21, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3110 (మిత్తికిన్ ముఖ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట"
(లేదా...)
"తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్" 
(నిన్న హైదరాబాదు, అమీర్‌పేటలో అముదాల మురళి గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

90 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తనువున్ త్రోలుచు రెండు కాళ్ల పయినన్ తాదాత్మ్యమై సెల్లునన్
  మనమున్ గ్రోలుచు మాధురమ్మ నగవున్ మర్యాదయే వీడుచున్
  చనుచున్ వీధుల మధ్యనున్ వడివడిన్ సంతోషమున్ వీడియోల్
  కనఁగన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబగున్ జూడఁగన్

  మాధురమ్మ = మాధురి దీక్షిత్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. బాలముకుంద శర్మ:

   "బహుశా...

   కనగన్ మిత్తి కమీరుపేటయెగ ముఖ్యద్వారమున్ ౙూడగన్

   అని ఉండాల్సింది"

   తొలగించు
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమస్యాపాదాన్ని సవరించడంతో మీ పూరణలో అన్వయం కొంత తప్పింది. మన్నించాలి. "వడిగ సందర్శింపగా వీడియోల్" అంటే అన్వయం సరిపోతుంది.

   తొలగించు
  4. 🙏

   సరిక్రొత్త ప్రాతః కాలపు సరదా పూరణ:

   వలపుల్ మీరగ సత్యభామ గొనుచున్ వయ్యారమౌ రీతినిన్
   తెలుపన్ ప్రేమను మంద హాసములతో తెల్లారి జామున్ విధిన్
   సలుపన్ యాత్రలు వీధి మధ్యమున భల్ సంతోషమౌ జంటనున్
   తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

   తొలగించు
  5. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తెల్లారి' వ్యావహారికం. అయినా మీది సరదా పూరణ అంటారు కనుక ఇలాంటి దోషాలకు మీరు నిరంకుశులు, అతీతులు!

   తొలగించు
 2. జంట నగరాల *రోడ్ల*పై సాగువారు
  గుంటలందున పడి నేలఁగూలుచుండ
  వింతయే యిట్లు పలుకగా విబుధులార!
  మిత్తికిన్ ముఖద్వారమమీరుపేట.

  రిప్లయితొలగించు

 3. సుబ్బారావు గారే మాకు శరణు !

  అమీరుపేటకి కొత్తిమీరకట్టకి సంబంధం చెప్పొచ్చు గాని‌ ఇట్లా మిత్తికి కలుపుటెట్లు :)  ఏమిటంటిరి ? కవివర! యెటుల యెటుల
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట?
  ఇట్లు పలుకుట తగునయ్య? యింపు గాను
  లేదు వినుటకు వలదిది లెస్సగాదు !  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ పేరు కనిపించకుంటే ఇది అచ్చంగా సుబ్బాగారి పద్యమే! పదప్రయోగం, శైలి అన్నీ వారివే!

   తొలగించు
  2. జోహార్లు పరకాయ ప్రవేశ విద్య లో ప్రవీణురాలైన
   జిలేబి గారికి.

   తొలగించు
 4. మిత్తికిన్ ముఖద్వార మమీరు పేట
  లెస్స గాదని పలికిరి యుస్సు రనుచు
  వింత సమస్య నిచ్చిన చింత గాక
  యెట్లు పూరించ గోరిన మెట్లు మెట్లు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వింతగ సమస్య నిచ్చిన' అనండి. లేకుంటే గణదోషం. 'మెట్లు మెట్లు'?

   తొలగించు
  2. మిత్తికిన్ ముఖద్వార మమీరు పేట
   లెస్స గాదని పలికిరి యుస్సు రనుచు
   వింతగ సమస్య నిచ్చిన చింత గాక
   యెట్లు పూరించ గోరిన మెట్లు మెట్లు

   తొలగించు
  3. మెట్లు మెట్లు అంటే పడికట్టు పదములు [ఆంధ్ర భారతి ]

   తొలగించు
 5. తే.గీ//
  భాగ్యనగర మందున నిత్య భాగ్యలక్ష్మి l
  విలయతాండవ మాడుచూ విసృతమవగ l
  బతుకు భారమైన ప్రజలు బయలుదేరె l
  మిత్తికిన్ ముఖద్వారమ మీరుపేట ll

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లి సిరిపురం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాండవ మాడుచున్ విస్తృతముగ । బ్రతుకు... బయలుదేర' అనండి.

   తొలగించు
 6. తే.గీ//
  భాగ్యనగర మందున నిత్య భాగ్యలక్ష్మి l
  విలయ తాండవ మాడుచున్ విసృతముగ l
  బ్రతుకు భారమైన ప్రజలు బయలుదేర l
  మిత్తికిన్ ముఖద్వారమ మీరుపేట ll

  రిప్లయితొలగించు
 7. "రద్దీ ఎక్కువగా ఉండి తరచు ప్రమాదాలు జరుగుతాయి కనుక అమీరుపేట మృత్యు ముఖద్వారం అనే అర్థంలో పూరించవద్దు" అన్న నిబంధనతో ఇచ్చిన సమస్యకు శతావధాని ఆముదాల మురళి గారి పూరణ......

  సత్య సుందరమైన విచార ధార
  నిత్య యజ్ఞంబుగా సాగు నిష్ఠతోడ
  జ్ఞాన మిచ్చోట వెల్గొందు, జడత పాలి
  మిత్తికిన్ ముఖద్వార మమీరు పేట.

  (అమీరుపేటలో వందల కొలది సంస్థలు విద్యార్థులకు వివిధాంశాలలో శిక్షణ నిస్తుంటాయి. కనుక జడత్వమనే మృత్యువుకు అమీరుపేట ముఖద్వారం)

  రిప్లయితొలగించు
 8. తలపై త్రాణము దాల్చబోవు యువకా! తాళన్ బ్రయత్నించ బో
  విలపై నంతట శీఘ్రగామి వయి నీకెవ్వారు బోధించినన్
  బలుకంజాలవు వాహనంబుపయినన్ బర్వేల జాగ్రత్తరా
  తలపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించు
 9. మైలవరపు వారి పూరణ

  కలయా ! సత్యమ ! యింతలేసి జనమా ! కంగారుగా బోవగా
  బలమా ! ధైర్యమ.! వృత్తియా ! యితరమౌ వ్యాపారమా ! బాపురే !
  తలక్రిందౌ మితధూమశాకటపు యాత్రన్ సుంత యట్లిట్లుగాన్
  తలపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబగున్ జూడఁగన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 10. తే.గీ//
  మిత్తికిన్ ముఖద్వారమ మీరుపేట l
  యందు ప్రాచుర్యమును బొందె, యాతనపడు l
  ప్రజల బాగోగు జూడగ ప్రభుత కృపన l
  మానసిక వైద్యశాలయు గానవచ్చు ll

  రిప్లయితొలగించు


 11. తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్
  వలదే పోవలదే షికారుకు జనావాసంబు తీవ్ర్రమ్ము! ఓ
  వలపైనాచిన దాన! మాట వినవే వయ్యారి పూబోడియా
  కలలో తేలుచు ట్యాంకుబండు వెడలన్ కారెక్కు రావేసఖీ !


  జిలేబి

  రిప్లయితొలగించు
 12. తే.గీ//
  బహుళ వ్యాపార సముదాయ ప్రాప్తికిపుడు l
  మిత్తికిన్ ముఖద్వారమ మీరుపేట l
  యనుచు, బరుగుబెట్టి జనులు యరుగుచుండ l
  తరలి యొచ్చుచుండెను లక్ష్మి దారిలేక ll

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బహుళ వ్యాపార' అన్నపుడు 'ళ' గురువై గణదోషం. సవరించండి.

   తొలగించు
 13. మంచి సంపాదనల్ గల్గి మాన్యు లగుచు
  దాన ధర్మాలు జేయు వదాన్యు లగుచు
  పేద వారికి యండయై పేదరికపు
  మిత్తికిన్ ముఖ ద్వారమమీరు పేట

  రిప్లయితొలగించు
 14. నిండె రోడ్లన్ని బండ్లతో నేల కనక |
  కదల రహదారి జనులకు కఠిన మాయె |
  ప్రాణ మరచేత నిడుకొని ప్రజలు తిరుగు|
  "మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట"

  రిప్లయితొలగించు

 15. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బలుపౌ రీతిని రాత్రి ప్రొద్దుటను భల్ ప్రార్థించి యెల్లమ్మనున్
  సలుపన్ విద్యలు పాసు మార్కుకొరకున్ సంపూర్ణతన్ ఫైలవన్
  తలలో చింతలు నాత్మహత్య తరఫున్ తల్లాడు విద్యార్థినిన్
  తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 16. వానకురియగ పథముల వరద పాఱు
  అడుగు ముందుకువేయగనుడుగు జవము
  చీడపీడలు మశకముల్ చెలగఁజేయు
  మిత్తికిన్ ముఖద్వారమమీరుపేట

  రిప్లయితొలగించు
 17. భాగ్య నగరము నందొక భాగ మౌత
  అంత గొలిచెడి దేవుళ్ళ కాలవాల
  మీ యమీరు పేటను మోక్షమిచ్చు మిత్తి
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  మిత్తిమిత్తి-శివుడు

  రిప్లయితొలగించు
 18. పరుగు లెత్తెడు వాహన వరుసతోడ
  పెరిగె పర్యావరణమందు పిసకఁ గనగ
  నంతు పట్టని రోగాలె యంకురింప
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాహన వరుస' అనడం దుష్టసమాసం. "వాహన పంక్తితోడ" అనండి.

   తొలగించు
 19. జ్ఞాన మార్జించవత్తురు ఛాత్రులిటకు
  తొలగు గాఢాంధకారమ్ము ధూర్తజనుల
  మనసు ప్రక్షాళనమ్మగు మందమతుల
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట!!

  రిప్లయితొలగించు
 20. వివిధ దెసల విజ్ఞానము పెరుగు చుండె
  నెల్లెడ నిపుణుల కొఱత యెదుగు చుండె
  నేటి వేళలందు వలయు నెఱతనముల
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  మిత్తి = ఆధిక్యత ( ఆం. భా)

  రిప్లయితొలగించు
 21. సకలకళలకు నిరవుగా ఛాత్రులకది
  వెలుగుచుండగ దెలిసియుదెలియ కిటుల
  మిత్తికిన్ముఖద్వారమమీరుపేట
  యనుట పాడియే గురువర!మననజేయ

  రిప్లయితొలగించు
 22. కళల కాణాచి యీపేట కంచు కోట !
  వర్ధమాన కళాకార్ల వరమనదగు
  నెదుగుదలకు కాకయె మఱి యెట్టులౌను ?
  "మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట"

  రిప్లయితొలగించు
 23. తేటగీతి
  వసతి గృహమదె విద్యార్థి బాగుపడఁగ
  దారిమల్లించఁ జూచెడు దనుజులుండ
  నడత బలహీనతలఁ దప్పు బెడదతోడ
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  రిప్లయితొలగించు
 24. కిక్కిరిసి దారులన్నియు కిటకిట యిట
  పక్కకు తల ద్రిప్పుటకును కటకట యట
  భాగ్య నగరమున జనుల బ్రతుకు బాట
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  రిప్లయితొలగించు
 25. మత్తేభవిక్రీడితము

  ఇలనే స్వర్గముఁ జేసు కొమ్మనుచు మీకేర్పాట్లకై తండ్రులున్
  గలిమిన్ త్యాగముఁ జేయ విద్యగొని విజ్ఞానమ్ము శోధించగన్
  బలహీనమ్ములఁ జిక్కి స్రుక్కి యువతా! పాడైతె దుర్నీతులన్
  దలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్  రిప్లయితొలగించు
 26. భాగ్య నగర నివాసుల బ్రతుకు బాట
  వేల వాహనముల మధ్య వెదుకులాట
  నెత్తికిన్ హెల్మెటు ధరింప నేర్వకున్న
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  రిప్లయితొలగించు
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 29. చేతిలోనెడతెగకుండు సెల్లు ఫోను
  దారి నిండుగ నుండును దారుణముగ
  నీటి మడుగులు యుండదు నియమమసలు
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మడుగులు + ఉండదు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించు
  2. ధన్యవాదములు గురువు గారు.

   తొలగించు
 30. ఉదక మగ్ని గాలి పుడమి చదలు గృహము
  వాహనం బాయుధము జర వ్యాధి యాప
  ద లన నిది యది యన నేమి ధరను గాంచ
  మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట


  విలయుండౌ నకటా నివాసమున నిర్భీతుండునై యుండఁ గాఁ
  గలలో నైనఁ దలంచ నట్టి పగిదిం గావం బడుం గారణం
  బిలలోఁ జావున కా శివాజ్ఞయె సుమీ యిభ్భంగి నేనెన్నఁడుం
  దలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  [తలఁపన్ = తలఁపను]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 31. అలుపే లేకను నిత్య కృత్యముగ యాతాయాతమున్ యాతనై
  నిలుపన్ దృష్టిని కష్టమైనను ప్రజానీకమ్ము సాగింతురే
  మలుపుల్ ద్రిప్పెడి వాహనమ్ములకు మోమాటమ్మదే లేదిటన్
  తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 32. వలసల్ వచ్చిరి దండిగా జనులు సంపాదించు చిత్తంబుతో
  బలుప్రాంతమ్ముల నుండి, వాహనములీ ప్రాంతమ్ములో నిత్యమున్
  బలురోగమ్ములఁ వ్యాప్తిజేయు కసటే వర్ధిల్ల నచ్చోటులో
  తలపన్ మిత్తికమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 33. తే.గీ. మెట్రొ రైలంచు స్తంభముల్ మిన్నగాగ
  జంక్షనాయెనె యేవైపు జరుగలేము
  దారికైనను జూడ నెవ్వారికైన
  "మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట"..!

  రిప్లయితొలగించు
 34. తేటగీతి:
  విద్యయు విలాస మొకచోట విహిత మేగ
  చేరువగ దొరికెడు వన్ని జేర సులువు
  కాలు మోపను జోటులేక కలవరము
  మిత్తికిన్ ముఖద్వారమ మీరుపేట l

  రిప్లయితొలగించు
 35. మెట్రొ రైలుతో వీథుల మీది రద్ది
  తగ్గి పోవ నంత సురక్ష తారసిల్లె
  మిత్తికిన్ ముఖద్వార మమీరు పేట
  కాదనుటె నిజమిక మీద కచ్చితముగ!

  రిప్లయితొలగించు
 36. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....

  జలముల్ నిండిన గుంతలే నెటు గనన్ సంక్లిష్టమౌ దారులే
  పలు చోట్లన్ జరు గచ్చటన్ నిరతమున్ పంచత్వముల్ బండ్లచే (కార్లచే)
  విలసిల్లే నగరమ్ము దుర్దశను సంవీక్షించు వారెల్లరున్
  దలపన్ మిత్తి కమీరు పేటయెముఖద్వారమ్ము ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గుంతలే యెటు... విలసిల్లున్...' అనండి. 'విలసిల్లే' అనడం వ్యావహారికం.

   తొలగించు
 37. లలనల్ బారులుతీరియంగడులలో లాస్యంబుగా కుల్కుచున్
  వెలుముల్ బేరములాడుచుండెదరు యేవేళన్విలాసంబుగా
  వెలయెంతేనియులెక్కచేయరుగదావెర్రిన్ సదా భర్తకున్
  తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆడుచుండెదరు + ఏవేళ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "బేరము లాడుచుంద్రు గద యేవేళ..." అనండి.

   తొలగించు
 38. కలవేనక్కడ ధూమవస్తువణికాగారాప్తమార్గమ్ములున్
  కలవేనక్కడ తృష్ణజృంభ "సుర"గంగాతీర్ధధిష్ణ్యంబులున్
  కలవేనక్కడ కామశాస్త్రకలితఖ్యాతాంగనాసంఘముల్
  తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్
  [ధిష్ణ్యంబులు = స్థానములు బ్రౌణ్యం]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలవే + అక్కడ' అనుకుంటే 'కలవే యక్కడ' అవుతుంది.
   'కలవేని + అక్కడ' అనుకుంటే 'కలవేని యక్కడ' అవుతుంది.
   మరి మీరేమనుకున్నారో?

   తొలగించు
 39. గురువు గారూ,
  ధన్యవాదములు. కలరేని అని అనుకొని రాశాను.
  మీ సూచనమేరకు సవరించినాను.
  భవదీయుడు
  ఊకదంపుడు

  కలవే యక్కడ ధూమవస్తువణికాగారాప్తమార్గమ్ములున్
  గలవే యక్కడ తృష్ణజృంభ "సుర"గంగాతీర్ధధిష్ణ్యంబులున్
  గలవే యక్కడ కామశాస్త్రకలితఖ్యాతాంగనాసంఘముల్
  తలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 40. రాజధాని నగర మందు రద్ది హెచ్చె
  మిత్తి కిన్ ముఖద్వార మమీరుపేట
  వాడవాడల జనములు బండ్ల వడిగ
  సాగుట గని భీతిల్లిరి జనము లచట.

  రిప్లయితొలగించు