30, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2804 (ప్రకృతి వినాశమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్"
(లేదా...)
"ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్"

51 కామెంట్‌లు:

  1. చకచక నోట్లను పంచుచు
    పకపక నవ్వుచును వోట్లు పండించెడి యా
    వికటపు నేతల దుష్టపు
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      సుకృతకృతంబులన్ మది వసుంధర మెచ్చును , శాంతి గూర్చు , ధూ...
      ర్తకృతదురంతముల్ గని ముదంబును బొందదు , దాననేర్పడున్
      ప్రకృతిని భూప్రకంపనలవాంఛితవృష్టులు ! గాన నింద్యమౌ
      బ్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్

      ప్రకృతి = స్వభావము

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  3. అకటా తప్పు జిలేబీ
    ప్రకృతి వినాశనమె, మిగులఁ బావనము భువిన్,
    వికటించెడు ప్రకృతిని జను
    లు కట్టి కావంగ పో పలువిధమ్ములుగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అకటా! దోమలు నల్లులు
      వికటించెడి కందిరీగ విరివిగనీగల్...
      లుకలుక బొద్దెంకలటుల
      ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్ 😊

      తొలగించండి
  4. శ్రీ గురుభ్యోనమః.
    ప్రాసాక్షరం కృ - దానికి బదులు క- వాడవచ్చా ?
    కొంచెం వివరించ ప్రార్ధధన.

    రిప్లయితొలగించండి
  5. వికలము నందిన మనమున
    సకలము విడువగ దలచుచు చచ్చెడి యూహన్
    చకిత నిరీహ నిరాశా
    ప్రకృతి వినాశనమె మిగుల బావనము భువిన్ .వికలము నందిన మనమున
    సకలము విడువగ దలచుచు చచ్చెడి యూహన్
    చకిత నిరీహ నిరాశా
    ప్రకృతి వినాశనమె మిగుల బావనము భువిన్ .

    రిప్లయితొలగించండి
  6. వికృతపు పాలన మందున
    సుకృతుడే కూరుకొని పోవు శోకము నందున్
    వికటపు చేస్టలె మూలము
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్

    రిప్లయితొలగించండి

  7. వృక్షో రక్షతి రక్షితః


    నికరము గా జగద్వహయు నీల్గును పర్యవసానమెద్ది? యా
    ప్రకృతి వినాశనంబె! కడు పావన కార్యము ధాత్రిలోపలన్
    దకమును రక్ష చేయ మన ధాత్రిని ప్రోచుకొనంగనెల్లరున్
    చకచక మేలు కోరుచు కుజమ్ముల గావ ప్రయత్నమున్ గనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. అకృతము జగమున జనులకు
    ప్రకృతి వినాశనమె; మిగుల పావనము భువిన్
    ప్రకృతియె ; జీవము గావున
    ప్రకృతిని గాచుట ముఖ్యము భారత వాసీ !

    రిప్లయితొలగించండి
  9. డా పిట్టాసత్యనారాయణ
    వికృతియె ప్రకృతిని జేరిన(స్వభావమునజేరినచో)
    సుకృతము శూన్యంబు దాన శోభయు కరువౌ
    ప్రకృతియె బాహ్యపు నటనవ
    ప్రకృతి వినాశనమె మిగుల బావనము భువిన్

    రిప్లయితొలగించండి
  10. వికృతపు చేష్టల ఫలితము
    ప్రకృతి వినాశనమె;మిగుల బావనము భువిన్
    యకృతముల బరిహరించుచు
    సుకృతములే చేయదలచు శూరులు గల్గెన్

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2804
    సమస్య :: ప్రకృతి వినాశనమ్మె కడు పావన కార్యము ధాత్రిలోపలన్.
    ఈ భూమి మీద ఉన్న ప్రకృతిని నశింపజేస్తే అది పవిత్రమైన కార్యం ఔతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    ప్రహ్లాదుడు ఓ తండ్రీ! శరీరధారు లందఱూ ఇల్లు అనే చీకటి బావిలో త్రెళ్లకుండా వీరు వేరే మేము వేరే అని మతిభ్రమణంతో భిన్నులుగా ప్రవర్తించకుండా అంతా ఆ విష్ణుకళామయమని అనుకొంటూ జీవించాలి. ఇదియే భద్రమును కలిగిస్తుంది అని హితోపదేశం చేస్తూ ఉండగా హిరణ్యకశిపుడు “ఓ ప్రహ్లాద కుమారా! నీవు చెప్పేది సరికాదు. మనము సురులను తరిమివేయాలి. దిక్పాలకులను బాధపెట్టాలి. పాపం పుణ్యం అని అనుకోకుండా యక్షులు మొదలైన సాధువులయొక్క వినాశనమును సిద్ధింపజేయడమే మన రాక్షస కులమునకు ప్రకృతి సిద్ధమైన ధర్మము. మనకు శత్రువులైన అమరుల వినాశనమే మనకు పావన కార్యము అని నచ్చజెప్పే సందర్భం.

    “సుకృతము విష్ణుకీర్తనము, చూడకు భేదము, తండ్రి!” యన్న “నీ
    మొక” మని, పల్కె హేమకశిపుం డిటు “బాలక ! దేవతాళికిన్
    సుకము తొలంగ జేయవలె, స్రుక్కగ జేయవలెన్ సురాళి, నెం
    చకు మది పాపపుణ్యముల, సాధు వినాశన మస్మదీయమౌ
    ప్రకృతి; వినాశనమ్మె కడు పావన కార్యము ధాత్రిలోపలన్.”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-9-2018)

    రిప్లయితొలగించండి
  12. డా పిట్టాసత్యనారాయణ
    ప్రకృతియె పచ్చ పచ్చురిక భావమె పో పగయన్న దానితో
    వికృతియ తారసిల్లు నిక వ్రేల్చగ నుండవు సఖ్యతల్ సుమా!
    సుకృతము గోర మానవుల చూడ్కులు మారవలెన్ జగాన దు
    ష్పకృతి వినాశనంబె కడు పావనకార్యము ధాత్రి లోపలన్
    (వాడు నాపై పచ్చురికం(పగ)బట్టినాడన్న ప్రయోగం తెలంగాణలో కలదు)

    రిప్లయితొలగించండి
  13. షపర లను నా కీ బోర్డులో వేయలేకపోయినాను…ష్ప్ర..ఇప్డుడు వచ్చినది…సవరించ గలరు

    రిప్లయితొలగించండి
  14. సకలము నాకే రావలె
    తికమక లేదిందులోన-ధీరుడనౌ న
    న్నిక నెవ్వరాపలేరను
    ప్రకృతి వినాశనమె మిగులఁబావనము భువిన్

    రిప్లయితొలగించండి
  15. వికృత పు చేష్టలు జేయుచు
    స కిలిం చు చు యువత సల్పు సైగ ల నెల్ల న్
    పెకలించ బూని దురిత పు
    ప్రకృతి వినాశ న మె మిగుల బావన ము భువి న్

    రిప్లయితొలగించండి
  16. వికృతపు యాలోచన గల
    నికృష్టుల యకృతకములవి నిత్యము పెరుగన్
    సుకృత మదెట్లగు? ఖలుజన
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్.

    రిప్లయితొలగించండి
  17. ఒకటిగ పూనికన్ గొనుచు నుర్విని మానవులెల్లరున్ వినా
    శకరపు పాలిథీనులకు స్వస్తియనన్ ప్రతిచోటఁ జేయ న
    ప్రకటిత యుద్ధమద్దియె నివారణఁజేయు ప్రమాదకారియౌ
    ప్రకృతి వినాశనంబె - కడు పావన కార్యము ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి
  18. వికటపు నాగ రీకమున వేయివిధమ్ము లవెఱ్ఱి చేష్టలున్
    సకలము గంగ లోనఘన సారమువోలె విలీన మైనిలన్
    వికటుని వంటి పాలకులు వేలకు వేలుగ దొంగ లుండగన్
    ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రి లోపలన్

    రిప్లయితొలగించండి
  19. సకలము నాకేకావలె
    నొకరైనను బాగుపడుట కొప్పను పరులే
    నికపై ననియెడి స్వార్థ
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్.

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. ప్రకృతిని శక్తిగా దలచి ప్రార్థన సల్పిరి తొల్లిటన్, దదీ

      యకృపను గోరి, చూవె! యధునాతనమందు వరప్రదాయినిన్,

      వికృతను జేసి, హింసల ప్రవృత్తికిఁ బాల్పడగన్ క్షణాప్తికై,

      ప్రకృతివినాశనంబె కడు పావనకార్యము ధాత్రిలోపలన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  21. సకలమును తుడిచి బెట్టును
    ప్రకృతి వినాశనమె, మిగుల బావనము భువిన్
    నికరముగ బెంచ చెట్లను
    సుకృతము లొనగూర్చి ప్రజకు సుస్థమొసంగున్!!!

    రిప్లయితొలగించండి
  22. కం.
    సకలము కలుషితమయ్యెను
    ప్రకృతి విపత్తులును వచ్చె ప్రాణాల్దీయన్
    వికటాయా! తొలగించుము
    ప్రకృతివినాశనమె , బావనము భువిన్

    రిప్లయితొలగించండి


  23. మకుటాయమానముగ తా
    ను కనులకగుపించు త్రవ్వి నూతిని గానన్
    మకరత మగుపడు! వెలుపలి
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. వికలము చేయును జీవుల ప్రకృతి వినాశనము, మిగుల భావనము భువిన్ సకల ప్రపంచము గావగ నకలంకపు మదిని ప్రకృతి యారాధనమే

    రిప్లయితొలగించండి
  25. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    ప్రకృతి వినాశనంబె కడు
    పావన కార్యము ధాత్రి లోపలన్
    ======================
    ప్రకృతిని నాశనము చేయడమే అన్ని
    పనులలోకి పవిత్రమైన పని ఈ భూమి
    పైన యని చెప్పటంలో అసంబద్దతె సమస్య
    =============================
    సమస్యా పూరణం - 270
    ===================

    సీ.యఫ్.సీ.ల నదిగో వారొదిలిరి -
    ఓజోనుకు తూట్లుగ మెదిలిరి
    అడవుల నరికివేతకు ఇదె కదిలిరి -
    భూతాపమై పొదిలిరి
    ఏదేమైన గాని ప్రగతిని -
    కాంచగవలెనను దుష్ట తలంపునన్
    ప్రకృతి వినాశనంబె కడు -
    పావన కార్యము ధాత్రి లోపలన్

    ====##$##====

    (సీ.యఫ్. సీ. = క్లోరో ఫ్లూరో కార్బనులు)
    ( ఓజోను = భూమికి గల రక్షక పొర)
    (పొదిలిరి = వృద్ది చెందిరి)
    ( ధాత్రి = భూమి)

    ====##$##====

    Refrigerants,Fire supression systems
    Air Crafts, Aerosols మాధ్యమముగా
    సహజనిత క్లోరో ఫ్లూరో కార్బనులను విచ్చల
    విడిగా వాతావరణంలోకి ఒదిలి ఓజోను
    పొరను ధ్వంసము చేస్తున్నాము.

    అడవుల నరికివేత-- పర్యావరణ కాలుష్యం--
    హరిత గృహ ప్రభావం(Green House Effect)
    --- భూమి వేడెక్కడం( Global Warming)------
    జల ప్రళయం.

    పారిశ్రామిక విప్లవం కాలం నాటికి ప్రాచుర్యంలో
    ఉన్న "ఏది ఏమైనా అభివృద్ది(Growth at any
    Cost) నినాదమును పక్కన బెట్టి "నిలకడ గల
    అభివృద్ధి(Sustainable Growth)నినాదంతో
    ముందుకెళితేనే నాలుగు రోజుల పాటు మనము
    ఈ భూమి పై బ్రతకగలము.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  26. వికృతపుబనులంజేసిన
    ప్రకృతివినాశనమె,మిగులబావనముభువిన్
    సుకృతములుసేయుచుండియు
    నకృత్యములన్జేయకునికియవసరమైనన్

    రిప్లయితొలగించండి
  27. వికలమయిన చిత్తముతో
    వికాసమునె యడ్డు దొరల వికృతపు చేష్టల్,
    సకలము వారల యపకృత
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్
    ****}{}{****
    ప్రకృతి = స్వభావము.

    రిప్లయితొలగించండి
  28. నికృతపు బుద్ధుల స్వార్థపు
    టకృత్యములకాగ్రహించి యావేశముగా,
    వికృతపు రూపము దాల్చెడి
    ప్రకృతివి, నాశనమె మిగులఁ బావనము భువిన్..��

    రిప్లయితొలగించండి
  29. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్
    కంద పాదము దానిని సీసములోనికి మార్చి నా పూరణము

    నరలోకములో జనులు చాలా ఘోరములు చేయు చున్నారు , తల్లి తండ్రులను ముసలి తనములో సరిగ్గా చూడక వారిని చంపుతున్నారు . వావి వరుసలు మరచి మగవారు పరస్త్రీల సాంగత్యము కోరుచున్నారు ఘోరములు చాల జరుగు తున్నవి ప్రకృతిని నశింప చేయడము భావ్యము. . నాడు సృష్టిని నాశనము చేయ మత్స్యావతారమెత్తి జగము కాపాడినావు . శ్రీహరి నిద్ర లెమ్ము అనుచు శేష శయనము పై పడుకొన్న శ్రీహరిని బ్రహ్మ వేడుకొనుచుండె నను భావన

    సీసము
    ఖలముపైన జనులు ఖలము లెన్నియో జరుపుచుండె జననీ జనకులు పొది
    యనుచు తలచి బలి గొనుచుండె కొందరు, వావి వరుసలన్ని వట్టి విననుచు
    పర వనితల పొందు పసపడు చుండె గా నింకొందరు, తలచ నిక్క మిదియె
    నరహరీ ప్రకృతి వినాశనమె మిగులఁబావనము భువిన్, శుభాంగ, నాడు

    నాదు సృష్టిని మొత్తము నాశనమ్ము
    చేయ మత్స్య రూపుండవై సాయమునిడి
    నావు, నారాయణా ! లెమ్ము నరుల కాచు
    మనుచు వేడె పద్మభవుడు మధురిపువును

    రిప్లయితొలగించండి
  30. వికృతపుచేష్టలన్జనినవేయివిధంబులుగానగున్సుమా
    ప్రకృతివినాశనంబె,కడుపావనకార్యముధాత్రిలోపలన్
    సుకృతంబులేగడుంగడుగసొంపుగజేయుటనెల్లవారికిన్
    బ్రకృతియనంగనేర్వుమికపార్వతిదేవిగభూతలంబునన్

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. వికసిత ఘన కాంతార
      ప్రకరము లభివృద్ధి సేయ వలయు మనుటకున్,
      సక లాటవీ క్షయ క్షి
      ప్ర కృతి వినాశనమె, మిగులఁ బావనము భువిన్

      [మిగులన్ = మిగులుటకు; పావనము = జలము]


      సుకరము కాదు మార్చ మధుసూదనుఁ డెంచిన నైన మూర్ఖునిం
      బ్రకటిత మైనఁ జేయవలెఁ బన్నుగ యత్నము మానవాళికిన్
      వికలిత ధీ దయాది గుణ భీకర మర్త్య మనస్థ కుత్సిత
      ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్

      [ప్రకృతి = స్వభావము]

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చకచక నోట్ల పంపకము, చల్లని కల్లున బొజ్జ నింపుటన్,
    పకపక నవ్వులాడుచును పంచుట స్వప్నపు సౌధరాజముల్,
    వికటపు చేష్ట లన్నియును, వింతలు భారత దేశమందు నీ
    ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్ :)

    రిప్లయితొలగించండి
  33. వికృతినినమ్మకు మనసున
    ప్రకృతియె పరమాత్ముడనుచు భావనచేతన్
    సుకృతినిమార్చెడిదౌ "విష
    ప్రకృతి వినాశనమెమిగులభావనము భువిన్"

    రిప్లయితొలగించండి
  34. సకలహితేషణప్రచురసత్వగుణాన్వితవర్తనమ్మునన్

    బ్రకటపరోపకారవరభావనసంగతసుప్రవృత్తితోఁ

    సుకృతమునొందుఁ గాక, మతిచోదితనిందితహేయదుర్మనః

    ప్రకృతివినాశనంబె కడు పావనకార్యము ధాత్రిలోపలన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  35. సుకృతవశంబునం గరుణజూపుచు నల్వయె జీవరాశికిం, బ్రకృతి మహోదయంబిడగ బ్రాకృతచర్యల వాని ద్రుంచుటల్, ప్రకృతి వినాశనంబె - కడుపావన కార్యము ధాత్రిలోపల, న్నకృతము లాచరింపమియె హర్షముగూర్చు జగద్ధితంబులౌ. .
    p.సూర్యనారాయణ

    రిప్లయితొలగించండి
  36. సకలహితేషణప్రచురసత్వగుణాన్వితవర్తనమ్మునన్

    బ్రకటపరోపకారవరభావనసంగతసుప్రవృత్తితోఁ

    సుకృతమునొందుఁ గాక, మతిచోదితనిందితహేయదోష దీ

    ప్ర కృతివినాశనంబె కడు పావనకార్యము ధాత్రిలోపలన్.
    ( హేయదోష దీప్ర కృతి అసహ్యమై దోషముతో వెలుగు కార్యములు )
    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  37. వికృతములైన కాంక్షలవి విజ్ఞతఁ జంపగ జ్ఞానహీనుడై
    వికటపు కృత్యముల్ సలిపి వృక్షములన్ నరికించు చుండుటే
    ప్రకృతి వినాశనమ్మె, కడు పావన కార్యము ధాత్రిలోపలన్
    సుకృతమటంచు మొక్కలను జోరుగ నాటుచు రక్షసేయుటే.

    రిప్లయితొలగించండి
  38. సవరించిన పద్యం

    వికృతపు టాలోచన గల
    నికృష్టుల యకృత్యములవి నిత్యము పెరుగన్
    సుకృత మదెట్లగు? ఖలుజన
    ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్.

    రిప్లయితొలగించండి


  39. వికృతంబగు చేష్టలచే
    ప్రకృతి వినాశనమె ,మిగుల పావనము భువిన్
    ప్రకృతిని కాపాడుచు ప్రజ
    లకృత్యము లొనర్చకుండ నహరహమున్నన్.

    రిప్లయితొలగించండి
  40. వికృతపు ఫర్టిలైజరులు వీలుగ పంటల నాక్రమించగా
    ప్రకృతపు బొమ్మలన్నిటిని ప్లాస్టరు పేరిసు పూడ్చివేయగా
    సకలపు సంచులన్నిటిని శాపపు ప్లాస్టికు త్రోసివేయగా
    ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి