5, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3096 (కష్టములు దీర...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి"
(లేదా...)
"కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్"

68 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  దుష్టుడు మోడి గెల్వగను దుఃఖము రాగను గుండెబాదుచున్
  శిష్టులు కాంగ్రెసోత్తములు సిగ్గును వీడుచు జంపుజేయుచున్
  నష్టము పెద్దలేదనుచు నవ్వుచు నేడ్చుచు వీతరాగులై
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్

  రిప్లయితొలగించు
 2. మైలవరపు వారి పూరణ

  ఇష్టమువచ్చినట్టులు మహీస్థలి గుంతలు ద్రవ్వ., బాల్యపుం...
  జేష్టలనాటలాడుకొను చిన్నకుమారుడు గుంతలో బడన్,
  దృష్టికి రాన్ , ప్రభుత్వము రహిన్ వెలి దీయగ తల్లిదండ్రులున్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించు
  2. భ్రష్టవిధానపాలనము బాధలకుం గురిచేయుచుండెనీ..
   నష్టము పూడ్చువారెవరనన్ మధురాపురమెల్ల కుందగా
   నష్టమినాడు పుట్టిన మహాత్ముడు ద్రుంచెను కంసదైత్యునిన్!
   కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 3. దుష్టులు వారు వంచకులు తోరపుబాధల ముంచుచున్ సదా
  నష్టము తోటివారల కనంతముగా ఘటియించు యత్నమం
  దిష్టము గల్గువారు పొరుగింట వసించెడి వారికీయెడన్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.

  రిప్లయితొలగించు
 4. ఊహ కందని బాధలు మోహ రించ
  నష్టము గలిగి నంతనె నలిగె మనసు
  నిముస మేరీతి గడచునో నివ్వ టిల్లు
  కష్ట ములుదీరఁ గన్నీరు గార్చి రడలి

  రిప్లయితొలగించు
 5. నష్టము చవిచూచిన వేళ నందన పతి
  యప్పులన్నియు తీర్చుచు నాదుకొనగ
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
  పరువు పోయినదనుచును బాధ తోడ

  రిప్లయితొలగించు


 6. కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
  నష్టముల లెక్క బెట్టి త్సునామి తీరు
  జీవితము దిమ్మ తిరిగెను; చింత జేయ
  బతుకు బండి సాగిలబడె భ్రాంతి గూడి


  జిలేబి

  రిప్లయితొలగించు
 7. తేటగీతి
  దేశ విభజనఁ దప్పులఁ దీర్చ నెంచి
  ప్రభుత కాశ్మీరమందున రభసఁ జేయ
  జనులు విద్యార్థు లాదిగ కనలి జాతి
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి

  రిప్లయితొలగించు
 8. శ్రీ గురుభ్యోన్నమః🙏

  "మనిషి సుఖవేళ నిన్నిటు మరచు నేమొ
  వేడెద కలిగించుమెపుడు వెతలు మాకు"
  అనుచు కుంతి,పాండవులంత కలిసి చేరి
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి

  రిప్లయితొలగించు
 9. దుష్ట 'సైకో'ను తుదముట్ట తొలగఁజేసి
  మహిళలందరు పాందె సేమమును మిగుల
  కష్టములుఁదీర;కన్నీరుఁగార్చి రడలి
  ప్రాణ కంటకమగు వాని భయము తొలగ.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహిళ లంద రందిరట సేమమును...' అనండి. వచనదోషం తొలగిపోతుంది.

   తొలగించు
 10. మనను బాధపెట్టిన నేత మారెను గద
  చింతలింక లేవని సంతసించిరి తమ
  కష్టములు దీరఁ ; గన్నీరు గార్చి రడలి
  ముందు ముందున రాబోవు ముప్పు దలచి

  రిప్లయితొలగించు
 11. దుష్టచతుష్టయ మ్మెటులఁ
  ద్రుంచుట పాండవ కోటి నంచు ని
  ర్దిష్టపు వ్యూహమేదియును
  తేల్చగ రాకను చూచుచుండ వి
  స్పష్టము సేయకన్ కురునృ
  పాలుడు,రాణియు పాండుసంతుకున్
  కష్టము లెల్లఁ దీరెనని
  కార్చిరి కంటను నీరు భీతితోన్.

  రిప్లయితొలగించు
 12. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సుష్టుగ వర్షముల్ కురిసి జూబిలి హిల్సున రోడ్డులన్నియున్
  భ్రష్టును పట్ట డ్రైవరులు భళ్ళున నేడ్చుచు గ్రుడ్లుకుక్కుచున్
  పుష్టిగ తిండికిన్ కొరత బొత్తిగ లేదని రైతులన్నలన్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్

  రిప్లయితొలగించు
 13. (బకాసురసంహారానంతరం పాండవులు తల్లితోపాటు వెళ్లుతుంటే ఏకచక్రపురప్రజలు)
  "దుష్టబకాసురున్ జెలగి
  దున్మెను భీముడు;నేకచక్రపుం
  గష్టములెల్ల దీరె"నని;
  కార్చిరి కంటను నీరు భీతితోన్
  "నష్టము లెవ్వి ముందగునొ ?
  నర్మిలి గాచెడి వీరుడెవ్వడో
  శిష్టు?"డటంచు పౌరతతి
  చింతిలె పాండవు లేగుచుండగన్.

  రిప్లయితొలగించు


 14. ఇష్టము వచ్చినట్లు తమ యిచ్చల తీర్చుకొనన్ తలాకనన్
  భ్రష్టయె జీవితమ్ములవి! భాజ్ప విదారక మైన యీ స్థితిన్
  స్పష్టము గాను మార్చుటకు చట్టము తెచ్చెను; మీననేత్రులే
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 15. హాయి గలిగెను మనసుల కలరు నట్లు
  కష్టములు దీర...కన్నీరు గార్చి రడలి
  చుట్టు ముట్టగ నిడుములు సుడుల వోలె
  దేవ దేవుని వేడిరి తీర్పు మనుచు

  రిప్లయితొలగించు
 16. ఉత్పలమాల
  నష్టనివారణంబనుచు నాశము జేయఁగ నుగ్రవాదులన్
  దాష్టిక దాడులన్ చెలఁగి ధాటిగ నా సరిహద్దులందునన్
  దుష్టుల పైన బాంబులను ద్రోయుచు గూల్చగ మ్రోతకున్ జనుల్
  గష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్

  రిప్లయితొలగించు
 17. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  *"కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను*
  *నీరు భీతితోన్"*

  సందర్భము: దేవకి అష్టమ గర్భంలో తనను హతమార్చే వా డుదయిస్తా డని ఆకాశవాణి చెప్పగానే కంసుడు ఆవేశం కట్టలు తెంచుకోగా చెల్లెలైన దేవకిని ఆమె భర్త వసుదేవుని చెరసాలలో బంధించినాడు. ఇక భయం లే దని నవ్వినాడు.
  కాని అతని రాణులు మటుకు దైవభీతితో కన్నీరు కార్చినారు. కంసుని పాప కృత్యాలు వా రెరింగినవే కాబట్టి అతడు దుష్టు డని అతనికి దైవభీతి లే దని వాళ్ళు వాపోయినారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అష్టమ గర్భ జాతు డట!
  అంతముఁ జేయున! టంచు దేవకిన్,
  శిష్టుని బావనున్ జెర వ
  సింపగఁ బెట్టి హసించెఁ గంసుడున్
  "గష్టములెల్లఁ దీరె" నని;
  కార్చిరి కంటను నీరు భీతితోన్..
  దుష్టుడు దైవభీతి రహి
  తుం డయొ కంసు! డటంచు రాణులున్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  5.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 18. నష్టమొనర్చి సంస్థలను నాశము జేసిన నాయకాగ్రణుల్
  దుష్టులు వారలే పదవి తోడుగ బొందిరి నేడు వారికిన్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్
  భ్రష్ట సమాజమౌననుచు భారముగా ప్రజ కృంగి పోవుచున్

  రిప్లయితొలగించు
 19. రావణ చెర లో జానకి రాము వీడి |
  పతి వియోగమున వగచె పడతి మిగుల |
  లంక నాధుని వధతోడ రాము గూడ |
  "కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి"

  రిప్లయితొలగించు
 20. అష్టమ శిశువై శ్రీ హరి యవతరింప
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
  దుష్ట కంసుని కందక దూర మేగి
  శిష్ట గోపాలకుల చెంత చేర్చిరపుడు

  రిప్లయితొలగించు
 21. కష్టముదాపురించినది కన్నులముందర నీటిముంపుతో
  నష్టమునొందె పంటలు వినాశనమొందెనురైతుజీవనం
  బిష్టముతోడ నిల్వనటఁ నెల్లరు రైతులకండదండగా
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.

  రిప్లయితొలగించు
 22. చంద్ర యాన ప్రయోగ విజయమున మన
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
  భారతీయుల కెటులనపార శాస్త్ర
  పటిమ గల్గెనోయనినీర్ష్య పడెను పాకి
  స్థాను ప్రభువులవాక్కయ్యె తాపమొందె

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాకిస్థాను' అన్నపుడు 'కి' గురువై గణదోషం. సవరించండి.

   తొలగించు
 23. ఉన్నఁ బుట్టువు మృత్యువు నుండు ననఁగ
  లోక బంధము తీరఁగ రోగమునకు
  లొంగి సుఖనిద్రఁ జేరఁగ నంగ సంగ
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి


  వృష్టి విధమ్ము భాగ్యములు వెల్లువ లై ప్రవహించునే వినా
  పృష్టము పుణ్య మున్న నన విత్తము దేవ నికాయ కల్పితా
  దృష్టము లింక స్పష్టమగ, దెప్పలుగన్ భువి నుండి పోవ వీ
  కష్టము లెల్లఁ, దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్

  రిప్లయితొలగించు
 24. కఱవురాక్షసి జగమంత కదలియాడ
  ప్రభుత గమనించి ధనమీయ వలసినంత
  కష్టములదీర గన్నీరు గార్చిరడలి
  పుడమి జనులార్య!సంతసపుబొంగుతోడ

  రిప్లయితొలగించు
 25. దుష్టుడు రావణాసురుడు తొయ్యలి సీతను లంక జేర్చుచున్
  భ్రష్ట గుణంబునన్ వివిధ బాధల వెట్టెను రాముడంత నా
  దుష్టుని గూల్చివేయ జయ దుందుభి మ్రోవగ వానరుల్ నరుల్
  'కష్టము లెల్లదీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్'!

  రిప్లయితొలగించు
 26. సుష్టుగ వర్షముల్ గురువ సౌరభమొప్పగ జేలుపండగన్
  గష్టములెల్లదీరెనని గార్చిరిగంటనునీరుబ్రీతితోన్
  బుష్టియెతిండిగింజలకు,భుక్తికిలోటదిగల్గరాదనే
  స్పష్టత వారిలో గలిగి సౌఖ్యపుజీవనమిచ్చగించిరే

  రిప్లయితొలగించు
 27. ఉత్పలమాల
  పుష్టిని గల్గి నార్టికలు పూర్తిగ రద్దని త్రీసెవెన్టినే
  స్పష్టము భారతావని కసాంప్రతమంచు వచించ కేంద్రమే
  నష్టము లేదు లేదనుచు నమ్ముచు కాశ్మిరు పండితోత్తముల్
  గష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్

  రిప్లయితొలగించు
 28. నష్టము వచ్చెనంచు తన నాకుడు చచ్చెను రోయిబాధతో
  నిష్టమటంచు చేసె కృషి నెందరు చెప్పిన నాలకింపకన్
  పుష్టిగ వానలే కురిసె భూరిగ పంటలు పండి యిప్పుడా
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.

  రిప్లయితొలగించు
 29. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి
  తే.గీ//
  రాజయక్ష్మము సోకగా రాలిపోవు l
  తల్లిదండ్రులు బిడ్డపై తల్లడింపు l
  హృదయవేదన కలుగంగ హృద్యముగను l
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి ll

  రిప్లయితొలగించు


 30. కొడుకు చదువు ముగిసినంత కొలువు దొరికె
  కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
  రిన్ని దినముల బాధలెల్ల యిక నుండ
  బోవటంచును మదినెంచి మురిసి రింట.

  : మరొక పూరణ
  దుష్ట మనస్కుడై యచట దోర్బల మొప్పగ చంపనెంచగా
  చేష్టలు గాంచి దేవకియు చింతను చేయుచు నుండ భర్తయున్
  యష్టమి నాడు పుట్టు సుతుడంతము చేయును కంసునంచనన్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది.
   రెండవ పూరణలో 'భర్తయున్ + అష్టమి' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించు
 31. . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం-సమస్యాపూరణం
  సమస్య :: కష్టములెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.
  (సుఖములలో ఉన్న భక్తుల మనోభావన)
  కష్టము లున్నచో మనకు కల్గును నిత్యము దైవచింతనల్,
  కష్టము లేనిచో కలుగు గర్వ మహంకృతి పాపభీతియున్,
  ‘కష్టమె కోరె కుంతి’ యనగా మనమెంత యటంచు సజ్జనుల్
  కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్.
  కోట రాజశేఖర్ నెల్లూరు. 5.8.2019

  రిప్లయితొలగించు