27, జూన్ 2018, బుధవారం

సమస్య - 2718

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై"
(లేదా...)
"పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

76 కామెంట్‌లు:

  1. సుతగొనె భూమికి సీతా
    పతి యల్లుండై; సపత్ని వరలెను, సుతయై
    యతివయె హరికిని సురనది,
    స్తుతముగ పార్వతికి నాడు శుభముగ నీశా!

    రిప్లయితొలగించండి
  2. గిరికిపాటి వారి పూరణ.....

    అతిదారుణ బంధము లివి
    వ్రతకల్పము లౌను గాదె వైకుంఠములో
    క్షితిజాతను గను భూమికి
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై.

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    క్షితికిన్ బుట్టెను పుత్రియౌచు సిరియే సీతాకృతిన్ , భూ రమా
    పతియే రామునిగా జనించి , తను చేపట్టెన్ ధరాపుత్రికన్!
    మతినాలోచనఁజేయ చుట్టరికమున్ మాన్యా ! యిలాదేవికిన్
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. క్లైబ్యం మా స్మ గమః పార్థ ...

      సుతఁ గొని భూమికి ధరణీ
      పతి యల్లుండై; సపత్ని వరలెను సుతయై
      క్షితిజయె ధాత్రికి , కవి ! ప్ర...
      స్తుతమునకిది పూరణమ్ము ! స్తుతియింపంగన్!!

      🙏

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ఒకావిడ.. పొరుగింటావిడ తో ఇలా అంటోంది.. 😀

      పతియున్ బుత్రియు నిర్వురుండిరి గృహంబందున్ సతాయింపగా!
      సతమున్ నాకిది యిష్టమంచనును మెచ్చంబోడు నా భర్త., నా
      సుతయే ! నేనొక క్రొత్తచీరఁ గొన జూచున్ వింతగా ! బాపురే !
      పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. సవరణ:

      క్షితికిన్ బుట్టెను పుత్రియౌచు సిరియే సీతాకృతిన్ , భూ రమా
      పతియే రామునిగా జనించి , యిట చేపట్టెన్ ధరాపుత్రికన్!
      మతినాలోచనఁజేయ చుట్టరికమున్ మాన్యా ! యిలాదేవికిన్
      పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"

      ధన్యవాదములతో.... మురళీకృష్ణ 🙏🙏

      తొలగించండి
    6. మైలవరపు వారి లౌకిక పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    7. మైలవరపు వారు

      ఇవ్వాళ మీరు డబల్ సిక్సర్ !

      చాలా బాగుంది


      జిలేబి

      తొలగించండి
    8. “సతాయింపగా” ననడము మీ వంటి ప్రాజ్ఞులకు శోభ నీయదు మురళీ కృష్ణ గారు!

      తొలగించండి
    9. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... వ్యావహారికమే..దానిని.... విమర్శింపగా... అనియు.. తొలి పద్యం లోని.. రెండవ పాదంలో.. తను . అనునది.. యిట.. అనియు గమనింప మనవి .. మన్నించండి... నమోనమః... మురళీకృష్ణ

      తొలగించండి
    10. మురళీకృష్ణ గారు నమస్సులు. సవరణ బాగున్నది. మీ మనస్సు నొప్పించిన క్షమించగలరు.

      తొలగించండి
    11. శ్రీ పోచిరాజు వారికి ప్రణామాలు . అంత పెద్ద మాట ఎందుకండీ.. మీ వంటి వారి పరిశీలన తరువాత నా పద్యం అనర్ఘరత్నమౌతుందని నా భావన . హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిశ్శ్యామికాపి వా.... నమోనమః

      తొలగించండి
  4. డా.పిట్టాసత్యనారాయణ
    పతియౌ నిక్కమటంచు బ్రేమికునిచే బాహ్యంపు సంబంధ మే
    గతి?! నే వీడితి మోరిపై మనుగడన్ గల్లంతుగాన్ మత్ సుతన్
    సతిగా మారె దుబాయి వెళ్ల బతికిన్ సావాసమై బెళ్లినిన్
    జతనంగా నవె పుట్టు మచ్చలకటా!సాయేబుగా మారె1 నా
    బతి యల్లుండుగ బుత్రియే సవతిగా బ్రాప్తించె జిత్రంబుగన్
    (1.ఇస్లాము మతావలంబికి రెండవ వివాహం చెల్లును)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణలో కొంత అస్పష్టత ఉన్నది.
      'మోరిపై'...? 'జతనంగా' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా. అచ్చంగా అవే పుట్టుమచ్చలా మోరిపై ఆ వనిత విడిచి పెట్టినశిశువుకు.యత్నంకొలది ఆమె పరిశీలించి తప్పి పోయిన తన శిశువు దుబాయికి తీసుకు వెళ్ళబడింది.కాలువ అందామా గట్టుకావాలి.జతనం వికృతి,యత్నమునకు,ఇదీ బాధ!

      తొలగించండి
  5. డా.పిట్టాసత్యనారాయణ
    "పతి పిన్నడు, నే బెద్దను
    మతినా షేక్స్పియరు వనిత మాదిరి; పెళ్లిన్
    సుత యీడు వధువు జేరన్
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై!"
    (ఒక అమాయక సపత్ని ఆవేదన.)

    రిప్లయితొలగించండి
  6. మగడు చచ్చిన మగువ మగతోడుగ మగడిని
    తను పొందదలచె
    తనతో పాటదె సవతిగ ఎదిగిన కూతురిని
    వధువుగ మలచె
    మండి తెగలవి బంగ్లాదేశమున మనువులట
    పవిత్రంబుగన్
    పతి యల్లుండుగ బుత్రియే సవతిగా బ్రాప్తించె
    జిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  7. క్షితి కి న్ జనించె సీత గ
    పతి పరి ణ య మా డె ను రఘు వంశో ద్భ వు ని న్
    వ్రత మది చె డ భూదేవి కి
    పతి యల్లుoడైస పత్ని వర లె ను సు త యై
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  8. అతివను భూజాతను రఘు
    పతి మనువాడగ భళారె! వరుసలు మారెన్
    స్థితికారిణి భూమాతకు
    పతియల్లుండై సపత్ని వరలెను సుతయై!

    రిప్లయితొలగించండి
  9. పతిమారుచునల్లుడుగను
    సుతయునునటసవతివోలెజూచుచుమిగులన్
    సతతముబాధించగనా
    పతియల్లుండైసపత్నివరలెనుసుతయై

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2718
    సమస్య :: *పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్.*
    భర్త అల్లు డయ్యాడు. కుమార్తె సవతి అయ్యింది చిత్రంగా అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సమస్య ఇస్తే అది అందరి ప్రశంసలను పొందేట్లు ఉంటే బాగుంటుంది. కవులు వినూత్నంగా ఆలోచించి గొప్ప ప్రశంసలు పొందేవిధంగా సమస్యాపూరణ పద్యాలను చెప్పడం ఇంకా బాగుంటుంది. ఐతే సంబంధ బాంధవ్యాలను అధర్మబద్ధంగా ఇవ్వడం సమ్మతమేనా? భర్త అల్లు డవడం, కుమార్తె సవతి కావడం ఎక్కడ జరిగింది ? అని సమస్య ఇచ్చిన వారిని ప్రశ్నించే సందర్భం.

    నుతులన్ బొందు సమస్య లిచ్చుట తగున్, నూత్నమ్ముగా నెంచి స
    న్నుతులన్ బొందెడి పద్య పూరణల నెన్నో చేయుటల్ బాగు, స
    మ్మతమే యిట్టు లధర్మబంధము నిడన్? మాన్యా! సుధీ! యెచ్చటన్
    *పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్ ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! ఇదేమీ కొత్త సమస్య కాదుగదా! మాటలు వేరైనా పలు రూపాలలో వివిధావధానాలలో యిచ్చిన సమస్యే కదా!
      భూదేవిని కృతయుగమున చేపట్టిన విభుడే (హరి) త్రేతా యుగమున రాముడై అల్లుడు కాగా ఆయన పత్ని (లక్ష్మి)సీతగా జన్మించి తన సుత యైనది కదా! (కందపాదము)
      తన పతి చేపట్టగా తన సుతయే (సీత)తన సవతి యైనట్లుకదా! (మత్తేభ పాదం)?
      విజ్ఞులేమందురో?

      తొలగించండి
    2. అన్ని రకాల బంధుత్వాలకు సంబంధించిన సమస్యలూ గతంలో యిచ్చినవే!! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. సమస్యాపూరణలో ఇదీ ఒక సంప్రదాయమే. అభినందనలు.

      తొలగించండి
    4. అవధాని వరేణ్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారి స్పందన.
      రాజశేఖర్ గారి వివరణ,పూరణ
      ఎవరినో అధిక్షేపించేది కాదు.సమస్య ఇచ్చినవారిని ఆక్షేపించేదీ కాదు.ఆ ధోరణిలో
      ఆలోచించిన ఒక కవి ఆలోచన మాత్రమే.అది రజశేఖరనిబద్ధవక్తకు సంబంధించింది.ఆ కవి దాన్ని మొదటిసారి వినివుండవచ్చు.
      ఆయనకు ధర్మాగ్రహం కొంచెం ఎక్కువ కావచ్చు.

      తొలగించండి
    5. కోట రాజశేఖర్ ప్రత్యుత్తరం
      అవధాని వరేణ్యా!
      శ్రీ సూరం శ్రీనివాసులు అన్నయ్యా!
      అల్లన కిటియై ...... అని అంటూ ఒక కంద పద్యాన్ని అవధాని పితామహులు శ్రీ సి వి సుబ్బన్న గారు చెప్పినట్లు వినియున్నానండీ. ఐనా మనసొప్పక మఱియొక ధోరణిలో ఆలోచించి పూరించాను. మీ ఆమోదమును పొందగలిగినాను. ధన్యోఽస్మి. నమోనమః.

      తొలగించండి
    6. శ్రీ జనార్దన రావు గారి స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
    7. శ్రీమతి సీతాదేవి గారి స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
    8. నేటి నా సమస్యాపూరణ కు సానుకూల ధోరణిలో స్పందించి అభినందించిన
      శ్రీ కంది శంకరయ్య గురువర్ణ్యులకు హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  11. మతి వశము దప్పెను పరి
    శ్రుత సేవనమున యొకనికి , సోలముగ ననెన్
    రతిపతి యే సతము నుమా
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సేవనమున నొకకనికి' అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  12. అతి చిత్రమ్మీ బంధము
    క్షితికిని జూడనిలలోన సీతారాముల్!
    గత యుగమున గలిగిన నిజ
    "పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై"

    రిప్లయితొలగించండి
  13. పతినేదైవముగాదలంచితినినాప్రాణంబుతుల్యంబుగా
    సుతనున్నట్లుగజూడగా,జననిగాజూడన్మనంబొప్పకే
    పతియల్లుండుగబుత్రియేసవతిగాబ్రాప్తించెజీత్రంబుగన్
    నతిగారాబమునావిధంబుగనుమాయల్మారిగమార్చెనో

    రిప్లయితొలగించండి
  14. 3వపాదముచివర "జిత్రంబుగన్ " చదువవలసినదిగాప్రార్ధితుడను

    రిప్లయితొలగించండి
  15. మత్తేభవిక్రీడితము
    క్షితిపై విష్ణువె రామచంద్రునిగ నా శ్రీదేవి భూజాతగా
    జతగూడన్ గతిమాలినట్టిదగు నీ జంటన్గనన్ భూమికిన్
    బతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్
    శ్రుతి సూక్తంబగు బంధమెట్లగునె నాలోచించ మండోదరీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బంధ మిట్లగునె యాలోచింప' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ :

      మత్తేభవిక్రీడితము
      క్షితిపై విష్ణువె రామచంద్రునిగ నా శ్రీదేవి భూజాతగా
      జతగూడన్ గతిమాలినట్టిదగు నీజంటన్గనన్ భూమికిన్
      బతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁబ్రాప్తించెఁ జిత్రంబుగన్ 
      శ్రుతి సూక్తంబగు బంధమిట్లగునె? యాలోచింప మండోదరీ!

      తొలగించండి
  16. కందం
    నుతిగొను రమా, రమణులే
    జతగూడ నవనిజ రామచంద్రులగనిలన్
    గతిమాలు బంధము! ధరకుఁ
    బతి యల్లుండై సపత్ని వరలెను సుతయై!!

    రిప్లయితొలగించండి


  17. ఇవ్వాళ రాముల వారిని యెవరూ వదిలేటట్టు లేరు :)


    అతుకుల బొంతగ రాముని
    కతను జిలేబి చదువంగ కందపు పాద
    మ్ము తనకు తోచగ నిట్లనె
    "పతియల్లుండై సపత్ని వరలెను సుతయై!"

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కల్పిత కధలతో పద్యమల్లితే పూరణ రాణించదు కదా!

      తొలగించండి

    2. పూరణ కిట్టింపులకై
      సోరణి దివ్వెల కళుకున సొంచాయింపన్
      సారమ్ము లేని పాద
      మ్మే రెపరెపలాడెనుగద మించార సుమీ :)


      జిలేబి

      తొలగించండి
  18. అతి చిత్రమ్ముగ బంధముల్ కలిగెగా యానాడు భూమాతకున్
    గతమందున్ నిజ భర్తయే జగతినే కాపాడ జన్మించగన్
    సుతయౌ సీతనె ధర్మపత్నిగను దా చొక్కంగ జేపట్టగన్
    "పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"

    రిప్లయితొలగించండి


  19. సుతనివ్వంగను పెండ్లిలోన నకటా సుస్తీపడెన్నొబ్బిడన్
    సతినానాటికి కష్టమాయె బతుకన్ జామాతకున్, జీవన
    మ్ము తరమ్మై నిలువన్ ద్వితీయ కొమరిన్ ముద్దారుగా నివ్వ, శ్రీ
    పతి యల్లుండుగఁ, బుత్రియే, సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    క్షితినాథుం డగు పద్మ‌నాభుడు :- సురల్ సేవించి ‌ - ప్రార్థించినన్

    క్షితి రాల్చన్ దశకంఠు కంఠముల నా శ్రీరాముడై పుట్టి తా

    క్షితికన్యామణి సీతఁ జేకొనె | కవీ ! సిధ్ధించె నర్థం బిటుల్ =

    " పతి యల్లుండుగ , బుత్రియే సవతిగా బ్రాప్తించె జిత్రంబుగా "

    రిప్లయితొలగించండి
  21. ఇతివృత్తమ్మిది క్రొత్త చిత్రమునకై -యెన్నాళ్ళ పూర్వమో
    హతుడైపోయిన భర్తయే బ్రతికె భార్యన్ గుర్తు పట్టంగ తా
    మతి కోల్పోయె - వివాహమాడె సుత సంబంధీకయౌకన్యనే
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్(చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. అతి చిత్రమ్ములు భవ పం
      చత లెంచ నతీతము మరు జన్మము నందం
      చితముగఁ గాఁ గల దివ్విధిఁ
      బతి యల్లుండై సపత్ని వరలెను సుతయై


      నుతియింతుం గడు భక్తి శంకరుని నేనోరార నిత్యంబు సం
      తత పూజార్హులు గాంచ సత్క్రమము సత్యం బయ్యెఁ జెప్పంగఁ బ
      ర్వత సూనాద్వయి మేనకా సురనదీ బంధుత్వమున్ సానుమ
      త్పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్

      [సానుమత్పతి = కైలాస పతి; సానుమత్పుత్రి = పార్వతి (హిమవంతుని కూతురు) ; మేనకకు శంకరుఁ డల్లుఁడు, గంగకు పార్వతి సవతి]

      తొలగించండి
  23. రతిపతి తండ్రి జనించగ
    క్షితిపై దశరథ సుతునిగ గీర్వాణులు కో
    ర తిరమగు నిచ్చ , భూమికి
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    సతియౌ పృథ్వికి నాథుఁ డంత భువిపై స్వాంశన్ రఘూత్తంసుఁడై,
    సతిగాఁ దాఁ గొనె సీతనున్ హరుని విల్ సంధించియుం ద్రుంచియున్!
    మితి లేనట్టి ప్రమోద మందుకొనఁగా మిన్నంటు భూదేవికిం,
    బతి యల్లుండుగఁ, బుత్త్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్!!

    రిప్లయితొలగించండి
  25. పతియౌ భూపతి రాముడె
    పతి,యల్లుండై!సపత్నివరలెను సుతయై!
    "మతిమంతులెంచుపూరణ
    నతిచమత్కార భరిత మందునసాగెన్"!

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    ("అండజానిచ జారుజానిచ స్వేదజానిచోద్భిజ్జానిచ అశ్వ గావః పురుషా హస్తినో యత్కించేదం ప్రాణి జంగమంచ పతత్రిచ యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ")


    ఇతడే మత్స్యము కూర్మమై భడవ! పో! యీతండె కుందారమై
    యితడే పూరుష-సింహుడై భడవ!
    పో! యీతండె కుబ్జుండునై
    యితడే రాముడు రాముడై భడవ! పో! యీతండె రాముండునై
    యితడే బుద్ధుడు కల్కియై భడవ! పో! యీతండె సర్వస్వమై
    యితడే యా పరమాత్మరా భడవ! పో! యీతండధర్మంబుగా
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్

    "భడవ : శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975
    కొంచెం ముద్దుగా తిట్టడం"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. భడవ అంటే గుర్తుకొచ్చింది...,

      పూనెను హూణవిద్యలను బోధనఁజేయ వివేకశూన్యుడ
      వ్వానికిఁజెప్పవేల, భడవా! నిజతత్వమెఱుంగువిద్యతోన్
      బ్రాణములేనిదేహము విరాజిలఁజేయనసాధ్యమేరికిన్
      జ్ఞాన సరస్వతీ,సలిలజాత ముఖాంచిత వాగధీశ్వరీ!

      జ్ఞానకౌముది-ఏకప్రాస శతకం నుండి
      🙏🏻

      గౌరీభట్ల బాలముకుంద శర్మ

      తొలగించండి
  27. ధృతితో భేదన జేసి శంకరు విలున్ తేజమ్ముతో నిల్చితా
    క్షితిపుత్రిన్ గొన భార్యగా కనుచు నక్షింతల్ శిరమ్మందునన్
    దితిపుత్రుల్ చిలికించ రాముపయి ప్రీతిన్ బొందుచున్ భూమికిన్
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  28. వెతలం దీర్పుమటంచు నాడు విభునిన్ వేడంగ వైకుంఠుడే
    క్షితినిం బుట్టియు కోసలేశ సుతుడై ఛేదించ చాపంబు సం
    హతయై లక్ష్మియె భార్యయయ్యె ధవ మాహాత్మ్యంబు బెంపారగన్
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై

    సందర్భము: "మా నాన్నకు..అనగా హిమవంతునికి నా పతి.. అనగా పరమ శివుడు అల్లుడై యతికినాడు.. అనగా అనుకూలమైన బంధుత్వంగా కలిసిపోయినాడు.
    సపత్ని.. నా సవతి.. అనగా గంగాదేవి.. మా యన్నకు.. అనగా విష్ణుమూర్తికి సుతయై వరలెను."
    అని జిత మన్మథుడైన శంకరుని రాణి గౌరి చెలికత్తెలతో చెబుతున్నది.

    అతుకుట= అనుకూలమగుట, కలిసివోవుట
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "అతికెను మా నాన్నకు నా
    పతి యల్లుండై.... సపత్ని
    వరలెను సుతయై
    స్తుత మతి మా యన్న" కనియె
    జిత మన్మథు రాణి గౌరి చెలికత్తెలతో..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    27.6.18

    రిప్లయితొలగించండి


  30. కృతయుగమ్మున ముదమున
    క్షితిదేవికిపతి యగుచును శ్రేయము లొసగెన్
    క్రతువును చేయగ పుట్టెను
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై.

    2.క్షితికా రాముడె యల్లుడయ్యె గనుమా సీతా మహాసాధ్వియే
    సుతయై పుట్టగ త్రేత యందు విను మా చోద్యంబుగాశ్రీహరే
    సతికిన్ పుత్రు నొసంగె నత్తరిని తా వైదేహిఁ పెండ్లాడ నా
    పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై

    సందర్భము: "మా నాన్నకు..అనగా హిమవంతునికి నా పతి.. అనగా పరమ శివుడు అల్లుడై యతికినాడు.. అనగా అనుకూలమైన బంధుత్వంగా కలిసిపోయినాడు.
    సపత్ని.. నా సవతి.. అనగా గంగాదేవి.. మా యన్నకు.. అనగా విష్ణుమూర్తికి సుతయై వరలెను."
    గౌరి ఇలా చెలికత్తెలతో క్రమంగా చెబుతున్నది. 1కి1...2కు2 అనుసంధించుకోవలె.

    అతుకుట= అనుకూలమగుట, కలిసిపోవుట

    సమస్య 4 వ పాదంలోనే రావాలనే నియమం పెట్ట బడినప్పుడు పూరించవలసివస్తే.. ఇలా పూరించాలి....
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "నుత గుణు డగు మా నాన్నకు...(1)
    స్తుతమతి మా యన్న..."(2)
    కనియె దుర్గ క్రమముగా...
    "నతికెను సంబంధము నా
    పతి యల్లుండై...(1) సపత్ని
    వరలెను సుతయై.."(2)

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    27.6.18

    రిప్లయితొలగించండి