాగ్యము కదా! ఇక ఈ మరణవేదన భరింపవలసినదే కాని చింతింపవలసినది కానే కాదు.
    పాలిండ్లకు విషము నలదుకొను విషపు టాలోచనకు పాల్పడిన నాపట్ల కృష్ణా! నీవు విష పూరిత కృష్ణ భుజంగమై కాటు వేయుట యుచితమే కదా!

    చీరితిని మాతృమూర్తిగ
    దారుణ కృష్ణ భుజగము సుధల్ వెలిగ్రక్కెన్..
    చేరెను నా యొడిఁ బ్రేమను
    తీరుగ దుగ్ధముల గ్రోలి తీసె నసువులన్..

    కాదు..కాదు..
    తీరుగ దుగ్ధముల గ్రోలి...
    దివ్యత్వ మిడెన్..

    అ...బ్..బ్..బ్..బా! కన్నులు మూతలు పడుచున్నవి.. అయ్..య్..య్..యో!

    (పూతన కన్ను మూయును.)

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    19.6.18

    రిప్లయితొలగించండి
  37. కోరకె మాటమూటలనుకూర్పుననేర్పునమైకు పల్కుతో
    ప్రేరణ చేతలోకులకుపెద్దగరొక్కము బంచివోట్లతో
    ఆరణమందుగెల్వగనె?నాశదురాశనునమ్మువాడెపో
    దారణకృష్ణసర్పము!సుధల్ వెలిగ్రక్కుచునుండెసత్కవీ (ఎన్నికలముందు తరువాతగాదు)

    రిప్లయితొలగించండి
  38. కవిపోషకురాలైన రాణిగారు :
    ధారుణినాధుఁడేగ రిపుధాత్రిని గెల్వగ, నాగుటేలకో
    గారవమొప్పసాగు నవకావ్యరసాంచితగోష్ఠి? రమ్మయా!
    పారెను చీకటుల్, బహుళ పక్షము మీరలుచూపినట్టి యా
    దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండె, సత్కవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక దీర్ఘ ప్రయత్నము :
      నిద్ర మధ్యలో లేచిన కవిస్వగతము:

      గౌరశరీరకాంతి, నగగల్భకుచోన్నతి సింహమధ్య యా
      యూరువు లెంచెనే నరటి నూనగనౌను లతాంగి వేణియా?
      దారుణ కృష్ణ సర్పము; సుధల్ వెలిగ్రక్కుచునుండె సత్కవీ!
      వారిజనేత్రి వక్త్రమది పౌర్ణమి చంద్రుని వోలె; కాంచుచున్
      నేరక పేరునూరునిలు నేర్వగఁ బిల్వగఁ జేయి జారె, రే
      జారెను, వచ్చె నిద్ర యిక? స్వప్నము వచ్చునె ? యాపె వచ్చునే?

      తొలగించండి
  39. శ్రీగురుభ్యోనమః

    కోరి మధింపనెంచి నొక కొండను కవ్వము జేసి త్రాడుగా
    భూరి భుజంగమౌ హరుని భూషిత భూషణ రాజు వాసుకీ
    కోరల బట్టి చిల్కినను క్రుంకక బాధల నోపుచుండ నా
    దారుణ కృష్ణసర్పము, సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ

    రిప్లయితొలగించండి
  40. కొరియా కిమ్ అణ్వస్త్ర ప్రకటన ఎలా ఉందంటే...

    మారణకారణాదయిత మత్సరనిర్జరుడాయెనోయి 'కి
    మ్మీ'రుడు, వానికిన్ తెలివి మిక్కిలి, నమ్మగరాదు నేడికన్.
    పౌర హితమ్ముకైన 'అణుబంధన' చేసెదనంచు వార్తనం
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ

    రిప్లయితొలగించండి


  41. ఆరని వ్యథయే బ్రతుకున

    దారుణ కృష్ణభుజగము; సుధల్ వెలిగ్రక్కెన్*

    నీరాకరమును చిలుకుగ

    పారము లేనియట్టి ముదమును పడసిరి దివిజుల్.

    రిప్లయితొలగించండి
  42. జోరుగ సీబియై భటులు జొచ్చుకు రాగను కల్కతందునన్
    కూరిమి నొల్కుచున్ మమత కోయిల వోలెను కూసి పాటలన్
    తీరుగ చంద్రునిన్ పిలిచి తియ్యని స్వీట్లను నోటకుక్కెనే:👇
    "దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ"

    రిప్లయితొలగించండి