ప్రకృతి విధాత కల్పిత విభావరి కన్నులు కానకన్ జనుల్ నికటము గాను చేరి తన నిర్మలతన్ చెడ గొట్ట నిక్కమౌ ప్రకృతి వినాశనంబె! కడు పావన కార్యము మానవాళికిన్ సుకృతము గాను వచ్చిన వసుంధర రక్షణ సేయుటేగదా!
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.... *"అజ్ఞానమ్ము వికాసదాయక మహో రాగమ్ము పండించెడిన్"* మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.... Padyamairhyd@gmail.com *సమస్యాపాదంలో యతి?*
మిత్రులకు నమస్కృతులు. జ్వరం ఇంకా తగ్గలేదు. పూర్తిగా నీరసంగా ఉంది. డాక్టర్ వ్రాసిన మందులు వాడుతున్నాను. ఈరోజు కూడ సమూహానికి అందుబాటులో ఉండలేను. మన్నించండి.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
అమాయక విశాఖపట్టణం (1950s):
పకపక నవ్వుచున్ దవిలి భామల వెంటను కోతిచేష్టలన్
తికమక రీతులన్ పొగడి తిట్టుల సైచుచు కండ్లుగొట్టుచున్
సకలపు బీడి పీకలను చంగున రాల్చెడి రోడ్డు రోమియోల్
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్
ప్రకృతి = స్వభావము
నేను ఆకాశవాణి కి పంపినది
రిప్లయితొలగించండివికటము గాకపోవునె భువిన్ సుఖ శాంతులు,చేయబూనినన్
ప్రకృతి వినాశనంబె;కడు పావన కార్యము మానవాళికిన్
ముకుళిత హస్తులై,విమల భూరి వదాన్యత సాయమీయగన్
త్రికరణ శుధ్ధిగా నతుల దీన శరణ్యుల కాదరమ్మునన్.
చంపకమాల
రిప్లయితొలగించండివికలముఁ జెందగన్ విషము వెల్వడి నంతటఁ బాలవెళ్లిలోఁ
బ్రకృతి వినాశనంబె! కడు పావనకార్యము మానవాళికిన్
జకచకఁ జేయనెంచి గిరిజాసుత వైపునఁ జూడ నీశుడే
ముకుళిత హస్త యూచె తలఁ బూనెను దేవర నీలకంఠుడై
రిప్లయితొలగించండివలదు నాశనమిక చేయ వలదు వలదు
బెడిసి కొట్టును తప్పక పెల్లుబుకుచు
నరుల "కొప్పును", ప్రకృతి వినాశనంబు,
పట్టి లాగుచు నేర్పును పాఠములను!
జిలేబి
రిప్లయితొలగించండిప్రకృతి విధాత కల్పిత విభావరి కన్నులు కానకన్ జనుల్
నికటము గాను చేరి తన నిర్మలతన్ చెడ గొట్ట నిక్కమౌ
ప్రకృతి వినాశనంబె! కడు పావన కార్యము మానవాళికిన్
సుకృతము గాను వచ్చిన వసుంధర రక్షణ సేయుటేగదా!
జిలేబి
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపినది
నికరము గాను చెప్పెద వినిర్మల ధాత్రిని కొట్టి లోడుచుం
డ కటకటేను దక్కునిక డంబము వీడక బోవ తప్పదా
ప్రకృతి వినాశనంబె! కడుపావనకార్యము మానవాళికిన్
ప్రకృతికి చేరువై బతుకు బండిని శంభుని తోడు లాగుటే!
జిలేబి
అనపర్తి జిలేబి జిందాబాద్! ఈ రోజు మొట్ట మొదటగా చదువబడిన మీ పూరణకు అభినందనలు (Opening Batsman)
తొలగించండి👏
తొలగించండినమో నమః!
మీ ప్రోటీనోత్సాహములే మాకు బూస్టు బలము :)
జిలేబి
చం.మా.
రిప్లయితొలగించండిచకచక వాహనంబులను జప్పుడు సేయగ తోలుచుండ్రిలన్
సకలము రేడియేషనున జచ్చెను పక్షులనేకముల్ సదా
వికలమునొందుచుండగను వృక్షములెన్నియొ నేల కూలగా
ప్రకృతి వినాశనంబె కడు పావన కృత్యము మానవాళికిన్ .
.....రేసోజు మల్లేశ్వర్
వనపర్తి.
సుకృతము లెన్నిజేసిననుసూటిగపోటిగమాటలాడుచున్,
రిప్లయితొలగించండిప్రకృతిగతన్నుదాదలచిపాపపు భావనమూటగట్టితా
వికృతపుభాషవాడుచునుపెద్దలపిన్నలబాధబెట్టెడిప్రకృతి వినాశనంబెకడుపావనకార్యముమానవాళికిన్
కొరుప్రోలురాధాకృష్ణారావు, మీర్ పేట్, రంగారెడ్డి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రకృతి యనంగ చిత్తగును., బ్రహ్మమె సత్తగు., చింత జేయుచో
ప్రకృతిని సృష్టి చేసినది బ్రహ్మమె., బ్రహ్మమునందె లీనమౌ
ప్రకృతియె అంత్యమం., దది పరాత్పరరూపము ! పల్కరాదిటుల్
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చ: ప్రకృతిని రక్షసేసిననె ప్రాకటమౌ సుఖమిచ్చు నెప్పుడున్
రిప్లయితొలగించండిసకల ప్రజాళికీభువిఁ బ్రశాంతిని గూర్చుచు, నెంచ నెవ్విధిన్
ప్రకృతి వినాశనంబె కడుపావన కార్యము మానవాళికిన్?
వికల మనస్సుతోడ విని పించకు మెప్పుడు పొల్లు మాటలన్
మనము నందున సతతము మగువ బలిమి /
రిప్లయితొలగించండిధనము గాక మరింకొక ధ్యాస లేని/
*నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు*
వగతు నే తీరు నీ ప్రజ ప్రగతి మారె //
(పర్యావరణాన్ని పాడుచేసే దుష్టభావాలను తొలగించుకున్న మానవుణ్ణి జంతువృక్షపక్షిసంతతులు దీవిస్తాయి)
రిప్లయితొలగించండివికలములైన కార్యముల
బెల్లుగ జేసెడి ధూర్తభావనా
ప్రకృతివినాశనంబె కడు
పావనకార్యము మానవాళికిన్ ;
సకలము జంతుసంతతులు ,
చల్లనినీడల వృక్షజాతులున్ ,
శుకపికశారికాదులును
చొక్కపుదీవెన లొప్పనిచ్చెడిన్ .
రిప్లయితొలగించండిఆటవిడుపు గలభా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ముకుళిత హృత్సరోజమున పూరుషు రూపము గాంచనెంచగా
నికటమునున్న నాత్మభవు నివ్వెర పాటున తల్లడిల్లకే
వికల మనమ్మునన్ దవిలి వీర్యము చేకొని మాయదారియౌ
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్ 😊
గలభా జిందాబాద్ 😊
తొలగించండిసృష్టి యిచ్చివట్టి వనరులింకు నటుల
రిప్లయితొలగించండిపెక్కువగ వాడకనె వాని
బెంచు కొనుట
నరుల కొప్పును , ప్రకృతి వినాశనంబు
వారి జాతి మనుగడకే పాటుదెచ్చు
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
రిప్లయితొలగించండి*"అజ్ఞానమ్ము వికాసదాయక మహో రాగమ్ము పండించెడిన్"*
మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి....
Padyamairhyd@gmail.com
*సమస్యాపాదంలో యతి?*
శ్రీ మంద పీతాంబర్:
తొలగించండి*"అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్"*
తొలగించండినెనరుల్స్ పంపించితిమి !
జిలేబి
సమస్యా పాదము మార్చకుండ యతిని సాధించ వలెనని పృచ్ఛక మహాశయుల యాశయము కావచ్చు!
తొలగించండిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిజ్వరం ఇంకా తగ్గలేదు. పూర్తిగా నీరసంగా ఉంది. డాక్టర్ వ్రాసిన మందులు వాడుతున్నాను. ఈరోజు కూడ సమూహానికి అందుబాటులో ఉండలేను. మన్నించండి.
త్వరగా కోలుకోండి గురువు గారు 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలము కొల్లగొట్టుటయె స్వార్థపు చింతనె చూడ నన్ఙిటన్
రిప్లయితొలగించండిప్రకటిత శాస్త్ర యంత్రములు రాక్షస చేష్టలఁ గూల్చు నన్నిటిన్
వికటపు మేధ గ్రుడ్డిగను పెంచు చునుండె కీడు,సత్యమే
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్!
వికృతపు రీతులన్ ప్రగతి పేరిడి వృక్షములన్ని గూల్చుచున్
రిప్లయితొలగించండిఅకృతక శోభలన్ జెరిపి హర్మ్యములందు విమోహమందుటన్
ప్రకృతి వినాశనంబె; కడు పావన కార్యము మానవాళికిన్
సుకృతముగా దలంచి భువి సుందర రూపము రక్ష సేయుటే
వికృతరసాయనంబులిల వేలమువెఱ్ఱిగ వేయపంటలన్
రిప్లయితొలగించండిసకలమునందు కృత్రిమపు సంచుల వాడుక పెచ్చుమీరగన్
ప్రకృతిని నాగరీకతయె గ్రక్కున మ్రింగగ నంతకంతకున్
ప్రకృతివినాశనంబె కడు పావనకార్యము మానవాళికిన్!!!
తెరువు గల వానినే లోక మరుగదీయు
రిప్లయితొలగించండిఅరువు నిచ్చు వాణ్ణి మరి యమరు దనుదురు /
మెరుగు తరుగుల తేడాలు యెరుగ బోని
*నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు//*
వికృతపుచేష్టలన్జనినవేయివిధంబులుగానగున్సుమా
రిప్లయితొలగించండిప్రకృతివినాశనంబె,కడుపావనకార్యముమానవాళికిన్
సుకృతంబులేగడుంగడుగసొంపుగజేయుటనెల్లవారికిన్
బ్రకృతియనంగనేర్వుమికపార్వతిదేవిగభూతలంబునన్
---
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివికృతవినాశకృత్యములు పెచ్చెరిలిన్ సకలస్థలమ్ములన్,
రిప్లయితొలగించండిబ్రకటితశుభ్రతల్ గనగ మృగ్యములయ్యె,సుఖాలసత్వమై
వికలమొనర్చ నీ జననవీనకుసంస్కృతి, నైజమై దగెన్
బ్రకృతివినాశనంబె కడు పావనకార్యము మానవాళికిన్.
కంజర్ల రామాచార్య.
చీకుచింతలు లేకయే చెలిమినుంట
రిప్లయితొలగించండినరులకొప్పును,ప్రకృతివినాశనంబు
ముప్పుదెచ్చును నరులకుమొదటి కెసుమి
కాన రక్షించ బ్రకృతిని గద్దుమనకు
ప్రకృతి మాతయెగాచును ప్రజల నెల్ల
రిప్లయితొలగించండిదాని కాపాడుటే మన ధర్మ మనుచు
నెల్ల వారల బూనగాచెల్లు నెటుల
నరుని కొప్పును ప్రకృతి వినాశనంబు
ప్రకృతి ధర్మ మెంచి నడచు పద్మజాండ
రిప్లయితొలగించండిమక్కజమ్ముగను నరులు దక్క సత్వ
రమ్ము భూ చరాచర విళయమ్ముఁ గోర
నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు
సుకరము సేయ జీవనము సూరి జనావళి మార్గ మూని హిం
సకు నతి దూర ముండి యనిశమ్ము మెలంగ శుభం బగున్ ధరం
దికమక యేలఁ బ్రాణములు తీయక దుర్మతి చిత్త దౌష్ట్యపుం
బ్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్
వికృతముపెంపుమీరిన వివేక విహీనులు దుర్వినీతులై
రిప్లయితొలగించండిఅకృతముగాఁగ ఖాత్రములనంఘ్రిపముల్ తునుమాడ తథ్యమౌ
ప్రకృతి వినాశనంబె, కడు పావన కార్యము మానవాళికిన్
ప్రకృతినిరక్షజేయ, జనపాళిమహాభ్యుదయంబునొందగన్!
రిప్లయితొలగించండిఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్రమంలో...
31/08/2019 శనివారం ప్రసారం కాబోతున్న సమస్య
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్
నా పూరణ......చం.మా
*** ****
ప్రకృతియె సర్వ జీవులకు ప్రాణము నెన్నగ ద్రుంచబోకుమా!
వికృతపు చేష్టలన్ మరిచి ప్రేమగ బెంచిన వృక్షజాతులన్
సుకృతము లెన్నొ యిచ్చి భువి శోభిల జేయును గాన;నెవ్విధిన్
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్??
.
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
కాకల తోడ శాత్రవులు,కాశ్మిర రాష్ట్రము నిప్పుబెట్టగా
రిప్లయితొలగించండిప్రకృతివినాశనంబు, కడు పావనకార్యము మానవాళికిన్
శోకముతోడపండితులు,శోషిల జేసిరి వారుక్రూరులై
ఏకముగాను యీప్రభుత,ఏకునుమేకునుజేయ జూడగా!
రాకలుపోకలున్ బెరిగి,రాక్షస క్రీడకు నీడబోయెలే.
నీకల దీరగా నికను,నీరసచట్టములన్నిమార్చుచున్
రిప్లయితొలగించండిఏకముగానుదెచ్చితిరి,ఏలగ రాష్ట్రము శాంతిమార్గమున్
శోకము దారిమార్చినది,శోభను బెంచెను జూడముచ్చటే
ప్రకృతి వినాశనంబు, కడు పావనకార్యము మానవాళికిన్
తేటగీతి
రిప్లయితొలగించండిమొక్క నాటక వృక్షాల మొదలు నరికి
రగుల భూ యుపరితలమ్ము సెగలఁ జిమ్మి
కూలబడినట్టి వృక్షంపు కొమ్మ నరుకు
నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు
ఏపుగను పెరిగెతరువులేమిజేసె
రిప్లయితొలగించండిహాయి గాపారు నదియును హాసమాయె
చిత్రమైనట్టి మనుషి విచిత్రరీతి
నరులకొప్పును ప్రకృతివినాశనంబు
చం.
రిప్లయితొలగించండివికటపు నవ్వుతో నరుక వేటున చెట్లను కాననమ్ములన్
చకచక గట్ట మేడలను చండభమార్గము తాకు చుండగన్
వికృతము గాగ జీవనమువేదన లెంచుచు నాలపింపరే
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్
వై. చంద్రశేఖర్
గు రు భ్యో న మః
రిప్లయితొలగించండి