కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================== కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో ========================= జన్మ కారకుడు మాత్రమే కాదు విద్యా బుద్దులు నేర్పి పోషించిన వాడైన తండ్రికి ఒక దశలో కంటి వెలుగై మెలగాల్సిన సుతుడె యముడై ప్రాణములను హరించె ననుటలో ధ్వనించెడి వైపరీత్యమే సమస్య ============================ సమస్యా పూరణం - 244 ==================
తండ్రి చచ్చిన కొలువొచ్చునని పైసల మూట రావొచ్చని తల్లికి ఫింఛను తానొచ్చునని హాయిగ తాము బతకొచ్చని తనయుని తల్లి కుట్రిది చూడె సభ్య సమాజము కాంచదయో కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో
====##$##====
తండ్రిని చంపిన ఒక్కసారిగా వారికి డబ్బులు రావడమే కాదు,తల్లికి ఫింఛను కొడుకు కు ఉద్యోగము వచ్చిన కేసులు సభ్య సమాజములో కోకొల్లలు.
ఒక ఉదాహరణని తడిమి చూద్దాం!
తెలంగాణ,కర్ణాటక సరిహద్దు దేవసూగూర్ లో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు (KPCL)లో పని చేసే కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి గతంలో ఇలాంటి మరణాలు చాలా సంభవించినవి.
తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవ ములు గ పూజ చేసె డు దేశాన మూర్ఖుడగు చు బెల్లమయ్యె భార్య యు తల్లి యల్లమైన కంటి దీపమౌ సుతు డ య్యే కాల యముడు ______కరణం రాజేశ్వర రావు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2776 సమస్య :: కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో! కంటికి వెలుగు, కంటికి దీపము అని అనుకొన్న కొడుకే కాలయముడు అయ్యాడు అని విచారించడం ఈ సమస్యలో ఉన్న విషయం. సందర్భం :: పరశురాముని తండ్రియైన జమదగ్ని మహర్షి తన నలుగురు పుత్రులను పిలిచి కుమారులారా! దోషయుక్త యైన మీ తల్లి శిరస్సును ఖండించండి అని ఆజ్ఞాపించినాడు. అప్పుడు పితృవాక్య పరిపాలనా ధర్మము యొక్క మహిమను ఎఱిగిన పరశురాముడు తన గండ్రగొడ్డలితో తన తల్లి శిరస్సును ఖండించినాడు అని శ్రీరాముడు కౌసల్యమ్మకు పితృవాక్య పాలనాధర్మాన్ని గురించి విశదీకరించినాడు. (అయోధ్యాకాండ 21-32) ఆ సమయంలో ఆ మాటలు విన్న ఒక వ్యక్తి అయ్యో కొడుకే తల్లికి యముడయ్యాడా! అని బాధపడినట్లు ఊహించి చెప్పే సందర్భం.
కంటిని మిమ్ము పుత్రకుల గంటిని కీర్తిని, నేడు రేణుకన్ గంటిని దోషయుక్తగను కావున జంపు డనంగ తండ్రి, నే గంటిని ధర్మ మంచు తలఁ ఖండన జేసెను జామదగ్నియే; కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో! కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (31-8-2018)
మఘధ రాజ్య రాజు బింబి సారుడు తన పుత్రుడు అజాతశత్రువు చేతిలో చని పోయెను . అజాత శత్రువును తన కుమారుడగు ఉదయ భద్రుని చేతిలో చచ్చెను . మేవారు రాజు రాణ కుంభుడు తన పుత్రుడు ఉదయి చేతిలో చచ్చెను, చహమాన రాజు అరునోరాజు తన కుమారుడు జగదేవ చేతిలో చచ్చెను .మార్వారు రాజు అభయ సింగు తన తండ్రి అజిత్ సింగును చంపెను ఈ మధ్య దీపేంద్ర రాజు తండ్రి తో సహా కుటుంబమును నేపాలులో చంపెను చరిత్ర లోన ఇటువంటి సంఘటనములు కోకొల్లలు
నా పూరణము
బింబిసార దొరను తన బిడ్డడు దును మాడ, నాతండును తన కుమారుని కర మున వధించబడెను, రాజ ఘనుడు రాణ కుంభు నతని సుతు డుదయి కూల్చె , చాహ మాన పతి నరునో రాజు వాని పుత్రు డైన జగదేవు చేత పొడవడచబడె, చంపె మార్వారు రాజును సంపరాయు డభయ సింగుడు దుష్టుడై నాశపడచు పదవిని,తన కుటుంబమున్ పడనడచెను దుష్ట దీపేంద్ర భూపతి, దొరకు చుండు చరిత లోన పుష్కలముగా మరువ లేని సంఘటనములు,సొమ్ముకోసరము తనదు (కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు) కలియుగమున లేశంబైన కరుణ లేక .
[8/31, 5:13 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి. కట్టుకొన్నవాడు భువిని కాల యముని యట్లు బాధ లిడుచు సత మారడిడగ కంటిదీపమౌ సుతుడయ్యె ;కాలయముడు వంటి తండ్రిబుద్ధిని మార్చి పగపు బాపె.
సందర్భము: స్తంభోద్భవుడై నృసింహ స్వామి యవతరించి హిరణ్య కశిపుని సంహరించినాడు. అదృశ్యరూపులై గగన మండలంలో నిలబడి దేవతలు దిక్పాలకులు ఆ లోకోత్తరమైన సంఘటనను వీక్షించినారు. ఒక యువతి "కడుపున పుట్టిన బిడ్డడే కాల యము డైనా" డన్నది. (తన ప్రసక్తి రాగా) యమధర్మ రా జది విని నొచ్చుకొని దిగివచ్చి ఆ యువతిని బిలిచి ఈ తీరుగా అంటున్నాడు. ============================== ఖర నఖా ల్గదలించి మెరయు జూ ల్విదిలించి మించి సురారిన్ వధించె నృహరి
ఘనుడగు పరశు రాముని గాథ నెఱుగ
రిప్లయితొలగించండిదండ్రి మాటను దలదాల్చి తనయుడేను
కన్న తల్లిని కడతేర్చె కరుణ వీడి
కంటి దీపమౌ సుతుడయ్యెఁ గాల యముడు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వింటి పెక్కగు గాథలు విధివశమ్ము
రిప్లయితొలగించండిమింటి దేవతలు కోపాన మిన్నకుండ
కుంటి గుణముల వంశము కూల్చు ఖలుడు
కంటి దీపమౌ సుతుడయ్యె కాలయముడు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "దేవతల్" అంటే సరి!
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏
తొలగించండివింటి పెక్కగు గాథలు విధివశమ్ము
తొలగించండిమింటి దేవతల్ కోపాన మిన్నకుండ
కుంటి గుణముల కులమును కూల్చు ఖలుడు
కంటి దీపమౌ సుతుడయ్యె కాలయముడు!
రిప్లయితొలగించండిమంట లెగయగ మసియయ్యె మనుగునొందె
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ, గాలయముఁడు
చిన్న వాడని చూడడు చీటి చింప
గాను చిత్రగుప్తుడచట గాలమేయు !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కన్న కొడుకును బెంచెను గార వమున
రిప్లయితొలగించండికొంగు ముడివేసి సతికంట కోరి వలచి
తల్లి విషమాయె తరలించె బెల్లి దముగ
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాల యముఁడు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో భావం స్పష్టంగా లేదు. "పెండ్లి సేయగా పెండ్లాము బెల్లమాయె" అందామా?
కన్న కొడుకును బెంచెను గార వమున
తొలగించండిపెండ్లి సేయగా పెడ్లాము బెల్ల మాయె
తల్లి విషమాయె తరలించె బెల్లి దముగ
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాల యముఁడు
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*కుంతీవిలాపము....*
కంటి రవిప్రభావమున కర్ణుని , భీతిలి లోకనిందకున్
గెంటితి నీటిలోనికట., నేడిటు దుష్టచతుష్టయమ్మునం...
దుంట ., వధింపబూనుట మహోగ్రుడునై నిజసోదరాళి ., నా
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ!!👏👏👏🙏🙏🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశాంతికాముకమైన దేశమ్మునందు
తొలగించండిపుట్టి., యుగ్రవాదిగ మారె పుత్రుడనుచు ,
బాధపడుచుండెనివ్విధి భరతమాత !
కంటిదీపమౌ సుతుడయ్యె కాలయముడు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు మురళీకృష్ణ గారికి:
తొలగించండిశేషాశేషవిశేషభూషకలితా భాషారమాయోషితా
వాగ్దేవీ విభవాభిమాన భవ సద్భావస్ఫురద్రాజితా |
లోకాలోకవిలోకమూక సుజనానీక ప్రభాదీపితా
ద్వైధీ శోధన ధారణైక యవధానీ! నౌమి విజ్ఞానధీ !
🙏🏻
గౌరీభట్ల బాలముకుందశర్మా,
గోలోకాశ్రమమ్
**********************************************************
మైలవరపు వారి స్పందన:
శారదాకృపాసంపన్నులు..
శ్రీ గౌరీభట్ల బాలముకుందశర్మగారికి సవినయనమస్సుమనస్సులు 🙏🙏
శ్రీరమ్యార్థమనోజ్ఞభావగుణరాశీభూతశబ్దప్రభా
ధారానిర్మితపద్యసౌధవిలసద్వాణీపదారాధనా
ధీరాజన్మధువాక్యభూషితమహాదివ్యార్థజిహ్వాగ్ర ! హే!
గౌరీభట్లముకుంద ! గైకొను నమస్కారప్రసూనమ్ములన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అమ్మా సీతాదేవి గారూ నమోనమః 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
శ్రీ వజ్జల రంగాచార్య కవిమిత్రులకు శుభాభినందనలు.. 🙏🙏
తొలగించండిసజ్జనసంగతిన్ విమల శాబ్దికపద్యము జూడ , వాణి కాల్
గజ్జెలు ఘల్లుఘల్లుమనగా నడయాడిన రీతి దోచెడిన్!
హృజ్జలజాతముల్ విరిసి యెంతయొ సంతసమందె మాకు శ్రీ
వజ్జలవంశభాస్కర ! శుభమ్ముల బొందుము శాశ్వతమ్ముగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పెండ్లము పలుకు లే సదా బెల్లమనుచు
రిప్లయితొలగించండితల్లిదండ్రుల క్షేమము తలచ కుండ
వెడల గొట్టి గృహము నుండి కడు మదమున
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెడల గొట్టె గృహమునుండి కఠిను డగుచు' అంటే బాగుంటుందేమో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రశస్తమైన పూరణార్యా!🙏🙏🙏
తొలగించండిరామాచార్య గారూ,
తొలగించండిప్రహ్లాదుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "ఇంటికి వెల్గుఁ దా నొసఁగు నిక్కటిఁ బాపు..." అందామా?
అవునండి అలాగే మార్చాలి.
తొలగించండిధన్యవాదాలు.
'కలి'ని ఘోరము లెన్నియో!కన్నవారి
రిప్లయితొలగించండినాగ్రహంబున డబ్బుకై నమిత క్రూర
ముగను కడతేర్చు బిడ్డలు వగలు నింపు
కంటి దీపమౌ సుతుడయ్యె కాల యముడు!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'డబ్బుకై యమిత... బిడ్డడు వగపు నింపు...' అనండి.
ధన్యవాదములు
తొలగించండికవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
========================
కంటికి దీపమౌ సుతుడె
కాలయముండుగ నయ్యె నయ్యయో
=========================
జన్మ కారకుడు మాత్రమే కాదు విద్యా
బుద్దులు నేర్పి పోషించిన వాడైన తండ్రికి
ఒక దశలో కంటి వెలుగై మెలగాల్సిన
సుతుడె యముడై ప్రాణములను హరించె
ననుటలో ధ్వనించెడి వైపరీత్యమే సమస్య
============================
సమస్యా పూరణం - 244
==================
తండ్రి చచ్చిన కొలువొచ్చునని
పైసల మూట రావొచ్చని
తల్లికి ఫింఛను తానొచ్చునని
హాయిగ తాము బతకొచ్చని
తనయుని తల్లి కుట్రిది చూడె
సభ్య సమాజము కాంచదయో
కంటికి దీపమౌ సుతుడె
కాలయముండుగ నయ్యె నయ్యయో
====##$##====
తండ్రిని చంపిన ఒక్కసారిగా వారికి
డబ్బులు రావడమే కాదు,తల్లికి ఫింఛను
కొడుకు కు ఉద్యోగము వచ్చిన కేసులు
సభ్య సమాజములో కోకొల్లలు.
ఒక ఉదాహరణని తడిమి చూద్దాం!
తెలంగాణ,కర్ణాటక సరిహద్దు దేవసూగూర్
లో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు (KPCL)లో
పని చేసే కింది స్థాయి ఉద్యోగులకు
సంబంధించి గతంలో ఇలాంటి మరణాలు
చాలా సంభవించినవి.
( మాత్రా గణనము- అంత్య ప్రాస )
----- ఇట్టె రమేష్
( శుభోదయం)
వింటిమి నేటికాలమున బిడ్డలు చేయు దురాగతమ్ములన్
రిప్లయితొలగించండికంటిమి యాస్తికోసమయి కర్కశుడైన సుతుండు తండ్రినే
మంటలలోనఁగాల్చుటను మారిన లోకపు తీరుతెన్నులన్
*"కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(ఔరంగజేబు తనతండ్రి షాజహాన్ పాదుషాను బంధించటం)
రిప్లయితొలగించండిజంటగురాణి ముంతజును చావది మింగగ షాజహానుడే
యొంటరివాడయున్ సతికి నొప్పగుతాజమహల్ ను గట్టగా
తుంటరి చేష్టతోడ కుమతుం డవురంగడు ఖైదుచేయగా
గంటికిదీపమౌసుతుడె కాలయముండుగ నయ్యెనయ్యయో
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్సులండీ !
తొలగించండితల్లి దండ్రులు ప్రత్యక్ష దైవ ములు గ
రిప్లయితొలగించండిపూజ చేసె డు దేశాన మూర్ఖుడగు చు
బెల్లమయ్యె భార్య యు తల్లి యల్లమైన
కంటి దీపమౌ సుతు డ య్యే కాల యముడు
______కరణం రాజేశ్వర రావు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పగటిచీకట్లు మాన్పగభాస్కరుండు
రిప్లయితొలగించండికంటిదీపమౌ!సుతుడయ్యె కాలయముడు!
"మంచి బెంచగతండ్రియు! వంచనాల
శిక్షవేయగ కొడుకు!ప్రసిద్దులైరి!!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
ఇంటికి వెల్గు దాననియు నిక్కటిఁ బాపునటంచుఁ దల్చి చే
రిప్లయితొలగించండికొంటిని హ్లాదమెంతొ, యనుకోని విధమ్ము విరోధిభక్తుడై
మింటికిఁ. జేర్చె నన్ననుచు, మేకొని కాంచనకశ్యపుండనెన్
కంటికి దీపమౌ సుతుడె కాలయముండు నయ్యె నయ్యెయో!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2776
సమస్య :: కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో!
కంటికి వెలుగు, కంటికి దీపము అని అనుకొన్న కొడుకే కాలయముడు అయ్యాడు అని విచారించడం ఈ సమస్యలో ఉన్న విషయం.
సందర్భం :: పరశురాముని తండ్రియైన జమదగ్ని మహర్షి తన నలుగురు పుత్రులను పిలిచి కుమారులారా! దోషయుక్త యైన మీ తల్లి శిరస్సును ఖండించండి అని ఆజ్ఞాపించినాడు. అప్పుడు పితృవాక్య పరిపాలనా ధర్మము యొక్క మహిమను ఎఱిగిన పరశురాముడు తన గండ్రగొడ్డలితో తన తల్లి శిరస్సును ఖండించినాడు అని
శ్రీరాముడు కౌసల్యమ్మకు పితృవాక్య పాలనాధర్మాన్ని గురించి విశదీకరించినాడు. (అయోధ్యాకాండ 21-32)
ఆ సమయంలో ఆ మాటలు విన్న ఒక వ్యక్తి అయ్యో కొడుకే తల్లికి యముడయ్యాడా! అని బాధపడినట్లు ఊహించి చెప్పే సందర్భం.
కంటిని మిమ్ము పుత్రకుల గంటిని కీర్తిని, నేడు రేణుకన్
గంటిని దోషయుక్తగను కావున జంపు డనంగ తండ్రి, నే
గంటిని ధర్మ మంచు తలఁ ఖండన జేసెను జామదగ్నియే;
కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో!
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (31-8-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమ
తొలగించండిఇంట బుట్టిన పసిపాప యింటివారి ;
రిప్లయితొలగించండిదాశరథిగ పుట్టిన హరి దశరథునకు ;
కాల సమవర్తి గాపేరు గాంచెను గద!;
కంటి దీపమౌ ;సుతుఁడయ్యెఁ ;గాలయముఁడు"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
తల్లి విషమాయె బెండ్లాము బెల్ల మాయె |
నమ్మ యొనరించు కొనె కటా యాత్మహత్య |
కుమిలి , పక్షవాతము సోక , గూలె దండ్రి |
పీడ విరిగె నని మురిసె కోడలమ్మ |
పొంగె నాస్తి వచ్చె నటంచు పుత్రు డపుడు |
కంటికి దీపమౌ సుతుడయ్యె కాలయముడు |
తల్లిదండ్రుల సుకమును దలచ నట్టి
కొడుకు నివ్వకు దైవమా ! కడుపు చేటు |
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
👃👃👃. గు రు వ ర్యు ల కు ప ద న మ స్కా ర ము లు . 👃👃👃
తొలగించండిధ న్య వా ద ము లు 👃👃👃👃👃
ఆశ యాతని గ్రమ్మగ నవధి మీర
రిప్లయితొలగించండిదల్లి దండ్రుల హతమార్చె దనయుడొకడు
ధనపిశాచి లక్షణమెంత దారుణమ్ము!
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,
నా ప్రబంధం సక్రమంగా చేరడానికిది కడపటి రోజు.ఫోన్ చేసి తెలిసికోగలరు.
ఈరోజు అనంతకృష్ణ గారికి అందాలి.
తొలగించండిఆస్తిపంచలేదేమినాకనుచుచంపి
రిప్లయితొలగించండికఃటిదీపమౌసుతుడయ్యెగాలయముడు
నేటియువకులవర్తనమిటులయుండె
నిట్టివానికియురిశిక్షనిడుటమేలు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కంటి'...'కఃటి' అని టైపయింది.
మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
"ఇట్టివానికి నురుశిక్ష..." అనండి.
ఈ రోజు సమస్య
రిప్లయితొలగించండికంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు
ఒక్కసారి చరిత్ర చూస్తే
మఘధ రాజ్య రాజు బింబి సారుడు తన పుత్రుడు అజాతశత్రువు చేతిలో చని పోయెను . అజాత శత్రువును తన కుమారుడగు ఉదయ భద్రుని చేతిలో చచ్చెను . మేవారు రాజు రాణ కుంభుడు తన పుత్రుడు ఉదయి చేతిలో చచ్చెను, చహమాన రాజు అరునోరాజు తన కుమారుడు జగదేవ చేతిలో చచ్చెను .మార్వారు రాజు అభయ సింగు తన తండ్రి అజిత్ సింగును చంపెను ఈ మధ్య దీపేంద్ర రాజు తండ్రి తో సహా కుటుంబమును నేపాలులో చంపెను చరిత్ర లోన ఇటువంటి సంఘటనములు కోకొల్లలు
నా పూరణము
బింబిసార దొరను తన బిడ్డడు దును
మాడ, నాతండును తన కుమారుని కర
మున వధించబడెను, రాజ ఘనుడు రాణ
కుంభు నతని సుతు డుదయి కూల్చె , చాహ
మాన పతి నరునో రాజు వాని పుత్రు
డైన జగదేవు చేత పొడవడచబడె,
చంపె మార్వారు రాజును సంపరాయు
డభయ సింగుడు దుష్టుడై నాశపడచు
పదవిని,తన కుటుంబమున్ పడనడచెను
దుష్ట దీపేంద్ర భూపతి, దొరకు చుండు
చరిత లోన పుష్కలముగా మరువ లేని
సంఘటనములు,సొమ్ముకోసరము తనదు
(కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు)
కలియుగమున లేశంబైన కరుణ లేక .
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధ కవి గుంటూరు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంటికిదీపమౌసుతుడెకాలయముండుగనయ్యెనయ్యయో
రిప్లయితొలగించండిమింటికిదావినంబడగమీదునుమిక్కిలియెంతయేడ్చిన
న్గంటినినీరురావడముగాంతుముగానికవచ్చుజీవముల్ ?
తుంటరియైనయట్టిసుతుదూగువిధంబుగజంపుటొప్పగున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిదాస్య శృంఖలబద్ధయై తల్లడిల్లె
మ్లేచ్ఛ పాలనాగండము మీర నేడు
కొడుకు పరభాష తో గొంతు గోసి మనియె
కంటిదీపమౌ సుతుడయ్యె కాలయముడు
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఇంటిని దిద్దుకొమ్మన నవెక్కడివో చదువుల్విదేశపున్
బంటుగ నేగి "డాలరు"ను బాగుగబెంచియు దేశ రూకలన్
పంటికినానకుండ బహు భారమునున్ సహియింప ద్రోచి తా
కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా, శ్రీ అనంతకృష్ణ గారికీ ఫోన్ చేయగలరు.మీ మెప్పుకోలునకు కృతజ్ఞతలు.
హిరణ్యకశిపుని ఆవేదన
రిప్లయితొలగించండివింటిమి వేదవాక్యముల విజ్ఞత తోడుగ పుత్రుడేయగున్
మింటికి బోవుమార్గమున మిత్రుడు దాటగ నడ్డగింతలన్
తుంటరి యయ్యెనే సుతుడు దోషము లెంచగ దండ్రియందునే
కంటక ప్రాయమే పితను కాదను పుత్రుని బొందగానిలన్
కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యెనయ్యయో!
పుత్రుడు పున్నామ నరకాన్ని దాటిస్తాడని నమ్మకం!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిభృగు మహాముని కల్పిత భీమ దివ్య
రిప్లయితొలగించండిహోమ జనితంపు ఋభుగణ మున్న నేమి
దక్షునకు వీరభద్రుఁడు తలఁచ బేసి
కంటి దీపమౌ సుతుఁ డయ్యెఁ గాలయముఁడు
పంటికిఁ జేయ వైద్యమును బన్నుగఁ గూర్చొనఁ జేసి తండ్రినిన్
వెంట ద్విచక్ర వాహన మపేత భయోన్నత వేగ మంటగన్
మింటినిఁ దాఁ దమిన్ నడుప మిఱ్ఱగు రాతిని నెక్కి కూలగం
గంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికంటికి రెప్పలా పెనిచి కమ్మని జీవన యానమిచ్చినన్
రిప్లయితొలగించండితుంటరి యై నిరంతరము దోషము లెన్నుచు కన్నతల్లిపై
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో
పంటపొలమ్మునన్ కసవు పాకకు పంపెను క్రూర బుద్ధితో
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కంటికి రెప్పగా' అనండి.
గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
తొలగించండితప్ప త్రాగిన మత్తున తనువు మరచి
రిప్లయితొలగించండిధనము నీయగ లేదని దాష్టికముగ
కన్న తల్లిని దునుమాడి కలియుగాన
కంటి దీపమౌ సుతుడయ్యె గాలయముడు!!!
తండ్రిమాటను మన్నించి తల్లిని కడ
తేర్చి ధరలోన జమదగ్ని దేహజుండు
రేణుకాదేవి పాలిట లీలగాను
కంటి దీపమో సుతుడయ్యె గాలయముడు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండి*కంటికి దీపమౌ సుతుఁడయ్యెఁగాలయముఁడు* !!
పూరణ
ఆస్తి మొత్తము కొడుకున కప్పగించ
తనయునికి బరువయ్యిరి తల్లి దండ్రి
కడుపు కింత తిండియె పెట్ట కసురు కొనుచు
*కంటికి దీపమౌ సుతుఁడయ్యెఁగాలయముఁడు* !!
హంసగీ
31.8.18
హంసగీతి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంటిని బుణ్యసీమలను, గాదనఁ బోక వ్రతాదు లొప్పఁ జే
రిప్లయితొలగించండికొంటిని, బుత్రుఁ గోరి, తుదఁ గోరిక తీరె నటన్న దల్లికిన్
గంటకభూతగండజనికారణజాతకమాతృహంతయై
కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్య యో!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మనిషిలో మానవత్వము మాయమయ్యె
రిప్లయితొలగించండివయసు మళ్ళిన జనకులు భారమయ్యె
కన్నవారిపట్ల కరుణ గాన రాదు
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు.
డా. మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జనకులు భారమైరి' అనండి.
గురువుగారికి ధన్యవాదములు.
తొలగించండికంటికి కానరాని హరి కైటభ వైరిని మాటిమాటికిన్
రిప్లయితొలగించండిగొంటెతనమ్ముతో దలచు కొడ్కును జూచుచు నాగ్రహమ్మునన్
గంటికి జూపమంచనగ కంబము నందున జూపి తండ్రికిన్
కంటికి దీపమౌ సుతుడె కాలయముండుగ నయ్యె నయ్యయో.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"హరిఁ గైటభవైరిని" అనండి. అన్వయక్లేశం ఉండదు.
.
రిప్లయితొలగించండిగుంటడు వాడు శైశవము కొంతయు వీడను లేదు మాకిలన్
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో
తుంటరి వారలన్ కలిసి దుష్టచతుష్టయమై జనాళికిన్
కంటకుడాయె హంతకుని గా కడ గండ్లను జేయుచుండెనే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిద్రుపద సూనను సిగపట్ట దుస్ససేను
రొమ్ము రుధిరమ్ముఁ ద్రాగుచుఁగ్రూరుడౌచు
భీమ సేనుండు గూల్చంగ, పిన్ని పృథకు
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁగాలయముఁడు!
ఉత్పలమాల
ఇంటికి వచ్చి ద్రౌపదినె యీడ్చుకు వెల్లిన దుస్ససేనునే
యొంటిగ జిక్కబుచ్చుకొని యోధుడు భీముఁడు రొమ్ముజీల్చి తా
నంటఁగ రక్తమున్ గురుల కాసతి మెచ్చగఁ బిన్ని కుంతికిన్
గంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కంప్యుటరునకుఁ బుట్టెను కైన నిమిడె
రిప్లయితొలగించండిసెల్లు ఫోనునే తానంచు చింతఁ దెచ్చె
సులువు సౌకర్యమను బేర సొంపు గాను
మనుజు లందరి మనముల మాయ జేసె
కనుల ముందుండి నిరతము గాంచ మనుచు
దృష్టి దోషమ్ముఁ గొనిఁ దెచ్చె దివ్యముగను
చేతిలోఁ బేలి చిదిమెగా జీవితముల
*"కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంటివాడని గారాబు చాలఁ జేయ
రిప్లయితొలగించండితుంటరొక్కడు మారెను కంటకముగ
ఇంటి దీపము లార్పేటి హీనుఁడాయె
కంటి దీపమౌ సుతుఁడయ్యె గాలయముఁడు..
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆర్పెడి' అనండి.
[8/31, 5:13 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండికట్టుకొన్నవాడు భువిని కాల యముని
యట్లు బాధ లిడుచు సత మారడిడగ
కంటిదీపమౌ సుతుడయ్యె ;కాలయముడు
వంటి తండ్రిబుద్ధిని మార్చి పగపు బాపె.
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
కంటి దీపమౌ సుతుడయ్యె కాలయముడు
సందర్భము: స్తంభోద్భవుడై నృసింహ స్వామి యవతరించి హిరణ్య కశిపుని సంహరించినాడు. అదృశ్యరూపులై గగన మండలంలో నిలబడి దేవతలు దిక్పాలకులు ఆ లోకోత్తరమైన సంఘటనను వీక్షించినారు.
ఒక యువతి "కడుపున పుట్టిన బిడ్డడే కాల యము డైనా" డన్నది. (తన ప్రసక్తి రాగా) యమధర్మ రా జది విని నొచ్చుకొని దిగివచ్చి ఆ యువతిని బిలిచి ఈ తీరుగా అంటున్నాడు.
==============================
ఖర నఖా ల్గదలించి మెరయు జూ ల్విదిలించి
మించి సురారిన్ వధించె నృహరి
కనరాక నిలుచుండి గగన వీధులనుండి
తిలకించిరి దివిజుల్, దిక్పతులును...
''కడుపునం జనియించి కన్న బిడ్డడె కాల
యముడాయె''ననె నొక్క యతివయపుడు
యమధర్మ రా జది గమనించి దిగివచ్చి
పిలిచి యయ్యతివతో బలికె నిట్లు...
'' భగవ ద్విరోధంబు భక్త విరోధంబు
ధర్మ విరోధంబు తగవు తల్లి..!
తపములున్ వరములున్ ధర్మంబుకోసమే..!
తప్పిన దైవంబె తంట వాపు..
కన్న బిడ్డ డనక కడతేర్పగా నెంచె
నెన్నితీరులనొ నీ వెరుగ వేమి?
అరయ త ప్పిది కానెకా దనగ వచ్చు
''కన్న తండ్రియే తానయ్యె కాల యముడు''
కనుక నిట్టి సందర్భాన ననగరాదు
''కంటి దీపమౌ సుతు డయ్యె కాల యముడు''
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
31-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఉ . వింటిహిరణ్య కశ్యపుని వింతగు గోర్కెలు విస్మయంబుగన్
రిప్లయితొలగించండిమంటలఘోరసంద్ర విషమాలగనాగులకొండకోనలన్
ఒంటరివానిజేసిపసికూననుహింసలపాలుజేసితా
వెంటకుతోడుకెళ్ళ నిలువెత్తగుకంభముజూప శ్రీహరిన్
కంటిమి నారసింహమునుకాంతులుచిందుచునుగ్రరూపమున్
ఇంటికి వాకిటన్ నడుమఇమ్మగుగుమ్మమునెమ్మదించిగా
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో.
చంటి బిడ్డను చదివిస్తి నింటి నమ్మి...
రిప్లయితొలగించండిఒంటి కొడుకాయె డాక్టరు మింటి కెగసి...
ఇంటి కగుదెంచి గుచ్చునె నిచట నచట...
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ గాలయముఁడు!!!
ఒంటరి బుడ్డగాడనుచు నొప్పుచు నొచ్చుచు కొంపనమ్ముచున్
రిప్లయితొలగించండిచంటిని హైద్రబాదునహ చక్కని డాక్టరు జేయగాసలా!!!
మింటికి నెగ్గుచున్ సుగరు మీటరు గీటరు విప్పిజొప్పుచున్...
ఇంటికి రాగనే భడవ డిచ్చట నచ్చట సూదిగుచ్చుచున్
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో!!!
తుంటరి వాడయో వినడు తుష్టిగ చెప్పిన నాదుమాటలన్
రిప్లయితొలగించండిగుంటడు చావడే విషము గుప్పెడు క్రుక్కిన నోటినిండుగా
తంటలు పెట్టి త్రోసినను దబ్బున గిట్టడు కొండనుండినన్
మంటను త్రోసినన్ విడడు మాయల మారిది వీనిప్రాణమున్...
ఇంటిని వాకిటన్ గొణుగు నిచ్చట నచ్చట విష్ణునామమున్
కంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో