18, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2877 (హనుమద్వాలముఁ ద్రొక్కె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్"
(లేదా...)
"హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్"

53 కామెంట్‌లు:

  1. పనిలేని చంద్రుడాతడు
    కనుగొని చంద్రుండితనిది కాలిని త్రొక్కెన్
    వినుమా! ఇది యెట్లన్నన్:
    "హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్"

    రిప్లయితొలగించండి
  2. ( ఇద్దరు గురువుల ప్రశ్నలు - ఇద్దరు శిష్యుల జవాబులు )
    " తనసతి సుమముల నడుగగ
    నొనరగ జను భీము డేమి యొనరిచె ? " " రాధే
    యుని జంపిన దెవరోయీ ? "
    " హనుమంతుని తోక ద్రొక్కె ; " " నర్జును డలుకన్ ."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    తనవారిన్ పెఱవారలట్టులనిలో దర్శించి కుందంగ , గీ...
    తను బోధించెను కృష్ణమూర్తి , తన క్రోధంబెల్ల పెంపొందగా
    ననలజ్వాల స్పృశించె , పట్టుకొనె ఘోరాహిన్ , కలన్ క్రుద్ధుడై
    హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. కనలుచు లంకను గాల్చెను
    హను మంతుని తోక ; త్రొక్కె నర్జును డలు కన్
    ఘన భుజ బలమున వైరుల
    నని లో కసి దీర కౌరవాధ మ తతు లన్

    రిప్లయితొలగించండి
  5. ఘనుడాకర్ణుడునర్జును
    హనుమద్ కేతనముగూల్చనదిభువిపడ గే
    తనముగనకనరదముదిగి
    హనుమంతునితోకద్రొక్కెనర్జునుడలుకన్

    రిప్లయితొలగించండి
  6. హనుమానుండునుసీతజాడరసి కయ్యంబందునన్ జిక్కయా
    దనుజుల్ వాలముగాల్చ గాల్చె నలుకన్ దైత్యాల యంబున్నహో
    *హనుమద్వాలము ;ద్రొక్కెనర్జునుడుదానత్యంతరౌద్రంబునన్*
    తనయున్ జంపినసింధు భూవరుని నాదండున్ సునాయాసుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జాడ నరసి/ జాడ యరసి" అనడం సాధువు. అక్కడ సంధి లేదు.

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    ధనికుల పీచము నణచగ
    పనిబడ నట నోట్ల రద్దు బాబే(చంద్ర బాబు నాయుడు) మెచ్చెన్
    ఘన ఘోరము బీ.జే.పను
    హనుమంతుని తోక ద్రొక్కె నర్జును డలుకన్

    రిప్లయితొలగించండి
  8. డా. పిట్టా సత్యనారాయణ
    ఘన ప్రాంతీయత నడ్డు బెట్టుకొనుటే గర్వంబు యీనాడు నా
    దను దేశమ్మును జాతి గౌరవమునున్ దాటేయుటే నీతియై;
    మనలేమే మన మందరొక్కటను సన్మానంబదే రీతియౌ
    హనుమద్వాలము ద్రొక్కె నర్జునుడు దా నత్యంత రౌద్రమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'గర్వంబు + ఈనాడు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2877
    సమస్య :: హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్.
    *హనుమంతుని తోకను అర్జునుడు కోపంతో త్రొక్కినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఉలూచి ఒక నాగకన్యక. కౌరవ్యుని కుమార్తె. తీర్థయాత్ర చేస్తూ అర్జునుడు ఒకనాడు ఒక కొలనులో స్నానం చేస్తూ ఉండగా ఆ విజయుని చూచి మోహించి ఆ ఉలూచి తన ప్రభావంతో ఆ కిరీటిని నాగలోకానికి తీసికొని వెళ్లింది. తన కోరికను తీర్చమన్నది. తనకు వ్రతభంగమౌతుందని పార్థుడు ఉలూచిపై మండిపడ్డాడు. ఆ తరువాత శాంతించి ఆమె కోరికను సఫలం చేశాడు.
    ఒక చెలికత్తె తన భర్త తనను కొట్టినాడని ఉలూచి దగ్గఱ చెప్పుకోగా ఉలూచి “ఓ సఖీ! ప్రేయసీప్రియుల మధ్య కోపతాపాలు సహజమైనవి. తాత్కాలికమైనవి. నా ప్రియుడు అగు అర్జునుడు తనకు వ్రతభంగమౌతుందనే కోపంతో మొదట నా తోకను త్రొక్కినాడు సుమా!” అని పలికినట్లు ఊహించి చెప్పే సందర్భం.

    కనుమా కోపము ప్రేయసీప్రియులకున్ గల్గున్ గదా యంతటన్,
    వినుమా నెచ్చెలి నాదు ప్రేమ కథనే విన్పింతు “నో పార్థ! చే
    కొనుమా నీదు ‘ఉలూచి’ “ నంటి, వ్రతమున్ గోల్పోదునే యన్న యూ
    హను మద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (18-12-2018)

    రిప్లయితొలగించండి
  10. వినుమా!యీభువి యంద నంతమయమై విక్రాంతమై యొప్పుగా;
    యనిలో శత్రుభయంకరుం డగుచునే యాశత్రు సైన్యమ్మునే;
    తనరెన్ చెలరేగి యాలముననే తర్కింప భీముండహో ;
    హనుమద్వాలముఁ ;ద్రొక్కె నర్జునుఁడు ; దా నత్యంత రౌద్రమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "తనరెన్ తా చెలరేగి..." అంటే సరి.

      తొలగించండి
  11. వినరో పంపగ వలదయ
    హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్
    నను యనృతపు సందేశము
    లను వాట్సప్ లో, వివరములవి దెలియకనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అలుకన్ + అను = అలుక నను' అవుతుంది.

      తొలగించండి
  12. అనలమున లంక గాల్చెను
    హనుమంతునితోక ,ద్రొక్కె నర్జునుఁడలుకన్
    ననిలో శాత్రవ మూకను
    గనుమరు గగు నటుల జేసె గాండీవ ముతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. వనమున భీముండలుగుచు
    హనుమంతుని తోఁకఁ ద్రొక్కె; నర్జునుఁ డలుకన్
    తన విలువిద్యను జూపెను
    ఘన కర్ణుని రధము క్రుంగగా రణమందున్

    రిప్లయితొలగించండి
  14. చనుచు గిరిపైకి భీముడు
    హనుమంతుని తోఁకఁ ద్రొక్కె, నర్జునుఁ డలుకన్
    తునుమాడెను కౌరవులను
    వినుతించగ సురలు కాంచి విజయుని దురమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఘనువనితనుదెచ్చెననుచు
    గనలినహనుమన్నవోలెగాననమందు
    న్ననికిటికైశబరునితో
    *హనుమంతునితోకద్రొక్కె ,నర్జునుడలుకన్

    రిప్లయితొలగించండి
  16. ఈ రోజు శంకరాభరణము వారి సమస్య

    హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్"

    ఇచ్చిన సమస్య కంద పద్య పాదములోనిది

    నా పూరణము సీసములో

    తెలుగు నేర్చుకొను విద్యార్ధులకు ఎక్కడో విన్న సమస్య గుర్తుకు రాగా వారి తెలుగు పండితునికి అ సమస్య ఇచ్చుచు (హనుమంతుని తోకను అర్జునుడు ఎలా తొక్కాడో తెలుపవల్సినది) అని అడుగగా ఆ గురువు గారు “బిడ్డలారా రాముని తోక పివరండు అన్న చందమున గలదు ఈ సమస్య కలిపి చదువ రాదు రాముని తో కపి వరుండు అన్నట్లుగా విడ దీయాలి” నెల్లూరు లో ఒక అవధాని గారు ఈ సమస్యను ఈ ప్రకారము పూరించారు అని తెలిపిన సందర్భము


    సీసము
    తైలపు వలువలు వాలమునకు చుట్టి నిప్పు నంటిoచగ నప్పుడు హను
    మంతుడు వేడుచు మందసానుని నింగి కెగురగ, మండెను భగభగమని,
    గిరగిర తిరుగుచు,సురసుర మండుచు,బోటుడా రావణు పురము కాల్చె
    ఘనతతోడ హనుమంతుని తోఁకఁ,ద్రొక్కె నర్జునుఁడలుకన్ ధనువును కరమున
    దాల్చి రణరంగ మందు సైoధవుని జంప,
    తెలుసు కొమ్ము తనయులార కలిపి చదువ
    వలదు నెపుడు, “రాముని తోక వలె” ననుచు,నొ
    క గురువు బలికె శిష్యుల గణము తోడ


    రచన పూసపాటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      'వలదు + ఎపుడు = వల దెపుడు' అవుతుంది. నుగాగమం రాదు. "వల దెపుడును" అనండి.

      తొలగించండి
  17. ఘన విక్రముండు దా భయ
    మన నెఱుఁగడు మానసమున నటఁ బట్టంగం
    జని కని పామును, దలఁచుచు
    హనుమంతుని, తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్


    అని లోద్ధూత పతాక సంస్థిత వికా సామేయ శౌర్యద్యుతిన్
    హనుమంతుండు విరాజమానుఁ డయి తా నార్చన్ వడిం దా ననీ
    కిని నిల్చుండఁగ భండన స్థలిని, టెక్కెం బందు వీక్షించుచున్
    హనుమద్వాలముఁ, ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  18. మత్తేభవిక్రీడితము
    కనుమా! నాతడుఁ గొట్టి నే మొదటగా కాండమ్మిడన్నా వరా
    హను, మద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్
    వెనుకంజేయని వానిశౌర్యమునటన్ వీక్షించ గాపార్వతిన్
    యనలాక్షుండు కిరాతుడై బిలిచె మాయానింద్రకీలాద్రిపై


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనుమా యాతడు' అనండి. 'వరాహమును' అనవలసింది 'వరాహను' అన్నారు. 'పార్వతిన్ + అనలాక్షుండు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.'వరాహ' అన్ననూ పంది అనే అర్థం వస్తుందని అలా వ్రాశా ను సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

      మత్తేభవిక్రీడితము
      కనుమా! యాతడుఁ గొట్టి నే మొదటగా కాండమ్మిడన్నా వరా
      హను, మద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్
      వెనుకంజేయని వానిశౌర్యమునటన్ వీక్షించ గా గౌరినే
      యనలాక్షుండు కిరాతుడై బిలిచె మాయానింద్రకీలాద్రిపై

      తొలగించండి
  19. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వినగా భీముని గాథ నాదినము తా వీక్షింప హన్మంతునున్
    చనగా దారికి నడ్డముండి దిటవౌ చాంతాడు కన్పించగా
    ఘనమౌ శక్తిని నెత్తలేక నపుడా గాఢంపు శుల్బమ్మువోల్
    హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనలంబొందుచుగాల్చెలంకనటబాహాటంబుగానత్తఱిన్
      హనుమద్వాలము,ద్రొక్కెనర్జునుడుదానత్యంతరౌద్రమ్మునన్
      వినుమాశంకర!నాదువాక్యమును,నావేశంబునొందన్భళా
      యనిలోశాత్రవులందఱిన్దునిమెహాహాకారముల్బల్కగా

      తొలగించండి
    2. * continuation: 👇

      వినగా నా కథ మండి పండితుడు నన్ వెంటాడి బాదెన్నయో!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ (కొసమెరుపుతో సహా) బాగున్నది. అభినందనలు
      ******
      సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    *"హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు*
    *దా నత్యంత రౌద్రమ్మునన్"*

    సందర్భము: ఆయుధం పట్టక ఊరకే సారథ్యం చేస్తా నన్న కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు విజృంభించగా అర్జునునిలో ప్రతీకార జ్వాలను రగల్కొలుప డానికి హఠాత్తుగా రథంనుండి దూకి చక్రధారియై భీష్ముని పైకి పరుగెత్తాడు సంహరిస్తా నని..
    అప్పు డర్జునుడు నొచ్చుకొని బావను సమాధానపరచి తిరిగి తీసుకురావడానికి తానూ దూకాడు. అతని అంతరంగంలో శత్రువులమీద కోపంతో ప్రతీకార జ్వాల రగులుకొన్నది. ఆత డత్యంత రౌద్రమూర్తి యయ్యాడు.
    అర్జునుడు కపిధ్వజుడు. అంటే అతని జెండా మీద కపిరాజు (ఆంజనేయుడు) వుంటాడు.
    అర్జునుడు దూకి పరుగిడుతుండగా జెండా నీడ భూమిమీద పడుతున్నది. కృష్ణుని మీదనే దృష్టి వుండడంవల్ల జెండా మీదున్న హనుమంతుని తోక యొక్క నీడను అనుకోకుండా అర్జునుడు తొక్కాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తన సారథ్యము మాని దూకె హరి క్రో
    ధావిష్టుడై భీష్మునిన్
    దునుమన్.. రౌద్రము శత్రు రాజిపయి నెం
    తో రేగఁ దా నొచ్చి బా
    వను బట్టంగ రథంబు దూకె నరుడున్..
    భవ్య ధ్వజచ్ఛాయలో
    హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా
    నత్యంత రౌద్రమ్మునన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    18.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. అనుకరణందున దెలియక
    తనునాటక సాధనాన తత్తరబాటం
    దుననిలువక జూడకనే
    హనుమంతుని తోకద్రొక్కె నర్జునుడలుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనుకరణంబున దెలియక। తన నాటక సాధనమున తత్తరబాటుం। గని...' అనండి.

      తొలగించండి
  22. కందం
    తనకర్తవ్యముఁ దెలుపఁగ
    వినువీధిని విశ్వరూపుఁ బ్రీతిని గనుచున్
    రణమున్, వింటిని బోలగ
    హనుమంతుని తోఁకఁ, ద్రొక్కె నర్జునుఁ డలుకన్

    రిప్లయితొలగించండి
  23. విని నంతనె సంతసం బున
    చనె వేగమె భీముడనగ సౌగంధి కమున్
    మనమున పొంగుచు వడివడి
    హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్

    రిప్లయితొలగించండి