18, ఆగస్టు 2019, ఆదివారం

సమస్య - 3107 (భద్రగిరీశునిన్... )

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్"
(లేదా...)
"భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా"

35 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    నిద్రను జాగ్రతన్ కొలిచి నివ్వెర వోవుచు వాని రూపమున్
    ముద్రను వేయుచున్ మదిని ముప్పది రీతుల పాట పాడగా
    ఛిద్రము జేసి మాయలను చీకటి మాపుచు వాని హృత్తునన్
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా

    రిప్లయితొలగించండి
  2. నిద్రాహారము లనువిడి
    భద్రాచల రామకథను పఠియించిన యా
    యద్రిజ పైత్యమున పలికె
    భద్రగిరీశుండొసఁగును భక్తులకుఁ జెరన్.

    రిప్లయితొలగించండి
  3. అద్రిసుతానుగుండొకరు డాయతభక్తియుతుండు మిత్రుడౌ
    రుద్రునితోడ నీవిధి గురుత్వము జూపి చమత్కరించె నో
    భద్రుడ! రామదాసుడను భక్తుని కష్టము జూచినామిటన్
    "భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా"

    రిప్లయితొలగించండి
  4. కం.
    కద్రువుడై యగుపించగ l
    విద్రుతమగు రామదాసు వివశుఁడు యవగన్ l
    పద్రథుడై ప్రభు మురియుచు l
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్ ll

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అద్రిజ సూనునిన్ వలెను హాయిగ బొజ్జను పెంపుజేయుచున్
    క్షుద్రపు రాజకీయమున కుండలు మార్చుచు మాటిమాటికిన్
    వద్రను బోలుచున్ దవిలి వందల కోటులు కొల్లగొట్టుచున్
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    నిద్రలు మాని మందిరపు నిర్మితికై తపియించినాడ., శ్రీ...
    మద్రమణీయమూర్తివని మాటల పాటల గట్టినాడ., నీ..
    భద్రత నాకు దక్కనిదె భక్తులు నిన్నిటులందురయ్య! "ఆ
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా !"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. ఛిద్రము నాలోచించిన
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్
    భద్రమున మనసు నిలిపిన
    భద్రగిరీశుఁ డొసంగు భక్తులఁ కనిషిన్!

    రిప్లయితొలగించండి
  8. గుడిగట్టిన గోపన్న గోస...

    కందం
    "దిసలెరుగఁ బుట్ట గేస్తును
    వసియింపగ జేయ గుడిని *భద్రగిరీశుం*
    *డొసఁగును భక్తులకుఁ జెరన్*"
    మసిపూయఁగ నీ తెరగున మౌనమె? రామా!

    రిప్లయితొలగించండి
  9. చిద్రూపుడు సీతాపతి
    భద్రగిరీశుం డొసగును భక్తులకు,జెరన్
    ఛిద్రము జేయుచు,ముక్తిని
    విద్రాణమగు హృదయమున వేదనదొలగన్
    విద్రాణము = మేల్కొల్పబడిన

    రిప్లయితొలగించండి


  10. భద్రం కవికందివరా!
    భద్రాచల విభుని నమ్మి పాడౌతారో ?
    ఛిద్రమయె రామ దాసుడె!
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. భధ్రపు కైవల్య పదము
    భధ్రగిరీశుం డొసగును భక్తులకు....చెరన్
    క్షుద్రపు పాలకు లిత్తురు
    తద్రాముని పూజ సలుపు తత్వ విదులకున్

    రిప్లయితొలగించండి
  12. (భద్రగిరీశుడు తనుండే హనుమ చిత్తపు చెరలో తనను తలచెడి భక్తులకు కూడా స్థానం కలుపిస్తాడని నా భావన)

    భద్రుడగు హనుమ నిలిపె
    చిద్రూపుని భద్రముగను చిత్తపు చెరలో
    నాద్రత తలువగ దనతో
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకు జెరన్

    రిప్లయితొలగించండి


  13. భద్రము రా సుపుత్రుడ! గభాలున నమ్మకు రాములోరినే!
    ఛిద్రము నమ్మి రాఘవుని చిక్కెను రావణు చేతి సీతయే
    ఛిద్రము రామదాసుడయె చీకటి రాత్రుల లెక్కబెట్టెరా!
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా


    జిలేబి పరార్ :)

    రిప్లయితొలగించండి


  14. అద్రిజపతి యనె ముక్తిని
    *భద్రగిరీశుండొసఁగును; భక్తులకుఁజెరన్
    చిద్రము చేయుచు నెట్టి యు
    పద్రవముల నిల నొసగక వరమిడు వినుమా.


    : మరొక పూరణ

    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా
    భద్రము కూర్చుచుండునది వాసిగ ధ్యానము చేయుచుండగా
    ఛిద్రము జేసి పాపములు చింతలు బాపు నటంచు నెంచుమా
    నద్రిజ బాయకన్ దలచి హ్లాదము నందెను శూలిగూడి తాన్.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి నమస్సులు
    భద్రo కర్ణేభి మంత్రము
    భద్రగిరీశుడొసగును, భక్తులకు జెరన్
    క్షుద్రపు విద్యలు నేర్చిన
    నిద్రలు లేకన్ గడుపుట నిజమగు నరుడా!

    రిప్లయితొలగించండి
  16. భద్రాచల రామునినిటు
    భద్రగిరీశుండొసగునుభక్తులకు చెరన్
    చిద్రూపుని భగవంతుని
    క్షుద్రముగా బలుకనిటుల చోద్యముగాదే?

    రిప్లయితొలగించండి
  17. విద్రావితమ్ము సేయును
    గా ద్రవ్యాపేక్ష నెల్లఁ గమనీయముగా
    భద్రపు నిజ చిత్తంబను,
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ, జెఱన్


    ఛిద్రిత కాద్రవేయ గుణశీల ఖగేశ్వర యాన భక్త! సా
    ముద్రిక రత్నభూషణ విమోహ సరాగ మనో౽భిలాషుఁడా
    రౌద్ర గిరీశ భవ్య విమల ప్రమ దాయతనమ్ము నాఁగ నో
    భద్ర! గిరీశునిం గొలుచు భక్తులకుం జెఱసాల దక్కురా

    [సాముద్రిక = సముద్రునకు సంబంధించిన; రౌద్ర = రుద్రునకు సంబంధించిన]

    రిప్లయితొలగించండి
  18. భద్రగిరీశునిన్గొలుచు భక్తులకున్చెఱసాలదక్కురా
    నిద్రనుమున్గుచున్నిటుల నేరముగోచరమౌవిధంబుగా
    క్షుద్రపుమాటలన్బలుక చోద్యముగాదెదలంచగానిటన్
    భద్రమెయౌను రామునిల భక్తినిగొల్వగ నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  19. భద్రత నిచ్చి బ్రోచునట పాపవికర్ముల నైన భక్తితో
    ముద్రిత హస్తులైననిక ముక్తిలభించుట నిక్కమందురే
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్, జెరసాల దక్కురా
    ఛిద్రపు కార్యముల్ సలిపి చిక్కిన వేళను వాస్తవమ్మిదే.

    రిప్లయితొలగించండి
  20. భద్రత నిచ్చు వృష్టి నిడి, బాగగు దైవము వజ్రియే సుమా
    ఛిద్రము జేయు గోకులము జెప్పకు పూజలమానుడంచు చి
    న్ముద్రను జూపి, కొండ కిట మ్రొక్కుట మేలొకొ? చాలు జాలు నో
    భద్ర! గిరీశునిం గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా.

    రిప్లయితొలగించండి
  21. నిద్రను, మెలుకువ భజనము,
    భద్రము నొసగును జనులకు భక్తిని చేయన్ |
    ఛిద్రము తొలగ, తన మదిని
    "భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్"

    రిప్లయితొలగించండి
  22. భద్రత బతుకులకెన్నడు
    భద్రగిరీశుండొసఁగును, భక్తులకుఁ జెరన్
    ఛిద్రముజేయునఘముల ను
    పద్రవములఁబాపికూర్చు పరమపదమ్మున్

    రిప్లయితొలగించండి
  23. ముద్రికనిచ్చి సీతవెతబుచ్చెగ లంకను మారుతాత్ముచే
    ముద్రికలిచ్చి తా చెరవిముక్తుని జేసెగ రామదాసునిన్
    భద్రుని కోరికన్ గిరిని వాసముజేకొని ముక్తినీయ నే
    భద్రగిరీశునిం గొలుచు భక్తులకు జెరసాల దక్కురా?

    రిప్లయితొలగించండి
  24. నిద్రను గాచితిన్ వినర! నీమము దప్పక పూజ జేసితిన్
    భద్రత నిచ్చువాడవని ప్రార్థన జేసితి సాల గట్టితిన్
    క్షుద్రుల పాలబడ్డ నను చూడవు వేడిన పల్క వేమిరా?
    "భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా"
    **)()(**
    (రామదాసుని నిష్ఠురపు వాక్కులు)

    రిప్లయితొలగించండి
  25. భద్రముగా గుడి గట్టిన
    భద్రాచల రామదాసు బందీయై దా
    రిద్రము తాళక పాడెను
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్

    రిప్లయితొలగించండి
  26. కందం
    విద్రుమ భూషణ పంజర
    భద్రతఁ బక్షులకు రామ పదమున్ నేర్పన్
    క్షుద్రత, తద్బంధనతో
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్

    ఉత్పలమాల
    విద్రుమ భూషణంబగుచు వేడుక జేసెడు పంజరాలలో
    భద్రత వంక పక్షినిడి పల్కఁగ నేర్పిన రామనామమున్
    క్షుద్రము లైన చేష్టలవి, శోకము గూర్చుచు వాటి స్వేచ్ఛకున్
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా

    రిప్లయితొలగించండి
  27. రుద్రుని యాగ్రహ మందున
    క్షుద్రము జేయంగ జగతి క్షోభించు నటన్
    భద్రము చేయక భక్తిని
    భద్ర గిరీశుం డొసగును భక్తులకుఁ జెరన్

    రిప్లయితొలగించండి


  28. నిద్రను వీడుము దుష్టుడ!
    ఛిద్రంబయెదవు నిటుల వచింపగ ధూర్తా!
    క్షుద్రపుటాలోచన ! యే
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  29. నిద్రను వీడుము దుష్టుడ!
    ఛిద్రంబయెదవు నిటుల వచింపగ ధూర్తా!
    క్షుద్రపుటాలోచన ! యే
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  30. భద్రంరాకొడుకో! దెస
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ, జెరన్
    క్షుద్రులకు కింకరులగు ద
    రిద్రులకున్ తానొసగు పరిత్రాణమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. అద్రిసుతాసుపుత్త్రుడను నాదరమొప్పగ శారదాంబనున్
    రుద్రు,విధాతనైన హరి రూపములన్ లలితాంబ, లక్ష్మినిన్
    భద్రము మిత్రరత్న! యలవాటుగ నిట్టి తురుష్క దేశమున్
    భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా

    రిప్లయితొలగించండి
  32. భద్రాద్రి రామునింగని
    భద్రాచలమున నిరతము భక్తుడు నిన్నే
    భద్రముగా గుడిని నిలుప
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్!!

    రిప్లయితొలగించండి
  33. కందము:
    భద్రాద్రి నేగి గొల్చిన
    భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్
    భద్రము నరయగ దోషము
    ముద్రల మొహరీల నీయ మురిసెను దాసున్

    రిప్లయితొలగించండి