18, జులై 2018, బుధవారం

సమస్య - 2736

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్"
(లేదా...)
"చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్"

99 కామెంట్‌లు:

  1. నాకడ రావే యనుచును
    కూకటపల్లిని మగండు గూగులు లోనన్
    పాకెటు ఫోనున చూపగ
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ మగని పేరు సూర్యు డన్నమాట!

      తొలగించండి
    2. సార్! ఆటవిడుపులో అది మరింత విశదమౌను...

      🙏

      తొలగించండి


  2. ఆకట్టుకొనెడు కంఠపు
    లాకెట్టు చమక్కు, తళతళలను జిలేబిన్
    మాకందముగా కోరెడు
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పోకిరి వాడగు బావయె
    రాకూడనివేళలోన రమణిని గూడన్
    పాకకు చాటుగ జేరగ
    చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి


  4. ఆకము చూపు చెల్వుడట నగ్నిక ణంబుగ ధూముధామనున్
    దాకొను రేయి రాగ సయి దగ్గిర చేరుచు చిన్న పిల్లవా
    డై కయి మోడ్పులన్ గద! కడాణిని మీరగ సాధ్యమౌనకో?
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    సూరీడు బావ ....

    చీకటి యావరించెనిదె చిక్కినదీయవకాశమంచు దాఁ
    దాకుచు కాంతమేను "వనితా ! యిది సంపెగ , దొండపండిదే !
    కాక యివొక్కొ బంతులని కాంతుడిటుల్ గిలిగింతఁ బెట్టగా
    చీఁకటిలోన., సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ శృంగారరస భరితమై అలరించినది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. ఆకసమునసూర్యుండీ
      లోకముఁజూపించు , దాని లోతు తెలియగా
      చేకొని యెదిరించుచు పెం
      జీకటి ., *లో సూర్యుని* గని చేడియ నవ్వెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. భరిచువాడు మాత్రమె కాదు సకలము తాను
    ఆలికి భర్త
    గృహిణిగ మాతృమూర్తిగ చరించ మరి తానేగా
    కర్త
    సతికి వెలుతురు తాను పెనిమిటి నిశిలో తనకు
    చేరువయ్యెడిన్
    చీకటిలోన సూర్యు గని చేడియ నవ్వె
    మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. రమేశా! కమాలు చేసినావయా :)


      సాకు కుటుంబమున్ తను బసాలుగ నింతియు దీపవృక్షమై
      సాకెడు వాడు పాలుషికి స్వామియు దైవము‌ చండరుక్కుడై
      దాకొనగా నిశిన్ వెలుగు ధామము గానతడే రమేశుడై,
      చీకటి లోన సూర్యు గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్!

      జిలేబి

      తొలగించండి
    2. రమేశ్ గారి భావానికి జిలేబీ గారి పద్యానునృతి చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. నేటి శంకరాభరణం సమస్య నాల్గవ పాదంలో,
    నా పూరణ.

    చీకటి జ్ఞానశూన్యత, వశీకృతకాంతులు జ్ఞానలబ్ధిగన్,
    చీకటి నుండి వెల్తురును జేరుటయే పరమార్థమై చనన్,
    వీక గురుప్రబోధము లవిజ్ఞత బాప, పరార్థవేత్తయై,
    చీకటి లోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరంబుగన్.

    "తమసో మా జ్యోతి ర్గమయ
    మృత్యో ర్మా అమృతం గమయ"
    అని వేదవాక్కు.

    రిప్లయితొలగించండి
  8. (దీపావళి పర్వదినం )
    వాకిలిముంగిటన్ యువతి పద్మిని దివ్వెలపర్వమందునన్
    కాకరపూవు వత్తులను గాల్చుచు గాంచెను బావ సూర్యునిన్ ;
    బైకొను లజ్జతోడ మృదుభావము , రాగము మేనుగప్పగా
    జీకటిలోన సూర్యుగని చేడియ నవ్వె మనోహరమ్ముగా .

    రిప్లయితొలగించండి
  9. ఏకత ముగనిదు రించుచు
    ప్రాకట ముగప్రొద్దు గ్రుంక బ్రమపడి జూడన్
    వేకువ జామను కొనివడి
    చీకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి
  10. తేకువ గలిగిన వానిని,
    ఛేకోక్తులు పలుకువాని, శ్రీమంతుని, క్షే
    మాకారుని తనభర్తను
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    [తనను ఆదరించి, కూడుగుడ్డలకు లోటులేకుండఁజేసి, ప్రేమఁ బంచిన సూర్యుఁడను పేరు గలవానితో, నొక వనిత యొకనాఁటి రాత్రివేళ ప్రేమతో దరిఁజేరి ముచ్చటించుచున్న సందర్భము]

    "ఆఁకలి దప్పులుం దొలఁగ నాదర యుక్తత భుక్తి నిచ్చియున్,
    సోఁకఁగఁజేసి ప్రేమమును, సూర్యుఁడ! రాణివలెన్ ననుం గనన్,
    దాఁకెను చూపు లీ హృదిని! దారఁగఁ జేకొను" మంచుఁ జేరియున్,
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధురకవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      నాలుగు పాదాలలోను ఖండబిందు ప్రాసను ప్రయోగించిన మీ నైపుణ్యం ప్రశంసార్హం!

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2736
    సమస్య :: చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్.
    చీకటిలో సూర్యుని చూచి అందంగా నవ్విందట ఒక భామ. ఇలా చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. గ్రహణ సమయంలో సూర్యుని చూడకూడదు. ఒకవేళ చూచినట్లయితే కంటికి ప్రమాదం కలుగుతుంది అని మన పూర్వీకులు చెప్పియున్నారు. పెద్దల మాటలు నిత్య సత్యాలు అని భర్త చెబుతూ ఉండగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడి పట్టపగలే చీకటి పడింది. అతని భార్య ప్రమాదం కలగకుండా ఉంటుందని కంటికి అడ్డుగా నల్లని కళ్లద్దాలను పెట్టుకొని సూర్యుని చూచింది. తన తెలివితేటలను మెచ్చుకోమని భర్తవైపు చూచి అందంగా నవ్వింది అని ఆ సన్నివేశాన్ని విశదీకరించే సందర్భం.

    శ్రీకర భాస్కర గ్రహణ సిద్ధి యగున్ పరిపూర్ణమై, కనం
    బోకు మటంచు నాథు డనె, పూజ్యుల వాక్కులు నిత్యసత్యముల్
    చీకటి యయ్యె పట్టపగలే, వెస నద్దము నడ్డు పెట్టి యా
    ‘’చీఁకటి లోన సూర్యు గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్’’.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (18-7-2018)

    రిప్లయితొలగించండి
  13. తేకువ తో శత్రువుల ను
    వీకము న న్ దునిమి తాను వీడె న సువు ల న్
    శోకిం చె డు సతి కల గని
    చీకటి లో సూర్యుని గని చేడి య నవ్వేన్

    రిప్లయితొలగించండి
  14. ఆకసమందాదిత్యుని
    ప్రాకటముగ రాహుమ్రింగు పర్వపు వేళన్
    వీకన్ చలువల జోడున
    చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్

    వీక = ఉత్సాహము

    రిప్లయితొలగించండి
  15. ఆకసమున సంపూర్ణపు
    చీకటులే యలముకొనగ చిత్రము పగలే
    ప్రాకటమగు నాగ్రహణపు
    చీకటి లో సూర్యుని గని చేడి య నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  16. ఏకపది వెంట నడచిరి
    "చీఁకటిలో, సూర్యునిఁ గని చేడియ నవ్వెన్"
    శోకము నిచ్చిన తమ కా
    రాకూరము తొలగె ననుచు రమణుడు బల్కన్

    రాకుమారుడు రాకుమారి పారిపోయి గుహలో దాగుకొనినారు. దారి తప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని చీకటిలోనే నడక సాగించి ఎట్టకేలకు గుహ ద్వారము దగ్గిరకు చేరుకొనగా సూర్యోదయము అయి సూర్యుడు ఇరువురకు కనిపించెను అప్పుడు రాకుమారుని పలుకులతో రాకుమారి నవ్వేనని భావన

    రిప్లయితొలగించండి
  17. నాకముజూడుమ యొకపరి
    చీకటితో నిండియుండె జీష్ణుడు లేమిన్
    ముకురము నకుమసి బూసియు
    చీకటిలో సూర్యునిగని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి

  18. నీ కనులు చూడ గలుగునె;
    యాకసమున నేరిని మఱి యరయంగలమో?;
    యాకస్మికముగ బ్రియునిన్;
    "చీఁకటిలో? సూర్యునిఁ ; గని చేడియ నవ్వెన్"

    రిప్లయితొలగించండి
  19. కొత్తగా పెళ్ళయి శోభనమైన మర్నాడు...ఇంకా పెళ్ళికొచ్చిన బంధువులు యింటినిండా ఉన్నారు. మనవాడేమో తాపంతో రగిలిపోతుంటే అమ్మాయిగారికి సూర్యుడిలా కనిపించాడు. తను అతనికి చిక్కీ చిక్కకుండా...అక్కడా యిక్కడా నక్కుచూ ఆటపట్టిస్తోంది.....

    కోరిక తీవ్రమైతే కలయిక మధురాతిమధురమని గాలివాటుగా విన్నాను. 😃

    ఏకాంతమె దొరకక నిక
    స్త్రీకాంతుఁడె రగులుచుండెఁ దీవ్రపు తీండ్రన్
    సోకగ నా వేడి తనకు
    *"చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దొరకక యిక' అనండి.

      తొలగించండి

    2. ఇంకా గాలివాటుగా వినే దశలోనే ఉన్నారా !
      హయ్యొ రామా ! కాస్త ముందజండి :)


      జిలేబి

      తొలగించండి
    3. 😀
      జిలేబి గారూ!..
      నేను బ్రహ్మచారిగా మిగలిపోవాలని పైవాడి కోరికేమో!
      ఇంకా పిల్లని చూపించడం లేదు

      తొలగించండి

    4. ಮೀರು ಮರೀ ರಾತಿ ಯುಗಂ ವಾರಿಲಾ ವುನ್ನಾರೇ? ವೆಂಟನೇ ಏದೈನಾ ಪಿಲ್ಲನು ಪಟಾಯಿಂಚಂಡಿ ! ಪೈವಾಡಿ ಕೊರಿಕಲು ಗಟ್ರಾ ಏಮೀ ಲೇವು ಸ್ಮೀ :)


      ಜಿಲೇಬಿ

      తొలగించండి
    5. రొంబ నండ్రి...జిలేబి యవర్గళే!!
      😄🙏🏻

      తొలగించండి

    6. :) ఆల్ ది బెష్టున్నర :)

      జిలేబి

      తొలగించండి
  20. ఆకన్నెక గోపికయే
    యేకాంతముగ వనమందె యెదురులు చూడన్
    గోకుల తిలకుని కంటను
    "చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (శ్రీ కృష్ణుని రెండు కళ్ళు సూర్యచంద్రులు కదా!)

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ఆకారము లోరవి యై
    తాఁకగ మనసును కనుగొని తద్దయు ప్రీతిన్
    సోఁకగ మదనుని బాణము
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి

  22. చేడియ భారతాంబ ముద్దుబిడ్డ



    కూకటి వేళ్ళ దుర్నయము, క్రుంగెడు భారత భూమి దుస్థితిన్,
    పాకుడు రాళ్ళ జీవితపు భారము వైదొల గింప నేతయై
    కాకవెలుంగు మోడి భళి గాన్పడి దేశవి దేశముల్ నెగ
    డ్తై కడకన్ గనెన్ నసదు డంబము లేదు! జిలేబి! నాతడిన్
    చీకటి లోన సూర్యు గని, చేడియ, నవ్వె మనోహరమ్ముగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జిలేబి యాతనిన్' అనండి.

      తొలగించండి
  23. ఈ కలతల యేరి కెఱుక
    రాకలు పోకలు దివమణి రాహువు నోటన్
    వ్యాకులుఁడై యుండ దివినిఁ
    జీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్


    వెలుఁగు లన్నింటినిఁ దనలోనే యమర్చు కొనిన శంకరుని పార్వతి చీకఁటిలో చూచి భయపడని సందర్భము:

    ప్రాకట దివ్య సచ్చరిత పార్వతి యత్తరి నిర్భయమ్ముగం
    బాకల సన్నిభాక్షి యుత ఫాలు సితామల భస్మదేహు ర
    త్నాకర భోగ భాసిత వరాభరణప్రభఁ జంద్రశేఖరుం
    జీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    [సూర్యుఁడు = శివుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  24. నాకముజూడగామిగుల నల్లగనౌటన మంధిలేమిచే
    నాకులరాజశేఖరుడెయద్దముమధ్యన బూయగామసిన్
    చీకటిలోనసూర్యుగనిచేడియనవ్వెమనోహరమ్ముగన్
    నాకలికియంతగానగుట కర్ధముసూర్యునిజూడగల్గుటే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  25. వేకువ!నాషాడంబున
    చీకటిలో సూర్యునిగని?చేడియనవ్వెన్
    దూకుడు నూతనవరుడే
    జేకుని ముద్దులకు లొంగె చిలిపిగవధువే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జేకుని/జేకొని'?

      తొలగించండి
  26. ఆకస చలువల రేడును
    తాకగ పూశరపు వాడి తాపము హెచ్చన్
    నాకము జూపుమనగ నా
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆకసపు చలువరేడును' అనండి.

      తొలగించండి
  27. ఆటచిడుపు సరదా పూరణ:
    ("యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతం")

    వాకిట ధాన్యకుంభమును వైనపు రీతిని త్రోసిపుచ్చుచున్
    నాకిట స్వర్గమందునని నర్తనమాడెడి మానసమ్మునన్
    ప్రాకట నూత్నవల్లభుని పాణిని దీపిలు శ్వేతకాష్ఠతో
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    సూర్యుడు = ప్రభాకరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇవ్వాళేదో ఆట "చిడుపు" అని కొత్తాట మొదలెట్టారే ఎట్లా ఆబ వేయడం :)


      జిలేబి

      తొలగించండి


    2. వాకిట కొట్నపు కుండను
      తాకక తూలుచు సరకపు దారంబనుచున్
      మైకము లోవిడువగ గో
      చీఁ, కటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

      జిలేబి

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      శ్వేతకాష్టంతో మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      *************
      జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గోచీ' తరువాత అర్ధానుస్వారం ఎందుకు?

      తొలగించండి

    4. నిజం చెప్పాలంటే తెలీదండి. సమస్యాపాదంలో అట్లే వుంది నో ఐడియా


      జిలేబి

      తొలగించండి

    5. శ్వేతకాష్టమంటే ఏమిటండి ?


      జిలేబి

      తొలగించండి


    6. ఏమండీ జీపీయెస్ వారు

      మీ పద్యానికి భావమేమిటండి‌?

      జిలేబి

      తొలగించండి
    7. I was a chain smoker when I got married. And quit smoking on my first wedding anniversary to redeem a promise given to my wife on our first night, about 40 years back.

      Now I miss both...sigh!

      తొలగించండి
    8. బాగుందండీ... పొగత్రాగని వాడు...

      శ్వేతకాష్ఠ ఇది కూడా..?

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    9. శ్వేత కాష్ఠ... 👌🙏🏼

      ...డాక్టర్ వెలుదండ సత్యనారాయణ

      తొలగించండి
    10. శాస్త్రి గారు చక్కని పదము వాడారు. శ్వేత కాష్ఠమే యనండి. కఱ్ఱ ( సుద్దముక్క / పొగ చుట్ట) యను నర్థమున కాష్ఠము సాధువు.

      తొలగించండి


    11. ఆటబట్టు కందము :)


      వాకిటి కొట్నపు కుండను
      తాకక నూదుచు బుగబుగ ధారాళముగా
      మైకము లో పడిన పతిని,
      చీఁకటిలో, సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

      జిలేబి

      తొలగించండి
  28. సమస్య :-
    *"చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్"*


    *కందం**

    దూకుడుగా పని జేసియు
    లోకాలను మరచు నిద్రలో పగటి తఱిన్
    వేకువజామనుకొని గది
    చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
  29. ...............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    సందర్భము:రుక్మిణి గౌరీదేవికి మొక్కినది. తర్వాత "ఇక నా జీవితంలో చీకటి కమ్ముకొన్నది. నన్ను చైద్యునకు అనగా శిశుపాలున కిస్తారు. పెండ్లి చేస్తారు.. " అని నిరాశతో దిక్కులు చూస్తుండగా రుక్మిణికి కృష్ణుడు కనిపించాడు. హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకున్నది. ఆమె ముఖం దరహాసంతో వెలిగిపోయింది.
    చీకటిలో సూర్యుడు కనిపించినట్టయింది
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "చీకటి కమ్ముకొన్న దిక జీవితమందున చైద్యు కిత్తురే!
    ప్రాకటమైన నా బ్రదుకుఁ బా డొనరింతురె! దైవమా!" యటం
    చా కలకంఠి రుక్మిణి దెసల్ పరికించె.. హరిన్ గనుంగొనెన్..
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    మరొక పూరణము...

    సందర్భము: కొంచెం శ్రమిస్తే సులభమే!
    ఆధారము:- ఆర్ష వ్యాసావళి..
    శ్రీ అందుకూరి చిన్న పున్నయ్య శాస్త్రి గారు..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    శ్రీ కరమౌ విదర్భ యన చెల్వగు దేశము పావన ప్రతీ
    కాకర మౌను.. భీష్మకుడు యజ్ఞముఁ జేయు నతండు.. కుండినం
    బే కలితాగ్ని కుండ మగు.. కృష్ణు రథం బది వేదమాత.. తా
    నా కమలాక్షుఁ జేరఁ జను నాతడు ఋత్విజు డగ్నిఁ బిల్చెడిన్..
    బ్రాకట గార్హపత్య మయి భాసిలు రుక్మిణి.. యజ్ఞ పూరుషుం
    డై కరుణించు మాధవుడె యాహవనీయము.. వాడె సూర్యుడౌ..
    నా కలకంఠి కెల్లపుడు నాత్రమె కృష్ణునికై.. నిరాశ యన్
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    18.7.18

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. ఆ కందుకూరి పంతులు
    చీకటి లో మ్రగ్గినట్టి జీవితములలో
    శోకము దీర్చిన భానుడు
    చీకటిలోసూర్యునిగని చేడియ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  31. పోకిరి వోడొకండు సతి పొందును గోరుచు రాత్రివేళలో
    లోకము నిద్రబోవుతరి లోలుపుడై ప్రియురాలి చెంతకున్
    జేకొని మల్లెపూవులను జేరగ వచ్చిన సుందరాంగునిన్
    జీకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పోకిరివా డొకండు' టైపాటు...

      తొలగించండి
  32. వాకిలి తలుపులు తెరచి త
    దేకముగా దలచుకొనుచు నింపగు పతివౌ
    పోకిరి చేష్టల రాతిరి
    చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  33. దేవిక
    -------

    శోకమతిగ జానకి తా
    నాకర్ణించి పవన సుతు నయ వాక్కులటన్
    వీకను బొందగ లంకను
    చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్ !

    రిప్లయితొలగించండి
  34. గోకులమున హరి కన్నుల
    చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్
    నాకలితో నుంటి ననగ
    నేకాంతంబిదియెనంచు నింతియు పలికెన్.

    రిప్లయితొలగించండి
  35. డా.పిట్టా సత్యనారాయణ
    వీకన శబరిమలేశుని
    ప్రాకట దర్శనము నయము పడతికన వినన్
    సాకదె సుప్రీం ప్రథలను
    చీకటిలో ‌సూర్యుని గని చేడియ నవ్వెన్

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టాసత్యనారాయణ
    రాకల పోకలన్ తరుణి రాక్షసు బారిన బడ్డ తత్ క్షణం
    బే కల కల్లగాగ నురిపీఠము దుండగుడెక్కు చట్టమే
    శోకము దీర్చె నేటికది సూటిగ నిర్భయ త్యాగమే యనన్
    చీకటి లోన సూర్యుగని చేడియ నవ్వె మనోహరమ్ముగా

    రిప్లయితొలగించండి
  37. కందం
    వేకువఁ గుమారి కుంతియె
    ప్రాకటముగ మౌని మంత్ర ప్రాభవమెరుగన్
    చేకొని బిలువఁగఁ గూడిన
    చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్

    ఉత్పలమాల
    వేకువ వేళ కుంతి మదిఁ బ్రేమలుఁ బొంగఁగ భానుమూర్తిపై
    ప్రాకట మౌనిమంత్రపు ప్రభావము జూడగ నుచ్చరించగా
    నాకటఁ జేర వచ్చి భయమంతయు దీర్చియుఁ దాక గూడగన్
    చీకటి, లోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  38. New India 2019:

    రాకెటు సైన్సు కాదుగద రంగుల టీవికి బాళి లేదుగా
    చాకలి వాడలోననొక సప్తమి రాతిరి లైట్లు పోవగా
    పాకెటు స్మార్టు ఫోనునట భర్తయె జూపగ గూగులందునన్
    చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి