21, ఏప్రిల్ 2019, ఆదివారం

సమస్య - 2993 (చినవాఁడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్"
(లేదా...)
"చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్"

106 కామెంట్‌లు:



  1. మునిమాపువేళ సంపం
    గి నవ్విన సమయములో రగిలిన సెగలతో
    చిన దాని పైన నరరే
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  2. విను! కన్నయ నన్నువిడిచి
    చనలేదే క్షణమయినను ! చల్లని కాజే
    సెనకో? వినలేను సుమీ
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి


    రమ్ము ప్రియుని ప్రకటన


    రమ్ము > దివిన్ సురాధిపతి త్రాగు సుధన్ మరపించు | రమ్ము గా

    రమ్ము నొసంగు సంఘమున | రక్త కణమ్ముల శుద్ధిజేయు | నా

    రమ్మును రూపుమాపును తురంగము నందు | పటుత్వ పుంస్త్వసా

    రమ్మును నింపివైచుగద రాసవిలాస రతాదులందునన్

    రమ్ము జగమ్మునందున గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా


    { తురంగము = మనస్సు }


    ---------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  4. కనివిని యెరుగని రీతిగ
    ఘనమగు యజ్ఞములు జేయు కాలా తీతున్
    వినుటకు చోద్య మటంచును
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  5. చనుబాలివ్వగ వచ్చిన
    వనితను జంపె, వలువల నపహరించెన జ
    వ్వనులు జలకమాడెడుతరి
    చినవాఁడోనరించెనా యిసీ దుష్కృతముల్.

    రిప్లయితొలగించండి
  6. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వినకే తల్లివి మాటలన్ పరులవౌ వెన్నల్ కడున్దోచుచున్
    తినుచున్ మన్నును తియ్యగా మురియుచున్ తీండ్రించి యొప్పారుచున్
    కనుచున్ పార్థుని మోహముల్ తుడుచుచున్ గానమ్ముతో శంకదీ
    ర్చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్

    రిప్లయితొలగించండి
  7. కందం
    చినవారల నుప పాండవు
    లను గురు పుత్రుండు గూల్చె రాగవిహీనుం
    డు నిజము, సద్విద్యల నే
    ర్చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి


  8. అనఘా! కన్నడు వీడలేదు క్షణమైనానన్ను !బొంకేలనో
    చినవాఁడే యొనరించెనా యిటుల? ఛీఛీ! పెక్కు దుష్కృత్యముల్
    పనిలేకన్ పసి వాని దంచు పలుకుల్ పల్కంగ నాస్వాంతమా
    యెనకో? ముద్దుల గోప బాలుడితడాయెన్వెన్నదొంగాయెనో?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ధనమును పంచెన? విరివిగ
    జనులకు మద్యమ్ము వోసె శత్రువు లగు యో
    ట్లను తీసివేసెనా? గెలి
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్.

    రిప్లయితొలగించండి
  10. చినవాడే యని యట్లొడిన్ గొనినఁ జాచెం చేయి ముద్దాడగన్
    చినవాడే యని చంక నెత్తుకొన ముంచెం గొంప కృష్ణుండహో!
    మునియోగీశమహేశ్వరాదులను సమ్మోహించి చిత్తమ్ము దో
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. అనయము పేదల సేవయె
    తనలక్ష్యమటంచు చెప్పి తద్దయు దృతితో
    గొని పదవిఁ బ్రజాళిని దో
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి

  12. మైలవరపు వారి పూరణ

    చనఁ గోపమ్మున బాలకృష్ణకృతదౌష్ట్యంబెల్ల దెల్పన్ వ్రజాం...
    గనలన్ గాంచి యశోద వారికి నమస్కారమ్ములన్ జేసి యి...
    ట్లనె " నేనొప్ప ! నమాయకుండితడు , మా అబ్బాయి , ప్రేమార బెం...
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  13. చిననాటి నుండియును వల
    చినవాడే నేడు నిన్ను ఛీకొట్టేనా?
    చినదానా!హా!ప్రేమిం
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?

    రిప్లయితొలగించండి

  14. నా మాటకాదండీ ; ఆర్జీవీ మాట


    అనితర సాధ్యముగా తెలు
    గు నాట పార్టీని బెట్టి గుప్పిట రాష్ట్రం
    బునునిల్ప, కూఁతుమగఁడా
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [ఉత్తర గోగ్రహణ యుద్ధమున నర్జునుని యస్త్ర తతిచే మూర్ఛితులైన కౌరవ సైనికు, లట నేమి జరిగినదో యెఱుఁగఁజాలక, యుద్ధమందు గెలిచి, తమన ట్లుత్తరుఁడే మూర్ఛిల్లఁజేసి, తమ వస్త్రచ్ఛేదన మొనరించి యేఁగెనా? యని వితర్కించు సందర్భము]

    "తన తోఁబుట్టుకు బొమ్మపొత్తికలకై దండున్ సమీపించి, స్తీ
    ర్వినిఁ గీల్కొల్పిన సైన్య వస్త్రముల మేల్ దిష్ణ్యంపు భాగమ్ములన్
    గొని తా నేఁగెనె? యుద్ధమందు గెలుపుం గొంచున్న యీ మమ్ము గె
    ల్చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్?"

    రిప్లయితొలగించండి


  16. కన్నడి వలలో పడటానికి కారణమతడా నా మదియా !
    గోపెమ్మలార చెప్పండి !


    అనుమానమేను! నా చ
    ల్లను కొల్లయు గొట్టి మీదు లసితముఖుండై
    మనసునుదోచుచు చిలుకుచు
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. చనువు న మెలగుచు చెలిమిని
    ఘనముగ నటి యించి మెప్పు గాంచిన పిదప న్
    ధనమును సమయ మెరిగి దో
    చిన వాడోఁన రించె నా యి సీ దుష్కృతము ల్

    రిప్లయితొలగించండి


  18. మనువాడి ముచ్చటలు తీ
    రి నిండు మూణ్ణెల్లు కాలె! రివ్వున వేవి
    ళ్ళననేమందును మదిదో
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    ఘన యవధానియె నిరతము
    మనమున నా వాణి గొలుచు మహితాత్ముండే
    శని కాదే యమెరిక బ
    న్చినవాడొనరించెనా యిసీ దుష్కృతముల్?!

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా సత్యనారాయణ
    ఘన విద్యాలయమందు పెంపొసగగా గావించుడీ బోధ నం
    చననౌరా!నిజ బోధ మాని పరదేశా శౌచ సిద్ధాంతమున్
    మనిపేరో, ముకుపచ్చలారవుగదా మత్పుత్రుడాత్మాహుతిన్
    జినవాడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కుదుష్కృత్యముల్?!

    రిప్లయితొలగించండి
  21. అనితరసులభముగానది
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్
    యని యచ్చెరునొందెనదే
    కనగను నాని సినిమాను, కలఁతపడె జనుల్

    రిప్లయితొలగించండి
  22. తల్లి లేని పిల్ల వాడని తన చెల్లెలి కొడుకును సాకగా అతను పెరిగి పెద్ద వాడయి తన కూతురునే చెరచగా ఒక తండ్రి ఆవేదన

    కని, సుతుని తల్లి స్వర్గం
    బునకు వెడలగా, సహజకు పుత్రుండ ని నే
    మనుచితిని నక్కటా! పెం
    చినవాఁ డొనరించె నా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  23. తన వాడని మది పొంగుచు
    తన సర్వస్వము నతనికి తానిచ్చెనుగా
    తన వెనుకనె పన్నుచు వల
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  24. చినదానివన వినక న
    చ్చిన వాడని గుడ్డి ప్రేమ చెఱఁబడి, నిన్ మె
    చ్చిన వాడంటివి మనసి
    చ్చిన వాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (రావణాసురుడు ఆంజనేయుడు లంకాదహనం చేసిన వేళ పలికిన మాటలుగా...)

      చినదౌ కోతి నశోకపున్ వనిన జొ
      చ్చెన్, చేబట్టన్ మహా
      ఘనలౌ రాక్షస వీరులంత పరలో
      కాధ్వమ్మునే బట్టిరే!
      విన నాశ్చర్యము! లంకకొక్కడు మహా
      ప్రేషమ్మయెన్ తోకఁ గా
      ల్చిన వాఁడే యొనరించెనా యిటుల ఛీ
      ఛీ పెక్కు దుష్కృత్యముల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వనిని' అనండి.

      తొలగించండి
  25. ఈ రోజు శంకరా భరణము సమస్య

    చినవాఁ డొన రించె నా యిసీ దుష్కృతముల్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    చిన్ని కృష్ణుడు పాలు వెన్న దొంగిలించె నని గొల్ల స్త్రీలు యశోదతో గొడవ పడుచుండగా నా బిడ్డను నేడు రోటికి కట్టి వేశాను ఈరోజు ఇంటిలోనే ఉన్నాడు ఈ రోజు దొంగ తనము చేశాడని మీరు అబద్ధము లాడుతున్నారు అని కోపముగా పలుకు సందర్భం

    పెరటిలో కట్టిన పెయ్య దూడల నెల్ల వదలి గోవుల చెంత, పొదుగు లందు
    పాలు లేకుండగ పాపడు చేసెనా? దాచిన వెన్నను దోచి శిక్య
    మందు పిడతలను చిందు వందునిడెనా? నిదురించు జనముల నెఱక బట్టి
    ముడులను వేసెనా? గొడవ పడగ నేల మగువ లారా! మీదు మాటలను వి
    న, చిన వాఁడొన రించెనా యిసీ దుష్కృతముల్, నాదు బిడ్డడు ముదము తోడ

    నాడు కొనచుండె పెరటిలో, తాడు తోడ
    కట్టి వేసితి నతనిని కదల కుండ,
    నేడు దొంగిలించె ననుచు నెపము లేల?
    ననుచు పలికె యశోదమ్మ నతిఘ తోడ

    రిప్లయితొలగించండి
  26. వినుడీకలియుగమందున
    చినవాడొనరించెనాయిసీదుష్కృతముల్
    ననుదినమిటులేయుండును
    చినపెదయననేమిలేదుచెడ్డలుసేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగ్న్నది. అభినందనలు.
      'దుష్కృతముల్ + అనుదిన' మన్నపుడు నుగాగమం రాదు.

      తొలగించండి
  27. శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏
    శ్రీకృష్ణ లీలలు..యశోద భాగ్యం...నా పూరణ.

    వనితలు కన్నయc నిందిం
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్
    యని వారిని వారించుచుc
    దనయుని జడుడని యశోద దలపుట భాగ్యమ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగ్న్నది. అభినందనలు.
      'కన్నయ్య' తరువాత అరసున్న అవసరం లేదు. 'దుష్కృతముల్ + అని' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు. సరి చేసుకొనెదను.🙏🙏🙏

      తొలగించండి
  28. పెను మంటలు రేపెఁ బురిని
    గనివిని యెఱుఁగని విధముగఁ గక్షలు రేపెన్
    జన హృదయమ్ముల నీ పం
    చిన వాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్


    అనిపెం గాశికి నిర్దయం జెలఁగి యన్యాలాపముల్ పల్కుచున్
    ఘన వేశ్మంబును గాంచ రమ్మనుచు నక్షద్యూత మాడించెనే
    విన యాధీనుల ధర్మ మెంచకయె నిర్భీతిన్ వెసం దమ్ము పెం
    చిన వాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్

    రిప్లయితొలగించండి
  29. మనమున శివభక్తి గలిగి
    అనితరముగ గిరిజతోడ హరునే గొనుచున్
    ఘనమౌ గిరి మోయుచు నడ
    చిన వాడొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఘనమౌ జంద్యము నూనుచున్ తరలుచున్ కైలాస యాత్రంచుచున్
    కినుకన్ బూతులు తిట్టుచున్ ప్రబలమౌ ఘీంకారమున్ జేయుచున్
    కనుచున్ మోడిని కౌగిలించుచును భల్ కన్గొట్టు ధీమంతుడౌ
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్

    రిప్లయితొలగించండి
  31. అనునిత్యమ్మును పాలువెన్నలవి యాహారించుచున్ కొంటెయై
    ఘనుడౌ శైలధరుండు గోపికలతోకావింప శృంగారమున్
    చని నిందించగ వారు , తల్లి కడునాశ్చర్యమ్ముతో పల్కె "నా
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్"?

    రిప్లయితొలగించండి
  32. అనుయాయుండ్రను వెంట బెట్టుకుని సంహారమ్ము సాగించెనా
    ధనమున్ భూరిగ పంచెనా జనులకే మద్యమ్ము నే పోసెనా
    వినయమ్మున్ నటియించు నేతయె యిలన్ విద్రోహియా చెప్పు గె
    ల్చినవాఁడే యొనరించెనా యిటుల ఛీ ఛీ పెక్కు దుష్కృత్యముల్

    రిప్లయితొలగించండి
  33. అనిలో భీష్మునిఁ గూల్చెనా? నరుడు తానాడంగి సాయమ్ముతో
    ఘనుడౌ కర్ణుఁ వధించెనా? యనిని చక్రమ్మెత్తెడిన్ వేళలో
    కనగన్ శూరుడు శ్వేతవాహనుడటన్ కయ్యమ్ముఁ బెట్రేగి గె
    ల్చినవాడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్.

    రిప్లయితొలగించండి
  34. ( సత్యభామ తన సఖితో )
    ఘనపారిజాత కుసుమము
    నను గాదని రుక్మిణికిడె నాథుడు శఠుడై ;
    మనమును నభిమానము దో
    చిన వాడొనరించెనా ? యిసీ ! దుష్కృతముల్ .
    ( శఠుడు - కుత్సితుడు ; దుష్కృతముల్ - చెడుపనులు )

    రిప్లయితొలగించండి
  35. చనుబాలిచ్చిన చానఁ జంపె, నదిలో స్నానించు నవ్వేళలో
    ప్రణతుల్ గోరుచు అంగనాంబరములన్ లంకించెనా? సత్యమా?
    యనునిత్యమ్మును వెన్న మీగడల తానంకించెనా గొల్లడా
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్.

    రిప్లయితొలగించండి
  36. వనసంచారంబున నా
    మనసును నాకట్టుకొనుచు మైమరపున తా
    జనువుగ జేరగనే "వల
    చినవాడొనరించెనా! యిసీదుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  37. జనియిం చినప్ప టి మొదలు,
    యినకులమందు రఘురాముడెంచిన రీతిన్
    జనకుని యాజ్ఞను పాటిం
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగ్న్నది. అభినందనలు.
      'మొదలు + ఇనకుల = మొదలినకుల...' అవుతుంది. "మొదలె యినకుల..." అనండి.

      తొలగించండి
    2. . శ్రీ గురుభ్యో నమః
      శంకరాభరణం-సమస్యాపూరణ 21.4.2019
      సమస్య :: చినవాడే యొనరించెనా యిటుల ఛీ ఛీ పెక్కు దుష్కృత్యముల్.
      గోపికల ఆరోపణలకు యశోదమ్మ స్పందన.

      “చినవాడే? సరసుండు కృష్ణు డతిగా చిత్రమ్ముగా మమ్ము నే
      చినవాడే” యనగా; యశోద యనె “మా చిన్నారి వ్రేపల్లెఁ బ్రో
      చినవాడే, ఘన పూతనాదుల వెసన్ శిక్షించి మోక్షమ్ము ని
      చ్చినవాడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్!”
      కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరుజిల్లా.

      తొలగించండి
    3. చిరకాల దర్శనము రాజ శేఖర్ గారు. చాలా సంతోషము.

      తొలగించండి


    4. చాన్నాళ్ళ తరువాయి కోటవారి‌ దర్శనమ్ !


      జేజేలతో

      వెల్కం బెక బెక !


      జిలేబి

      తొలగించండి
    5. రాజశేఖర్ గారూ,
      హృదయపూర్వక నమస్కృతులతో పునఃస్వాగతం.
      మనోహరమూ, అద్భుతమూ అయిన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    6. గురువర్యులగు శ్రీ కంది శంకరయ్య గారికి , శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి, శ్రీయుతులు జిలేబి గారికి , శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీమతి గుఱ్ఱం సీతాదేవిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రణామాలు.

      తొలగించండి
  38. చినవాడేయొనరించెనాయిటులఛీఛీపెక్కుదుష్కృతముల్
    చినవాడైననుబుద్ధిలోఘనుడుఛీఛీఛాలుజూడకెప్పుడున్
    మొనగాడౌచునునన్నివేళలనుదామూర్ఖంబుగానుండుచున్
    వినయంబించుకలేకయేమసలిదాపీడించునెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  39. దుష్కృత్యముల్
    గాచదువప్రార్ధన

    రిప్లయితొలగించండి


  40. అనఘా! తాకంగనె వి
    ల్లును భళ్ళున విరిగెనట పలురకములుగ! నీ
    శునిమాయ? నయోధ్యాపురి
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. చను నీయం జనుదెంచు పూతనను దా జంపెం గదా తన్ని యా
    ఘను వాహ్యాసురు గాలి దీసె సుడినే ఖండించె వత్సాసురుం
    దునిమెన్ ధేనుకు ద్రుంచె నా బకుని పోద్రోచెం గదా కంస నా
    "చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్?
    మననీయం దగదోయి వాని" ననియెన్ మామయ్య కంసుం డహో.

    రిప్లయితొలగించండి
  42. విని రామాయణ మొక్క మూర్ఖు డనియెన్ వేటాడెనా స్త్రీని? శం
    భుని చాపమ్మును ద్రుంచెనా? మగువకై వాపోయెనా? చాటుగా
    జని కోతిం బడగొట్టెనా? విడచెనా జాయన్వనిన్? వేల్పు! మిం
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్.

    రిప్లయితొలగించండి
  43. అనయము నటనల తోడను
    వినయము చూపుచును తానువిత్తము నెల్లన్
    ఘనముగ దోచెను ఛీ వల
    చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

    రిప్లయితొలగించండి
  44. కృష్ణలీలను విన్న కంసుని మనోగతము

    చిననాడే మన రాక్షసాధిపుల శిక్షింపంగ చిత్రంబుగన్
    ఘనశైలంబును పైకినెత్తగను దాక్రీడారతిన్ ఛత్రిగన్
    దనవౌ పాదపుముద్రలన్ విడచి సత్కారంబు సేయన్నహిన్
    గనగా నన్నియు నెన్నరానివగు దుష్కార్యంబులన్ భూమి గా
    చినవాడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్
    యనమానంబది లేదులేదు యతడేనారాతి కృష్ణుండగున్

    రిప్లయితొలగించండి
  45. అవధాని శ్రీ కోట.రాజశేఖర్ గార్కిహృదయపూర్వక
    స్వాగతాంజలులు.

    రిప్లయితొలగించండి
  46. మత్తేభవిక్రీడితము
    వినగన్ దండ్రియె నిందజేసి హరునిన్, వేదించ దాక్షాయినిన్
    మనలేనంచును యజ్ఞగుండమున భస్మమ్మయ్యె వైరాగ్యభా
    వనలన్, దేవతలున్ మునుల్గనఁ బ్రజాపత్యంపు గర్వాన పెం
    చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్!

    రిప్లయితొలగించండి