23, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2797 (పగలో మున్గిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్"
(లేదా...)
"పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్"

62 కామెంట్‌లు:


  1. (1)
    నిగమార్థంబుల నెఱిఁగియు
    నగణిత సత్కర్మ రతిని ననయం బెదలో
    భగవంతునిఁ గొలిచి సురా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్.
    (2)
    విగతాశా వలయంబునన్ విషయ నిర్వేదాత్ములై నిచ్చలున్
    జగదుద్ధారణ కార్య దీక్షఁ గొనియున్ సత్కర్మలం జేసి వా
    సిగ దైవమ్మును నమ్మి కొల్చి శుభ కాశీక్షేత్రమందున్ సురా
    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    జగదార్తావనుడైన శ్రీహరిపదాబ్జప్రాభవోద్దీప్తయౌ ,
    జగదంబాసహితోత్తమాంగశుభసంస్పర్శాప్రపూతాంగియౌ ,
    నగరాట్సానుచలత్పునీతయగు , జాహ్నవ్యాఖ్యయౌ నిర్జరా...
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరు సవరణ 🙏

      జగదార్తావనుడైన శ్రీహరిపదాబ్జప్రాభవోద్దీప్తయౌ ,
      జగదంబాసహితోత్తమాంగశుభసంస్పర్శాప్రపూతాంగియౌ ,
      నగరాట్సానుతలానుషంగ యగు , జాహ్నవ్యాఖ్యయౌ నిర్జరా...
      పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. ఖగరాడ్వాహనమెక్కి శ్రీవిభుడు భక్తశ్రేణికిన్ దర్శనం
      బగురీతిన్ దిరుమాడవీథులకు రానత్యంతవైభోగమౌ !
      నగపంక్తిన్ గల భక్తవాహినిని నానందమ్మునన్ రేయియో
      పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. సుగుణ ములు కలిగి సతతము
    భగ వ ద్ఢ్యాన మున మెలిగి భక్తి యుతుం డై
    ముగుతి ని కోరు చు తా నా
    పగ లో మున్గి న న ఘ ములు భస్మమ్ముల గున్

    రిప్లయితొలగించండి


  4. భగవంతుని నమ్ముచు జను
    లు,"గ చింతనము"ను విడువక లూలామాల
    మ్ము, గజిబిజి విడువ నమరా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్!

    అమరాపగ - గంగ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఖగపతిపై నూరేగుచు
    జగమేలెడు వాడె మనకు శరణమ్మనుచున్
    భగవంతుని కొలిచి సురా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్.

    రిప్లయితొలగించండి

  6. Cause and effect :)



    మగువా! భూరిజమందు కర్మ మన సామర్థ్యమ్ములన్ జేర్చుచున్
    తగురీతిన్ ఫల మున్నొ సంగును సదా దావానలమ్మై ! సఖీ,
    జగడంబుల్ సయి కక్ష లన్ విడువకన్, జాప్యమ్ము లేకన్జనుల్
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మెట్ట వేదాంతం: 😊

    భగభగ కాల్చుచు క్రోధము
    తెగటార్చుచు కామములను త్రెంచుచు గ్రంధుల్
    సెగలిడు తన వాసన లా
    పగ; లో మున్గిన; నఘములు భస్మమ్ము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కశ్చిద్ధీరాః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిఛ్ఛన్"

      తొలగించండి
    2. రాజకీయ రచ్చలిచ్చట వద్దంటే జిలేబి వినలేదు సార్! 🙏

      నగవుల్ మానుచు డింపులయ్య వలె నానారీతులన్ వాగుచున్
      సెగలన్ గక్కుచు నిందలన్ విసిరి కాజేసెన్ ధనమ్మంచుచున్
      తగవుల్ తెచ్చుచు రోజురోజిటను హా! తంటాలతో మోడిపై
      పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్ :)

      తొలగించండి
    3. లో మునక... సరిగ్గా జరిగితే మరి లేవరు...😊 చక్కని వేదాంతం... నమోనమః శ్రీ శాస్త్రి గారూ
      🙏🙏

      తొలగించండి
    4. 🙏

      ప్రస్తుతానికి రోజుకు ఆరు పూరణలకు తక్కువ కాకుండా శంకరాభరణం "లో మున్గిన" వాడనై లేవలేకుండా ఉన్నాను సార్!

      తొలగించండి
    5. ప్రేమనగర్ సినిమా పాట పాడండి... లేచి.. నిలబడి.. పరుగిడగలరు.. నమోనమః
      🙏🙏😊

      తొలగించండి
    6. నవయుగ గిరీశం ఉవాచ:

      పొగచుట్టను మానుమనుచు
      జగడము చేసెడి రమణికి జంకక నెపుడున్
      నగవుచు పుట్టింటికి పం
      పగ; లోమున్గిన; నఘములు భస్మమ్ము లగున్

      తొలగించండి
  8. జగముల్ వర్ధిల జేయు పావనిగ నశ్రాంతమ్ము తా బారుచున్
    గగనమ్మందున సోయగమ్ములను విఖ్యాతమ్ము గా జూపుచున్
    సిగలో జాబిలి యున్నవాని సతియౌ జీవమ్ము తానౌ సురా
    పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  9. Dr.Pitta Saryanarayana
    Bhagavanthuni yaaraadhana
    Kegabadi Sree kaala hasthu lekaagratha kai
    Jagamellanu mechchaga dagu
    Pagaloa munginqa naghamulu bhsmammulagun

    రిప్లయితొలగించండి
  10. పగలున్ రేలు,నిరంతరంబుగ హృదిన్ భవ్యత్కృపా లబ్ధికై
    జగతిన్ రక్షణ జేయు నీశ్వరుని దీక్షన్ గొల్చి ,సంశుద్ధి,చి
    త్త గతులు సూటిగ నిల్పుచున్,వరమతిన్,సాద్గుణ్య మేపార నిం
    పగ,'లో'మునిగిన వాని పాప చయముల్ భస్మమ్ములౌనెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  11. తగు కర్మలాచరించుచు
    నగణితమగు భక్తితోడ యంతర్యామిన్
    నిగరముగ దలచుచు సురా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్!!!

    నిగరము = శ్రేష్ఠము,మిన్న

    రిప్లయితొలగించండి
  12. జగతిని పేదల కాచుచు
    సగ భాగము నిడి సతతము సతితో మను నా
    సెగకంటిఁ దలచి యమరా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్

    రిప్లయితొలగించండి


  13. గగనంబందున మాయా
    నగరంబుగలదు! వెడలగ నచ్చట భళి ని
    మ్నగ గలదు! జిలేబీ యా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. అగణితమగు గణపతులమ
    రగనా హుస్సేనుసాగరమ్మయె నమరా
    పగగా! నీవున్ రేయో
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. పగలను సెగలను బెంచక
    నగవుచు జగతిని జనులను నయముగ దనవా
    రిగ దలచి సుహృద్గంగా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్.

    రిప్లయితొలగించండి
  16. భగవంతుండగునంబుజోదరుని సత్పాదమ్ములన్బుట్టి నే
    రుగనారుద్రుని నెత్తిపైదుమికి కల్లోలమ్ముగాఁబారుచున్
    జగమందిద్ది పవిత్రమైనదని విశ్వాసమ్ముతోనా సురా
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్"*

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి నమస్సులు
    తగు నోము నోచిన పడతి
    కి గంగ పతి వరములు గద దిక్కగు నిలలో
    నిగమాంత చరిత హోమపు
    పగలో మునిగిన భస్మమ్ము లగున్.

    రిప్లయితొలగించండి
  18. చివరి పాదము సమస్య
    పగలో మునిగిన నఘములు భస్మమ్ము లగున్ చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2797
    సమస్య :: పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
    ఎల్లప్పుడూ పగలో మునిగి ఉంటే వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారంగా వామనమూర్తిగా అదితికశ్యపులకుమారుడుగా ఆవిర్భవించాడు. ఒక పాదంతో భూమిని మరొకపాదంతో ఆకాశాన్ని కొలిచి త్రివిక్రముడై విరాజిల్లినాడు. అప్పుడు సత్యలోకం వఱకూ వ్యాపించిన ఆ విష్ణుపాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలములతో భక్తితో కడిగినాడు. ఆ జలధారలు విష్ణుపాదోద్భవ జలధారలై ప్రవహింపగా ఆకాశగంగ ఏర్పడింది. ఆ భాగీరథి ఈ భారతభూమిపై ప్రవహిస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ పుణ్యప్రద యైన ఆ గంగాపగలో మునిగిన వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని గంగాస్నాన ఫలమును గుఱించి విశదీకరించే సందర్భం.

    సుగతిన్ వామనమూర్తి పాదమును విస్ఫూర్తిన్ దివిన్ నిల్ప, దా
    నగుచున్ దానిని భక్తి బ్రహ్మ కడుగంగా, విష్ణుపాదోద్భవం
    బగు నీరమ్మది ధాత్రి దివ్య నదిగా నయ్యెన్ గదా, యా సురా
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-9-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. . సవరణతో
      గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
      సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2797
      సమస్య :: పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
      ఎల్లప్పుడూ పగలో మునిగి ఉంటే వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
      సందర్భం :: శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారంగా వామనమూర్తిగా అదితికశ్యపులకుమారుడుగా ఆవిర్భవించాడు. ఒక పాదంతో భూమిని మరొకపాదంతో ఆకాశాన్ని కొలిచి త్రివిక్రముడై విరాజిల్లినాడు. అప్పుడు సత్యలోకం వఱకూ వ్యాపించిన ఆ విష్ణుపాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలములతో భక్తితో కడిగినాడు. ఆ జలధారలు విష్ణుపాదోద్భవ జలధారలై ప్రవహింపగా ఆకాశగంగ ఏర్పడింది. ఆ భాగీరథి ఈ భారతభూమిపై ప్రవహిస్తూ ఉన్నది. ఎల్లప్పుడూ పుణ్యప్రద యైన ఆ గంగాపగలో మునిగిన వాళ్ల పాపాలన్నీ భస్మమైపోతాయి అని గంగాస్నాన ఫలమును గుఱించి విశదీకరించే సందర్భం.

      సుగతిన్ వామనమూర్తి పాదమును విస్ఫూర్తిన్ దివిన్ నిల్ప, దా
      నగుచున్ దానిని భక్తి బ్రహ్మ కడుగన్, వైకుంఠపాదోద్భవం
      బగు నీరమ్ము వియన్నదీ సరణి నాహా పారె, నా నిర్జరా
      పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్.
      కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-9-2018)

      తొలగించండి
  20. సుగుణయుతుండగుచునుమది
    పగయనునదిలేకయుండిపగలునురేయిన్
    భగునిన్బూజకునుసురా
    పగలోమున్గిననఘములుభస్మమ్ములగున్

    రిప్లయితొలగించండి
  21. అగణితమగు పూజలతో
    వగచుచు చింతింతించుచు నిల వందుఱుటేలా?
    నిగమార్థమునే గ్రహియిం
    పగ ; లోమున్గిన నఘములు భస్మమ్ము లగున్ !
    ****)()(****
    లోమునుగుట = ఆత్మావలోకనము చేసి కొనుట

    రిప్లయితొలగించండి
  22. వగజెందకు రాతిరియని
    దిగులేమియు వలదు నదిని దిగులోతునకున్
    జగమున గంగను రేయో
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్.

    రిప్లయితొలగించండి
  23. అగణితమగు పూజలతో
    వగచుచు చింతించుచు నిల వందుఱుటేలా?
    నిగమార్థమునే గ్రహియిం
    పగ ; లోమున్గిన నఘములు భస్మమ్ము లగున్ !
    ****)()(****
    లోమునుగుట = ఆత్మావలోకనము చేసి కొనుట

    రిప్లయితొలగించండి
  24. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    పగలో మున్గిన వారి పాపచయముల్
    భస్మమ్ములౌ నెప్పుడున్
    ==========================
    ఎవరైనా పగలో మునిగితె వారి పాప
    కార్యముల సమూహములన్నియు
    తొలగిపోవునని ఒక భావము. పాప
    కార్యముల సమూహముల చేతనె పగలు
    సెగలు ఏర్పడి వాటిలోనే వారు భస్మమై
    పోయెదరని మరొక భావము. ఇట్టి రెండు
    భావముల విశేషమే ఇచట సమస్య.
    ============================
    సమస్యా పూరణం- 264
    ==================

    కురుక్షేత్రమది జరిగె నాడు -
    ప్రపంచ యుద్దము ఒరిగె నేడు
    ఎవరికి ఎవరో నీడగ తోడు -
    కూడు గుడ్డలు దొరకవు చూడు
    అధినేతలకై మన ఊపేక్షల్ -
    మనలను పాపుల చేసెడున్
    పగలో మున్గిన వారి పాపచయముల్-
    భస్మమ్ములౌ నెప్పుడున్

    ====##$##====

    క్రీస్తు పూర్వం 3100 లో జరిగిన కురుక్షేత్ర
    యుద్దం సాక్షాత్తు ప్రపంచ యుద్దమే. నాటికి
    ప్రపంచ జనాభా 1,40,00,000 (సుమారు)
    యుద్దంలో చనిపోయినది నాల్గవ వంతు జనం
    అనగ 35,00,000.

    రెండవ ప్రపంచ యుద్దమునకు సంబంధించి
    జపాన్ పై అమెరికా కక్ష గట్టి తేది 6-8-1945
    రోజున హీరోషిమా నగరంపై " Little Boy "
    అనే బాంబు వేయగ చనిపోయినది1,80,000
    తేది 9-8-1845 రోజున నాగసాకి నగరము పై
    "Fat Man"అనే బాంబు వేయగ చనిపోయినది
    80,000 మంది ప్రజలు.

    అగ్ర రాజ్యముల అధినేతలు పగలో మునిగితె
    భస్మమై పోవునది మనమే కదా !!!!

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
    కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    పగలో మున్గిన వారి పాపచయముల్
    భస్మమ్ములౌ నెప్పుడున్
    ==========================
    ఎవరైనా పగలో మునిగితె వారి పాప
    కార్యముల సమూహములన్నియు
    తొలగిపోవునని ఒక భావము. పాప
    కార్యముల సమూహముల చేతనె పగలు
    సెగలు ఏర్పడి వాటిలోనే వారు భస్మమై
    పోయెదరని మరొక భావము. ఇట్టి రెండు
    భావముల విశేషమే ఇచట సమస్య.
    ============================
    సమస్యా పూరణం- 264
    ==================

    కురుక్షేత్రమది జరిగె నాడు -
    ప్రపంచ యుద్దము ఒరిగె నేడు
    ఎవరికి ఎవరో నీడగ తోడు -
    కూడు గుడ్డలు దొరకవు చూడు
    అధినేతలకై మన ఊపేక్షల్ -
    మనలను పాపుల చేసెడున్
    పగలో మున్గిన వారి పాపచయముల్-
    భస్మమ్ములౌ నెప్పుడున్

    ====##$##====

    క్రీస్తు పూర్వం 3100 లో జరిగిన కురుక్షేత్ర
    యుద్దం సాక్షాత్తు ప్రపంచ యుద్దమే. నాటికి
    ప్రపంచ జనాభా 1,40,00,000 (సుమారు)
    యుద్దంలో చనిపోయినది నాల్గవ వంతు జనం
    అనగ 35,00,000.

    రెండవ ప్రపంచ యుద్దమునకు సంబంధించి
    జపాన్ పై అమెరికా కక్ష గట్టి తేది 6-8-1945
    రోజున హీరోషిమా నగరంపై " Little Boy "
    అనే బాంబు వేయగ చనిపోయినది1,80,000
    తేది 9-8-1845 రోజున నాగసాకి నగరము పై
    "Fat Man"అనే బాంబు వేయగ చనిపోయినది
    80,000 మంది ప్రజలు.

    అగ్ర రాజ్యముల అధినేతలు పగలో మునిగితె
    భస్మమై పోవునది మనమే కదా !!!!

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం) ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఇంత పెద్ద కామింటుకు చిరు ప్రయత్నం :)


      అగొ!నాడు కురుక్షేత్రము!
      మొగదీయని నగ్రరాజ్యముల బాంబుల తో
      పగయిగ్గో ! జనులారా
      పగలో మున్గిన నఘములు, భస్మమ్ము లగున్!



      జిలేబి

      తొలగించండి
  25. రెండు సార్లు ప్రచురింపబడింది క్షమించగలరు

    రిప్లయితొలగించండి
  26. వగయేలా? వలదు !వలదు!
    తెగనాడుచు స్వీయ కర్మ తీవ్రత తోడన్
    జగమెఱిగినదిది; యమరా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్

    రిప్లయితొలగించండి
  27. ఎగబడుచు చేసినను 'యా
    పగలో మున్గిన నఘములు భస్మమ్ములగున్'
    తగని పలుకులవి వాటి జ
    విగొనక తప్పదెపుడైన వేరే జగతిన్

    రిప్లయితొలగించండి
  28. మత్తేభవిక్రీడితము
    భగవద్దర్శన మందనీయరని నా ద్వారంబునన్ పాలకుల్,
    రగులన్ శాపమొసంగ మర్త్యులుగ నా బ్రహ్మాతజుల్, విష్ణువే
    తగవున్ దీర్చఁగ మూడుసార్లు నరులై దామోదరున్ జేరరే
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

    ( మూడుసార్లున్ + అరులై = మూడుసార్లు నరులై = మూడుసార్లు శత్రవులై )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపండితులు శ్రీవెలిదండ సత్యనారాయణ గారు దయతో సవరించిన పూరణ

      మత్తేభవిక్రీడితము
      భగవద్దర్శన మందనీయరని నా ద్వారంబునన్ పాలకుల్,
      రగులన్ శాపమొసంగ మర్త్యులుగ నా బ్రహ్మాత్మజుల్, విష్ణువే
      తగవున్ దీర్చఁగ మూడుసారు లరులై దామోదరున్ జేరరే
      పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్



      తొలగించండి
  29. సుగుణుండౌచునుదోటివారలకుసుశ్లోకుండునైదాసురా
    పగలోమున్గినవారిపాపచయముల్ భస్మమ్ములౌనెప్పుడున్
    భగవంతుండునుభక్తులన్ దయనుదావారంగనేజూచుచున్
    బగలున్ రేయినిగావుచుండునిలదాబాధల్నివారించుచున్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. తగు కార్యమ్ములు సల్పుచుఁ
      బగళులు రేయులు శ్రమబడి పన్నుగ భక్తిన్
      భగవద్ధ్యానమునఁ, జనక
      పగలో, మున్గిన నఘములు భస్మమ్ము లగున్


      జగ దాదిస్థిత విష్ణు పాద భవ సచ్ఛైవాలినీ వారినిన్
      సగ రామ్నాయ సహస్ర సంతతి సు నిస్తారప్రదాయీ నదిన్
      రుగనీకద్యుతి భాసమాన నదిలో లోకత్రయై కామరా
      పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

      తొలగించండి
  31. సగరాఖ్యామలచక్రవర్తికులసంజాతుండు ప్రార్థింపఁ దా

    దిగిరా; దుష్కృతహారి, నట్లు వరసాధ్వీస్నానపూతన్, దివా

    పగవారిన్; బహుధర్మశాస్త్రములహో! వాస్తవ్యమంచున్ విధిం

    పగ, లోమున్గినవారిపాపచయముల్, భస్మమ్ములౌ నెప్పుడున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    హోసూరుకు వెళ్లడం, తిరిగి రావడం అంతా బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఒంటి నొప్పులతో, చలితో జ్వరం మొదలైంది.
    డాక్టర్ వచ్చి మందు లిచ్చాడు..
    తరువాత దేవుని దయ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. హోసూరు చలియా మజాకాయా :)

      రెస్టు తీసుకొనండి కంది వారు కుదుట పడే దాక


      జిలేబి

      తొలగించండి
    2. గగనంబందున నుండి జారుచును శ్రీకంఠున్ దలన్ జేరి ప
      న్నగహారుంజడనుండి శ్వేత నగమున్నచ్చోట నుండే భువిన్
      దిగి తా వచ్చె పవిత్ర మౌ జలకమే తీర్థమ్మయెన్నా సురా
      పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

      తొలగించండి
  33. తగదని సప్తవ్యసనము
    అగుపించనియాశలన్ని నాహ్వానించన్
    మృగముల వేటగ దృంచుచు
    పగలోమున్గిన?నఘములుబస్మమ్ములగున్

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    పగలో మున్గినవారి పాపచయముల్
    భస్మమ్ములౌ నెప్పుడున్

    సందర్భము: జిగి సూరీడు అంటే
    కాంతి కలిగిన సూర్యుడు. తలెత్తగా అంటే ఉదయించగా అని అర్థం. కలిమి జేజే అంటే లక్ష్మీదేవి అని అర్థం. నింగి గంగ అంటే ఆకాశగంగ అని అర్థం.
    సూరీడు అంటే సూర్యుడు. ఇది గ్రాంథికం కాదు. అయినా అందమైన పదం కాబట్టి స్వీకరించడానికి సాహసించాను.
    దిగ్గజాలు పవిత్రమైన ఆకాశ గంగా జలాలను నింపిన బంగారు కలశాలను తొండములతో పట్టుకుని వచ్చినవి. లక్ష్మీదేవి శిరస్సు మీదుగా ఆ జలాలను అభిషేకించాలని వాటి తపన. అటువంటి జలాలను కలిగిన దేవ నదిలో (ఆకాశ గంగలో) మునిగితే మన పాపాలన్నీ పోతాయి కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    జిగి సూరీడు తలెత్తగా కలిమి జే
    జే నెత్తిపైనుండి తి
    న్నగ పోయంగ పసిండి బిందియల నిం
    డన్ నింపి తొండాలతో
    దిగిభంబుల్ తగ నింగి గంగ జలముం
    దెచ్చున్ గదా! ఆ సు రా
    పగలో మున్గిన వారి పాప చయముల్
    భస్మమ్ములౌ నెప్పుడున్!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    23.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  35. పగతో రగులుచు మరిమరి
    సగటున పదిమార్లు తిట్టి సంబర పడుచున్
    వగచెడి వారల కెప్పుడు
    పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్

    రిప్లయితొలగించండి
  36. నిగమాగమ వినుతుని పద
    యుగమున ప్రభవించినట్టి పావన చరితన్
    జగతిన పారెడి గంగా
    పగలో మున్గిన నఘములు భస్మము లగున్.

    రిప్లయితొలగించండి
  37. వగలే మిగులును కడపట
    పగలో మున్గిన; నఘములు భస్మమ్ములగున్
    నిగమాంత వాక్యముల నే
    ర్వగ నాత్మవిమర్శ ,విషయ వాంఛలు లేకే!

    రిప్లయితొలగించండి
  38. ఇల్లరికం అల్లుడువాచ:👇

    పగలున్ రాతిరి మున్గరాదనుచుచున్ పాకెట్టు సెల్ఫోనులో
    తగవుల్ పెట్టుచు రోజురోజు విధిగా త్రాగొద్దటంచున్ తమిన్
    సిగరెట్టుల్ పలు పీల్చరాదనుచు భల్ ఛీగొట్టు నత్తయ్యపై
    పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్

    రిప్లయితొలగించండి