31, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3120 (ప్రకృతి వినాశనంబె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు"
(లేదా...)
"ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారం కానున్న సమస్య)

30, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3119 (ఏనుఁగు చంపఁ జాలదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఏన్గు చంప నోప దెలుకనైన"
(లేదా...)
"ఏనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్"
(డా. వెల్దండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

29, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3118 (బారునఁ గూర్చున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్"
(లేదా...)
"బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్"
(డా. వెల్దండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

28, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3117 (ఎగ్గుసిగ్గుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు"
(లేదా...)
"విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్"

27, ఆగస్టు 2019, మంగళవారం

సమస్య - 3116 (ఎక్కడిదీ మేధ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్"
(లేదా...)
"ఎక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడనివాని కివ్విధిన్"
('శంకరాభరణం' వాట్సప్ సమూహ మిత్రులకు ధన్యవాదాలతో...)

26, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3115 (దుర్వినయమ్ముతో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్వినయమ్మునను మనసు దోచెదరు హితుల్"
(లేదా...)
"దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా"
('పద్యానంద లహరి' గ్రంథం నుండి)

25, ఆగస్టు 2019, ఆదివారం

ఆహ్వానం


సమస్య - 3114 (పాపము దక్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్"
(లేదా...)
"పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్"

24, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3113 (వారిజపత్రమే తగిలి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్"
(లేదా...)
"వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

23, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3112 (అభయ మొసఁగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు"
(లేదా...) 
"అభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే"

22, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3111 (కాలాతీతమునఁ గలుఁగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్"
(లేదా...)
"కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్"

21, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3110 (మిత్తికిన్ ముఖ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట"
(లేదా...)
"తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్" 
(నిన్న హైదరాబాదు, అమీర్‌పేటలో అముదాల మురళి గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

20, ఆగస్టు 2019, మంగళవారం

ఆహ్వానం

అష్టావధానము
అవధాని : శతావధాని ఆముదాల మురళి
అధ్యక్షులు : శ్రీ ప్రొద్దుటూరు ఎల్లారెడ్డి గారు
వేదిక : ఏ. ఎస్.రెడ్డి స్పోకన్ ఇంగ్లీషు సెంటర్, మైత్రీవనం, అమీర్ పేట, హైదరాబాదు.
తేది: 20-8-2019 ఉదయం 10.00 గం.

సమస్య - 3109 (అంఘ్రిద్వంద్వము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్"
(లేదా...)
"అంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్"

19, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3108 (వాన లెన్నియో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాన లెన్నియో కురిసె పిపాస పోదు"
(లేదా...)
"దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"

18, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3107 (భద్రగిరీశునిన్... )

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్"
(లేదా...)
"భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా"

17, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3106 (కాంతను వలచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతను వలచి యోగిగా గణుతికెక్కె"
(లేదా...)
"కాంతాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

16, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3105 (గాధిసుతునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాధిసుతునకు మేనక కన్నతల్లి"
(లేదా...)
"మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్"

15, ఆగస్టు 2019, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)


శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం,
టెలీఫోన్ కాలనీ, కొత్తపేట. హైదరాబాదు
తేదీ. 15-08-2019 (గురువారం)
సాయంత్రం 6.30 గం.లకు
సహజ కవి
శ్రీ  బండకాడి అంజయ్య గౌడ్ గారి
అష్టావధానం
సంచాలకులు - శ్రీ చింతా రామకృష్ణారావు గారు
పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి - శ్రీ కంది శంకరయ్య గారు
సమస్య - శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
దత్తపది - శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
వర్ణన - ధనికొండ రవిప్రసాద్ గారు
ఆశువు - శ్రీ చిటితోటి విజయకుమార్ గారు
న్యస్తాక్షరి - అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు
వారగణనం – శ్రీ చక్రపాణి గారు
అప్రస్తుత ప్రసంగం - శ్రీ విరించి గారు

అందరూ ఆహ్వానితులే

నిషిద్ధాక్షరి - 48

కవిమిత్రులారా,
అంశము - స్వాతంత్ర్య దినోత్సవము
నిషిద్ధాక్షరము - సకారము ('స', దాని గుణితములు, సంయుక్తాక్షరములు)
ఛందము - మీ యిష్టము.

14, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3104 (పువ్వులలో జ్వాల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్"
(లేదా...)
"మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో"

13, ఆగస్టు 2019, మంగళవారం

సమస్య - 3103 (మామకె మామగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్"
(లేదా...)
"మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్"

12, ఆగస్టు 2019, సోమవారం

దత్తపది - 160

కవిమిత్రులారా,
కాక - తాత - పాప - మామ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ 
రామాయణార్థంలో 
స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం వ్రాయండి. 

11, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3102 (భామ కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భామ కంటెఁ జిన్నదోమ మిన్న"
(లేదా...)
"భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్"

10, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3101 (కలిమి దొలంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము"
(లేదా...)
"కలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

9, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3100 (లలనలు సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్"
(లేదా...)
"స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్"

8, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3099 (మాతను భర్తగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్"
(లేదా...)
"మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్"

7, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3098 (మూఁడేఁడుల పిల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్"
(లేదా...)
"మూఁడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెన్ బ్రీతిమై"

6, ఆగస్టు 2019, మంగళవారం

సమస్య - 3097 (కల్లోలము సాగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్"
(లేదా...)
"కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్"

5, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3096 (కష్టములు దీర...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి"
(లేదా...)
"కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్"

4, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3095 (కలము విడిచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలము విడిచి మేటి కవిగ వెలిఁగె"
(లేదా...)
"కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై"

3, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3094 (కవి నాశంబును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్"
(లేదా...)
"కవి నాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

2, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3093 (కల్లలే చెప్పుచుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కల్లలే చెప్పుచుండు నాకాశవాణి"
(లేదా...)
"ఔనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్"

1, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3092 (తొందరపడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"