8, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2782 (తేలును ముద్దాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్"
(లేదా...)
"తేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ"

40 కామెంట్‌లు:


  1. ఏలిక వారి దురాయిగ
    చాలిక పేర్పులు జిలేబి, సరసము గానన్,
    మేలుగ వ్రాయన్ పాకము
    తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  2. జాలము లోన పద్యముల చక్కగ చూచుచు నేర్పు గాంచుచున్
    కోలకుతెచ్చి వాక్యముల కొంగున గట్టుకొనంగ రమ్యమై
    పాలకి నెక్కు పద్యముగ, పంకజ నేత్ర ! జిలేబి పాకమై
    తేలును, ముద్దులాడి, యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌👌👌👏👏👏
      మీ ఇంద్రజాలములో, జిలేబి పాకంలో మేమెప్పుడో పడ్డాము!😊😊😊

      తొలగించండి
    2. సమస్యాపూరణం – 1105 (తేలును ముద్దులాడి చెలి)

      కవిమిత్రులారా,
      ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...

      "తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్"
      ('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

      కంది శంకరయ్య వద్ద 7/07/2013 07:11:00 AM

      https://kandishankaraiah.blogspot.com/2013/07/1105.html?m=1

      తొలగించండి
  3. ఒక ప్రేమికుని అభ్యర్ధన:
    చాలును నీ నయగారము
    కాలము బోనీకుము వృధ కాంతామణిరో
    హేలగ ముదంబు నామది
    తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    T.S లో యెన్నికలు..TRSకు సూచన:
    పాలితులకు తాయిలమిడ
    తేలికగా మరచిపోరె తీరా మరల
    న్నేలగ వోట్లను గొనుటకు
    తేలును ముద్దాడి పల్కు!తేనియలూరన్!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    అన్నయ్య ,చెల్లికి వివాహం జరిపించి ఆమెను అత్తవారింటికంపుతూ అనిన మాట:
    మేలును గోరువాడొకడె మేటియ నూటికి కోటి కొక్కడే
    వీలునుబట్టి దోచుకొను వీరులు పెక్కురు భారతీయత
    న్నాలుగ బ్రాణముండువర కావరుడేగతి;ద్రోతు నిన్నిటన్
    తేలును ముద్దులాడి యిక తేనియలూరగ బల్కవే చెలీ!

    రిప్లయితొలగించండి
  6. హే లలనా రమ్మిక సర
    సాలాడెడు వేళ గాదె సైయని యన్నన్
    జాలును మనసూహలలో
    తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్.

    రిప్లయితొలగించండి
  7. చాలును వాదమింకనొక చక్కని బిడ్డ జనించు బాలుడో
    బాలికయో తలంచుటయె వ్యర్థము కావున వేచియుండుమా
    చాలిక కొన్నిమాసములె జవ్వనియోపికపట్టు
    కాన్పులో
    *"తేలును, ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ"*

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    🙏శ్రీకృష్ణ సత్య🙏

    ఏలనె యల్క? మీరెరుగరే ? అది చిన్నది పారిజాతమే!
    లీలగ నిచ్చినారు గద ! లేదె మరొక్కటి దెత్తు.,నమ్మ గో...
    పాలుని., చేరి చూడు మది
    స్వర్గసుఖమ్ముల హాయిహాయిగా
    తేలును! ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలు ని *మేష* మైన రససాగరతీరము జూడవచ్చు ! నాం...
      దోలన మానుమింక , *తుల* తూగు గదే *మిథునమ్ము*, మేనిపై
      వ్రాలవె ! *కన్య* వీవు ! సుఖరాశివి ! *వృశ్చిక* రాశి నాది నే
      తేలును ! ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    2. వాహ్! క్యా రాశి హై :)


      మేలగు రాశుల బోసిరి
      లీలగ యవధానులిచట లెస్స! భళి భళీ,
      లోలాక్షుల కైరాసులు
      తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!

      ***

      మైలవరపు రాసులివి! భ
      ళీ! లోలాక్షుల కు రాశులివియె! జిలేబీ
      లై లసితమై మగడి మది
      తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!.


      జిలేబి

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2782
    సమస్య :: తేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ.
    తేలును ముద్దు పెట్టుకొని తీయగా మాట్లాడు ఓ ప్రేయసీ! అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అమాయకురాలైన నవ వధువును ఏకాంతంలో ఉన్న భర్త దగ్గఱకు పిలుస్తూ ఓ చెలీ! గడచిపోతున్న కాలము మళ్లీ తిరిగి రాదు సుమా. ఆలస్యం చేయకుండా పరిరంభ సుఖాన్ని పొందాలి. దాంపత్య ‘శోభనం’దుకోవాలి. అప్పుడు మన మనసు ఆనంద సముద్రంలో *తేలును ముద్దులాడుతూ* తేనె వంటి తీయని మాటలను పలుకు అంటూ బ్రహ్మానందప్రాప్తి గుఱించి బోధించే సందర్భం.

    పాలను ద్రాగి నీకు నొక పాలు మిగిల్చితి ద్రాగు మింక నీ
    కాలము రాదు, కౌగిలి సుఖమ్మును బొందుచు నిమ్ము వేగ నీ
    లీల జెలంగు శోభనము ప్రీతిగ, చిత్తము మోదవార్ధిలో
    తేలును, ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ !
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-9-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు



    1. గోలా! జిలేబి శోభన
      వేళను కొని యాడెదమ్ము వెసవెస రమ్మా!
      పాలు మురిపాలు సరసము
      తేలును! ముద్దాడి పల్కు తేనియ లూరన్!


      జిలేబి

      తొలగించండి
  10. లోల త తో ప్రేమికు లి ల
    మేలగు జంట గ కలిసి రి మిథున ము గాగన్
    లాలిత్యపు సరసాభ్ఢి న్
    తేలు ను ముద్దాడి పల్కు తేనియ లూర న్

    రిప్లయితొలగించండి
  11. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    తేలును ముద్దులాడి యిక
    తేనియలూరగ బల్కవే చెలీ
    ========================
    "విషపూరితమైన తేలును ముద్దాడి
    అటుపై తీయ తీయగా మాటలాడవె
    ఓ చెలియా " అనటంలో ధ్వనించే
    అసంబద్దతె ఇచట సమస్య
    ========================
    సమస్యా పూరణం- 250
    ==================

    ముఖపుస్తకమున పెట్టెను ముఖము
    చూపబోడుగ తనదు నఖము
    యువతుల వంచన దిశగ మఖము
    మోసపోవుట అదేమి సుఖము
    గొఱ్ఱె కసాయిని నమ్మెననగ
    ఉచ్చున పడెను అనారుకలీ
    తేలును ముద్దులాడి యిక
    తేనియలూరగ బల్కవే చెలీ

    ====##$##====

    ( నఖము = గోరు)( మఖము = యజ్ఞము )

    ====##$##====

    తన ముఖము అంతంత మాత్రమేనని
    మరో అందమైన ముఖాన్ని ముఖపుస్తకంలో
    పెట్టి 45 రోజుల వ్యవధిలో 25 సిమ్ కార్డులు
    మార్చి 500 మంది యువతులు,మహిళలను
    బురిడీ కొట్టించి సుమారు కోటిన్నర కాజేసిన
    మగమహారాజు పేరు జోగాడ వంశీకృష్ణ ఊరు
    రాజమండ్రి సమీప కంబాలచెరువు.

    మోసగించిన వంశీకృష్ణ మోసం 22
    క్యారెట్లయితె , మోసగించబడిన మహిళల
    తెలివి తక్కువతనం 24 క్యారెట్లు కదా!

    కేటుదైన బాహ్య సౌందర్యమునకు కాక
    సొక్కమైన అంతర్ సౌందర్యమునకు మీ మీ
    మనసులను పడేసుకోగలందులకు సమస్త
    మహిళా లోకమునకు మనవి.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  12. చాలిక సరసపుటలుకలు,
    మ్రోలన్ వ్రాలితిని, విడుము మోమాటంబుల్,
    సోలిన మది యిక మరులన్
    దేలును, ముద్దాడి పల్కు తేనియలూరన్..

    రిప్లయితొలగించండి
  13. మేలుగ వృశ్చిక చిత్రము
    బాలుడు గీయంగ జూసి భళిరా యనుచున్
    లాలనసేయుచు తల్లియె
    తేలును ముద్దాడి ,పల్కు తేనియలూరన్!!!

    రిప్లయితొలగించండి
  14. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

    సందర్భము: ఒక ఆడ తేలు మగ తేలును ముద్దాడి ఈ విధంగా తీయగా పలుకుతూ ఉన్నది
    "సమస్యా పూరణ లోలురు మన పేరు మీద రోజంతా ఈ విధంగా తేలుతూనే ఉన్నారు లెండి!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లీల నొక యాడ తేల్ మగ
    తెేలును ముద్దాడి పల్కు తేనియలూరన్
    "తెేలిరి లెండి! సమస్యా
    లోలురు మన పేరు మీద రోజంత నిటుల్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    8.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  15. ఏల యలిగెనో శ్రీమతి?
    మేలగు నొక చీరదెచ్చి మెప్పించినచో
    చాలును,మోదమున మునిగి
    తేలును ; ముద్దాడి పల్కు తేనియ లూరన్"

    రిప్లయితొలగించండి
  16. *సమస్య :-*

    "తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్"

    *కందం**

    మేలిమి ముత్యాలల్లిన
    మాలను భార్యకు చిరు బహుమతినివ్వంగా
    హేలా విలాసమందున
    తేలును, ముద్దాడి పల్కు తేనియలూరన్
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  17. పాలనువేసిననుసిరిక
    తేలును,ముద్దాడిపల్కుదేనియలూర
    న్బాలునినందముజూసిన
    నాలలనలుమురిసిపడుచునానందముతోన్

    రిప్లయితొలగించండి
  18. కాళికయగునచ్చిన నగ తేలేనని చెప్పినపుడు తెచ్చినచో తా మేలములాడును దివిలో తేలును, ముద్దాడి పల్కు తేనియలూరన్

    రిప్లయితొలగించండి
  19. పాలసముద్రమందలలపాన్పునవిష్ణువుసర్పరాజుపై
    తేలును,ముద్దులాడియికతేనియలూరగబల్కవేచెలీ!
    ఫాలనురేఖలున్గలిగిభాసురతేజముగల్గియున్నయీ
    బాలునిజంకనెత్తుకొనిపాయనిప్రేమనుబొందుచుండుచున్

    రిప్లయితొలగించండి
  20. మేలగు నీ కిఁకఁ జని తేఁ
    జాలిన మఱి నీదు భర్త సతము మధు మహా
    శాలను బ్రీతి వదరుఁబో
    తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

    [ వదరుఁబోతు + ఏలును = వదరుఁబో తేలును]


    పాలను నీటి నింపుగను వారక వేరొనరించ నేరు నీ
    జాలపదంపుఁ దెల్లని ఖజాకము కానము దాని నెందు నే
    గాలము వేసి చూచినను గాంచుమ యా కలహంస నీటి లోఁ
    దేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ

    [తేలు = నీళ్లలో క్రీడించు]

    రిప్లయితొలగించండి
  21. (శోభనసమయం - చిత్రవిచిత్రపు చక్కెరబొమ్మలు)
    హేలగ శోభనంబునను నింపగు చక్కెరబొమ్మలెన్నియో
    మేలుగ జేసి వానినొక మిన్కులపళ్ళెరమందు నుంచగా,
    లాలన నాథుడిట్లనెను "లాస్యసుహాసిని!పంచదారపుం
    దేలును ముద్దులాడి ,యిక తేనియలూరగ బల్కవే చెలీ!

    రిప్లయితొలగించండి
  22. మేలని యొక గౌళి యొకచొ
    నాలాపన జేసి మురిసి యానందముతో
    వాలముల పోలికలు గని
    తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    పత్నికై ఘోర తపము కపర్థి జేయ
    కామమును గల్గ జేయగ కాంతు డపుడు
    నాతి మరుజన్మ నందగ శీత నగపు
    పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను

    రిప్లయితొలగించండి
  23. బాలునిబుడిబుడినడకలు
    జాలిగతగు జూపులంద?జనకుని మనసే
    మేలగుమమతలయందున
    తేలును!ముద్దాడిపల్కు!తేనియలూరన్

    రిప్లయితొలగించండి
  24. చాలుము ' సీరియల్ల', ట విశాదవిలాపకథాసుదీర్ఘసం

    చాలితకుచ్చితత్త్వగుణసజ్జితపాత్రలు క్రూరకాంతలై

    మేలిమి కాదు, కాంంచకుమి!, మేనులు హాయిని గౌగిలింపగా

    తేలును, ముద్దులాడి యిక తేనియ లూరగఁ బల్కవే చెలీ!,

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. చాలును కొంటె చూపులిక చల్లని వెన్నెల కాంతులీనెడిన్
    వేళన నీదు పొందుకని వేచితి, సిగ్గును మానమంటినే
    గాలిపతంగమౌను నిను గాంచిన నాదు మనస్సు నింగిలో
    తేలును, ముద్దులాడి యిక తేనియలూరగ బల్కవే చెలీ.

    రిప్లయితొలగించండి
  26. బాలుడు మాటలు నేర్చుచు
    గోలను చేయుచు కుడువగ కూరిమి తోడన్
    మాలిమి తో వేడ జనని
    తేలును ముద్దాడి పల్కు తేనియలూరన్.

    రిప్లయితొలగించండి
  27. చాలును సరసపు మాటలు
    కాలము చేజార నీకు కనుమీ గడియన్
    మేలిమి బంగరు క్షణముల
    దేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

    రిప్లయితొలగించండి
  28. గోలగ వాగును నా యి

    ల్లాలిట, రాత్రియు పగలును లలితో హృదిని

    న్నేలును, వలపుల మున్గును,

    తేలును,...ముద్దాడి పల్కు తేనియ లూరన్ :)

    రిప్లయితొలగించండి
  29. గోలగ వాగుచున్,...సతము గొప్పగ కోతలు కోయుచున్,...మహా

    ప్రేలుచు,..రాత్రియున్ పగలు ప్రేమను కూర్చుచు జార్చుచున్,...హృది

    న్నేలుచు,...నామదిన్ తొలిచి నేర్పుగ వల్పులలోన మున్గుచున్

    తేలును ముద్దులాడి!...యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!

    రిప్లయితొలగించండి
  30. మేలుగ సత్యభామ జడ మెచ్చుచు నీకడ తప్పుజేసితిన్
    రోలున రోకలిన్ గొనుచు రొప్పుచు రోజుచు దెబ్బతీసితే!
    చాలును గ్రుద్దులాటలిక చంపకు! నామది నీదు హృత్తునన్
    తేలును;..ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!

    రిప్లయితొలగించండి