3, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3094 (కవి నాశంబును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్"
(లేదా...)
"కవి నాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

78 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కవివర్యుండిల రాజకీయ పథమున్ గంభీరుడై పట్టుచున్
  పవరున్ గోరుచు ముఖ్యమంత్రి పదవిన్ బంగారుతో గుంజగా,
  జవురన్ బూనెడు ప్రాతిపక్ష పశులన్ ఝాడించు శాపాలతో,
  కవి, నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై...

  జవురు = తొలగించు
  సత్కావ్యము = ఘన కావ్యము

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు, శుభోదయం!
   ప్రతినిధి ప్రాతినిధ్యం అయినట్లు ప్రతిపక్షం ప్రాతిపక్షం అయిందంటారు. బాగుంది.

   తొలగించు
  2. 🙏

   "ప్రాతిపక్షము"

   తెలుగు పర్యాయపద నిఘంటువులో ఉన్నది సార్! (ద్వేషము)

   అది standard కాదనుకోండి 😊

   తొలగించు
 2. సువిశాలమ్మగు భారతావనిని సంశ్లోకించుచున్ గావ్యమున్
  గవియొక్కండు రచింప బూనె, నొక భాగమ్మందు దేశోన్నతిన్
  నవరోధించెడు తీవ్రవాదమును సంహారమ్మునే జేసి శో
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దేశోన్నతిన్ + అవరోధించెడు = దేశోన్నతి నవరోధించెడు' అవుతుంది.

   తొలగించు
 3. అవమా నించుటె లక్ష్యము
  కవనం బులువ్రాయు వారు గాయ పడంగ
  న్నవరో ధము గల్పించుచు
  కవి నాశము గోరి వ్రాయు గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు
 4. సువిసా లంబగు లోకమం దునను సంశ్లోకిం చగామో దము
  న్నవలో కింపగ కానరా రుగద మన్నెంబం దుముల్లుల్ వలెన్
  కవి నాశంబును గోరి , వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై
  భవభో గంబగు సూనృతం బులను నొప్పారం గగుప్పించు చున్

  రిప్లయితొలగించు
 5. కవి లోకమ్మున ధార్మికప్రభవమున్ గాంక్షించు, సర్వంబునన్

  నవచైతన్యశుభప్రభావరుచులన్, నైర్మల్యతావైభవం

  బవనిం గాంచగ నెంచు, మానవులయం దానందముల్ గూడ శో

  కవినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 6. భువి నిండగ కలి మాయలు
  భవితయె విలువలను వీడి భారంబైనన్
  కవి యొక్కడె పూనుచు శో
  క వినాశముగోరి వ్రాయు గావ్యములెలమిన్

  రిప్లయితొలగించు


 7. జవరాలా! విను! త్వర పడ
  క! వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్
  రవణింపదు! వ్రాయవలెన్
  తవణింపగ దేశభక్తి ధరణిని రమణీ !


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...గావ్యము లెలమిన్ రవణింపవు' అని ఉండాలి.

   తొలగించు
 8. మైలవరపు వారి పూరణ

  భువి హింసాయుత పద్ధతిన్., దురితమున్., మోసమ్ము., దుర్మార్గమా...
  నవతాహీనదురంతదుష్కృతములన్ గాంచన్ మదిన్ ఖిన్నుడై,
  నవభావాంచితఖడ్గమై దునుమనన్యాయమ్ము., వీక్షింపలే.,
  క.., వినాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై.!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 9. భువియందున గల స్థలముల
  వివిధగుణగణముల ప్రజలు వెలయగ ఘనుడౌ
  కవి తిలకించుచు నందర
  కవినాశము గోరి వ్రాయు గావ్యము లెలమిన్ .
  (అవినాశము-శుభము)

  రిప్లయితొలగించు
 10. మత్తేభవిక్రీడితము||

  హవనంబట్టులనాత్మయందు గని బాహ్యంబందు లోకంబుకై
  సవరింపంగ మనుష్యజాతి రవివంశౌన్నత్యు గాధన్ మహా
  కవి వాల్మీకి యధర్మసిక్షణను దుష్కార్యాసురోపేతలం
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై

  Rohit 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించు
 11. కవికుల భూషణు లందరు
  రవికుల తిలకుని కథ లతిరమ్యము తోడన్
  భువిజగు నాసీతా శో
  కవి నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు


 12. కవి నానావిధ పర్వుపాసనపు ప్రాకాశ్యమ్ముతో సజ్జనుల్
  సువిశాలమ్మగు దేశమందు నిలువన్ చొక్కాటమై సర్వదా
  తవణింపంగను విస్తృతమ్ముగ భువిన్ తాత్సార్యమున్ యంకవం
  క వినాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై


  జిలేబి

  రిప్లయితొలగించు


 13. ఆకాశవాణి కి పంపించినది


  అవిరామంబుగ వృద్ధిగాంచి జనులే యానందమున్ పొందుచున్
  తవణింపంగ విశాల మైన పరిధిన్, తాదాత్మ్యతన్ చెందుచున్
  ప్రవిభక్తమ్ముగ మంచి పల్కులమరన్, ప్రార్థించి, స్ఖాలిత్యమున్
  కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై !  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ పద్యాన్ని నిన్న చదివాను. ఈసారి అనపర్తి నుండి పంపారు.

   తొలగించు
 14. శ్రవణానందము గూర్చు మానసము శశ్వత్సౌఖ్యసంప్రాప్తికిన్
  భవ వార్ధిన్ తరియింపజేయు తరుణోపాయంబుజూపున్, సదా
  కవి తానల్లెడు కావ్యమందుఁనెలమిన్ కర్తవ్యబద్ధుండు శో
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై

  రిప్లయితొలగించు
 15. కవితల్ కావ్యములన్ పురాణముల సద్గ్రంధమ్ములన్ వ్రాయుచున్
  కవియాశించును విశ్వశాంతిఁ గన సాకారంబుగానెన్నఁడున్
  చవులూరించెడు వర్ణనల్ మెరయగా సార్ధక్యమౌరీతి శో
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై

  రిప్లయితొలగించు
 16. కవి తాఁ నల్లగ నిచ్చగించు కవితల్ కావ్యమ్ములన్ పూనికన్
  భవితవ్యంబును చక్కదిద్దు పగిదిన్, భావంబు సంత్రస్తమౌ
  కవితల్ వ్రాయడు, సర్వలోకహితమున్ కాంక్షించునేవేళ శో
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై

  రిప్లయితొలగించు
 17. ఆటవిడుపు గంభీర పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కవివర్యుండిల క్రోధ కామములవోల్ గండమ్ములన్ దాటుచున్
  భవబంధమ్ముల ద్రుంచగా కొలుచుచున్ భద్రాద్రి రామయ్యనున్
  వివశమ్మౌచును భక్తి తత్త్వమున తా విజ్ఞానమున్ గ్రోలి, శో
  క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈసారి 'గంభీర' అన్న విశేషణాన్ని చేర్చారు!

   తొలగించు
  2. 🙏

   ఆకాశవాణి గవర్నమెంటుది కదా...మన గవర్నమెంటుకు సరదా లేదు 🙁

   తొలగించు
  3. మీలో విజ్ఞానశాస్త్రవేత్తయే కాదు విద్వత్కవి కూడా కలఁడు. మీరు గుర్తించుటయే యాలస్యము!!!

   తొలగించు
 18. ప్రవిమల భావ మనోహర
  కవనము లల్లెడు సుకవిగ కరుణా పరుడై
  భువిలోని బాధలును శో
  క... వినాశముగోరి వ్రాయు గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు
 19. శంకరాభరణం.. .నేటి సమస్య....

  సమస్య
  *** *** **

  కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై

  నా పూరణ. మత్తేభము
  **** *****

  రవి వీక్షించని చోటు గాంచునని విశ్రావంబు తా బొందుచున్

  కవివర్యుండును శాంతి నిల్ప భువినన్ గ్రంథమ్ములన్ వ్రాయడే?

  అవమానించుచు నివ్విధంబు గన నన్యాయంబె ముమ్మాటికిన్

  "కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై"

  .-- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించు
 20. "కవి నని గొప్పలు జెప్పుచు
  కవనపు వనమున తను దిరుగాడును గానిన్
  కవితల పస లేద"ను శం
  క వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు
 21. డా.బల్లూరి ఉమాదేవి.

  అవివేకంబది హెచ్చు కాగ మదిలో నత్యాశ తోవేడె లో
  కవినా శంబును కోరి వ్రాయునట సత్కవ్యంబు సంపూర్ణుడై
  సువిశాలం బగు నుర్విలో మనుజు లీసున్ ద్వేషమున్ వీడ శో
  క వినాశమ్మగు ప్రేమ నిండు నిట సాకల్యంబు సిద్ధించగా

  రిప్లయితొలగించు
 22. కందం
  సువిశాలంబైన మదిన్
  భవబంధ విముక్తి, ముక్తి పథ శోధనలో
  శ్రవణానందమ్మిడ శో
  క వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు
 23. మత్తేభవిక్రీడితము

  అవనిన్ మానవ జీవనంబు ఘనమై యానంద సందోహముల్
  రవళించన్ గద రూపుఁ గాంచెను కళా రాశుల్ చతుష్షష్టిగా
  కవనంబొక్కటి యందునన్ మెరసి సంస్కారమ్ము బోధించ నే
  కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై

  రిప్లయితొలగించు
 24. కవినాశంబునుగోరివ్రాయునటసత్కావ్యంబుసంప్రీతుడై
  కవిసేమంబునుగోరివ్రాయునిలసత్కావ్యంబులింపారగా
  గవనంబన్నదిదైవరూపమయియెక్కాలంబుజీవంబుతో
  నవకంబొందుచునుండగా,బలుకనన్యాయంబుగాదారమా!
  ---

  రిప్లయితొలగించు


 25. అవమానింప తగదయా
  కవి! నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్
  చవులూరవు! కావలె నీ
  కవిత్వ సంపద జనులకు కాపుగడ సుమీ


  జిలేబి

  రిప్లయితొలగించు
 26. కవియన ఋషిసంభూతుడు
  కవిరచనలుశుభములీయ ఖగవతిప్రజకున్
  గవినిన్ న్యాయమె యిటులన
  కవినాశము గోరివ్రాయు గావ్యములెలమిన్

  రిప్లయితొలగించు
 27. చెవిసోకన్ గడు దుష్టుడౌ ప్రభునిదుశ్చేష్టల్ కవీంద్రుండు వీ
  క, వినాశంబును గోరి వ్రాయునట, సత్కావ్యంబు సంప్రీతుడై
  శ్రవణమ్మైన పదమ్ములన్ కరము సుశ్రావ్యమ్ముగా వ్రాయు తా
  ను విశాలంపు మనస్కుడైన దొరపై నూత్నంపు యత్నమ్ముతో

  రిప్లయితొలగించు
 28. భువి దారుణముల నెత్తి వి
  రివిగ నిరంతర మతండు లీలా రీతిన్,
  వివరమ్ములు వలదుర నీ
  కవి, నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్

  [ నీకు + అవి = నీ కవి]


  అవనీ సంభవ జంతు సంచయ విరో ధాస్వాంత విత్తార్థ ధి
  క్భవబంధేషణ దుష్ట శక్తిగణ సేవా లోక మాత్సర్య భై
  రవ కార్యాచరణాభిలాష యుత దుర్దాంతాఘ హృన్నిర్దయా
  కవి నాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై

  [కవి = కళ్ళెము]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 29. స్తవనీయంబగు కావ్యఖండికలుసుస్తోత్రంబుగావ్రాసి,మా
  నవధర్మంబునురక్షసేయకవిపుణ్యాత్ముల్సమాజంబున న్
  శివనామామృతరాగమాలికలు యస్థిత్వంబుసాధింపనే
  కవినాశంబునుగోరివ్రాయునట సత్కావ్యంబుసంప్రీతితోన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి

  రిప్లయితొలగించు
 30. కవికేదియసాధ్యమిలను
  కవనముతో భువనములను కలవరపరచున్
  కవికలమునుకదుపుచుశో
  కవినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యములెలమిన్

  రిప్లయితొలగించు
 31. : మరొక పూరణ

  అవిభాజ్య కుటుంబమ్మున
  యవాం తరమ్ముల గుపించ యావే దనతో
  జవమున నాపదలచి శో
  కవి నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్"*

  రిప్లయితొలగించు

 32. అవనీ మండలమందు జనులన్యాయమ్ముగా బాధలన్
  చవిచూడంగ కవీశ్వరుండట దురాచారాల నాసాంతమున్
  గవనంబందున నెండగట్టుచును దుష్కార్యమ్ములన్ ద్రుంచి శో
  "క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై!"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "సజ్జనుల నన్యాయంబుగా..." అనండి.

   తొలగించు
 33. భువి పై రాక్షస నాశనమ్ము కొరకై పుణ్యాత్ములన్ బ్రోవగా
  రవి వంశాంబుధి చంద్రుడై వెలసె శ్రీరాముం డసామాన్యుడై
  కవి తానా మహనీయు గాధకిటు శ్రీకారంబు గావించి శో
  క వినాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై

  రిప్లయితొలగించు
 34. వ్యవహారమ్మును భోలెడు
  వ్యవసాయముఁ జేయురైతు వ్యదలం గని తా
  గవిగా కృషీవలుర శో
  క వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్

  రిప్లయితొలగించు
 35. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి ,
  కం.
  నవ కవితాఝరిని వికట l
  కవి, నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్ l
  భువిలో మెచ్చక దివికే l
  గి, విలయ తాండవము జేయ గీర్వాణుఁడు గనెన్ ll

  రిప్లయితొలగించు
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 37. బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా
  నవ లావణ్య విలాస భాసుర మహానందంబు సంధిల్లగన్
  కవిరాజన్య హితోక్తి సంభరిత విఖ్యాతాద్భుతాదర్శమై
  దివిలోక ప్రకటానురాగ సమమై,త్రీన్ తాప సంభూత,శో
  క,వినాశంబునుఁగోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై.
  ప్రసారమైన నా పూరణం

  రిప్లయితొలగించు