31, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2889 (సాయిని నమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్"
(లేదా...)
"సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"

54 కామెంట్‌లు:

  1. తీయని రక్తిని భక్తుడు
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్
    వేయిని పాపముల కిచట;...
    మోయును కష్టములు మనవి మ్రొక్కగ సాయిన్

    రిప్లయితొలగించండి
  2. శ్రేయము కోరుచు మొదలిడి
    మాయని మమతల నుమునిగి మాయుట కంటెన్
    చేయని పనులకు లోబడి
    సాయిని నమ్మి కొలిచినఁ,గసాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సాయిని నమ్మి కొలిచినను
    సాయిగ హాయిగను బ్రతుకు సాగున్ గానీ
    భాయీ భాయీ యనుచుఁ గ
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    31.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  5. నిన్నటి సమస్యకు నా పూరణ

    సంధితిరస్క్రియాజనితసంగరసంధితవైరివాహినీ

    బంధురభీసమిద్విముఖపార్థవిశాదనివారిణీకృపా

    సింధువిరాణ్మయాకృతినిఁ జేకొని కృష్ణుడు జూప బంధుమో

    హాంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  6. కాయమె శాశ్వత మనుకుని
    మాయన బడిబ్రతుకుచున్న మానవుల సదా
    కాయుచు పాపముల దునుమ
    సాయిని నమ్మి కొలచినఁ గసాయిగ మారున్.

    రిప్లయితొలగించండి
  7. హాయిగ నుండగ వచ్చును
    సాయిని నమ్మి కొలిచిన ; గ సాయిగ మారున్
    తీయని మాటల తోడ న్
    మాయలు గ ల్పించు కపట మాంత్రికు వల నన్

    రిప్లయితొలగించండి
  8. హాయిగ బాధలన్ మరచి భార్యను ప్రీతిగ గారవం బునన్
    తీయని కాపురమ్ము నను తీరగు భర్తగ పేరుపొం దకన్
    మాయల మారిస్నే హితుల మాటల వెంబడి మైకమం దునన్
    సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా

    రిప్లయితొలగించండి
  9. ( విరసుడుగా పొగరుబోతుగా కనబడే నానావలితో
    సాయి భక్తుడైన మహల్సాపతి )
    ఓయి మహాశయా ! వినెడి
    యోపిక , శ్రద్ధయు నీకునున్నచో
    హాయిగ నుందు వింక జను
    లందర నొక్కటి జేసి నిల్పు నా
    సాయిని నమ్మి కొల్చిన ; గ
    సాయిగ మారును నిక్కమే కదా !
    మాయమనమ్ముతో నెపుడు
    మంచిని కోరక విర్రవీగగన్ .

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    హేయవిధానమున్ వలచి యెందరొ బెద్దల తూలనాడి , హిం... సాయుతధోరణిన్ మరగి శాంతిని భగ్నము జేసి , యొక్కనా...
    డే యమునన్ మునింగిన , మహిన్ శిల మ్రొక్కిన షిర్డికేగి యా...
    సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. శంకరాభరణం.... డిసెంబర్ 31, 2018,శనివారం
    సమస్య

    నా పూరణ :

    సాయిని నమ్మి కొలిచిన గసాయిగ మారున్

    *** *** *** ***
    మాయలు జేయుచు నిత్యము

    న్యాయము దప్పి పరులకు సహాయము సుంతన్

    జేయక,కల్మష బుద్ధిన్

    సాయిని నమ్మి కొలిచిన గసాయిగ మారున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  12. ఈయిలలోన స్వార్థముననెవ్వడు దుష్టులచెంతఁజేరి తాఁ
    జేయక సాయమెవ్వరికి చిత్తమునన్ స్మరియించకన్ హరిన్
    హేయములైనక్షుద్రముల నేమది దైవమటంచు, కాదనిన్
    *"సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"*

    రిప్లయితొలగించండి
  13. వాయన మిమ్మని,డబ్బులు,
    ప్రాయమ్మును,కొల్లఁగొట్టువాడై,ఖలుడై,
    'ఓ'యను కడు మోసపు గో
    సాయిని నమ్మిఁగొల్చినఁగసాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  14. ఖాయముగా స్వర్గ మొదవు
    సాయిని నమ్మి కొలిచినఁ, గసాయిగ మారున్
    సాయము చేయక యెవరికి
    మాయలతోఁ బ్రజల ముంచి మను దుష్టుండే

    రిప్లయితొలగించండి
  15. నేటి శంకరాభరణము సమస్య
    సాయిని నమ్మి కొలిచిన, గసాయి గ మారున్

    ఇచ్చిన పద్య పాదము కందము నా పూరణము సీసములో
    సాయితా = సాయము


    సాయితా కోరుచు ,సర్వము నీవే ననుచు ,కల్మషము లేక, నోరు నొవ్వు
    భజనలు జేయుచు, పరులకు శక్తి కొలది సాయమును చేసి, వదలక తన
    విధులను, సతము వెరవక చేయగ, గలుగు సుఖములు జనులకు వసుధ
    న షిరిడి సాయిని నమ్మి కొలిచిన, గసాయి గ మారున్వి శాల మైన

    భరత భూమిలో దొంగ బాబాల వలన,
    జనులు యోచన చేయుచు జాగ రూకు
    లై మెలుగుచు, ప్రలోభములను విసర్జ
    నమును చేయ సౌఖ్యము కల్గు నరుల కెపుడు

    రిప్లయితొలగించండి
  16. వేయి విధమ్ముల మనసుకు
    హాయి లభించును గద మఱి; యాదైవమునే
    ఛీయను కఠినాత్ముడెపుడు
    "సాయిని నమ్మి కొలిచినఁ ; గసాయిగ మారున్"

    రిప్లయితొలగించండి
  17. సాయముసౌభాగ్యంబగు
    సాయినినమ్మికొలిచిన; గ
    సాయిగమారున్
    సాయికితుర్కలుగోవున
    మాయికులనుజంపిమాంసమందించినచో

    రిప్లయితొలగించండి
  18. సాయము చేయుటెరుగునని
    ఖాయముగన్ జెప్పగలము,ఘనమగుకీర్తిన్
    హేయమగు నిట్లన వలదు
    *"సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్"*

    రిప్లయితొలగించండి
  19. కూయును యేగూటి చిలుక
    నేయంబున నేర్పగాను నియమంబుననే
    తీయని యా పలుకులను క
    సాయిని నమ్మి కొలిచిన గసాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  20. సాయికసాయియుగ్మపదసామ్యసమస్యనొసంగు శంకరా?
    మోయని భారమై చెలగి, మోహనభావన దోచనందునన్,
    సాయి యటన్న శబ్దముఁ గసాకస ఛేదమొనర్చఁ, బూరణన్
    సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా?

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  21. మాయలు తొలగును నీలో
    సాయిని నమ్మి కొలిచినఁ ;గసాయిగ మారున్
    సోయి యెరుంగక పాపము
    చేయగ; సాయి తలిదండ్రి చెలిమరి వేడన్

    రిప్లయితొలగించండి
  22. కాయమునకు స్వాస్థ్యమ్మును
    ఖాయముగా మనమున కును కడువడి నొసగున్
    హాయిని కాదే? యెట్టుల
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్ ?

    రిప్లయితొలగించండి
  23. *"సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"*
    మాయికులైయమాయకులమంచినిపైకముజేసికొన్నచో
    మాయికులైమహాత్ములసమాదరణీయులగారలంపుచో
    మాయికులైదురాత్ములసమాజసభాస్థలిజేర్చిగొల్చుచో
    మాయికులైనమస్కృతిసమాదరణంబునగ్రూరుజేరుచో
    మాయికులైదయాళువులమంచినిశ్రద్ధనుగూలనేసినన్

    రిప్లయితొలగించండి
  24. కాయక వాచక మానస
    హేయపు పనులే వదిలి మహేశుడు వానిన్
    హాయిగ నమ్ముడు, నిక్కము
    సాయిని నమ్మి కొలిచినఁ గ; సాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్కారములు. పనులు వత్తిడుల వలన గత నాలుగు రోజులుగా పూరణలను పంపి యుండలేదు. యిప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    27-12-2018:

    ఊరక కోపము తోడను
    తారాడుట మానుచుండి తగు తేకువతో
    నా రాణీ! నను విని మమ
    కారము పాయసము నందు గలిపిన రుచియౌ.

    28-12-2018:

    తాను ప్రీతి గొనిన తన్వితో నతనికి
    యిరువు రింటి వారు నిష్ట పడుచు
    పెండ్లి చేయ నలరి వేడుక నాతడు
    కనుల నీరు నింపి గట్టె తాళి.

    29-12-2018:

    పెరడులోని దొండలతిక పెంపునొంది
    ప్రాపుకై బెండ మొక్కపై ప్రాకి దాని
    కసురు నంటి యుంటను చూచు గతిని తట్టె
    దొండతీగెకు గాసెను బెండకాయ.

    30-12-2018:

    సంధించిన స్తవముతో
    అంధకరిపువును మనమున నర్చించంగన్
    బంధము లుడిగిన సిసుడా
    యంధుడు కనులార గనెను మహాద్భుత మూర్తిన్.

    31-12-2018:

    కాయము ముక్తిని బొందును
    సాయిని నమ్మి గొలిచిన; గసాయిగ మారున్
    శ్రేయముగా నొప్పెడి నా
    ప్యాయతల నడచు మనమది పద్ధతి లేకన్.

    రిప్లయితొలగించండి
  26. గురుదేవులకు వినమ్రవందనములు

    నాలుగు పాదాలు సమ గణములతో
    ==============******==========
    మాయలు నిండిన జగతిని మంచిని బంచన్
    గాయములైనను వెరువక కాలుని తోడన్
    హాయిగ జేయుచు రణమును హద్దులు జూపెన్
    సాయిని నమ్మి కొలిచిన గ సాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  27. హేయపు బోధల జేయుచు
    జేయగ దుష్కృత్యములను చేయుచు నాజ్ఞల్
    రాయిడి పెట్టెడి ఘనుడగు
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్.

    సాయి = ప్రభువు

    రిప్లయితొలగించండి
  28. శ్రేయములెన్నియొకలుగును
    సాయినినమ్మికొలిచిన,గసాయిగమారున్
    మాయలు నేర్చిన మనుజుడు
    హేయంబగుబ్రదుకుగలిగి యిధ్ధరనెపుడున్

    రిప్లయితొలగించండి
  29. నా ప్రయత్నం :

    కందం
    ఆయెనె దత్తాత్రేయుఁడు
    నీ యవనిన్ షిర్డిఁ బర్తి నేర్పడె ప్రభువై
    సాయిగ ! భక్తుడనఁగ నే
    సాయిని నమ్మి కొలచిన గసాయిగ మారున్?

    ఉత్పలమాల
    సాయియె ఖండయోగమును సాధన చేయఁగ వైరులందురే!
    "హేయమనంగ సాయి నతనెవ్వడొ ముక్కలు జేసినాడహో
    మాయలమారి సాయి యని మాన్యుడు షిర్డిని యెవ్వడైన నీ
    సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి దినం హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఉన్నత గౌరవ పురస్కారం మరియు సన్మానం
      అందుకున్నందుకు వేవేల అభినందనలు!!!

      తొలగించండి
  30. హేయపుఁ బనులం జేయును
    ఛాయా వినుమా కడింది సాధువె యైనం
    బాయక యసురు ఘ నాంహ
    స్సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్

    [అంహస్సు + ఆయి = అంహస్సాయి; పాప మాదాయము గా గలవాఁడు]


    ఈ యతి వర్తనమ్మును సహించఁ డతండని నీ వెఱుంగవే
    పాయక వాని నివ్విధినిఁ బంతము తోమఱి కాఱు కూతలం
    గూయఁగ వీరభద్రు మదిఁ, గోపము మీఱఁగ నాదరింప కా
    సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మాయయు చంద్రులిర్వురును మమ్తయు లాలును యాదవాదులున్
    తీయగ రాహులున్ జగను దీటుగ స్టాలిను మోడి షా లునున్
    మోయుచు వారి పాపముల మ్రొక్కుచు షిర్దిని నొక్కరొక్కరున్
    సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా

    రిప్లయితొలగించండి
  32. ఓయీమీయందునదయ
    గోయన్మీయందుదైవగోసాయిన్సా
    హాయంబందుచుబోయగ
    *"సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్"*

    రిప్లయితొలగించండి
  33. సాయముజేయుసాధకులసంకటమణ్చునసాధ్యసాధ్యమౌ
    సాయిదయామయుండుమనసావచసాశిరసానమస్సులన్
    *"సాయిని నమ్మి కొల్చినఁ; గసాయిగ మారును నిక్కమే కదా"*
    మోయనిమాయమోహమిహమోపరమోనిజమోయెరుంగమిన్

    రిప్లయితొలగించండి
  34. హేయీశ పాపనాశక
    సాయీశా శంకరాయ శరణంబు గురో
    నాయెద యొప్పదు చెప్ఫగ
    సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్

    రిప్లయితొలగించండి
  35. పాయని భక్తి గల్గి యును పావన చిత్తము తోడ మె ల్గు చున్
    సాయ మొనర్చిపేదల కు సర్వ హితం బును గోరఁ మేలగున్
    సాయిని నమ్మి కొల్చిన ; గ సాయిగ మారు ను నిక్క మే గదా
    మాయలు మంత్ర తంత్ర ముల మాంత్రిక సేవలు జేయ బూనగన్

    రిప్లయితొలగించండి
  36. మాయామర్మము గలుగు క
    సాయిని నమ్మికొలిచిన కసాయిగమారున్
    సాయిని భక్తిగగొలుచుచు
    సాయంబును జేయుపరుల సంతసమొదగన్!

    రిప్లయితొలగించండి
  37. శ్రేయముగూర్చుచున్నెపుడుశ్రీకరకార్యముగల్గజేయునే
    సాయినినమ్మికొల్చిన,గసాయిగమారునునిక్కమేకదా
    పాయుచుసాయినామమునుబామరువోలెనుదిర్గుచుండియున్
    నేయుపకారమున్బ్రజకునెప్పుడుజేయకనుండువాడహో

    రిప్లయితొలగించండి
  38. మాయలు, మంత్రము లొసగిన
    సాయముతో మోసగించి జనులను దోచన్
    తీయగ పలుకు కుటిల గో
    సాయిని నమ్మి కొలిచిన కసాయిగ మారున్!

    రిప్లయితొలగించండి
  39. పాయును దుఃఖము లన్నియు
    సాయిని నమ్మి కొలిచిన; గసాయిగ మారున్"
    మాయల మోసము నొందు న
    మాయకుడిల; బంధితమగు మార్జాలగతిన్

    రిప్లయితొలగించండి
  40. శ్రేయము గూర్చెద ననుచున్
    కాయమునకు కావి గట్టి గైకొని బూదిన్
    మాయలు జేయు కపట గో
    సాయిని నమ్మి గొలిచిన గసాయిగ మారున్!!!

    రిప్లయితొలగించండి
  41. మాయులమాయకుల్ ప్రజలు మాన్యునిహాయిగనిస్సహాయులై
    మాయజమానిసాయిమనమాయనభృత్యులమయ్య ద్వారకా
    మాయిజయాభయంబుశుభమంగళసత్త్వఫలంబులీయ యే
    *సాయినినమ్మిగొల్చిన గసాయిగమారును?నిక్కమేగదా*
    మాయికుమాయలోబడియమాయికులెందరుమాయమయ్యిరో

    రిప్లయితొలగించండి
  42. కాయమె శాశ్వతమ్మనుచు కాంతల కాసుల వెంట పర్గిడుచున్
    న్యాయము ధర్మమున్ విడిచి యక్రమ మార్గము నన్ జరించెడిన్
    మాయను నమ్ముకున్న యిల మానవ పాపము లెల్ల ద్రుంచగన్
    సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా.

    రిప్లయితొలగించండి
  43. సాయముసేయరయ్యయగచాట్లకుత్రాగుడుమూలమయ్యె యే
    మాయనొమాయమయ్యెసగమాయెనుసంపదచాలదయ్యెగో
    సాయిలుసోయిదప్పిరియసాధ్యముసాధ్యమునయ్యెనయ్యొగం
    జాయియెహాయినీయగురుసాయినిసాయముజేయడన్న హం
    *"సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా*

    రిప్లయితొలగించండి
  44. విఘ్ననాయకు డొనగూర్చ వేడుకలను
    యేడుకొండల నాధుడు యేలుగాత
    యేటి కేడాది దీవెన లిడుచు ప్రజకు
    నూతనాబ్దియు తోడయి యూతనీయ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    న్యాయముగా మెలిగెదరట
    సాయిని నమ్మి కొలిచినఁ ; గసాయిగ మారున్
    తీయగ మాటలనాడుచు
    మాయలు జేయంగ జూడు మనుజులు జగతిన్

    రిప్లయితొలగించండి