1, జులై 2018, ఆదివారం

సమస్య - 2722

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు"
(లేదా...)
"చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

34 కామెంట్‌లు:



  1. అక్రమార్జన చేయుచు నాంధ్ర దేశ
    మందు వెలిగెడు భక్తుని మార్చ వచ్చి
    న ముర ళీకృష్ణునికి వందనంబటంచు
    చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మరక నెరుగని పాండవమధ్యముండు ;
    సాటి లేనట్టి క్షత్రియ సవ్యసాచి ;
    ధన్యముకుళితహస్తుడై తనదు జీవ
    చక్రమును ద్రిప్పె బార్థుండు చక్రి ముందు .

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. వక్ర బుద్ధిని గైకొని వైరమందు
      విక్రమముతోడ దండెత్తు వీర్యమొప్ప
      నక్రమములేక వెంటాడి సక్రమముగ
      చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు :)

      చక్రము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
      సం. వి. అ. న.
      4. దండు;


      చక్రి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
      సం. వి. న్‌. పుం.

      4. రారాజు;

      తొలగించండి


  4. విక్రముడా! కిరీటి! భువి వీరుల కందువ! కందుటేలనో
    నక్రమ మీ విదారణమ టంచు నధీరుడు గా విచారముల్
    సక్రమ మిద్దికాదు విను! స్వామిని సర్వము నేను లెమ్మనన్
    చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పంచ భూతముల సాక్షి పరమ ప్రీతి
    సతిని ప్రేమగ జూచెడి పతి నటంచు
    గొప్ప ప్రకటన జేయుచు కుటిల భర్త
    చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రి ముందు

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    చక్రిమహోపదేశముల సారమెరింగి మహోగ్రరూపుడై
    శక్రతనూజుడాక్రమితశాత్రవుడై రిపులన్ దహింప , ని...
    ర్వక్రబలోద్ధతిన్ నిశితబాణవినిర్మితవహ్నిప్రోజ్జ్వల...
    చ్చక్రము ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుడై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధాని వరేణ్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారికి నమస్సులతో..... చిరు సవరణ....🙏

      చక్రిమహోపదేశముల సారమెరింగి మహోగ్రరూపుడై
      శక్రతనూజుడాక్రమితశాత్రవుడై రిపులన్ దహింప , ని...
      ర్వక్రబలోద్ధతిన్ నిశిత బాణ కృతానల భీకరోల్లస.......
      చ్చక్రము ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుడై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి 🙏

      తొలగించండి
  7. నీకు చేతకాకున్నచో నేను చేతు
    రణమనుచు వాసుదేవుడు రధము దిగుచు
    చక్రము నుదిప్పె,బార్ధుడు చక్రిముందు
    తనదు నశక్తతనుతెల్పి తనదు బంధు
    వులను చంపగలేనని తెలుపు చుండె


    అర్జునుడు రణములో డీలావడిపోవ పౌరుషము కల్గించుటము కల్గించుటకు వాసుదేవుడు రధము దిగి తన చక్రము తో శత్రు సంహారం చేసదనని పలికిన పలుకులు

    రిప్లయితొలగించండి
  8. రథ ము నడుపు చు వ్యూహ మ్ము రచన చేసి
    బావ సాయము చేయ గా బ వ ర మందు
    తనకు తానె సాటి యన గ దైర్యము గను
    చక్రము ను ద్రిప్ పె పార్టు oడుచక్రి ముందు

    రిప్లయితొలగించండి
  9. భారత సమర మందున ప్రజ్వలించి
    బాణముల విడ్చి చెచ్చెర ప్రకట వైరి
    చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు
    కౌరవ ప్రముఖు లనిఁ బ్రకంపమొంద

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    సర్వమును తానె యోజనా చక్రిననుచు
    రైతునున్ రాజు జేయు షరాఫు1 మోది
    నిధిని విప్పకబోయిన న్నిజ మనీష2
    నాదుకొనెగాదె కేసియార్ హ్లాదమొప్ప
    చక్రమును ద్రిప్పె బార్థుండు చక్రి ముందు
    (1.కోఠీదారుడు,2.బుద్ధి, ప్రజ్ఞ,మతి..శ.ర.)

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2722
    సమస్య :: *చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షము నందు శూరుఁడై.*
    చక్రపాణి యైన శ్రీ కృష్ణుని దగ్గఱ అర్జునుడు చక్రం త్రిప్పినాడు. తన శౌర్యాన్ని ప్రదర్శించినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపినాడు పార్థసారథి యైన శ్రీకృష్ణుడు. శత్రుపక్షంలో తనకు ఆచార్యులను బంధువులను చూచిన అర్జునుడు ‘’హే కృష్ణా! స్వజనులైన వీరిని నేను చంపలేను’’ అని విషాదమునకు లోనుకాగా జగద్గురువు అగు కృష్ణ భగవానుడు ‘’ఓ అర్జునా! ఇట్లు అధైర్య పడుట నీకు తగదు. హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టు. నీ క్షత్రియ ధర్మాన్ని ఆచరించు. నీవు నిమిత్త మాత్రుడవు’’ అని గీతను బోధించి మార్గదర్శకుడు అయ్యాడు. పరంతపుడైన పార్థుడు తన సందేహము మోహము తొలగిపోగా ఆత్మజ్ఞానమును పొంది శ్రీ కృష్ణుని సమక్షం లోనే శత్రు సంహారం చేసేందుకు చక్రం త్రిప్పిన సందర్భం.

    ‘’అక్రమ మేమొ? కృష్ణ! స్వజనాదుల జంప’’ ననన్ కిరీటికిన్
    సక్రమ మార్గదర్శకుడు శౌరియె గీతను బోధ జేయగా,
    నక్రమ శోకమే తొలగ నాహవ మందు నిమిత్తమాత్రుడై
    *చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షము నందు శూరుడై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (1-7-2018)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    వక్రపు చింత పెన్గొన నవారిత సాహసమంది కృష్ణుదౌ
    సక్రమ ధర్మ బోధనల సారమెరింగి సుకర్మచోదనన్
    విక్రమమొప్ప కౌరవుల వీర్యము డిగ్గగజేసి భాగ్యపుం
    జక్రము ద్రిప్పె నర్జునుడు చక్రి సమక్షము నందు శూరుడై!

    రిప్లయితొలగించండి
  13. నర నారాయణులు వారు అవతార పురుషులు
    కారణజన్ములు
    ధరణి భారము పూని దించగ ఉద్యమించిన
    క్షాత్ర ధర్ములు
    సారథిగ శౌరిని యెంచి తెలివిగ చక్రము ద్రిప్పె
    నర్జునుడు
    చక్రి సమక్షము నందు శూరుడై వెలుగంగ తానదె
    విజయుడు

    రిప్లయితొలగించండి
  14. అన్న దమ్ములు మనవారు నచట నిచట
    రాజ్య సుఖమేమి మనవారు రాలి పోవ
    వద్దు వద్దనుచు యుద్ధమును వదలి హృదయ
    చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  15. సక్రమ పద్ధతిన్ రణము సాహస మందున చేయగా వలెన్
    వక్రపు బుద్ధితోడ పగ వారలు గాదన నాపగే యునిన్
    విక్రమ మున్వధిం పమది వేల్పులు మెచ్చగ రాజ ఠీవియున్
    చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షము నందుశూ రుడై

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు
    చక్రి సమక్షమునందు శూరుఁడై

    సందర్భము: నరకాసురుని వధించి చక్రధరుడైన కృష్ణుడు రాగా నెంతో సంతోషంతో అందరూ దీప తోరణాలతో పండుగ చేసుకున్నారు. టపాసులూ కాల్చినారు.
    భీముడు "విష్ణుచక్రము" కాల్చినాడు. అర్జునుడేమో "భూచక్రము" కాల్చినాడు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    చక్రధరుండు తా నరక
    సాల్వునిఁ గూలిచి రాగ పండుగై
    విక్రమ మొప్ప హర్షమున
    భీముడు కాల్చెను *విష్ణు చక్రమున్*
    వక్రత లేని దంచును ట
    పాసులు కాల్చుచు స్వీకరించి *భూ*
    *చక్రముఁ* ద్రిప్పె నర్జునుఁడు
    చక్రి సమక్షమునందు శూరుఁడై

    సాల్వుడు=రాక్షసుడు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    1.7.18

    రిప్లయితొలగించండి
  17. కరిని గాపాడుటకు నాడు హరియె పూని;
    కర్ణుని హతమార్చె తుదకు కవ్వడి యగు;
    సమసె నరకుడు నిలువక సంగరమున;
    "చక్రమునుఁ ద్రిప్పెఁ ;బార్ధుండు ; చక్రిముందు

    రిప్లయితొలగించండి
  18. పరుషపదజాలములతోడవైరిపైన
    చక్రమునుద్రిప్పెబార్ధుండుచక్రిముందు
    సక్రమమెయనిగృష్ణుడుసర్దిచెప్ప
    న్యాయమార్గమెవీరులనడకసుమ్ము

    రిప్లయితొలగించండి
  19. డా.ఎన్.వి.ఎన్.చారి
    నరకుని వధతో మురిసెనా నంద మునను
    దీపతతులతో వెలిగెనా దివ్య జగతి
    సంతసమ్మున నెగురుచు కాంతీలీను
    చక్రమును ద్రిప్పె బార్థుడు చక్రిముందు

    రిప్లయితొలగించండి
  20. డా.ఎన్.వి.ఎన్.చారి
    నరకుని వధతో మురిసెనా నంద మునను
    దీపతతులతో వెలిగెనా దివ్య జగతి
    సంతసమ్మున నెగురుచు కాంతీలీను
    చక్రమును ద్రిప్పె బార్థుడు చక్రిముందు

    రిప్లయితొలగించండి
  21. తే.గీ.
    శత్రుసేనలు జృంభించు సమయమందు
    చక్రము సమస్యన రథము సాగలేదు
    పార్థుడు దిగెను క్రిందకు బాగు జేయ
    చక్రమును దిప్పె పార్థుడు చక్రి ముందు

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    వక్రపు చింత పెన్గొన నవారిత సాహసమంది కృష్ణుదౌ
    సక్రమ ధర్మ బోధనల సారమెరింగి సుకర్మచోదనన్
    విక్రమమొప్ప కౌరవుల వీర్యము డిగ్గగజేసి భాగ్యపుం
    జక్రము ద్రిప్పె నర్జునుడు చక్రి సమక్షము నందు శూరుడై!

    రిప్లయితొలగించండి
  23. అరి గణ దమనుం డస్త్ర విద్యా నిపుణుఁడు
    రణ విశారదుండు కిరీటి గుణ యుతుండు
    నత్తరి ననిఁ జలమున దండెత్తిన పర
    చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు

    [చక్రము = దండు/సేన]


    విక్రము లిద్ద ఱుద్ధతులు భీకరులై చన నాజినిం జమూ
    చక్రము నొంద నచ్చెరువు జాలిగఁ గర్ణుఁడు నేల దూల భూ
    చక్రము నందు దూఱ రథ చక్రము చక్రి యనుజ్ఞతో ధను
    శ్చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై

    [చక్రి = కృష్ణుడు; రథ చక్రము హస్తమున కలవాడు, కర్ణుడు]

    రిప్లయితొలగించండి
  24. విక్రమముడయ్యు స్వజనుల ప్రీతుల వరు
    స క్రమము జూసియు రణము చలుపుటనగ
    నక్రమమును చేయుటగాదె యంచు వంశ
    చక్ర మునుద్రిప్పె బార్ధుండు చక్రిముందు

    రిప్లయితొలగించండి
  25. తేటగీతి
    శ్రీకరుండు సుభద్రను సేవ కొసఁగి
    వలపు పండించు వ్యూహమ్ముఁబార్థునకిడ
    కపట మునివలె నటియించ గడ్డపు కొనఁ
    జక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (రాబోవు చిత్రము:
    "నర నారాయణ యుద్ధము")


    విక్రయ రీతులన్ గఱచి వీధుల వీధుల వెంబడిచుచున్
    విక్రమ రాహులుండు నిజ వీర్యము జూపుట మోడితోడ నా
    వక్రపు బుద్ధికిన్ విభవ వైరపు చిత్రమదిట్లు తోచెగా:
    చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు
    శూరుఁడై...

    రిప్లయితొలగించండి
  27. ప్రతిన బూనినసైందవ పతనమెంచి
    సూర్యుడస్తమయములోపుజుడమనగ?
    అర్జునుని గెలుపెంచి హరియుతానె
    చక్రమునుదిప్పె|బార్థుడు చక్రిముందు
    కృష్ణ లీలనుదెలియకతృష్ణచేత

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు.

    శాంతనవుని రణము గాంచి శైలధరుడు
    చక్రమును దిప్పె; పార్థుడు చక్రి ముందు
    నిలచి నాజిలో శస్త్రము నిలుప నన్న
    నతని మాటను వల్లించ నాస్థ జేసె
    (ఆస్థ=ప్రయత్నము)

    రిప్లయితొలగించండి
  29. విక్రమదుర్నిరీక్ష్యకృదభీలపరాక్రమసంధితాస్త్రని
    ర్వక్రసులక్ష్యభేదియగు భాసురగాండివకార్ముకమ్ముతో
    అక్రమదుష్టమార్గరచితాక్షయకౌరవపక్షవాహినీ
    చక్రముఁ ద్రిప్పె నర్జునుడు చక్రిసమక్షమునందు శూరుడై.

    రిప్లయితొలగించండి
  30. సక్రమమార్గమేయనుచుచక్రిపదేపదిపల్కగాదగన్
    చక్రముద్రిప్పెనర్జునుడుచక్రిసమక్షమునందుశూరుడై
    విక్రమమొప్పగాననినివేలకువేలుగశత్రుమూకలన్
    వక్రములౌవిధంబుగనువ్రక్కలుసేసెనువారిదేహముల్

    రిప్లయితొలగించండి
  31. గీతనుపదేశమొనరించి చేతన గల
    వారిగా జనులను జేయ శౌరి విదిత
    చక్రమును ద్రిప్పె ; బార్థుండు చక్రి ముందు
    మొగిడి వినగ నాశమ్మొందె మోహముడిగి!

    రిప్లయితొలగించండి
  32. ప్రక్రియ నెన్నికన్ గెలువ భాగ్యపు కన్నడ రాజ్యలక్ష్మినిన్
    సూక్రము వోలుడింపులుడు స్రుక్కుచు పట్టి కుమారు కాళ్ళనున్
    వక్రపు బుద్ధిదిట్టెనట వాగుడు కాయగ మోడి వర్యునిన్ 👇
    "చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై"

    రిప్లయితొలగించండి