20, ఆగస్టు 2019, మంగళవారం

సమస్య - 3109 (అంఘ్రిద్వంద్వము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్"
(లేదా...)
"అంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్"

64 కామెంట్‌లు: 1. హమ్మయ్య కాంపిటీషను తక్కువ జీపీయస్ గారు రాలెయింకా :) కంది వారివ్వాాళ సెలవా ? :)


  అంఘ్రియ నగ పాదమగును
  అంఘ్రిద్వంద్వమ్ము రెండనన్ పాదములౌ!
  అంఘ్రిని పడెద నెటులయా
  అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ?


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   నాలుగు పాదాలను అంఘ్రితో ప్రారంభించి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
   కాంపిటీషన్ తక్కువ అంటూ కాస్త తొందరపడ్డారు. రెండవ పాదంలో యతి తప్పింది. "...పాదమ్మగు । నంఘ్రిద్వంద్వమ్ము రెండనన్ పాదములౌ" అంటే సరి! (నాకిష్టం లేనిదైనా అఖండయతిని సూచించాను). "అంఘ్రుల బడెద" అంటే ఇంకా బాగుంటుందేమో?
   ఈరోజు 'ఆముదాల మురళి' గారి అష్టావధానానికి వెళ్తున్నాను. అందుకోసం కాదు కాని... కాకతాళీయంగా అలా దుష్కరప్రాస వచ్చేసింది.

   తొలగించు
 2. (ప్రాతః కాలపు సరదా పూరణ:

  అంఘ్రుల్ పోవగ దారుణంబుగనయో హైరాననౌ తీరుగా...
  అంఘ్రుల్ చేయుచు కృత్రిమంబునవి భల్ హాయైనదౌ రీతినిన్...
  అంఘ్రుల్ రెంటిని శేఠివారు మహ దానందమ్ము తో కూర్చగా...
  అంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్

  See:

  1. Dr. P. K. Sethi (https://en.m.wikipedia.org/wiki/P._K._Sethi)

  2. Sudha Chandran (https://www.google.co.in/search?client=safari&channel=iphone_bm&ei=ZjdbXfPKOu3Cz7sP1PaOsAE&q=sudha+chandran&gs_ssp=eJzj4tTP1TewNDE3KjZgBAAQxQKJ&oq=sudha&gs_l=mobile-gws-wiz-serp.1.0.46i273i275j0i131j46i273j46j46i131j0l3.3236.9225..10406...0.0..0.216.1816.4j7j2......0....1.......0..0i67j46i67j46i67i275j0i131i273j0i273j0i131i67.NlbESWMCpJ0)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈ సమస్యను ఇస్తున్నపుడే సుధా చంద్రన్ గుర్తుకు వచ్చింది. అదే విషయంగా మీ పూరణ రావడం సంతోషం.
   'అంఘ్రుల్' అన్నారు కనుక "హాయైనవౌ రీతిగా" అనండి.
   జిలేబి గారు చేసిన పొరపాటును మీరూ చేసారు. మూడవ పాదంలో యతి తప్పింది. "..రీతిగా । నంఘ్రుల్ రెంటిని... మహదానందమ్ముతో..." అంటే సరి! నా కిష్టం లేకున్నా అఖండయతిని సూచించాను.

   తొలగించు
  2. “...ఈ సమస్యను ఇస్తున్నపుడే సుధా చంద్రన్ గుర్తుకు వచ్చింది. అదే విషయంగా మీ పూరణ రావడం సంతోషం...“

   ...Great men think alike sir!

   😊

   తొలగించు
 3. *జాంఘ్రీ అను వాడు మిత్రుడని ఊహించి......*

  అంఘ్రిద్వయమే ముఖ్య
  మ్మంఘ్రిద్వంద్వమ్ము లేక నాడన్ దరమే
  జాంఘ్రీ తో చదరంగము
  నంఘ్రిద్వంద్వమ్ము లేని యాడది యాడెన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   నాట్యం కాకుండా చదరంగం ఆడించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 4. సమస్య :-
  "అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్"

  *కందం**

  అంఘ్రులు పోవగ కృత్రిమ
  యంఘ్రికవచములు ధరించి యాడగ వచ్చున్
  యంఘ్రికవచముల చంద్రన్
  యంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్
  ......................✍చక్రి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కృత్రిమ + అంఘ్రులు = కృత్రిమాంఘ్రులు' అని సవరణదీర్ఘసంధి వస్తుంది. 'వచ్చున్ + అంఘ్రి' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

   తొలగించు

 5. అంఘ్రులపై బడి వేడగ
  నంఘ్రిని నదిబుట్టజేయు నాతనిగృపచే
  నంఘ్రిజకులమం దచ్చట
  నంఘ్రిద్వంద్వమ్ము లేనియాడుది యాడెన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు


 6. అంఘ్రిన్జాతము! గంగయై పరుగు తానాంధ్రావనిన్గోలగా
  నంఘ్రుల్మ్రొక్కగ రాజమండ్రిని సుదానంబై తలిర్చెన్ భళా
  నంఘ్రుల్లేకయు కృష్ణవేణిగను విన్యాసంబులన్తోడుగా
  నంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అంఘ్రిన్ మోపుచు శంకరార్య పరుపున్ హాయైన తీరుంగ మా
  కంఘ్రిన్ చేర్చుచు కైపదమ్ము భళియౌ కష్టమ్మునౌ రీతిగా
  నంఘ్రిన్ తోడుత ప్రాస కూర్చుటనుభల్ హంగామ తోనిచ్చిరే:
  "అంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'తీరుంగ' అన్న ప్రయోగం సాధువు కాదు. "హాయౌ విధంబొప్ప మా..." అందామా?

   తొలగించు
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 9. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  అంఘ్రితలముపై గొప్ప, ష l
  డంఘ్రియు నెగురాడు చుండ డంగగు రీతిన్ l
  యంఘ్రిజుఁడు మెచ్చు చుండగ l
  యంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ll

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు
   రీతిన్ + అంఘ్రిజుడు.... అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించు
 10. మల్లి సిరిపురం గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 11. అంఘ్రి ద్వయమెగ ప్రాణము|
  అంఘ్రిని వేయుచు జతులను, నంగన నాడున్|
  అంఘ్రివ లెతోచు పదముల |
  "అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్"

  రిప్లయితొలగించు
 12. అంఘ్రులు లేనట్టి యువిద
  అంఘ్రుల నంటియును వేడ నార్ద్రంబున దా
  నంఘ్రుల నొసగిన ముదమున
  అంఘ్రి ద్వంద్వమ్ము లేని యాడుది యాడెన్

  రిప్లయితొలగించు
 13. మైలవరపు వారి పూరణ

  అంఘ్రిద్వంద్వపు లేమి యడ్డుపడె నాట్యంబాడ., భూతేశ.! ది..
  వ్యాంఘ్రిద్వంద్వమె దిక్కుగా దలచితిన్.! హాలాహలాహార.! లు..
  ప్తాంఘ్రిన్ గావవె యంచు మ్రొక్కులిడ దివ్యాశీఃప్రభావమ్ముతో
  నంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. అవధానులవధానులవధానులే !


   అదురహో


   జిలేబి

   తొలగించు
  2. "శ్రీమతి జిలేబీ గారికి.. మీకు కూడా నమోనమః 🙏"

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించు
  3. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉంది అభినందనలు

   తొలగించు
  4. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉంది అభినందనలు

   తొలగించు
 14. కం.
  అంఘ్రితలము నాటవెలది l
  అంఘ్రిద్వయ పూరణమున నద్భుత రీతిన్ l
  అంఘ్రిన వాణీ కృపతో l
  యంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ll

  రిప్లయితొలగించు
 15. అంఘ్రీ ఘట్టన ఘట్టము
  నంఘ్రీకృత తాడనంబు నలరెను సర్కస్!
  అంఘ్రీ గోపనమయ్యెను
  అంఘ్రీ ద్వంద్వంబులేని యాడుది యాడెన్

  రిప్లయితొలగించు
 16. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  కం.
  అంఘ్రితలముపై గొప్ప, ష l
  డంఘ్రియు నెగురాడు చుండ డంగగు నపుడున్ l
  యంఘ్రిజుఁడు మెచ్చు చుండగ l
  యంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ll

  రిప్లయితొలగించు
 17. అంఘ్రిద్వంద్వము లేకను
  నంఘ్రిద్వంద్వంబునునుచ,నసలుకుసరిది
  వ్యాంఘ్రముదాగలుగుకతన
  నంఘ్రిద్వంద్వంబులేని యాడదియాడెన్

  రిప్లయితొలగించు
 18. శార్దూలవిక్రీడితము

  అంఘ్రుల్ దాల్చిన మువ్వలన్ గనఁగ నాహార్యంబునన్ నేస్తమే
  యంఘ్రుల్ దాకఁగ నేలపైన లయతో నాడంగ తాదాత్మ్యమై
  యంఘ్రీయుగ్మము నందె దృష్టిఁ బరకాయావేశితా యన్నటుల్
  నంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్

  రిప్లయితొలగించు
 19. అంఘ్రి విచేతన దుష్పల
  లంఘ్రాతృ సురా విచలిత లయ రాహిత్యా
  నంఘ్రి నరాభంబై దు
  ష్టాంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్

  [దుష్పలలం ఘ్రాతృ: చెడ్డ మాంసమును వాసన చూచువాఁడు; అలుక్సమాసము]


  సాంఘ్రి ప్రాణులు హీన పాదతతులున్ క్ష్మాంతస్థ దుర్వార గూ
  ఢాంఘ్రి ద్యోతిత వృక్ష సంచయము భూమ్యాకాశ సంప్రాప్త బ
  హ్వంఘ్రి ప్రాభవ జీవరాశులును ఘోరాభేద్య జాడ్యాది దో
  షాంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. సాంఘ్రిప్రాణులు - పాదముగల ప్రాణులు
   హీనపాదతతులు ?
   క్ష్మాంతస్థ- భూమిలోపల
   దుర్వార - irresistible/ inevitable
   గూడాంఘ్రి - దాగిన వేర్లు
   ద్యోతిత వృక్ష సంచయము - కూడినట్టి‌ వృక్ష సమూహము

   భూమ్యాకాశ సంప్రాప్త - భూమి ఆకాశములు‌ తమదైన
   బహ్వంఘ్రి ప్రాభవం జీవరాశులు- యెన్నోపాదములు కలిగిన జీవరాశులు

   ఘోరాభేద్య - అభేద్యమైన
   జాడ్యాది‌ దోషాంఘ్రిద్వందము లేని జాడ్యము లాంటి దోషములు కలిగిన పాదములు లేని
   భామ - ప్రకృతి వనకాంత !

   హమ్మయ్య ! సరియేనాండి పోచిరాజువారు ?   జిలేబి

   తొలగించు
  2. హీనపాదతతులు: పాదములు లేని సమూహము (జీవులు)
   భామ: ఒకానొక స్త్రీ (నర్తకి)
   నరులు, జంతువులు, పాములు, చెట్లు, తుమ్మెదలు, పురుగులు, నర్తకి యన్నియు వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్!

   తొలగించు

  3. వాహ్ ! క్యా బాత్ హై !

   నమో నమః   జిలేబి

   తొలగించు
 20. అంఘ్రిపముల బోలు దిటవు
  నంఘ్రి యుగము గల్గి నాట్యమంతయు నేర్చెన్
  అంఘ్రిజ నంచు తడబడెడి
  అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్

  రిప్లయితొలగించు
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 23. అంఘ్రి ద్వంద్వములేకయుండిన సహాయంబౌటదివ్యాంఘ్రమే
  యంఘ్రిద్వంద్వములేని భామ వెసనాట్యంబాడెజిత్రమ్ముగన్
  నంఘ్రిన్బుట్టిన గంగకూడను మహాహర్షంపు వేగంబుతో
  నంఘ్రుల్దాటుచు బర్వులెత్తును గదాయానందముప్పొంగగన్

  రిప్లయితొలగించు
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అంఘ్రిద్వంద్వము లేక పోయినను తానత్యంత స్థైర్యమ్మునన్
   అంఘ్రిద్వంద్వము యున్న రీతిగనె గన్పట్టున్ సదా కృత్రిమం
   పంఘ్రిద్వంద్వము తోడ భవ్యముగ నాట్యంబంత నేర్చెన్ గదా
   అంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్

   తొలగించు
 25. అంఘ్రిజయనఁనలుసాయని
  యంఘ్రికవచమునుధరించియతివేడుకగా
  నంఘ్రిపమునీడ దీఁటుగ
  నంఘ్రిద్వంద్వమ్ము లేనియాడుది యాడెన్.

  రిప్లయితొలగించు
 26. అంఘ్రియె బోవగ నకిలీ
  యంఘ్రిని యమరించి సుధయె యద్భుతరీతి
  న్నంఘ్రీ తలమును కదుపుచు
  అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ?


  రిప్లయితొలగించు
 27. అంఘ్రిస్కంధము* లేక ధాత్రి తరు వెట్లందించు పుష్పాల? గూ
  ఢాంఘ్రుల్ కందుక మాడుటెట్లు భువి? చాలయ్యా ప్రతాపంబు లీ
  యంఘ్రుల్ ముఖ్యము నృత్యపాటవమునం దాశ్చర్యమౌ నెట్టు లా
  యంఘ్రి ద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్?

  *చెట్టుమూలము

  రిప్లయితొలగించు
 28. అంఘ్రిద్వంద్వమె మానవాళికి ప్రధానాంగమ్మె కాదందువే
  యంఘ్రిద్వంద్వము లేనివారిలను నాట్యమ్మాడ సాధ్యమ్మెనా?
  యంఘ్రింద్వంద్వము లున్నవాడవె, యసత్యాలేలరా, యెవ్వరా
  యంఘ్రిద్వంద్వము లేనిభామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్?

  రిప్లయితొలగించు
 29. గురువు గారికి నమస్సులు
  అంఘ్రిన్ ఘ్రప్రాస కొదువ
  అంఘ్రుల్ మరియెటులదెత్తుయసదృశమయ్యెన్
  సంగ్రహమున కృత్రిమమౌ
  ఆంఘ్రిద్వoద్వము లేని యాడది యాడెన్.

  రిప్లయితొలగించు
 30. కందం
  అంఘ్రుల్ మొదలుగ వృక్షము
  నంఘ్రుల వర్ణించి పద్య మల్లుచు కవనీ
  యాంఘ్రుల సరి గానముగా
  నంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్

  (గానమాడింది అను భావంతో. గురుదేవులు తగునో లేదో తెలియజేయ ప్రార్థన)

  రిప్లయితొలగించు
 31. ఈ "oఘ్రి"ప్రాసను దాటవేయుటకునై ఈ ప్రొద్దు నే సర్వదే
  వాంఘ్రిద్వంద్వముఁబట్టువాడ నిజమన్నన్ నమ్ముదో లేదొ నీ
  యంఘ్రిద్వంద్వమునాన కంటినొక దయ్యాలున్నచిత్రంబులో
  యంఘ్రిద్వంద్వము లేనిభామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్.

  రిప్లయితొలగించు
 32. అంఘ్రియులేకయె మనిరే
  అంఘ్రిద్వంద్వమ్ము లేక నాడెసినిమలోన్
  నాంఘ్రియు లేకయ నేమీ
  అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్!!

  రిప్లయితొలగించు
 33. శార్దూలవిక్రీడితము
  అంఘ్రుల్ ద్రిప్పుచు 'బంధనా' యనెడు నృత్యాభ్యాసి సంకల్పి గా
  నాంఘ్రుల్ నాట్యము జేసెనా యనఁగ నాహార్యంబు నన్ బూనుచున్
  యంఘ్రుల్ గంటలు వందమించి యిరవైయారేసి గా నూగ యం
  త్రాంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్

  (గానాంఘ్రులు = పాటలోని పాదాలు
  యంత్రాంఘ్రి ద్వంద్వము = యంత్రలవంటి పాదములు)

  https://m.ntnews.com/article/nepali-teenager-girl-dances-for-126-hours-to-break-guinness-world-records-1-1-595879.html/595879

  రిప్లయితొలగించు
 34. యంఘ్రులు లేవని వగవక
  ఘుంఘ్రుల సవ్వడి వినగనె కూరిమి తోడన్
  యంఘ్రులతో పనిలేదని
  నంఘ్రి ద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్

  మరొక పూరణ

  నంఘ్రియు లేని భుజంగము
  నంఘ్రియు లేనట్టి తరువు లానందముతో
  నంఘ్రియులేకాడుటగని
  నంఘ్రి ద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్

  రిప్లయితొలగించు