9, జులై 2018, సోమవారం

సమస్య - 2728

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"
(లేదా...)
"సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

95 కామెంట్‌లు:


  1. నిత్య మైనది సత్యము నిక్కమదియె
    కాని ప్రాణమానములకు కష్టమైన
    సమయమున నప్రియంబు, పొసగనిదైన
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. పన్నులందును పశువుల పాడియందు
    రాజకీయమందు ధనపు రచ్చలందు
    వారిజాక్షులందును పెండ్లి బాటలందు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టాసత్యనారాయణ
    పెళ్లిచూపుల యందును బ్రియము కాని
    విషయమును విప్పజూచిన విధమునందు
    పాడిగోహత్య సూచన బరగనున్న
    సత్యమును బల్క బుధు లపచారమంద్రు

    రిప్లయితొలగించండి


  4. సత్యము నిత్య మైనది నసత్యము క్షీణమగున్ వడిన్, సఖీ
    ప్రత్యవహారమందు, ప్రతిపత్తికి ద్రోహము గల్గు వేళ నౌ
    చిత్యము గానకన్ జనులు చింతన జేయక వేగిరమ్ముగా
    సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పూరణలను పరిశీలించిన ప్రతిసారి నిఘంటువును ఆశ్రయించక తప్పదు. ఈరోజు 'చిత్యము' శబ్దం కోసం ఆంధ్రభారతి తలుపు తట్టవలసి వచ్చింది!

      తొలగించండి

    2. కంది వారికి
      నమో నమః

      ఔచిత్యము అని రాసాను . ంంంంంంంంంంంం

      మీరు చిత్యము అని కొత్త పదాన్ని చూపించారు :)


      జిలేబి

      తొలగించండి
    3. ఇంకేం! క్రొత్త ఆయుధం దొరికింది "త్య" ప్రాసకు! జయీభవ దిగ్విజయీభవ!!!

      తొలగించండి

    4. కొంత సవరణ కోతి చేతికి కొత్త ఆయుధము దొరికెను :)


      జిలేబి

      తొలగించండి
  5. అన్నిదేశమ్ము లభివృద్ధి నందవలయు ;
    నరులు తమలోని పొరపుల మరువవలయు ;
    కరుణహృదయజీవితహాని కారకమగు
    సత్యమును బల్క బుధు లపచారమంద్రు .

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    నిత్యపు భోజనంబు పయి నింటను బైటను పూరుషాళి ,యా
    గత్యమటంచు నొప్పుదల నప్పుడె విప్పగ కన్యకాళి, సాం
    గత్యమునందు క్షేమమును గౌరవమొప్పగ జెప్పు వారలున్
    సత్యము బల్క నార్యులపచారమటందురు శాస్త్ర సమ్మతిన్

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    సత్యము బల్కగావలెను శాంతికరమ్ముగ , నప్రియమ్మునౌ
    సత్యము బల్కరాదిల ప్రజాహితమున్ మదిఁ గోరి , కాన నౌ..
    చిత్యమునెంచు , జీవులు రుచించని శాంతివినాశకమ్మునౌ
    సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జడ కందములు... మా కందములు.. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం లో కలసిన మిత్రులు... 🙏సర్వశ్రీ...
      కంది శంకరయ్య.. ముద్దు రాజయ్య.. మునుగోటి వారు... వెలుదండ వారు... మాముడి వారు.. అంబటి భాను... అవుసుల భానుప్రకాశ్... విరించి... బిట్రా నాగమల్లేశ్వరరావు... పాండురంగవిఠల్... చంద్రమౌళి సూర్యనారాయణ... అంజయ్య గౌడ్... విట్టుబాబు... బొగ్గరం ఉమాకాంత్... ప్రసాద్... శిష్ట్లా శర్మ... భూసారపు నర్సయ్య... ఊర ఈశ్వరరెడ్డి... మాచవోలు వారు... ప్రభాకరశాస్త్రి... బస్వోజు సుధాకరాచారి... అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి.... తిరుక్కోవళ్లూర్ శ్రీహర్ష... జ్ఞానప్రసూన... గుండు మధుసూదన్... తోపెల్ల బాలసుబ్రమణ్యం... విద్యాచరణ్... షరీఫ్... రామకృష్ణారెడ్డి... జంధ్యాల ఉమాదేవి... అనంతకృష్ణ... తురిమెళ్ల రాధాకృష్ణ... బద్రిపల్లి శ్రీనివాసులు... చింతా రామకృష్ణారెడ్డి... కోట రాజశేఖరావధాని గారు...
      ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు 🙏🙏



      చని నే గాంచితి కంది శంకరుల , రాజన్ముద్దు రాజయ్యనున్ ,
      మునుగోటిన్ , వెలుదండ , మాముశను , భానుద్వంద్వమున్ , శ్రీ విరిం...
      చిని , బిట్రాన్వయు , పాండురంగవిఠలున్, శ్రీ సూర్యనారాయణున్ ,
      ఘనునంజయ్యను , విట్టుబాబును , నుమాకాంతప్రసాదాఖ్యు , శ...
      ర్మను, భూసారపు వారి , నీశ్వరుని , శ్రీ మన్మాచవోలాఖ్యు , శా...
      స్త్రిని , బస్వోజు సుధాకరార్యు, నసనారేవారి , శ్రీహర్షునిన్ ,
      దనరన్ జ్ఞానప్రసూన , గుండు మధుసూదన్వర్యు , తోపెల్ల వా...
      రిని , విద్యాచరణున్ , షరీఫుననగన్ , శ్రీరామకృష్ణాఖ్యు , నా...
      ర్యను జంధ్యాల , నంతకృష్ణ , తురిమెళ్లార్యాదులన్ బద్రిప...
      ల్లిని , చింతాన్వయు, రాజశేఖరుల .., ,నిల్చెన్ శాశ్వతంబౌనటుల్
      మన సాంగత్యము , శంరాభరణమై మాన్యమ్మునై వెల్గెడిన్ !
      నను మన్నింపుడు విస్మరించితినొ మీ నామంబునేదేనియున్ !!

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    2. మన్నించితిమి జిలేబిని విడిచినా :)


      జిలేబి

      తొలగించండి
    3. అసలు పై పేర్లలో ఒకటి మీ నిజ నామధేయమేమో, ఆ మాట మీరు ఒప్పుకోవడం లేదేమో? కాకుంటే లిస్టులో మిమ్మల్ని విడిచెయ్యడమా? 🙂

      తొలగించండి
    4. మైలవరపు వారి పూరణ, కవి మిత్రులను ప్రస్తావించిన పద్యం రెండూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  8. బడానాయకుడు కొత్తగా చేరిన ఛోటానేతల తో :)

    అయ్యిరయ నేతలుగ నయ్యిరయ్య మిత్రు
    లార! గవనము మీకు వలయును మీరు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు
    రాజకీయమున పనికి రాని దదియె

    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. సత్య మాడినచో పెండ్లి చట్టుబండ
    లగు పరిస్థితి కలుగ గత్యంతరమ్ము
    లేక కల్లల నాడిన కాదు దొసగు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు.

    రిప్లయితొలగించండి

  10. జడకందముల పుస్తకావిష్కరణ
    సక్సెస్ మీట్ సందర్భముగా
    శుభాకాంక్షలు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. కలియుగంబౌట సర్వత్ర యిలను నేడు
    కల్లలాడుట నిత్యమై చెల్లుచుండ
    సన్నుతాచారు లెడనెడ సజ్జనాళి
    సత్యమును బల్క బుధు, లపచార మంద్రు.

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టానుండి
    ఆర్యా,
    "గోవధ జతనము" అను సవరణ సాధువు.(హత్యకు "హత్యా"అనవలసియున్నందున)Sorry for the trouble given to you.

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టానుండి
    ఆర్యా,
    "గోవధ జతనము" అను సవరణ సాధువు.(హత్యకు "హత్యా"అనవలసియున్నందున)Sorry for the trouble given to you.

    రిప్లయితొలగించండి
  14. అనయమును సత్యమును పల్క యవనిపైన
    చిక్కు యశము మనుజులకు మిక్కుటముగ
    ప్రాణ విత్తమానమ్ముల భంగ మందు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పల్క నవనిపైన' అనండి.

      తొలగించండి
  15. నిత్యము తథ్యవాక్యములె నిష్ఠనుబూని వచించగావలెన్
    ప్రత్యహ మా వచస్సు లిలవారికి ప్రీతిని గూర్చి భీతిరా
    హిత్యము నేర్పుచుండవలె నీవిధి గాంచక నుత్సహించుచున్
    సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. సత్యమే శాశ్వతం బని సజ్జ నా ళి
    పలుకు చుండగ వినలేద వసుధ యం దు
    ఎట్టి కష్టాల పాలైన నేమయి న న
    సత్యము ను బల్క బుధుల ప చార మంద్రు

    రిప్లయితొలగించండి
  17. కలి బలిమిని ఖలులై చెలగిరి జగతిని చూడగ
    పెక్కులై జనులు
    దోషములెత్తి చూప ద్వేషపడెదరు శత్రుభావనగ
    యా ఘనులు
    నిజమాడి నిష్టూర పడగరాదు పరుషము దాచి
    పల్కుటెల్లెడన్
    సత్యము బల్క నార్యులపచార మటందురు
    శాస్త్రసమ్మతిన్

    రిప్లయితొలగించండి
  18. జడకు వన్నెలుఁగూర్చు పుస్తకములొప్ఫు
    సరస రసభావ సమ్మోహ సంభృతముల
    చకిత సౌందర్య పదజాల వికసితముగ
    సత్యమునుఁబల్క బుధులపచారమండ్రు.

    రిప్లయితొలగించండి

  19. సత్య మార్గమె విహితము సర్వజనుల
    కయిన కఠినమ్ము బాటింప కరము ప్రీతి
    హితము గూర్చునదైన నయిష్టమైన
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అయిష్టము' సాధువు కాదు. "అనిష్టము" అనాలి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! యతి కోసం అయిష్టమన వలసివచ్చింది! మన్నించ ప్రార్ధన! 🙏🙏🙏

      తొలగించండి
  20. పేర్మివిడనాడియాయాడపెండ్లివారి
    లోటుపాటులచేతలులుచ్ఛమనుచు
    సత్యమునుబల్కబుధులపచారమంద్రు
    సర్దుకొనగనునిరువురిసబబయౌను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లుచ్ఛము'..?

      తొలగించండి


  21. పరిణయమ్ములయందు మరియు పడతులందు
    గోవుల కిలను రక్షణ కూర్చు టందు
    పరుల ప్రాణ మాన ములనుబాగుపరచు
    సమయమందునుయోచింప జగతియందు
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "పరిణయమ్ముల వేళను పడతులందు" అనండి.

      తొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2728
    సమస్య :: *సత్యముఁ బల్క నార్యు లపచార మటందురు శాస్త్రసమ్మతిన్.*
    సత్యము మాట్లాడితే అపచార మౌతుందని పెద్దవాళ్లు అంటారు. ఈ విషయాన్ని శాస్త్రం కూడా అంగీకరిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వేదవేత్త యైన కౌశికుడు తనపై రెట్టవేసిన కొంగను కోపంతో చూడగా అది కాలి బూడిదయ్యింది. అట్లే ఆ తాపసి ఒక ఇల్లాలిని కోపంతో చూడగా ఆ పతివ్రత ఓ కౌశికుడా ! ధర్మసూక్ష్మములను గుఱించి ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్లి తెలిసికో అని హితవు పలికింది. అలాగే అని కౌశికుడు ధర్మవ్యాధుని సమీపించగా ఆ ధర్మవ్యాధుడు ఓ కౌశికుడా!
    *భూతహితంబుగా బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు, త*
    *ద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకు నట్ల.....{మహాభారతం 3-5-62}* అని ధర్మసూక్ష్మములను విశదీకరించ సందర్భం.

    స్తుత్యము వేదవాక్కు విను సూక్ష్మము ధర్మము జూడు కౌశికా!
    నిత్యము భూతసంతతికి నీవు హిత మ్మొనరింప బొంకినన్
    సత్య ఫలమ్మె దక్కు , ననిశమ్మును భూతభయాస్పదమ్మునౌ
    *సత్యముఁ బల్క నార్యు లపచార మటందురు శాస్త్రసమ్మతిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (9-7-2018)

    రిప్లయితొలగించండి
  23. విత్త మాన నిజప్రాణ విలయ మందు
    నబల విప్ర గో రక్షణ మందుఁ దక్క,
    జగ మెఱిఁగిన విఖ్యాతంపు సత్య మిది, య
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు


    సత్య వచో ధురంధరుఁడు సాగ నరణ్యము వేదనన్ నిజా
    మాత్యుని నాపు తేరన సుమంత్రునిఁ బంక్తి రథుండు, రాముఁడే
    యత్యధిక ధ్వజి ధ్వనిని నశ్రుత మంచు వచింపుమా యనన్
    నిత్య మసత్య భాషణము నేరము సంతత దుఃఖ దాయమౌ
    సత్యముఁ బల్క నార్యు లపచారమఁ టందురు శాస్త్రసమ్మతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాల్మీకి రామాయణము:
      తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః.
      సుమన్త్రస్య బభూవాత్మా చక్రయోరివ చాన్తరా ...৷৷రామా. 2.40.46৷৷

      నాశ్రౌషమితి రాజాన ముపాలబ్ధోపి వక్ష్యసి.
      చిరం దుఃఖస్య పాపిష్ఠ మితి రామ స్త మబ్రవీత్ ... ৷৷రామా. 2.40.47৷৷

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  24. సూర్యుడు మకర రాశినందు చొచ్చు నట్టి
    దినముగాన శుభమగుట తెలుపు వార్కి
    అరుణుడొక కదలనితార యనుచు నిత్య
    సత్యమును బల్క బుధులపచార మంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. "మకరరాశిలో" అనండి. అలాగే "వారి। కరుణు డొక..." అనండి.

      తొలగించండి
  25. "నిత్యసురార్చనాదిదృఢనిష్ఠ వహించియు, దానధర్మసం
    స్తుత్యములైన గార్యములఁ దోచిన రీతి నొనర్చి, వ్యర్థమౌ
    సత్యము లాడకున్న" యన సంగతమే!,.. కన నప్రియమ్మునౌ
    సత్యముఁ బల్క, నార్యు లపచార మటందురు శాస్త్రసమ్మతిన్.

    "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
    న బ్రూయాత్ సత్య మప్రియం"
    అను సూక్తిని అనుసరించి.

    రిప్లయితొలగించండి
  26. సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్
    సత్యముబల్కగావలెనుశాస్త్రముచొప్పుననెల్లవేళలన్
    నిత్యముబల్కుచోభువినినీతినిదప్పకసత్యమున్భళా
    సత్యమెగాచునెల్లపుడుశాస్త్రయుతంబుగగారవించుచున్

    రిప్లయితొలగించండి
  27. GPS వారు పైనిచ్చిన లిస్టులోనున్న “చింతా” వారి పేరులో చివర “రెడ్డి” యా లేక “రావు” అనుండలా? వారు “ఆంధ్రామృతం” బ్లాగరు అయితే గనక “రావు” అవుతుంది .... చింతా రామకృష్ణా రావు.

    రిప్లయితొలగించండి
  28. విన్నకోట వారూ! చిన్న అనుమానం! పాత జంధ్యాల వారి కొన్ని సిమాలలో విన్నకోట అని ఒక నటుని చూచినట్టు గుర్తు! కొన్ని టి వి కార్యక్రమాలలో కూడ! వారు మీరేనా అని? 🤔🤔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో కాదండీ. నటనాకౌశల్యం బొత్తిగా లేనివాడిని 😢. ఏమయినప్పటికీ, నటుడేమోనని నా గురించి అనుకున్నందుకు థాంక్స్ సీతాదేవి గారూ 🙂.

      మీరంటున్న నటుడు విన్నకోట విజయరాం అయ్యుండాలి, జంధ్యాల గారి సినిమాలు కొన్నిటిలో నటించారు, టీవీ ఆర్టిస్టు కూడా. విజయరాం గారి తండ్రిగారు విన్నకోట రామన్న పంతులు గారు లాయర్, ఆ తరపు ప్రసిద్ధ రంగస్ధల నటులు, సినిమా నటులు కూడా. పాత “కన్యాశుల్కం” సినిమాలో అగ్నిహోత్రావధానుల పాత్ర అద్భుతంగా పోషించారు రామన్న పంతులు గారు 🙏..

      తొలగించండి
    2. అవునండీ! ఆయన విన్నకోట విజయరాం గారే అనుకుంటాను! వారి తండ్రిగారి పేరు కూడ విని యువ్నాను! సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు!🙏🙏

      తొలగించండి
  29. చింతా రామకృష్ణ రావు గారు (ఆంధ్రామృతం)

    రిప్లయితొలగించండి
  30. నిత్య నియమాలు,ధర్మాన నిలుపకున్న?
    ఆశ నత్యాస గామార్చి నాపదలను
    పంచి పోషించ గలిగిన?వంచనౌ|న
    సత్యమును బల్కు బుధులపచారమంద్రు|

    రిప్లయితొలగించండి
  31. ధర్మ పథము నడుగయిన దాట రాదు
    సత్య మాచరింప వలయు నిత్యమనుచు
    నెన్ని కష్టము లెదురైన నెపుడయిన న
    "సత్యమును బల్క బుధు లపచార మంద్రు"

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    ("సత్యం వధ ధర్మం చెఱ")

    ముత్యములమ్ముటందునిట ముద్దుగ తెల్లని భామకున్ విఠూ
    నిత్యము గూడ్సుసర్విసుల, నీరవ మాల్యల రక్షణందునన్,
    భత్యము జీతమందులను, భార్యలతల్లుల వంటలందునన్
    సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్

    తెల్లని భామ = American lady tourist
    ఇట = Charminaar Pearl Bazar
    విఠు = విఠల్ (విట్టు)
    భార్యలతల్లులు = అత్తగార్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆబ కందము :)


      ముత్యము లమ్ముట లోనన్
      నత్యంతపు టాక్సులందున నమో కవిరాట్
      గత్యంతరమిక లేదు,న
      సత్యము బల్కంగ తప్పసలులేదు సుమా !

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారి ఆటవిడుపు పూరణ, దానికి జిలేబీ గారి కౌంటర్ పద్యం... రెండు బాగున్నవి. ఇద్దరికీ అభినందనలు.

      తొలగించండి
  33. ఆరు నూరైన నేమిరా యవని నరుడు
    విడువ దగదు విపత్కర వేళనైన
    సత్యమును, బల్క బుధు లపచార మంద్ర
    సత్యమునని తెలుసుకొన్న చాలుమింక

    రిప్లయితొలగించండి
  34. వారకాంతల బొందుట చోరగుణము
    స్వార్థము పరహింసయు మద్యపాన మింక
    ద్యూతమదియు లోభము దైవ దూషణమ్మ
    సత్యమును బల్క బుధులపచారమంద్రు

    రిప్లయితొలగించండి
  35. తేటగీతి
    ప్రాణభయమునఁ జేర నభయమొసంగి
    తా హరిశ్చంద్రు డననుచుఁ దలఁచి చెలఁగి
    వెంబడించెడు వానికి భీతుఁ జూప
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    రిప్లయితొలగించండి
  36. ఏదోరంకంగా పెండ్లి చేయాలని తాపత్రయపడే పెద్దలతో కష్టమే!
    😃

    వెయ్యబద్ధములను బల్కి వేడ్క గాను
    పెండ్లిఁ జేయ వచ్చనిరి పెద్దలెల్ల!
    వయసు వేతనాదుల నింక వ్యాపకముల
    *"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"*

    రిప్లయితొలగించండి
  37. శంకర గురువులకు ధన్యవాదాలతో సవరించిన పద్యము.

    వేయి బొంకులు బల్కియు వేడ్క గాను
    పెండ్లిఁ జేయవచ్చని యంద్రు లెల్ల!
    వయసు వేతనాదుల నింక వ్యాపకముల
    "సత్యమును బల్క బుధు లపచార మంద్రు"

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు.

    సందర్భము: సినిమా నటీమణులు తమ వయసు విషయం సరిగా చెప్పరు. సినిమా అవకాశాలు జారిపోతాయేమో నని భయం.
    ఒక సినీ తార విలేఖరులతో యిలా చెప్పింది.
    " నా వయసు పదహారే! యెక్కువ అని మాత్రం చెప్పను"
    (రెండో మాట చెప్పినప్పుడే ఆమె తెలివి తెల్లారిం దని తెలిసిపోతూనే వున్నది.)
    ఆమె యింకా ఇలా అన్నది.
    "చెప్పినట్టైతే సినిమా చూపలేను."
    (సినిమాలు రావని ఆమె ఆంతర్యం. ఐతే ఆ మాట చెప్పదగింది కాదు. చెప్పినా ఈ విధంగా అసలు చెప్పరాదు.)
    ఆమె చివరికి యిలా చెప్ఫింది.
    " సత్యమును మాత్రం చెప్పను. ఎందుకంటె బుధులు అపచార మంటారు కాబట్టి."
    (మొదటి మాట మాత్రం సత్యమే! ఎందుకు చెప్పరు.. అంటే బుధులమీద నెట్టివేస్తున్నట్టు తేలుతున్నది.వారు అపచారం.. అని అనకపోయివుంటే తాను సత్యమే చెప్పివుండే దా న్నని ఆమె భావన.)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "వయసు పదహారె! నా కెక్కువ
    యని చెప్పఁ...
    జెప్పిన సినిమఁ జూపలే నొప్పుగాను...
    సత్యమును బల్క... బుధు లపచార మంద్రు"
    తెలివి తెల్లవారగ నటి తెలిపె నిటుల...

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    9.7.18

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    సత్యమును బల్క బుధు లపచార మంద్రు

    సందర్భము: "నీ జీవిత విధానం గురించి నిర్భయంగా నిజం చెప్పరాదా!" అంటే అత డేం చెప్పాడో చూడండి.
    "చిన్నప్పుడే జారత్వం చోరత్వం అలవాటైనవి. ఏం చెయ్య మంటారు? ఇప్పుడు నిజం చెబితే తిడుతారు. తిట్లు తినడం నాకేమైనా యిష్టమా!
    నిజం చెబితే బుధులు అపచార మపచార మంటారు.
    (అంటే మాత్రం నే నేమైనా మారుతానా!) "
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఇలను జారత్వ చోరత్వము లవి సుఖము
    లనుచు నలవాటు పడితి
    చిన్నపుడె... యిపుడు
    తిట్లు దిన నాకు ప్రీతి లేదే మహాత్మ!
    సత్యమును బల్క బుధు
    లపచార మంద్రు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    9.7.18

    రిప్లయితొలగించండి
  40. దైత్యులు కారుగాదెయిల ధర్మము దప్పని వారె మానవుల్
    ముత్యము వోలె స్వచ్ఛమగు భూరి యశస్సును పొంద గోరుచున్
    సత్యము పల్కుచుందురిల సజ్జను లెల్లరు గాదె, మర్చినన్
    సత్యము బల్క నార్యులపచారమటందురు శాస్త్ర సమ్మతిన్

    రిప్లయితొలగించండి
  41. ముత్యపు హారమున్ గనగ మోహన రీతినఁ గూర్చె దారమే
    సత్య మసత్యముల్ సరిగ శాంతిని యట్టులె గూర్చఁగా వలెన్
    నిత్య మశాంతిఁ బెంచునది నెమ్మినిఁ గల్గగఁ జేయలేనిదౌ
    *"సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"*

    రిప్లయితొలగించండి
  42. భృత్యుడ నీకు నేననుచు బీరును త్రాగగ తొట్రుపడ్చుచున్
    ముత్యపు పండ్లు నీవనుచు ముద్దుల గుమ్మవు నీవటంచుచున్
    నిత్యము శ్వశ్రువున్ పొగడి నీరజ నేత్రవు నీవటంచుచున్
    సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్

    రిప్లయితొలగించండి