23, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3112 (అభయ మొసఁగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు"
(లేదా...) 
"అభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే"

40 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  రభసను జేసి మెండుగను రక్తము పీల్చెడి దానవాదులన్
  నభనున కెత్తి రాజ్యసభ నందున మేటిగ గోలజేయున్
  శుభముగ కీర్తి సంపదలు స్రుక్కక కల్గును పోరుడంచు వా
  రభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గోల జేయుచున్/ గోల జేయగా' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 2. *అశోక వనములో సీతతో రాక్షస కాంతల మాటలుగా నూహించి*


  ప్రేమ మీరగ గొనితెచ్చె భామ నిన్ను
  బెట్టు సేయక నీవింక పేర్మి తోడ
  నతని కౌగిలి జేరిన నబల చాలు
  నభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు.

  రిప్లయితొలగించండి
 3. అపుడు దశకంఠు డవ్వాని కనియె నిట్లు
  వినుము మారీచ! నామాట విందువేని
  యభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు
  కాదటన్నను యమపురి గనెద వోరి!.

  సభనొక దానవుండు హరుసంబున దైత్యజనాళి కిట్లనెన్
  ప్రభువులపైని భక్తిగొని వర్తిలు డన్నిట మీకు నిత్యమున్
  విభవము లందు సత్యమిది వీరిని మించినవారు లేరు మీ
  కభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే.

  రిప్లయితొలగించండి
 4. రాక్షస వనితలు హనుమంతునితో..

  తేటగీతి
  ఇయ్యశోక వనమ్మున నింతి జూచి
  తేటపడి వానరమ! రాము మాటలేల?
  చీల్చి చెండాడెదరు, మాని సీత వీడ
  నభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు

  రిప్లయితొలగించండి
 5. సమస్య :-
  "అభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు"

  *తే.గీ**

  లంక నాశనముగ జేసి యింక నీవు
  బ్రతుక జాలవు వానరా పారిపోక
  శరణు వేడుకొనుము చాలు శత్రువనక
  అభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు
  ..................✍చక్రి
  రాక్షస సైన్యం హనుమతో.....

  రిప్లయితొలగించండి
 6. విభీషణు పల్కుగా

  ప్రభువులు రామలక్ష్మణులు! భాగ్యవిధాతలు! కౌసలేయుడో
  యభినవ విష్ణుమూర్తి కరుణామయుడౌ! దరి యాదిశేషుడే!
  యభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు! రావణ కుంభకర్ణు! లే
  చి భవము దాటి వారి దరి చేరగ యత్నము చేయ వేడెదన్!
  జిలేబి

  రిప్లయితొలగించండి

 7. సీత తో కింకరి పలుకులు

  ముగుద! వినవె రాలేడు నీ మొగుడు సంద్ర
  మునిక దాటి ! ప్రేమ కురిపించు దశకంఠు
  పైన ! మారాజు గా మనువాడుమింక!
  యభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 8. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  శుభమగు బీహరందునను శోకము మీరగ మానవాళికిన్
  విభవపు దానవాధముల భీకర రీతిని ప్రోత్సహించు వా
  రుభయులు లాలు పుత్రులట నుల్లము లొల్లగ కొల్లగొట్టుమం
  చభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. అభయ మిచ్చి పాలించుగ సత్య నిన్ను
   విభవపు ప్రభల లంకేశు విశ్వ మందు
   న భయ రహిత దైత్యుల దాను నయము దోడ
   సభ, భవన, సంపదలొసఁగు సబల నీకు
   అభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు

   తొలగించండి
 10. (ఉపాధ్యాయుడు విద్యార్థులకు మానవసోదరులకు,దానవసోదరులకు గల తేడా గురించి బోధిస్తున్నాడు)
  శుభమది కల్గుగా వినుడు ;
  సోదరులా రఘురామలక్ష్మణుల్
  అభయము నిచ్చి ప్రోచెడి మ
  హాత్ములు ;రావణకుంభకర్ణులే
  యభయము నీయనట్టి విర
  సాత్ములు; తామసలక్షణుల్ ;
  సభయులు చెంత జేరినను
  జంపెడి ధూర్తులు ;క్రూరవర్తనుల్ .

  రిప్లయితొలగించండి
 11. శుభదులు,శూరులున్,జనుల శోకనివారణ తత్పరోన్నతుల్
  విభవ దయా విశారదులు,వీరులు,రాముడు,లక్ష్మణుండు,తా
  మభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు;రావణ కుంభకర్ణులే
  త్రిభువన రాక్షస ప్రముఖ తీవ్ర తమో వివశప్రతాపులున్.

  రిప్లయితొలగించండి
 12. శరణు వేడగ రాముడు సదయుు డగుచు
  అభయ మొసగి ప్రోచును......రావణాసురుండు
  వికృతచేష్టగ బాధించు విమల మతుల
  పరుల భామల మోహాన పంత మూని

  రిప్లయితొలగించండి
 13. దళిత సంఘముల మనోగతం
  ఉభయులు రాక్షసేశ్వరులు యోధులు పౌరుషమం దమేయులున్
  విభవము నొప్పెడున్ యసురవీరుల కోటగు లంకయందునన్
  రభసను జేయుచున్ దమదు రాజ్యమునందలి జీవకొటికి
  న్నభయము నిచ్చిప్రోచెడి మహాత్ములు రావణకుంభకర్ణులే

  రిప్లయితొలగించండి
 14. తే.గీ//
  సీతను త్రిజట జూచుచు శ్రీరఘుపతి l
  నభయ మొసఁగి ప్రోచును, రావణాసురుండు l
  యమరుడై దివికేగును, అంతమొందు l
  రాక్షసులిక, శ్రీరాముడె రక్షనొసగు ll

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. ధర్మ మూర్తి రాము డరాతి తమ్ముడైన
  అభయ మొసఁగి ప్రోచును; రావణాసురుండు
  దూత నెంచక హనుమంతు తోక గాల్చె
  సహజ లక్షణ మే రీతి సమసి పోవు

  రిప్లయితొలగించండి
 17. వావి వరసలు మరచిన పక్షులకును
  శిశువులనుజూచి కామించు పశువులకును
  రామ భద్రుని నిరసించు రాజ్యమందు
  అభయమిచ్చి ప్రోచును రావణాసురుండు!

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి రచన:


  రారా బాలకృష్ణ.! రారోరి బాలకృష్ణ ! రారా.! ముద్దులాడ. రారా.!!

  🙏🚩శ్రీకృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  అలకలు మోముపై కదలనట్టిటు., చల్దులకుండ రెండు చే...
  తులనొకమారు ముంచి., తిని., తోటి వయస్యులు నవ్వ వారి., మూ...
  తులకును రాయుచున్ ముదముతో., పరిహాసములాడుచుండగా,
  లలనలు గాంచి., రోషమతులై చని , తల్లికి చెప్పనల్లరిన్
  పిలువగ రాన్ , యశోద మెలిపెట్టి చెవిన్ వదనమ్ము జూడగా
  లలితముఖారవిందమున లక్షలసూర్యుల కోటిచంద్రులన్
  విలసితభూనభోంతరవిభిన్నసమస్తచరాచరాదిజీ...
  వుల నదులన్ మహాద్రులను పొల్పు ద్రుమమ్ముల తారకావళిన్
  జలధుల., వహ్నులన్., సకలజాతుల , గాంచుచు విష్ణుమాయయా.!
  కలయ.! యటంచు భ్రాంతిగొని కర్రను ప్రక్కనబెట్టి , పాలచె
  క్కిలిపయి ముద్దులీయ గిలిగింతల నవ్వెడి నల్లనయ్య మా...
  కిల పరదైవమయ్య ! యతడే గురువయ్య! నమస్కరింపుడీ.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 19. కష్టమందున వేడగ కాలుడార్య!
  యభయ మొసగిబ్రోచును,రావణాసురుండు
  నసురుడైనను,శైవుడునమితభక్తి
  నిగొలుచుదినముదినమునునియమముగను

  రిప్లయితొలగించండి
 20. కొంగు బంగారమై నిల్చు కోరినంత
  భక్త జనులకు శ్రీరామ భద్రు డెపుడు
  నభయ మొసగి ప్రోచును; రావణాసురుండు
  విజ్ఞులైన వారల మాట వినక చెడెను.

  రిప్లయితొలగించండి
 21. ఖలుల జంపగ వచ్చియు గణుతికెక్కె
  మునుల యాగాల నిర్విఘ్నమొనరజేసి
  అభయ మొసఁగి ప్రోచును, రావణాసురుండు
  జచ్చె రామబాణముతోడ రచ్చ లోన!

  రిప్లయితొలగించండి
 22. శ్రీరామచంద్రుడు

  " సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
  అభయం సర్వభూతేభ్యో
  దదామ్యేతద్వ్రతం మమ "
  అంటూ,

  శ్రీకృష్ణుడు

  " సర్వధర్మాన్ పరిత్యజ్య
  మామేకం శరణం వ్రజ
  అహం త్వా సర్వపాపేభ్యో
  మోక్షయిష్యామిమాశుచః"

  అంటూసర్వప్రాణులకు అభయ మిచ్చారు.
  కాని ఈ రావణకుంభకర్ణులు ఏ అభయము ఎవరికిచ్చారంటూ ప్రశ్నిస్తూ,
  విరుపుతో కూడిన ప్రశ్నార్థకపూరణ,

  'అభయము సర్వభూతముల కాశ్రయమొందిన నిత్తునంచు నా
  విభుడగు రాఘవుండు నదె బేర్కొని గృష్ణుడు నట్లె చెప్పి, తా
  రభయము నిచ్చి ప్రోచిరి మహాత్ములు, రావణకుంభకర్ణులే
  శుభముల నిచ్ఛి కాచిరొ విశుద్ధనయార్జితధర్మబద్ధులై? '.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 23. ఉభయులురామలక్ష్శణులుపోరునభీతిని గొల్పువారయున్
  నభయమునిచ్చిబ్రోచెడిమహాత్ములు,రావణకుంభకర్ణులే
  యిభమునుబోలిగర్వముననీశుడురాముని ధిక్కరించగా
  నభయమునిచ్చురాముడనినంతముజేసెనునొక్కవేటునన్

  రిప్లయితొలగించండి
 24. సీతా దేవి రాక్షస స్త్రీల మాటలు విను నప్పటి మనోగతము:

  వెఱ్ఱు లకట యీ యసురులు తుఱ్ఱు మంచుఁ
  బోవు నసువులు రాఁగ రాముండు వేయ
  నస్త్రములు వీరు నేరక యందు రిట్లు
  నభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు


  నభమున దేవ సంఘము ఘనమ్ముగ దీవన లీయ మిత్ర స
  న్నిభములు జంతు రాశు లని నిత్యము భూజన పూజ్య కణ్వ ఋ
  ష్యభయ వనమ్ము నందుఁ బల లాశన శాక మృగాళి కిమ్ముగా
  నభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే

  [రావణము = పెద్దగా నఱచునది, సింహము; కుంభకర్ణుఁడు = పెద్ద చెవులు కలవాఁడు, గజరాజు]

  రిప్లయితొలగించండి
 25. కాకినాడ యందు కలదు గానగ నది
  నాలయమొకటి రక్కస నాథునకును
  నమ్మి కొలుచు చుండె తలచి నగర జనులు
  నభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు

  రిప్లయితొలగించండి
 26. మైలవరపు వారి పూరణ

  శుభచరితన్ ధరాత్మజనశోకవనిన్ చెరబట్టినట్టి రా...
  సభసముడైనవాడొకడు , జాడ్యమదాంధుడొకండు.! సత్కవీ.!
  అభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే !!?
  ఇభవరదుండు రాఘవుడె యెల్లజనాళికి దిక్కు నమ్ముమా.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 27. ప్రహస్తుడు విభీషణునితో...

  చంపకమాల

  శుభమని యుద్ధతంత్రముల శోధనఁ జేయ నొహో! విభీషణా!
  యుభయులు రామలక్ష్మణులు నున్నతు లంచును సొల్లు మానుమా!
  యభమును మాటలాడక భయంబును వీడుము లోక భీకరుల్
  నభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే!

  రిప్లయితొలగించండి
 28. ప్రభువని చెప్పు రాముడు విరాగిగ కానఁ జరించువాడు తా
  నభసము దాటి వచ్చునని నమ్మితి వేమొ, యసాధ్యమే సతీ
  శుభముల బొందవచ్చునిక సుందరి దానవు కోర్కె దీర్చిన
  న్నభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే

  రిప్లయితొలగించండి
 29. అభిమతి దోడ రాక్షసుల కండగ నిల్చి యధర్మమంతకున్
  అభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే
  విభవము కోలు పోయి భువి వీడిరి రాముని శస్త్ర ధాటికిన్
  శుభముగ గాచు ధర్మము సుశోభితమౌనటు దైవమెప్పుడున్

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి నమస్సులు
  అభయమిచ్చి ప్రోచును రావణాసురుండు
  నసురులకును,శ్రీకృష్ణుడు నందునింట
  బాల లీలను జూపుచు పాపులన్ న
  శింప కలుగజేసె వివేక క్షితి శ్రుతిగ.

  రిప్లయితొలగించండి
 31. రామదేవుని శరణన్న రక్షఁగూర్చి
  యభయ మొసఁగి ప్రోచును, రావణాసురుండు
  పతనమగుటది తప్పదు! పాప ఫలము
  ననుభవించును రావణుఁడాజియందు.

  రిప్లయితొలగించండి
 32. అభయమిచ్చి ప్రోచును రావణాసురుండు
  రామునెదురించగలిగిన రక్షకుండు
  లంకవాసులదీవించ లక్ష్యశధ్ది
  గలిగియున్నాడు భయమేల?నలుగవలదు( అనిలంకవాసులకు మంత్రి హితవు)

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.
  ( విభీషణుడి మనోగతం...)

  శరణు కోరిన వారిని కరుణ జూపి
  ప్రబల శత్రువునైన శ్రీరామచంద్రు
  డభయ మొసగి ప్రోచును; రావణాసురుండ
  ధర్మ మార్గమున జనుచు తన పతనము
  తానె కొని తెచ్చుకొనుచుండె త్వరిత గతిని.

  రిప్లయితొలగించండి
 34. రాక్షసులనోగతం....
  చంపకమాల:
  శుభముల గూర్చువార లుపశోభల వెల్గుచు నుండువారలున్
  విభవము నందజేయగల వీరులు శూరులు యుద్ధభూమిలో
  ప్రభలను జిమ్మువారు మనరాజులు వారలె రాక్షసాళికి
  "న్నభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే"

  రిప్లయితొలగించండి
 35. మాయలేడిగ వేవెళ్లి మరులు జూప
  అభయ మొసగి ప్రోచును రావణాసురుండు
  రామబాణముతో నాకు వ్రాసి యుండె
  యనుచు మారీచుడు తలచె మనము నందు

  రిప్లయితొలగించండి