22, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2714

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై"
(లేదా...)
"తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే"

89 కామెంట్‌లు:


  1. పరుగుల మసీదు బోవన్
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై,
    యిరుబుట్టువులు, నొకండే
    పరమాత్ముడు విధములు సఖి పరిపరి సుమ్మీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీరు చేసిన ఉత్తమ పూరణలలో ఇదొకటి. చాల బాగుంది. అభినందనలు.
      "...చేరు గతులు పరిపరి సుమ్మీ" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి

    2. కంది వారికి నెనరుల్స్ !

      వెల్కం బెక బెక !

      ప్రాజెక్టు సక్సెఫుల్ అయ్యిందాండి ! జడగంటలు ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
      మ్రోగేదెప్పుడు ? :)


      జిలేబి

      తొలగించండి
    3. వహ్!!
      ద్విజులు = యిరుబుట్టువులు...తేట తెలుగు
      ఆహాఁ!
      👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻💐💐💐

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. అరయగ కొరాను చదివిరి
      తురకలు; జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
      సరియగు నొడుగైన పిదప
      వరులగుటకు ముందు రోజు బ్రాహ్మణులలరన్

      తొలగించండి
    2. ఒడుగు : ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
      వా.వి.
      వడుగు, ఉపనయనము

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆంధ్ర వాచస్పత్యాన్ని మీరు పేర్కొనకుంటే 'ఒడుగు' సాధువు కాదని, 'వడుగు' అనాలని చెప్పేవాణ్ణి!

      తొలగించండి


  3. మరకల్లేని వళక్ష వస్త్ర ములతో మస్జీదు బోవంగ నా
    తురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే
    యిరుబుట్టై సఖి బాప నయ్యలుగదా! యీశుండొకండే సుమా
    పరిశోధింపగ వేరువేరు విధముల్ ప్రార్థించు తీరుల్ సుమీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. అరమరికలు లేని వారలు
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    పరిమితిగ పూజ జేయుచు
    పరమేశుని కొలుతు రంట పరమ ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  5. బురకలు వేయుచు బుద్ధిగ
    పరులకు నగుపడరు జూడ పరదా లోనన్
    అరయగ జంధ్యమ్ము నదియె
    తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై

    రిప్లయితొలగించండి
  6. ఒక భర్త.... భార్యతో...

    " జ్వరమే ! తగ్గుటలేదు ! శక్తి తొలగెన్ ! ప్రాణమ్ములన్ నిల్పగా
    వర సౌరమ్మను జన్నమున్ సలుపగా భద్రమ్ము సేకూరెడిన్!
    మరి మీ యిష్టమటంచు " వైద్యుడనగా , మార్గమ్ము లేకుండుటన్
    తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధఁ గావింతురే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు వారి పూరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వర సౌరమ్మను జన్నము వావ్ !


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారికి వందనములు 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


    3. వర సౌరమ్మను జన్నము
      పరహిత వైద్యుడు తెలుపగ పరిపరి విధముల్
      వరమియ్యదే మనకనుచు
      తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై !

      జిలేబి

      తొలగించండి
    4. నిరతాగమశుభమంత్రో...
      చ్చరణరతులు కరధృత వర సర్వీసృక్కుల్
      స్వరకంఠీరవులు గ్రహిం..
      తుర కలు ? జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. వరుసగ కలలను గంటిని
    కరికే రెక్కలు మొలవగ గగనము నెగసెన్
    పురుషుడు ప్రసూతి నందెను
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై.

    రిప్లయితొలగించండి


  8. పరమాత్ముని మస్జీదున
    శరణాగతి గాంచువారు సఖియా యెవరో?
    ధరణీ సురులెటు కొల్తురు?
    తురకలు; జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    మరచిన సంఖ్యా బలమున
    సరి హైందవ జాతి తనదు శౌర్యము వీడె
    న్నొరు తురకకు వేయై చన
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై!

    రిప్లయితొలగించండి
  10. అరమరికలెరుగకనెపుడు
    చిరకాలమ్ము సఖులై పసితనము నుండి
    తురకలు హిందువులుండగ
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై !

    రిప్లయితొలగించండి

  11. సందర్భము - "ఆతుర " - వ్యాధిగ్రస్తుడు పరహిత వైద్యులు సంధ్య వారిస్తే రోగంపోతుందని చెప్పడము.



    పరమాత్ముని రూపమతడు
    వరమై కష్టేఫలి, అనపర్తి మనుజుడా
    పరహిత వైద్యుడనన్ "నా
    తుర" కలు,జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. తురకల్ మర్కలటంచు నెంచుటదియే దోర్దండమౌ వాదమే
    మరువన్నోపరు గాదె యైదు జపముల్; మా వార లాధ్యాత్మమున్
    బరగన్నంగడి నమ్ముటే సబబదే?పాటింపరే ధర్మమున్
    పర పీడన్ గనియైన "జుల్ము"(అధికారము)లకునై ప్రాణాల నర్పింతు రా
    తురకల్ జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతో జేతురే!

    రిప్లయితొలగించండి
  13. తురకల్ మర్కలటంచు నెంచుటదియే దోర్దండమౌ వాదమే
    మరువన్నోపరు గాదె యైదు జపముల్; మా వార లాధ్యాత్మమున్
    బరగన్నంగడి నమ్ముటే సబబదే?పాటింపరే ధర్మమున్
    పర పీడన్ గనియైన "జుల్ము"(అధికారము)లకునై ప్రాణాల నర్పింతు రా
    తురకల్ జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతో జేతురే!

    రిప్లయితొలగించండి


  14. పురహిత దర్గా దారిన్
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    పరుల హితమునకు పారులు,
    వరమయ్యిరి యనుగలమ్ము పరమావధిగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. పరమాత్ముడొకడని తలచి
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఙికులై
    అరయగ హిందువులున్ను మొ
    హరమున పీరుల మోయరె హార్దము తోడన్ !

    రిప్లయితొలగించండి
  16. నిరాకారమె ఉపాసనగ మా మతమనిరి
    ప్రవక్తేయులుగ ముసల్మానులు
    ప్రకృతి మన పూజార్హమనగ పూజించిరిగా
    సనాతన హిందువులు
    నమాజు చేయగబూని మసీదులో వజ్రాసనమున
    కూర్చొనగ తురకల్
    జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్దతో
    జేతురే ఆర్యుల్

    రిప్లయితొలగించండి
  17. తి ర ముగ నల్లా గో లు తు రు
    తురక లు ; జంద్యమ్ము దాల్చు దురు యాజ్ని కు లై
    ధ ర ణీ సురులి ల భక్తి న్
    గురు వు ల మంత్రోప దేశ గోప్య త తోడ న్
    _______::::కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి


  18. పరుగుల్ పెట్టిరి పారు లెల్ల రకటా బ్రాహ్మణ్యమున్త్రేచు చున్
    మెరుగుల్ గాంచిరి మైక్రొసాఫ్టు జనులై మేల్నాడులోగాదయా!
    మరి,వేదమ్ములు నేర్చువారెచట సూ! మాటాడకోయీ సఖా
    తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. అరయన్ భారత దేశమందు మతమేదైనన్ సమానంబుగా
    నిరతమ్మొందును గౌరవమ్ము మెలగున్ స్నేహమ్ముగా పౌరులె
    ల్లరిటన్ విప్రులు, చేయుచుండగనె యల్లాకై నమాజచ్చటే
    తురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే

    రిప్లయితొలగించండి
  20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2714
    సమస్య :: *తురకల్ జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతో జేతురే.*
    సందర్భం :: మృతసంజీవని విద్యను నేర్చుకొనేందుకు దేవతలచే పంపబడిన కచుని రాక్షసులు చంపి కాల్చి బూడిద చేసి ఆ భస్మాన్ని సురలో (కల్లులో) కలిపి శుక్రాచార్యులచే త్రాగించారు. రాక్షసుల మోసాన్ని గ్రహించిన గురువు గురు సేవా యజ్ఞాన్ని మీరు ఇలా మోసంతో చేస్తారా? అని ఉగ్రుడైనాడు. ఇకమీద కల్లు త్రాగిన వారికి పాపం కలుగుతుంది అని శాపం కూడా ఇచ్చినాడు అని విశదీకరించే సందర్భం.

    అరి యంచున్ కచు భస్మమున్ గలిపి నా కందించగా నెంచి యి
    *త్తుర కల్ ? జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతో జేతురే*
    యరయన్ మోసముతోడ? నంచు నిడె శుక్రాచార్యు డీ శాపమున్
    ‘’సుర ద్రాగన్ ఘన పాప మబ్బు నికపై జూడంగ ధాత్రీస్థలిన్.’’
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (22-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆహా ! తురకలు లో కల్లుని గాంచిరి !

      అదురహో కోటవారు !

      అరరే జిలేబియా జే
      తుర,కలు? జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
      ధరణీ సురులుగదా! బా
      మ్మ, రాజ శేఖరుల పద్య మాధురి గనుమా!

      జిలేబి

      తొలగించండి
    2. కలు-

      మద్యము;
      "కలుద్రావం బనిపూని యాదవులు." ఉ, హరి. ౪, ఆ.

      ఆంధ్రభారతి

      తొలగించండి
    3. పద్య రూప ప్రశంసల నందించిన సహృదయులు జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
      కల్లు పదాన్ని కలు అని ప్రయోగించ వచ్చునని సోదాహరణంగా వీశదీకరించినందులకు కృతజ్ఞతలు.

      తొలగించండి
    4. శ్రీమతి సీతాదేవి గారూ!
      మీ సందేహాన్ని జిలేబి గారు
      తీర్చినారని అనుకొంటున్నానండీ.

      తొలగించండి
    5. అవునండీ! జిలేబిగారికి ధన్యవాదములు!
      మీకు అభినందనలు!🙏🙏🙏

      తొలగించండి


  21. చెరువున పుకిలింతురు బో
    తురకలు, జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
    సరసన పూజావిధిగన్
    ధరణీసురులు, వివిధములు ధ్యానపు తీరుల్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ: మీరీ శంకరాభరణ సమస్యను మిస్సయ్యారు:

      "కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా"

      తొలగించండి

    2. టిట్ ఫార్ టాట్ గాల్ :)


      రా!తిరిగొచ్చెదమ్మనుచు రాధను త్రిప్పగ లేమయున్బడం
      గా తన బుట్టలోన కలి కాలపు పోకడ తీరు తెన్నులే
      రాతను మార్చగా నరరె రాముని కండ్లను కప్పి మందు మా
      కో,తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా :)

      జిలేబి

      తొలగించండి


    3. రాతల జేర్చు బ్రహ్మ మజ రాణి జిలేబికి భర్త గా హరిన్
      తా తలచెన్! భళారె ముదితై తను ప్రేయసి యయ్యె చూడగా
      మాతర మిద్ది నిర్ణయము మాదని చెప్పుచు తా హుషారుగా
      కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

      జిలేబి

      తొలగించండి
    4. సార్ వచ్చేశారు...ఇక ఆటలు సాగవు...

      ప్రీతిగ సంపదన్ వలచి రీతిగ రూపసి జాలమల్లి తా
      కోతిని పెండ్లియాడె;..నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా
      జాతక మిద్దియే ననుచు జాప్యము జేయక దీనిలో మహా
      పాతక మేమిలేదని ప్రభాకర శాస్త్రిని పెండ్లియాడెగా!!!

      తొలగించండి

    5. మీ కాలేజీ రోజుల్లోనూ యింతేనాండి ?
      హెడ్డు గారొస్తున్నా రని పిల్లలతో బాటు మీరూ చుప్చాప్ అయిపోయేవారా ?

      ఉత్పలమదురహో ఎవరా కోమలి :)


      జిలేబి

      తొలగించండి
    6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    7. స్వర్గీయ డాక్టర్ రుక్మిణీ దేవి (MBBS MD)

      🙏

      తొలగించండి
  22. పరమత సహనమె వరముగ
    వర హిందూ దేశమునను వరలగ జనులే
    ధరణీసురు డను నల్లా!
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదము చివర “జనులే “బదులు “నచటన్ “గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  23. కం.
    పరిపూర్ణజ్ఞానముకై
    గురువగు బ్రహ్మమును జేరి గొలిచెను మదిలో
    తురుకుల సిద్ధుడు చూడగ
    తురుకలు జంద్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై..

    రిప్లయితొలగించండి
  24. సురుచిరమగు వైదికమును
    మరచుచు చరియించుచుండ మనభూసురు లా
    సరణిని గమనించినచో
    తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై.

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,

      కరుణా హీన మనో ప్రవృత్తి యుత దుష్కామక్రియా శీలురే ! !

      అరయన్ హైందవ ధర్మమార్గములకున్ వ్యత్యస్త సంచారులే ! !

      తురకల్ జంధ్యము దాల్చి యఙ్ఞముల నెంతో శ్రద్ధతో జేతు రే

      కరణిన్ ? ధేను మాత శిరముల్ ఖండించు దుష్టుల్ గదా ! !
      ------------------------------------



      { దుష్కామక్రియ = చెడు కోరికలతో గూడిన పని ;

      వ్యత్యస్త = విభిన్నమైన , వ్యతిరేక మయిన }

      --------------------------------------------------------------------

      తొలగించండి
  26. తురకలయందునగలరట
    యిరవుగబ్రాహ్మణులుగూడనిహముననందున్
    శ్రోత్రియులవోలెనాయా
    తురకలుజంధ్యమ్ముదాల్చుదురుయాఙ్ఞికులై

    రిప్లయితొలగించండి
  27. సీసము
    శిలువను మెడలోన చిన్నతనము నుంచి దాల్చి క్రై స్తవులెల్ల తనివి దీర
    ప్రార్ధనలను జేయు భాను వాసరమున చర్చికి వెడలుచు సంతసముగ,
    మహ్మద్ను కొలిచి నమాజును వజ్రాసనము వేసి జేయు ఘనంబుగా స
    తతము (తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై)న వాసి సాత్త్వికులు సంక్ర

    మణము లందును , గ్రహణ సమయము పిదప,
    శవ దహన మైన తదుపరి, శ్రావణ మున
    వచ్చు పున్నమి దినమున, వర్జనమ్ము
    చేతురు మలిన జంధ్యమ్ము శివ శివ యని,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పరిచిరి పూసగ సీసము
      ల రాధనంబయె జిలేబులమరెన్ కందం
      బు రుచిర మాయెన్ సరికొ
      త్త రోహితము శంకరుని సదనమున కృష్ణా!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబి తల్లికి ధన్యవాదములు

      తొలగించండి
    3. తలచిన యెల్లరు సీసం
      బులలో కందమ్ము నుంచి పూరణ మాలల్
      సులువుగ నల్లగ వచ్చున్
      జిలేబి, చిరు తెలివితోడ చేసితి జిమ్మిక్స్

      తొలగించండి

    4. సీసము లో కందము నమర్చిరి
      కందము లో సీసము నమర్చ తరమే ? :)


      జిలేబి

      తొలగించండి
  28. గురువులు విధులను సడలిం
    తురుగద తప్పక కృపగొని తురకల పట్లన్
    బరగంగా,భువి నెవ్విధి
    "తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై?"

    రిప్లయితొలగించండి
  29. కందం
    నిరతమ్ము సంఘ జీవిగ
    చరియించుట తప్పదిలను సర్వులతో భూ
    సురలును, మిత్రులు నైనన్
    దురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై.

    రిప్లయితొలగించండి

  30. పొరబాటున మాటాడకు
    పరబ్రహ్మమునెరిగినట్టి పండితులెపుడున్
    మరచియు విజ్ఞత సేవిం
    *తుర కలు? జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై"
    ****)()(****
    (కల్లు సేవించెదరా?)

    రిప్లయితొలగించండి
  31. తరియింతురు ప్రార్థనతో
    తురకలు! జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై
    పరమాత్మను సేవింపగ
    ధరణీసురు లవనిలోన తథ్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  32. సమస్య :-
    "తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై"

    *కందము**

    మరువక మసీదు బోదురు
    తురకలు; జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    ధరణీ సురలు;హరిజనము
    తరలును ప్రార్థనలు జేయ; దైవమ్మొకటే
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
  33. తర తమ భేదము లె oచక
    పరమత స హ న మ్ము గల్గి పర మాత్ము oడo
    దరి కొక డే యని నమ్ము చు
    తు ర క ల జంధ్యమ్ము దాల్చు దు రు యాజ్జ్నికు లై

    రిప్లయితొలగించండి
  34. స్థిరముగ జేయు నమాజును
    తురకలు,జంథ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    జరుగగ యుపనయనమ్మును
    నిరతము గాయత్రి జేయ నిర్మల భక్తిన్!!!

    రిప్లయితొలగించండి
  35. నిరతాధ్యయనులు వేదా
    నురతులు విగత దురితౌఘ నుత చారిత్రుల్
    పరమార్ష ధర్మ సచ్చా
    తురకలు జంధ్యమ్ముఁ దాల్చెదురు యాజ్ఞికులై

    [సత్ +చాతురక = సచ్చాతురక; చాతురక = పాలించుట]

    “దాల్తురు” సాధు రూపము గావున “దాల్చెదరు” గా మార్చితిని. తప్పైన తెలుప గలరు.


    ధరణీదేవ నరేంద్ర కార్పటిక సద్వం శాభిజాతుల్ తమిం
    బరమార్థాదిక వస్తు సంచయ సుసంప్రాప్తార్థులై ధాత్రినిన్,
    నిరతం బెల్లరు హాస్య వాక్య తతి సాన్నిధ్యమ్ము నవ్వంగ నీ
    తురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేయరే

    [తురక = మ్లేచ్ఛుఁడు]

    “చేతురు” పద మసాధువు గనుక “చేయరే” గా మార్చితిని. తప్పైన తెలుప గలరు.

    రిప్లయితొలగించండి
  36. తురకల్జంధ్యముదాల్చియఙ్ఞములనెంతోశ్రధ్ధతోజేతురే
    తురకల్నాబడువారిలోగలరునెంతోమందిభూదేవులే
    కరమున్వారలుజేతురీభువినిసాకారంబుగాయఙ్ఞముల్
    నిరతంబందఱుజేయగావలయుపానీయాదిపూజల్సుమా

    రిప్లయితొలగించండి
  37. శిరముల్ ముండనముల్, శిఖల్ ముడులతో చెన్నొందు, నా ముళ్ళలో
    హరిపాదాబ్జ ప్రసాద పుష్పములు, దేహమ్మందు భస్మంబు, వా
    తెరలన్ మంత్రము, లక్షతల్ కరములన్ ధృత్వుల్ గదా! కారులే
    తురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే.

    రిప్లయితొలగించండి
  38. విరివిగ నాటకమాడిరి
    పరివర్తన బంచబూన భక్తినిబంచన్
    పురజన సుముఖమునందున
    తురకలు జంధ్యమ్ముదాల్చుదురు యాజ్ఞికులై (వేషదారులు)

    రిప్లయితొలగించండి
  39. పరహితము గోరువారే
    తురకలు; జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై
    ధరణీసురులు;మతములు సు
    కరముం జేయు మనుజులకు కన్గొన పరమున్ !

    రిప్లయితొలగించండి
  40. అరుగుదురు మసీదునకున్
    తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
    జరుపగ జన్నములను భూ
    సురులు కడు నియమము తోడ స్తుతియించి హరిన్

    రిప్లయితొలగించండి
  41. ఆటవిడుపు సీరియస్ పూరణ:

    ("ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ")

    సరిలేదింపుగ లవ్ జిహాదనగ గోషానున్ విసర్జించుచున్
    పరుగుల్ బెట్టుచు భాజపా జనుల
    సావాసమ్ము సాధింపగా
    వరమున్ గోరుచు విశ్వహిందువుల ఘర్వాపస్ వితానమ్మునన్
    తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. " ఆబ" కం :)


      సరియై మాకిల వేల్పుల
      మరలేదౌ లవ్జిహాదు మరకల్ వలద
      య్య! రమానాధు శరణు గొ
      ల్తుర! కలుషితమవమికన్ ములుగు భాజ్పాయే!

      జిలేబి

      తొలగించండి
  42. ధరణిన్మానవజన్మపూర్వగుణ సంధానప్రధానంబు సం
    స్కరణీయక్రమమందుషోడశ విధాచారంబులవ్వాటిలో
    మరుజన్మోపనయమ్మునందుఁ గలుగన్మంత్రోపదేశాన నే
    ర్తురకల్ జంధ్యముఁదాల్చి యజ్ఞములనెంతో శ్రద్ధతోఁజేతురే

    నేర్తురు+అ క ల్
    అ-అచ్చులు శక్తి స్వరూపములు,
    క-హల్లులు శివ స్వరూపములు.
    జంధ్యము-బ్రహ్మస్వరూపము,
    యజ్ఞము-విష్ణుస్వరూపము,
    చేతురు= సేవింతురు.

    గౌరీభట్ల బాలముకుందశర్మ,
    గోలోకాశ్రమము.

    రిప్లయితొలగించండి
  43. పరమం బెరుగక కొందరు
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు; యాజ్ఞికులై
    మరుజన్మలందు భక్తుల
    మొరలను దేవునికితెల్ప పొసగుదురేమో

    రిప్లయితొలగించండి
  44. 'జడ కందములు - మా కందములు' పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్, కూకటిపల్లి వివేకానంద నగర్ లోని 'వడ్డెపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ హాల్' లో జులై 8 (ఆదివారం) సాయంత్రం 3 గం.లకు ప్రారంభమౌతుంది. సాయంత్రం 6 గం.లోగా కార్యక్రమం పూర్తవుతుంది.
    దీనితో పాటు జంధ్యాల ఉమాదేవి గారి 'తిరుప్పావై - తెలుగు గజల్స్' పుస్తక ఆవిష్కరణ కూడా జరుగుతుంది. సభానిర్వహణకు అయ్యే కర్చులో సగం వారు భరిస్తున్నారు.
    పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రిక త్వరలోనే ప్రకటిస్తాను.
    వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుంటాను. వారికి ఇవ్వవలసిన పుస్తకాలను ముందే క్యారీబ్యాగుల్లో పెట్టి సిద్ధంగా ఉంచడానికి, సభ ఏర్పాట్లకు ఇది అవసరం.
    కవిమిత్రులు గమనించవలసిందిగా మనవి
    సభకొరకు హాలు మాట్లాడడానికి అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారితో వెళ్ళిరావడం, ముఖచిత్రం వేయించడం, ప్రింటింగ్ పని... మొదలైన కారణాల వల్ల నేనీరోజు బ్లాగులో సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి


  45. శిరమున టోపీ దాల్తురు

    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై

    నిరతము పూజలు సలుపుచు

    పురుషోత్తముడగు హరిహర మూర్తిని కొలుతుర్.

    రిప్లయితొలగించండి
  46. మత్తేభవిక్రీడితము
    చిరకాలమ్ముగ వారి వారి మతముల్,చిహ్నాలు వేరైనయున్
    జరియించన్ దగ నొక్క యూరి జనులైసావాసమున్ జేసి భూ
    సురులున్ నిత్యము సంఘజీవులగుచున్చూడంగ మాటాడగన్
    దురకల్, జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే

    రిప్లయితొలగించండి
  47. తురకల్ మర్కలటంచు నెంచుటదియే దోర్దండమౌ వాదమే
    మరువన్నోపరు గాదె యైదు జపముల్; మా వార లాధ్యాత్మమున్
    బరగన్నంగడి నమ్ముటే సబబదే?పాటింపరే ధర్మమున్
    పర పీడన్ గనియైన "జుల్ము"(అధికారము)లకునై ప్రాణాల నర్పింతు రా
    తురకల్ జంధ్యము దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతో జేతురే!

    రిప్లయితొలగించండి
  48. డా.పిట్టాసత్యనారాయణ
    మరచిన సంఖ్యా బలమున
    సరి హైందవ జాతి తనదు శౌర్యము వీడె
    న్నొరు తురకకు వేయై చన
    తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాజ్ఞికులై!

    రిప్లయితొలగించండి
  49. విరిసెన్ జూడర రాహులయ్య నొసటన్ వీభూదితో నామముల్
    మురుగుల్ కాలువ నోటి మాయ వతినిన్ ముద్దాడ యాదవ్లుభల్
    త్వరగా ప్లేటును మార్చి చంద్రుడట తా పట్టంగ కాంగ్రేసు కాళ్
    తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే

    రిప్లయితొలగించండి