6, ఆగస్టు 2019, మంగళవారం

సమస్య - 3097 (కల్లోలము సాగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్"
(లేదా...)
"కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్"

99 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  అల్లాభక్తుల రోదనల్ విరివిగా నానంద మందించగా
  ముల్లాలందరు విస్తు పోవుటను భల్ మోదమ్ము చేకూర్చగా
  గల్లీగల్లిన "పండితుల్" నగవుచున్ గానమ్ములన్ జేయగా
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్

  రిప్లయితొలగించు
 2. కల్లలు గావట నిజమిది
  యెల్లప్పుడు నుగ్ర వాద మెల్లలు లేక
  న్నుల్లాసము జూపెదరట
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 3. ఎల్లరు సంతో షించిరి,
  ఉల్లంబులు నింగికెగసె నుల్లాసముతోన్,
  హల్లీసములాడిరియట,
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్..

  కల్లోలము = పెద్ద అల, ఆనందము

  రిప్లయితొలగించు
 4. చల్లారుగ చల్లని భువి
  యల్లాడగ నికనుజాలు యాతనతోడన్
  కళ్ళాలు బిగించ నెటుల
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్?

  - యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

  రిప్లయితొలగించు
 5. భల్లూకాకృతతీవ్రవాలులవనిన్ భస్మమ్ముగావించుచున్
  మెల్లంగన్ భువినాక్రమించుఖలులున్ మీరంగ మోడీశుడున్
  చెల్లెన్ మీకును కాలమంచు విభజించెన్ యిట్టి ధర్మోద్ధతిన్
  కల్లోలమ్ము నిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్

  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించు
 6. ఎల్లలను చెరప నెంచెడి
  కల్లరి మూకలట సల్పు కార్యము లెల్లన్
  త్రెళ్ళించిన నచ్చట నిక
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 7. ముల్లై భారతమాత చిత్తమునకున్ మోదంబు పోకారున
  ట్లుల్లాసంబును గూల్చుచున్న గతికిన్ యోచించి యీనాడు వీ
  రెల్లన్ చట్టముచేసినారలవురా యీధైర్యకృత్యంబుచే
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్.


  మల్లయ్య పత్ని కిట్లనె
  వల్లీ! రాజ్యాంగగతిని వారలు మార్చన్
  పెల్లుబికిన దుత్సాహము
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 8. మైలవరపు వారి పూరణ

  *నమో* నమః

  దిల్లీనెక్కెను మేటియోధుడన మోదీ! వాని ధీశక్తితో
  నుల్లాసమ్ముగనుండు జాతి , యిక యుద్ధోన్మాదపుం జిచ్చులున్
  జల్లారున్! హిమవన్నగమ్ము మురియున్., సత్యమ్ము.! నాశమ్ము గాన్
  కల్లోలమ్ము.., నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్
  మల్లెల్ విచ్చినరీతి శాంతియని సంభావింతు మోదమ్మునన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 9. భల్లూకాకృతతీవ్రవాదులవనిన్ భస్మమ్ముగావించుచున్
  మెల్లంగన్ భువినాక్రమించుఖలులున్ మీరంగ మోడీశుడున్
  చెల్లెన్ మీకును కాలమంచు విభజించెన్ యిట్టి ధర్మోద్ధతిన్
  కల్లోలమ్ము నిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్
  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించు
 10. అల్లా! యేసు! హరుడ! మీ
  రెల్లరు బాపుము సమస్య నెట్టులనైనన్
  చల్లని చూపు లిడి;మిగుల
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  కల్లోలము...సంతోషము

  రిప్లయితొలగించు
 11. ఎల్లలు ఏ దేశంబున
  నెల్లప్పుడు శాంతినుండె నెంచగ జగతిన్?
  కల్లలు కావవి; చెప్పగ
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్.

  రిప్లయితొలగించు
 12. ముల్లాలు చెదరి కదిలెను
  పిల్లా పాపలును బెదరి భీతిలి పారెన్
  చల్లార్ప గుండె మంటలు
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 13. కందం
  ఝల్లుమన స్వార్థపరులకు
  చెల్లదటంచు 'ప్రతిపత్తి' చెప్పఁగ మోదీ
  వెల్లివిరియు శాంతియె యే
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్?
  శార్దూలవిక్రీడితము
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్
  జల్లార్పంగ ప్రభాసమానుడు సదా శాంతిన్ ప్రసాదించగా
  నల్లాటప్పయ కాదు నేనని సునాయాసమ్ముగా నార్టికల్
  నుల్లేకించెను, దేశమొక్కటియనన్ యోధుండు మోదీ సుమా!

  రిప్లయితొలగించు
 14. Malli siripuram
  శ్రీశైలం ప్రాజెక్టు నుండి
  కం.
  అల్లా యున్నాడనుకొని l
  మెల్లగ ముస్లిం వనితలు మెచ్చిన వెనుకన్ l
  తల్లాకు సమర్ధించగ l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 15. శ్రీగురుభ్యోన్నమః🙏

  చిల్లర శాసనమికపై
  చెల్లదచట భరత మాత చేవయె మోడీ
  నెల్లరు ముల్లాలు బొగడ
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  చేవ-బలము,కల్లోలము-సంతోషము

  రిప్లయితొలగించు
 16. కం.
  చల్లని దేశంబందున l
  కొల్లలుగా రచ్చజేసి కోతులగుంపై l
  యల్లరిమూకలు బరుగిడ l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 17. కం.
  చెల్లెను చీకటి రాజ్యము l
  మళ్ళెను ధృతరాష్ట్రులంత మలయపు వైపున్ l
  యుల్లాసము నొప్పని ప్రజ l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 18. కం.
  చెల్లెను కాశ్మీరము మన l
  కెల్లయు మోడీ క్రమముగ కెలఁకుట జేతన్ l
  భల్లూకపు పట్టువలన l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 19. కం.
  మల్లాడుటచే మోడీ l
  చల్లని హిమగిరి ప్రజలకు జంజాటములన్ l
  మెల్లగ తొలగించ యమతి l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 20. ఎల్లల్లేని విమర్శశాస్త్ర మిచటే
  యెత్తెన్ బతాకమ్ములే ;
  కొల్లల్గాగ కవిత్వగాంగఝరు లు
  ద్ఘోషన్ బ్రవర్థిల్లెలే ;
  యుల్లంబందున నూత్నతేజమున శాం
  తోదాత్తమై యెప్పుడున్
  గల్లోలమ్ము నిరంతరాయ మగుతన్
  గాశ్మీరదేశమ్మునన్ .
  (కల్లోలము - సంతోషము;నిరంతరాయము - ఆటంకాలు లేనిది)

  రిప్లయితొలగించు

 21. నిన్న
  సభలో కాంగ్రెసు తీరు :)


  ఎల్లప్పుడు దేశములో
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్
  తల్లడిలవలె జనాళియు
  లల్లాయి పదము పలికె మలక కాంగ్రెస్సూ !


  జిలేబి

  రిప్లయితొలగించు
 22. 2వ పూరణ

  భల్లంబౌ తగు చట్టమున్ విభజనంబవ్వంగ రాష్ట్రంబునన్
  ముల్లాలున్ ఖలులున్ యెటేని ప్రబలన్ మోదీ గనన్ ధర్మమున్
  అల్లా దీవెననిచ్చెనంచు దలుపన్ ఆ దుష్టులన్ మాపుటన్
  కల్లోలమ్ము నిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్

  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  Detroit

  రిప్లయితొలగించు

 23. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బిల్లంగోడుల నాడువాడు రణమున్ భీతిల్లుచున్ వేడగా
  భల్లూకమ్మగు ట్రంపువాడు కినుకన్ వాచాలుడై కూయగా
  నుల్లాసంబుగ పార్లమెంటు వడిగా నుండ్రాళ్ళు వడ్డించగా
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్

  బిల్లంగోడు = Cricket (village)
  కల్లోలము = సంతోషము (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించు
 24. ఎల్లరు మెచ్చెడు రీతిగ
  నల్లరి మూకలను జెండి యంతమొనర్పన్
  చెల్లెడు చర్యలతో నే
  కల్లోలము సాగు టొప్పు కాశ్మీరమునన్?

  రిప్లయితొలగించు


 25. పిల్లా జెల్లెలు రెండు పైబడు తరాల్ విశ్వాసముల్ బోవ యా
  అల్లా కావు మటంచు వేడుకొనగా నా కాంగ్రెసీయుల్ సదా
  మల్లాగుల్లల బోవ భాజ్ప ధృతితో మార్చెన్ స్థితిన్ తప్పెగా
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 26. చెల్లున్ గాలము నుగ్రవాదమునకున్ శ్రీలున్ విశేషమ్ముగా
  జల్లై వర్ధిల నింకఁ జూచుటకునై సందర్శకుల్ హెచ్చగాఁ
  జల్లారున్ బెనుమంటలన్ని,ఘనమై శాంతమ్మదే మాపుచున్
  గల్లోలమ్ము, నిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్

  రిప్లయితొలగించు
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 28. ఎల్లరు నొకటై యణగును
  కల్లోలము, సాగుటొప్పు కాశ్మీరమునన్
  చల్లని మనసుల విడిదిగ
  మెల్లగ సుఖ శాంతు లమరి మేలగు ప్రజకున్

  రిప్లయితొలగించు
 29. చల్లని భూతల స్వర్గము
  మెల్లగ భరతమున జేర మేదిని యందు
  న్నెల్లరి మనముల హర్షపు
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్!!!

  రిప్లయితొలగించు
 30. తొల్లెవ్వారలు దల్పరీవిధమునన్ దుర్భేద్యమౌ నార్టికల్
  చెల్లేదేల? తిరస్కరించి వదలెన్ జేజేలు మోడీకహో!
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్, గాశ్మీర దేశమ్మునన్
  దల్లీదండ్రులు పిల్ల పాప మెలగన్ దామంత మోదమ్మునన్

  రిప్లయితొలగించు
 31. చెల్లనిదౌ శాంతి పథమె
  యల్లరియే వారికక్కడాలంనమౌ
  యెల్లప్పుడు కుజనాళికి
  "కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వారి కక్క డాలంబనమౌ నెల్లప్పుడు...' అనండి.

   తొలగించు
 32. ఉల్లాసమ్మగు శీతలాద్రి వరమయ్యున్నుగ్ర వాదాగ్నిలో
  కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్
  చెల్లంబోదిక దుష్ట శక్తుల నుదాసీనమ్ముగా జూచుటన్
  తెల్లంబాయెను దేశ మంతయు మతాతీతమ్ముగా నొక్కటై

  రిప్లయితొలగించు
 33. రిప్లయిలు
  1. కుసుమ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాలన మొసగ/పాలన నొసగ' అనండి.

   తొలగించు
  2. చల్లని పాలన నొసగగ |
   మెల్లగ చట్టము సవరణ , మేటిగ పెద్దల్|
   బిల్లును జేసిరి ,యెటులను |
   కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్|

   తొలగించు
 34. కల్లయనరాదు నిజమది
  యెల్లరొలయ దేశమందు నేకంబయ్యెన్
  అల్లరులు జరుగవికపై
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 35. ఎల్లల్ మీరుచునుగ్రవాదమునఁనెన్నెన్నో వసంతమ్ములన్
  కల్లోలాంబుధిలోనముంచిరిగదా కాఠిన్యతన్ దేశమున్
  చెల్లున్ కాలమువారియాటలకికన్ చేయంగ రాజ్యాంగమున్
  కల్లోలమ్ము నిరంతరాయమగుతన్ గాశ్మీర దేశమ్మునన్

  రిప్లయితొలగించు
 36. యెల్లర కింపుగ నెడదం
  దల్లడ ముండక సుఖమ్మునఁ దనర నాలుం
  దల్లియు బిడ్డలు నట ని
  ష్కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్


  త్వల్లీలోద్భవ సప్తయుగ్మ సుమహా బ్రహ్మాండ మందుం బ్రభూ
  సల్లాపోత్సుక నక్ర కూర్మ తిమి సత్సంధాన మోహాచ్ఛర
  త్తల్లోలోదక వాయు సంచలిత విద్ధధ్వాన విస్తారపుం
  గల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్

  [కాశ్ +మీర =కాశ్మీర ; ప్రకాశవంతమైన కడలి; కాశ్ = ప్రకాశము; మీరము = సముద్రము]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణను యడాగమంతో ప్రారంభించారు.
   రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నది.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   అవునండి. ప్రమాదపతితము.

   తొలగించు
 37. మిత్రులందఱకు నమస్సులు!

  [హరిశ్చంద్రుని సత్యవాక్పాలనా ప్రకటన మగునంత దనుక, కాశ్మీరమునం గల్లోలములు జరుగుచునే యుండునని శివపార్వతులు సంభాషించుకొను సందర్భము]

  "ముల్లెన్ దాఁ గొనఁ బూన వేచు వటువై, పోలేని నక్షత్రకుం;
  డిల్లున్ వాకిలి వీడి, కొల్వున నయోధ్యేశుండు పూనంగ; నా
  యిల్లా లా సుతుఁ డా ద్విజున్ గొలువఁ దా మెన్నెన్నొ కష్టాల్ గొనన్,

  గల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్!"

  రిప్లయితొలగించు
 38. కల్లగ నెంతును దీనిని
  కల్లోలము సాగుటొప్పుకాశ్మీరమునన్
  మల్లియతీగను వోలెను
  నల్లుకొ నుచునొక రికొకరుహాయి మనవలెన్

  రిప్లయితొలగించు
 39. కల్లోలమ్మునిరంతరాయమగుతన్గాశ్మీరదేశమ్మున
  న్బల్లాలమ్మనుగోరుకొందునిపుడేభారమ్మునీదేసుమా
  కల్లోలమ్ములులేకనుండగమమున్ఖండాంతరాళంబున
  న్నెల్లన్నుండెడువారలందఱినిసూయీసారిగాపాడుమా

  రిప్లయితొలగించు
 40. చల్లని కాశ్మీరమ్మున
  ప్రల్లదులైనట్టి యుగ్రవాదుల దాడుల్
  అల్లాడించగ నిలుపన్
  'కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్'!

  రిప్లయితొలగించు
 41. కం.
  కల్లలు గాదుగ కాశ్మీర్ l
  చల్లని మన మాతృభూమి జయహో యనుచున్ l
  పిల్లలు దిరిగిన మెచ్చక l
  కల్లోలము (జేయవచ్చు) సాకుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 42. కం.
  కుళ్ళుకు జస్తుండె రిపులు l
  భల్లాతకమువలె బట్టె భారతమోడీ l
  ముల్లియ కొల్లేగొట్టగ l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
 43. కం.
  పిల్లుల బట్టెడి ఎలుకై l
  యల్లిన పన్నాగమందు యద్భుత రీతిన్ l
  మెల్లిగ తానే జొరబడ l
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ ll

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లి సిరిపురం గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో వాడుక పదాలు దొర్లాయి.

   తొలగించు
 44. ఎల్లరి కిలలో నేడే
  యుల్లము రంజిల్లగాదె యుత్సాహముతో
  నొల్లని వారల తలపున
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  మరొక పూరణ

  చల్లని వార్తను వింటిమి
  యుల్లములుప్పొంగెగనుడు నొప్పుగ. నేడే
  మెల్లగ సేదను తీరుచు
  కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 45. కల్లయు కాదిది నిజమే
  ఎల్లలు లేనట్టి మోద మిలలో కలిగెన్
  బిల్లది సభలో నెగ్గెను
  కల్లోలము సాగు టొప్పు కాశ్మీరమునన్

  రిప్లయితొలగించు
 46. ఉల్లాసమ్మను మాటలేదచట తీవ్రోన్మాదులే రేగగన్
  పిల్లాపాపల తోసుఖంబుగను జీవింపంగ లేరైరటన్
  చెల్లన్ గాలము పాతచట్టమట నిల్చెన్ భారతమ్మేకమై
  కల్లోలమ్మిక నిరంతరాయ మగుతున్ గాశ్మీర దేశమ్మునన్

  రిప్లయితొలగించు


 47. ఈ వారము ఆకాశవాణి సమస్య యేమిటో తెలియ చేయ గలరు


  జిలేబి

  రిప్లయితొలగించు
 48. . *శ్రీ గురుభ్యో నమః*
  శంకరాభరణం-సమస్యాపూరణం

  (కమలహాస విరోధి మనోభావన)

  ఉల్లాసమ్మున హాస మొంది కమల మ్ముప్పొంగె, కాశ్మీరమే
  యెల్లన్ వీడుచు భారతోర్వి జమ యయ్యెన్, మోది మోదించె, తా
  నల్లాడెన్ ఖలుడొక్కరుండు తగదీ యన్యాయమం చిట్లనెన్
  “కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ కాశ్మీరదేశమ్మునన్.”
  కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 6.8.2019

  రిప్లయితొలగించు