8, మే 2019, బుధవారం

సమస్య - 3012 (కుంజర యూధంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్"
(లేదా...)
"కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్"

71 కామెంట్‌లు:

  1. రంజన చెడి మోడీ - అరి
    భంజనుడై జగను కొరకు ప్రాల్పడెనకటా !
    సంజాయిషీలు ఇత్తురె !
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
    ( మోడీ గారికి క్షమాపణలతో )

    రిప్లయితొలగించండి


  2. గంజాయి తాగి గిరసల
    సంజాతల మత్తుగాంచి సన్నబడితివా!
    పింజారీ యెక్కడ్రా
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ప్రాతః కాలపు సరదా పూరణ:

    (అమోఘ కవి అవధానివర్య శ్రీ బండకాటి అంజయ గౌడు గారికి అంకితం)

    బంజర హిల్ల్సు దాపునట భారతి నామపు టౌను హాలులో
    జంజట జేయనెంచుచును ఝమ్మని పృచ్ఛక యోధులెందరో...
    అంజయ గౌడు గొంతుకను హైరన జేయుచు నాపజూచిరే:
    "కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్"

    🙏

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    పుంజితపాలనానుభవమూర్తులు ధీరులు స్వీయపాలనా
    రంజితపాలితుల్ కలసి రాజ్యమహోన్నతపీఠమందు బా...
    లుం జననేత జేయగ విరోధిని నెంచుట వింత ! చూడగా
    కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. రంజిలఁ జేయుచుఁ బూరణ
    లం జూపిరి యీ మొబైలులం జిత్రముగన్
    సంజయ! కలియుగముం గవి
    "కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్"

    రిప్లయితొలగించండి
  6. గుంజెను జుత్తును బట్టుక
    భంజించెను నేలగూల్చి బాలుడు కంసు
    న్నంజన్నా యేమందును
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. పుంజుకొనుచు పోరు ననిని;
    నంజుకొనును రుధిర మేది నల్లుల వలెనే ?;
    ముంజె లిచటివేమాయెను?
    కుంజర యూధంబు ; దోమ ; కుత్తుకఁ జొచ్చెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అంజన! కాంగ్రెస్ యోధులు
    రంజనచెడి బాబుతోడ లాలూచీతో
    భంజను లైరౌర! కనన్
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  9. మంజుల మధురామృతుడై
    పంజరమున రామదాసు బంధితుడయ్యెన్
    పెంజీకటి క్రమ్ముకొనన్
    *కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.*

    పంజరము=చెరసాల

    రిప్లయితొలగించండి
  10. గుంజెను మాటిమాటికీని గుండెను కంసుని కృష్ణభీతియే
    రంజన మాసిపోయినది రాక్షస కృత్యము లెల్ల వ్యర్థమై
    భంజనుడాయె తుట్టతుద బాలుని చేతను పాపకర్ము డా
    కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్.

    రిప్లయితొలగించండి
  11. *అనసూయ పాతివ్రత్య వ్రతాన్ని భంగమొనర్చ భిక్షుకులై త్రిమూర్తులు అత్రి ఆశ్రమం చేరిన సన్నివేశం*

    కుంజముఖులు గోరిరనుచు
    రంజిలు గుణధాము లపుదు రమణి వ్రతమ్మున్
    భంజన మొనర్చ చేరుట
    కుంజర యూధంబు దోమ కుత్తుక జోచ్చెన్

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. పంజన సమస్య యిప్పుడు
    రంజిల్లుచు శంకరాభరణమున జొచ్చెన్
    మంజుల ! పురోగతియె యిది
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    పంజన= శ్రేష్ఠమైనది (ఆం.భా)

    రిప్లయితొలగించండి
  14. (సత్యపాలన కోసం రాజ్యం విడిచి సతీసుతుల నమ్మి
    కాటికాపరైన హరిశ్చంద్రుని చూచి విశ్వామిత్రుడు తనలో )
    అంజలినొగ్గు నెల్లపుడు ;
    నాదరమొప్పగ గారవించు నన్ ;
    గంజదళాక్షి పుత్రులకు
    గష్టమొనర్చెను చక్రవర్తియే ;
    వింజము వోలె నిల్చెకద
    వీరుడు నేటికి గాటికాపరై ;
    కుంజరయూధ మొక్కటిగ
    గూడియు జొచ్చెను దోమకుత్తుకన్ .

    రిప్లయితొలగించండి
  15. అంజని బుత్రుడు నా యప
    రంజిత లంకకు జనియెను, రాక్షస కులమున్
    భంజన జేయగ నొప్పెను
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  16. రంజిల నోటరు నెన్నిక
    వింజామరవీచు కలుపు వేడిగటీలన్
    గంజిని ద్రాగున్నకటా!
    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్



    రిప్లయితొలగించండి
  17. లంజకొడకా యనుచు మరి
    రంజింపగ చెప్ప రామలింగడు గానే
    అంజు కలిగె హా నావిధి
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  18. మంజుల భావము లు డి గియు
    భంజన మొనరింప గడ గి పగ గొని యల్పు న్
    గుంజు కొని వెడల నది య గు
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  19. కంజదళాక్షుఁడు నరుఁడు రి
    పుంజయు లట లేక పాండు పుత్రులు కట్టా
    భంజితులే నిర్బలుచేఁ
    గుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్


    భంజన మేల యిప్పు డను బల్కుల, పశ్చిమ తీర పుణ్య దే
    శాంజన రాజ యోధప వరాంకుశి చోదితమై కడున్ వెసం,
    బింజర దృష్టి నే నఱవఁ బెద్ద యెలుంగున, వీటి లోనికిం
    గుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను, దోమ కుత్తుకన్
    [అంజనము = సౌవీర దేశము; వీడు = శిబిరము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 14/8/2016 నాటి పూరణములు:

      కంజ దళాక్షున కత్యను
      గుం జెలువుం డోడెను గలఁకున బోయలకే
      యంజని సుత ధ్వజుండును
      గుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్


      కంజదళాక్ష సఖుఁడు నరి
      భంజనుఁ డర్జునునిఁ దక్క పాండవుల నటన్
      భంజించె సైంధవుఁ డకట
      కుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్


      అంజన మద్ది జూచిన మహాద్భుత మియ్యది కాన నేర్తుమే
      పుంజు కొనంగ బాహు బలమున్ మశకమ్మున కెట్లు శక్యమౌ
      గుంజది లేక యుండినఁ బ్రకోపపు మాటలు గాక యెక్కడా
      కుంజర యూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్?

      తొలగించండి
  20. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గుంజుచు శిస్తులెల్లడును గుప్పిడి లోనను మూతబెట్టుచున్
    మంజిర నీళ్ళ నివ్వకను మందల వోటులు దోచుటందునన్
    డంజనులందు దూరుచును డబ్బుల నిచ్చిరి నాయకోత్తముల్:
    "కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్"

    రిప్లయితొలగించండి
  21. వంచన పరుల కుతంత్రము
    మంచిగ పాలన నెరపెడి మారాజు పరుల
    పంచన జేర్చె గదకటా
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  22. రంజిలగమామనంబులె
    యంజయగురుసెప్పగవితనాశువుగాగన్
    నంజయధారణకటకవి
    కుంజరయూధంబుదోమకుత్తుకజొచ్చెన్

    రిప్లయితొలగించండి
  23. అనుసరించుచుగురువర!యదనుజూచి
    కొల్లగొట్టెనుమీఫోనుగుజనుడొకడ
    యేమిలాభమోవానికినేమొకాని
    మనకుకష్టముపేర్లనుమరలవ్రాయ

    రిప్లయితొలగించండి
  24. కందం
    పుంజుకొనెడు వ్యూహమ్మున
    సంజకు కాంగ్రెసు కుమార సామిని జేరెన్
    రంజిల కర్నాటకమున
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  25. ఉత్పలమాల
    రంజిలి యెన్నికన్ గెలిచి రాష్ట్రము నేలెడు నాశ చావగన్
    పుంజుకొనంగ వ్యూహమున మొగ్గుచు చేరి కుమార సామినిన్
    సంజకు గద్దెనెక్కగను సాగెను కాంగ్రెసు నిల్ప భాజపాన్
    కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్

    రిప్లయితొలగించండి
  26. కంజదళాక్షీవినుమిక
    ఝంజాటమ్మేలనాకు జనహితమొదవన్
    రంజిల పూరణరాదయె
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్!!

    రిప్లయితొలగించండి
  27. తంజాపురి నగర జనులఁ
    రంజింపగ వచ్చె ఘనులు రాగములొలుకన్
    కంజారముఁ జూడఁ దలచె
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  28. అంజలి! శ్రీత్రయంబు యతి యత్రి సతీమణి దీక్షనే యికన్
    భంజన మందజేయమని భర్తల గోరుచు బంపగా భువిన్
    రంజిలు శోభలన్ విడి పరాత్పరులే యన సూయఁ జేరగా
    కుంజర యూధమొక్కటిక గూడియుఁ జొచ్చెను దోమకుత్తుకన్.

    రిప్లయితొలగించండి
  29. రంజింపజేయుసినిమా
    పింజంబున దోమగాగ!విఠలాచార్యుం
    డంజనమున మార్పులతో
    కుంజరయూధంబు దోమకుత్తుకజోచ్చెన్ (మాయజాలపు తంత్రాలతో)

    రిప్లయితొలగించండి
  30. అంజనవింటివేయిదియయార్యులుసెప్పిరినిశ్చయంబుగ
    న్గుంజరయూధమొక్కటిగగూడియుజొచ్చెనుదోమకుత్తుక
    న్గుంజరయూధమా?యకటకూరిమిదూరుటదోమకుత్తుక
    న్రంజిలజేయునేవినగరాగలభావితరంబులన్దగన్

    రిప్లయితొలగించండి
  31. మంజీర నాదము వినగను
    రంజిల్లు మదిని మురియుచు లౌల్యము తోడన్
    భంజన జేయగ వనితలు
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  32. మంజుల భాషిణి సీతను
    అంజన పుత్రుడు వెదకుచు నబ్దిని దాటన్
    భంజన జేయగ నసురుల
    కుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  33. కం. రంజింపకామధేనువు
    గుంజినకౌశికునిమనసు, గోవునులాగన్
    వింజగ సేనంతమయెను
    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్ .

    Note: వసిష్ఠుని కామధేనువాపహరింప కౌశికు పరాభవం ఇతివృత్తం గా వ్రాసిన పద్యం

    రిప్లయితొలగించండి
  34. కంజారుని తీక్షణకర
    సంజాతపువహ్నిసోకి సంకటపడచున్
    రంజనికుటమునదాగెను
    కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్

    రిప్లయితొలగించండి
  35. అంజలి గూర్చునెల్లపుడు హాసమువీడరు మోమునందునన్
    రంజుగ పాదముల్ గడుగు రాగముమీరగ కర్మచారులన్
    గంజినిద్రాగగా వెరపుగాంచరు క్షౌరముజేయగా మరిన్
    సంజయ!నాయకాగణమ సాధ్యమునెంచరు గెల్యనెన్నికన్
    కుంజరయూధ మొక్కటిగ గూడియు జొచ్చెను దోమకుత్తుకన్

    రిప్లయితొలగించండి
  36. రంజనమైన పాలన కలాధరుడిచ్చునటంచు తల్చగా
    నంజుకొనెన్ ప్రజా ధనము నంజుడుదిండిగ మారిచెచ్చెరన్
    సంజయ! కాంగెరీసుకు స్వశక్తియడంగగ వాని చేరెనే
    కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్

    రిప్లయితొలగించండి
  37. డా.పిట్టా సత్యనారాయణ
    అంజన!స్వచ్ఛ సుభారతి
    రంజిల వేవేల జనులు రాల్చిరి చెత్తన్
    భంజనులై మశకమునకు
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టా సత్యనారాయణ
    పంజరమట్టి రాష్ట్రముల బాగును గోరెడు కేంద్ర పాలనా
    రంజన మానియున్ తెలుగు రాష్ట్రమునందున గూడి కూటమిన్
    పుంజుకొనంగనాయె "విధిని బోలిన సత్తువ "యేది యెంచగన్?
    కుంజర యూధ మొక్కటిగ గూడియు జొచ్చెను దోమ కుత్తుకన్!

    రిప్లయితొలగించండి
  39. మిత్రులందఱకు నమస్సులు!

    [కాశీపట్టణమును నివాస మొనర్చుకొనుటకై తగు పరిస్థితులఁ గల్పించుటకు రవి నలినజ ప్రమథజన విఘ్నేశాదులఁ బంపఁగా, నట వారలకు నవకాశము లభింపమి, శివుఁడు విష్ణువును సపరివారముగఁ బంపెను. ఇందఱు దేవతలు ఆ చిన్న కాశీపట్టణములో ప్రవేశించుట, దోమ గొంతున నేనుఁగుల గుంపు ప్రవేశించినట్లున్నదనుట]

    కంజభవున్ రవిన్ బ్రమథగణ్యుల విఘ్నవినాయకాదులన్
    భంజన సేయఁ గాశికనుపంగను వారలు మిన్నకుంటచే
    రంజనతోడఁ బంపె హరి లక్ష్మి ఖగేంద్రులఁ! బోల్చి చూడఁగన్
    గుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్!!

    రిప్లయితొలగించండి
  40. మంజుల "జూ" లో దిరుగుచు
    రంజుగ "నెల్ఫెంట్సు గ్రూపు" రయమున రాగా
    గుంజెను "సెల్ఫోన్ ఫోటో"
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.

    రిప్లయితొలగించండి