3, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2976 (వాక్చాతురిఁ జూపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"
(లేదా...)
"వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా"

82 కామెంట్‌లు:

  1. మిక్చరుగా హామీలను
    పిక్చరులుగఁ జూప ప్రజలు వేయక వోట్లన్
    స్ట్రక్చరు గోల్పోయెనుగద
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      క్లిష్టమైన ప్రాస కనుక అన్యదేశ్యాలను ప్రయోగించక తప్పదు!

      తొలగించండి
  2. ప్రాతఃకాల సరదా పూరణ:

    దిక్చక్రమ్మును పర్యటించి బహుధా ధిక్కారమున్ జూపుచున్
    పిక్చర్ లందున నాయకుండువలెభల్ భీభత్స రూపమ్మునన్
    చక్చక్ మంచును నన్య దేశ్యములుపల్ ఝాడించి నోడింపగన్
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా

    రిప్లయితొలగించండి
  3. పిక్చరు లందున మాటలు
    వాక్చాతుర్యమ్ము పెంచు వాసిగ ననుచున్
    లెక్చరరు చెప్పినంతన
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    దృక్చాంచల్యమునన్ జనాళిఁ గని ముందే గెల్పునూహించి , య...
    ర్వాక్చాపల్యమనస్కుడై సభలలో వాగ్దానముల్ చేసి , స...
    మ్యక్చైతన్యము వచ్చునంచమలు చేయన్ లేని హామీలతో
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా !


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  5. దిక్చక్రమ్ముల కావల
    దృక్చరణమ్ములను చాపి దృంహితమగు ప్ర
    త్యక్చేతనుడి కెడన్ తన
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్!


    కంది వారు ఇల్లు మారిస్తే ఇట్లాంటి ప్రాస యే వేయాలా :)


    జేకే
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      నిజంగా మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      అమ్మా! ఈ సమస్య ఎప్పుడో వారం క్రితం షెడ్యూల్ చేసింది. అప్పటికి ఇల్లు మారే ఆలోచనే లేదు. ఏదో కాకతాళీయంగా జరిగింది. అయినా ఇల్లు మారే కార్యక్రమమంతా మొన్నా నిన్నా పూర్తయింది. ఇవాళ తీరుబడిగానే ఉన్నాను. కాకుంటే కాస్త అలసట ఉంది!

      తొలగించండి

    2. కంది వారికి నమో నమః

      విశ్రాంతి అవసరము .


      జిలేబి

      తొలగించండి
    3. అద్భుతమైన పూరణ జిలేబిగారూ,అభినందనలు!

      తొలగించండి

    4. ధన్యవాదములండీ సీతాదేవి గారు

      ఏదో అలా వచ్చేసిందంతే :)



      జిలేబి

      తొలగించండి
    5. జిలేబీ గారు దుస్తర ప్రాస పారావారమును సమ్యగృగ్వాగ్గుంఫన నౌక తో గోష్పదీకృత భంగి నుత్తరించినారు. అభినందనలు.

      తొలగించండి

    6. పారావారము - సముద్రము
      సమ్యక్ -,
      ఋక్ ,
      వాక్
      గుంఫన
      నౌక
      గోష్పదీకృత ఆవు డెక్క కొలది


      పోచిరాజు వారికి

      నమో నమః !!!!

      ఆవు డెక్క వలె పదముల నౌకతో ప్రాస యనే‌ సంద్రము ను నీదటము !



      సరియేనాండి !?

      జిలేబి

      తొలగించండి
    7. సమ్యక్, రుక్, వాక్, గుంఫనమను నౌక తో
      సముద్రమును ఆవు దాఁట కలుగు గుంట లా చేసి

      తొలగించండి
  6. వాక్చాతుర్యము చేత వీరబలు డ
    భ్భంగిన్ యశంబున్ గనెన్ ;
    వాక్చాతుర్యముతో దెనాలికవి వ
    హ్వారే ! సుకీర్తిన్ గనెన్ ;
    వాక్చాతుర్యము లేని చంద్రముని య
    బ్బాయైన లోకేశుడే
    వాక్చాతుర్యము జూపి , మంత్రివరు
    డబ్బా ! వ్యర్థు డయ్యెన్ గదా !

    రిప్లయితొలగించండి


  7. ఏమి చేసినా ఓడ వలసినదే :)


    డేక్చాలన్ తను పేర్చి వడ్డనలతో డింకీలు కొట్టెన్ సుమా
    వాక్చాతుర్యముఁ జూపి క్రొత్తడి కెడన్ ప్రాణేశు; వ్యర్థుండయెన్
    వాక్చాతుర్యము తోడు బోధకుడయా ; వావాదులన్తోడుగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. వాక్చాంచల్యాపగయై
    వాక్చాతుర్యంబులేక ప్రభునాత్మజుడే
    దుక్చరణుండోయన దు
    *"ర్వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"*

    రిప్లయితొలగించండి
  9. దిక్చక్రంబుననేతలాధములువాగ్దేవీదయాదక్షిణన్
    వాక్చాతుర్యము రాజ్యమున్ సభల సంపద్వైభవంబెంచి దు
    *"ర్వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ ;డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా"*
    వాక్చైతన్యులుబెద్దపీటపయి గర్వాంథ్యారినేబెట్టగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      దక్షిణ...?

      తొలగించండి


  10. జగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగలడెన్



    దిక్చక్రమ్ముల కావలన్ కుదరముల్ ధీంధీంయనంగన్ వెసన్
    ప్రాక్చైతన్యుడు దృంహితమ్ముగ నుషస్ వాజేన గాంధర్వమై
    దృక్చాతుర్యము గాంచి తేరు నడుపన్, దృక్కర్మ ప్రత్యక్షిగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ప్రాక్చంద్రునిలా శమథుడు
    దిక్చతురము నేలదలచి దేశము దిరుగన్
    వాక్చాతుc నెవరు నమ్మక
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాక్చాతు;...? దాని తర్వాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  12. లెక్చరు దంచుచు గొప్పగ
    పిక్చరు జూపుటయె కాని పిసరంతైనన్
    కిక్చేర్చుటయే యెరుగక
    వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"

    రిప్లయితొలగించండి
  13. లెక్చరు దంచుచు గొప్పగ
    పిక్చరు జూపుటయె కాని పిసరంతైనన్
    కిక్చేర్చుటయే యెరుగక
    వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి శంకరా భరణము సమస్య

    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణము సీసములో


    మాకు వోటివ్వుము మహిళలా రా! మీకు వేవిళ్ళు వచ్చిన వేయ బోము
    పన్నును, యిత్తుము ప్రసవించక మునుపే నాధారు కార్డును శోధనమ్ము
    జరిపి స్కానింగు తో ,జాగ్రత్త! బందరు పోర్టు హైద్రాబాదు పోవును గద
    ప్రత్యర్ధి గెలువంగ. పట్టుబట్టి నిడును సింధు నది జలము సీమ యంత
    మా పార్టి యని బల్క ,మంత్రి పదవి యెటుల వరించె నితనిని ,లక్కు గాదె!
    రెట్టింపు వాక్చాతురిం జూపి మంత్రి వ్యర్థుం డయ్యెనో కాంచు చుండి రిపుడు,

    మీరితని పాటవమ్మును మెచ్చి ఓటు
    వేయ భావ్యమా? మనకేలా మాయ గాడు ?
    తెలుసుకొని వోటు వేయము తెలుగు బిడ్డ
    నిపుడె యని ప్రతి పక్షపు నేత బలికె



    (ఇంతకన్నా నాకు చేతకాలేదు సున్నా చేర్చి)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ఇచ్చిన సమస్యను ఏమాత్రం మార్చకుండా మరో ఛందంలో ప్రయోగించడం సంప్రదాయం.
      'పన్నును + ఇత్తుము'అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'మునుపే యాధారు... పట్టుబట్టి యిడును... బిడ్డ యిపుడె యని...' అనండి.

      తొలగించండి
  15. బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు

    దిక్చక్రము మీరిన స
    మ్యక్చేతనుడగు నితండు మదిలోదలపన్
    వాక్చాపల్యము దగునని
    వాక్చాతురిజూపి మంత్రి వ్యర్ధుండయ్యెన్

    వాక్చాపల్యము = మాటదప్పుట

    రిప్లయితొలగించండి
  16. త్వక్చక్షువులనె గాకను
    దృక్చరణమ్ముల ప్రగల్భ దృష్టిని తానే
    దిక్చక్రము జూతుననుచు
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లెక్చరులో దొర యయ్యెను
    వాక్చాతురి జూపి మంత్రి; వ్యర్థుండయ్యెన్
    చక్చక్ మంచును జనులకు
    పిక్చరుగా తానొసగిన వృద్థి నిడుటలోన్.

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లెక్చరులో దొరయయ్యెను
    వాక్చాతురి జూపి మంత్రి; వ్యర్థు0డయ్యెన్
    చక్చక్ మంచును జనులకు
    పిక్చరుగా తానొసగిన వృద్థి నిడుటలోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ ప్రొఫైల్ పేరు shankarabharanam blog అని వచ్చింది?

      తొలగించండి
  19. వాక్చాతుర్యంబొకకళ
    దృక్చాతుర్యంబునకదిదోహదమిచ్చున్
    వాక్చాతుర్యపుశూన్యుడు
    వాక్చాతురిజూపి మంత్రి వ్యర్ధుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  20. ఫ్రాక్చరయిన నాయకునిగ
    లెక్చరు లనిశము వినెడి విలేఖరుని వలెన్
    పిక్చరులో నటుని పగిది
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఎండలధికముగ పెరుగక
    దండిగ పశువులకు మేత ధరణిని కఱవై
    మెండుగ కష్టంబులు రా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  21. రుక్చైతన్యము నమ్ముము
    త్వక్చేల ముడుగు ఫణి వలె దప్పక విడుమీ
    వాక్చాతుర్యపు కపటము
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్


    వాక్చాపల్యము నెంత జూపినను దా వంచింప రాదే భువిన్
    రుక్చింతా పర రాజ నీతి విలసల్లోలాక్ష రాజన్యునిన్
    దృక్చైతన్య విరాజమాన ధవునిన్ ధీమంతుఁ గౌటిల్య భృ
    ద్వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. దిక్చ క్రపు సాధన లో
    వాక్చా తుర్య మున సాటి వత్తు రె యనుచు న్
    త్వ క్చ తు ర మునను సభ లో
    వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుo డయ్యే న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్వక్చతురము' ?

      తొలగించండి
  23. లక్ చైరున్ తను పట్ట గోరి సభలో రాజ్య శ్రీ పతుల్ కొందరిన్
    వాక్చాతుర్యము మించగా పొగ డెతాన్ బ్రహ్మాస్యుడై కోర్కెతో
    వాక్చర్యల్ కురిచీలు కూర్చగను బోవయ్యా! రసాభాసమౌ
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ, "డబ్బా" వ్యర్థుఁ డయ్యెన్ గదా

    మంత్రి వరుడు చేసిన డబ్బా కార్యక్రమం వ్యర్తమాయే నే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో 'సభలో రాజ్యశ్రీ' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చుక్చుక్ మంచును పాత రైలువలెవే చుట్టల్ను మండించుచున్
    పోక్చెక్కల్నహ నమ్లి యుమ్ముచును భల్ మోదంపు తమ్లమ్ముతో
    లెక్చర్లిచ్చుచు నర్థశాస్త్రమున కాలేజీని మాస్టారుగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    బాక్చాకుల1 పాక్ వారలె
    వాక్చాలన వల్ల మార వాజమ్మలె పో
    పాక్చాతుర్యం బెంచని
    వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్
    (1.బాకు మరియు చాకు॥కత్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు ఇంకా విదేశాల్లోనే ఉన్నారా? వరంగల్ చేరుకున్నారా?

      తొలగించండి
  26. ఇటీవల తెలంగాణ యెన్నికల ప్రచారంలో ఒక పార్టీమారిన నాయకుడు ప్రసంగం చివర్లో కారు గుర్తుబదులు సైకిల్ గుర్తుకే మనఓటని పల్కిన వైనం!

    వాక్చాపల్యముతో విపక్షమును దావర్ణించి గూండాగ జి
    మ్మిక్చారిత్రుడు పార్టిమారి యతడే మేలైన వాడంచుచున్
    దృక్చాంచల్యముచే విపక్షగురుతున్ దేశీయచిహ్నంబుగా
    వాక్చాతుర్యము జూపి మంత్రివరు డబ్బా!వ్యర్ధుండయ్యెగదా!

    రిప్లయితొలగించండి
  27. వాక్చాతుర్యము లేదు నాకనుచుఁ దా వాపో వగా నొజ్జయే
    వాక్చాతుర్యముఁ బెంచెదన్ గనుడు నా పాండిత్యమేపాటిదో
    వాక్చాతుర్యపు పాటవమ్మదియె యభ్యాసమ్ము తో గల్గగన్
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుడబ్బా వ్యర్థుండయ్యెన్ గదా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా, ధన్యవాదాలు. వరంగల్ లోనే.ఈ మాసాంతానికి అమెరికాకు వెళ్ళాలి.ఈ లోగా పుస్తకాల ఆవిష్కరణ చేయాలి.

      తొలగించండి
  28. డా.పిట్టా సత్యనారాయణ
    వాక్చేష్టం(వాక్కు,చేష్టను)గన జాలదన్న నియమాల్ వారించె వక్తృత్వమున్
    పాక్చేష్టల్ గనలేని ముఖ్యు(ప్రధాని) డొకచో బంపింప విద్యాధికుం
    డేక్చాతుర్యుడె!వ్యూహదూర సచివుం డిబ్బంది పాల్గాడె స
    ద్వాక్చాతుర్యము జూపి మంత్రివరు డబ్బా! వ్యర్థుడయ్యెన గదా!!

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా నుండి
    సమస్యాపాదంలో"డయ్యెన్ గదా"ఉండాలి, టైపాటు

    రిప్లయితొలగించండి
  30. ... ...శంకరాభరణం....
    03/04/2019 బుధవారం

    సమస్య

    వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుండయ్యెన్

    నా పూరణ. కం:

    ***** ***** **** **

    లెక్చరు దంచెను తిక్కగ

    ముక్చంపలు వేసుకొనెద!పోనిక సభకున్!

    దిక్చక్రమ్మున కడు దు

    ర్వాక్చాతురి జూపి మంత్రి వ్యర్థుండయ్యెన్



    😆😆ఆకుల శాంతి భూషణ్😁😁
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  31. దిక్చక్రము గెలిచెను తా
    వాక్చాతురి చూపి మంత్రి ,వ్యర్థుండయ్యెన్
    వాక్చాతుర్యము తగ్గగ
    దిక్చక్రము నందె తాను దెబ్బను తినియెన్.

    రిప్లయితొలగించండి
  32. కందం
    డేక్చాలో కూకన్ ప్ర
    త్యక్చేతనుడు భయభీతి తారసపడగా
    దిక్చక్రదిశన్ బలుకుచు
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్...

    రిప్లయితొలగించండి