12, ఆగస్టు 2019, సోమవారం

దత్తపది - 160

కవిమిత్రులారా,
కాక - తాత - పాప - మామ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ 
రామాయణార్థంలో 
స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం వ్రాయండి. 

70 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  విభీషణోపదేశం..


  కపియే కాల్చెను ! బూదియయ్యె మన లంకాకమ్రదీవ్యద్రుచుల్.!
  తపమున్ మానితి మానినీయ మమతాతప్తుండవౌటన్ ! గనన్
  విపరీతమ్మగు కోర్కె పాపము గదా ! వేధించు నిన్ సోదరా.!
  విపులార్థమ్మును పొందుమా! మనగ వేవే బంపుమా మైథిలిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 2. కాక ఘూకము లున్నట్టి కాన లందు
  పాప మెంచక రాముడు శాప మనుచు
  ధర్మ రక్షణ భారము తాత వేల్పు
  మదిని జోకొట్టి సీతను మామ యనుచు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి రెండు పాదాలలో కొంత అన్వయలోప మున్నట్టుంది. భావ స్పష్టంగా లేదు.

   తొలగించు
 3. (దశరథుఁడు విశ్వామిత్రునితో....)

  కౌశికా! కష్ట మెఱుఁగని కన్నకొడుకు
  నప్పగింతునె? బుధనుతా! తప్పదనెడి
  నీదు తలఁ పాపరానిదె; వేదనార్త
  మామకీన హృదయ మిది మాట వినదు.

  రిప్లయితొలగించు


 4. శూర్పణఖ మాట గా


  మా మనసును దోచిన ధీ
  రా! మనువాడెదము వీరుడా! కాకడతో
  టై మదిమది తాతనముగ
  నా మగనిగ పా! పద! లలనను వలదనకోయ్!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాకడతోటై, తాతనముగ'?

   తొలగించు
 5. దశరథుడు కైకతో

  కై(కా క)డు దుఃఖంబగు
  నాకో ముది(తా త)నయుని నాప్రాణంబున్
  లే కావ కృ(పాప)రవయి
  నీకై కొను(మా మ)రియొక నిరుపమ వరమున్.

  రిప్లయితొలగించు
 6. కాక, తాత, పాప, మామ - రామాయణార్థంతో స్వేచ్ఛాఛందంలో పద్యం

  స్థితప్రజ్ఞుఁడు రాముఁడు

  సీ. కైక కోరికవల్ల *కాక*పోయెను వేడ్క , కడ కేఁగ వలసెను కానలకును
  *తాతతాత*ది యవతారమె చూడంగ, *తాతవేలుపు* వ్రాత తప్పలేదు
  శాప మేనాటిదో *పాప*మవ్విధమున, నేలపట్టి నడచెను కాలిబాట
  *మామక* మనుకున్న మహరాజు పట్టము, చేజారిపోయెను చిటికెలోన

  తే. ఇన్ని కష్టముల్ జనియించె నిన కులునకు
  నైన నావంత కోపమ్ముఁ బూన డతఁడు
  కొండకోనల తిరుగాడుచుండి కూడ
  చిరునగవు మోమున నొకింత చెరుగ దెపుడు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గిరి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నేలపట్టి నడచె కాలిబాట' అనండి. లేకుంటే గణదోషం. 'మహరాజు' ప్రయోగం సాధువు కాదు.

   తొలగించు
  2. మామక మనుకున్న కామితభోగము - అని సవరించానండీ

   తొలగించు
 7. రావణాసురుని భావోద్వేగం

  పరుల*కా క*మనీయ దివ్య ప్రభావ!
  సీత వి*తాత*మో భగ్న!స్నిగ్ధ చరిత!
  మద్వ్య*పా ప*రితోషిత!మంద గమన!
  చారు గుణశీల!రసమయ చందమామ!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వితతాతమో భగ్న'? "వితత తమోభగ్న' సాధువు అనుకుంటాను.

   తొలగించు
 8. సీత!వితతాతమో భగ్న!స్నిగ్ధ చరిత!

  రిప్లయితొలగించు
 9. సవరించిన పూరణ
  ---------------
  కాక ఘూకము లున్నట్టి కాన లందు
  పాప మెంచక రాముడు శాప మనుచు
  తాత వేలుపు దయచూడ ధర్మ నిరతి
  మాట వినినంత సీతయె మామ కమున

  రిప్లయితొలగించు
 10. 🙏శ్రీ గురుభ్యోన్నమః🌺

  దశరథుండు పుత్రులు గాక తా తలంచి
  జేయ పుత్ర కామేష్టి, యజ్ఞేశు డిచ్చు
  పాయ సము గ్రోలి పాపౌఘ నాశులఁగన
  మహిని యందరి మోదమా మదులు నిండె.

  రిప్లయితొలగించు
 11. 🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷

  రిప్లయితొలగించు


 12. పరితపించు టేలనొ అయ్యొ! పాపమనుచు ?

  కాతనకేగెదను జనకా! కలత వలదు

  బాధపడకు మాతా! తండ్రి బాగు గనుము

  మరల వచ్చెద మరి వినుమా మహీజ!


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷

  రిప్లయితొలగించు
 13. సీతను బంధించి తెచ్చిన తర్వాత రావణునికి మండోదరి చేయు ప్రార్ధన

  రాక్ష సోత్త(మా మ)దిలేని రమణి పొందు
  వలదు (పాప)ము కలుగును తెలిసి యేల
  కొమను ము(క్కాక) పొనరించి కుతినిడితివి,
  వదలు మా సీ(తా త)న్వినిముదముతోడ
  ననుచు పలికె మండోదరి మనువు గాంచి

  ముక్కాక = నిర్భంధము

  రిప్లయితొలగించు
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 15. దాశరథి ఉవాచ...
  అన్యులను గాక రక్కసుల ననిని దునిమి
  పాప పంకిల మెల్లను పరిహరించి
  లంకయందు తా తరుణి ని రక్ష సేసి
  మామక సతితెత్తుననెను మరులు తోడ

  రిప్లయితొలగించు
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  (కాక)లుదీరినట్టిదగు గాముల జట్టును (పాప)మెంచకన్
  తోకనుజుట్టి రూపడచి దొడ్డగ రాముని (తా త)లెంచగా
  వీకగ నాంజనేయుడని వింటిమి సుందరకాండమందునన్
  తేకువగల్గు పావనిని తీరుగ (మామ)ది సన్నుతించెబో!

  రిప్లయితొలగించు
 18. ఆటవెలది:
  తా తలలు పదిగల తలపొగరు వానిది
  మామదిని దలతుము మాన్య రామ
  నీవుగాకనెవరు నీరజాక్షా రక్ష
  పాపమెంచబోక పాడెగట్టు.

  రిప్లయితొలగించు
 19. ఏమనందు భ్రాతా ! తమ కెరుక యేను
  యిటుల జరుగగ నాపాపమేమి లేదు
  మామనసు కోరుచుండె, మీమాదిరి తమ
  పాదుకా కమలములింక పాల ననిడు

  రిప్లయితొలగించు
 20. *రావణాసురుడు అశోకవనములో నున్న సీతతో పలికిన పలుకులుగా నూహించిన పద్యం*

  మామది దోచినట్టి యొక మానవ కాంతవు నీవుగాదె, హే
  కామిని యేటికా కలత కౌగిలిఁ జేరగ రమ్ము నా దెసన్
  భామల పట్టితెచ్చుటది పాపము కాదసురాళికెప్పుడున్
  తామసమేల నింక వనితా! తమకించుము మమ్ము జేరగన్

  రిప్లయితొలగించు
 21. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
  * దశరథుడు ఏనుగనుకుని మునికుమారుని చంపడం వలన
  * దశరథునకు మునిశాపము తగిలి వగచుచున్న సందర్భంలో-
  ఆ.వె//
  ఎలుగు బంటు 'కాక' ఏనుగనుకొనుచు l
  'తాత'నముగ యంబు తానువేయ l
  'పాప'కర్మ యంటి బాలముని జదియు l
  'మామ' లోని మచ్చ మాకుయంటె ll
  ***********************
  తాతనము = వ్యక్తిత్వమ

  రిప్లయితొలగించు
 22. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  N. T. రామాయణము
  (చిత్ర సీమ - Trajicomics)

  ఏడుపాపగ లేము కొన్నిటి నెన్ని మారులు చూచినన్
  చూడుమా మరియాద మీరగ జుత్తు పీకుచు కొన్నిటిన్
  వేడుకా కనలేము కొన్నిట వెంబడించగ నేడుపుల్
  పాడుతా తమ కీర్తి నెన్నడు పండుగంచును శంకరా!

  రిప్లయితొలగించు
 23. పూనిక రామపాదముల పుణ్యకరమ్ముగ,పూర్వయుగ్ర పా
  పానల కీలలార్పు జల బంధుర మేఘమటంచునెంచి య
  ద్దానవరేని తమ్ముడట తా తరియించిన భంగినెమ్మెయిన్
  మానుట చేతకాక పలుమారులు మామదిగొల్తుమెప్పుడున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పూర్వ + ఉగ్ర = పూర్వోగ్ర' అవుతుంది.

   తొలగించు
  2. సవరించబడినది...
   పూనికరామపాదములుపుణ్యయశస్కరమౌట, సర్వ పా
   పానలకీలలార్పుజలబంధురమేఘమటంచునెంచియద్దానవరేనితమ్ముడట తా తరియించిన భంగి నెమ్మెయిన్
   మానుట చేతకాక పలు మారులుమామదిగొల్తుమెప్పుడున్

   తొలగించు
 24. రిప్లయిలు
  1. నుతవర కృపా పరీ తా
   తత గరి మామల మనో వితత బాహు దురా
   గత శిక్షిత కాక జనక
   సుతా సు సేవిత రఘువరు స్తుతియింతు మదిన్

   తొలగించు
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 25. శ్రీరఘురామనామము వశీకర మంత్రము కాఁక దీర్చు, నె
  వ్వారల తాతనమ్ము ననివార్యముగా తనియించు పెంపుతో,
  తారణజేయుసాధనము దారుణపాపవితాన వారధిన్,
  మారణజేయు దౌష్ట్యమును మామక దైవము రామచంద్రుడే.

  రిప్లయితొలగించు
 26. తే: అసుర నాయకా! కపటుడవై మహీజ
  కొని తరలితివి నీపాపమె నిను కూల్చు
  నీటితాత సుపుత్రుడనేను, వచ్చి
  తిటకు మామహరాజుకు బటుడనగుచు
  నీటితాత: వాయువు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహరాజు' అనడం సాధువు కాదు.

   తొలగించు
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂దత్తపది 🤷‍♀....................
  *కాక - తాత - పాప - మామ*
  పై పదాలను అన్యార్థంలో
  రామాయణార్థంలో
  స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం

  సందర్భము: "ఇక్ష్వాకు చక్రవర్తి తపస్సు చేస్తే బ్రహ్మ లోకంలో పూజింపబడే రంగనాయక స్వామి ఇలకు దిగివచ్చినాడు. దశరథుని కాలం వరకు అర్చించబడి క్రమంగా శ్రీ రంగానికి విచ్చేసినాడు."
  ఈ వృత్తాంతం రాముడు తన సుతుడైన కుశునితో చెబుతున్నాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "ధరకు డిగ్గె నిక్ష్వాకుని తపము కాకఁ..
  గుశ సుతా! తగ సేవించె దశరథుండు..
  పాప పరుపుపై పడుకొన్న ప్రభుని రంగ
  నాథు సేవింపుమా! మది నమ్ముకొనుమ!"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  12.8.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 28. 12, ఆగస్టు 2019, సోమవారం

  దత్తపది - 160

  కాక - తాత - పాప - మామ
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ 
  రామాయణార్థంలో 
  స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం వ్రాయండి. 

  నా పూరణ
  *** *** ***
  కైకేయి వనవాసము కోరిక కోరగా దశరథుడు ఆమెతో యిలా మాట్లాడుతూ....

  తే.గీ.

  రాముడే పాపమును జేసె? మా మనసు కడు

  తాపమయ్యె గద ప్రియ కాంతా!తనయుడు

  గాదె వాడు?విను సఖి!నీకా కఠినపు

  కోరికేల? వేరొక్కటి కోరుకొనుము


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
  🌷🌷 వనపర్తి 🌷🌷

  రిప్లయితొలగించు
 29. రావణుడు సీతతో
  సీతా!తగునే నుకిటు
  మాతనువున కాకరేప మన్మథకోలా!
  ఈతలపులు పాపమనకు
  భీతిలకుము మామనసుకు ప్రీతినొసగుమా!

  రిప్లయితొలగించు
 30. యయాతి ఉవాచ:
  రామ పట్టాభషేకమునకై కాకరులు
  తాము తపమే చేయ తాతతాతను గనగ!
  మామదిన నీరాజ మనో వితత సోమా!
  రామా! కృపా పరీ! రఘుకుల ఘన శ్యామా!
  కాకరులు - సూర్య వంశ్యులు
  తాతతాత - విష్ణుమూర్తి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీరు ఛందస్సు నేర్చుకొని (అదేమంత కష్టం కాదు) పద్యాలు వ్రాస్తే బాగుంటుంది.

   తొలగించు
  2. ఆర్యా,
   తప్పిదమునకు మన్నించండి. ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను.

   తొలగించు


  3. నేర్చు కొనవచ్చు ఛందము
   పేర్చుచు పేర్చుచు పదముల బెదుర వలదయా
   నోర్చుకొనుచు సరి జేతురు
   కూర్చుట యెటులో తెలియును కుదురుగ వచ్చున్ !


   ఆల్ ది బెస్ట్


   జిలేబి

   తొలగించు
 31. మండోదరి:
  శ్రీలంకాకమనీయపట్టణము నీచే నేడు కూలెన్ గదా
  హేలన్ గోసలరాట్సుతాతనయుఁ డేమేమింక చేయంజనో
  యాలంబాపుము దైత్యపా! పరువ శ్రేయంబెల్లడన్; రాక్షస
  స్త్రీలన్ గావగ మామకార్తి విని తర్కింపన్ దగున్ నీవయే

  రిప్లయితొలగించు
 32. కందం
  కాకమ్ము నూరడించఁగ
  చేకొన తా తనర నుడుతఁ జెట్టు బిడారున్
  పైకొన పాపవినాశా!
  శ్రీకర! మా మహి నహింస ప్రేరణ రామా!

  రిప్లయితొలగించు
 33. . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం-దత్తపది
  *కాక, తాత, పాప, మామ*
  అన్యార్థములలో రామాయణార్థం.
  సందర్భం :: లంకలో ఉన్న సీతామాతతో మారుతి
  పూరణ ::
  కావంజాలుదు వెల్ల లోకముల నీకా కష్టముల్? భూజ! పూ
  తా! విచ్చేయుము రామదూత నన చింతా? తల్లి! నే మారుతిన్
  భావింపన్, నిను వెంట ర మ్మనుట పాపమ్మా? ననున్ నమ్ము మ
  మ్మా! వేగన్ కొనిపోదు రామపదకామా! మద్భుజమ్మెక్కుమా.
  కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 12.8.2019

  రిప్లయితొలగించు