28, జులై 2018, శనివారం

సమస్య - 2745 (రాతికిఁ బుత్రుండు...)

వి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్"
(లేదా...)
"రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్"

109 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పాతకములు పండిన విక
      నీ తులువ హిరణ్యకశిపు డీల్గును హరిదౌ
      చేతను త్వరలో, దివిజా
      రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్.

      తొలగించండి
    2. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. పాతకము జేసి నొచ్చుచు
    సీతాపతినే కొలుచుచు సిగ్గులొలికెడిన్
    నాతిని పెండ్లాడి శివా
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుందండీ.. శివారాతి.. ఎవరో

      ...మైలవరపు మురళీకృష్ణ

      *************************

      🙏

      శివారాతి

      వేదబాహ్యుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)

      పాషండుడు

      తొలగించండి
    2. అయితే ఓకే.. సురలు రంజిల్లుట..? 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      *****************************

      నా లాటి నాస్తికునకు "శ్రీనాథుడు" అని పేరు గల సుపుత్రుడు పుడితే సురలు మరి రంజిల్లరా?

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒలికెడిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. అక్కడ "సిగ్గు లొలుకు నా। నాతికి..." అనండి.

      తొలగించండి
  3. ప్రీతిగ భక్తులు కొలిచిన
    సీతనగము పైనుండి శివుడే తెంచన్
    నూతన వరములు కోరగ
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "శీతనగము నుండి వేగ శివు డేతెంచెన్" అందామా?

      తొలగించండి
    2. ప్రీతిగ భక్తులు కొలిచిన
      శీతన గమునుండి వేగ శివుడే తెంచన్
      నూతన వరములు కోరగ
      రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

      తొలగించండి
  4. ఘాతకుడైయను నిత్యము
    భీతిని గొల్పుచు సురలను వేదన పెట్టన్
    ఆతారకుఁ దునుమ పురా
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెట్టన్ ఆ' అని విసంధిగా వ్రాసినారు. అక్కడ "వేదింపగ దా। నా తారకు..." అందామా?

      తొలగించండి


  5. మాతకు కపాలినికి, అగ
    జాతకు ఖచరికి జయంతి చాముండి జగ
    న్మాతకు దశభుజ దుగ్గ, కి
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దశభుజ దుగ్గ' అన్నది దుష్టసమాసం. "దశభుజ దుర్గ" అనండి.

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    శీతనగాత్మజాశివుల *చిన్న కుమారుడె* *శక్తిమంతుడై*
    భీతిలఁజేయు తారకుని పీచమడంచునటంచు గోర ., సం...
    ప్రీతిని జెందగా ., శివుని రేతము రూపము దాల్చగా , పురా...
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ పద్యమును తెలుగు పద్యవైభవం లో పంపించాను.. ఆ సమూహసారధి చక్రపాణి గారు సుందరకాండ పరంగా పూరింపగలరా అని కోరినారు 👇🙏

      వాతతనూజుడై నిఖిల వ్యాకృతికాకృతియౌచు , నీయగా
      సీతకు ముద్రికన్ , గొనగ చిత్రశిరోమణి , లంకఁగాల్చగా ,
      కోతియనంగ మారుతి దగున్ శివతేజము , గావునన్ పురా...
      రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారు అవధాను లనిపించుకున్నారు. అద్భుతంగా ఉన్నది రెండవ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  7. (విక్రమార్కసింహాసన మెక్కబోయే భోజునితో సాలభంజిక )
    నీతిధురంధరుండు కడునిర్మలరూపుడు భోజభూపుడే
    వీతభయుండుగా నరిగి విక్రముబీఠము నెక్కబోవగా
    నాతతసాలభంజికయె యాతని నివ్విధిబ్రశ్నవేసెడున్
    "రాతికిబుట్టె బుత్రుడు సురల్మునులెల్లను సంతసింపగా "

    రిప్లయితొలగించండి


  8. మాతకు కప్పుటైదువకు మాలిని గుబ్బలిపట్టియా జగ
    న్మాతకు అగ్నివక్త్రునకు నాత్మభవుండు కపర్దికిన్ సఖీ
    చేతనుడా త్రినేత్రునకు జీవనుడామదనారి యంధకా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కోతికి కొండముచ్చుకును కోయిల పుట్టి పఠించె వేదముల్
    నాతికి బుట్టి నాగులిల నాట్యము నేర్పె పినాకపాణికిన్
    ప్రేతకు బుట్టె దైవమిల ప్రేమను పంచగ లోకమంతయున్
    *రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      అసంబద్ధమైన వాక్యాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. 🙏🙏
      కోతికి *కొండ మ్రుచ్చునకు* కోయిల పుట్టి పఠించె వేదముల్
      నాతికి బుట్టి నాగులిల నాట్యము నేర్పె పినాకపాణికిన్
      ప్రేతకు బుట్టె దైవమిల ప్రేమను పంచగ లోకమంతయున్
      *రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్*

      తొలగించండి
  10. రాతిరి వేళలందునను రక్కసిమూకలతో చరించుచున్
    ఘాతకుడైన తారకుడు కాఱియ పెట్టచు కాశ్యపేయులన్
    భీతిల జేయ నిత్యమును వేదనఁ బాయగఁ జేయ నంధకా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ప్రీతి గ హరి నామం బు ను
    జాతికి వైరుధ్యమన గ జనకుని మార్చ న్
    పాతక దైత్యు ని కి సురా
    రాతికి పుత్రుoడు పుట్టె రంజిల్ల సుర ల్

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2745
    సమస్య ::రాతికిఁ బుట్టెఁ బుత్రుడు సురల్ మునులెల్లను సంతసింపగన్.
    రాయికి కొడుకు పుట్టినాడు. అప్పుడు దేవతలు మునులు సంతోషపడ్డారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వజ్రాంగుని కుమారుడైన తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అమోఘమైన వరాలను పొంది లోకాలను బాధపెట్టడం మొదలుపెట్టినాడు. పరమశివునికి కుమారుడుగా పుట్టే కుమారస్వామి ఒక్కడే తారకాసుర సంహారం చేయగలడు అని బ్రహ్మదేవుడు ఉపాయాన్ని సూచించినాడు. సతీవియోగంతో ఒంటరివాడై తపస్సు చేసికొంటున్న శివునికి పార్వతితో వివాహం జరిపించారు దేవతలు. తత్ఫలితంగా త్రిపురములను దహించిన ఆ పురారాతికి పుత్రుడు పుట్టగా సురులు మునులు (తమకు త్వరలో తారకాసురుని బాధ తొలగిపోతుందని) సంతోషించారు అని విశదీకరించే సందర్భం.

    భీతిని గూర్చు తారకుని వే వధియించెడి నా మహేశు సం
    జాతు డటంచు, దేవతలు సాధులు జేరి యుమామహేశులన్
    బ్రీతిని గూర్చి పెండ్లి జరిపించిరి; తత్ఫలితమ్ముగా బురా
    ‘’రాతికిఁ బుట్టెఁ బుత్రుడు, సురల్ మును లెల్లను సంతసింపగన్.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-72018)

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    జాతక మేదో యెరుగని
    పాతకుని వినాశమునకు బ్రహ్లాదునకై
    జోతలు చేయగ నసురా
    రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అసురారాతికి అంటే వ్యతిరేకార్థం వస్తున్నది కదా? "చేయగను సురా।రాతికి..." అనండి.

      తొలగించండి
  14. సీసము

    తారక దనుజుని గోరతనమ్ములు దినదినము పెరుగన్ దివ్యులెల్ల
    వెతలును పడుచుండ, వేల్పుల కోర్కెను తీర్చగ దిసమొల దేవు డపుడు
    మారిని పెండ్లాడె,మంగళ మిడు నట్టి ఘడియలం దక్కాలక! నగజాత!
    పురల! కి( రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్") విరించి సమభిదము
    నొసగె కార్తికేయుడనుచు, మిసిమి తోడ
    పెరిగి స్కందుడు తారకాసురుని తోడ
    పోరు భీకరముగ సల్పి పొడవడచగ
    దేవతలు ముద మందుచు దీవెన లిడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      కంద పాదాన్ని సీసపద్యంలో ఇమిడ్చి తారకాసుర సంహార కథను వివరంగా చెప్పిన మీ పద్యం ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  15. ఆకాశవాణి వచ్చే వారపు సమస్య



    సతి పద సేవనమ్మె శుభ సంపద లిచ్చును పూరుషాలికిన్ !

    --
    అతివలనన్ జిలేబులయ యర్ధపు మేనుగ నిల్చినారయా
    పతిసతు లిర్వురున్ బతుకు బండికి ద్వంద్వ నిగాళవంతముల్
    గతి శృతి యీడుజోడు సయి కావ్యపు కైపుల జోరు గానగన్,
    సతి పద సేవనమ్మె శుభ సంపద లిచ్చును పూరుషాలికిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ సమస్యను గతంలో శంకరాభరణంలో ఇచ్చినట్టున్నాను. అవునో కాదో ప్రభాకర శాస్త్రి గారే చెప్పాలి!

      తొలగించండి

    2. శంకరాభరణంలో రాని సమస్య అంటూ యేదన్నా వుంటుందంటారా కంది వారు :)

      Touching 2750 = 7 years + :)


      Cheers
      జిలేబి

      తొలగించండి

    3. జనవరి 20 2018

      సమరము శాంతి గూర్చు ఘన సంపద లిచ్చును నిశ్చయమ్ముగన్ !


      తొలగించండి
    4. సమస్య - 2652 (కాంతకు మ్రొక్కంగ...)
      కవిమిత్రులారా,
      ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
      "కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"
      (లేదా...)
      "కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే"
      కంది శంకరయ్య వద్ద 4/15/2018 05:00:00 AM

      తొలగించండి
    5. సమస్య - 2558 (భార్యకు సేవఁ జేయ...)
      కవిమిత్రులారా,
      ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
      "భార్యను సేవించునట్టి భర్త తరించున్"
      (లేదా...)
      "భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"
      (ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఎలపర్తి రమణయ్య గారు ఇచ్చిన సమస్య)
      కంది శంకరయ్య వద్ద 12/28/2017 12:02:00 AM

      తొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    జాతికి(nation)నిన్నొవేషనను(innovation)జాగృతి నివ్వగ 'మోది 'పిల్పునన్
    నాతి యహల్యనున్ గనగ నాతుల రాతిని గాన రాదె!దో
    చేతము యత్నమంచు సరి జేయగబోవగ నద్భుతంబుగన్
    రాతికి బుట్టె పుత్రుడు సురల్ మునులెల్లరు సంత సించగన్

    రిప్లయితొలగించండి
  17. 'పురారాతికి కుమారస్వామి జన్మించాడు' అన్న భావంతో వచ్చిన పెక్కు పూరణలపై గుండు మధుసూదన్ గారు ఒక సందేహాన్ని లేవనెత్తారు. అదేమనగా...
    "శివుని కుమారుడైన కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. ఆ తారకుని కుమారులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే త్రిపురాసురులు. వారిని శివుడు సంహరించాడు. కనుక కుమారస్వామి జననానికి ముందు శివుడు పురారాతి కాడు. తారకుని సంహారం తరువాతే పురాంతకు డయ్యాడు. కనుక 'పురారాతికి కుమారస్వామి జనించా' డనడం పొసగదు." అని.
    ఈ విషయమై పెద్దల అభిప్రాయాన్ని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జిలేబి గుండ్రము గా నుండును :)


      జిలేబి

      తొలగించండి
    2. పిన్న వాని యభిప్రాయము:
      పూర్వ గాథలు ప్రస్తుతము ప్రస్తావింప బడుచున్నవి కాబట్టి ప్రస్తుత కాలములో శివుడు పురారియే కాబట్టి, యంతియ కాక తదుపరి జరిగినవి ముందు చెప్పి వివరముగా పూర్వపు వృత్తాంతములు చెప్పుటయు సాంప్రదాయము కాబట్టి పురారాతి యనడములో తప్పు లేదని నా యభిప్రాయము.

      తొలగించండి
    3. ఉదాహరణ:
      గంధర్వుఁడు చెప్పు చున్నట్లుగా సంవరణునికి దపతి నిచ్చు సందర్భమున సంవరుణిని కురుకులాంచితుఁ డని నన్నయభట్టు వర్ణించె నీ పద్యమున.
      కురు (తపతీ సంవరణుల పుత్రుఁడు) వప్పటి కింకా పుట్ట లేదు. అంతే గాక తండ్రిని కొడుకు వంశాంచితునిగ చెప్పుట గూడ.


      అలఘుండు పౌరవ కుల శేఖరుండు సంవరణుఁ డన్వాఁ డనవరత కీర్తి
      విదితుండు ధర్మార్త విదుఁడు నీ పుత్రికి నగణిత గుణములఁ దగు వరుండు
      గావున నతనికి దేవిఁ గాఁ దపతి నీ వలయుఁ గూతులఁ గన్న ఫలము దగిన
      వరులకు సద్ధర్మ చరితుల కీఁ గాన్ప కాదె నావుడు సూర్యుఁ డాదరించి

      వరుఁడు రాజ వంశ కరుఁడు సంవరణుండ యను గుణుండు దీని కని కరంబు
      గారవమున నిచ్చి యా ఋషి తోడఁ బుత్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు ... భార. ఆది. 7. 87.

      తొలగించండి
    4. ధన్యవాదాలండీ పోచిరాజువారూ!

      అలాగే...నన్నయగారు ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో నర్జునునిచే కర్ణుని "కానీన" అని సంబోధింపజేశారు.
      నన్నయ అంతటివారే ఇలా అంటే మనమెంతవారము! మనమూ స్వీకరించవలసిందే గదా!
      మరొక్కమారు ధన్యవాదాలతో...
      గుండు మధుసూదన్

      తొలగించండి
    5. కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు.

      తొలగించండి
  18. సమస్య :-
    "రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్"

    *కందం**

    నాతికి పెండ్లి జరిగినా
    జాతకులే పుట్టకున్న సంతతి కొరకున్
    ప్రీతిగ హరి గొల్వగ గొ
    డ్రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్
    ................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని 'గొడ్రాలికి' అనవలసిన చోట 'గొడ్రాతికి' అనవచ్చునా అని సందేహం!

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [తారకాసుర వధార్థమై ముక్కంటి కంటిమంటకు బుగ్గియై యతనుఁడైన ననవింటిదంట, శంబరాసుర వధార్థమై శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుఁడై జన్మించిన సందర్భము]

    మాత నగాత్మజన్ శివుని మానస మందున నిల్పఁబూని సా
    కూతముఁ గాఁగ వింటఁ బువుఁగోల విడన్ ననవింటిదంట, సం
    పాతిగ నగ్గికంటి కనుమంటకు నంటియు మ్రగ్గఁగా, మురా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్!

    రిప్లయితొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    రాతికి బుట్టె బుత్రుడు సురల్
    మునులెల్లన్ సంతసింపగన్
    ======================
    అటు దేవతలు ఇటు ఋషులు
    మునులు అందరును సంతోషించగ
    రాయికి కొడుకు పుట్టినాడని చెప్పు
    టలో అసంబద్ధమే - సమస్య
    ========================
    సమస్యా పూరణము - 209
    ====================

    ఎనభై దశక పిల్లోడికి
    పిల్ల దొరుకదనె ప్రపంచ బ్యాంకు
    ఒడ్డూ పొడుగు తానెంతున్నను
    పెళ్ళికి కుదరదని మంచి ర్యాంకు
    ఐనను అంగలార్చి కొడుకుకై
    చుప్పనాతి మొక్కె రాతికి
    బుట్టె బుత్రుడు సురల్
    మునులెల్లను సంతసింపగన్ నాతికి

    ====##$##====

    (ఎనభై దశక పిల్లోడికి=1986 ఆ తరువాత
    పుట్టిన మగ పిల్లవాడికి )
    ( పిల్ల దొరుకదనె ప్రపంచ బ్యాంకు = ప్రపంచ
    దేశాలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు
    మన దేశంలో ఏటేటా పడిపోతున్న లింగ
    నిష్పత్తి పై సర్వే చేయించి, 1986 , అటు
    తరువాత పుట్టిన మగ పిల్లలకు ఆడ
    పిల్లలు దొరకక పెళ్ళిళ్ళు అతి కష్టమౌ
    తాయని తెలియపరచినది )
    (ఒడ్డూ పొడుగు తానెంతున్నను = మగ
    పిల్లవాడు బాహుబలి మాదిరిగా ఉన్నను)
    ( పెళ్లికి కుదరని మంచి ర్యాంకు = ఐనను
    మంచి సంబంధం దొరకదు గాక దొరకదు)
    ( ఐనను అంగలార్చి కొడుకుకై = ఇంతటి
    ప్రతికూల పరిస్థితులలోను కొడుకు
    కోసం ఆరాటపడుతు )
    (చుప్పనాతి మొక్కె రాతికి=ఆ శూర్పణఖ
    మొక్కినది రాతి రూపంలోని ద్యావరకు)
    ( బుట్టె బుత్రుడు సురల్ మునులెల్లను
    సంతసింపగన్ నాతికి = అటు దేవతలు
    మునులు సంతోషించగ ఆ ముదితకు
    కొడుకు పుట్టినాడని భావం )

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నాలుగు లైన్ల పద్యానికి యింత పెద్ద జిలేబియా !

      వామ్మో ! రమేశా! :)


      జిలేబి

      తొలగించండి
    2. ధన్యవాదములు - కృతజ్ఞతలు

      తొలగించండి
  21. కాతరులై దేవత లపు
    డాతురతోశివునివేడదారకు గురిచిన్
    బ్రీతిని గిరిజకునుబురా
    రాతికిపుత్రుండుపుట్టెరంజిల్లసురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వేడ దారకు జంపన్" అనండి.

      తొలగించండి
  22. ఘాతకు డౌ తారకుడే
    భీతిలజేసె జగతినని వేడగ గిరిజన్
    బ్రీతిగ జేగొన మదనా
    రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    జాతికి(nation)నిన్నొవేషనను(innovation)జాగృతి నివ్వగ 'మోది 'పిల్పునన్
    నాతి యహల్యనున్ గనగ నాతుల రాతిని గాన రాదె!దో
    చేతము యత్నమంచు సరి జేయగబోవగ నద్భుతంబుగన్
    రాతికి బుట్టె పుత్రుడు సురల్ మునులెల్లరు సంత సించగన్

    రిప్లయితొలగించండి
  24. ధాత వరమ్మొసంగ నిట దైత్యుడహమ్మును బొంది లోకమున్
    భీతిల జేయుచుండ గని వేదన జెందెడు వేళ దానవున్
    నాతికి లోకమేలెడు సనాతన భక్తుడె ధాత్రిలో సురా
    రాతికి బుట్టె బుత్రుడు సురల్ మునులెల్లను సంతసింపగన్.

    రిప్లయితొలగించండి
  25. కాతరులైనదేవతలుగాలునివేడగ,దారకాసురు
    న్బాతకుసంహరించుటకు బాలునిగోరగనంతనప్పురా
    రాతికిబుట్టెపుత్రుడుసురల్మునులెల్లనుసంతసింపగ
    న్బాత్రియుశంకరుల్మనకుపావనమూర్తులు,దల్లిదండ్రులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాలుగవ పాదంలో ప్రాస?

      తొలగించండి
  26. నాతికి జనియించక నట
    నాతాపసి శివుని సుతుగ నాషణ్ముఖుడై
    భూతలమున వెలిగె; శివా
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఆర్యుడు సుమేధ గలిగిన
    భార్యనుఁ గని మనసుపడెను; పరభామినిపై
    క్రౌర్యము , కామము , గొలిపెడి
    చర్యల కై పాటు పడక చరియించె సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జనియించక యట.. శివసుతుడుగ నా షణ్ముఖుడై' అనండి.

      తొలగించండి
  27. ఆతత గుణశీలి జగ
    త్త్రాతకు భక్తుఁడు కరమ్ము ప్రహ్లాదుఁడు సం
    ప్రీతిని దైత్యుఁడు దై వా
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్


    భూతల శిష్ట రక్షణకు భూరి గుణోన్నత భాసితుండు సా
    కేత పురంబు నందు సుర కీర్తిత రాముఁడు రాక్షసేంద్ర ని
    ర్యాతన హేతు రాజిత మహాకృతిఁ బంక్తిరథుండు రాక్ష సా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆ తారకాసుర నణచి
    ద్యోతమ్మిచ్చుచు జగతికి తుష్టిని గూర్చన్
    రీతిగ పార్వతికి పురా
    రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సుతుల్

    రిప్లయితొలగించండి
  29. భీతిని వీడు డింక మన పీడలు తీరు గృపాసముద్రుడై
    శ్రీతరుణీ మనోహరుడు చెప్పెను తొల్లి, వధింతు దానవు
    న్నాతని బిడ్డ గాచుటకు నంచు వచించెను ధాత యా సురా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్.

    రిప్లయితొలగించండి
  30. నీతిని వీడగ?మూషిక
    నేతనుజంపకనె మంచినేర్పరితనమున్
    జాతకమును మార్చ!మురా
    రాతికి బుత్రుండుపుట్టె రమమజిల్లసురల్ (గణపతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మూషిక నేత'...?

      తొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    ("ఏ తీరుగ నను దయ జూచెదవో")

    ఘాతుక బ్రహ్మచర్యమును ఖైదుగ నోర్వగ ఖర్గపూరులో
    వేతన భత్యముల్ పెరిగి వేడుక
    మీరగ నయ్యటీలలో
    రాతిరి ఘస్రమున్ కొలిచి రంజిల జేయగ శాస్త్రి...దానవా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్ :)

    దానవారాతి = విష్ణువు (మన్మథుని తండ్రి)
    గమనిక: దయజేసి ముందు వెనుకలు తర్కంచకండి...అనంగుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పుడుతూ ఉంటాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆ.బ.కందము :)


      వీతి తడుపుదాలుపుగా
      వేతన భత్యముల పొంది వేడుక తోడై
      కాతరి సయాట ధ్వాంతా
      రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సు, రల్ :)

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      __/\__

      తొలగించండి
  32. కందం
    భూతఘనాధిపు శిశువున్
    శీతనగాత్మజ గనంగ సేమమటన్నన్
    రేతము రూపము దాల్చ కి
    రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టైపాటు సవరణతో

      కందం
      భూతగణాధిపు శిశువున్
      శీతనగాత్మజ గనంగ సేమమటన్నన్
      రేతము రూపము దాల్చ కి
      రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

      తొలగించండి
  33. ఉత్పలమాల
    ఆతత పక్షపాతమున నందగ నా సుధ దేవ కోటికిన్
    ప్రీతిగ విష్ణుమూర్తి తగు లీలల మోహిని యౌచుఁ జూపగన్
    భూతఘనాధిపుండలరి మోహ వశంబున బొందగన్ మురా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపండితులు శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు.టైపాటు సవరణతో

      ఉత్పలమాల
      ఆతత పక్షపాతమున నందగ నా సుధ దేవ కోటికిన్
      ప్రీతిగ విష్ణుమూర్తి తగు లీలల మోహిని యౌచుఁ జూపగన్
      భూతగణాధిపుండలరి మోహ వశంబున బొందగన్ మురా
      రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  34. శ్రోతగ నారదు కథనము
    మాతయుదరమున పితరుని మార్గము మార్చన్
    ప్రీతాత్ముడు శ్రీవత్సా
    రాతికి బుత్త్రుండు పుట్టె రంజిల్ల సురల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి పూరణ:
      శౌర్యము ప్రతాపమున్న య
      నార్యావల్లభుడు రావణాసురు డాహా!
      చౌర్యము జేయగ రాముని
      భార్యనుగని మనసుపడెను పరభామినిపై!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    4. Jet lag తీరకనే మూడింటికి మెలకువ వచ్చి పద్యరచన!! 😊😊😊

      తొలగించండి
  35. ప్రీతిగ సురపుర మందున
    నాతిని శిలపై మలచెడి నడిసమయమునన్
    క్రంతపడి కప్ప వెలువడ
    రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమరశిల్పి జక్కన' చిత్రాన్ని గుర్తుకు తెచ్చారు!

      తొలగించండి


  36. యాతన లిడుచును ద్విజులను
    భూతలమందు కనకకశిపుడు హింసించన్
    చేతము లలరంగ సురా
    రాతికి బుత్రుండు బుట్టె రంజిల్ల సురల్.

    రిప్లయితొలగించండి
  37. శంకరాభరణం వారి సమస్య

    *రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్*

    పూరణలు

    కం

    ఘాతకుడై సురలందరు
    భీతిల్ల దురాగతాల పీడన పరిచే
    యా తారకుఁ దునుమ పురా
    *రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల*!! (1)

    జ్యోతుల బుట్టెను వెలుగున్
    రాతిరి బుట్టిన మిణుగురు రంగుగ మెరిసెన్
    భీతికి వణుకే బుట్టగ
    *రాతికి పుత్రుండు పుట్టె రంజిల్ల సురల్*

    (2)

    ఖ్యాతికి బుట్ట నతిశయము
    జాతికి బుట్టిన కులమను జాడ్యము పెరిగెన్
    నీతిని వెదకగ నూతిన
    *రాతికి బుత్రుడు పుట్టె రంజిల్ల సురల్*
    (3)


    హంసగీతి
    28.7.18

    రిప్లయితొలగించండి
  38. ఈతనికి బుట్టు తనయుడె
    యాతన దొలగించు ననియె యాశగ గనగా
    కౌతుకమున,నాయసురా
    "రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్"

    రిప్లయితొలగించండి

  39. మరొకపూరణ

    భీతిని గూర్చుచు దివిజుల
    కాతారకుడు సతతమ్ము హానిన్ గూర్చన్
    వేతల బాపగ పురా
    రాతికి బుత్రుండు బుట్టె రంజిల్ల సురల్.

    రిప్లయితొలగించండి
  40. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷🏻‍♀.........
    *"రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును*
    *లెల్లను సంతసింపఁగన్"*
    **************************************
    సందర్భం: రామునికి దాస దాసుడు.. రావణునికి భయ దాట్టహాసుడు (భయాన్ని కలిగించే అట్టహాసం కలవాడు)..
    ఎవడు?.. ఆంజనేయుడు.. ఆతడు సీతామాతకు దిగులు మాన్పడానికి పుట్టినాడు.
    ఎవనికి?.. శంబసాధస అరాతికి.. అనగా శంబసాధసుని శత్రువుకు.. అనగా..కేసరి అనే వానర వీరునికి..
    కేసరి యెలాంటి వాడు?.. అశేష శేముషీ విభవుడు..మునీశ్వరాశీర్వచన శుభశీలుడు.. పార్వతీ పరమేశ్వరార్చనా నిమగ్న మానసుడు.. సకలాగమ ధురంధరుడు.. హిమాలయ విహారి.. 60000 వానరులకు అధిపతి..
    శంబసాధసు డనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి వరాలుపొంది దేవతలను అప్సరసలను క్రూరంగా హింసించే వాడు.
    నేను గాక మరెవరూ శిరసున రత్నాలు ధరింపరాదు.. అంటూ దేవతా సర్పాల పడగలపై మణులను పెఱికివేసేవాడు.
    నేను తప్ప మీ రెవరూ తపస్సులు చేయరాదు.. అంటూ మునుల గడ్డాలను గుంజేవాడు.
    యజ్ఞ భాగం నా కివ్వాలి.. అంటూ దేవతల నవమానించేవాడు.
    దేవత లంతా మొర పెట్టుకోగా బ్రహ్మ కేసరి నాశ్రయించ మన్నాడు. వారంతా కేసరిని ప్రార్థించారు. ఈవార్త నారదుడు శంబసాధసునికి చెప్పి జాగ్రత్త.. అన్నాడు.
    ఘోరమైన యుద్ధంలో శంబసాధసుణ్ణి కేసరి సంహరించి హిరణ్యకశిపుని వధించిన నరకేసరిలా కీర్తింపబడ్డాడు.
    ==============================
    రాతిని నాతిఁ జేయగల రాముని సన్నిధి దాస దాసుడై..
    వ్రాతను దిద్దుకో ననిన రావణుకున్ భయ దాట్టహాసుడై..
    మాతకు సీతకున్ దిగులు మానుపఁ జేయగ శంబసాధ సా
    రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ
    28-7-18
    ~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి