24, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2715

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి"
(లేదా...)
"చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

50 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. సరదాగా:

      చంద్రుడొకడుండె నిచ్చట చక్కగాను
      చంద్రుడొకడుండె నచ్చటచల్లగానె
      యింద్ర భోగము జేసిరి యిందునందు
      చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి :)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. చంద్ర బాబొకరు మరియు చంద్ర శేఖ
    రుండొకరు ముఖ్య మంత్రులు, మొండి మోడి
    వలన నష్ట బోతిరి గదా తెలుగు జనత ,

    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి

    రిప్లయితొలగించండి
  3. అది యమావాస్య రాత్రియే యైననేమి
    తెలుగు ప్రజల బ్రతుకులందు దివ్యమైన
    ప్రబల కాంతుల నందించు ప్రముఖు లైన
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    గోపికలు ఒక సరస్తీరమున గోపాలకునికై వేచి యున్నారు..నింగిలో చంద్రుడు ప్రకాశిస్తూ.. నీటిలో ప్రతిబింబమై కనబడుచున్నాడు.... కృష్ణుడు రాలేదు... వారి ముఖాలపై నవ్వుల వెన్నెలలు లేవు...

    నందకుమారుఁ జూడగ మనమ్ములు పొంగి ముఖాంబరమ్ములన్
    చిందును పండువెన్నెలల చిక్కని నవ్వులటంచుఁ జేర , వా...
    డెందును గానరాడు ! శరదిందుడు దోచెను నింగి నీటిలో !
    చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  5. తెలుగు నాట గలరయ పదిలముగా ని
    రువురు ప్రభువులు, "మాకంద" రుంద్రపు జడ
    పద్యముల మేమె ప్రచురింప వలసి వచ్చె
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి
    నైన నేమి చేసితిమి యత్నమ్ము తెలుగు
    పద్య మును నిలుప నదిగో వచ్చుచుండె

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జిలేబి లంకెలు లంకెలు గా నుండును :)
      అందొక లంకె యిది :)

      జె కె :)

      నెనరులు

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యం సమీక్షించాలంటే కనీసం ఒక్కసారైనా ఆంధ్రభారతి తలుపు తట్టక తప్పదు!

      తొలగించండి

    3. అహో ఆంధ్రభారతి
      నీవే లేకున్న జిలేబికి దిక్కేది
      పదాల జిలేబు లవేయ :)

      కందివారికి నెనరులు :)


      జిలేబి

      తొలగించండి
  6. ఎందులకీదినమ్ము చెలికింతటి కోపము వచ్చె నా పయిన్
    పొందునుఁ గోరి వచ్చితిని పూర్ణ శశాంకునిఁ బోలునట్టి యీ
    సుందరి మోముపై నగవు శూన్యము పున్నమి రేతిరందునన్
    చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు నమస్సులు. నిత్యములైన ద్రుత సంధులు కూర్చిన ఛందోబద్ధ పద్యము వ్యాకరణ దోష రహితమగును. మీ పూరణమున రెండు చోట్ల నీ సంధిని సమకూర్చండి.

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    ఆంధ్ర చంద్రుడు నాయుడు యాం.ప్ర.లోన
    రాజు చంద్రశేఖరుడు తె.రా.న జూడ
    కుంపటులు వేరు, యణచిరె కుజనతతిని?
    చంద్రు లిద్దరున్నను లేదు చంద్ర కాంతి!

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    లంకఁ జేరిన సీతమ్మ రాము దలఁచ
    రాక్షసాధములకు నాడు లంకలోన
    నీలిమేఘమై రాముండు, నింగి నేలు
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారు కడుఁ జక్కటి పూరణ.
      “నీల తను రామ చంద్రుండు” మఱింత శోభ చేకూర్చు నను కుంటాను.

      తొలగించండి
    2. ఆర్యా! మీ దయ మాపై కలిగినందుకు ధన్యవాదములు.మీ సూచన అనుసరణీయము.

      సవరించిన పూరణ :

      లంకఁ జేరిన సీతమ్మ రాముఁ దలఁచ
      రాక్షసాధములకు నాడు లంకలోన
      నీల తను రామచంద్రుండు, నింగి నేలు
      చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి!

      తొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    బిందెల కొద్ది ద్రవ్య, మభివృద్ధి ప్రణాళికలో వికాసముల్
    చిందరవందరయ్యె నట జేతులు మారెను ,లంచగొండులే
    ముందర దూసుకొంచు జన(చన)మోపెడు కట్టెలు పండ్ల పుల్లలౌ
    చందము కాంతులీనవు నిశాచర వృత్తి జెలంగ ,చీకటుల్
    తొందర జీలి వేర్పడిన దొందును దొందను మాడ్కి,వెల్గుకై
    చందురు లిద్దరున్న గనజాలము చంద్రిక లయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
  10. అలిగి పత్నితో మేలములాడకున్న
    నిండు పున్నమి రోజున దండిమగడు
    చిలిపిగ పలికె సతి పతి యలుక దీర్చ
    “చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి”

    రిప్లయితొలగించండి

  11. వడిగ రెండుగ విభజించబడిన తెలుగు
    సీమలను పసిడిగమార్పు చేసెదమను
    చంద్రులిద్ద రున్నను, లేదు చంద్రకాంతి
    గనయినను నాల్గుయేడులు గడచిపోయె

    రిప్లయితొలగించండి
  12. స్థిరమగు సూర్యుడు కేంద్రము రాష్ట్రములు
    తిరుగు గ్రహములు
    సవ్యపు పరిపాలన స్థితికై స్థిరపరచగన్
    నిగ్రహములు
    కక్ష్యలోనే రక్షణ ఉండగ కాదనుటన్ మరి
    భావ్యమా
    చందురు లిద్దరున్న గనజాలము చంద్రిక
    లయ్యొ దైవమా

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. తెలుగు రాష్ట్రాల పాలన తేటగాను
    నడుపు చున్నట్టి ప్రభువుల నడతజూడ
    రవి ప్రభలతోడ రాజిల్ల రమ్యమౌచు
    చంద్రు లిద్దరున్నను లేదు చంద్రకాంతి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందడి జేయగా తనకు చంద్రుడు గావలె నంచు మొండిగన్
      నందను నూరడింప నిశినాథుని బింబము దర్పణమ్మునన్
      విందుగ జూపగా గనిన వెన్నెల రాయుని మించుమోమునన్
      చిందిలు నవ్వులారగను చిత్రమదేమకొ రాముసన్నిధిన్
      చందురు లిద్దరున్న గనజాలము చంద్రిక లయ్యొ దైవమా!!

      తొలగించండి


  15. "చంద్రిక చీరలు దొరకలే :) నేనే మి సేతురా నీ పెండ్లికి నా కుమారుడా చంద్రశేఖర :)


    చందన కట్టుకోకల పసారమహో యన పోయినామయా
    వందన మంచు నిర్వురు కవాతుల సేయుచు సేల లెల్ల మా
    ముందర వేసి రయ్య! భళి మొద్దు మగండు,కుమారుడైననా
    చందురు లిద్దరున్న గనజాలము, చంద్రిక లయ్యొ దైవమా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2715
    సమస్య :: *చందురు లిద్దరున్నఁ గనఁ జాలము చంద్రిక లయ్యొ దైవమా !*
    ఇద్దఱు చంద్రులు ఉన్నా వెన్నెలను మాత్రం చూడలేకపోతున్నాము అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అందం చిందే మన తెలుగు భాష శ్రీ కృష్ణ దేవరాయలు మొదలైన మహారాజుల పరిపాలనలో ఆనాడు మహర్దశను పొంది అంతటా ప్రకాశించింది. ఐతే ఈనాడు తెలుగు భాషను మాట్లాడే రెండు రాష్ట్రములను పరిపాలించే రాజచంద్రులు ఇద్దఱు ఉన్నా మన తెలుగు భాష మహర్దశను కోల్పోయి ఉన్నది అని తెలియజేసే సందర్భం.

    అందము చిందు భాష మన యందఱి భాష తెలుంగు భాష, యే
    మందుము నాడు పొందిన మహాదశ యే చనె , తెల్గుతల్లి యా
    క్రందన నెంచ రీ తెలుగు రాష్ట్రము లేలెడి పాలకోత్తముల్
    *చందురు లిద్దరున్నఁ గనఁ జాలము చంద్రిక లయ్యొ దైవమా !*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-6-2018)

    రిప్లయితొలగించండి
  17. ఒక్క చంద్రుడు గగనాన నుజ్వ ల ము గ
    వె లి గి మబ్బు చాటున జే రె వేగిరముగ
    తో య మందు న్న బింబ మ్ముతో చ నపుడు
    చంద్రులి ద్దరు న్న ను లేదు చంద్ర కాంతి

    రిప్లయితొలగించండి
  18. రాష్ట్రములకధిపతులుగరాటతేరు
    చంద్రులిద్దరున్ననులేదుచంద్రకాంతి
    సాగుచున్నదిపాలనజంకుతోడ
    పదవులూడునేమొయనెడుభయముతోడ

    రిప్లయితొలగించండి
  19. సీసము
    పరదేశ వణిజుడు పలికె నిటాలి యన్నాఫ్ ద యీస్టు ననుచు నతిశయముగ,
    దేశ భాషల లోన తెలుగు లెస్స యనుచు వర దేవ రాయలు వక్కణిoచె .
    తీయ నైనది గద తెనుగు భాష మధురమగు తేనె కన్నను మౌలి లోన ,
    సీపి బ్రౌన్ వరుడు రచించెను మొదటి తెలుగు నిఘంటువును పలువురు మెచ్చ,
    మల్లె పూవుల దండ మా తెలుగు జనని కనుచు పాడుదుము గా ఘనత తోడ
    పర్వ దినము లందు పరవశించి ,పిదప మాట్లాడ తప్పిద మనుచు బలుకు,
    యితర దేశమువారు యెంత గానో మెచ్చు చుండెడి మన భాష , చూపు చుండె
    సవతి వలపు మన చంద్రులిరువురును, చోద్యమ్ము కాదుగా శోభ నిచ్చు

    నట్టిది మన తెనుగు భాష, మట్టి లోన
    కలువ సిద్ధమగుచు నుండె తెలుగుభాష
    నేడు, తెలుగు చల్లదనము చూడ బోము ,
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి

    రిప్లయితొలగించండి
  20. వనరు లెన్నియున్నను జూడ వసుధ జనులు
    నీసురో మని పడియున్న నేమి ఫలము?
    చేతనము లేక యభివృద్ధి చెందబోరు
    "చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి"

    రిప్లయితొలగించండి
  21. సాంద్ర తరమైన పనులను తలకు నెత్తి
    నిధులు లేవంచు పై వాని నిలుపు నొకరు ,
    కొత్త పధకాలు చేపట్టి కులుకు నొకరు
    చంద్రు లిద్దరున్నను లేదు చంద్ర కాంతి
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  22. విందముమంచిపద్యములువీనులవిందుగనన్నచోభువిన్
    చందురులిద్దరున్నగనజాలముచంద్రికలయ్యొదైవమా!
    యెందునువీరలుల్మనకునీయుటలేదుగబ్రోత్సహీంపునున్
    నందముగల్గుభాషయిదియన్నిటికంటెనుజింతజేయగన్

    రిప్లయితొలగించండి
  23. నగలు నట్రలు పట్టు పినద్దము లవి
    యెల్ల సున్నలు సుమ్మి మాయింట,మే మె
    టులు వచింతుము తోబుట్టువులు మఱి రవి
    చంద్రు లిద్ద రున్నను, లేదు చంద్రకాంతి

    [చంద్రకాంతి = వెండి]


    అందము లొల్కు చంద్రముఖి యాలి కలాధరుఁ బోలు తల్లియుం
    జందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా
    యెందు గృహాభ్రమందు మఱి యించుక యేని నిరంతరమ్మునుం
    జిందులు వేసి ఘోరముగఁ జెల్వలు దిట్టలు పోరు సల్పఁగన్


    రిప్లయితొలగించండి
  24. విందులఁ దేల్చి, మించి, కనువిందొనరించి, వరించి, నట్టి యా
    సుందరి వీడి దవ్వుఁ జని, జూడగ నీ నిశి వత్తు నంచనన్,
    బొందునుఁ దల్చి యద్దమున మోము గనెన్ తెలవారు లంతయున్
    చందురు లిద్దరున్నఁ గనఁ జాలము చంద్రిక లయ్యొ దైవమా!.



    రిప్లయితొలగించండి
  25. ఒకానొక వర్షాకాలపు పున్నమి రాత్రి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురియుచున్న సమయంలో యింటికి చేరాడు భర్త. ఏ కారణం చేతనో భార్య విచారంలో నుండగా కనుకొలనులలో నీరు నిలచింది. అది చూసిన భర్త "ఈమె నామీద అలిగిందా లేక మరే కారణంగానైనా దఃఖితురాలై యుందా" అని తలబోయు సందర్భము.

    సుందరమైన మోమునను జూడగఁ జంద్రుని బోలి వెల్గునే
    డెందము నందు నేమి గొని ఠీవిని దప్పగ జేసె, నచ్చటన్
    విందులుఁ జేయు వెన్నెలయు వేడ్కను దీర్చక మబ్బు పాల్బడన్
    *"చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా"*

    రిప్లయితొలగించండి
  26. కాంతి కిరణాల బ్రాంతి సంక్రాంతిగాగ!
    ఆంధ్రతెలగాణ చంద్రులునధికులైన
    చంద్రు లద్దరున్నను లేదుచంద్రకాంతి
    మోదినామోదమేలేక నాదమేది?

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:

    ఇందుల చంద్రుడా బిసను నెందుల కీయవు నాకనంగనో...
    యందుల చంద్రుడా స్పెషలు నందక జేసితి వెందుకో యనన్...
    కందిన మోముతో చెమట కార్చుచు మోడియె విస్తుపోయెగా:
    "చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా!"

    బిసను = Bison Polo Ground for Secretariat
    స్పెషలు = Special Status for AP

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "ఆబ" కందం :)


      ముందరి మిత్రుడొ కండయె
      బిందా సైన తెలగాణ వీరుడొకడయెన్
      చిందరవందర జేయుచు
      కందుకముల మోడి నాడి కందించిరిగా :)

      జిలేబి

      తొలగించండి
  28. ఉత్పలమాల
    కుందెనహో! బృహస్పతియె గూడఁగ శిష్యుడు భార్య తారతో
    నందనునంద నల్గురట నవ్వఁగ నల్గుచు మూల్గెనిట్టులన్
    గందము చల్లనుండదని కార్తిక మందున నింగి కృత్తికా 
    చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపండితులు శ్రీ వెలుదండ వారికి మరియు అవధానులు శ్రీ మైలవరపు మురళీకృష్ణ వారికి ధన్యవాదములతో...

      ఉత్పలమాల
      కుందెనహో! బృహస్పతియె గూడఁగ శిష్యుడు భార్య తారతో
      నందనునంద నల్గురట నవ్వఁగ నల్గుచు మూల్గెనిట్టులన్
      "చందనచర్చ వేడినిడె , శారదపూర్ణిమ నింగిఁ దారయున్
      చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా!"

      తొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    ముందుగఁ జంద్రశేఖరుఁడు పూనఁగ, వెన్కనుఁ జంద్రబాబు తా
    డెందము నందునన్ సతము దీక్షనుఁ బూనఁగ, రాష్ట్రముల్ దగన్
    ముందుకుఁ బోవుచుండఁగను, పూనియుఁ గేంద్రము సాయ మీనిచోన్,
    జందురు లిద్ద రున్నఁ, గనఁజాలము చంద్రిక లయ్యొ! దైవమా!

    రిప్లయితొలగించండి
  30. సమస్య :-
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి

    తే.గీ*

    అలకకును కారణము జెప్పుమంబుజాక్షి
    చంద్రకాంతులీనెడి మోము సన్న బడెను
    పైన చంద్రుడింటను జ్యోత్స్న పండనేమి
    చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
  31. తెలుగు రాష్ట్రము లందున కలిమి లేక
    కలసియుండిన చెలిమియె కరువు కాగ
    వసుధ నేలెడు దివ్యమౌ ప్రభువులైన
    చంద్రులిద్దరున్నను లేదు చంద్రకాంతి!!!

    రిప్లయితొలగించండి


  32. అందరు మెచ్చురాముడట నన్నియు వీడుచు సాగుచుండగా
    డెందము నందుబాధనట లీలగ జూపుచు పల్కిరిట్టులన్
    చందురు వంటిరాముడును,జాబిలి నింగిన కానిపించినన్
    చందురు లిద్దరున్నగనజాలము చంద్రిక లయ్యొ దైవమా

    రిప్లయితొలగించండి
  33. వందల మంత్రముల్ నుడివి భళ్ళున జల్లిన గంగతీర్థమున్
    బందరు లడ్డులన్ కుడిపి పండుగ జేయగ భాగ్యనగ్రినిన్
    పందిరి మంచమున్ పరచి పండుకు బెట్టుచు జోలపాడినన్
    చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా

    రిప్లయితొలగించండి