1, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2805 (అంబలితో సమంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ"
(లేదా...)
"అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్"

58 కామెంట్‌లు:

 1. చలి జ్వరము తోడ వారము పలుకు లేక
  మంచి నీరము తోడనె మాత్రలిడగ
  కంబళిని త్రోసి యాకలి కడుపు నింప...
  నంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ!

  రిప్లయితొలగించండి 2. జ్వరము పడి లేచితి జిలేబి జాంగ్రిలేల
  అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
  నోటికంత ఘాటగు చారు నూక జేర్చు
  జావ యేను దప్పిక దీర్చు జల్దిగాన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జల్ది' అన్న అన్యదేశ్యం ఎందుకు? "దప్పిక దీర్చు సత్వరమున" అనవచ్చు కదా?

   తొలగించండి


  2. కుశలమేనా కంది వారు?

   ఆరోగ్యము జాగ్రత్త


   జిలేబి

   తొలగించండి
 3. తైలము గల పదార్ధముల్ తిప్పు చుండు
  కడుపు లోన ,చల్లని వన్ని కష్ట బెట్టు
  నుదరమును, గ్రీష్మ ఋతువులో నుదయమందు
  అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ

  రిప్లయితొలగించండి
 4. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  అంబలికి సమం బగునె
  భక్ష్యములు దినఁగ

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఎండలోన దిరిగి శ్రమియించునట్టి
  కష్టజీవికి హాయిని గలుగజేసి
  చల్లదనమును జేకూర్పజాలినట్టి
  యంబలికి సమం బగునె
  భక్ష్యములు దినఁగ

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  1.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 5. గ్రీష్మకాలము నడుమన గేహమందు
  నున్న దేహమునకు హాయి సున్నయగును ;
  నాకటికి దప్పికకు గుందు నట్టి జనుల
  కంబలికి సమం బగునె భక్ష్యములు దినగ ?

  రిప్లయితొలగించండి
 6. తీవ్రమైనట్టి జ్వరముతోఁ దిప్పలుపడు
  నాకు స్వస్థతఁ జేకూర్చునా మఱి యొకటి?
  యంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ?
  కాని చేసి యిచ్చెడివారు కానరారు.
  (నేనున్న వృద్ధాశ్రమంలో మనం కోరుకున్నవి చేసిపెట్టే సౌకర్యం లేదు)

  రిప్లయితొలగించండి
 7. కోడి కూరను దినినంత కూర్మి గాను
  అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
  వేడి పకోడి బజ్జీలు వేడు కంట
  ఫిష్షు కబాబు చికెనులు ఫేష నంట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగున్నది. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. కోడికూర, భక్ష్యాలు, పకోడి మొదలైనవి అంబలికి సమానంఆ కావు. దానికంటే గొప్పవి అని మీ భావమా? ప్రారంభంలో కోడికూర అన్నాక చివర చికెను ఎందుకు?

   తొలగించండి
  2. హమ్మయ్య సోదరులు బ్లాగులోకి వచ్చారు సంతోషం. ఇంక మళ్ళీ ప్రయాణాలు చెయ్యకండి . మా అందరికీ ఎంత ఇబ్బందీ ??????????????????????
   కోడి కూర వేరు చికెను వేరు అనుకున్నాను. మనకి ఆ వాసన్లుకుడా కుడా తెలియవుగా . అదన్నమాట అసల్ సంగతి

   తొలగించండి


 8. జంబపు మాట కాదు మన జాతి సజావుగ నెక్కొనంగ యా
  జంబల మే కదా రసము జాస్తిగ జేర్చెను జీవగర్రగా
  తంబి!జిలేబి జాంగ్రియు యితమ్ములు మేలును చేయవయ్య! నీ
  యంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. పలురకాల రోగాలిల పరిఢవిల్ల
  నుప్పుకారమ్ము తీపులే ముప్పు దెచ్చు
  నాయు రారోగ్యములబెంచు నవని రాగి
  యంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2805
  సమస్య :: అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్.
  పంచభక్ష్యాలు రుచిలో అంబలితో సమానం కావు గదా అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము పానీయము అనే ఐదింటిని పంచభక్ష్యాలు అని అంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి అనే విషయం మన కందఱికీ తెలిసిందే కదండీ. ఐతే అంబలి అనేది ఇంకా చాలా రుచిగా ఉంటుంది. పిండి నూకలు చేర్చి వండిన పదార్థాన్ని అంబలి అంటారు. ఇది ఎంత కమ్మగా ఉంటుందో వర్ణించి చెప్పలేము. ఒక వ్యక్తి చాలా కాలం తరువాత అంబలి రుచి చూచి తన తల్లితో “అమ్మా! ఈ అంబలి వలన చాలా లాభాలు ఉన్నాయి. గతకాలంలో ఈ అంబలియే అందఱికీ సంపూర్ణాహారంగా ఉండేది కదా. పంచభక్ష్యాల రుచికంటే అంబలి రుచియే చాలా గొప్పగా ఉంది అని విశదీకరించే సందర్భం.

  అంబలి యన్న వంటకము నందున రాగులు నూకలుండు, శ్రే
  యం బగు దీని దిన్న, బల మబ్బును, పుష్టియు తుష్టి గల్గు నో
  యంబ! గతమ్ము నందు నిదె యందఱి భోజన మౌచు నుండె నీ
  యంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అద్భుతమండీ రాజశేఖర వారు


   అంబరమంటు కోట కవనంబున కెట్లొలయించె తియ్యనో
   నంబయు నంబలిన్ బలిమి యబ్బుర మై‌ యొన గూడగా గదా!


   జిలేబి

   తొలగించండి
  2. సంబర మొందుచున్ కులికి ఝమ్మని పెన్నయు పొంగిపొర్లగా
   తుంబురు నారదుల్ మురిసి త్రుళ్ళుచు నొల్లరె రాజశేఖరున్!

   తొలగించండి
 11. రోగములు మాన్పి స్వస్థత రూఢి నొసగు
  అంబలి కి సమం బగు నె ;భక్ష్యములు దిన గ
  పెరుగు మధు మే హ రోగం బు పేర్మిగాను
  వైద్యుల సలహా పాటింప వలయు నెపుడు

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ
  సైరంధ్రి.... కీచకుడు...

  కంబలి వంటిదౌ ముతక కాదె ధరించిన బట్ట , నాదు వే...
  సంబిది పంకిలమ్ము , పరిచారిక నాపయి మోహమేల ? దో...
  సంబనఁ., కోమలాంగి ! మనసైనది తృప్తినొసంగు ., పేదకా
  యంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిరుసవరణ..

   శ్రీ సూరం వారికి నమస్సులతో....

   సైరంధ్రి.... కీచకుడు...

   కంబలి వంటిదౌ ముతక కాదె ధరించిన బట్ట , నాదు వే...
   సంబిది పంకిలమ్ము , పరిచారికనే ! మరి మోహమేల ? దో...
   సంబనఁ., కోమలాంగి ! మనసైనది తృప్తినొసంగు ., పేదకా
   యంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  2. వామ్మో!

   అంబలికి యాజ్ఞసేనికి లంకె పెట్టడం మైలవరపు వారికే చెల్లు !

   ఏ సమస్యా పాదానికైనా కీచకుడిని లాక్కుని రా గల సమర్థులు !

   ( పూర్వాశ్రమంలో విరటుని కొల్వులో కవీశ్వరులై వుండే వారేమో జె.కె :))


   అద్భుతః

   జిలేబి

   తొలగించండి
  3. ఏమో.... శ్రీమతి జిలేబీ గారికి వందనములు 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  4. శ్రీ కంది శంకరయ్య గారికి వందనములు.. వారు త్వరగా కోలుకొనవలెనని అభిలషిస్తూ.....

   అంబులఁగోరుచుండెఁదడి యారిన నాలుక , చిత్తమేమొ ప...
   ద్యంబులపై సమీక్షకయి యర్రులు సాచుచునుండెఁ దా ద్వితీ...
   యంబునకోటు వేసిరి గదా గురువర్యులు ., పూరణాఖ్యమౌ
   అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 13. అంబరమంటె సంబరములక్కున నెచ్చెలి వచ్చి చేర నా
  కంబళి లోన దూరి బిగికౌగిటఁ జేర్చుకు శీతకమ్మునన్
  చుంబనఁజేసి ప్రీతిఁ దన సుందర హస్తముతోడ నిచ్చెనీ
  యంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👌🏻👌🏻👏🏻👏🏻

   మీ అద్భుతమైన సంభాషణలతో ఉమాని వశపరచుకోవడంలో సహకరించిన మీకు ధన్యవాదాలు
   🙏🏻🙏🏻💐

   తొలగించండి

  2. విట్టు బాబు గారు

   ఈ ఉత్పలమ్ము తరువాయీ మీ కాడ గాలి తగులకుంటే జీవితమే వేష్టున్నర వేష్టు

   వెంఠనే భాజా భజంత్రీలు సన్నాయి మేళాలకు సంసిద్ధులై పోయి ఆహ్వాన పత్రిక పంపించే యండి‌ :)


   జిలేబి

   తొలగించండి
 14. పేదసాదలు ' రేషను'బియ్యమునకు
  చొక్కి,కడుపార భుజియించి,మ్రొక్కు లిడుదు
  రంబలికి;-సమంబౌనె భక్ష్యములుఁదినగ
  నట్టి సౌభాగ్య,సంతోష మందుకొనగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నట్టి సమధిక సౌభాగ్య మందుకొనగ
   అని చివరి పాదం చదువ ప్రార్థన

   తొలగించండి
 15. జ్వరముతో నున్న వేళను సారము గల
  తేలికగ నరుగు ద్రవపు తిండి మేలు
  శ్రమను దగ్గించి నుదరమున్ శాంతి గూర్చు
  *"అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ"*

  శ్రమను తగ్గించి అనియే నా భావన కానీ...శ్రమతో దగ్గించి అని మాత్రము కాదని సవినయముగా మనవి చేసుకుంటున్నాను.
  😃🙏🏻

  చంద్రమౌళి సూర్యనారాయణ గారి ప్రేరణతో
  ఊహలే సుమా....మళ్ళీ నాకు ఆడగాలి సోకిందనుకునేరు..
  🙊🙊🙊

  కంబళి లోన దూరి సతి కాటుక లంటిన కౌగిలింతలన్
  చుంబన మిచ్చి కూరిమిన చోదన జేయగ, తీవ్ర తాపమున్
  పంబయె రేగదా! మనకు పాడియె చెప్పగ నచ్చకుండినన్
  *"అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. విట్టు బాబు గారు

   ఈ ఉత్పలమ్ము తరువాయీ మీ కాడ గాలి తగులకుంటే జీవితమే వేష్టున్నర వేష్టు

   వెంఠనే భాజా భజంత్రీలు సన్నాయి మేళాలకు సంసిద్ధులై పోయి ఆహ్వాన పత్రిక పంపించే యండి‌ :)


   జిలేబి

   తొలగించండి
 16. అంబలికిసమంబగునెభక్ష్యములుదినగ
  భక్ష్యములుసరిరావుగబరమపురుష!
  రాగియంబలికేదియుజగమునందు
  పుష్టినిచ్చునునొడలికిపూర్తిగాను

  రిప్లయితొలగించండి
 17. పుష్టి గలిగించు వైద్యుల దృష్టి లోన
  రుచి యమోఘమౌ జవి చూడ వచనమేల?
  రాగి యంబలి యనినంత రసన కింపె
  యంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ

  రిప్లయితొలగించండి
 18. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  అంబలితో సమంబు లగునా
  చవి జూచిన బంచ భక్ష్యముల్
  ======================
  రుచి చూడగ అంబలితో సమానం
  ఏ పంచ భక్ష్యమును ఉండబోదని
  చెప్పటంలో విశేషమే సమస్య
  =======================
  సమస్యా పూరణం - 271
  ==================

  షాపింగు మాలున మాల్టుగ-
  అద్దముల పెట్టి అమ్మిరనగ
  పూరి గుడిసె మట్టి దుత్తగ-
  శక్తినిడి కడుపు నింపుననగ
  తైదలతో ఇతరము తూగునా-
  పిండిగా తీరు లక్ష్యముల్
  అంబలితో సమంబు లగునా-
  చవి జూచిన బంచ భక్ష్యముల్

  ====##$##====

  మనుషులు తినే ఆహార పదార్థములను
  క్రింది ఐదు విధములుగా వర్గీకరించవచ్చును.

  1. భక్ష్యము:- నమిలి తినుననవి
  2. భోజ్యము:- చప్పరించి తినునవి
  3. చోష్యము:- జుర్రుకుని తినునవి
  4. లేహ్యము:- నాకుచు తినుననవి
  5. పానీయము:- త్రాగునవి

  ( మాత్రా గణనము- అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 19. అంబలితోసమంబులగునాచవిజూచినబంచభక్ష్యముల్
  నంబలితోసమంబులగునాయవియేవియులేవుగాభువిన్
  నంబలిపుష్టినిన్బలమునాయువుబెంచునునెల్లవారికిన్
  నంబలిసాటిరావుబరమాన్నములేవియుభోజ్యవస్తువుల్

  రిప్లయితొలగించండి
 20. కలిమి లేమిని జనులకు సులువుగాను
  చలువ జేయుచు నోటికి చవిని గూర్చి
  బలము నీయును త్రాగిన పలుచనైన
  యంబలికి సమంబగునె భక్ష్యములు దినగ!!!

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. మాదు వంటకములఁ బోల్చ నీ దినమున
   నంగడి కరిగి తెచ్చిన నకట చెప్ప
   వేల ధైర్యముగ ననృత మేల వెక్క
   సం బలికి, సమం బగునె భక్ష్యములు దినఁగ

   [వెక్కసంబు + అలికి = వెక్కసం బలికి; అలుకు = భయపడు]


   కంబుక మెత్తి చూచినను గన్పడ నేర్చునె పట్టణమ్ములో
   నంబ కరంపు వంటకము లద్భుత రీతినిఁ జేయ వీటినిన్
   సంబరముల్ సెలంగ సరసమ్ముగఁ జూచెదు గాక పోల్చినం
   తం బలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్

   [పోల్చినంతన్ + పలి = పోల్చినంతం బలి; పలి = పల్లె]

   తొలగించండి
 22. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  జంబము జూపుచున్ మగడు చల్లని నీటిని స్నానమొల్లగా
  తొంబలు దోమలున్ పెరికి తొమ్మిది రోజులు మూల్గుచుండగా
  కంబళి ద్రోసి పుచ్చుచును కంఠపు శోషను తీర్ప హాయిగా
  నంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్

  రిప్లయితొలగించండి
 23. గుంభన మందహాసమది కోమలి యానన మందు గాంచగా
  నంబర మంటె నూహలె విహంగము లై గగనమ్ము దాకెనే
  సంబర మందు గ్రోలితిని చక్కని చుక్కయె యిచ్చినట్టియా
  యంబలి తో సమంబులగునా, చవిఁ జూచినఁ బంచ భక్ష్యముల్.

  రిప్లయితొలగించండి
 24. ఆకలెక్కగ యేరుచిసాకదపుడు
  అంబలికిసమంబగునె! భక్ష్యములుదినగ?
  నొక్కపూటకు కండలుదక్కవెపుడు!
  బీదసాదకు నంబలే మోదమొసగు!

  రిప్లయితొలగించండి
 25. పెళ్లి లో వంటల వీథి పెట్టి వచ్చిన వారికి కావలసిన వంటకాలు వడ్డించేది గతంలో ఎప్పుడూ చూడని పల్లెటూరి రైతు అంతరంగం :

  ఉత్పలమాల
  రంభను దెచ్చి రంట మహరాజులు కోడలిగా కుమారుడున్
  సంబర మంద, సందడిగ చక్కని వంటల వీథిఁ దీర్చిరే
  దంబము జూపగన్, దినగఁ దన్వియు దీరదు నోటికేదియున్
  యంబలితో సమంబలగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్

  రిప్లయితొలగించండి
 26. బింబము చంద్రబింబమన భీకర పర్వత శ్రేణి గుబ్బలై
  డంబము చే నితంబము విడంబము వీడుచు నూయలూగగన్
  తంబుర నాదమై గళము తంత్రులు మీటుచు తేనెలొల్క *నో*
  *ష్ట్యాంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 27. ఎండ లందున మాడుచు నెగసి పడెడి
  వేడి గాలుల నలయుచు వాడి పోయి
  కూడి గట్టున నాచెట్టు నీడ జొన్న
  యంబలికి సమంబగునె భక్ష్యములు దినగ!

  రిప్లయితొలగించండి
 28. రంభను సరిపోలు సఖి సరాగమాడ పిలిచి రాతిరి వేళలో ప్రేమతోడ నింపుగ కరకమలమున నిచ్చి నట్టి యంబలికి సమంబగునె భక్ష్యములు దినగ

  రిప్లయితొలగించండి
 29. పుష్టి కలుగజేయు నెపుడు పుడమి యందు
  రుజలు తొలగంగ చేయుచు రుచిని కూర్చు
  నంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ
  కాదు కాదటండ్రు బుధులు ఘనముగాను.

  2.పాల తోడ చేర్చుచు త్రావంగ సతము
  సత్తువదియు కలుగును జవము గాను
  చల్ల తోడుగ త్రాగిన చలువ కూర్చు
  నంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ..

  రిప్లయితొలగించండి
 30. అంబరమందునన్ గరుడుడాపక కూయగ స్త్యానమంచుచున్
  తుంబురు నారదుండ్లు కడు తొందర జేయుచు పాటపాడగా
  త్ర్యంబకు డేగుచున్ ధరను త్రాగుచు పల్కెను మీసమెత్తుచున్:👇
  "అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్"

  రిప్లయితొలగించండి