1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2917 (యోగికి యోగమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"
(లేదా...)
"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"

84 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. యోగమొ యుద్యోగమొ స
      ద్యోగమొ పెండ్లైన సుతుఁడు యోచనఁ జేసెన్
      ద్యాగము నేర్పెను దండ్రికి
      *"యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"*

      తొలగించండి
  2. యోగీశ్వర శంకరుడట
    ప్రాగల్భ్యము తోడ నెగ్గి వాదములందున్
    భోగము వీడు సురేశ్వర
    యోగికి యోగమ్ము నేర్పె యోగి
    ముదమునన్

    సురేశ్వరుడు = ఆది శంకరుని శిష్యుడు (మండన మిశ్రుడు)

    రిప్లయితొలగించండి
  3. భోగము లందున మునుగుచు
    రాగము రంజిల్ల మదిని రారాజు వలెన్
    సాగర తీరమ్ము నమరి
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదము నన్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    రాగమతిన్ బ్రవర్తిలి పరాఙ్ముఖుడయ్యెను క్రీడి యుద్ధభూ...
    భాగమునన్ గురూత్తముల బంధుజనమ్మును గాంచి ఖిన్నుడై ,
    యోగవిదుండు దెల్పెను మహోన్నతగీతను , కర్మబద్ధుడౌ
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  5. సాగెను జీవన యానము
    రాగద్వేషములు తొలగ రతగురువతడే
    శ్రీగురువును చేరగ సం
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!

    జిలేబి యోగము :)

    రిప్లయితొలగించండి
  6. త్రాగుడు మానక సతతము
    భోగాలకు మరిగినట్టి పురుషుండతడే
    రోగాల పడిన యా యు
    ద్యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్.

    రిప్లయితొలగించండి
  7. భోగములు పొంద గలడు
    ద్యోగస్తుడు కొలువులోన పదోన్నతి తోడన్
    రోగము బాపగ నొక ఉ
    ద్యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "కొలువులో పదోన్నతి..." అనండి.

      తొలగించండి


  8. సాగెను జీవితమ్ము! మనసా! పరమాత్ముని సన్నిధానమున్
    నేగన నెట్లు వీలగును? నెంజిల తీర్చు మహాత్ముడెవ్వడో?
    సాగెను యత్నమాతనిది!స్వామియె వచ్చెను! భక్తి గాంచి సం
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. బీగము వేసెను నింటికి
    సాగె చలిమలకు విదురుడు సాగిల బడగా
    జోగి! గురో! యని యోగికి
    యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. 'యోగీశ్వర్' మక్కువతో
    నేగియు నొక యోగి వద్ద కీప్సితమొప్పన్
    సాగిలపడి కోరంగన్
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    రిప్లయితొలగించండి
  11. ( ప్రేమయోగి నరుడు - జ్ఞానయోగి నారాయణుడు )
    వేగము మీర ద్వారకకు
    బ్రేయసి జేరగ రాగయుక్తుడై
    యాగమనమ్మొనర్చు ఘను
    నర్జును శౌరి సమాదరించి , యే
    యాగము జేయకుండ ముని
    యట్టుల నాటక మాడ , బ్రేమపుం
    యోగికి , యోగి , యోగ్యమగు
    యోగనియోగ మొనర్చె యోగ్యుడై .
    ( ఆగము - అల్లరి ; యోగనియోగము - ఉపాయబోధనము
    యోగ్యుడై - తగినవాడై )

    రిప్లయితొలగించండి
  12. భోగ మె యోగ మ్మను కొని
    యే గమ్య ము లేని వాని కీశ్వ రు కృప తో
    ధీ గరి మ భక్తి యు ను సం
    యోగి కి యోగ మ్మునేర్పె యోగి ముదము న న్

    రిప్లయితొలగించండి


  13. రోగములు వీడు జనులా
    రా గనుడీ యోగ మహిమ! రారండయ్యా
    యోగా డేయిదియే! ప్రతి
    యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సంబోధన తర్వాత గసడదవాదేశం రాదు.

      తొలగించండి
    2. 13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.
      వాఁడు + కొట్టె = వాఁడు గొట్టె, వాఁడు కొట్టె
      అపుడు + చనియె = అపుడు సనియె, అపుడు చనియె
      నీవు + టక్కరివి = నీవు డక్కరివి, నీవు టక్కరివి
      మీరు + తలఁడు = మీరు దలఁడు, మీరు తలఁడు
      వారు + పోరు = వారు వోరు, వారు పోరు
      అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి.
      రారు + కదా = రారు గదా, రారు కదా
      వత్తురు + పోదురు = వత్తురు వోదురు, వత్తురు పోరుదు

      14. తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.
      వాఁడు + కంసారి = వాఁడు కంసారి
      వీఁడు + చక్రపాణి = వీఁడు చక్రపాణి
      ఆయది + టంకృతి = ఆయది టంకృతి
      అది + తథ్యము = అది తథ్యము
      ఇది + పథ్యము = ఇది పథ్యము

      15. ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు.
      కూర + కాయ = కూరగాయలు
      కాలు + చేయి = కాలుసేతులు
      టక్కు + టెక్కు = టక్కు డెక్కులు
      తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
      ఊరు + పల్లె = ఊరువల్లెలు

      తొలగించండి


  14. ఆ గుజరాతుని మోడీ
    సాగిల బడజేసె! మెప్పు సాధించె! భళా
    సేగిని ద్రోలగ సేనా
    యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!


    సర్జికల్ స్ట్రయిక్ !
    కర్మణ్యేవాధికారస్తే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. సాగుచు నిత్యము కొలువున
    రోగములనుగొని సతమ్ము రొప్పుచు నుండన్
    భోగమునొసంగ నాయు
    ద్యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    రిప్లయితొలగించండి
  16. సాగెడి సంసారమ్మున
    దాగినసత్యమ్ము దేవి "దయచేదెలుపన్
    యోగియు" మర్పున వేమన
    యోగికి యోగమ్మునేర్పె యోగిముదమునన్

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    "యోగము సీసాలో బడు(ఔషధ కంపెనీలు నెలకొల్పు)
    యోగమ్మది యేల బాబ!యుక్తియె గానీ
    సాగిన యోగము చాలును"(అని హితవు సూచించుచు)
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    "యోగమటన్న భస్త్రికను నూపుట గాదయ పొత్తి కడ్పునున్;
    సాగునె వృద్ధ,రోగ గత సర్వ జనాళికి, నీకు నెల్లెడన్?
    ఈగతి సాధనన్ బడసి యింటనె గుందిరి చూడు బాబ!"నన్
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుడై!

    రిప్లయితొలగించండి


  19. మ్రోగగ భేరియున్ భళి సమున్నత వేదిక పైన మోడియే
    తా గురు వై జనాళికి ప్రధానిగ సద్గురు జగ్గి వాసుదేవ్
    సై గరి జూపి రాజునకు సాధ్యమటంచును కర్మయోగిగా
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుడై!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ఆగమ శాస్త్రమునేర్వక
    రాగాదులగూడియుండిరంజిలు చుండన్
    యోగివరేణ్యుని చట్టగు
    యోగికి యోగమ్మునేర్పె యోగిముదమునన్

    రిప్లయితొలగించండి
  21. శంకరాభరణము నేటి సమస్య
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్
    సమస్య కందము నా పూరణము సీసములో

    భీష్ముడు ఓడిపోగా ధృతరాష్ట్రునకు ఆవిషయము తెలసి మొదటి నుంచి యుద్ధ వివరములు తెలుపు మనగా మొదటి రోజు వివరములు సంజయుడు తెలుపు సన్నివేశము (యోగి = యతి అర్జునుడు , యోగి = కృష్ణుడు యోగము = భగవద్గీత యోగము , క్లేదువు = శరీరము)


    సీసము
    పెంచిన తాతతో, ప్రేమతో విద్యలు
    నేర్పిన గురువుతో, కూర్మి చూపు
    బందు జనములతో ,పౌషము నేరీతి
    చేతునని కిరీటి చేతి లోని
    ధనువును పడవైచి ధరణి ఫై కూర్చుండ,
    ఫల్గుణుని వలదు భయము ననుచు
    నోదార్చి, యోగికి యోగమ్ము నేర్పె యో
    గి ముదము నన్దన క్లేదువు రణ


    రంగమున పెంచి జూపుచు, భంగపడిన
    పార్ధుడు భయము వీడి జే బట్టి ధనువు
    తోడ రధమెక్కె ,వ్యాస సుతుండ! వినుము
    యుద్ద వివరములని సంజయుండు బలికె



    రిప్లయితొలగించండి
  22. సాగవు బ్రతుకులు, కావవు
    మా గణములు యోగమే సుమంత్రము, సఖుడా!
    యోగము గైకొమ్మనుచు ప్ర
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    (ప్రయోగి అంటే scientist 😄)
    మా గణములు= లక్ష్మీ గణములు(ధనము)

    రిప్లయితొలగించండి
  23. యోగి కడ కేఁగ నాతఁడు
    వేగముగ నుపాయమునకు వేదనతో దు
    ర్వాగనుచితునకు భా ర్యా
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    [భార్య + అయోగి = భార్యాయోగి]


    ఈ గతి బంధు మిత్ర గురు హేయ తర ప్రతిఘాతనమ్మునన్
    భాగరి నౌట తప్పదని పాప కృపా భయ విహ్వలుండునుం
    గాఁగ నరుండు కయ్యమునఁ గర్మ సుయోగునిఁ జేయ దుఃఖ సం
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తే.గీ.
      పార్థుఁ డట నంతఁ గాంచె నప్పలను దాత
      ల గురువుల మేనమామల భ్రాతలఁ దన
      యుల మనుమల సఖుల శ్వశురుల సుజనుల
      నుభయ సేనల నడుమున నున్న వారి 26.

      తే.గీ.
      బంధువుల నందఱ ననికి వచ్చి నట్టి
      వారిఁ గుంతీ కుమారుఁ డేపార దయ భృ
      శమ్ము మదిఁ గాంచి యంత విచార పడుచు
      మిక్కిలి పలికె నివ్విధి నక్కజముగ 27.

      తే.గీ.
      యుద్ధ మొనరించ మనమున నుత్సహించి
      చలమున నరుదెంచిన నిజ జనులు ధీరు
      లిచట నిల్చిరి విక్రమ మెంచి మదిని
      వీరిఁ గాంచ నిపుడు కృష్ణ వీర వరుల 28.

      తే.గీ.
      క్రుంగు చున్నవి భృశము నా యంగము లివి
      యెండు చున్నది నానోరు మెండుగాను
      వణఁకు చున్నది దేహము ప్రస్ఫుటముగ
      గగురుపా టగు చున్నది కలవరమున 29.

      తే.గీ.
      కరము విడి పడుచున్నది గాండివమ్ము
      మండు చున్నది మిగుల చర్మమ్ము నాకు
      నుడిగినది శక్తి నిలఁబడి యుండుటకును
      మనము నందుఁ గాంచంగ సంభ్రాంతి వొడమె 30.
      తే.గీ.
      సూచకములు సెఱపునకుఁ జూచు చుంటి
      శకునములను బెక్కింటిని సంగరమునఁ
      గేశవ తనవారి వధించఁ గీడె కాని
      మేలు పిదప సుంతయుఁ జూడఁ జాల నకట 31.
      తే.గీ.
      కోర నీ రాజ్యమును గృష్ణ కోర నీ వి
      జయమును సుఖమ్ము నైన రాజ్య మది యేల
      మాకు గోవింద భోగ సమాజము లవి
      యేల జీవితమ్ము నదియు నేల యింక 32.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  24. రాముడు గురు శిష్య సాంప్రదాయము కొనసాగించి, యోగ వాసిష్ఠం నేర్చె?


    యాగమ్ము సేయ నరుడై
    నాగశయనుడు దిగివచ్చి నాచారంబున్
    బాగుగ పాటించ మొదటి
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    రిప్లయితొలగించండి
  25. యోగఫలప్రదాత్రఖిలయోగపరేశ్వరకృష్ణు డాప్తసం
    యోగవియోగసంశయనిరుత్తరనిశ్చలసవ్యసాచిదు
    ర్యోగికి, యంత్రమత్స్యదళనోరునిశాతశరప్రయోగసం
    యోగికి, యోగి యోగ్యమగు యోగనియోగమొనర్చె యోగ్యుడై.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    యోగిని తెచ్చి మోడియట యుక్తులు నేర్పుచు గుంభనమ్మునన్
    రాగము తోడ యూపికిని రమ్యపు రీతి ప్రధాని జేయగా
    భోగము జేసి మార్చనహ! బోలెడు పేరులు నగ్రినగ్రికిన్
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడ నూపిరికి'అనండి. 'అగ్ని నగ్మికిన్'?

      తొలగించండి
    2. 🙏

      యోగి = 1. యోగి ఆదిత్యనాథ్
      యోగి = 4. "యోగ"మును ప్రపంచమంతా చాటిన నరేంద్ర మోడి
      యూపికిని = UP కి
      నగ్రినగ్రికిన్ = నగరి నగరికి (అలహాబాదుకు, ఫైజాబాదుకు, ముఘల్ సరాయికి వగైరాలకు)

      తొలగించండి
  27. ఆగక తన పరిపాలన
    రాగద్వేష రహితముగ రంజిలు నటులన్
    సాగగ చింతిలు ముఖ్య ని
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!
    (నియోగి = మంత్రి)

    రిప్లయితొలగించండి
  28. ఆగమ శాస్త్రమును జదివి
    యోగాభ్యాసమ్ము నేర్వ, నుర్వీతలమున్
    యోగులకు సేవజేయు ని
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!!!

    రిప్లయితొలగించండి
  29. త్రాగుడు మాననట్టి కడు త్రాష్టుడు జూదము లాడుచున్ సదా
    భోగపు వాడలన్ దిరుగు పూరుషుడెంతయొ బాధజెందె నో
    రోగము చేత వాడిసతి రుక్మిణి వేడగ నాప్రభుత్వపు
    ద్యోగికి యోగి యోగ్యమగు యోగనియోగమొనర్చె యోగ్యుడై.

    రిప్లయితొలగించండి
  30. యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"
    యోగికి యోగమున్ గురిచి యోగియచెప్పుట చిత్రమేగదా
    యోగియనంగ నేర్తునిట యోగము నభ్యసనంబుజే యుటే
    యోగుల లక్షణంబరయ యైహిక వాంఛలు లేనివారుగా

    రిప్లయితొలగించండి


  31. హే గురు! కంది శంకర సహేతువు గానగు పించలేదయా
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై?
    భోగికి యన్న పోవు సరి పోవు కవీశ్వర! యిట్లు మార్చితిన్
    భోగికి యోగి యోగ్యమగు భూతదయన్ గరిపెన్ సయోగ్యుఁడై!

    ఇదియెవరి స్టైలు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. నా ప్రయత్నం :

    వశిష్ట మహర్షిపై స్పర్ధతో రాజయోగి యైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారిన వైనం

    కందం
    రాగమయుండౌచు తపో
    యోగము నశియింప రాజయోగి గొనె ఋషీ
    యోగము వశిష్టు స్పర్ధన్
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    ఉత్పలమాల
    రాగవిలోలలంబున విరాగి త్రిశంకుని, మేనకాది సం
    యోగమునన్ తపోబలము నోడ వశిష్టుని బోలెడున్ ఋషీ
    యోగమునందు స్పర్ధ మదినున్నతుఁ జేసె, పరోక్షరీతినన్
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

    రిప్లయితొలగించండి

  33. క:
    యోగము చేసెడు యోగిని
    రాగముతోగనుచునడుగరమణీయముగా
    వేగమె కాదనక నిరు
    ద్యోగికి యోగమ్ము నేర్పెయోగిముదమునన్'

    రిప్లయితొలగించండి
  34. భోగిదినురెండుమారులు
    రోగియుమరిమూడుమార్లు లోగుట్టెర్గన్
    యోగవిధివిధానమరయ
    *"యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"*

    రిప్లయితొలగించండి
  35. రాగి విరాగిగాగ నగరాట్టు తనూజదిగంబరాంబరున్
    భోగిధరున్విభూతిధరుమ్రోడుమృడున్జగదేకసామి బై
    రాగినియోగినీసతిని బ్రార్ధన జేయమరుండుగల్పె హృత్
    *"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*

    రిప్లయితొలగించండి
  36. జోగులుభోగులున్బ్రజకు జూపిరిచక్కనిదారియోగ్య బై
    రాగులుమోక్షమార్గము విరాగవిభావిభవాభిరామమున్
    భోగికినంతరారులెసమూలము గాయెదిరించుమంచు *సం*
    *యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*

    రిప్లయితొలగించండి
  37. యోగులు యోగసాధనల యుక్త విముక్త ముముక్షుదక్షు సం
    యోగిని యోగిగా లహరి యోగిని యోగముగోరిజేర ను
    ద్యోగము బ్రాణవిద్యయని యుక్తవిహారవిచారచారు ధీ
    *"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*

    రిప్లయితొలగించండి
  38. ఆగమయెన్ మహాత్భుత సదాగతి జూపెడు యోగవిద్య బై
    రాగి చికిత్సలా ప్రణవ ప్రాణమపానగతుల్ మధించి దు
    ర్యోగము కర్మపాశముల మో ఘము జేయుమహత్వ సాధనే
    యోగిముకుందుయోగమది యోగ్యులొసంగినమేలొసంగు సం
    *"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*

    రిప్లయితొలగించండి


  39. భోగము లొందగ సతతము
    రోగము లంటగ తనువుకు రొప్పుచు వేగన్
    సాగిలపడగా గనిదు
    ర్యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్.

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    సందర్భము: భృగు మహర్షి శివునికై తపస్సు చేస్తే దేవతలు భంగం చేశారు. భృగువు తపోభంగం గావించిన వారు తమ శక్తికి కారణమైన మంత్రాలనే మరచిపోతా రని సంకల్పించి మళ్ళీ తీవ్ర తపస్సులో లీనమైనాడు. దేవతలు విష్ణువు నాశ్రయిస్తే శివుని వద్దకు పంపాడు.
    శివుడు రాగా భృగు శరీరం అగ్ని శిఖలు చిమ్ముతున్నది. విష్ణువు సలహాతో శివుడు భృగుహృదయంలో సాక్షాత్కరించాడు. భృగువు కనులు విప్పి అగ్నికీలలు శాంతింప శివుని స్తుతించినాడు.
    శివుడు దీవించి "నా జ్ఞానాన్ని కోల్పోయినా" నన్నాడు. "స్వామిమలైలో వెలసిన సుబ్రమణ్యునివల్ల నీ స్వరూప జ్ఞానం పొందు" మని భృగు వన్నాడు.
    శివుడు కావేరీ తీరంలోని స్వామిమలై చేరి పార్వతీ స్కందులకు తా నిదివరకే ఉపదేశించిన పంచాక్షరిని స్కందునినుంచి ఉపదేశం పొందాడు.
    శివునికే ఉపదేశించినందున సుబ్రమణ్యుడు "స్వామి నాథు"డైనాడు. "శివ గురు" వని పిలువబడ్డాడు.
    (ఒకే కథాంశానికి రెండు పూరణలు విశేషం.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    యోగ నిరూఢుడు నభవుడు
    యోగి భృగువు కాంక్షతోడ యోగము మరువం
    గా గుహుడు మంత్ర మిచ్చెను..
    యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

    మరొక పూరణము.. సమస్య..
    యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

    యోగ నిరూఢుడౌ శివుడు
    యోగ వతంస భృగు ప్రకాంక్షచే
    యోగము విస్మరింప దన
    యుం డగు స్వామిమలై గుహుండు దా
    యోగము" "స్వామి నాథు" డిత
    డో!" యన మంత్రము నిచ్చి నేర్పడే!...
    యోగికి యోగి యోగ్యమగు
    యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    1.2.19
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో..

    రిప్లయితొలగించండి
  41. షట్కర్మయుక్తా కులధర్మపత్నీ...

    ఉత్పలమాల
    హద్దుల కార్యదర్శి కరణాదుల మంత్రిగ లక్ష్మిరూపమై
    యొద్దిక నోర్మినిన్ ధరణి నొప్పెడు నల్గురి తోడ నామెలో
    శుద్ధిగ భుక్తికిన్ జనని సొంపున రంభగ ముంచి తేల్చువా
    రిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్

    రిప్లయితొలగించండి
  42. కందం
    శుద్ధిగ లక్ష్మి సరస్వతు
    లిద్దఱు దయతోడ నింటి నేలిన ముదమౌ
    సిద్ధిగ హరిహరులంపిన
    లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ

    రిప్లయితొలగించండి