2, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3093 (కల్లలే చెప్పుచుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కల్లలే చెప్పుచుండు నాకాశవాణి"
(లేదా...)
"ఔనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్"

78 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వానల్ బాగుగ వచ్చి కర్షకులికన్ బ్రహ్మాండమౌ రీతినిన్
  కోనల్ కోనల రాష్ట్రమందు భళిగా కొండాడ్రు మిమ్మంచు పల్
  గానమ్ముల్ వడి పాడి నేతలవహో...
  కంఠమ్ము వేచీల్చగా
  నౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. సరదా శార్దూలమ్మును
   పరగడపున వేగి వ్రాయ పండిత వర్యా!
   బిరబిరను బుఱ్ఱ వేడై
   దురుసవ నా హార్టు రేటు దుర్భరమాయెన్

   తొలగించు
  3. Lion Anuprasad Miryala:

   ప్రతిరోజూ ప్రాతఃకాల సరదా పూరణ కోసం ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాం ప్రభాకర శాస్త్రి గారూ🙏🙏🙏😊

   తొలగించు
  4. కంది శంకరయ్య గారు:

   "ఇప్పుడు నార్మల్ కు వచ్చిందా హార్టు బీటు?"

   తొలగించు
 2. శ్రీ గురుభ్యోన్నమః🙏

  వర్ష సూచన జేయగా వట్టిగుండు
  నింగి పొడిగుండు ననిజెప్ప నేల దడియు
  నిజము వాతావరణ సూచి నెఱుఁగ లేము
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి

  రిప్లయితొలగించు
 3. *కంసునితో వసుదేవుని మాటలుగ*

  పడతిఁ జంపకు మో బావ పాప మదియు
  ధీరుడవగు నిన్ను వధించు వీరు డెవడు
  ధరణిఁ బుట్టగ లేడయ్యె, తరచు గాను
  కల్లలే చెప్పుచుండు నాకాశ వాణి.

  రిప్లయితొలగించు
 4. ఆకాశవాణి సమస్యాపూరణం పంపని వారెవరైనా ఉంటే ఈరోజు ఉదయం 10 గం.లోగా పంపండి.
  "కవి నాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై"
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించు
 5. నీలి వార్తలు జెప్పగ నీల వేణి
  నిజము మరుగున పడవేసి నేర ములను
  పనికి మాలిన హత్యలు పౌరు షమున
  కల్లలే చెప్పు చుండు నాకాశ వాణి

  రిప్లయితొలగించు
 6. సరస సంగీత సాహిత్య భరితమగుచు
  సర్వ కళలకు నిలయము,సన్నుతంబు!
  భ్రమల తప్పించి,నమ్మించి,పదుగురాడు
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి.

  రిప్లయితొలగించు


 7. హన్న ! ఆకాశవాణి కివ్వాళ రికార్డింగ్ కెళ్తూ ఇట్లా అభాండాలేయడమా ! మేమొప్పుకోము :) మా ఆకాశవాణి కి మించిన దేది కలదు సత్యము చెప్పుటలో :)


  టీవి తెరిచిన చానళ్ళు టింగురంగ
  కల్లలే చెప్పుచుండు, నాకాశవాణి
  చూడ సత్యమేవ జయతే సూక్తి ని విడు
  వక నిబద్ధత తో తెల్పు వార్తలెల్ల !  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   చక్కని పూరణ. ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   నిజానికి ఈ సమస్యను ఆకాశవాణిలోనే ఇస్తానన్నాను. కార్యక్రమ సంచాలకులు రాంబాబు గారు విని, నవ్వి వద్దన్నారు.

   తొలగించు

  2. ఇవ్వాళ్టి పూరణలు చూసేక రాంబాబు గారు అరరే మంచి అవకాశం జారి పోయిందే అనుకోక మానరనుకుంటా :)

   రాంబాబు గారికి పాత దోస్తి జిలేబి సలామని చెప్పండి :)

   జిలేబి

   తొలగించు
 8. సత్యంబు నెరిగి నిజమున్ తె
  ల్పగా తానై వచ్చె బలుకుల వాణీ,
  మాయ కాంపిన కంసుని బ్రమ
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి


  ఒక క్షణము పాటు సోదరీ వాత్సల్యం అను మాయ కంసుని బ్రమింప చేయు సందర్భము.
  ~ శరశ్చంద్ర

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శరత్ చంద్ర గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే. కాని ఛందోబద్ధంగా లేదు మీ పూరణ.

   తొలగించు


 9. చానళ్లన్నియు కట్టగట్టుకొనుచున్ సత్యమ్ము నేపాతిబె
  ట్టేనాయే మన దేశమందు; జనులట్టేనమ్మకన్ వాటినే
  ఔనౌఁ గల్లలె చెప్పు నందురు గదా! యాకాశవాణిన్ జనుల్
  చానాచక్కగ సత్యమేవజయతే చందమ్ముగాజూతురే!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాకుంటే వాడుక పదాలు ఎక్కువ పడ్డాయి...

   తొలగించు
 10. సమస్య :-
  "కల్లలే చెప్పుచుండు నాకాశవాణి"

  *తే.గీ**

  జోరు వానలనుచు జెప్పు హోరుగాను
  వాన కొరకు వేచియు జూడ వానరాదు
  వర్ష సూచన విషయమ్ము వట్టిదగును
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి
  .....................✍చక్రి

  రిప్లయితొలగించు
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 12. చెరసాలలో నుంచిన దెవకీ వసుదేవులకు 8వ గర్భంబున నొక యాడుది బుట్టినట్లు దెలిసి తనలోతను అనుకొన్నాడట-
  కంసుడు ఈ విధంగా...

  చెల్లి కేడవ గర్భంబు ఛిద్రమయ్యె
  అష్టమంబున నాడుది యవత రించ
  చిత్రమేమిటో విధిరాత జెప్పలేము
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి

  రిప్లయితొలగించు
 13. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఆనందమ్ముగ కుల్కుచున్ ప్రభుతదౌ నారాధ్య కంఠమ్ముగా
  వీనుల్ విందగు మాటలన్ పలుకుచున్ విడ్డూరమౌ రీతినిన్
  జానల్ బెత్తెడు కృత్యముల్ పొగడగా జాప్యమ్ము లేకుండగా
  నౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్

  రిప్లయితొలగించు
 14. దేవకిని చంపబోతున్న కంసునితో వసుదేవుడు

  చెల్లెలే దయజూపుమీ చిత్తమందు
  తల్లియౌ సమయమ్మున తథ్యముగను
  చెల్లులే నీదుకోరిక చింతవలదు
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి

  రిప్లయితొలగించు
 15. వార్తలు చదువు వేళన ప్రతిదివసము
  జరుగు విషయములన్నియు చదువుచుండ
  శాసన సభలో సభ్యులు సలుపుచున్న
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి

  రిప్లయితొలగించు
 16. తరచు హెచ్చరించు ప్రజను దైవవాణి
  జరుగును విపత్తు లనుచును జగతి లోన
  స్వార్థ పరులవి నమ్మక పలికెదరిటు
  "కల్లలే చెప్పుచుండు నాకాశవాణి"

  రిప్లయితొలగించు
 17. మైలవరపు వారి పూరణ

  జ్ఞానంబున్ సమకూర్చు పెద్దల సమీక్షన్., కర్ణపర్వమ్ములౌ
  గానమ్ముల్ వినిపించు., రైతులకు యుక్తంబైన కార్యక్రమం..
  బానందంబిడు.,బంధువందరకునార్యా.!యిట్లనన్ జెల్లునే.?
  ఔనౌఁగల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి అధిక్షేపాత్మకమైన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 18. ఎన్నికల ముందు జూపెద రెన్నొ కలలు
  యెన్ని కల్లలైనను వచియింతు రపుడు
  విధిగ నెన్నికల ప్రసార వేళ వారి
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలలు + ఎన్ని' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "కలల । నెన్ని..." అనండి.

   తొలగించు
 19. శ్రోత కుపయుక్త వార్తలు సూక్త చయము
  హితము గోరెడు విషయాలు సతము దెలుప
  కల్లలే చెప్పు చుండు నాకాశవాణి
  యనుట తగదయ్య గూర్పగా నప యశంబు

  రిప్లయితొలగించు
 20. కల్ల లేచెప్పు చుండునా కాశవాణి
  యనెడుపలుకులు నిజములే యక్షరాల
  వచ్చుననుజెప్పు వర్షమ్ముపడదు మనకు
  రాదనినుడువు తోడన రాళ్ళుపడును
  (రాళ్ళవర్షము)

  రిప్లయితొలగించు
 21. కుండపోత వర్ష మనంగఁ గురియ దకట
  యెండ మండు నంచు ననంగఁ గుండపోత
  వాన రాక పోకల నది కాన లేదు
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి


  దీనవ్రాత విధేయ భూత ఖర నిర్దేశవ్రజ వ్యాప్తమై
  నీనా భేదము సేయు దేశజనమున్ నిర్వీర్యమే నిత్యమున్
  గానశ్రేణి సపాన వశ్య గురు చీత్కారమ్ములన్ నిల్తురే
  యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యా కాశ వాణిన్ జనుల్

  [కాశము = ఒకానొక దేశము]

  రిప్లయితొలగించు
 22. ఙ్ఞానంబిచ్చును వార్తదెల్పునునికన్ గైతల్ సరాగంబుతో
  నానందంబును బొందునట్లుగ దగన్నాలాపముంజేయగా
  నౌనా గల్లలెచెప్పునందురుగదాయాకాశవాణిన్జనుల్
  వీనుల్సోకగరానిమాటలుసుమావిన్పించెగానిత్తఱిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తెల్పును + ఇక = తెల్పునిక' అవుతుంది. అదనంగా నుగాగమ మెక్కడిది? "వార్తలన్ దెలుపులే గైతల్..." అనండి.

   తొలగించు
 23. అపుడు నపుడు జరుగు చుండు నటుల కద్దు|
  జగతి వార్తల చక్కగ చాటి చెప్పు|
  "కల్లలే చెప్పుచుండు నాకాశవాణి"
  యనుట పాడి కానే కాదు యరయ జూడ |

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాదు + అరయ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పాడి కాదయ్య మీ రరసి చూడ" అనండి.

   తొలగించు
 24. తానే కొల్ల లబద్ధవాక్యములు నిత్యప్రోక్తులై యొప్ప, స
  మ్మానార్హమ్ములఁ జేయుడం చనియె తన్మాహత్మ్య మొప్పారగన్
  వేనోళ్ళన్ వరకందిశంకరు , డహో వింతైన నేరీతి? నే
  డౌనౌఁ గల్లలె చెప్పునందురు గదా! యాకాశవాణిన్ జనుల్

  రిప్లయితొలగించు
 25. పరుల ధనముల నాశింప పాడి యనును
  సంపదకు మితి యన్న దసత్య మనును
  ముదిమి నైనను మరణము బొంద వనును
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి.

  ( నాకు + ఆశవాణి )

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆశావాణి' అనడం సాధువు అనుకుంటాను.

   తొలగించు
  2. ఆశ యొక్క వాణి అని నా భావనండీ. తప్పంటారా

   తొలగించు
 26. నేనే తప్పును చేసినాడను కదా నిన్ బావను న్నిర్దయన్
  నానా హింసల బెట్టి యుంచి చెఱలో నాసోదరీ సైపుమా
  రానౌ నష్టమ గర్భమందు నొక కుఱ్ఱం డన్న పాపాయెగా
  నౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్.

  రిప్లయితొలగించు


 27. కల్లలే చెప్పుచుండు నాకాశవాణి
  యనుట పాడి కాదు సతత మవని యందు
  కష్ట సమయములందున గళము నెత్త
  కణ్వసుత బ్రతుకు నిలిచె గాదె నాడు

  రిప్లయితొలగించు
 28. వానల్ గాలులతోడ వచ్చునని విశ్వాసమ్ము గల్గించుచున్
  నానా వార్తలు చెప్పుచుందురయ ప్రాణాపాయమున్ దెల్పగా
  నేనాడైన నవాస్తవంబయినచో యీరీతిగా నందురే
  *"యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్"*

  రిప్లయితొలగించు
 29. వానల్ గాలులతోడ వచ్చునని విశ్వాసమ్ము గల్గించుచున్
  నానా వార్తలు చెప్పుచుందురయ ప్రాణాపాయమున్ దెల్పగా
  నేనాడైన నవాస్తవంబయినచో యీరీతిగా నందురే
  *"యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్"*

  రిప్లయితొలగించు
 30. ఆనందమ్మున బెండ్లిసేసితివి నీవా ర్భాటమున్ జూపుచున్
  జ్ఞానాంభోధివి నీవుగాదె యిట యజ్ఞానమ్ముతో నివ్విధిన్
  నా నారిన్ హతమార్చనేల యది యన్యాయమ్ము కాదందువే
  యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్

  రిప్లయితొలగించు
 31. ప్రాణాపాయము పొంచి యున్న దనుచున్ వార్తల్ వచించెన్ గదా
  ప్రాణేశా! వలదింక యాత్రలనుచున్ బ్రాణేశయే చెప్పగన్
  జ్ఞానమ్మేమయెనోయి నీ విటుల యజ్ఞానమ్ముతో పల్కగా
  నౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  2. తేటగీతి
   పాడిపంటల దేశమ్ము పరిఢవిల్ల
   కళల యౌన్నత్యమునఁ బ్రజ కాంచ ముదము
   గూర్చి, కథనాలు నాటికల్ పేర్చ నవియె
   కల్లలే? చెప్పుచుండు నాకాశవాణి

   తొలగించు
  3. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 32. శార్దూలవిక్రీడితము
  ఏనాడో మన నిర్ణయమ్ము వరకే యీ తీర్థయాత్రల్ పతీ!
  వానల్దప్పని యల్పపీడన భయోత్పాతంపు టీ వార్తలన్
  మానన్జాలము ముఖ్యమౌ పయనముం బ్రాణేశ్వరా! మధ్యలో,
  నౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్!

  రిప్లయితొలగించు
 33. సత్యమే పల్కు పధ్ధతి సాగదచట
  ప్రభుత చెప్పిన మాటలే పలుకు చుండ
  కల్లలే చెప్పుచుండు నాకాశవాణి
  యంచు తలచు చుందురు ప్రజ లనవరతము

  రిప్లయితొలగించు
 34. నీతి,జనులకు శాస్త్రసాంకేతికతయు,
  కళలు,గానంపు నైపుణి,కాచుననగ
  కల్లలే!చెప్పుచుండు నాకాశవాణి
  జనహితమ్మును కోరును జనసుఖమ్ము.

  రిప్లయితొలగించు
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. తే.గీ//
   రైతు కృషి లేక యేడ్చినన్, రైతువారి l
   సంతసించుచు నుండగా, సంబరాన l
   ధాన్యమిక వృద్ధియౌనని ధాత్రియందు l
   కల్లలే జెప్పుచుండు నాకాశవాణి ll

   తొలగించు
 36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు