22, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3111 (కాలాతీతమునఁ గలుఁగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్"
(లేదా...)
"కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్"

89 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కూలగ యౌవనమ్ము మరి కూరిమి రాదని భామలందునన్
    మూలగ నేలనో ముసలి మూఢుడ! నీదిక పంట పండెరా!
    రాలగ నోటి దంతములు రావుగ హాయిగ పంటి నొప్పులే:👇
    "కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఇది నిజంగానే సరదా పూరణ. బాగుంది. అభినందనలు.
      ప్రస్తుతం నేను పంటినొప్పితో బాధపడుతున్నాను. మీరు చెప్పే కాలాతీతపు రోజులు నాకెప్పుడు వస్తాయో?

      తొలగించండి
    2. 🙏

      తొందర పడకండి...నా వయసు రానివ్వండి

      🙏

      తొలగించండి
  2. Malli siripuram
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
    కం.
    సాలున వరుణుడి దయతో l
    రాలిన వర్షపు చినుకులు రయితుకి మేలై l
    నేలను దున్నిన సస్యము l
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్ ll

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లి సిరిపురం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రైతుకు మేలై" అనండి.

      తొలగించండి
  3. ఏలా నీవిధి లీలలు
    హేలగ భావించు నంట నీసుడు జగతిన్
    జాలము జేయుచు జనులను
    కాలా తీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయక్లేశం ఉన్నట్టుంది.

      తొలగించండి
  4. మేలును గూర్చగ లేవవి
    బాలురనే చెరచు నీదు వ్యర్థపు పలుకుల్
    చాలించుమంటి, నెవ్విధి
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
  5. కం.
    బాళిగ యాబ్దిక మందున l
    మాలిన్యము లేక శుచిగ మధురపు రుచులన్ l
    కోడలు వండియు బెట్టగ l
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్ ll

    రిప్లయితొలగించండి
  6. కం.
    సాలున వరుణుడి దయతో l
    రాలిన వర్షపు చినుకులు రైతుకు మేలై l
    నేలను దున్నిన సస్యము l
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్ ll

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లి సిరిపురం గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. కాలిన చర్మపు బొబ్బలు
    తేలికగా పోవు;మంచినిచ్చెడి వైద్యున్
    మేలుగఁజేరగ సుఖమగు
    కాలాతీతమునఁగలుగు గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
  8. మంచి తెల్పెడి వైద్యున్ అని చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  9. ఏలా బుత్రుల గోరగ
    చాలిక సంతును కొమరుల జల్లని బుత్రిన్
    మేలుగ జూడద ముదిమిన
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్"

    రిప్లయితొలగించండి


  10. బాలా! బతుకగు శూన్యము
    కాలాతీతమునఁ, గలుఁగుఁ గద సత్ఫలముల్
    మాలిని! సరియగు వేళని
    చాలిక తో చేయగ పని చక్కగ నెపుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  11. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మూలగ బోకు రాహులుడ! పుర్వులు పట్టగ భీకరమ్ముగా
    దూలము లన్నియున్ విరిగి దుర్భర రీతిని నేలపాలయై
    కూలెను స్వర్గధామమని; కూడుము నాలిని పూని యివ్విధిన్:👇
    "కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్"

    రిప్లయితొలగించండి
  12. కాలము మేలగు వైద్యుడు
    బేలగ మార్చెడు ఇడుములు వేదన సలపన్
    కాలాతీతుని వేడగ
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    శారీరక, మానసిక గాయాలు మాన్పడానికి కాలాన్ని మించిన వైద్యుడు లేడు. నిస్సహాయ స్థితిలో పడదోసే కష్టాలు ఎదురైనప్పుడు కాలాతీతుడైన భగవానుని వేడుకుంటే కాలం గడిచే కొద్దీ అన్ని కష్టాలు తీరిపోయి, మంచి ఫలితాలు వస్తాయి.

    రిప్లయితొలగించండి

  13. భలే మంచి చౌక బేరము ఆలసించన ఆశాభంగము :)



    పాలిక లేలు మ్యూచువలు ఫండు జిలేబుల చేర్చు దండిగా
    చాలిక మాది! డబ్బులను చక్కగ పోయుడి స్టాకు మార్కెటున్
    తేలిక తో జయించెదరు! తెండు దినారము లెల్ల నిప్డె! పో
    గాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. మేలైన బాబు రైతుల
    మేలు కొరకు హరిత గృహము మేలని తెలుపగ
    పూల ఫలం, కాయగ యౌ
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేలని తెలుపన్' అనండి. కందం రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. 'ఫలం' అనడం వ్యావహారికం.

      తొలగించండి


  15. చాలదు తీరదు మోహము
    తేలిక పడు మానసమ్ము తెమ్మర వీచున్
    మాలిని చేరువ తెలియని
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. కూలిన విమానమున్ గని
    చాలిక బ్రతికితి ననుచును శాస్త్రియె పల్కెన్
    మేలౌ దలపగ నొకపరి
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురుభ్యోన్నమః🙏

    మీలాంటుత్తముఁ లనుటను
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్
    కూలదె బుద్ధియు దేహము?
    కాలాంతమ్మునఁ గుదరదు, కాలుని జేరున్.

    రిప్లయితొలగించండి
  18. తాలిమి గలిగియు భక్తిగ
    వేలుపులను గొలుచు చుండ వికసిత భవితన్
    జాలిగ నొసగగ బూనరె
    కాలాతీతమున గలుగు గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
  19. బాలశశాంకమౌళి నిజ
    పాదములన్మనమందునిల్పి ష
    ట్కాలములందు శాస్త్రవిధి
    గా నభిషేకము సల్పు వాడు తా
    త్కాలిక జ్ఞానమాంద్యమును
    దాటును తథ్యము చింతయేటికిన్
    కాలముమించిపోయినను
    గాంచును మందుడు సత్ఫలమ్ములన్.

    రిప్లయితొలగించండి
  20. లాలనమునఁ జొప్పించుము
    లీలా కృష్ణుని కథలను లేత మనసునం
    దేలాగయినను, అనకుడి
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏలాగు' అనడం వ్యావహారికం. "మనమునం । దే లీలనైన ననకుడి" అనండి.

      తొలగించండి
    2. లాలనమునఁ జొప్పించుము
      లీలా కృష్ణుని కథలను లేత మనసునం
      దేలీలనైన ననకుడి
      కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్.

      తొలగించండి
  21. ఆలస్య మమృతము విసము |
    వలదుగ జాప్యము ననెదరు, వసుధను విబుధుల్ |
    తెలిసెగ సత్యము ,విననిటు |
    "కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్"

    రిప్లయితొలగించండి
  22. చాలును తొందర చర్యలు
    పాలన చేయ నటువంటి పరువడి యేలా !
    మేలగు నిర్ణయములకై
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి


  23. చాలిక! మోదీ ప్రభుతన్
    త్రోలిరి ఈడీ చిదంబరుని సీబీయై
    పాలికి ! భళిరా యైనన్
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!


    జిలేబి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. మైలవరపు వారి పూరణ

    కంకుభట్టు..

    మ్రోలనె యున్న వృక్షమును మూలముతో పెకలింప జూచెదీ
    వేలనొ పాచకా ! వలల ! యెండిన కట్టెలు లేవె ? శక్తియే
    మూలము గాదు., బుద్ధిబలమున్ గొని నెమ్మది
    వేచి చూడుమా !
    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  25. కాలము మించిపోవకనె కార్యములన్నియు చక్కజేయుమా
    కాలము మించిపోయినను గాంచుట కష్టము సత్ఫలమ్ములన్
    కాలము వెళ్ళమార్చునుగ గాంచుచు స్వప్నములందు కమ్మగా
    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోవకనె' అనడం సాధువు కాదు. "మించకుండగనె" అనండి.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. ఆలయములు మూయుదురయ
    కాలాతీతమున,గలుగుగదసత్ఫలముల్
    ఫాలునిదలచుచు భక్తిని
    బాలన్నైవేద్యమిడగబ్రాతఃసంధ్యల్

    రిప్లయితొలగించండి


  28. గోలా వినవే! వలదన
    కే లలనా!పిల్లలు మన కెంపులవుదురే!
    గ్రోలెదమిక రమ్మ సుధల
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గోలను వినవే/ గోలా? వినవే' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  29. మాజీ ప్రధాని కీ||శే|| శ్రీ పి. వి. నరసింహరావుగారి ఉవాచ....

    కందం
    పాలనమున త్వరితమ్మున
    మేలగు నిర్ణయములఁ గొన మేదిని యందున్
    తేలచఁ గొన్నిటి నుంచఁగ
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి


  30. మేలౌ ఫ్రాన్సు ప్రయాణము
    మేలౌ యూయేయి పయనమే! బెహరెయి‌నౌ
    మేలు మనకు వెళ్లెదనిక
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ తిరుగు ప్రయాణ మెప్పుడు? ఎక్కడున్నా శంకరాభరణాన్ని పలుకరిస్తూనే ఉంటారు కదా? :-)

      తొలగించండి

    2. అబ్బే ! మేము కాదండోయ్ శ్రీమాన్ మోదీజీ :)



      జిలేబి

      తొలగించండి
  31. ఏలా? వినకుంటివిగద
    కాలాతీతమునఁగలుఁగుగద సత్ఫలముల్
    ఫాలాక్షుని మదిదలుపక
    కాలక్షేపము నొనర్చగ కలిగెనిడుముల్!

    రిప్లయితొలగించండి
  32. మేలుగ నాటఁ బుడమి బీ
    జాలు తరు లొసంగు భావిఁ జారు ఫలమ్ముల్
    మేలి తపమ్ముల నరులకుఁ
    గాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్


    చాలఁడు సేయఁ గార్యములు శార్ఙ్గినిఁ దల్చుట తక్క నెవ్వియుం
    బోలఁడు పూరుషాన్యులకు మూఢపు భక్తుని కవ్వ తక్కఁ దాఁ
    దోలఁడు వాహనమ్ములు మధుద్విషు యాన వరమ్ము దక్క నీ
    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల
    ఆలికి జోడుగా తగెడు హంగును జ్ఞానము నందు పొందగన్
    కాళిని కాళిదాసు తగు కైవడి వేడుచు నందె పాండితిన్
    మూలము కాళిమాతయని పూనుచు దీక్షగ నభ్యసించినన్
    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి
  34. ఫాలపునేత్రునిన్గొలిచి పాయసమాదిగ బిండివంటల
    న్జాలముజేయకన్నిడగ భాలశశాంకుడుమోదమందిదా
    కాలముదాటిపోయినను గాంచనమాదిగ సంపదల్వెస
    న్గాలము మించిపోయిననుగాంచునుమందుడుసత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఫాల విలోచనున్ ... జాలము జేయకే యిడగ బాల... మోదమంది తా... మాదిగ నిచ్చు సంపదల్...' అనండి.

      తొలగించండి

  35. ... శంకరాభరణం... . 22/08/19 ....గురువారం...

    సమస్య::

    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    నా పూరణ. ఉ.మా.
    ***** **** **

    కాలము జెందువారి గని గాయము డెందము కయ్యెనంచు నీ

    వేలను వెక్కి వెక్కి విలపించెదవున్? పరితాప మేలనో?

    వేళకు సల్పు కార్యములు... వేళయె మీఱిన మాను గాయమే!

    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్



    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷



    రిప్లయితొలగించండి
  36. ఏలాతొందర హితుడా
    కాలానికి తలనువంచ కర్జము పొసగున్
    బాలారిష్టముబాయగ
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
  37. కందివారి సూచనలకు కృతజ్ఞతలు. మీ సూచనననుసరించి సవరణతో
    1. మేలైన బాబు రైతుల
    మేలు కొరకు హరిత గృహము మేలని తెలుపన్
    పూల ఫలము, కాయగ యౌ
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    2. కీలిని రైతులు సాకగ
    మేలిఫలములు హరితగృహమేగితి వంటున్
    మేలైన బాబు, హర్షము (వర్షన్)
    కాలాతీతమునఁ గలుఁగుఁగద సత్ఫలముల్

    3. కాలయవనుని వధించగ
    కాలంజరుని నెలమి కొరకై ప్రార్థించెన్
    కాలనియతిని తెలిసి హరి
    కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....

      ఆలయ పుణ్య తీర్థముల నన్నియు దిర్గెను జేసెనర్చనల్
      కాలము వ్యర్థమాయె కడు కాని ఫలించను లేదు కోర్కులున్
      కీలిని స్వేధ మోడినను ఖేదము తీరునటన్న సత్యమున్
      కాలము మించిపోయిను గాంచును మందుడు, సత్ఫలంబులన్.

      తొలగించండి
    2. గండూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  38. కాలము కాని కాలమది కాటక మంచును తల్చు వేళలో
    నేలను ముద్దులాడెనట నింగిని వీడుచు వర్షమత్తరిన్
    హాలికు లెల్ల సంతసము నందుచు గూరల సాగుజేసినన్
    కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి

  39. పిన్నక నాగేశ్వరరావు.

    వీలున్న తావులందున
    వేలాదిగ మొలకలుంచి పెంచగ భావిన్
    మేలగు పర్యావరణకు
    కాలాతీతమునఁ గలుగుఁ గద సత్ఫలముల్.

    రిప్లయితొలగించండి
  40. చాలిక పడ్డకష్టములు సత్వరమే నను నెన్నుకొన్నచోన్
    మేలగు పాలనమ్మునను మిమ్ములమిన్నలకెత్తివేసెదన్
    బూలనుబెట్టి ఇత్తు భృతి భుక్తికిఁ గొల్వులు లేనివారికిన్
    గాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కాలము మించిపోయినను గాంచును
    మందుఁడు సత్ఫలమ్ములన్

    సందర్భము: సింహధ్వజు డనే రాజు వెండి బంగారు రత్నాలు ముత్యాలు మున్నగున వెన్నో దానాలు చేశాడు. ఆ పుణ్యఫలంగా స్వర్గలోక నివాసం లభించింది. ఐనా తమకంటె ఒక మెట్టు తక్కువగా వున్నట్టు దేవతలు పరిగణించే వారు. ఎందుకంటే అతనికి అమృత పాన యోగ్యత రాలేదు.
    నారదు డొకసారి ఇంద్రలోకం సందర్శించగా ఆయన తన బాధ చెప్పుకున్నాడు. నారదుడు "అన్నింటికన్న మించిన దానం అన్నదానం. అది నీవు చేయలేదు. అందుకే నీ కీ అవస్థ" అన్నాడు.
    తర్వాత భూలోకాని కేగినాడు. సింహ ధ్వజుని పుత్రుడైన చిత్రకేతువు రాజ్యం చేస్తుండగా అతనికి తండ్రి దీనావస్థను అన్నదాన మహిమనుగురించి చెప్పాడు. ద్వాదశి వేళలలో అరుణాచలంలో చేస్తే ఇంకా మంచి దన్నాడు. నారదుని సలహా మేరకు అతడు తండ్రి సద్గతికోసం శాయశక్తులా అన్నదానాలు చేశాడు.
    దేవేంద్రు డొకనాడు సింహధ్వజుని కడకు వచ్చి మెచ్చుకొని స్వయంగా అమృతం తాగించాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మేలుగ వెండి బంగరు ల
    మేయ ధనంబులు దాన మిచ్చి తా
    లీలగ నాక మేగియును
    రేత్రము గ్రోలడు రా జటంచు భూ
    పాల కుమారుచేతఁ దగ
    ద్వాదశి వేళల నన్న దానముల్
    చాల నొనర్పఁ జేసె ముని
    చంద్రుడు శోణ గిరీంద్రమందునన్
    గాలము మించిపోయినను
    గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    22.8.19
    -----------------------------------------------------------
    రేత్రము= అమృతము

    సందర్భాన్ని బట్టి అర్థాలు..
    రాజు = సింహధ్వజుడు
    భూపాల కుమారుడు =రా కుమారుడు
    ముని చంద్రుడు = నారదుడు
    శోణగిరీంద్రము = అరుణాచలము

    రిప్లయితొలగించండి