1, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3092 (తొందరపడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"

65 కామెంట్‌లు:

 1. వందలు వేలగు హితులను
  సందడి గాపలుక రించి సాహిత్యము నన్
  అందరి సాంగత్య మునువీడి
  తొందర పడికైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "అందరి సాంగత్యము విడి" అనండి.

   తొలగించు
 2. అందముగా ప్రాసగుదుర
  చిందులు వేయుచు మొదలిడ శీఘ్రము కందం
  బందున భావము విరియక
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్
  Rohit 🙏🏻🙏🏻🙏🏻

  ప్రాస బాగుందని రాస్తూండగా భావము సరిపడక కైతపిట్ట హుష్కాకైంది😂😂

  రిప్లయితొలగించు
 3. వందనలిడి శంకరునకు
  పందెమ్మున వ్రాయగలను పద్యము లంచున్
  కందమ్ముల నీరీతిని
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 4. కందం
  వందిత 'పిట్టా' వారలు
  నందరి మదిదోచి కవిగ హారతులందెన్
  బృందమునకు దల్మి పిలువ
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు


 5. అందరి కన్న జిలేబియె
  ముందుగ పూరింపగాను ముంచెత్తుచు రాన్
  పందెము పడలేక నహో
  తొందరపడి కైత, పిట్ట, తుఱ్ఱున నెగిరెన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 6. సందర్భోచితరీతిని
  నందంబుగ పద్యసుధల నందరి కిచటన్
  వందితమతియై పంచుచు
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్.

  రిప్లయితొలగించు
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 8. శ్రీ గురుభ్యోన్నమః🙏
  కీ.శే. డా.పిట్టా సత్యనారాయణగారిని స్మరిస్తూ,

  మందారమంటి రచనల
  అందరి మన్ననలు వడసి యద్భుత కవితా
  పందారము జేసెనితడు
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 9. మైలవరపు వారి పూరణ

  అందరికంటెను నేనే
  ముందుగ పూరింతుననెడి బుద్ధి రచింపన్
  కందము గీతంబైనది !
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్.!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుందరయమునాతటగత
   బృందావనసీమఁ గృష్ణవేణురవంబుల్
   డెందమునుదోచినంతనె
   తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్.!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. మైలవరపు వారి పూరణలు అద్భుతంగా ఉన్నవి.

   తొలగించు
 10. వందల పదములు రయమున
  కుందక వ్రాసెదనని కవి గుప్పించ 'త్ప్రు'వున్
  ముందన వికటకవివరుడు
  తొందరపడి కైతపిట్త తుఱ్ఱున నెగిరెన్

  తెనాలి రామకృష్ణుడు "త్ప్ర్ర్వ్వటబాబా తలపై" వ్రాయమని ఇచ్చిన కవి ఎంచేసాడంటారు?😂😂
  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించు


 11. బిందాసుగ వ్రాసిరయా
  సందర్భసహితపు బల్పసందగు కైతల్!
  వందనమయ పిట్టాజీ!
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 12. *పిట్టా వారికి అశ్రునివాళులతో*


  సుందర మగింద్రసభన ప
  సందగు పద్యములఁ జెప్ప శచిపతి పిలువన్
  బంధములను విడనాడుచు
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 13. కందివర! దరికి రమ్మని
  యందల మంపిరి దివిజులు హార్దము తోడన్
  సందేహించక నలరుచు
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 14. అందర మనసులు దోచగ
  సుందరమగు కవితలల్లి సుకవీశ్వరుడై
  పొందగ ముక్తి పదమ్మును
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 15. పిట్టా వారికి అశ్రునివాళితో


  చందురు పొందుగ శిగలో
  నందంబుగ దురిమినట్టి నాగాభరునిన్
  సుందర కందముల బొగడ
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్


  రిప్లయితొలగించు
 16. డా.పిట్టావారికి నమస్కృతులతో

  వందిత పిట్టాయేగిరి
  కుందగ కవిలోకమెల్ల కూడగ దివిజుల్
  సందడి జేయగనచ్చట
  తొందరపడి కైతపిట్ట తుర్రున నెగిరెన్

  రిప్లయితొలగించు
 17. సందడి చాలిక భువిపై
  బృందారక గణము దివికి పిలిచెడి నంచున్
  కొందల మొందగ మిత్రులు
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్.

  రిప్లయితొలగించు
 18. విందులు చాలని యిహమున
  వందల వర్షములు స్వర్గవాసము నందున్
  ఛందములన్ గేళి సలుపఁ
  "దొందరపడి కైత "పిట్ట" తుఱ్ఱున నెగిరెన్"

  రిప్లయితొలగించు
 19. అందపు పద్యమ్ముల మా
  కందపు సురస రసము మన కందించుచునే
  పొందగ పరమ పదమ్మును
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్ 🙏

  రిప్లయితొలగించు
 20. ఛందము లోచెక్ చేయగ
  సుందర ముగ నుండు ననుచు శోధన కునిడన్|
  మందమయె ను చర వాణీ
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"

  రిప్లయితొలగించు
 21. ఈ పద్యమున దోషము తెలుప ప్రార్ధన

  "తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"
  నా పూరణ

  అందము తోనే తోచగ
  సుందరి కొరకై జగమున శోధన జేయన్
  కందమున కవిత వ్రాయ
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కవిత వ్రాయగ' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించు
  2. అందము తోనే తోచగ
   సుందరి కొరకై జగమున శోధన జేయన్
   కందమున కవిత వ్రాయగ
   తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

   ధన్యవాదములు

   తొలగించు
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 23. అందరి కంటెను మొదటగ
  నందంబుగ బద్యరచన నాహ్లాదముగన్
  విందునుజేయుచునుండక
  తొందరపడి కైతపిట్ట తుర్రున నేగెన్

  రిప్లయితొలగించు
 24. సుందర సుమధుర కవితా
  నందపు నందనవనముననద్భుత ఫణితిన్
  విందుగకవితలగూర్చుచు
  తొందరపడి కైతపిట్టతుర్రుననెగిరెన్

  రిప్లయితొలగించు
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పందెమ్మున మోడి గెలువ
  సందడి చప్పుడును లేక సంగ్రామమునన్
  ముందును వెనుకను చూడక
  తొందరపడి కైతపిట్ట తుఱ్ఱున నెగిరెన్ :)

  రిప్లయితొలగించు
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  సందర్భము:
  సుందరుడు= సుందరేశ్వరుడు.. శివుడు;
  హనుమంతుడు
  సుందర సన్నిధి= శివ సన్నిధి
  లేదా హనుమత్సన్నిధి
  అందరి మెప్పుల తోట= జనా లందరి
  మెప్పులు అనే తోట

  "నా కవిత అనే పిట్టను శివ సన్నిధి లేదా హనుమత్ సన్నిధి అనే నందన వనంలో నెగురవేద్దా మనుకుంటే అది (పిట్ట) ఒప్పక జనాల మెప్పు లనే ఒక చిన్నతోటలోకి తుఱ్ఱున ఎగిరిపోయింది."
  అని ఒక కవి వాపోతున్నాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "సుందర సన్నిధి నందన

  మందు నెగురవేయ దలప..
  నది యొప్పక దా

  నందరి మెప్పుల తోటకుఁ

  దొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 27. ఇందిందిర సందో హా
  నం దామం దారవింద నందన వన తు
  ల్యేందిర గృహ సందర్శతఁ
  దొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 28. సుందరమగు పద్యమ్మును
  కందములో రాసి చూపు కాంక్షయు కలుగన్
  ఛందము కుదరక మునుపే
  తొందరపడి కైత పిట్ట తుర్రున నెగిరెన్.

  రిప్లయితొలగించు
 29. కవిమిత్రులకు గమనిక....
  ఈవారం ఆకాశవాణి వారి సమస్య "కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై"
  దీనికి మీ పూరణలను రేపు ఉదయం 10 గం. లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించు
 30. మిత్రులందఱకు నమస్సులతో...కీ.శే.పిట్ట సత్యనారాయణ గారు పరమపదించిన సందర్భమున సంతాపమును ప్రకటించుచు చేసిన పూరణము. దీనిని వారికే అంకిత మిస్తున్నాను.

  సుందర పద్యము నెన్నియు
  విందుగఁ గృతు లెన్నొ వ్రాసి వెలయుచుఁ దా గో
  విందుఁడు పిల్చిన కతమునఁ

  దొందరపడి కైత పిట్ట తుర్రున నెగిరెన్!

  రిప్లయితొలగించు
 31. పెందలకడ మంచమునే
  మందమతిని పెంచునిదుర మత్తువిడకనే
  ముందుగనే తడబాటున
  తొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్

  రిప్లయితొలగించు
 32. సుందర నందన వనమున
  విందుగ కృష్ణుండు చేరి వేణువు నూదన్
  సందడి చేసెను గోపిక-
  తొందర పడి తుఱ్ఱన నెగిరెన్

  రిప్లయితొలగించు