20, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2936 (హింస గల్గఁ జేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"హింస గల్గఁ జేయు హితము భువికి"
(లేదా..,.)
"హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్"

51 కామెంట్‌లు:

  1. సత్యమెంచగ నరిషడ్వర్గ హింసయు
    దుష్ట లోక హింస దురిత హింస
    యటులె గాంధిజీ మహాత్ముని మార్గ”మ
    హింస” గల్గ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి


  2. కంసుని బుద్ధి యేల ? మనకయ్యది చేయదు మంచి, సర్వదా
    హంసవలెన్ జిలేబి విను హాకపు రీతిని నేర్పుగావలెన్!
    శంసన చొక్కమేను? ధనుజారి సమర్థ‌న చేయడే యెటుల్
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. మంచి చెడుల గనక , మనదేశమున దూరి ,
    జనుల వధను సలుపు చపలమతుల ,
    నున్మదాన రేగు నుగ్రవాదుల ప్రాణ
    హింస , గల్గజేయు హితము భువికి .

    రిప్లయితొలగించండి
  4. మానవత్వ మదియె మహిని పరిఢవిల్లి
    ప్రేమభావ మింక పెరిగి నంత
    శాంతి వెల్లి విరియు సంక్షేమ మదియే న
    హింస గల్గజేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  5. హంసవరంపు పండుగుల హద్దులు మీరగ సంకురాతిరిన్
    మాంసము వండి మెక్కుచును మత్తు పదార్థము స్వీకరించుచున్
    ధ్వంసము జేసి పుంజులను ధైర్యము నిచ్చెడి పందెమందునన్
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్ :)

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    ధ్వంసవిధానపూర్ణమగు దారుణమారణహోమకృత్యదు...
    స్సంసదభిప్రయుక్తమయి శాంతి రహించునె ? నేటిరోజులన్
    కంసులు , వారి ద్రుంచుటకు కావలె కృష్ణులు , చక్రి చేయునా
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  7. మనుజుల మది చీల్చు మతముల మత్తున
    హింస; గల్గఁ జేయు హితము భువికి
    సఖి యహింస మేలు సమసమాజము సుమీ
    విశ్వదాభిభూజ వినవె భామ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. తీవ్ర వాదు లిచట దేశభద్రత నింక
    కూల్చివేయ దలచి కుట్రపన్ను
    ముష్కరుండ్ర వలన ముప్పువాటిలు వేళ
    హింస గల్గ జేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  9. మాంసము దిను వేళ మానవా!పశువుల
    ప్రాణ భీతిఁ దలుపు మానసమున
    భూతకోటి మెచ్చఁ బొసగును శుభముల
    హింస గల్గ జేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  10. పెరిగె పాప మనగ ప్రేమ లంతరించె
    మంచి కాన రాదు మహిని నేడు
    దు:ఖ మందు ధరణి దూకొని భరియించ
    హింస గల్గఁ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  11. మానవత్వ ము న ను మసలు చు మనుజుడు
    పరుల కుప క రించు పనులు జేసి
    సత్య ధర్మ పర త చక్క గా మెలగ న
    హింస గల్గ జేయు హితము bhuvi

    రిప్లయితొలగించండి
  12. సాధు చరితుడౌచు సంఘసంస్కారైక
    భావ మున్నవాడు బహుళగతుల
    నంధ మతులు నొవ్వ, నవ్వారి కధికమౌ
    హింస గల్గఁ, జేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  13. మాంసబక్షణంబు మరిగిన జంతువుల్
    హింస గల్గజేయు!హితముభువికి
    సర్వ విధములైన సమతుల్యతందించ?
    సృష్టి స్థితి లయల పుష్టి గాన!

    రిప్లయితొలగించండి
  14. ప్రియునితోడ తనకు పెండ్లిచేయమనుచు
    కోర నతనిదితమ కులము కాదు
    దునిమెదమతని నను దుష్టతలపునకు
    హింస కల్గ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  15. శాంతి సామరస్య సమభావ చయములు
    ప్రగతి గూర్చు చుండు జగతి కెపుడు
    హింస వీడి నంత ధ్వంసమాగు కద! య
    హింస గల్గఁ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  16. శబ్ద బ్రహ్మ మన్న "సత్య మేవ జయతే"
    శాంతి పథమె కార్య సాధనమ్ము
    ప్రాణ దీప కాంతి ప్రసరింప జేయు న
    హింస గల్గఁ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  17. అక్రమార్జనమున కలవాటు పడువాని
    దొంగతనము జేయు ధూర్తునెడల
    స్త్రీల నపహరించి శీలము గొనువాని
    హింస గల్గజేయు హితము భువిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లిస్టు చాల పెద్దది గనుక క్లుప్తంగా

      దుష్టబుద్ధివాని శిష్టునిగాజేయ
      దుష్టశిక్షణమ్ము దోషమగునె?
      హీనజాతి పశువు హింసకే లొంగును
      హింస గల్గజేయు హితము భువికి

      తొలగించండి
  18. కరముచందు గాంధి కాంచ స్వాతంత్ర్యము
    నెంచె తానహింస నంచితముగ
    మనుజ జాతి కొసగి మంచి మార్గమ్ము న
    హింస గల్గఁ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    హంసను బోలె నీ విటు శ్రమాచరణంబొనరింప నేల | వి

    ధ్వంస మొనర్చు మోయి రిపువర్గములన్ మది యందు | నిత్య ని

    ర్హింసయె కల్గజేయును మహీతల మందు హితార్థ సిధ్ధులన్ |

    శంసనముం బొనర్చు మిక సంతత మీవు పరోపకారమున్ |


    { శంసనము = స్తుతించుట , వాంఛించుట ; శ్రమము

    = తపస్సు }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  20. అర్జునునితో శ్రీకృష్ణుని పలుకులు:

    పార్థ! యాయుధమ్ము బట్టుమా నీవిక
    కలత యేలఁ గదలు కదనమునకు
    దూర దృష్టి గలిగి దుర్మార్గమున్ ద్రుంచు
    *"హింస గల్గఁ జేయు హితము భువికి"*

    బంధు మిత్రులనుచు భవబంధముల వీడి
    పోరు సలుపుమయ్య వీర! విజయ!
    క్షాత్ర ధర్మమెఱిగి కదనరంగము నందు
    *"హింస గల్గఁ జేయు! హితము భువికి!"*

    రిప్లయితొలగించండి
  21. కంస దురాగతంబులను కన్న పరాత్పర కృష్ణుడంత వి
    ధ్వంసముఁజేయఁబూనడె? యుదారతఁజంపక నూరకుండెనే?
    శంసన చేయ మర్త్యులు ప్రశస్త విధంబుగ చాటె దేవుడే
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్ !

    రిప్లయితొలగించండి
  22. ఆర్డిఎక్సు తోడ ఆర్మీని గూల్చెడు
    ద్రోహబుద్ధి గలుగు దుండగులకు
    వేరు చింతలేదు క్రూర మనమునకు
    హింస గల్గజేయు హితము భువికి.

    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
  23. ఏదియెటులనైన నెప్పుడరయగన
    హింసగల్గజేయు హితముభువికి
    హింసగూడదెపుడునెట్టివారికినైన
    నిడుములవియకలుగు హింసవలన

    రిప్లయితొలగించండి
  24. పాపకృత్య మగును పరపీడనము జేయ
    వేదసార మిదియె వివర మరయ
    భారతీయులెల్ల పాలించు సూక్తి న
    హింస గల్గఁ జేయు హితము భువికి.

    రిప్లయితొలగించండి
  25. సుద్దు లందుఁ గాక శుద్ధ కర్మము లందుఁ
    గూడ వీడ నెమ్మిఁ గ్రూర కృతుల
    నెద్దినమ్ము నైన సద్దయా పూరి తా
    హింస గల్గఁ జేయు హితము భువికి

    [పూరిత = అహింస =పూరి తాహింస]


    హింస యనంగ రా దనిమి షీప్సిత కార్యము పూర్వపార్థి వో
    త్తంస లొనర్చ నధ్వర వితానము గూర్చెనె సుంత లోక వి
    ధ్వంసము నశ్వమేథ మఖ పావన ఘోటక ఖండనమ్ము నా
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


      * అ త్య ద్భు త పూ ర ణ లం దిం చు మీ కు ప ద న మ స్కృ తు లు *



      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారు నా పూరణములు మీకు బాగా నచ్చినందులకు ధన్యవాద సహస్రములు నమోవాక్పూరితములై.

      తొలగించండి
  26. రాముడేగి లంక రాక్షసుని వధించె
    కృష్ణ గీత నేర్పె కృంతనమ్ము
    మహిష మర్దిని పరి మార్చె నసురులను
    హింస గల్గఁ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  27. నా ప్రయత్నం :

    ఆటవెలది
    సంగరమున హింస జయమె! పాండవులకు
    గాంధితో నహింస కనెను స్వేచ్ఛ!!
    సాధనకని పూను సంకల్ప హింస, న
    హింస గల్గఁ జేయు హితము భువికి

    ఉత్పలమాల
    ధ్వంసము జేసి దేశమును పట్టుకు పోవుచు సంపదంతటిన్
    హింసల బానిసత్వమున హీనులు గాగన తెల్లవారు మీ
    మాంసలతో నహింసఁ గొన మాన్యుడు గాంధి ఫలించె స్వేచ్ఛ యే
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్?

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    హింసలు కావు మర్త్యులకు హేళన జేసెడి యత్త పల్కులున్
    హింసలు కావు మర్త్యులకు హెర్నియ బ్రైనుల హార్టు సర్జరీల్
    హింసలు కావు మర్త్యులకు హృత్తుల కిడ్నిల మార్పులివ్విధిన్
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్

    రిప్లయితొలగించండి
  29. ఆడితప్పనేల ఆరాటమదియేల
    సత్యశోధనమున సంతసమ్మె
    ఉద్యమాలనెపుడునోరిమిగలిగి,న
    హింస గల్గఁ జేయు హితము భువికి!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామరాజ్యమందు రాజిల్లశాంతియు
      సీతజాడకేగి సేమమరయ
      దుష్ట రావణుడనుదునుమాడినంతనే
      *"హింస గల్గఁ జేయు హితము భువికి"*!!

      ****రెండవ పూరణ..

      తొలగించండి
  30. గాంధి మార్గమిదియె గమనింపదగునయ్య
    ఎల్లవారలింక యుల్ల మందు
    భావి తరముకిచ్చె బంగారు మాట,య
    హింస గల్గజేయు హితము భువికి

    డా.సముద్రాల శ్రీనివాసచార్యులు,ములుగు

    రిప్లయితొలగించండి
  31. పరుషములు పలుకక, పరుల నిందించక
    సహన మనెడి హితుని సాయమంది
    హింసను విడనాడ హృదయము జేరు న
    హింస గల్గ జేయు హితము భువికి!

    రిప్లయితొలగించండి
  32. హంసిని! వింటివేయిదియయార్యులమాటలు నమ్మశక్యమే?
    హింసయెకల్గజేయునుమహీతలమందుహితార్ధసిధ్ధులన్
    హింసలుగల్గజేయునిలనిష్టజనాళికిసైతమున్సదా
    హింసలుమానుటొప్పగునహింసయెమేలదియెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  33. ధ్వంసమొనర్చ దానవుల దాశరధై యిల జన్మమెత్తెనే
    కంసుని గూల్చగా మధుర కార గృహమ్మున కృష్ణుడాయెగా
    హంసల బోలెడిన్ పరమహంసల బీడన జేయబూనినన్
    హింసయె గల్గజేయును మహీతలమందు హితార్ధసిద్ధులన్

    రిప్లయితొలగించండి
  34. మాంసమె పుష్టి నిచ్చు నని మాలిమి నెంచక తిండి కోసమై
    పాంసనులై వధించుటలు భావ్యమె ధారుణి సాటి ప్రాణులన్
    ధ్వంసము చేయ జీవ సమతౌల్యము మాయును మీకు కీడు నా
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్.

    రిప్లయితొలగించండి
  35. హింసను ప్రోత్సహించక మహీతల మందున శాంతి గోరినన్
    హింసయె నాయుధమ్ముగను హీనులు కొందరు భారతావనిన్
    ధ్వంసము జేయు ముష్కరుల ప్రాణము తీయుచు సాగుమంటి నా
    హింసయె కల్గజేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్

    రిప్లయితొలగించండి
  36. ధ్వంసము చేయుచున్ ప్రజల స్వార్జిత విత్తము, పెచ్చరిల్లుచున్
    కంసుని సంతతుల్ సతము కాఱియ పెట్ట, నకార్యశీలులై
    హింసల పాలుజేయు కడు హీనమనస్కుల లొంగదీయగా
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్

    రిప్లయితొలగించండి
  37. ధ్వేష భావమెల్ల దేశమందుననింప
    హింస తప్ప జనుల హితము లేక
    దుష్టమూకలైన దుర్మార్గ జనులపై
    హింస గల్గ జేయు హితము భువికి

    తమలోని ధ్వేషభావాన్ని దేశమంతా వ్యాపింప చేయడమే లక్ష్యంగా చేసుకొని, ప్రజల మంచి కోరుకోకుండా ఉండే దుర్మార్గమైన జనం మీద హింసను ప్రయోగించడం మంచిది.

    రిప్లయితొలగించండి
  38. హంసలు కామక్రోధముల న ణ్చరెదేవునిదారితెల్యగన్
    ధ్వంసమొనర్చెభూవరుల భార్గవరాముడుహింసకాదొకో
    *"హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్"*
    హింసయె ద్వారపాలురకు నీ శ్వర ధామము జేర్చెశుద్ధితో


    ధ్వంసముజేయపాపుల,శుభంబులొసంగపవిత్రకోటికిన్
    హింసయె హేతువయ్యె పరమే శుని జన్మ ప్రణాళికెట్టిదో
    హంసలకైనచిక్కదదియాదిపరాత్పరుసంభవంబు నే
    *"హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్"*

    రిప్లయితొలగించండి
  39. దోమలెల్ల రేగి సీమలసేమంబు
    రక్తపాననెపమ రాజరికమొ
    నర్చె గాన ప్రభుత యాదోమలకుజేయు
    *"హింస గల్గఁ జేయు హితము భువికి"*

    రిప్లయితొలగించండి
  40. దొంగతనము బరుల దూషించు గుణముకున్
    స్వార్థ లోభ మోహ జగడబుద్ధి
    రాక్షసత్వములకు రయముగ జనులెల్ల
    హింస గల్గఁ జేయఁ హితము భువికి

    రిప్లయితొలగించండి