20, జూన్ 2018, బుధవారం

సమస్య - 2712

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"
(లేదా...)
"తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్"
(రాణి వెంకట గోపాల కృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

78 కామెంట్‌లు:



  1. ఇలలో టికాణ తిండికి
    కలగాంచుచు చూచు నతడు కనకపు ధారల్
    చెలువపు జిలేబిగా కవి
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఇలలో తలపుల వలలో
    మిలమిల మెరిసెడి పదముల మేలగు కృతులన్
    వలపుల సుధలు జిలుకు వ్రా
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ

    రిప్లయితొలగించండి


  3. ఇలలో తిండియు లోటు బట్ట కొఱతై నిండారు దారిద్ర్యముల్
    కలలో తేలుచు జూచుచుండు నతడే గర్ముత్తు ధారాప్రవా
    హ లయల్ వేగముగా జిలేబులవలెన్, హాంఫట్! విచిత్రంబు! యీ
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. మిలమిల మెరియు కవివరు క
    నులు! తళతళలాడుచుండు నుంపారుగ గుం
    డు! లయ లొలికించుచు భళి వె
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. బలిమియు లేదుశరీరము
    న లెస్స గా పల్కలేడు ! నాన్చుడు వ్యవహా
    రి! లవించి పద్యముల తన
    తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !


    ఇంతకు మించి రాస్తే కవివరుల్ వాయ గొట్టెదరు కాబట్టి స్వస్తి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇనిక్కి ఎల్లామే జిలేబి మాయం!
      😁🙏🏻

      తొలగించండి
    2. తిరిగే కాలు, తిట్టే నోరు లాగ వ్రాసే చెయ్యి కూడ ఊరుకోలేదు! కానివ్వండి మీ ప్రస్ధానం!!🙏🙏🙏🙏🙏

      తొలగించండి

    3. ఇనిక్కుం జిలేబి :)

      సలసల కాగెడు నూనియ
      న లబ్జుగా వేసి తీసి న జిలేబులలా
      పలు రీతుల మత్తున రా
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

      జిలేబి

      తొలగించండి


    4. భలె! తిరిగెడు కాళ్లున్ తి
      ట్టుల గూడెడు వాయి చేయి టుప్పనుచున్ తా
      గలగల తిరుగక, తన కవి
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

      జిలేబి

      తొలగించండి
    5. జిలేబి గారూ:

      ఈ శంకరాభరణ సమస్యను మీరు మిస్సయ్యారు:

      "మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే"

      తొలగించండి


    6. భాసా! సరి జేయండీ!
      మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే
      దోసము! మీ కాదండీ
      "మో" సమ్ములు లేని వనిత, మోహిని గలదే :)

      జిలేబి

      తొలగించండి
    7. 👏👏👏

      రోసముగా ప్రశ్నించిన:
      "మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే?"...
      బాసను జేయుచు చెప్పెద:
      "మీసమ్ములు లేని వనిత మిలియను నొకటోయ్!"

      తొలగించండి
  6. కందం
    పులకింతల పద రవళిన్
    యిలలోఁ గనలేని వారి కింపగు రీతిన్
    సలలిత రాగ సుధలఁ గై
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ!

    రిప్లయితొలగించండి
  7. నిలువన్ నీడయు లేకపోయినను, మేనిన్ దాల్చగా మంచి బ
    ట్టలు లేకున్నను, తిండి చాలకయు పొట్టన్నింపగా, కోపమం
    దలుకన్ బూనిన భార్యకున్ వెతలపై హాస్యమ్ముగా వ్రాసి కై
    "తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్"

    రిప్లయితొలగించండి
  8. తలపులవి మెదిలెడు కారణంబున మనిషి తల
    జంతువుల కతీతము
    సమస్త ప్రాణికోటిలో మనిషి తాను ఉన్నతుడనియె
    ప్రతీతము
    తన తల బయోస్కోపు పెట్టెగ అంతర్జాల
    గవాక్షము తెరవగన్
    తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రీ
    తలంబందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. తలపులనసమాన ప్రతిభ
      గల మానవుడు కవివరుడు కలగాంచు భళా
      యిలని బయోస్కోపున, కై
      తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !

      జిలేబి

      తొలగించండి
  9. అల రె డు పద లాలిత్యము
    విల సి త మగు భావ జాల విన్యాసము తో
    స లలిత పు చిక్కనౌ కవి
    తలలో స్వర్గ మ్ము జూపు ధన్యుడె కవి యౌ
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    పొలమున్ దున్నుచు , మేఘపంక్తిపయి చూపున్ నిల్పి ,స్వేదంపు చు..
    క్కలతో విత్తులు జల్లి , సస్యఫలరక్షాదక్షుడై , జాతికా...
    కలి దీర్చున్ మన కర్షకుండతనిదౌ కష్టమ్ము భావించి , కై...
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  11. తలపై ముంతల నెత్తుకు
    పొలముల గట్టున వయారముగ నడయాడే
    చెలువలపై వ్రాసినకవి
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె కవియౌ

    రిప్లయితొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన్.చారి
    ఇలలో కలలో దేలుచు
    తలపుల లతలల్లుచు తన తార్కిక బుద్ధిన్
    నెలవంకజూచి తనకవి
    తలలో స్వర్గము జూపు ధన్యుడె కవియౌ

    రిప్లయితొలగించండి
  13. ఇలలో దొరకని వన్నియు
    కలలో సాధింప దలచి కాంక్షల కొలిమిన్
    బలిమిన్ గూర్చెడు పలు కవి
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె కవియౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌🏻💐
      నాదీ యించుమించు ఇలాంటి భావమేనే!
      😁

      తొలగించండి


    2. ఇలని కవి క్రాంతదర్శి వె
      తల మీరుచు మేలుగ పలు తలపుల మదిలో
      మెలమెల్లగతట్టుచు రా
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

      జిలేబి

      తొలగించండి
  14. సెలయేరుల యొయ్యారము
    మలయాచల పవనములును మధురస్వనముల్
    తలపించెడి కమ్మని కవి
    "తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఇలని పలమనేరున గల,
      పలుకుల నొయ్యారముగ సభాస్థలి నుంపా
      ర లయలొలికించు కవి, రా
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

      జిలేబి

      తొలగించండి
  15. ఇలలోన నిడుములంగని
    యలయుచు నున్నట్టి జనుల హర్షంబునకై
    సలలితశైలిన్ తన కవి
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ.

    కలలో నైనను భూజనాళిహితమున్ కాంక్షించి లోకంబునన్
    మలినంబుల్ తొలగించు మానసముతో మన్నింప నర్హంబులౌ
    పలుకుల్ గూర్చుచు సర్వకాలములలో వర్ధిల్లగా జేయు కై
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్.

    రిప్లయితొలగించండి
  16. బలముగ పాలిక దూయుచు
    పలకముతో కవుల పద్య పాలిక ఘాత
    మ్ముల గాయుచు కవనపు యని
    తలలో స్వర్గము జూపు ధన్యుడె కవియౌ

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2712
    *తలలో స్వర్గముఁ జూపువాడె కవియౌ ధాత్రీతలం బందునన్.*
    తలలో స్వర్గాన్ని చూపించేవాడే నిజమైన కవి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వేదోక్తములైన యజ్ఞములు దానములు మొదలైన పుణ్యకార్యములను చేస్తూ పాపవిముక్తులైన వారు పుణ్యఫలమైన స్వర్గమును చేరుకొంటారు అని గీతాచార్యులు చెప్పినట్లుగా సత్కర్మాచరణకు ప్రోత్సహిస్తూ పుణ్యప్రదమైన బావనలతో చక్కనైన వ్రాతలలో క్రమంగా స్వర్గమునకు మోక్షమునకు మార్గమును చూపించే వాడే నిజమైన కవి అని విశదీకరించే సందర్భం.

    కలి పాపమ్ము తొలంగ జేయుము మహత్కార్యమ్ములన్ పూజలన్
    విలసద్దాన జపమ్ములన్ తపములన్ వేదోక్త యజ్ఞమ్ములన్
    బొలుపారన్ శుభ మందు మంచును సదా పుణ్యప్రదంబైన వ్రా
    *తలలో స్వర్గముఁ జూపువాడె కవియౌ ధాత్రీ తలంబందునన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-6-2018)

    రిప్లయితొలగించండి
  18. పలువురి హితమును గోరుచు
    తిలకించుచు జగమునెల్ల తిమిరారి వలెన్
    వెలిగించుచు దెసలన్ వ్రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడు కవియే!!!


    చిలుకగ మధువులు పదముల
    పులకింతల పూలు విరియ పుష్పలిహమ్ముల్
    కిలకిలమని చేరగ కవి
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడు కవియే!!!

    రిప్లయితొలగించండి
  19. ఇలలో వింతలలో కో
    తల మేతల ప్రేతల మఱి తా చింతలలో
    తలలో ప్రభాకరుల వ్రా
    "తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"

    ఇక్కడున్న ఏ తలలతోనూ నాకు సంబంధం లేదు, కూర్పు తప్ప! అన్నీ ఆయనవే!!
    ప్రభాకర నమస్తుభ్యం 😁🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. త్వం సూరం ప్రణమామ్యహం 🙏🏻

      ఇలలో వింతలలో కో
      తల మేతల ప్రేతల మఱి తాతల తలలో
      తులలో ప్రభాకరుల వ్రా
      "తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"

      తొలగించండి


    2. అలవోకగ హరిగతి పరు
      గులెత్తెడు ప్రభాకరుల బిగువగు పదపు సొం
      పుల,నాటవిడుపులన్,రా
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!

      జాల్రా జిలేబి

      తొలగించండి

    3. వలపల దాపల చేతుల
      గలగల పారెడు పదముల గబగబ వ్రాయన్
      చిలుకయె జిలేబి తన కై
      తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె కవియౌ!

      జిలేబిగారూ! పాయింట్ ఆఫ్ ఆర్డర్! జెండర్ బయాస్! కవియౌ అని మాత్రమే యిచ్చారు. మరి కవయిత్రులో?
      మీరు పోరాడవలసిందే!!

      తొలగించండి
    4. "కవయిత్రి" పదం ఆంధ్రభారతి నిఘంటు శోధనలో లేదు. వీరతాడు ఎవరికో?

      తొలగించండి
  20. లలితంబగుపదములతో
    కలకాలముమనసునందుకదలుచుమిగులన్
    మిలమిలలాడెడు నాకవి
    తలలోస్వర్గమ్ముజూపుధన్యుడెకవియౌ

    రిప్లయితొలగించండి
  21. కలలే సర్వం బైనను
    యిలలో నవి సత్యమనుచు నెవ్వరికైనన్
    తలలో నరచేతుల గీ
    "తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"

    రిప్లయితొలగించండి
  22. అలవోకగ నవధానము
    చెలరేగుచు జనులు మెచ్చ చేసెడి నేర్పున్
    గలిగియు మురిపించెడి కవి
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ!

    రిప్లయితొలగించండి
  23. చెలియను బుగ్గలు గిల్లుచు
    వలపులు వడ్డించమనగ?వయ్యారమునన్
    తలపుల మదిలోగనె కవి
    తలలోస్వర్గమ్ము జూపు! ధన్యుడెకవియౌ!

    రిప్లయితొలగించండి
  24. కలిదోషమ్ముల దెలుపుచు
    మలినమ్ముల దొలగజేయు మాటల తోడన్
    మలచగ సమాజమును వ్రా
    తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె కవియౌ!

    రిప్లయితొలగించండి
  25. ఇలలో మనుజులు పడు బా
    ధల తెలుసుకొనుచును నిచ్చ తగువిధముగ తాఁ
    దెలుపి పరిష్కారము వ్రా
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ

    రిప్లయితొలగించండి
  26. విలపించు వాని కింపుగఁ
    బలు తీరుల నూఱడించుఁ బదముల తోడన్
    జల మయము లైన కను గ్రం
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ


    కలలం దేలి రసోత్తమంబులు మహా కావ్యంబులన్ వ్రాసి యూ
    హల యాందోళము లందుఁ దేలుచును నిత్యంబింక నెందేని భా
    షల మాధుర్యము నిండి నట్టి సుమహా శబ్దార్థ రమ్యంపు బుం
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీ తలం బందునన్

    రిప్లయితొలగించండి
  27. సలలిత సౌరభ ఘన రచ
    నలతో చదువరుల నెల్ల నలరించుచు వా
    రల కిల కలలో తలపో
    తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిలసన్మోహన భావ జాల గతులన్ విజ్ఞత్వమేపారగా
      పలు గ్రంథంబుల వ్రాయుచున్ మధుర శోభల్ నింపు సంభావ్యతన్
      కళలన్ చిందు రసాత్మకంబయిన వాక్యప్రౌఢి జూపించు,కై
      తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రి తలంబందునన్



      తొలగించండి
  28. ఇలలో భానుడు చూడనట్టివియు దర్శించున్ కవీశుండు, బా
    ధలతో నిత్యముఁ గ్రుంగుచున్ కడు నవస్థల్ పొందు దీనాత్ములన్
    పలు వైనమ్ముల కైతలన్ పలుకి సంభావించుచున్ మంచి వ్రా
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్

    రిప్లయితొలగించండి
  29. పోచిరాజు వారికి ధన్యవాదాలతో 🙏🙏🙏

    అలవోకంగను వ్రాయుచున్, మిగుల నాలంకారికంబౌ విధిన్
    దులతూచంగను లేనివౌ ఋషుల సద్భోదల్ పురాణంబులన్
    కలమున్ నింపుచు మేలగున్ విధము సత్కావ్యంబులన్, క్రొత్త బుం
    తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రీతలంబందునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. సీతా దేవి గారు పుంత యను పదప్రయోగము మిమ్మాకర్షించి నట్లున్నది. పద్య మలవోకగా జాలువాఱినది మీ ఘంటము నుండి. చాలా బాగుంది.
      రెండు చోటుల ద్రుతసంధి సమకూర్చండి వ్యాకరణబద్ధ మయి ప్రకాశించ గలదు.

      తొలగించండి
    2. ధన్యవాదములార్యా! సవరించెదను! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. అలవోకంగను వ్రాయుచున్, మిగుల నాలంకారికంబౌ విధిన్
      దులతూచంగను లేనివౌ ఋషుల సద్బోదల్ పురాణంబులన్
      గలమున్ నింపుచు మేలగున్ విధము సత్కావ్యంబులన్, గ్రొత్త బుం
      తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రీతలంబందునన్!

      తొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ
    ధాత్రీతలం బందునన్"

    సందర్భము: కవితలలో స్వర్గం చూపించగలవాడే కవి.. అని నా మిత్రు డంటే
    నే ని ట్లంటిని.
    "స్వర్గం పుణ్యంతో సంపాదించదగింది. కాని పుణ్యం నశించే స్వభావం గలది. అది నశించినప్పుడు స్వర్గపదవినుండి వైదొలగడం తప్పనిసరి.
    "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి"
    పుణ్యంవల్ల స్వర్గం చేరుకోగలిగినవాడు ఆ పుణ్యం క్షీణించగానే మానవలోకంలోకి వచ్చిపడుతాడు.
    కాబట్టి నరుడు సంపాదించ దగింది పాప పుణ్యాల కతీతమైన మోక్షం. అది యెప్పుడూ నశించనిది.
    అందుకే "శ్రీ కైవల్యపదంబు జేరుటకునై" యని పోతన భాగవతాన్ని వ్రాయడం ఆరంభించాడు కాని "స్వర్గం చేరుకోవడానికి
    నే నిది వ్రాస్తున్నాను.." అనలేదు కదా!
    అందువల్ల సాహిత్యం చక్కని సూక్తుల ద్వారా మానవునికి ధర్మానురక్తిని కలిగించి ముక్తివల్ల కలిగే ఆనందాన్ని పొందేలా చేయాలి. సాహిత్యంయొక్క ప్రధాన ప్రయోజనం అదే సుమా! "
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పలికెన్ నా చెలికా డొకం డిటుల స
    ద్భావంబుఁ దోపంగ "గై
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ
    ధాత్రీతలం బందునన్"...
    బలుకన్ నే నిటు లంటి "స్వర్గమునక
    న్నన్ మోక్షమే మిన్న.. కై
    తలు సత్ సూక్తుల ధర్మమున్ నిలిపి ము
    క్త్యానంద మీయన్ వలెన్"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    20.6.18

    రిప్లయితొలగించండి
  31. పలుకుల వెలదిని గొలుచుచు
    తలపులలో చెరగు భావ తరగలకే తా
    నలవోకగ జెప్పెడు కవి
    తలలో స్వర్గమ్ముజూపు ధన్యుడె కవియౌ

    రిప్లయితొలగించండి
  32. లలితంబౌపదకూర్పుతోమిగులలోలాయంబునొప్పారుకై
    తలలోస్వర్గముజూపువాడెకవియౌధాత్రీతలంబందునన్
    గలలోగోరెనునాయనమ్మయికనాకాభావమున్జెప్పుమా
    విలవిల్లాడెనునంతనామనసుయేప్రేతంబుగామారెనో

    రిప్లయితొలగించండి
  33. అలవోకన్ మది భావజాలములనే యందింపు యత్నమ్ములో
    పలురీతుల్ కవిరాజులీ భువిని కావ్యాలెన్నియో వ్రాసినన్
    మలినమ్ములను ద్రుంచి మానవ హితమ్మాశించు చున్ వ్రాయు వ్రా
    తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రీతంబందునన్

    రిప్లయితొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (కంది శంకరుల నిర్వచనం)

    "తలమానిక్కము శంకరాభరణమై తండోపతండాలుగా
    బిలబిల్లాడుచు మాన్యులిందులను హా! భీభత్సమున్ జేయ చిం
    తలతో మూగిన బూజులన్ దులిపి బేతాళున్ శమింపించి నా
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్ :( "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ సరదా పూరణలు సార్థకంగా ఉన్నాయి. 🙏🏻

      ...గౌరీభట్ల బాలముకుంద శర్మ
      గోలోకాశ్రమము

      తొలగించండి


    3. ఆటబట్టు కందము

      తలమానికమ్ము శంకరు
      కొలువు కవులకున్ జిలేబి గూర్చన పద్యం
      బుల నందున సరదా కవి
      తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ!


      జిలేబి

      తొలగించండి
    4. గౌరీభట్ల వారి స్పందన వ్యక్తిగత వ్హాట్సప్లో 👆

      తొలగించండి




  35. ౘలిలో వర్షములో మహామహుల సత్సంగంబులోనెండలో
    కలలో వాక్కులలో సుధాప్రణయ సంఘాతంబులో కూర్మిలో
    బలిలో రక్షణలో సుహృద్విజన సంవాదంబులో శాంతిలో
    తలలో స్వర్గముఁజూపువాడె కవియౌ ధాత్రీతలంబందునన్

    గౌరీభట్ల బాలముకుందశర్మ,
    గోలోకాశ్రమము.

    రిప్లయితొలగించండి
  36. తెలియని వారెవ్వరిల సు
    ధలు గురియగ భాగవత కథలు భక్తిగ తా
    పలికించెను పోతన; కై
    తలలో స్వర్గమ్ముఋజూపు ధన్యుడె కవియౌ !

    రిప్లయితొలగించండి
  37. ఋ ..నాల్గవ పాదం లో లేదు. టై పాటుగా గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి

  38. కలలో గాంచినవన్నియు

    తలచుచు నతిచక్కగాను ధరలో ప్రజకున్

    తెలుపుచు  సతతము తనకవి

    తలలో స్వర్గమ్ముజూపు ధన్యుడె కవియౌ.

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టాసత్యనారాయణ
    కలియుగమే నరకమ్మై
    పలుబాధల గలుగజేయ భావన గురిగా
    మలిపియు మిథ్యాపర చిం
    తలలో స్వర్గమ్ముజూపు ధన్యుడె కవియౌ!

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టాసత్యనారాయణ
    ఇలలో లేత మనస్సులేవి?కఠినుల్ యీనాటి విద్వద్వరుల్
    కలలే గాంచరు పచ్చి లౌక్యము గనన్ కాపాడరే కాలమున్
    చలముం బూని సుకర్మ నైవహి,పురే,సంసిద్ధి యంచెంచగన్
    మలచేనా, వెతలన్ ,దురాగతములన్ మాన్పంగ నాధ్యాత్మ చిం
    తలలో స్వర్గము జూపువాడె కవియౌ ధాత్రీతలంబందునన్

    రిప్లయితొలగించండి
  41. పలు రంగమ్ముల భారతీయతను తా బంధించి వృత్తమ్ములన్
    కలగా పుల్గపు రీతినిన్ కలిపి తా కార్టూన్ల హాస్యమ్ముతో
    కలలో గ్రోలని రాజకీయముల దుర్గంధమ్ము లొప్పారు వ్రా
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్

    రిప్లయితొలగించండి